Monday, 6 July 2015

ప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (37వ సర్గ)


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
          శ్రీ మాత్రే నమ:
      శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:


 37వ సర్గ (వాల్మికి రామాయణములోని 68 శ్లోకాల  తెలుగు వచస్సు)
("రాముని శీఘ్రముగా తీసుకోని రమ్మనమని సీత హనుమంతుడుతో చెప్పుట, తనతో రామునివద్దకు రమ్మనమని హనుమంతుడు ఆమెను కోరుట, సీత అందు నిరాకరించుట ")




పున్నమి చంద్రుని బోలిన మోముగల ఆ సీతాదేవి హనుమంతుని వచస్సును 
విని హనుమంతునితో ధర్మయుక్తమైన ఈ క్రింది పలుకులు పలికెను 
ఓ వానరుడా రాముడు అన్యమనస్కుడుకాడని శోకముతో ఉండెను
అన్న వచస్సు విషమిశ్రితమైన అమృతమువలె నాకు దోచెను 


దైవము గొప్ప ఐశ్వర్యము కలది లేదా దారుణమైన ఆపత్తులోను 
పురుషున్ని త్రాడు కట్టి ఈడ్చుకొని పోయినట్లు ఈడ్చుకొని పోవును
ఓ ప్లవగోత్తమా ప్రాణులకు దైవము నిజముగా తప్పించు కొనుటకు వీలు లేనిదియును
వ్యసనములచే మొహితులమైన నన్ను, సౌమిత్రిని, శ్రీరామచంద్రుని
 చూడు మనేను


రాఘవుడు సముద్రములో ఓడబ్రద్దలై ఈది ఈది అలసి పోయినవాడు లాగును
సముద్రము ఈదినట్లుగా  ఈ శోకము అంతము ఎట్లు కనుగొన కలుగును
నా భర్త రాక్షసులను సంహరించి రావణున్ని హతమార్చుటను
లంకాపట్టణమును పూర్తిగ నశింప చేయునట్లు ఎప్పుడు చూడ గలుగును 


ఈ సంవస్చర కాలము ముగియ నంతవరకే నా జీవితముండును
 క్రూరుదైన రావణుడు నాకు పెట్టిన గడువులో 10 మాసము నడుచు చుండెను
త్వరపడమని చెప్పుము, ఓ వానరా ఇంకా రెండు మాసములే  మిగిలి ఉన్నవియును 
తమ్ముడగు విభీషణుడు రావణునితో సీతను ఇచ్చివేయమన్న మాట తిరస్కరించెను


నన్ను తిరిగి ఇచ్చివేయుట రావణునికి ఎ మాత్రము ఇష్టము లేకుండెను 
అతడు కాలానికి లొంగిపోయినాడు యుద్దములో అతన్ని మృత్యువు వేదుకు చుండెను 
హనుమంతుడా విభీషణుని జైష్ట పుత్రిక "కలయన "నామె తల్లి పంపగా  వచ్చెను 
ఆమె నాతొ చెప్పినది వృద్ధ దాగు అవిన్ధ్యుడను రాక్షసుడి మాట రావణుడు వినకుండెను 


రావణునికి  మిక్కిలి శీలసంపన్నుడు, మేదావియును, విద్వాంసుడును 
అగు ఇష్టుడైన రాక్షసుడు " రాక్షసులకు రామునివలన వినాశము కలుగుననెను 
కాని ఆ దుష్టాత్ముడు అతని హితవచనములను చెవిని పెట్టక
 త్రోసిపుచ్చెను
ఓ హరిశ్రేష్టా నాభర్త త్వరలో నన్ను కలిసి కొనగలడని నేను ఆశించు చున్నాను 


ఓ వానరా శ్రీ రాముని యందు ఉత్చాహం, పురుషం, బలమును 
మృదుత్వం, కృతజ్ఞత  పరాక్రమము, ప్రభావము మొదలగు పెక్కు గుణములుండెను
ఎందు చేతననగా ఆ రామునియందు ఇంకా అనేక సుగుణాలు ఉండెను
నా అంతరాత్మ (మనస్సు) పరిశుద్దమగుటకు కారణము అదియే మగును  


జనస్థానమున సోదరుడు వెంట లేకుండగనే 14 వేల రాక్షసులను
జంపిన రామచంద్రుని విషయమున నెవరు వ్యాకుల మెందకుండా ఉండును  
ఆ పురుషోత్తముడు వ్యసనా విష్టులగు రాక్షసులలో పోల్చుటకు వీలు లేనివాడును
శచీదెవి ఇంద్రుని ప్రభావము నేరిగినట్లునే నతని సామర్ద్యము నెరుగుదును  


ఈ విధముగా మాట్లాడు చున్నదియును, రాముయోక్క శోకముచే 
కృశించినదియును  
అగు ఆ సీతాదేవి కన్నుల వెంబడి కన్నీరు కార్చుచుండ హనుమంతు డిట్లు పలికెను 
నా మాట వినిన వెంటనే శ్రీ రాముడు వానర గణములతోను ఎలుగు బంట్లతోను  
నిండిన పెద్ద సైన్యముతో శ్రీ రామచందుడు సీఘ్రముగా ఇక్కడకు రాగలుగును  


ఓ సీతాదెవి నిను ఇప్పుడే ఈ దు:ఖమునుండి విముక్తురాలిని చేసెదను
ఓ దోషరహితురాలా నా వీపు పై ఎక్కుము, నిన్నిప్పుడే రాముని వద్దకు చేర్చెదను 
నిన్ను నా వీపు పై కూర్చుండ బెట్టుకొని సముద్రమును దాటెదను
రావణునితో సహా ఈ లంకను కూడా మోయుటకు నాకు శక్తి కలదనెను 


హోమము చేసిన హోమద్రవ్యమును అగ్నిదేవుడు దేవెంద్రునికి  అంద చేసినట్లును 
నేను నిన్ను ప్రస్రవణ పర్వతము మీద ఉన్న రామునకు ఇప్పుడే అంద  చేసెదను
ఓ సీతాదేవి విష్ణువు దైత్యులను సంహరించిటకై ఉద్యమించి నట్లును
లక్షమన సమేతుడైన రాముడు రాక్షసవధకై ఉద్యమిన్చ గలుగును



శ్రీ రామచంద్రుడు మహబల వంతుడు నీదర్శనము చేయుటకు ఉత్చాహముతో నుండెను 
ప్రస్రవణ పర్వతముపగల యశ్రమమునందు ఇంద్రునివలె శ్రీరాముడు విరాజిల్లు చుండెను 
ఓ దేవి నా విపుపైకి నెక్కుము నామాటను ఉపెక్షిమ్పకము  అని హనుమంతుడు పలికెను 
రోహిణి చంద్రుని వద్దకు వెళ్ళినట్లు నీవు రామునివద్దకు వచ్చుటకు నిశ్చఇంచుకొనమనెను 


ఓ సీతా నీవు నా వీపుపై నదిరోహించిన ఈ మహాదధిని ఆకాశమార్గమున దాటగలను  
ఓ సాద్వి నిన్ను తీసుకొని వెళ్ళునప్పుడు ఈ లంక వాసులేవ్వరూ నావెంట రాలేరును
సందేహము లేదు చూడుము, నా వీపుపై నెక్కుము అకాశమార్గమున వెల్లెదను  
ఓ సీతాదేవి నేను ఇక్కడకు ఎట్లా వచ్చినానో అట్లే నేను నిన్ను తీసుకొని పోగలగును 


ఆశ్చర్య కరములైన హనుమంతుని మాటలను 
వినగానే సీత సంతోషముతో వికసించెను 
సకలావయవములు పులకిత మాయెను 
వెంటనే పవన పుత్రునితో ఇట్లు పలికెను


ఓ హనుమ్తుడా నీవెత్లుఆ అనుకోనుచున్నావు నను మోసుకొని వెళ్ళగలను 
అని సీతాదేవి ఇది నీలోని కపిత్వము అని నా తలంపేను 
అందులో అల్పశరీరుడవు నా భర్త వద్దకు ఏవిధముగా తీసుకొని వెళ్ళ వలెను 
అనుకుంటున్నావు అని సీత హనుమంతునితో పలుకులు  పలికెను


పవన నందనుడగు హనుమంతుడు సీత యొక్క మాటలు వినెను 
తనకు నూతన  మైన పరాభవము సంప్రాప్తమైనట్లుగా తలంచెను 
నల్లని నేత్రముల ఈ సీతకు నా బలముగాని ప్రబావముగాని తెలియదును 
అందు చే నేను ఇచ్చాసారముగా పెరుగు రూపమును ఈమెకు చూపించెదను

శత్రుసంహారకుడు ఆయిన హనుమంతుడు ఈ విధముగా ఆలోచించెను 
సీతాదేవికి  తణ విశ్వరూపమును చూప దలచు కొనెను 
బుద్ధి మంతుడైన హనుమంతుడు చ్చెట్టు నుండి క్రిందకు దూకెను
సీతకు నమ్మకము కల్గించుటకై శరీరమును పెంచుట  ప్రారంభించెను 


సీత ఎదుట ఆ కపి శ్రేష్టుడు మేరు మన్దరత్వముగా పెరిగెను

ప్రజ్వలించు అగ్నితో సమానమైన తేజముతో నిలబడి యుండెను 
పర్వతముతో సమానమైన  విశాలగు కాయముగాలవాడుగను
ఎర్రని ముఖము వజ్రముతో సమానమైన కోరలు గోళ్ళుగల మారుతి సీతతొ నిట్లనెను 


పర్వతములను  వనములను  పెద్ద పెద్ద భవనములను
అనేక ప్రాకారములు గల ఈ లంకా పట్టణ మంతయును
రావణ, రాక్షసుల సహితముగా తీసుకొని వెళ్ళగలను 
అటువంటి  శక్తి నాకు ఉన్నది అని  సీత తో  పలికెను


ఓ దేవి నిరాశపడ వద్దు, నాతొ వచ్చుటకై సంకల్పించ వలెను
లక్ష్మణ సహితుడైన రాముని శోకరహితునిగా జేయ వలెను 
వాయుదేవుని ఔరస పుత్రుడును పర్వతసమానుడగు వానితోను
పద్మపత్రము వలే విశాలమగు కన్నులుగల ఆ జానికి ఇట్లనెను 


ఓ వానరా నీశక్తిని బలమును వాయువుతో సమానమైన వేగమును 
అగ్నితో సమానమైన అద్భుతమైన తేజమును నేనెరుగుదును
ఇతరు డెవ్వడు అపారమైన సముద్రము యోక్క అవలి ఒడ్డున నున్న భూమికెట్లు రాగలను
నీ గమనశక్తిని, నన్ను తీసి కొనిపోగల సామర్ద్యమును నే నెరుగుదును  


ఓ కపిశ్రేష్ట నీతొ నెను వచ్చుట యుక్తము కాదు వాయు వేగసమాన మైన వేగమును 
సముద్రముపై నాకాశమునకు పోయినప్పుడు వేగము నన్ను మోహ 
పెట్టును 
నీ వీపు నుండి  నేను తిమి,మకర,మత్యముల గల సముద్రమునందు 
పడవచ్చును
వివశనై సముద్రములో పడిపోయిన నేను అందలి జంతువులకు ఆహారము కాగలను 


ఓ శత్రువినాసన ఇందువలన నేను నీతొ రాజాలను 
నన్ను తీసుకొని వెళ్ళునప్పుడు నీపై కూడా సంశయము కల్గును
 అప్పుడు రాక్షసులవలన  నీ ప్రాణాలకు  కూడా  ముప్పు రావచ్చును
దురాత్ముడైన రావణుడు ప్రేరేపించిన రాక్షసులు నిన్ను వెంబడించును 

   
 ఓ వీరుడా శూలములు  ధరించిన మహాశూరురులు నిన్ను ముట్టడి చేయును 
నన్ను కుడా రక్ష్మించవలసిన పరిస్థితి నిన్ను ఇరకాటంలో పెట్ట  వచ్చును 
నన్ను రక్షిమ్చుతూ నీవు ఆయుధముతో యుద్దము చేయుట కష్ట  తరమగును 
నీవు యుద్ధము చేయునప్పుడు నేను భయముతో నీ వీప్పునుండి  పడ వచ్చును 


 ఆప్పుడు భయంకరాకారులు గొప్ప దేహములుగలబలవంతులైన వారును 
అగు ఆ రాక్షసులు ఏదో విధముగా నీతొ  యుద్ధము  చేయ కలుగును 
నీవు యుద్దము చేయునప్పుడు  ఏమర పాటుగా ఉండుట వలన నేను
  క్రింద పడగా అప్పుడు నన్ను రాక్షసులు పట్టి తీసుకొని పో వచ్చును  


వానరోత్తమా రాక్షసులవల్ల నావల్ల నీకు ఇబ్బంది కలుగ వచ్చును 
ఇట్లు చేయట వలని నీ ప్రయత్నమంతా వ్యర్ధ మగును 
యుద్దములో జయాజయాలు నిశ్చితములు కావును 
 జయము కలుగు వచ్చును,లేదా పరాజయము కలుగ వచ్చును 


నీవు రాక్షసులందరిని చంపుటకు సమర్దుడవే అయినను
రాక్షసులతో పాటు రావణున్ని చంపుట వల్ల రామునికీర్తి తగ్గును 
లేదా రాక్షసులు నన్ను తీసుకొని పోయి, వానరులను రామ లక్ష్మణులకు ను 
తెలియని రహస్య ప్రదేశము నందు ఎక్కడైన నన్ను దాచ వచ్చును


అప్పుడు నాకోసం నీవు చేసిన ప్రయత్నముంతా వ్యర్ధమై పోయెను
నీతో గలసి రాముడు ఇక్కడకు వచ్చుటలో మంచి లాభము కల్గును 
రామలక్ష్మణులు నీరాజైన సుగ్రీవుదు వీరన్దరి జీవితము నామీదే ఆధార యుండెను 
నేను నీ నీ వీపు  పై ఎక్కినా నీకు నీకు కష్టములు మీద   కష్టములు వచ్చును           


శోక సంతాప  కర్సితులైనవారు నా విషయమున నిరాశులైనచొ ప్రాణములను త్వజింప కల్గును
ఓ మానరోతమా పతిభక్తిని పురస్కరించు కొని రామునికంటే వేరైనవాని యోక్క శరీరమును 
నేను స్వయముగా స్ప్రుశించను నేను రావణున్ని యొక్క శరీరమును స్పృశించి తిననిన బలాత్కారము వలనను
గతిలేక స్పృ సిన్చితిని దిక్కులేక వివశురాలనై ఎమియు చేయలేనపుడు దేమి చేయదగును ?


రాము డిక్కడ బందు సహేతుడైన రావణున్ని సంహరించియును 
నన్నీప్రదేశము నుండి తీసికొనివెల్లిన అది అతనికే యుక్తముగా ఉండును
యుద్దములో శత్రువులను సంహరించు ఆ రాముని పరాక్రమములను గూర్చినేను 
పవన పుత్రా నేను వినుటయే కాదు రాముని శక్తి స్వయముగా
 చూచినాను 


యుద్దమునందు  దేవ-గంధర్వ-భుజంగ-రాక్షసులేవ్వరు రామునితో సమానులు కారును
ఇంద్రునితో సమానమైన బల పరాక్రమములు కల వాడును 
యుద్దమున చిత్రమైన ధనుస్సును ధరించి నపుడు మహాబల సంపన్నుడును 
అగు రాముడు వాయు ప్రేరితమైన ప్రజ్వలించు అగ్ని వలే ఉండును 


ఓ వానర ముఖ్యుడా యుద్దమున శత్రు మర్ధనుడును 
లక్ష్మన సహితుడును మదించిన దిగ్గజమువలే నిలబడిన వాడును
యుగాంత సూర్యుని వలే ప్రజ్వలించు వాడును
బాణ జ్వాలలో నున్న రాఘవుని యుద్దమున నెవ్వడు ఎదుర్కొన గలుగును



కావున ఓ కపిశ్రేష్ట లక్ష్మణ యుక్తుడును 
యూధ పతులతో గూడు కొనిన వాడును 
అగు నా ప్రియుని వేగముగా తీసుకు రావలెను
శోకముతో కృశించి ఉన్న నాకు హర్షము కలిగించ వలెను 

శ్రీ సుందర కాండ నందు 37వ సర్గ సమాప్తము  
  

No comments:

Post a Comment