Sunday, 30 August 2015

ప్రాంజలిప్రభ - సుందర కాండ తెలుగు వచస్సు (51 వ సర్గ)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ 
శ్రీ మాత్రే నమ:
శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ: 


 51వ సర్గ (వాల్మికి రామాయణములోని 45శ్లోకాల  తెలుగు వచస్సు)
("హనుమంతుడు రాముని ప్రభావమును వర్ణించి చెప్పుచూ రావణునికి నీతిని ఉపదేశించెను ) 


మహాబలవంతుడగు హనుమంతుడు రావణుని చూసి ధైర్యముగా ఉండెను 
రావణునితో ఎట్టి తొట్రుపాటు లేకుండా అర్ధవంతములగు మాటలు పలికెను
ఓ రాక్షసేంద్ర నెను నీ వద్దకు సుగ్రీవుని సందేశమును తీసుకొనివచ్చాను
నీసొదరుడు వానరరాజు సుగ్రీవుడు నిన్ను కుశలమడిగి నట్లు చెప్పమనెను


మహాత్ముడగు సుగ్రీవుడు చెప్పిన మాటలను చెప్పుచున్నాను
ఈ వాక్యములు ధర్మ అర్ధ యుక్తమైనవియును 
ఇహపరలోక యోగ్యమును కలిగించునవియును 
సందేశమును ఉన్నది ఉన్నట్లుగా లేలుపుతున్నాను 


రధములు, గుర్రములు, ఏనుగులు, కలవాడును 
లోకమునకు, తనరాజ్యమునకు తండ్రిలాంటి వాడును
లోకభండుడైన దేవేంద్రునితో సమానమైన వాడును 
దశరధ మహారాజు తేజోవంతముగా వెలుగు చుండెను 


అతనికి మహాభాహువును ప్రభావ యుక్తుడును
మిక్కిలిప్రియమైన జ్యేష్టపుత్రుడును రామచంద్రుడును
అతడు తండ్రి ఆజ్ఞచేత దండకావనమునకు పవేశించెను
భార్య అగు సీత, సోదరుడైన లక్ష్మణుతో వనమునకు వచ్చియుండెను


విదేహ దేశధి పతియైన జనక మహారాజు పుత్రికయును 
భర్తను అనుసరించి అరణ్యమునకు వచ్చిన సీతను 
ఎవ్వరూలేని సమయాన మాయ చేసి తీసుకొని వెళ్ళెను
రామలక్ష్మణులు సీతను వెదుకుచూ సుగ్రీవున్ని కలుసుకొనెను    


సుగ్రీవుడు సీతను వేదికించెదనని రామునికి ప్రతిజ్ఞ చేసెను
రాముడు సుగ్రీవునితొ వానర రాజ్యమును ఇచ్చెదనని పతిజ్ఞ చేసెను
పిమ్మట వాలి సుగ్రీవుల యుద్దము నందు వాలిని సంహరించెను
సుగ్రీవున్ని వానర భాల్లూకములకు అధిపతిగా చేసెను 


వాలి శక్తి ఎటువంటిదో నీకు ముందే తెలుసును 
ఆ వాలిని రాముడు ఒక్కబాణముతో సంహరించెను
సత్య ప్రతిజ్నుడగు సుగ్రీవుడు సీతాన్వేషణ ప్రారంభించెను
తన వద్ద ఉన్న వానర భల్లూకములను దశదిశలను పంపెను


వందలకొలది, వేలకొలది, లక్షలకొలది, వానరులందరును 
ఆకాశమునందు, పాతాళమునందు, భూమియందును
గరుత్మన్తునితో సమాన మైనవారును, వయువుతో సమానమైన వారును       
అగు వనరులు అతిసీఘ్రముగా అన్నిచోట్ల సీత కొరకు వెతుకు చుండెను


నేను హనుమంతుడను వాయుదేవుని ఔరస పుత్రుడను
సీతకొరకు మిక్కిలివేగాముతో కడలి దాటి లంకలో అడుగు పెట్టాను 
ఇక్కడ అన్ని చోట్ల తిరిగి నీ గ్రుహములొఉన్న సీతను చూసాను
నిన్ను చూచుటకై , రామ దూతగా ఇక్కడకు వచ్చి నీకెదు రున్నాను 


 నీవు తప:శక్తి గలవాడవు ధర్మార్ధములు నేరిగిన వాడవును 
 గోప్పసంపదను, గొప్ప శక్తిని సంపాదించిన వాడవును
మహాప్రాజ్ఞా పరదారులను నీ యింట భందించుట తగదును 
ధర్మ విరుద్ధముగా భుద్ధి మంతులు ప్రవర్తించుట తగదును  


దేవాసురల కైనను శ్రీ రాముని భాణములకును
లక్ష్మణుని చేత విడువ బడిన భాణములకును
ఎవ్వరూ ఎదుట నిలబడి యుద్దము చేయ లేరును
మూడు లోకములలో రామున్ని ఎదిరించే వారు లేరును


రామునికి అపరాధము చేసినవారు సుఖముగా ఉండలేరును 
త్రికాలహితమును, దర్మార్ధముల కనుకూల మగు మాటను
మన్నించి ఆ పురుషోత్తమునకు జానకినిచ్చి వేయ వలెను
సీతను నేను చూసినాను చాలా భాద పడు తుండెను


ఇక  చేయవలసిన కార్యము రాముని పై యుండెను 
నీఇంట ఉన్న సీత ఐదు తలల సర్పమని తెలుసు కొనవలెను
విషాన్నము ఎక్కువ తిన్న వారెవరైనా జీర్ణము చేసు కో లేకుండును 
అట్లే అసురులు, సురులు గాని, ఎవ్వరు సీతను జీర్ణము చేసుకో లేరును


నీవు తపస్సువలన ధర్మ ఫలమును పొంది యున్నావును  
నీవు ధీర్ఘాయును పొంది, సీత ఆశించుట మంచిది కాదును  
నివు చేసిన తపస్సును, వ్యర్ధము చేయుట మంచిది కాదును
రాముడు వచ్చి నిన్ను చంపకముందే సీతను అప్పచెప్పవలెను    


ధర్మ ఫలము అధర్మ ఫలముతో కలయ కుండును  
ధర్మ ఫలము ధర్మ మార్గమునే అనుసరించి ఉండును  
ధర్మ ఎప్పుడు  చేసిన అధర్మము నశించి పోవును  
ఇప్పటిదాకా ధర్మ ఫలము పొందావు, పొందెదవు అధర్మ ఫలమును


అధర్మము బలమైనప్పుడు ధర్మము కూడా వెనక్కి పోవును
అధర్మ ఫలం అనుభవించేటప్పుడు ధర్మ ఫలం నశించును 
నీవు ధర్మ ఫలమును అనుభవిన్చావు సందేహము లేదును 
అచిరకాలమోలో అధర్మ ఫలమును కూడా అనుభవిన్చగలవును  


జనస్థానములో రాక్షస వధను 
రామసుగ్రీవుల మద్య స్నేహ భంధమును 
రాముడు సంహరించిన వాలి వధను 
గుర్తు తెచ్చుకొని ఏది హితమో కనుగొనవలెను 


ఆశ్వరధ గజాలతో కూడిన కంచన లంకను
నేనొక్కడినే తక్షణమే నసింప చేయ గలను
అది రాముని నిర్ణయమునకు అనుగుణము కాదును 
అందుకే నేను బలాబల విషయాలు తెలుపుచున్నాను 


ఎందు చేతననగా రాముడు వానర భల్లూకముల సమక్షము నందును 
సీత అపహరించిన శత్రువులను నశింప చేసెద నని ప్రతిజ్ఞ చేసెను
రామునకు అపకారము చేసిన దేవేంద్రుని నైనాను ఎదిరించగలుగును 
నీ వంటి వానిని వదిలి పెట్టునా? చూడగలవు నీ వధ త్వరలోను 


సీత యనిన ఎవ్వరను కోనుచున్నవో,  నీకు తెలియుట లేదును 
నీ ఇంట ఉన్న స్త్రీ సర్వ లంక వినాశిని గా గుర్తించ వలెను 
అందు చేత సీత శరీర రూపములో ఉన్న కాళపాశమును 
నీ అంతట నీవె మెడకు తగిలించు కొనకము, ఏది హితమో అలోచించు 
కొనవలెను


అటు చూడు సీత యొక్క తేజము చేతను 
ఇటు చూడు శ్రీ రామచంద్రుని కోపము చేతను 
పెద్ద భవనములతో, వీధులతో ఉన్న లంకను
దహించి వేస్తున్న అగ్నిని ఒక్కసారి చూడవలెను 


నీమిత్రులను, జ్ఞాతులను, సుతులను, హితులను 
స్త్రీలను, భోగములను, లంకాపట్టనము యొక్క నాశనమును
 ఎందుకు కోరుకొనుచున్నావు, నీ పట్టుదల వీడి సీతను 
రామునికి అప్పచెప్పి, నీ కీర్తిని, శక్తిని నిలబెట్టు కొనవలెను


ఓ రాక్షస రాజా నేను రాముని దాసుడను, అతని దూతను  
కీర్తిగల రామనకు స్థావరజంగము రూపములైన ప్రాణులలోను  
  పంచ భూతములతో కూడిన సకల లోకములను
శ్రీ రాముడు సంహరించి అట్లే సృష్టించగల సామర్ద్యము గలవాడును 


ఏ కాలములోను, ఏ దేశములోను, ఏ భూతములలోను
దేవాసురలలోను, నరులలోను,రాక్షసులలోను విద్యాధరులలోను 
గంధర్వులలోను, యక్ష కిన్నరులలోను, నాగులలోను, పక్షులలోను 
శ్రీరాముని ఎదుట నిలబడి యుద్దము చేయగలవారు ఎవ్వరూ లేరును


రాజశ్రేష్టు డైన రామునకు నీవు అపకారము చేసినావును  
నీవు బ్రతికుండట కష్టమే అని తెలుసుకొనవలెను 
యుద్దములో రాముని ఎదుట నిలబడి యుద్దము  చేయలేరును 
ఓ రాక్షస రాజ సత్య వచనములు పలుకుచున్నాను ఆలకించ వలెను    
నాలుగు ముఖములు గల స్వయంభువుడగు బ్రహ్మయైనను 
మూడు నేత్రములు గల త్రిపుర సంహారి యగు రుద్రు డైనను 
ఐస్వర్య శాలియైన దేవతల కధీశ్వరుడు ఇంద్రు డైనను
యుద్దమునందు రామచంద్రుని ఎదుట నిలబడ లేరును


నిర్భయముగా మాటలాడు చున్న మాటలను
సౌష్టము కూడిన అప్రియమగు వచనములను
రావణుడు విని కోపముతో నేత్రములు త్రిప్పెను
"ఈ వానరుని వధింపుడు అని ఆజ్ఞాపించెను

సుందర కాండ నందు 51 వ సర్గ సమాప్తము

Wednesday, 26 August 2015

ప్రాంజలిప్రభ - సుందర కాండ తెలుగు వచస్సు (50 వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
ప్రాంజలి ప్రభ
          శ్రీ మాత్రే నమ:
                                   శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:


 50వ సర్గ (వాల్మికి రామాయణములోని 19శ్లోకాల  తెలుగు వచస్సు)
("రావణుడు ప్రేరేపిమ్పగా లంకకు ఎందుకు వచ్చినావని ప్రహస్తుడు హనుమంతుని ప్రశ్నించుట, రాముని దూతగా వచ్చినానని హనుమంతుడు చెప్పుట  ) 


మహాబాహువులను గలవాడు, లోకములను ఏడ్పించిన వాడును
అగు రావణునికి ఎదురుగా నిలబడిన పసుపు పచ్చని కన్నులను 
గల హనుమంతుని చూసి మహా రోషా విష్టుడుగా మారెను
అయినా హనుమంతుని చూసి శంకాకులిత స్వాన్తుడై చింతించెను రావణుడు నందీశ్వరుడు వచ్చినా ఏమి? అని సంకోచించేను 
నదీశ్వరుడే పూర్వము కైలాసము పరిహసిమ్పగా శాపము ఇచ్చెను 
అతడే ఇప్పుడు వానర రూపమున వచ్చి యుండ వచ్చును 
లేక బాణాసురుడా? ఎవ్వరికి చిందిన వాడో కనుగొన మనెనురోషముతో రావణుడు ప్రహస్తునితో గంభీరార్ధ యుక్తమును 
ఎర్రని కన్నులుకలవాడై సమయాను కూలమైన మాటలు పల్కెను 
ఈ వానరుడు ఎక్కడనుండి ఇక్కడకు వచ్చుటకు కారణమును 
 తెలుసుకో మనేను, అన్ని వివరములను తెలుసుకోవలెను అతని యుద్దెశ్యమెమి ? ప్రమదావనమును పాడు చేయుటలోను
దుర్భేద్యమైన ఈ నగరమునకు వచ్చుటలో ప్రయోజనము అడుగవలెను
రాక్షసులను బెదిరించుటలో అతని యుద్దేశ్యమెదో తెలుసు కోవలెను
రాక్షసులతో యుద్దము ఎలా చేసినాడు? ఎ ఉద్దేశ్యమో కనుగోన మనెనురావణుని మాటలు విని మంత్రి వర్యుడు ప్రహస్తు డిట్లనెను
ఓ వానర ఊరడిల్లుము నీకు ఇక్కడ ఏమి భయము లేదును
నీవు రావణుని గృహమునందు ఉన్నావు నీకు శుభ మగును
నీవు రావణాలయమునకు వచ్చుటకు కారణము తెలుప వలెను ఇంద్రుడు పంపగా వచ్చినట్లయితే నిజం చెప్పవలెను 
నీ తేజము వానరులకు ఉండదు, రూపము మాత్రమే ఉండును
ఓ వానరా నీవు నిజము చెప్పిన విడిచి పెట్టగలము, అనృతమును
పల్కిన నీవు జీవించుట అసంభవము అని ప్రహస్తుడు పలికెనుహనుమంతుడు రాక్షస మంత్రులతో ఈవిదముగా పలికెను
నేను ఇంద్ర, వరుణ,యమ లలో నెవ్వరికి చెందిన వాడను కాను 
రాక్షసేంద్రుని దర్శనార్ధమై వచ్చినాను, నేను పుట్టుక తోను వానరుడను,
 దదర్శనము దుర్లభమని భావించి ప్రమదావనమును పాడు చేసినాను


బలవంతులైన రాక్షసులు నాతో యుద్దము గోరి వచ్చెను 
నా ఆత్మరక్షనకై నేను యుద్దములో వారిని ఎదుర్కొనగలిగాను
దేవాసురలకైనను అస్త్రములతొ నన్ను భంధించు శక్తి లేదును
బ్రహ్మదేవుడు ఎ అస్త్రము ప్రయోగించిన పనిచేయవు అని వరము ఇచ్చెను


నేను బ్రహ్మస్త్రము నుండి విముక్తి అయినాను
రామకార్యము కొరకు నీయొద్దకు వచ్చి యున్నాను 
అమిత తేజస్సు గల రాముని యొక్క  దూతను నేను  
నేను చెప్పు హిత వచనములు ఆలకిన్చవలెను  
      
సుందర కాండ నందు 50 వ సర్గ సమాప్తము  

Saturday, 22 August 2015

ప్రాంజలిప్రభ - సుందర కాండ తెలుగు వచస్సు (49 వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
ప్రాంజలి ప్రభ
          శ్రీ మాత్రే నమ:
                                   శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ: 49వ సర్గ (వాల్మికి రామాయణములోని 20శ్లోకాల  తెలుగు వచస్సు)
("ప్రభావశాలి అయిన రావణుని రూపమును చూడగానే హనుమంతుని మనస్సులో అనేక విధములైన భావములు కలుగుట ) 


ఇంద్ర జొత్తు యొక్క కర్మచే విస్మితుడును 
రావణునియోక్క కర్మచే ఎర్రని కన్నుల గలవాడును
హనుమంతుడు రాక్షస ప్రభువును చూచెను
రాక్షస కాంతిని చూసి అశ్చర్య పడెను


బహుమూల్యమును బంగారముతో చేయబడినదియును
మరియు  ముత్యములు, వజ్రములతోను  వైడూర్యములతోను 
చేయబడిన కిరీటము ధరంచి మహాతేజవంతుగా ప్రకాశించుటను
హనుమంతుడు రావణుని చూసి అంనంద పడెను 


బహుమూల్యమైన పట్టు వస్త్రములను ధరించిన వాడును 
మంచి రూపము కలిగి ఎర్ర చందనము నలదుకొనిన వాడును 
చిత్ర విచిత్ర రచనలలోను అంగరాగముల తోడను
   అలంకృతమగు శరీరముతో  రాక్షసాదిపతి ఉండెను 


రావణుడు నల్లని కాటుక కొండ వలే ఉండెను
వక్షస్తలముపై ప్రకాశవంతమైన హారములుండెను 
పూర్న చంద్రుని మోఖముతో బాలసూర్యుని వలే ఉండెను
వజ్రవైడూర్యములతో  పొదగబడిన సింహాసనము మీద ఉండెను


భాహువులకు  దండ కడియములు ధరించెను
వక్షస్థలముపై కస్తూరి చెందన లేపములు పూయబడి యండెను 
అతని చేతులు ఐదు తలల సర్పము వలే కనబడు చుండెను
ఆకాశములో ఉన్న నల్లని మేఘమువలె నుండెను


భయంకరమైన పెద్ద కోరలు కలిగి యుండెను 
కన్నులు రక్త వర్ణము కలిగి భయపెట్టు చుండెను 
పెదవులు పొడుగుగా పెద్దవిగా ఉండెను 
పది తలలతో ఉన్న రావణుని మారుతి చూసెను 


విన్జామరులతో స్త్రీలు విసురు చుండెను 
య్యవ్వనవతుల స్త్రీలు సేవించు చుండెను 
మంత్రతంత్రములు తెలిసిన వారు నలుగురు ఉండెను 
దుర్భర, ప్రహస్థ, మహాపార్స్య,  నికుమ్భాది రాక్షులుండెను


నల్గురు రాక్షసులచే పరివృతుడైన రావణుడు బలదర్పము ప్రకటించెను
రావణుడు చతుసముద్ర పరివృతమైన భూలోకమువలె నున్న వాడును 
మంత్రం తంత్రజ్నులగు ఇతరమంత్రులచే పొగడబడు చున్నవాడును 
దేవతలచే పరివృతుడైన దేవేంద్రునివలె రావణుండు వెలుగు చుండెను


భీమ విక్రముగల రాక్షసులు హనుమంతుని భాదపెట్టినను 
భాదను భరిస్తూ ఆశ్చర్యముగా రాక్షస ప్రభను చూసి సంతోషించెను 
హనుమంతుడు రాక్షసాధిపతి యొక్క తేజస్సును తెలుసుకొనెను 
రావణుని తేజస్సుకు హనుమంతుడు మోహితుడై తనలోతాను ఇట్లనుకొనెను


ఆహ ఏమి రూపము, ఏమి ధైర్యము, ఏమి బలము, ఏమి శక్తి, ఏమి కాంతియును
ఈ రాక్షస రాజు రాజోచితములగు సర్వలక్షణములను కలిగి యున్నాడును 
ఇతని యందు ప్రబలమైన అధర్మము లేకుండిన ఈ రాక్షస రాజు సర్వ ప్రపంచమును
ఇంద్రసహతమగు దేవలోకమును కుడా రక్షించగల సమర్ధుడు అని మారుతి తలచెను 


దేవతలు దానవులు, సమస్త మైన లోకములు దారుణములైనవి యును 
క్రూరములనిఅవియును కుశ్చితములైన ఇతని పనులకు వెరచి యుండెను
కోపము వచ్చిన యితడు మొత్తము జగము నంతను సముద్రముగా మార్చ గలుగును
రావణప్రభావమును పలువిధములుగా వీక్షించి హనుమంతుడు ఆలోచించి చింతించెను

సుందర కాండ నందు 49 వ సర్గ సమాప్తము

  


Monday, 17 August 2015

ప్రాంజలిప్రభ - సుందర కాండ తెలుగు వచస్సు (48 వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
ప్రాంజలి ప్రభ
          శ్రీ మాత్రే నమ:
                                   శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:


 48వ సర్గ (వాల్మికి రామాయణములోని 61శ్లోకాల  తెలుగు వచస్సు)
("ఇంద జిత్తుతో యుద్దముచేసి హనుమంతుడు అతని అస్త్రములచేత బద్ధుడై రావణుని సభకు వెళ్ళుట ) 


హనుమంతుని చేతిలో అక్షకుమారుడు మరణించినట్లు గ్రహించెను 
రావణుడు రోషము కల్గిన మనస్సును సమాధాన పరచు కొనెను 
కోపమును బయటకు వక్తీకరించక రావణుడు తన కుమారుడును
అగు దేవతుల్య పరాక్రముడైన ఇంద్రజిత్తు ను ఆజ్ఞాపించెను 
నీవు అస్త్ర కోవిదుడవును, శ స్త్రదారులలో శ్రేష్టుడవును
దేవేంద్రాది దేవతల విషయమునను పరాక్రమమును చూపినవాడవును
బ్రహ్మను ఆరాధించి వివిధ అస్త్రములను సంపాదించిన వాడవును
నా నమ్మకము దేవాసురాలకు కూడా  నీవు శోక ప్రదుడవును 
దేవేంద్రుని ఆశ్ర యించిన దేవతలుగాని, మరుద్గణములు గాని సమరము నందును 
నీవు అస్త్రవిద్యను చూపినప్పుడు  ఎదుట నిలబడి యుద్దము చేయలేక పోయెను 
మూడు లోకములలొ నిన్ను జయించు వారు వేరొకరు లేరని నా నమ్మకమును
నీవు వ్యర్ధము చేయక భాహు బలము చేతను, తపో బలము చేతను యుద్దము చేయవలెను
దేశ కాల కోవిదులలొ ప్రముఖుడవును, బుద్దిమంతు లలో శ్రేష్టుడవును 
యుద్దములో నీ వీరొచిన కర్మలకు అసాద్య మైనది ఏదియు   లేదును 
లేదా బుద్దిపూర్వకముగాచేయు మంత్రనమునకు సాదింపరాని 
దేదియును
ఈ మూడు లోకములలో నీ అస్త్రబలమును శరీర బలమును ఎరుగని వారు లేరును  
నీవు నా యంత తపోబలము, యుద్ద పరాక్రమము, అస్త్రబలము కల వాడవును 
మహాసంగ్రామమునకు వీవు వెళ్ళునప్పుడు నీ విజయ విషయము నందును 
నిశ్చయముగా నా మనస్సు ఎన్నడు ఖేదమును పొందదు నాకున్న నమ్మకమే యును
కింకరులు,జంబుమాలి,అక్షకుమారుడు సమస్త సైన్యము హనుమంతుని చేతిలోమరణించెను 
ఓ శత్రు నాశక వారాలలో నాకున్న శక్తి ఎమియు  లేదును
నాకున్న మంత్ర శక్తి, అస్త్ర శక్తి నీకే  యున్నదియును
నీవు  పర ప్రభావ బలమును ఆత్మబలమును విచారించవలెను 
 నీ బలమునకు తగినవిధముగ అస్త్రములను వానరునిపై వేయవలెను 
ఓ వీర శత్రువు మరణించు వరకు యుద్దము చేయు చుండ వలెను 
ఆత్మబలము, పరబలము గమనించి యుద్దమునందు  విజ్రుమ్భిమ్చ వలెను
సేనలను తీసుకొని పోవద్దు యుద్దమునందు గుంపులుగా పారిపోవును 
విసాలమగు సారముగల వజ్రము ఇతని యందు వ్యర్ధమే యగును 
వానరుని సామర్ద్యము ఇంతే అని నిర్ధారణము చేయ లేమును 
అగ్ని సమానమైన తేజస్సుగల వానరునియందు ఆయుదములు పనిచేయ కుండును
ఎదుటివానియందు నీకున్న పరాక్రముము ఉన్నదనిగమనిమ్చ వలెను
ఎకాగ్రచితుడవై నీ ధనుస్సు యొక్క దివ్యమైన శక్తిని స్మరించి యుద్దము చేయవలెను 
ఓ బుద్దిశాలి నేను నిన్ను యుద్దమునకు పంపుట మంజసము కాదును
 కాని రాజ ధర్మమునకు, క్షత్రీయ ధర్మమునకు సమ్మత మైనదియును
ఓ శత్రుదమాకా వీరుడైన వాడు వివిధ శస్త్రములను ప్రయోగించ వలెను
సంగ్రామము నందు  విజము తప్పక సాధించి తిరిగి రావలెను 
యుద్ద విషయములను తెలుసు కోవలెను
యుద్ద విజయమును కాంక్షించ వలెను 
దేవతలను జయించిన మహా వీరుడవును 
యుద్దముచేయుటకు నిశ్చయించుకొని వెల్ల వలెను 
తండ్రి మాటలను విని యుద్దము చేయ తలంచెను
ముందుగా తండ్రికి శీఘ్రముగా ప్రదక్షిణం చేసెను 
తరువాత ఇష్టులైన తనగణములచే ప్రశంసింప బడెను
ఇంద్రజిత్తు యుద్దమునకు పోవుటకు కుద్యుక్తుడాయెను 


పద్మ విశాల లోచనుడు శ్రీమంతుడు మహాతేజస్వియును 
రాక్షసాధిపతి పుత్రుడు సర్వకాలమున పొంగిన సముద్రమువలెను 
శత్రువులకు సహింపరాని వేగముగాను, గరుత్మంతుడు కన్నా వేగముగను
నింగిలోను, పృధ్యిమీద పయనించే 4వ్యాఘ్రములుగల రధమునెక్కి యుద్దమునకు వచ్చెను 


సస్త్రకోవిదుడును, అస్త్ర వీదులలో శ్రేష్టుడును ధనుర్ధార శ్రేష్టుడును
యుద్దమునకు బయలు దేరగా నాలుగు దిక్కులు మలినము లాయెను 
అతని రధఘోష ధనుస్టన్కారము విని మారుతి హర్షము నొందేను 
అతని తేజస్సును, ధనుస్సు ధరించి వచ్చిన ఇంద్రజిత్తును చూసెను 


 క్రూర మృగములు పలు విధములుగా ఆర్తనాదములు చేసెను 
అక్కడకు యక్షులు, నాగులు, మహర్షులు, సిద్దులు వచ్చెను
పక్షిసంగములు ఆకాశమున ఆచ్చాదనచేసి నాదములు చేసెను
హనుమంతుడు ఇంద్రజిత్తును చూసి శరీరమును పెంచి పెద్దగా నాదము చేసెను 


ఇంద్రజిత్తు పిడుగువంటి ధనుష్టన్కారము చేయుచు యుద్దము ప్రారంభించెను 
హనుమంతుడు కూడా తన తేజో బలముతో ఇంద్రజిత్తును ఎదుర్కొనెను
వైరముతో కూడిన దేవేంద్ర -అసురేంద్రునివలె  యుద్దము చేయు చుండెను   
ఇంద్రజిత్తు హనుమంతునిపై భాణములు వదలగా మారుతిని తికమక పెట్టెను 


ఇంద్రజిత్తు ఆయతములును, తీక్షణములగు ములుకులు గలవియును
మంచిరెక్కలు గలవియును చిత్రమైన సువర్ణపుంఖములు గలవియును 
వజ్రాయుధము తో సమానమైన వేగముగా పయనించే భాణములను
ఎడతెరిపి లేకుండా మారుతిపై ఇంద్రజిత్తు వేసెను, వాటిని మారుతి ఎదుర్కొనెను


ధనుస్సు ఠంన్కారము విని హనుమంతుడు గాలిలోకి ఎగిరి  తప్పించు కొనెను 
ఆపవన నందనుడు, మాటి మాటికి బాణములకు ఎదుట నిలబడు చుండెను   
ఇరువురు ఒకరి బాణములకు ఒకరు తప్పించుకోనుచు ఉత్తమ మైనదియును 
మనోహర మైనదియును అద్భుతముగా ఒకరిఎదుట ఒకరు యుండి యుద్దము చేయుచుండెను   


ఆ రాక్షసుడు హనుమంతుడు  బాణములులను తప్పిన్చుకొను సమయమును
తెలిసుకొనలెకపోయెను, అట్లే హనుమంతుడు కూడా ఇంద్రజిత్తు  
 భాణములను
ఎదుర్కొనుచు దేవ సమానవిక్రముగల వారు ఒకరి తోనొకరు  యుద్దము చేయుచుండెను 
అకాశము నందు దేవతలు యక్షులు ఋషులు నాగులు కన్నార్పకుండా చూచు చుండెను  

ఇంద్రజిత్తు వేసే భాణములు హనుమంతున్ని ఎమీ చేయలేక పోయెను 
హనుమంతుని శక్తి ఇంత అని తెలుసుకోలేక పలువిధాలుగా అలోచించి విచారించెను   
హనుమంతుని నిగ్రహించుటకు ఉపయోగించిన శక్తి భాణములన్నియు విఫలమయ్యెను 
ఇక ఇంద్రజిత్తు హనుమంతున్నీ మంత్ర శక్తితో లొంగదీయుటకు ప్రయత్నించెను 


అస్త్రవిద్యాపరుడును మహాతేజస్వియును మహాబల పరాక్రమ వంతుడును 
అగు ఇంద్రజిత్తు అన్నిఅస్త్రములు వ్యర్ధముకాగా బ్రహ్మాస్త్రమును సంధించెను
హనుమంతుడు బ్రహ్మ ఇచ్చిన వరము గుర్తుకు  తెచ్చుకొని మౌనం  వహించెను 
బ్రహ్మాస్త్రమునకు హనుమంతుడు గోరవించి కదలక మెదలక నైలపై పడిపోయెను 


శత్రువులు హనుమంతుని సమీపించి బలాత్కారముగా భందిమ్చెను 
వారు హనుమంతున్నీ కఱ్ఱలతో గట్టిగా కొట్టగా పెద్దగా నాదము చేసెను  
     మారుతి క్రిందకు పడగా శత్రువులు నిశ్చెష్టు డైననట్లు గమనించెను
వెంటనే నారతో పేనిన త్రాల్లతోను, గుడ్డలతోను, చెట్ల నారతోను గట్టిగా కట్టి వేసెను 


నారలు కట్టిన వెంటనే హనుమంతుడు బ్రహ్మాస్త్రము నుండి భదవిముక్తు డాయెను 
శత్రువులు బలాత్కారముగా తనను కట్టి కొట్టిన కొట్టుగాక అని ఊరు కుండెను
రావణుడికి కూడా నన్ను చూడాలని కుతూహలముగా ఉండి ఉండ  వచ్చును 
ఎందుచేతననగా మరొక దానితో భందిమ్చితే హ్రహ్మాస్త్రము విడిపోవును 


ఇంద్రజిత్తు హమంతుడు బ్రహ్మాస్త్రము నుండి విముకుడైనట్లు తెలుసు కొనెను   
చిన్తించుచూ భ్రహ్మాస్త్రమునకు భద్దు డైనట్లుగా వానరుడు పవర్తిమ్చు చుండెను  
యితడు ఇతర భందమునకు బద్దుడాయెను, అయ్యో నేను చేసిన కర్మ వ్యర్ధమై పోయెను 
ఇప్పుడు రాక్షసుల విజయము సంశయాస్పదమైన పరిస్తితిలో ఉంచ బడి యుండెను  


హనుమంతుడు అస్త్ర విముక్తుడు  కాని వాని వలే రాక్షస దెబ్బలు బరిస్తూ ఉండెను 
క్రూరులైన రాక్షసులు మరణ వేదణను కల్గించుటకు  పిడికల్లు బిగించి గ్రుద్దుచుండెను
హనుమంతుని భందించి తెచ్చుటను రాక్షసులందరూ వింతగా చూచు చుండెను 
హనుమంతుడ్ని సభాసదులతో ఉన్న రాజు వద్దకు  రాక్షసులు లాగుకొని పోయెను


మదించిన ఏనుగును గోలుసులతోకట్టి లాగినట్లు హనుమంతున్నీ లాగు చుండెను 
వారు రావణునితో రాక్షసులను చంపిన వానరుడితడే అని గట్టిగా చెప్పెను    
అక్కడున్నవారు ఎవ్వరివాడు, ఎక్కడినుండి ఎపనిమీద ఇక్కడకు వచ్చెను 
ఇతనికి ఎవరు సహాయము చేసెను అని ఒకరికొకరు అను కొను చుండెను  


హనుమంతుడు మార్గమును అతిక్రమించి హటాత్తుగా రాక్షసాధిపతి యొక్క పాదములవద్దను
కూర్చొనిఉన్న వృద్దపరిచారికలతో మహారత్న విభూషితమగు గృహమును చూసెను  
మహాతేజస్వియగు రావణుడు విక్రుతాకరా రాక్షసులచే లాగాబడుచున్న మారుతిని చూసెను 
కపి సత్తముడు కూడా  సూర్య తేజస్సుతో వెలుగుచున్న రాక్షసాదిపతిని చూసెను 

         
హనుమంతున్నీ చూసిన రావణుడు రోషముతో చంచలమైన ఎర్రని కన్నులు త్రిప్పసాగెను 
తనవద్దవున్న కులసీల వృద్దులను అతన్ని గూర్చి అడుగుటకు వినియోగించెను
హనుమంతుడు వచ్చిన కార్యార్ధమును, కర్యముయోక్క మూల
 కారణమును తెలిపెను 
"నేను కపీశ్వరుదగు సుగ్రీవునిసన్నిధి నుండి  అతని దూతగా వచ్చితిని అని నివేదించెను "

సుందర కాండమునందు 49వ సర్గ సమాప్తము  
     

Tuesday, 11 August 2015

ప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (47 వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
          శ్రీ మాత్రే నమ:
                                   శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:

 47వ సర్గ (వాల్మికి రామాయణములోని 38శ్లోకాల  తెలుగు వచస్సు)
("హనుమంతుడు అక్షకుమారుని వధించుట    ) 
హనుమంతుని చేతిలో  అనుచర వాహన సహితముగాను 
అమాత్య పుత్రులు ఘోరముగా మరణించినట్లు రావణుడు తెలుసుకొనెను 
రావణుడు  ఎదురుగా కూర్చునిఉన్న అక్షకుమారుని చూసెను
అతడు సమరరోద్దతుడును యుద్దన్ముఖుడై యుండెను 
ప్రభువుయ్యోక్క దృష్టి పాత మాత్రముచే ప్రేరితుడైన వాడును 
చిత్రమైన కాంచనమగు ధనస్సును గల ప్రతాప వంతుడును
అగు అక్షకుమారుడు ద్విజశ్రే ష్టులచే  హవిస్సులతోను 
ప్రజ్వలించుచున్న అగ్ని హోత్రునివలె లేచి సభలో నిలబడెను 
 వీర్యవంతుడును బలవంతుడును అగు అక్షుడు పరాక్రమమును 
చూపాలని బాలసూర్యునివలె వెలుగుతున్న గొప్పరధమును 
ఈ రధము తప: ఫలముచేత వచ్చినదియును సమస్త ఆయుధలతోను  
ఉన్న రధముపై ఎక్కి అక్షుడు హనుమంతునిపై యుద్దము చేయుటకు బయలుదేరెను 
ఆ రధము కరగించిన పరిశుద్ధమైన బంగారముతో చేసినట్లు ప్రకాశించు చుండెను
ఈ రధములో రత్నములచేత, వజ్రములచేత అలంకరించ బడిన పతాకము  లుండెను 
మనోవేగాముతో సమానమైన వేగముతో పోయే గుర్రములు కట్ట బడి ఉండెను 
ఈ రధములో ఉన్నవారితో సురులు, అసురులు కూడా  జయించ లేక పోయెను 
ఈ రధము సూర్య ప్రభ వలే వెలుగుచూ ఆకాశములో సంచరించ గలుగును
ఈ రధము మనస్సంకల్పముతో అడ్డు లేకుండా ప్రయాణము చేయ గలుగును
ఈ రధములో యుద్దమునకు కావలసిన సకల ఆయుధములు గలిగి యుండును 
అక్షుడు భూమిని నింపుచు వచ్చి తోరణములవద్ద ఉన్న హనుమంతుని సమీపించెను
సింహమువలె భయంకరమైన నెత్రములుగల అక్షుడు మారుతిని సమీపించెను 
యుగాన్తసమయమున ప్రజాక్షయమున ప్రవృత్తమైన ప్రళయ కాలాగ్ని వలెను 
విమయజనితమైన సంబ్రమము కలవాడును మెరుపువలె ఉన్న వాడును 
అగు అక్క్షకుమారుడు హనుమంతుని బహుమాన పూర్వక దృష్టి తో చూచెను 
మహాత్మడైన కపి యొక్క వేగమును
శత్రువలపై ఆతను చూపిన పరాక్రమమును
తన బలము , తపోశక్తి బలము గలవాడును 
అగు అక్షకుమారుడు ప్రళయ రుద్రునివలె మారెను 
హనుమంతునితో యుద్దమున ఎదిరించలేని  పరాక్రమమును  
గూర్చి విచారించగా సంజాతక్రోధము కలవాడై స్థిరముగా నిలబడెను 
అతడు ఏకాగ్ర చిత్తముతో తీక్షణములైన మూడు భాణములను 
హనుమంతునిపై ప్రయోగించి యుద్దమునకు సిద్దము కమ్మని ప్రేరేపించెను 


యుద్దమున నలయని వాడును, శత్రువుల జయించగల సామర్ద్యము గలవాడును  
యుద్దోత్సాహ ప్రవుద్దమైన మానసము గలవాడు, అగు గర్వ యుక్తుడును  
అగు హనుమంతుని వైపు ఆ యక్షుడు విల్లు నమ్ములు చేత ధరించి చూచెను
 సీఘ్రముగ పరాక్రమించు వాడును నగు యక్షుడు ఆ వానరుని సమీపించెను  


బంగారు పతకమును దండ కడియములను, సుందరమైన కుండ లములను  
ధరించిన వాడగు అక్షుడు హనుమంతునితో గదాయుద్దమును ప్రారంభించెను 
నిజముగా వారియుద్ధము దేవాసురాలకు సైతము సంబ్రమును కల్గించెను 
వారుచేస్తున్న వీర్యవంత మైన యుద్దము నకు భూమి కిక్కుర మన కుండెను  


అపుడు సూర్యుడు తపించు మానివేసెను
వాయువు వీచుట మానివేసెను, సముద్రము కలిగెను 
పర్వతములు తీవ్రంగా కంపించేను
ఆకాశమునుండి భయంకరమైన నాదము వినిపించెను


అక్షుడు భాణములను మారుతిపై సరిగా గురిచూసి వదులు చుండెను
భాణ అగ్రభాగము లందు బంగరు పొన్నులు గలవి వదులు చుండెను
అవి విషధరము కలిగి సర్పములను బొలినవిగా ఉండెను 
అటువంటి వాటిని మారుతిపై మూడు భాణములు అక్షుడు వేసెను


హనుమంతునకు వాటి ప్రభావము వలన ముఖము నుండి రక్తము స్రవించెను
క్రిందకు మీదకు గల నేత్రములతో హనుమంతుడు పలుమార్లు త్రిప్ప సాగెను 
ఆ అస్త్రములు కిరణములు వలే వంటికి తాకి ఎర్రని మంటలు వచ్చెను 
హనుమంతుడు ఆకాశమునందు అటు  ఇటు  తిరుగుచూ భాద లేకుండెను 


హనుమంతుడు ఉద యించిన సూర్య ప్రభవలె కనబడు చుండెను
ఎర్రని బింబము వలె మారుతి ముఖము ప్రకాశించు చుండెను 
చిత్రమైన దనస్సుతో వచ్చిన అక్ష కుమారుడి ప్రతిభను
చూసి సంతోషించు చూ యుద్ధొన్ముఖుడై దేహమును పెంచెను 


సుగ్రీవుని మంత్రులలో శ్రేష్టుడైన అంజనీ పుత్రుడును 
మంధర పర్వత శిఖరాగ్రముపై ఉన్న సూర్యుడువలె ఉన్నవాడును 
బలపరాక్రమములు గల హనుమంతుడు అత్యధిక కోపముతోను 
అక్షకుమారున్ని నేత్రములందున్న అగ్నితో కాల్చునట్లు చూచెను 


యక్షుడు తపస్సు శక్తి తో సంపాదించిన ధనుస్సు ధరించిన వాడును 
యుద్దమునందు నేర్పుగా వర్షమువలె భాణములు వేయు వాడును
గాలితో సమాన వేగముగల  భాణములను మారుతిపై అక్షుడు వేసెను
అవి మేఘము పర్వతముపై వర్షిమ్చినట్లుగా మారుతిని గాయపరిచెను


అటుపిమ్మట హనుమంతుడు రణమున ప్రచండ పరాక్రమమును 
చూపువాడును, మిక్కిలి తేజస్సు బలము కలవాడును
అగు యక్షకుమారుని యుద్దమును చూసి హర్షయుక్తుడాయెను 
అక్షుడు ప్రయోగించిన బాణములకు గాయమై గమ్భీరనాదము చేసెను 


వీర్యదర్పము ప్రవృద్దమైన కోపముగలవాడును
రక్తమువలె ఎర్రనైన నయనములు కలవాడును 
మారుతి యుద్దము చేయుటచూచి సంతోషించెను
కూపములొ చిక్కిన గజమువలె అక్షుడు మారుతినిసమీపించెను  


అక్షుడు బలపూర్వకముగా మారుతిపై విష భాణములు వేసెను
హనుమంతుడు ఉస్చాహపూర్వకముగ తప్పించుకొని గర్జన చేసెను 
చూచువారికి భయము కల్గునటులుగా కాళ్ళు చేతులు కదిలించెను
అకాశములోకి ఎగురుతూ భూమిపైకి వస్తూ తిరుగుచుండెను


మారుతి విల్లు ధరించి యుద్దోన్ముఖుడై పెక్కు బలమైన బాణములతో ఎదుర్కొనెను
ఆకాశమున ఆచ్చాదనచేయు అక్షకుమారుని బహుమానపూర్వకముగా చూసెను 
కార్యముయోక్క యదార్ధ రూపము తెలిసిన వాడగుట వల్ల చింతించెను
అక్షుని యుద్దనైపున్యముచూసి హనుమంతుడు మేచ్చు కొనెను


అక్షుడు పర్వతముపై వడగళ్ళు పడునట్లు నిప్పురవ్వలు ప్రయోగించెను 
హనుమంతుని శరీరమంతా రక్తముకాగ ఇతనిని ఎట్లు జయించ వలెనని అనుకొనెను
బాలదివాకరుని బోలిన తేజము గలవాడును అస్త్రములను సన్ధించ గలవాడును
బాలుడైన పెద్దవానిగా మహోత్తరమైన యుద్దముచేయు చుండెను 


సమస్త యుద్దకర్మలు తెలిసిన ఇతనిని చంపలేకున్నాను
మహాబుద్దిశాలి, యుద్ద విద్యలో ఆరితేరిన వాడును 
సావధాన చిత్తముగా యుద్దములో ఏంతో ఓర్పువహించు చుండెను
యక్షులు, కిన్నరులు, మునులు అక్షుడిని మెచ్చు కొనుచుండెను  


పరాక్రమముతో ప్రవృద్దమానము గలవాడును
నా ఎదుటే నిలబడి నన్నే ఎదిరించగల సమర్ధతను చూపుచున్న వాడును 
ఇతని పరాక్రమము దేవాసురాలను కూడా ఆనందపరచు చున్నదియును
ఇతని పరాక్రమము యుద్దము నందు పెరిగి నన్నే లొంగ దీయును


ఇప్పుడితనిని ఉపెక్షిమ్చతగదు సంహరించుట మేలగును
వ్యర్ధమైన అగ్నిని ఉపెక్షిమ్చరాదు, ఆర్పి వేయవలెను 
శత్రువుని వేగమును గమనించి యుద్దము చేయాలనుకొనెను 
మారుతి తన కర్తవ్యమును తెలుసుకొని యుద్ద వేగమును పెంచెను   


వీరుడైన హనుమంతుడు ఆకాశమర్గములొ మహావేగము కలవియును 
జాగరూకతో కూడుకున్నవి, రధబారమును మోయు చున్నవియును
అగు ఎనిమిది గుర్రములను అరచేతులతో కొట్టి హనుమంతుడు చంపెను 
అక్షుడు కుర్రములు మరణించగా, రధము విరిగిపోగా, అకాశమునుండి నేలపై పడెను 


అక్షుడు రధమును విడిచి ధనుస్సు ఖడ్గము ధరించి ఆకాశము పైకి 
ఎగెరెను
అప్పు  డతడు తప: శక్తి కలవాడై స్వర్గలోకముకు పోయే ఋషి వలె ఉండెను 
హనుమంతుడు గరుత్మంతుడువలె, సిద్దిలువలె, సంచరిన్చేమార్గమున బయలుదేరెను
అక్షకుమరుని వద్దకు మెల్లగా వెళ్లి అతని  పాదములను గట్టిగా పట్టుకొనెను  


హనుమంతుడు సర్పమును గరుత్మంతుడు గట్టిగా పట్టుకున్నట్లను 
అక్షకుమారుని పాదములను గట్టిగా పట్టుకొని వేయి మార్లు గిర గిర త్రిప్పెను 
ఆ తరువాత నేలపై కొట్టెను రాక్సాస శరీరము ముక్కలు ముక్కలుగా మారెను 
యుద్దమును చూచుచున్న దేవేంద్రాదిదేవతలు ఆశ్చర్యముగా చుచు చుండెను


అక్షుడు రక్తము శ్రవించి ఎముకలు నలిగి ముద్దగా మారిపోయెను
భాహువులు, తొడలు, కటి ప్రదేశము,  కంఠం, మొఖము నలిగి పోయెను
సంధులు ఊడి  శరీర భంద మంతా శిధిలమై పోయి మరణించెను
 దెవత లందరూ సంతోష పడెను , రాక్షసులు భయముతో పరుగెట్టెను


అక్షుని నేలపై కొట్టిన శబ్దము రావణునికి గొప్ప భయము గలిగెను
 శక్తి యుక్తి  పరుడు, రక్తమువలె ఎర్రని కన్నులు గలవాడును
అగు హనుమంతుడు చని పోయినవారిని తీసుకువెల్లె యముడివలెను
ఆతోరణము వద్ద ఇతర రాక్షసుల రాకాకై నిర్రీక్షిమ్చు చుండెను

సుందరకాండ నందు 47వ సర్గ సమాప్తముప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (46 వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
          శ్రీ మాత్రే నమ:
                                   శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:

http://vocaroo.com/i/s1gBHpjs6ux1 
 46వ సర్గ (వాల్మికి రామాయణములోని 39శ్లోకాల  తెలుగు వచస్సు)
("హనుమంతుడు రావణుని సేనాపతులను వధించుట    ) 

మహాత్ముడైన హనుమంతుని చేతిలో మంత్రి సుతులు మరణించినట్లు రావణుడు తెలుసుకొనెను
రావణుడు తన భావమును భాహిర్గతముచేయక విచారించి కర్తవ్య నిర్ధారణ చేసెను
రావణుడు తనవద్ద ఉన్న  ఐదుగురు సేనాదిపతుల వైపు చూసి వారిని ప్రోస్చహించెను
వీరు రావణునితో సమానమైన వారు మారుతితో యుద్దమునకు తొందర పడుచుండెను 


విరూపాక్షుడు, యుపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘనుడు, భానకర్ణుడు బయలుదేరెను 
వారితో పెద్ద సైన్యముతో ఆయుధములతో వెళ్లి వానరుడిని శిక్షించండి   అని ఆజ్ఞాపించెను 
మీరు ఆ వానరునితో చాలా జాగర్త వహించి లొంగతీయుటకు ప్రయత్నం చేయవలెను
మీరు పనులలలో దేశ విరోధము, కాలవిరోధము లేకుండా జాగర్త పడవలెను 


అతడు చేసిన యుద్దమును బట్టి సామాన్య వానరుడు కాదనిపించు చుండెను 
గొప్ప సేనను నిగ్రహించిన ఒక మహా ప్రాణివలె నాకు కనపడు చుండెను 
వానరుడని తెలిసిన తర్వాత నాలో అనేక సందేహములు కూడా వచ్చెను
ఇప్పడు రూపమునుబట్టి అతడు వానరుడే అని నేను అనుకోను చున్నాను 


ఈ మహాభూతమును మనకోసమే ఇంద్రుడు తనతపోబలముచేత సృష్టించు యుండ వచ్చును 
నేను మీరన్దరు వెంటరాగా పూర్వము నాగులను, యక్షులను, గంధర్వులను దేవతలను 
అసురలను జయించి ఉన్నాము కదా వారు మనపై ఏదైనా అపకారము చేయదలచి యుండవచ్చును 
అందుకే నేను మీరందరూ  చతురంగ బలమును తీసుకొని వెళ్లి జయము సాధింఛి తిరిగి రావలెను 


నేను గతంలో వాలిని, సుగ్రీవుడ్ని, మహాబలసాలియైన జాంబవంతుడ్ని, నీలుడును 
ద్వివిదుడు మొదలైన అత్యధికమైన బలముగల అనేకమంది వానరులను భల్లూకాలను 
ఎందరినో నేను చూచి యున్నాను, కాని వారి వేగము ఇతని వేగామంత  భయంకరముగా లేకుండెను   
వారిలో ఇట్టి తేజముకాని, పరాక్రమం గాని, బలోశ్చాహముకాని మతిగాని లేకుండెను 


ధైర్య పరాక్రమములతో మీరు ఆ కపిని అవ మానింపక అదుపులోకి తేవలెను 
కావున కపిరూపములో ఏదో మహాశక్తి ఈరూపములొ వచ్చి యుండ వచ్చును
ఇతనిని నిగ్రహించుటకై మహోత్తర శక్తిని మీరు కూడా ఉపయోగించ వలెను
యుద్దమునందు ముల్లోకములలో ఎవరు మిమ్ము  జయించే వారు లేకుండె ననెను 


మహావెగశాలురతోను, అగ్నితో సమానమైన తేజము గలవారితోను
 మత్తగజలములతోను 
గుర్రములు,గజములు పెక్కు రధముల యందు తీక్క్షనమైన శస్త్రములను ధరించిన సేనలను 
మారుతిని ఎదుర్కొని జయమును కాన్క్షిమ్చువాడు యాత్మను రక్షించు కొనవలెను 
ఎందు చేతనంటే యుద్దములో జయ మనేది చంచల మైనదని గుర్తించ  వలెను 


ఉదయించు చున్న సూర్యునివలె తేజోమయమైన కిరణములతో వెలుగు చున్న వాడును
మహాసత్యసంపంనుడును, మహాబలుడును, మహోస్చాహ మహిమ గలవాడును 
మహా వేగ సంపన్నుడును, మహాకాయుడును, మహాభుజుడును, సింహాద్వార స్థితుడును 
నగు హనుమంతున్ని రాక్షసులు చూసి మారుతిని జయంచాలని అన్నిదిక్కుల నిలబడెను   


వారు భయంకరమైన ఆయుధములతోను
మారుతిపై ఆయస్థలములనుండి విరచుకు పడెను
రాక్షసులు ఒక్కసారిగా మారుతిపై భాణ వర్షము కురిపించెను
హనుమంతుని శరీరమంతా భాణములు గుచ్చుకొనగా రక్తము ఏరులై పారెను 


హనుమంతుడు మేఘ ఘర్జనవలె పది దిక్కులు ప్రతిద్వనిమ్చుననట్లు నాదము చేసెను
దుధరుడు వేసే బాణములను తప్పించుకొనుటకు హనుమంతుడు గాలిలోకి ఎగేరెను
దుర్ధరుడు కూడా బలముతో ఒకేసారి వంద బాణములను మారుతిపై  ప్రయోగించెను 
మేఘాలని గాలి తరిమినట్ట్లుగా హనుమంతుడు నోటి జ్వాలతో భాణము లను ఎదుర్కొనెను


హనుమంతుడు వేగముగా శరీరమును పెంచి దుర్ధరుని రధముపై ఒక్క సారి దుమికెను
రధము ముక్కలాయెను, గుర్రములు చనిపోయెను,దుర్ధరుడు క్రిందపడి మరణించెను
విరూపాక్షుడు, యుపాక్షుడు దుర్ధరుడు మరణించినట్లు విని మారుతి పై విజ్రుమ్భించెను 
ఇరువురు ఆకాశములోకి ఎగిరి హనుమంతుని వక్షస్తాలముపై ముద్గరలతో కొట్టెను 


గరుత్మంతునితో సమానమైన పరాక్రమము గల వాడును
మహాబలశాలియైన హనుమంతుడు రాక్షసుల మహా వేగమును 
అణచి గాలిలోకి ఎగురుతూ క్రిందకు వస్తూ వారిని ఎదుర్కొనెను
వెంటనే పాలక వృక్షమును పెకలించి దానితో రాక్షసులను వధించెను  


భానకర్ణుడు, ప్రఘనుడు ఇరువురు కలసి హనుమంతుని ఎదుర్కొనుకు సిద్దపడెను
ఆరాక్షసులు శూలములతొను ఒకవైపు బాణములతోను మరోవైపు యుద్దముచేసెను
ఆ రాక్షులు విపరీతమైన వేగముతో మాయాబలముతో హనుమంతునికి భాదకల్గించెను 
హనుమంతుని శరీరమంతా భాణములు గుచ్చుకొనగా మారుతి వారితో యుద్దము చేసెను    


 రక్తముతో ఉన్న మారుతి రోమములన్నీ ఎర్రబడెను
హనుమంతుని రూపము బాలసూర్యునివలే వెలుగు చుండెను
ఆ వానరశ్రేష్టుడు కోపోద్రేకుడై భీకర నాదము చేసెను 
పర్వతశిఖరమును పెకలించి వారిపై విసిరి చంపివేసెను


హనుమంతుడు అశ్వములను చేతబట్టి అశ్వములను 
గజములను పట్టి గజములను, రధములను బట్టి రధములను
సైనికులను బతి సైనికులను త్రిప్పుచూ నేలకుకొట్టి చంపి వేసెను 
దేవేంద్రుడు అసురలను సంహరించినట్లుగా మారుతి సంహరించెను


చనిపోయిన ఏనుగులతోను, గుర్రములతోను 
విరిగి పోయిన రధములతోను , హతులైన సైనికులతోను
యుద్దమున మారుతి సేనాధిపతులను సంహరించెను
భూమి అంతయు రక్తపు మడుగుగా అక్కడ మారెను


ప్రజాసంహారము కొరకు ఉద్యమించిన కాలము వలెను
హనుమంతుడు యుద్దము చేయవలెనని సింహద్వారముపై నిలిచెను 
మృ త్యువును తీసుకువెల్లె యముడివలె ఎదురుచూస్తుండెను 
పిక్కబలము ఉన్నా సైనికులు రావణునికి సేనాధిపతులు చనిపోయినట్లు తెలిపెను   

సుందర కాండ నందు 46వ సర్గ సమాప్తము