Tuesday, 26 March 2019

***శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - ***{001/102}


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - {001/102}

శ్రీ రామం త్రి జగద్గురుం సురవరం సీతామనోనాయకం
శ్యామాంగం శశికోటిపూర్ణవదనం చంచత్కలాకౌస్తుభం
సౌమ్యం సత్యగుణోత్తమం సుసరయూతీరే వసంతం ప్రభుం
త్రాతారం సకలార్థసిధ్ధిసహితం వందే రఘూణాం పతిం

సీ.
ముల్లోకగురువుని మోక్షసురవరుని
అవనిజాహృదయేశు ననఘశరుని

అసితాంగఘన పూర్ణశశికోటిపూర్ణుని
శాంతకౌస్తుభవిభాక్రాంతమణిని

సౌమ్య సత్య సుగుణ సౌశీల్యసుమనుని
సరయూనదీవాస సత్ప్రభుడని

రక్షించిమమ్మేల రఘుపతీ! శరణను
రక్షార్థహృదయపారక్ష రామ!

తే.
నమ్మకంబుంచి నళినాక్షు నంతజూడ
చిమ్మచీకటి దొలగించి చింతదీర్చు
నెమ్మికొకటని నామము నేర్చినంత
రామ రామ రామమయము రామపదము!

సీ.
ముజ్జగంబునకొక్క ముఖ్యగురుడు పూజ్య
దేవతాపూజిత దేవవరుడు!

నేలపట్టెడదకు నెయ్యంపు చెలికాడు
నలుపునప్పెడిమేని నరవరుండు

కోటిచంద్రులకాంతి కూడిన ముఖనేడు
కౌస్తుభమణికాంతి గమ్మువాడు

నిజలాలిత్యుడు నిత్యసత్యగుణుడు
నిను నను రక్షించు నిజపురేడు

తే.
సారసరయూనదీతీర సదనుడనుచు
సకలసిద్ధార్థసహితుని సన్నుతులిడ
రాఘవపదప్రణతి లోకరక్షయైన
రామ రామ రామమయము రామపథము!

(ముఖ్య తాత్పర్యము : మూడులోకాలకు గురువు, దేవతాశ్రేష్ఠుడు, సీతాదేవి పెనిమిటి,నల్లని శరీరము , కోటిచంద్రులకాంతితో ముఖము , అద్భుత కాంతి,కౌస్తుభమణి తో శాంతుడు, సత్యవ్రతుడు, సరయూతీరమందు వసించు ప్రభువు, మనలందర్నీ రక్షించు సర్వకార్య సిధ్ధులతో కూడిన రఘువంశరాజుల కధిపతి అగు శ్రీ రాముని కి నమస్కరించుచున్నాను )

శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {002/102}

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘువరాన్వయరత్న దీపం
ఆజాను బాహు మరవిందదళాయతాక్షం
రామం నిశాచరవినాశకరం నమామి.

సీ.
రఘువంశసంజాత రాఘవాయందును
దశరథాత్మజుడందు ధర్మధరుని

ఏలెక్క లేనట్టి ఏకాకి నీవందు
అవనిజాపతివందు అవనిపతిని

రవివంశరత్నంబు రాత్రదీపంబందు
రజనీచరులజంపు రక్షణుడని

మోకాటిజేతుల మోక్షకరుడవందు
తామరాకులకన్ను తారకమని

తే.
ఎంతబొగడుదు రామయా చింతనమున
చింతదీర్చుము రామయా అంతరమున
అంతులేనిది రామయా ఎంతయనిన
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: శ్రీ రఘువంశసంజాతుడు,దశరథాత్మజుడు,
అప్రమేయుడు, {ఇంతటివాడని ప్రమాణించశక్యముగానివాడు} సీతాపతి,
సూర్యకులప్రదీపకుడు, ఆజానుబాహుడు, సారసపత్రనేత్రుడు, నిశాచరవినాశకరుడు, పుణ్యచరిత్రుడు, జగత్పవిత్రుడు, శృంగారగుణాభిరాముడైన, శ్రీ రాముని ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {003/102}

శ్రీ రామం బలవైరినీలచికురం స్మేరాననం శ్యామలం
కర్ణాంతాయతలోచనం సురవరం కారుణ్యపాథోనిథిం
శోణాంభోరుహ పాదపల్లవయుగం క్షోణీ తనూజాయుతం
రాజత్కుండలగండభాగయుగళం రామం సదాహం భజే

సీ.
నీలమణులు తలనీలాలమని గూడు
చిరునవ్వు ముఖవీథి చిందులాడు

నీలమేఘశ్యాము నిడివికన్నులజూడ
విప్పారువిరులుగా వీనులమరు

చెవిపోగు వెలుగులే చెంపకాంతిగజేరు
పదపల్లవంబుల పద్మమలరు

కాశ్యపేయవరుని కరుణాసముద్రుని
కపినాథు కీర్తనే కాలమనుచు

తే.
రామనామంబు జిహ్వపై రాజ్యమేల
రామమూర్తిని కనులందు రాశిబోసి
రామపదముల శిరముంచి రక్షణడుగ
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: ఇంద్రనీలమాణిక్యములవలె నల్లనికేశములుకలిగినవాడు,
చిరునవ్వుమోమున చిందులాడెడివాడు, శ్యామలవర్ణదేహమువాడు,
చెవులంటు కన్నుల చెలువుకల్గినవాడు, దేవతాశ్రేష్ఠుడు ,దయాసముద్రుడు,
శోణాంభోరుహ పాదపల్లవయుగుడు, ధాత్రీతనూజాధిపుడు,
రాజత్కుండలలసద్గండస్థలుడు, దివ్యుడు, మాధవుడైన శ్రీ రాముని ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము- {004/102}

శ్రీ రామం జగదేక వీర మమలం సీతా మనోరంజనం
కౌసల్యా వర నందనం రఘుపతిం కాకుత్ స్థ వంశోద్భవం
లోకానా మభిరామ మంగళ ఘన వ్యాపార పారాయణం
వందేహం జనఘోర పాప నికర ధ్వంసం విభుం రాఘవం.

సీ.
జగదేకవీరుడు జడిగొను అమలుడు
నాతిహృద్రంజనా నాయకుండు

కౌసల్య కొమరుడు కాకుత్స్థకులజుడు
రఘుపతినాముడు రామవిభుడు

లోకాభిరాముడు లోకశుభకరుడు
పాపవిధ్వంసక పాదశుభుడు

చిన్మయాకారుడు చిద్సుందరాద్యుడు
చరణాంబుజమూలశరణుడనుచు

తే.
శరణుకోరిన శిరమందు కరమునుంచి
కరుణజూపుచు హృదయాద్యకమలమునను
చరణముంచుము శ్రీరామ! జన్మ నీది
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: జగదేక వీరా ! సీతామనోరంజనా !కౌసల్యా వరనందనా !
రాఘవా !కాకుత్ స్థ వంశోద్భవా! సర్వలోకపవిత్రా ! జనఘోరపాపనికరవిధ్వంసా ! చిన్మయాకారా ! సుందరా ! శ్రీరామా శరణు శరణు శరణు }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {005/102}

శ్రీ రామం జగదీశ్వరం జనకజాజానిం జనానందనం
జంతూనాం జనకం జనార్తి హరణం లోకేశ్వరం శాశ్వతం
ఆబాల్యాదిమునీశ్వరై: పరివృతం జాజ్వల్యమానం సదా
జంఘాలం జమదగ్నిసూనుహరణం జాతానుకంపం భజే

సీ.
జగదీశ్వరుండని జనకజాపతియని
జననందనుండని జానియనుచు

జంతుజీవంబుల జన్మకారకుడని
జగదార్తిహరణుడు జహ్నువనుచు

లోకేశ్వరుడని ముల్లోకశాశ్వతుడని
మునివరావృత బాలమోక్షకుడని

జాజ్జ్వల్యమాన తేజార్చితుండని
జంఘాలుడే కరుణాజలధి రామ!

తే.
పరశురామ గర్వాంధతాపరశు హరము
తిరము దెలిపిన శ్రీరామ తీర్థపదము
స్వరము నిశినాశశ‌రమను వరముదెలియ
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: జగదీశ్వరా ! జనకపుత్రీనాథా ! జనాహ్లాదా !
సకలజంతుసృష్టికారకా ! సకలజంతురక్షకా ! సజ్జానార్తిహరా !
లోకేశ్వరా ! శాశ్వతా ! జననమాది మౌనీంద్రసంఘారూఢావృతా !
జాజ్జ్వల్యమానతేజస్వుడా !జంఘాలుడా ! భార్గవగర్వాపహరా!
రఘువరా ! శ్రీ రామ రక్షమాం రక్షమాం రక్షమాం !}


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {006/102}

శ్రీ రామో రఘునాయకో రఘువరో రాజీవ నేత్రాంచితో
రాజేంద్రో రఘుపుంఘవో రఘుకులోత్తంసో రఘూణాం పతి:
రామో రాక్షస నాశకో~ మిత బలో రాకేందు పూర్ణాననో
రాజత్కింకిణి కంకణాంకిత కరో రామ స్సదా పాతు న:

సీ.
రఘువంశనాయక! రఘువర! రాజేంద్ర!
రాజీవదళనేత్ర! రామచంద్ర!

రఘువరాగ్రేసర! రఘుకులోత్తమ!
రాక్షసమదహర! రాఘవేంద్ర!

రక్షణాశ్రితజనారక్షణామితబల!
రాకేందుమహపూర్ణ రాజితముఖ!

రాజతకింకిణీరవ కంకణాంకిత
రక్షహస్తుభజన రక్షరక్ష!

తే..
రమము రామనామము శబ్దబ్రహ్మరసము
శశిసుధారసాప్లుత మనశ్శమనరవము
ప్రబలసత్పుణ్యఫలదము ప్రథమపదము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: రఘువంశరాజ రత్నము, రఘుకులోత్తముడు, రాజీవనేత్రుడు, రాజేంద్రుడు, రాజశ్రేష్టుడు, {విశేషణములు నాల్గును అదరోక్తులు} నిశాచరధ్వంసకుడు, అప్రమేయుడు,
రాకేందుపూర్ణాననుడు, రాజత్కింకిణికంకణాంకితకరుడు ( ప్రకాశించు మువ్వలుగల కంకణములచే అలంకరింపబడిన హస్తముములుగలవాడు} సీతామన:కుముదచంద్రుడైనట్టి శ్రీ రామచంద్ర ప్రభువు సదా మమ్ము రక్షించుగాక ! }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {007/102}

శ్రీ రామచంద్ర కరుణాకర రాఘవేంద్ర
రాజేంద్ర చంద్ర రఘువంశ సముద్రచంద్ర,
సుగ్రీవనేత్రయుగళోత్పలపూర్ణచంద్ర
సీతామన:కుముదచంద్ర నమో నమస్తే:

సీ.
శ్రీరామచంద్ర! ఆశ్రితకరుణాసంద్ర
రాకాప్రభాచంద్ర! రాఘవేంద్ర!

రాజరాజేంద్రశిరోమణిస్థితచంద్ర!
రఘువంశకులసంద్రరాత్రచంద్ర!

రవిసూనునేత్రసరసిజాయుగ్మస్థిత
పూజితసుగుణేంద్ర పూర్ణచంద్ర!

రత్నగర్భసూను రమణీయహృదయాంత
రాంతర కువలయరాజచంద్ర!

తే.
హృదయనిర్మలతాదీప్త హృద్యచంద్ర!
సదయగుణసారసరసిజా సఖ్యచంద్ర!
ఉదయరవికాంతినమసిత ఉర్విచంద్ర!
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: రాఘవా ! దయాకరా ! రాఘవేంద్రా ! రాజేంద్రచంద్రా !
రఘువంశసముద్రచంద్రాల ! సుగ్రీవనేత్రయుగళోత్పలపూర్ణచంద్రా !
( సుగ్రీవునినేత్రద్వంద కలువలకు పూర్ణచంద్రుడు) శోభనగుణు రామచంద్రుని విభాకరజాక్షియుగాబ్జచంద్రా ! {సీతామన:కుముదచంద్రా } కువలయేశా ! నిర్మలాత్మా ! శ్రీ రామ చంద్రా ! నమో నమస్తే ! }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {008/102}

శ్రీరామం కరుణాకరం గుణనిధిం సీతాపతిం శాశ్వతం
పారావారగభీర మజ్జనయనం ప్రావృఢ్ఘనశ్యామలం
వీరశ్రేష్ఠ మనామయం విజయినం విశ్వప్రకాశాత్మకం
ఘోరారిప్రకరాధిజప్రహరణం కోదండరామం భజే !

సీ.
నెనరుగుణాకరా ! నికరగుణార్ణవా!
నాతిసీతాపతే! నాథనాథ!

నీరధిగంభీరా! నీలోత్పలనయనా!
నీలనీరదదేహ! నైకరూప!

నిజవీరశిష్టేష్ట! నైరుధ్యనిజరూప!
నిఖిలలోకప్రకాశ! నిత్యవిజయ!

నర అరిషడ్వర్గనాశకా! నుఱుమాడు
నాదుచింతల వింటినారిబట్టి!

తే.
నాదు మనమున సాకేతనాథుడుండి
నాదు పథమని పదమందు నడకనేర్ప
నాదు హృన్నాద "శ్రీరామ"నామ శ్రుతుల
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: కరుణాకరా ! గుణనిధీ ! సీతేశా ! వారిధి గంభీరా ! కంజనయనా ! వర్షాంబుద శరీరా ! వీర శ్రేష్ఠా ! అనామయుడా ! విజయా ! విశ్వప్రకాశాత్ముడా ! సుందరాంగా ! సార్వభౌమా ! సౌమ్య నామా ! రమ్యగుణధామా ! ఘోరారిప్రకరాధిజప్రహరణుడా ( ఘోర శత్రువులు అరిషడ్వర్గములు) గుండెనుపిండే మనోవ్యధను హరించు ) శ్రీ రామా! కోదండధారివై నాచింతలు పోగొట్టి నన్నుధ్ధరించి నా ప్రార్థనలను ప్రణామములను అంగీకరించు మా ! }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {009/102}

శ్రీ రామచంద్రేతి సలక్ష్మణేతి
నీలోత్పల శ్యామలకోమలేతి
ఆక్రోశయుక్తా~ స్వధునైవ జిహ్వా
సీతాపతే రాఘవ రాఘవేతి!

సీ.
శ్రీరామచంద్రు డాశ్రితజనాభయుడని
లక్ష్మణసహిత సలక్షణుడని

నల్లకలువమేని నరరూపవిష్ణుడు
నళినకోమలదేహనాథుడనియు

రమణిసీతానాథ! రఘురామ! రాఘవా!
రక్షమాం రక్షమాం రామ! యనుచు

నాదు చింతలదీర్చు నామమందిన జిహ్వ
నా రాముపదములే నాకమనుచు

తే.
అన్ని నీవని దెలియంగ అమరపదము
ఎన్నిమారులు బలికెనో ఎదను కదిపి 
ఎన్నిమారులు కొలిచెనో ఎదను నిలిపి
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: శ్రీ రఘురామ ! రాఘవ ! శ్రీ రామచంద్రా!
సుమిత్రసుతానుయుక్తా ! ఉత్పల శ్యామల శరీరా ! ఉజ్జ్వలాంగా !
ధాత్రీరమణీసుతాధిపా ! సత్యబృందారాకనాథ ! సుధీజ నవందితపాదపద్మశృంగారనిధీ ! "రామా రామా రామా" అని నాజిహ్వ సదా నీ నామస్మరణ చేయుగాక ! }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {010/102}

శ్రీ రామచంద్రే రమతాం మనో మే రమాంగవామే విపదాం విరామే
జితారిరామే ప్రణతారిరామే గుణాభిరామే భువనైకరామే

సీ.
రమరూపజానకి వామాసనారూపు
రాక్షసాపద్రక్ష రామరూపు

రాక్షసారిజయము రాముని రణనీతి
రణపరాజిత అరిప్రణతి ప్రణతి

రమణించు సుగుణాభిరాముడే రమణము
రమణంబు సుందరరామసౌరు

రామచంద్రు కొలువై ప్రణతిల్లు మనమున
రాముడొక్కడు చాలు రక్షసేయ

తే.
రామ రామయే నర్తించు రసనగతిని
రామ రామయే నడిపించు హృదయగతిని
రామ రామయే జేర్చును ప్రణవపదము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: వామభాగంలో లక్ష్మీ దేవి కలిగి, మాఅపదలను పారద్రోలి,
శత్రువులను జయించి, వారిచే ప్రణతులందుకొని,వరసుగుణాభిరాముడు భువనైక మనోహరుడు శ్రీ హరియైన రామునియందు నా చిత్తము రమించుగాక ! }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {011/102}

శ్రీ రామచంద్ర రఘుపుంఘవ రాజవర్య
రాజేంద్ర రాజ సురనాయక రాఘవేశ
రాజాధిరాజ రఘునందన రామభద్ర
దాసోస్మ్యహం చ భవత శ్శరణాగతోస్మి

సీ.
రామచంద్ర! రఘువరేంద్ర! రాకాచంద్ర!
రాజరాజేంద్రవరార్యచంద్ర!

రాజాధిరాజ! సురవరహృదయరాజ!
రఘురాజనందనా! రాఘవేంద్ర!

రామభద్రా! "రక్షరక్ష శ్రీరామ" భజనల
రామదాసుడనైతి రక్షగోరి

రామనామమను ఆరక్షణాగతిజేర్చి
రక్షజూడుము రామ! రక్షనామ!

తే.
రాముడే వార్థిదాటించు రాయినిలిపి
రాముడే ఆర్తిదొలగించు రాకదెలిపి
రామపదరక్ష దొరుకుటే హృదయవరము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: శ్రీ రామచంద్రా ! రఘూత్తమా ! రాజవర్యా !రాజరాజేంద్ర !
రఘునాయకా ! సురరాజ! రాఘవేశా ! రాజాధిరాజ ! రఘునందన !
రామభద్రా ! నేను నీకు శరణుజొచ్చిన దాసుడను ! }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - 12/102

శ్రీ రామం సరసీరుహాక్షమమలం దూర్వాంకుర శ్యామలo
విద్యుత్కోటినిభ ప్రభాంబర ధరం వీరాసనాధిష్ఠితం
వామాంకో పరిసంస్థితాం "జనకజామాలింగ్యతాం బాహునా
తత్వం చాపరపాణినా మునిగణా నాజ్ఞాపయంతం భజే "

సీ.
నల్లకలువకళ్ళు నప్పు తేటంజుట్టి
నీవార కొనమూలనీలి మేని

నిప్పుమేఘజ్యోతి నీ పోతగా కట్టి
నడిమిని వీరాసనమున నిల్చి

నాతిసీతను ప్రేమనమ్మికగా బట్టి
నాదను పురజేయి నెమ్మినేర్పి

నామజపమునుల జ్ఞానబోధనుబెట్ట
నిలిచిన కుడిజేయి నేర్పునేర్ప

తే.
నేను భవసాగరమునంటి నిన్నుగంటి
నేను భవదీయమతిగంటి నన్నుగంటి
నేను భవనాసిపదమంటి నిత్యముంటి
రామ రామ రామమయము రామపథము!

సీ.
నిప్పులుంజంపని నీవారవరివేఱు
నిత్యమై జూపెడి నీలవర్ణ!

ముక్కోటిమెఱుపుల ముప్పేటవస్త్రంబు
ముచ్చటంగట్టిన మోహనాంగ!

ఒకజేత సతిసీత నొదలక కనిబెట్టి
మరుజేత మునిబోధ మహితదెల్పు

వీరాసనాశీన విమలపద్మాక్షుని 
విరిసిన హృత్పద్మవిరిగ గొలుతు!

తే.
సతిని విడువక జూపునే సఖ్యనియతి!
మునులకొదలక జెప్పునే ముఖ్యనియతి!
మానసేంద్రియంబుల జూడ మరులుగొలుపు
రామ రామ రామమయము రామపథము!

(ముఖ్యార్థము - వీరాసనముతో వామాంకముపైకూర్చున్న సీతా దేవిని ఎడమచేయితో కౌగిలించి కుడిచేతితో బ్రహ్మ తత్వాన్ని మునులకు భోధించుచున్న సారసపత్రనేత్రునికి శ్రీ రామునికి నమస్కరిస్తున్నాను )

శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - శ్లోకము 13/102

శ్రీ రామస్సకలేశ్వరో మమ పితా మాతాచ సీతా మమ
భ్రాతా బ్రహ్మ సఖా ప్రభంజనసుత: పత్నీ విరక్తి: ప్రియా
విశ్వామిత్ర విభీషణాదివశగా మిత్రాణి భొధస్సుతో
భక్తశ్శ్రీ హరి సంగతా రతిసుఖం వైకుంఠ మస్మత్పదం

సీ.
అఖిలేశ్వరుడు రాముడతడేను నా తండ్రి
అమ్మసీతమ్మయే నమ్మ నాకు!

అటనాభినింబుట్టి నబ్జాని నా భ్రాత!
ఆప్తుండు పవనజుండాత్మ నాకు

ఆత్మవైరాగ్యమే నమరిన నా పత్ని 
గాధిజుండే ప్రియగురువు నాకు

అరిరావణానుజుం డమితమిత్రుడు నాకు
ఆత్మబోధ నా కంగభవుడు

తే.
సడలని హరిభక్తి సరిరతీసరససుఖము 
రామ సంకీర్తనముజేయు రమ్యహృదయ
సదనమే నాదు శ్రీహరిసదనమనుచు 
రామ రామ రామమయము రామపథము!

సీ.
అఖిలజగన్నాథుడా రాముడే తండ్రి
అమ్మసీతమ్మయే నాదు మాత!

అట నాభినింబుట్టి ననుజుడాయెను బ్రహ్మ!
అనిలజుండాప్తుండు అత్మ నాకు

ఆత్మవైరాగ్యమే నన్నింట నా తోడు 
గాధిజుండందిన గురుడు హితుడు

అరిరావణానుజుం డమితమిత్రుడె నాకు
ఆత్మబోధయె సంతుగమరు వరము

తే.
వదలని హరిభక్తి సంసారసరససుఖము 
సత్యసంకీర్తనామృత సదనమైన
సరసిజాతహృదియె హరిసదనమనుచు 
రామ రామ రామమయము రామపథము!.

సీ.
అఖిలజగన్నాథుడా రాముడే తండ్రి
అమ్మసీతమ్మయే నాదు యమ్మ!

అంభోజజన్ముడై యనుజుడాయెను బ్రహ్మ!
అనిలజుండాప్తుండు నాత్మ నాకు

ఆత్మవైరాగ్యమే నన్నింట నా తోడు 
అటవిని గాధిజుం డాద్యహితుడు

అరిరావణానుజుం డమితమిత్రుడె నాకు
ఆత్మబోధయె సంతుగమరు వరము

తే.
నిత్యహరిభక్తి సంసార నిజపు సుఖము 
సత్యసంకీర్తనామృత సదనమైన
సరసిజాతహృదియె హరిసదనమనుచు 
రామ రామ రామమయము రామపథము!

(ముఖ్యార్థము - "సర్వేశ్వరుడైన శ్రీరాముడు నా తండ్రి, సీతమ్మ నా తల్లి, బ్రహ్మకు స్నేహితుడైన ఆంజనేయుడు నా సోదరుడు, విరక్తి నా భార్య, విశ్వామిత్రుడు,విభీషణుడు మొదలగు ఇంద్రియనిగ్రహముగలవారు నా మిత్రులు,ఙ్ఞానము నా పుత్రుడు,హరిపాదములందు భక్థి సం యోగసుఖము, వైకుంఠము నాకు నివాస స్థలం "మత్ సదనం" )

శ్రీ త్యాగరాజస్వామి "వసంత " రాగం లో ఆలపించిన "సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు నాతండ్రి" కీర్తనకు శ్రీ ఆదిశంకరుల వారి ఈ శ్లోకమే మూలమని మిడి మిడి ఙ్ఞానం తో నాకున్న నమ్మకం


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {014/102}

శ్రీ రామామలపుణ్దరీకనయన శ్రీరామ సీతాపతే
గోవిందాచ్యుత నందనందన ముకుందానంద దామోదర,
విష్ణో రాఘవ వాసుదేవ నృహరే దేవౌఘచూడామణే
సంసారార్ణవకర్ణథారక హరే కృష్ణాయ తుభ్యం నమ:

సీ.
త్రేతరాముని తేటతెలిదమ్మికంటిని
త్రాతసీతాపతి రామవిభుని

గోవింద! అచ్యుత! గోపాల! ముకుంద!
అనంద! నందన! ఆదివంద్య!

రామ! దామోదరా! రాఘవ! నరహరే!
వాసుదేవా! విష్ణు! వహ్నిదేవ!

సంసారసాగర సంకటహరగమ్య
నావిక శ్రీకృష్ణ నాథనాథ!

తే.
సుందరాంగుని నరలోకసుందరతను
బృందగాన బృందావన భృంగరీతి
నందనందను డానందనందనుడన
రామ రామ రామమయమ రామపథము!

{ముఖ్యార్థము: పుండరీకనయనా! కమలాక్షా ! మనోహరా ! సీతాపతీ ! గోవిందా ! అచ్యుతా ! నందనందనా ! ముకుందా ! ఆనందస్వరూపా! దామోదరా ! విష్ణుదేవా ! రాఘవా ! వాసుదేవా ! నృసింహావతారా ! సకలదేవస్వరూపా ! సంసార్ణవకర్ణధారకా ! ఆదిదేవా ! శ్రీరామాచ్యుతా ! జానకీరమణా ! పాపసంహారకా ! పతితపావనరూపా ! హరీ ! శ్రీ రామా !
శ్రీకృష్ణావతారా తుభ్యం నమ : }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {015/102}

రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్ స్థం కరుణాకరం గుణనిధిం విప్రప్రియం ధార్మికం,
రాజత్కుండలమండితాననరుచిం రాత్రించరధ్వంసినం
శంపాకోటిసమానకాంతివిలసన్మాయామృగఘ్నం భజే

సీ.
లక్ష్మణాగ్రజ రామ! లాక్షణ్యరఘవర!
లక్ష్మిసీతాపతే! లక్షణాంగ!

కాకుత్స్థవంశజా! కరుణాకర! ధర్మి!
సద్ధర్మగుణనిధే! సౌత్రదయిత!

వెలుగు కుండలకాంతి వెలిగించు ముఖమూర్తి!
వేల్పుదాయుల జంపు వేల్పవేల్పు!

కోటిమెఱుపులపట్టి కోటీరమునబెట్టి
మాయామృగంబుల మట్టుబెట్టు

తే.
మానసార్ణవశయనుండు మాధవుడని
మానవాంశగ మదిజేరు మనికిఱేని
మానసాలయమున నిల్పు మహితపదము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: రఘుకులశ్రేష్ఠా ! ధరణీజాధిపతీ ! సుందరాకారా !
కాకుత్ స్థవంశాననా ! కరుణాకరా ! గుణనిధీ ! విప్రప్రియా ! ధర్మస్వరూపా ! రాజత్కుండలశోభితాంగా ! రాత్రించరసంహారా !
మాయామృగమును మర్ధించిన కోటిమెఱుపులతో సమానకాంతి గల లక్ష్మణాగ్రజుని , కృపాభ్రాజిష్ణుని, శ్రీ రాముని ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 016/102

రామం రత్నకిరీటకుండలధరం కేయూర హారాన్విత్వం
సీతాలంకృతవామభాగ మతులం సింహాసనస్థం ప్రభుం 
సుగ్రీవాదిసమస్తవానరవరై స్సంసేవ్యమానం సదా 
విశ్వామిత్రపరాశరాదిమునిభిస్సంస్తూయమానం భజే

సీ.
నవరత్నమకుటంబు నప్పుకుండలములు
శోభితభుజకీర్తి శుభదహార

పడతిసీత ఎడమపక్కన కూర్చుండ
పాహిరామప్రభు పట్టమెక్కి

సుగ్రీవ వానర స్తోత్రసేవలనంది
గాధేయ వాసవ గణుతిగొనుచు

మునిపరాశర పూజ్యమూర్తియై శ్రీరాము
డభయంబు వరమిచ్చి ఆర్తిదీర్చ

తే.
రామసుందరతనుగని రాత్రిదొలుగ
రామనామంబు మంత్రమై రసనమంది
రామమందిరమాయెను రమ్యమనము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము : రత్నకిరీటము రత్నకుండలములు ధరించి,
భుజకీర్తులు కల్గి, పొలుపొందు హారములు కంఠసీమను ధరించి,
సీత వామభాగమందు వసింపగా, సింహాసనస్థుడై, ప్రభువై,
సుగ్రీవాదిసమస్త వానరుల సేవలు,స్తోత్రములందుకొని, 
విశ్వామిత్ర పరాశరాది మునులు స్తుతింప వారికి అభయమొసగి,
నాకోరికలీడేర్చు శ్రీరాములవారిని సాదర భక్తితో ప్రార్థనచేసి ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - 17/102

రామ స్సీతాసమేతో నివసతు హృదయే సానుజం రామ మీళే
రామేణ క్షీణపాపస్త్రి విధమపి కృతం కర్మ రామాయ దద్యాం
రామాదన్యం నజానే నహి కిమపి మహా రామ నామ్నస్సమానం
రామే పస్యామి విశ్వం భువన మనుదినం పాహి మాం రామచంద్ర

సీ.
సీతాసమేతుని శ్రీరామచంద్రుని
హృదయాలయంబుంచి హృదయమలర

అనుజులందరుగూడి నర్చించు రాముని
అర్చించుటొక్కటే అభిమతమని

పావననామమే పాపనాశనమని
కర్మలన్నియు పూజ కర్పణయని

పాదుకలంగాంచ పరచింతలేదని
పరమాత్మ శ్రీరామ పదము జేర్చ

తే.
అన్ని లోకంబులందుండి అలరు వాని
అన్ని కాలంబులందొక్క అమరనామ
మబ్బ శ్రీరామపదముల నర్థిగొలుతు
రామ రామ రామమయము రామపథము!!

(ముఖ్యార్థము: నా హృదయపీఠమందు వసించిన శ్రీ సీతా లక్ష్మణ భరత శతృఙ్ఞ సమేత శ్రీరామా ప్రణమిల్లుచున్నాను. శ్రీరామ స్మరణచే నాపాపములన్నియు క్షీణించినవి. మనోవాక్కాయకర్మములన్నియు శ్రీరామార్పణము. శ్రీరామ పాదుకలు తప్ప ఇతరములేవీ నాకు తెలియదు. సర్వలోకములన్నియు రామునియందున్నాయి. సర్వకాల సర్వావస్థలందు సదా నన్ను రక్షించు శ్రీరామచంద్ర ప్రభో !!! )


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {018/102}

రామం రాజ శిఖామణిం రఘుపతిం దేవారిదర్పాపహం
లోకానాం హితకారిణం గుణనిధిం కారుణ్యపుణ్యోదయం
ముక్తావిద్రుమరత్నశోభితతనుం సౌందర్యహస్తాంబుజం
కౌసల్యాతనయం భజామి సతతం శ్రీ జానకీనాయకం

సీ.
రాజశిఖామణి రఘువంశనృపమణి
రాక్షసమదనాశ రక్షకరణి

లోకహితకరుడు లోకోత్తరగుణుడు
కారుణ్యపుణ్యాద్యకమలధరుడు

పగడమౌక్తికకాంతి పరిఢవిల్లెడుమేని
పద్మసుందరహస్త పావనుడని

కౌసల్యకొమరుడు కలికిసీతాపతి
కరుణార్థభజనయే కరణమనుచు

తే.
తనువు తవపదాంబుజకీర్తి తరణినేగ
మనము తవభజాంబుజగతి మరిమరేగ
బయట లోపల "శ్రీరామ" భద్రగతుల
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: రాజశిఖామణి,రఘువంశశ్రేష్ఠుడు, దేవారిదర్పాపహరుడు,
లోకహితకారకుడు, గుణనిధి, శమదమాద్యఖిలైకగుణాకరుడు,
మరకత రత్నసమ్మానిత తనువుచే శోభించున్న సుందరాంగుడు,
హస్తపద్మములను కలిగిన వారిజాక్షుడు, కౌసల్యాతనయుడు,
జానకీపతి శ్రీ రామచంద్రమూర్తిని ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - 19/102

రామం వీరాసనస్థం హృదయ గత పరోదంచిత "జ్ఞానముద్రం"
"జానున్యా సక్త హస్తం" క్షితివర తనయా భూషితం వామభాగే
"షట్కోణే వ్యాహరంతం" పవనసుత యుతం మానసే మాన యంతం
సుగ్రీవే సేవమానే ధృఢ శర ధనుషా దక్షిణే లక్ష్మణేన

సీ.
వీరాసనస్థిత శ్రీరామ కరముద్ర
నానాభయ నివార జ్ఞానముద్ర

మోకాలుదాకంగ ముచ్చటబడు చేయి
మురిసెడి సీతమ్మ ముద్దుతొడవు

ఆరుకోణంబుల ఆసనంబునరూపు
అనిలజుహృత్సీమ నమరు గొలువు

విల్లంబులంబట్టి వీరలక్ష్మణుజేయి,
సద్భక్త సుగ్రీవ సేవ్య రామ!

తే.
విమలధర్మగుణనిరతి విగ్రహుడని
విశదకీర్తనార్చితవరవితతి నుతుల
విమలహృదయాంబుజస్థిత విష్ణుపదము
రామ రామ రామమయము రామపథము!

( ముఖ్యార్థము: ధనుర్భాణములతో లక్ష్మణుడు మరియు ,సుగ్రీవాదు ల సేవలందుకొంటూ, వామాంకస్థమందు సీత, వీరాసనాధిష్టుడై, బాహువును మోకాలిపైనుంచి, ఉదర సమీపంలో ఙ్ఞానముద్రతో, షట్కోణపీఠమందుండి హనుమకు ఙ్ఞానోపదేశముజేయుచున్న రఘు రామచంద్రునికి మరి మరి మోకరిల్లుచున్నాను )


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {019/102}

రామం వీరాసనస్థం హృదయగతపరోదంచితజ్ఞానముద్రం
జానున్యాసక్తహస్తం క్షితివరతనయాభూషితం వామభాగే
షట్కోణే వ్యాహరంతం పవనసుతయుతం మానసే మానయంతం
సుగ్రీవే సేవమానే ధృఢశరధనుషా దక్షిణే లక్ష్మణేన

సీ.
వీరాసనస్థిత! విమలహృదోపరి
జ్ఞానముద్రుంచు అజ్ఞానహరుడు

మోక్షవామకరము మోకాటిపై నిల్పి
మోక్షకరిమహీజ ముదముసేయ

షట్కోణపీఠాన సుద్దుజెప్పి పవన
సుగ్రీవసేవల సూక్ష్మమెరిగి

మనసునందునే మరిమరి దీవించి
సౌమిత్రి కుడివైపు సౌరుజేయ

తే.
సుందరాంగుడు రాముని సుందరతను
కనుల పంచాయతనమైన కనులదెరిచి
కమలమైనట్టి కనుసేవ కరుణయనిన
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: సువీరాసనస్థిరుడు,హృత్సంస్థితభోధముద్రకరుడు,
జానున్యాసక్తహస్తుడు, (హస్తము మోకాలియందుంచిన) శ్రీక్ష్మాపుత్రి పార్శ్వస్థులై , షట్కోణపీఠనివాసియై,ఙ్ఞానముద్రకలిగి,హనుమకు ఙ్ఞానోపదేశం చేయుచు, సుగ్రీవ సేవలందుకుంటూ, దక్షిణమున శరచాపాన్వితుడైన లక్ష్మణుని తో వెలయుచున్న శ్రీరాముని మానసమందు చింతించి ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {020/102}

రామం సౌమిత్రిమిత్రం రఘుపతి మమలం రామచంద్రం రమేశం
రమ్యం శ్రీ రాఘవేశం శుభలలితముఖం శుద్ధసత్వం సువీరం,
సీతాసౌందర్యపాత్రం సురమునివినుతం నీరదేందీవరాభం
వందే వందారుపాలం రజనిచరహరం రమ్యకోదండరామం !

సీ.
సౌమిత్రిసన్మిత్ర! సుమనోజ్ఞరఘుపతే!
రామచంద్ర! రమేశ! రమణకాంగ!

శుభమంగళానన! శుద్ధసత్త్వ! సువీర!
రఘవంశనృపవీర! రణవిదారి!

సతిసీతరమణక ! సురమునిస్తుతకీర్త!
నీరదశ్యామాంగ! నిత్యరక్ష!

రాక్షసహరరామ! రక్షార్థహితరామ!
రక్షించు కోదండరామ రక్ష!

తే.
రాముడొక్కడు చాలును రక్షసేయ
రామనామంబు యొక్కటే రాత్రిపగలు
రాముడందెడి పదము "శ్రీరామ" దెలియ
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: సౌమిత్రి మిత్రుడు, రఘుపతి, నిర్మలుడు,
రామచంద్రుడు, శ్రీరమేశుడు, సుందరాంగుడు, శ్రీరాఘవేశుడు,
మంగళకర సుందరమోముకలవాడు, పరిశుధ్ధస్వరూపుడు, వీరుడు,
సీతామహాదేవి సౌందర్యపాత్రుడు, సురమునివినతుడు,వారిదశ్యాముడు,
నమస్కరించువారల నిరంతర రక్షకుడు, దైత్యవిరాముడు,
మనొహరుడైన కోదండరాముని ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {021/102}

రామం చందనశీతలం క్షితిసుతామోహాకరం శ్రీకరం
వైదేహీనయనారవిందమిహిరం సంపూర్ణచంద్రాననం
రాజానం కరుణాసమేతనయనం సీతామనస్స్యందనం
సీతాదర్పణచారుగండలలితం వందే సదా రాఘవం

సీ.
శీతలచందన శీతలాంగుడు రామ!
క్షితిసుతామోహన క్షేత్రపాల!

పద్మాక్షికన్నుల పద్మబంధుడు రామ!
పున్నమిశశిమోము పూర్ణరూప!

రాజేక్షణ! కరుణారాజతేక్షణ రామ!
సీతామనోరథ సేవ్యమాన!

మైథిలిచెక్కిళ్ళ మెరయుటద్దమునందు
మదినేలు రాముని మెరుపుజూచు

తే.
కనులు కమలంబు వదనంబు కమలమేను
కరము కమలంబు హృదయంబు కమలమేను
కరుణ మేనెల్ల కమలమై కరణి దెలుప
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: శ్రీచందన శీతలుడు శీతలస్వామి, శుభకరుడు, వైదేహీమోహకరుడు , ధరణీజాననకంజకంజహితుడు, {సీతాదేవి నేత్రపద్మములకు సూర్యుడు} సంపూర్ణచంద్రాననుడు, రాజాధిరాజు చక్రవర్తి, కరుణాసం యుతలోచనుడు, సీతామానసస్యందనుడు, { సీతమనస్సు రథముగా గల } మిథిలరాట్కన్యామణీదర్పణస్ఫురదత్యున్నతగండభాగుడు (సీతాదేవి అద్దముల వంటి సుందర చెక్కిళ్ళయందు ప్రకాశించు రాముడు } శ్రీ కరుడైన శ్రీ రాముని సదా ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {022/102}

రామం శ్యామాభిరామం రవిశశినయనం కోటిసూర్యప్రకాశం
దివ్యం దివ్యాస్త్రపాణిం శరముఖశరధిం చారుకోదండహస్తం,
కాలం కాలాగ్నిరుద్రం రిపుకులదహనం విఘ్నవిచ్చేదదక్షం
భీమం భీమాట్టహాసం సకలభయహరం రామచంద్రం భజేహం.

సీ.
శ్యామసుందరరామ! స్యోనచంద్రనయన!
కోటిసూర్యప్రభా కోమలాంగ!

దివ్యసుందరరూప! దివ్యాస్త్రకరదీప!
శరచాపశుభహస్త! శార్ఙ్గధన్వి!

కాలనేమి! భయదకాలాగ్నిరౌద్రేశ!
వైరిసంహార! దుర్విఘ్నదూర!

భీమ! భీతహసన! భీతభయహరణ!
భయము దీర్చుము రామ! భక్తిధామ!

తే.
అరుల కన్నుల భయభీతి ఆరుణరామ
శరము మొనజూపి వరమిచ్చు శమనరామ
తరుణభజనార్థ "శ్రీరామ" తారకంబు
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: ఘన శ్యామాంగుడు, రవిశశినయనుడు, కోటిసూర్యప్రకాశుడు,
విఖ్యాతపురుషుడు,దివ్యాస్త్రపాణి, శరచాపోజ్వ్జల హస్తుడు,కాలస్వరూపుడు, కాలాగ్నిరుద్రుడు, శత్రుకులనిస్తారుడు, విఘ్నసంహరుడు,భయంకరుడు, భీమాట్టహాసుడు, సకలభయహరుడు, శ్యామాభిరాముడైన శ్రీ రామ చంద్ర ప్రభువును ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {023/102}

రామచంద్రచరితాకథామృతం, లక్ష్మణాగ్రజగుణాను కీర్తనం
రాఘవేశ తవ పాద సేవనం సంభవంతు మమ జన్మజన్మని

సీ.
రామచంద్రప్రభు రక్షచరితకథా
పావనామృతఝరీ పానమిమ్ము

లక్ష్మణాగ్రజరామ లాక్షణ్యగుణకీర్తి
పావనామృతగాన పానమిమ్ము

రఘువంశరాజన్య రామచంద్రా! నీదు
పాదసేవాభాగ్య పరమభక్తి

జగదభిరామ! నీ జన్మజన్మలజత
జతవీడక దొరకు జన్మ జన్మ!

తే.
స్మరణి రామనామామృత మథన శరధి
కరణి రామధర్మాచార కరణ తతరతి
ధరణి రామగానామృత ధరణ వితతి
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: దశరథాత్మజుని కథామృతం, లక్ష్మణాగ్రజుని గుణకీర్తనము,రాఘవేశా ! నీ పాదసేవయొనర్చుభాగ్యము నాకు జన్మ జన్మములందు సంభవించుగాక ! }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 024/102)

రామో మత్కుల దైవతం సకరుణం రామం భజే సాదరం
రామేణాఖిలఘోరపాపనిహతీ రామాయ తస్మై నమ:
రామాన్నాస్తి జగత్త్రయైకసులభో రామస్య దాసో స్మ్యహం 
రామే ప్రీతి రతీవ మే కులగురో శ్రీ రామ రక్షస్వ మాం

{ముఖ్యార్థము: రాముడు నా కులదైవం, దయాసముద్రుడైన రాముని ఆదరముతో సేవించుచున్నాను, రామ స్మరణచే ఎల్ల పాపములు నశించును, రామభర్తకై నే నాదరమున ప్రణుతించుచున్నాను, రఘువీరునికంటే సులభుడు లేడు, శ్రీ రామునికి నేనుదాసాను దాసుడను, రామునిపై నాకమిత ప్రీతి, నావంశ గురువైనా శ్రీ రామా నన్ను రక్షింపుము ! }

సీ.
కులపతి రాముడు కూరిమయ్యెను యింట
సాదరసేవనల సదయభజన

స్మరణచే పాపంబుమాపు మంత్రపు రామ!
రక్షకై ప్రణుతి ఆరక్షణంబు

సులభరామునికంటె సూక్ష్మమా జగతిని
పాదదాస్యతయందు పరమపదము

ప్రీతివర్థన రామ! ప్రాజ్ఞగురువు రామ!
ప్రాణంబు శ్రీరామపాదపథము!
తే.
తగని భారంబు తరిగించు తపము జపము
తెగని దూరంబు దరిదింపు తలపుపదము
తగిన మంత్రార్థసారంబు తరుణపదము
రామ రామ రామమయము రామపథము!

సీ.
ఇంటిదేవుండని ఇందిరారమణుని
సత్కరుణాదర సేవజేతు

అఖిలపాపహరుని ఆదిమూలాత్ముని
ఆధ్యాత్మహరి నమో ఆత్మరామ!

అఖిలలోకజనుల అతిసులభుడవని
దాసదాసుడనైతి దశరథాత్మ!

ప్రీతిపాత్ర రామ! ప్రేరణగురు రామ!
ప్రార్థరక్షణ రామ! పాహి పాహి!

తే.
తెగడు పాపంబు లొదలంగ తెలుసుకుంటి
నెగడు దీపంబు వెలిగింప నెలవుగంటి
పొగడు మనసున పులకింత పొలవరంటి
రామ రామ రామమయము రామపథము!
శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 025/102)

శ్రీ రామచంద్ర తవ కీర్తి సుర ద్రుమస్య
తారాగణ స్సుమనస: ఫల మిందు బింబం
మూలం ఫణాఫణిగతం గగనం చ మధ్యం
శాఖా దిశో భువనమండల మాలవాలం

సీ.
విమల రామవిభుడు వేల్పుమాను సమము
విరులాయె కీర్తులే విన్నుతార

శాఖాంతఫలసౌరు శశిబింబసదృశము
వేరుమూలములాయె వేలఫణులు

కాండమధ్యంబిల ఖంబుసరివితతి
కొమ్మలన్నియు దిక్కుకొనలుగాన

భువనమండలమాయె భూరివృక్షపు పాదు
భక్తిరేణువునైతి పదములంటి

తే.
కామితార్థము "శ్రీరామ" కల్పతరువు
భూమిజేశుడు శ్రీరామ భువనధారి
యామికుండగు శ్రీరామ యోగమూర్తి
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 26/102)

వైదేహీం ముదితోభిజాత పులకాంగాఢం సమా లింగయన్
వామేన స్తనక చూచుకం పులకిత వామం కరేణ స్పృశన్
తత్వం దక్షిణ పాణినా కలితయా చిన్ముద్రయా భోధయన్
రామో మారుతి సేవిత స్పరతు మాం సామ్రాజ్య సిమ్హాసనే

సీ.
పులకితవైదేహి పూరింప దరిజేర
పుర్రజేయినిబట్టి పులకలైన

కౌగిలింతలజేయి కొనబారునంజాచి
కొనవేలు శిశువార్తి కోర్కెదీర్చ

కుడిజేయిచిన్ముద్ర కామితసుజ్ఞాన
కలిమితత్త్వముజెప్పు కొలువుజూప

కపివరహనుమచే కోటిసేవలనొంది
కొలువుపీఠముపైన కొలువుదీరు

తే.
కోమలాంగుని కోమలి కొలువు కొలువు
కొలువునెరిగిన పావని కొలువు కొలువు
కొలువుదీరిన పరమాత్మ కొలువు కొలువు
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {027/102}

వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండదండం కరే
చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే
భిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ద్నిస్థితం
కేయూరాదివిభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం

సీ.
వామాంక జానకి వాసి సంసేవ్యంబు
కోదండ చక్రంబు కుడియెడమను

శంఖంబు శరమును శాంతదక్షిణమందు
నళినపత్రపుసౌరు నయనమందు

భద్రపాదంబులు భద్రాచలమునందు
భుజకీర్తులను చతుర్భుజములగల

భువనైకమోహనా! భుజగశయనరూప!
రఘువరా! శ్యామలరామ! ప్రణుతి!

తే.
దండనాథుడవని గొల్చు దండునడుమ
దండమిడితిని నీవండదండవనుచు
దండగూర్చితి నీ నామదండకమున
రామ రామ రామమయము రామపదము!

{ముఖ్యార్థము: ఎడమతొడయందు ఆసీనమైన సీత సేవలందుకుని, ఒక చేత ధనువు, వేరొక చేత చక్రము, కుడిచేతులు రెండంటియందు శంఖము, శరము ధరించి, పద్మపురేకులవంటి నేత్రములు కలిగి, భద్రాచలశిఖరమందు కేయూరాది విభూషణములచే వెలుగొందుచు, శ్రీ చతుర్భుజములతోడ శ్యమాలాకారుడు, రఘువంశ రాజశ్రేష్ఠుడైన శ్రీ రాముని సత్యచరుతుని ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 28/102)
వామే భూమిసుతా పురస్తు హనుమాన్ పశ్చాత్సుమిత్రాసుత
శ్శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో ర్వాయ్వాది కోణేష్వపి
సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్
మధ్యే నీల సరోజ కోమలరుచిం రామం భజే శ్యామలం

{ముఖ్యార్థము: వామభాగమున వైదేహి,ఎదుట మోకాలిపై వ్రాలిన హనుమ, వెనుక లక్ష్మణుడు ప్రక్కన భరత శత్రుఘ్నులు,
వాయవ్యాది మూలదిక్కున సుగ్రీవుడు,ఈశాన్యమున విభీషణుడు, ఆగ్నేయమున అంగదుడు,నైరుతియందు జాంబవంతుడుండగా మధ్యమందు నల్లకలువవలె సుందర శ్యామాంగుడైన శ్రీ రామచంద్రుని ప్రణమిల్లుచున్నాను }

సీ.
వామాంకమున సీత వాతాత్మజుడుబట్టి
వాసిపదములే నివాసమనిన

వెనుక లక్ష్మణమూర్తి వరుసను భరతుడు
వీచోపు శత్రుఘ్న వీచుచుండ

వీరసుగ్రీవుడు విమలవిభీషణ
విజయాంగద వృద్ధవెలుగుబంటి

వరమగు నలుదిశావాసధర్మము జూప
వరరాముడామధ్య వసనుడగుచు

తే.
వారిజశ్యామశోభల వొప్పుజుండ
వహ్ని పంచాయతనదర్శ వాసినెరిగి
వారిజాక్షుని పదగతే వాసమనగ
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {029/102}

వైదేహీసహితం సురద్రుమతలే హైమే మహామంటపే
మధ్యే పుష్పక మానసే మణిమయే వీరాసనే సంస్థితం 
అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య: పరం
వ్యాఖ్యాంతం భరతాదిభి: పరివ్రుతం రామం భజే శ్యామలం

{ముఖ్యార్థము: కల్పవృక్షముక్రింద కనకమంటపమందు
పుష్పకమునడుమ మాణిక్యపీఠమందు సీతాసహితుడై,వీరాసనమందుండి,
ఎదుట నిష్ఠతో పావని ఙ్ఞానతత్వములు చదువుచుండ, పరతత్వములను మునులకు భోధించుచు భరతాది సోదరాన్వితుడై, శ్యామలాకారుడు, చిద్విలాసుడైన శ్రీ రామచంద్ర మూర్తిని ప్రణమిల్లుచున్నాను }

సీ.
కల్పవృక్షముకింద కనకమంటపమందు
కామితారూఢపు కొలువుమధ్య

కనకమణిఖచిత కామితాసనమందు
కలికిసీతమ్మను కాలునిల్పి

కైవల్యతత్త్వము కేసరిసుతునకు
కట్టడతత్త్వము కుటపులకును

కరుణచే బోధించి గమనానుజులగూడి
గతిదెల్పు శ్యామలాకార రామ!

తే.
కరుణజూపెడు "శ్రీరామ" గళమునింపు
శరణునేర్పెడు శ్రీరామచరణమందు
తరుణమొక్కటే తలరాత తరణమైన
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 30/102)

వైదేహీ పరిరభ్య జాత పులకాం లజ్జా వతీం సుస్మితాం
కాంచీ నూపుర హార కంకణ లసత్కర్ణావతంసోజ్వలాం
కస్తూరీ ఘన సార చర్చిత కుచాం చంద్రాననాం శ్యామలం
కందర్పాధిక సుందరం రఘుపతిం శ్రీ రామచంద్రం భజే

సీ.
పత్నిసీతనుజూడ పులకరించెడి మేను
పత్నిజూపులు తాక పడెడు సిగ్గు

పట్టుచిరునగవు పైడంచుమొలనూలు
పుత్తడిమువ్వలు పసిడిగొలుసు

పగడపు కడియంబు పొడవైనపోగులు
పసిడిమెరుపులచే పరగు ముఖము

పన్నీట కస్తూరి పొడికప్పురపు మిశ్ర
పరిమళపూతందు పద్మకుచము

తే.
పున్నమశశిముఖము కర్ణపూరమేని
పుష్పశరకోటి సుందరపూర్ణశుభుడు
పుడమికొమరిత పతిగూడ పూజలిడుదు
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 31/102)

వైదేహీ రమణం విభీషణ విభుం విష్ణు స్వరూపం హరిం
విశ్వోత్పత్తి ప్రపత్తి పోషణ కరం విద్యాధరై రర్చితం,
వైరి ధ్వంస కరం విరించి జనకం విశ్వాత్మకం వ్యాపకం
వ్యాసాంగీ రస నారదాది వినుతం వందామహే రాఘవం

సీ.
వైదేహిరమణుడు విమతానుజహితుడు
విష్ణుస్వరూపుడు విదథపథుడు

విశ్వబీజాద్యుడు విశ్వరక్షాత్ముడు
విద్యాధరార్చిత విశ్వమూర్తి

వైరిగుణహరుడు వాగీశజనకుడు
విశ్వాత్మక! సకలవిశ్వవితతి!

వ్యాస అంగీరస వాక్సుతనారద
వినుత! నీ పదమంటి వేడుకొందు!

తే.
వాయునందను హృదయాన వారిజమని
వైరినాథుల గుణశేషవిదళితమగు
వారిజపదమేను హృదయావాసమైన
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 32/102)

వైదేహస్య పురే వివాహ సమయే కల్యాణ వేద్యంతరే
సామోదే విమలేందు రత్న ఖచితే పీఠే వసంతౌ శుభే
శృణ్వంతౌ నిగమాంతత్వ విధుషా మాశీర్గిర స్సాదరం
పాయాస్తాం సు వధూ వరౌ రఘుపతి శ్శ్రీజానకీ చానిశం

సీ.
వరవిదేహపురిని వధువు వైదేహిని
వరుడు రామునిజేర్చు వేడుకందు

వేదోచ్ఛరిత యాగవేదిక నడుమను
వేదపండితులు దీవెనలనివ్వ

వేలుపురారాళ్ళ వెలుగుపీటలపైన
వాసంతశోభల వధువు వరుడు

వదలక దీవించువారల దీవించు
వారని రక్షింప వరమడిగితి

తే.
వధువు సీతను జేరంగ వనము జేరి
విల్లునెత్తిన వధువని విల్లుదుంచి
వేడుకనగాను తమ పెళ్ళి వేడకనిన
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 33/102)

అసిత కమలభాసా భానయంతం త్రిలోకం
దశరథ కులదీపం దైవతాంభోజ భానుం
దినకరకులబాలం దివ్యకోదండ పాణిం
కనకఖచిత రత్నాలంకృతం రామ మీడే

సీ.
నీలోత్పలసదృశ నీలమేనిప్రభ
నిత్యము ముల్లోక నెగడుసేయ

దశరథకులదీప్తు ధర్మదీపప్రభే
దైవతకమలాప్తదీప్తికాగ

రవివంశజాత్ముడు రక్షకోదండంబు
రక్షింపగాబట్టి రక్షసేసి

రవ్వలూ రసనంబు రాశుల.జేరిన
రామచంద్రునిరూపు రక్ష రక్ష!

తే.
లోకరక్షణ నిలజూపు లోచనముల
యాగరక్షణ నెరవేర్చు యుక్తకరము
మోకరిల్లిన మనసుల ముక్తిసేయు
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 34/102

సుస్నిగ్ధం నీలకేశం స్పుట మధుర ముఖం సుందర భ్రూ లలాటం
దీర్ఘాక్షం చారునాసాపుట మమల మణి శ్రేణి కాదంత పఙ్క్తిం
బింబోష్ఠం కంభు కంఠం కఠిన తర మహోరస్క మాజాను బాహుం
ముష్ఠి గ్రాహ్యావలగ్నం పృథు జఘన ముదారోరు జంఘాఘ్

సీ.
నునుపుదీరిన మేను నలుపుదట్టపు జుట్టు
నప్పుమోము మెరయునుదుట భ్రుకుటి

చెవులజేరు కనులు చక్కకోసున ముక్కు
చొక్కపుమణులంటి చక్కపళ్ళు

దొండపండ్లయెరుపు నిండిన పెదవులు
శంఖువొంపులజూప గొంతుయుండ

దిట్టపట్టుల రొమ్ము దీర్ఘబాహువులునూ
పిడికిట బట్టేటి పిట్టనడుము

తే.
ఘనపు జఘనంబు ఘనజంఘికోరువులును
ఘనపదకమల! కమలాక్ష! కమలనాభ!
ఘనత నీరూపు గాంచుటే కనుకొలనున
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 35/102)
మాతా రామో మత్పితా రామచంద్రో
భ్రాతా రామో మత్సఖా రాఘవేశ;
సర్వస్వం మే రామచంద్రో దయాళు:
నాన్యం దైవం నైవ జానే న జానే

సీ.
రాముడే నాతండ్రి రామచంద్రుడె తల్లి
రాముడే అనుజుడు రక్షవిభుడు

రాముడే చెలికాడు రాముడే సరిజోడు
రాముడే నడిపేను ప్రాణనావ

రాముడే అన్నింట "రామ"యే అందును
రామచంద్రుని దయే రాత్రిపగలు

రాముడేయని పరరక్షణమెరుగని
రాజ్యహృదయమందు రామ! రామ!

తే.
"రామ" ఎదలయగతి నాకు "రామ" శ్వాస
"రామ" కంఠశశబ్దము నాకు "రామ" ఎఱుక
"రామ" శ్రవణసారము నాకు "రామ" నడక
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {036/102}

జానాతి రామ తవ నామ రుచిం మహేశో
జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం,
జానాతి దోర్భల పరాక్రమ మీశచాపో
జానా త్యమోఘపటు బాణగతిం పయోధి:

{ముఖ్యార్థము: ఓ రామా ! నీ నామ మంత్రరుచి దక్షసుతారమణుడు మహేశ్వడెరుగును. నీ పావనపాదపంకజ ప్రభావము అహల్య ఎరుగును.
నీ భుజపరాక్రమము శివదేవుని చాపమెరుగును.నీ శరధాటి సముద్రుడెరుగును}

సీ.
తెలిసికొంటిని రామ! తేనెల నీనామ
మంత్రమహతిని ముక్కంటి దెలుప

తెలిసికొంటిని రామ! తెరవగు చరణంబు
తరుణిగౌతమి శిలై తాకి దెలుప

తెలిసికొంటిని రామ! తవ శరణాగతి
తాకిదుంచిన వింటితాడు దెలుప

తెలిసికొంటిని రామ! తీక్ష్ణధర్మపుధాటి
తిమురుసాగరుజీల్చు తెరగు దెలుప

తే.
తెలిసి నడిపెడి తత్వంబు తెరవు నీవు
తెలిసి మసలెడు తరుణంబు తెలివి నీవు
తెలియ పరమేల" శ్రీరామ" దెలియు జిహ్వ
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {037/102}

దివ్యస్యందనమధ్యగం రణరణచ్చాపాన్వితం భీషణం
కాలగ్నిప్రతిమానబాణకలితం ఘోరాస్త్రతూణీద్వయం,
సుగ్రీవాంగదరావణానుజమరుత్పుత్రాదిసంసేవితం
రామం రాక్షసవీరకోటిహరణం రక్తాంబుజాక్షం భజే

{ముఖ్యార్థము: దివ్యరథమునథిష్ఠించి రణగుణధ్వని చేయు ధనువు బట్టి,
ప్రళయాగ్నితోబోలు బాణము సంధించి, అస్త్రతూణీద్వయం గలిగి,
రాక్షస మూకలను రణమందు నిర్జించి, సాధుసజ్జనులను శాంతపరచి,
సుగ్రీవ,అంగద,విభీషణ,హనుమదాదులచే సేవింపబడుతున్న శ్రీ శుభాంగా!
శ్రీ రామా ! రక్తసరోజనేత్రుడైన నిన్ను స్మరించు వారల రక్షించు సారసాక్ష ! నీకివే నాప్రణతులు }

సీ.
విజయరథమునెక్కి విల్లెత్తు రవముచే
విహ్వలరిపు మనోవిరతి సలుపు

కాలాగ్నివేగపు ఖగముల చేబట్టి
ఘోరకోలల జంటఖోలి నిలుపు

అంగద సుగ్రీవ ఆంజనేయుల భక్తి
రావణానుజసేవ రమముదెలుపు

రాక్షసనృపకోటి రక్షామణీ! రామ!
రక్తోత్పలేక్షణా! రక్షరక్ష!

తే.
నా మనోరథారూఢుడై నాదు ప్రభువు
నియతభక్తిస్వరధనువు నిలిపిపట్టి
నామమంత్రపు బాణమై నాలుకనెను
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {038/102}

బ్రహ్మాద్యామరసిద్ధజన్మభువనం యన్నాభిపంకేరుహం
శ్రీనిర్వాణనికేతనం యదుదరం లోకైకశయ్యాగృహం
యద్వక్ష:కమలావిలాసభవనం యన్నామమంత్రం సతాం
వాసాగార మఖండమంగళనిధి: పాయా త్స వో రాఘవ:

{ముఖ్యార్థము: నళిననేత్రా ! నీనాభిపద్మంలో బ్రహ్మాదిదేవతలు ప్రభవించినారు
ఇందిరారమణీ లక్ష్మీదేవి వశించు నీవక్షస్థలము {నీగర్భకోశం} 14 లోకములకు శయ్యాగృహము. నీ రొమ్ము లక్ష్మీదేవికి విలాసమందిరం . సాదు సజ్జన మహాజనులకు నీ నామము నివాసగృహము. శ్రీ రామా సర్వ శుభాకారా ! సంసారబంధనముల చిక్కి తపించు దీనుడైన నన్ను రక్షించు రామచంద్రా ! }

సీ.
ధాతాదివేల్పుల ధాతవు పితవీవు
పొక్కిలికమలంబు పుట్టినిల్లు

కమలాంబ కొలువైన గర్భభాండంబేను
భువనభాండంబుల పడకటిల్లు

ఎడమేను కమలాక్షి కెడదనవ్వులయిల్లు
నామమే మునులకు నాకగృహము

సర్వమంగళరామ! సకలదుఃఖవిరామ!
భవసాగరము దాటు బాట రామ

తే.
మనసు నెలవుగ మౌనంబు మొదటిమాట
కనుల కొలనున కమలంబు కొలువుమూర్తి
అనవరతమున శ్రీరాము డాత్మయింట
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 039/102)

శృంగారం క్షితి నందనీ విహరణే వీరం ధనుర్భంజనే
కారుణ్యం బలి భోజనేద్భుత రసం సింధౌ గిరి స్థాపనే
హాస్యం శూర్పణఖా ముఖే భయవహే భీభత్స మన్యాముఖే
రౌద్రం రావణ మర్దనే ముని జనే శాంతం వపు: పాతున:

సీ.
ఇంతితో విహరింప నెంత శృంగారమే
విల్లంది దుంచుటే వీరరసము

కాకాసురునిపైన కరుణాఝరిందించు
అగములబ్దిన్నిల్ప నద్భుతంబు

రావణానుజ మోమురక్షైన హాస్యంబు
భీబత్సముఖ మన్యభీరువులకు

రావణాసురుజంప రౌద్రమా రూపంబు
మునివరుగన శాంతముప్పిరిగొను

తే.
అష్టరసముల కాద్యంబు నంతమైన
అఖిలలోకధరుని అనంతామృతాబ్ది
శయును నొదలక సేవించు శరణుగోర
రామ రామ రామమయము రామపథము!

శ్లోకముఖార్థం :(జానకీ దేవి తో విహరించునపుడు శృంగారరసం, శివధనుర్భంగమందు వీరరసం, కాకాసురునియందు దయారసం, సముద్రమున పర్వతములుంచునపుడు ఆశ్చర్యరసం,శూర్పణకమోమున హాస్యరసం,ఇతరస్త్రీలమోహమున ( అసహ్యత)భీభత్స రసం ,రావణసం హారమందు రౌద్రరసం, మునీశ్వరులయందు శాంతరసము కలిగిన స్వరూపము మమ్ము రక్షించు గాక !!! )


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసమ 040/102)

వందామహే మహేశాన చండ కోదండ ఖండనం
జానకీ హృదయానంద చందనం రఘునందనం

సీ.
సీతమ్మ కదిపిన శివుని విల్లును జూచి
ఎత్తిజూతముయన్న నెత్తలేని

ఎల్లరు వీరులే ఎవరితడంచును
ఎత్తని తలలను ఎత్తి నిలుప

అవలీలగనుయెత్తి అటుపైన విలుదుంచి
అవనిజ పూమాల అర్హుడతడు

ఎదనిండ దానుండి ఎరిగిన పత్నికి
ఎదనిండ ఎలమిడు ఏలికతడు

తే.
ఎదర సీతమ్మ రాముని ఎఱుకజెప్ప
ఎదను రఘునందనుడేను ఎదర తానె
ఎదను చందనమర్పింప పదము "రామ"
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 041/102)

మూలే కల్పధ్రుమస్యాఖిల మణి విలద్రత్న సింహాసనస్తం
కోదండే నాశుగేనోల్లసిత కర యుగేనార్చితం లక్ష్మణేన
వామాంకన్యస్త సీతం భరత భృత మహా మౌక్తిఛ్ఛత్ర కాంతిం
శత్రుఘ్నే చామరాభ్యాం సువిలసిత కరే రామచంద్రం భజేహం

సీ.
కల్పవృక్షపుమూల కమనీయ మణులన్ని
నింపిన పీఠంబు నింపురేడు

కోదండమును బట్టు కోమలాంగుని జేయి
జేరు లక్ష్మణు పూజజేయు వైపు

వామాంకమున సీత వరలక్ష్మిరూపమై
వరియించి నెదవైపు వలపుమీర

పట్టుముత్యాలతో బరగు ఛత్రంబును
భరతుడే బట్టిల భక్తి జూప

తే.
వీచి వింజామరలయక వినుతిసేయ
పట్టు శత్రుఘ్ను పరిధిని పరమసేవ
ప్రణుతరాముని కొలువేను ప్రణుతపథము
రామ రామ రామమయము రామపథము!

శ్లోకముఖ్యార్థం : (కల్పవృక్షం మొదట సర్వరత్నములతో గూడిన పీఠమందుగల శ్రీరాముని , ధనుర్భాణములచే సొగసైన హస్తములుగల లక్ష్మణపూజలందుకొంటున్న మా రాముని, ఎడమతొడయందుకూర్చున్న సీతా మాతతో ఉన్న మా సీతారాముని , భరతునిచే ముత్యాల గొడుగుపట్టించుకున్న మా రఘువంశ రాముని, శతృఘ్నునిచే వింజామరల సేవలనందుకుంటున్న శ్రీరామచంద్ర ప్రభువులకు నమస్కరించుచున్నాను )


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {041/102}

మూలే కల్పధ్రుమస్యాఖిలమణివిలద్రత్నసింహాసనస్థం
కోదండేనాశుగేనోల్లసితకరయుగేనార్చితం లక్ష్మణేన,
వామాంకన్యస్తసీతం భరతభృతమహామౌక్తిఛ్ఛత్రకాంతిం
శత్రుఘ్నే చామరాభ్యాం సువిలసితకరే రామచంద్రం భజే~హం !

సీ.
ముజ్జగంబులమూల ముప్పిరిగొనియున్న
మందారతరువాటికాంతరమున

మణిమయాలంకృత మాన్యాసనస్థిత
మోహవిరహితేశ! మోక్షణేశ!

విల్లంబువైపున వినయలక్ష్మణమూర్తి
వామాంకమున సీత వాసిమీర

ముదమార భరతుని మౌక్తికార్చితఛత్ర
మగ్ధమోహనకాంతి మోముజేర

తే.
పవనవింజామర శతృఘ్నుపాణమలర
పవనసూనుడు పాదంబుబట్టి గొల్చు
భువనమోహనరాముని భజన భజన
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: నవరత్నఖచిత నవ్యపీఠమందు కల్పవృక్షముక్రింద
నెలకొని, విల్లంబులనుధరియించిన సొగసైన హస్తములుగల లక్ష్మణునిచే పూజలందుకుని, వామభాగమున సీత వఱలుచుండ , ముత్యాలగొడుగును భరతుడు పట్టగా, వింజామరములు వీచుచుశతృఘ్నుడు సేవింప, మందహాసముతో వెలుగొందు శ్రీ రాముని ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 042/102)

వామే కోదండ దండం నిజకర కమలే దక్షిణే బాణ మేకం
పశ్చాద్భాగే చ నిత్యం దధత మభిమతం చాప తూణీర భారం
వామే వామే లసద్భ్యాం సహమిళితతనుం జానకీ లక్ష్మణాభ్యాం
రామం శ్యామం భజేహం ప్రణత జనమన: ఖేద విఛ్ఛేద దక్షం

సీ.
ఎడమజేయినిజేరి ఏలు కోదండంబు
కుడిచేయికొన నొక్కకోల నిలిపి

వెన్నుభారముజేయు వీపునంబులపొది
విడువక యున్నట్టి వేద్యమూర్తి

తనతోటి నడిచేటి తనువుసీతమ్మయు
తమ్ముడు సౌమిత్రి తోడుయుండ

తరుణమంత్రముదెల్పి తనవారి దుఃఖము
తొలగించి రక్షించు తారకుడని

తే.
తరుణమొదలక కీర్తించి తన్మయమున
భరణ నీదను భజనార్థ భక్తజనుల
కరుణ జూపుము కమలాక్ష! కావుమిలను
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - 043/102

అంభోధర శ్యామల మంబుజాక్షం ధనుర్ధరం వీర జటా కలాపం
పార్శ్వద్వయే లక్ష్మణ మైథిలీభ్యాం నిషేవ్యమాణం ప్రణమామి రామం

సీ.
నీలమేఘపురంగు నిలిపిన సిరిమేను
నళినాబ్జముద్రిత నయనములును

నిలువెత్తు వింటిని నిలిపెడి సరిచేయి
నాజూకు తలజుట్టు నడిమి కొప్పు

నిజభక్తి సౌమిత్రి నిలిచికొల్వ కుడిని
నిత్యశ్రీ జానకి నిల్చెనెడమ

నిజభక్తి శిరముంచి నిలిపితి పదముల
నినుగను నిత్యమే నిజము రామ!

తే.
నిన్ను నీవారమెరుగును నీరధెరుగు
నిన్ను నటరాజు నగజయే నెమ్మినెరుగు
నిన్నుగను దారి నెరుకను నేర్పు నేర్వ
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {044/102}

కోదండదీక్షాగురు మప్రమేయం సలక్ష్మణం దాశరథిం దయాళుం
ఆజానుబాహుం జగదేకవీర మనాథనాథం రఘునాథ మీడే

సీ.
కోదండమొదలని కఠినవ్రత గురువు
అమితవిశ్వాతీత అమరమూర్తి

అనుపమాహ్వయుడు అమితదయాళుడు
ఆజానుబాహుడు అమలమూర్తి

దశరథతనయుడు ధారుణీపాలుడు
జగదేకవీరుడు జహ్నుమూర్తి

ఒరులనెరుగమన్న ఓర్పునేర్పునగాచు
ప్రణవనాదాత్మక! ప్రణతి ప్రణతి

తే.
నమ్మువారల నడిపించు నయనకాంతి
నెమ్మిజూపెడి హృదయాబ్జ నిలయుడవని
నమ్మి సర్వము నీవంటి నాదు రామ!
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: కోదండధారణ దీక్షయందు ఎల్లరకు గురువు, అప్రమేయుడు,
సలక్ష్మణుడు, దశరథపుత్రుడు, దయాళుడు,ఆజానుబాహుడు,
జగదేకవీరుడు, అనాథనాథుడు, రఘునాథుడు, శ్రీ శుభాంగుడైన శ్రీ రాముని ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామకర్ణామృతం - ప్రథమాశ్వాసము 045/102)

కర్పూరాంగ విలేపనం రఘువరం రాజీవ నేత్రం ప్రభుం
కస్తూరీ నికరా కృతిం ఖర ధృతి ప్రధ్వంసినం శ్రీహరిం
కందర్పాయుత కోటి సుంద తనుం కామారి సేవ్యం గురం
కాంతా కామద మప్రమేయ మమలం సీతా సమేతం భజే

సీ.
కర్పూరచందన కవరలేపనధారి
కమలాక్ష! రఘువర! కువలయేశ!

కస్తూరికానిధి కూడిన రూపసి
ఖరుని ధైర్యముజంపు ఖగపుశౌరి

కోటిమన్మధకోటికొమరు సుందరసౌరు
కైలాసవాసికి కొలువు గురువు

కాంతలు కామించు కందర్పమోహనుడు
కనశక్యమేగాని కఱ్ఱలేని

తే.
కలికిజానకీ సహితుడు కలిమిజేయ
కనులనిండెడి రూపమై కరుణగొనిన
కలిమికనులను కలలేల? కోర్కెలేల?
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 046/102)

నీలాబ్దబృందసదృశం పరిపూర్ణ దేహం
దిక్పాలకాది సుర సేవిత పాద పద్మం
పీతాంబరం కనక కుండల శోభితాంగం
సీతాపతిం రఘుపతిం సతతం భజామి

సీ.
నల్లకలువపూల ననువుగుత్తులనిగ్గు
నప్పేటి నిండైన నలుపుమేని

దిక్కని మొక్కంగ దివిజదిక్పాలక
దివ్యసన్నిధియైన దివ్యపదము

పసిడిచేలముగట్టి పసిడిపోగులబెట్టి
ప్రకటితార్చిసదీప్త ప్రకశితాంగ

అమ్మ జానకితోటి అయ్య రామునిజూడ
ఆత్మ భజనజేయు అనవరతము

తే.
భజన నీదయ శ్రీరామ! భక్తి నీది
బ్రతుకు నీదయ శ్రీరామ! భ్రమలు దొలుగ
తెరవు నీవని తెలిపేటి తెలివి నీవు
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {047/102}

భర్గ బ్రహ్మసురేంద్రముఖ్యదివిజప్రాంచత్కిరీటాగ్రసం
సర్గానేకమణిప్రభాకరసహస్రాభం పదాంభోరుహే,
దుర్గాసంతతసంస్తుతాంఘ్రికమలం దుర్వారకోదండినం
గంగావిస్ఫుటమౌళిమానసహరం కల్యాణరామం భజే !

సీ.
శశిశేఖర సనత శక్రాది సురలెల్ల
శిరమొంచి ప్రణుతిల్ల శీర్షకమున

శ్రేష్టరత్నప్రభ శ్రేయకమలపర్ణ
శోభమీర వెలుగు శోభితపద

శైలజాస్తుతికీర్త క్షేమపదాబ్జము
శత్రుదుర్వారమౌ శరధనుస్సు

శివమెత్తు సురగంగ శివుని తాకెడువేళ
శమనమానసశక్తి శరణమూర్తి

తే.
శరణసుమధామ! శరభీమ! శమనసోమ
శిఖరసద్ధర్మచరకామ! సేవ్యధామ!
శక్తకరుణాగుణోద్ధామ! శరణు రామ!
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: శివబ్రహ్మేంద్రాది దేవతల కిరీట మాణిక్యకాంతుల చే నొప్పుచున్న పాదద్వయముతో, జగన్మాత పార్వతీదేవి నిరంతర స్తోత్రముచేయబడిన పాద పద్మములుకలిగి , నివారింపశక్యముగాని కోదండధారివై, పరమేశ్వరుని మానసమును శాశ్వతముగ హరణమొనర్చి,{శంభు మానస హరుడవై} శ్రీ శుభాంగుడవై మనోహరుడై కల్యాణరాముడైన నిన్ను ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {048/102}

అగ్రే ప్రాంజలి మాంజనేయ మనిశం వీరం చ తారాసుతం
పార్శ్వే పఙ్క్తిముఖానుజం పరిసరే సుగ్రీవ మగ్రాసనే,
పశ్చాల్లక్ష్మణ మంతికే జనకజాం మధ్యే స్థితం రాఘవం
చింతాతూలికయా లిఖంతి సుధియశ్చిత్తేషు పీతాంబరం

సీ.
ఎదుట కైమోడ్పుతో ఎదసఖుడు హనుమ
వదలక పదముల వాలికొడుకు

పక్కటనుండగా పౌలస్త్య తమ్ముడు
పరిసరాసనమున పొద్దుగొడుకు

లక్ష్మణుడొకవైపు లక్ష్మియే మరువైపు
లసితవస్త్రుడు నడిమి సలక్షణుగని

మనముల లిఖియించు మధురచిత్రంబును
మది ధ్యానమదియని ముద్రవేయ

తే.
దుఃఖశమనము అంగదు దూరభక్తి
సుఖశరణయుక్తి హనుమంతు సూక్ష్మశక్తి
సఖ్యధర్మసాక్ష్యమెరిగి సాగిలబడ
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము:ఎదుట అంజలి జోడించిన పవనుజుని, పార్శ్వమునందు వీరుడైన అంగదుని, సమీపమందు విభీషణుని, ఎదుటపీఠమందు సుగ్రీవుని, వెనుక లక్ష్మణుని, వామభాగమున భామ సీతాదేవిని, వీరిమధ్యన పీతాంబరధారియగు శ్రీ రాముడు ! ఙ్ఞానులీ ముద్రనెరిగి ధ్యానమను కలముచేత చిత్తమందు వ్రాసికొనుచున్నారు {ఇలా ధ్యానము చేయుచున్నారు } సౌమ్యనామా శ్రీ రామా
రమ్యగుణధామా నన్ను రక్ష్మింపుము }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {049/102}

క్షీరాంభోనిధిమధ్యవర్తిని సితే ద్వీపే సువర్ణాచలే
రత్నోల్లాసితకల్పభూరుహతలే జాంబూనదే మండపే
తేజోభ్రాజితవేదికే సురుచిరే మణిక్యసింహాసనే 
హేమాంభోరుహకర్ణికోపరితలే వీరాసనస్థం భజే

సీ.
పాలసంద్రపునడిమి పరగు వెండిదివిని
పరిఢవిల్లెడు నొక్కపసిడికొండ

పద్మరాగాదులు పూచేటి వనములు
పెద్దచెట్టందున పెరిగియుండ

పారు జంబూనదీ పక్కనే ఒకయిల్లు
పుత్తడివెలుగులపట్టమందు

పద్మరాగాసన పసిడిపద్మమునందు
పుడమియానకయుండు పూర్ణమూర్తి

తే.
పుడమికోర్కెల దీర్చేటి పూర్ణతరువు
పగటివెలుగుల దొలగించు పసిడిమెరుపు
పదము దెలియగ పరమాత్మపథము దెలియ
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: పాలసముద్రము నడుమనున్న శ్వేతద్వీపమందు, కనకాద్రి యందు రత్నములచేత శోభించు కల్పకవృక్షములక్రింద కనకమంటపమందు కాంతులొసగు ప్మషట్పట్పప
గల మనోహరమైన మాణిక్య సిం హాసనమందు బంగారు పద్మమందు వీరాసనయుక్తుడు సుందరాంగుడు, రమణితోడ శోభించుచున్న అట్టి శ్రీ రామ స్వరూపమును ధ్యానించి ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {050/102}

దోర్దండేన చ మండలీకృతమహాకోదండచండాశుగై
ర్నిర్ఘాతై రవికోటితుల్యనిశితైర్బ్రహ్మాదిముఖ్యస్తుతై:,
సుగ్రీవాదిసమస్తవానరవరా నాజ్ఞాపయంతం గిరా
దైత్యాన్ తాడయ తాడయేత్యనుపదం శ్రీ రామచంద్రం భజే

సీ.
రణమేఘములజీల్చి రామకోదండము
రయమున పిడుగుశరఝరులొదల

రవికోటిసముడైన రామచంద్రునికీర్తి
బ్రహ్మాదిఘనులు స్తోత్రముల పొగడ

రవిసుతాదులు వానరులకెల్ల గిరులతో
రాక్షసహరణకై మ్రోతలిడుచు

రక్కసిమూకల రాజసంబునగూల్చు
రణవీరరాముడే రక్షరక్ష!

తే.
రక్షణార్థులు అరులైన రక్షసేయు
రక్షసైన్యము కపులైన రక్షసేయ
రక్షణార్థిగ పదమైతి రామచంద్ర!
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: పిడుగులతో బోలు భీషణ బాణములు రవికోటికాంతులీనుచు బ్రహ్మాదులచే నుతింపబడి, భుజములచేలాగబడి, గుండ్రమైన ధనుర్భాణములచే నొప్పుచు, ఖలులు రాక్షసాళిని మర్దించమని సుగ్రీవాది వానరులనాఙ్ఞాపించు 
శ్రీ రాములను ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {051/102}

భూకంపం జనయ న్నభో విదళయ న్నంభోనిధిం క్షోభయన్
దైతేయాంశ్చ విమర్దయన్ గిరివరాన్ భిందన్ దిశ: పూరయన్
వైదేహీ మతిమోదయన్ సకలగీర్వాణాన్ శిర:కంపయన్
కల్యాణో రఘురామబాణవిలసత్కోదండచండధ్వని:

సీ.
విశ్వకంపనమగు విన్ను బద్దలగును
విషధులు క్షోభించు వైరి జచ్చు

వహ్నిపర్వతములు వట్టిబోవుచు కుంగు
వహ్నిదిక్కుల శూన్యవాసి నిండు

వైదేహిహృద్వీణ వినసొంపుగా మీటు
వేల్పుశిరములెల్ల విడువకూగు

వందితరామ కోదండచండధ్వని
వదలకన్నియుజేసి వసుధనేల

తే.
వ్యాప్తభుజశక్తిసులభుడు వ్యాపకుడని
విశ్వరూపుడు విజితాత్మవిదితహరిని
వేదవేద్యుని భక్తితో వేడుపదము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: శుభప్రదుడగు రఘురామబాణవిలసత్కోదండచండధ్వని
భూకంపమును పుట్టించుచు ఆకాశము బ్రద్దలు చేయుచు,
సముద్రమును క్షోభింపజేయుచు రాక్షసులమర్దించుచు పర్వతములను బ్రద్దలుగొట్టుచు దిక్కులను నిండించుచు సీతను సంతసింపచేయుచు దేవతావళి తలలూచునట్టు చేయుచు వ్యాపించెను శ్రీ రామ భుజ శక్తికి ప్రణమిల్లుచున్నాను నన్ను రక్షించుగాక !}


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 052/102)

విమల కమల నేత్రం విస్ఫురన్నీలగాత్రం
తపన కుల పవిత్రం దానవధ్వాంత మిత్రం
భువన శుభ చరిత్రం భూమిపుత్రీ కళత్రం
దశరథ వరపుత్రం నౌమి రామాఖ్యమిత్రం

సీ.
వికసితసరసిజా విమలపల్లవనేత్ర!
వరనీలోపలవర్ణ గాత్ర!

వెలుగువేలుపువంశ వెలుగైన సుపవిత్ర!
వైరిదానవనిశావిభవ మిత్ర!

విదితాఖిలభువన వేద్యధర్మచరిత్ర!
వసుధాసుతహృదయ వరకళత్ర!

వహ్నిధర్మాచరవరదశరథ పుత్ర!
వరయశోధర నాదు వహ్నిమిత్ర!

తే.
వాయునందన హృదయాబ్జవాస రామ!
విదళనార్థితదానవవైరి రామ!
వేదవేదాంగగురువంద్య వేద్యరామ!
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: సరసిజపత్రనేత్రుడు, నీలమణిశోభితగాత్రుడు, భాస్కరకులసత్పవిత్రుడు, దానవధ్వాంతమిత్రుడు ( రాక్షసులను చీకటికి సూర్యుడు) భువనశుభచరిత్రుడు, ధరణీసుతాకళత్రుడు, దశరథవరపుత్రుడు,
పుణ్యయశుడు, కోదండధారి నాకుమిత్రుడైన శ్రీ రాముని ప్రణమిల్లుచున్నాను}


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 053/102)

జననీ జానకీ సాక్షా జ్జనకో రఘునందన;
లక్ష్మణో మిత్ర మస్మాకం కో విచార: కుతో భయం
జనకో రామచంద్రో మే జననీ జనకాత్మజా
హనుమత్ప్రముఖాస్సర్వే హరయో మమ భాంధవా;

సీ.
మాతజానకి జగన్మాతగ రక్షించి
జగదభిరాముడు జనకుడగుచు

శేషులక్ష్మణమూర్తి సేమపు మిత్రుడై
పరగు మాకేలను బాధ? భయము?

నాతండ్రి రామయ్య నాతల్లి సీతమ్మ
నా తోటిజనులు వానరులు హితులు

బంధనంబులదాట బంధువర్గంబని
బతుకుబాటను సాగ బాధలేవి?

తే.
ఆత్మ రాముడు దెలియంగ అతివ బుద్ధి
భావపదగతి నడిపించు భాష హనుమ
బాధ దాటింప బలమైన భక్తి కపులు
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {054/102}

జగతి విశద మంత్రం జానకీప్రాణమంత్రం
విబుధనుతమంత్రం విశ్వవిఖ్యాతమంత్రం
దశరథసుతమంత్రం దైత్యసంహారమంత్రం 
రఘుపతినిజమంత్రం రామరామేతి మంత్రం

సీ.
విశ్వధర్మములెల్ల విశదంబుగాజెప్పు
వైదేహి ప్రాణమై వినుతికెక్కు

విబుధజనగళము విడవనిదై యొప్పు
విశ్వంబు నొక్కటై వెలుగుజూపు

వరదశరథసూను వరనామమదియని
వధజేయు దైత్యుల వరమదనియు

వహ్నినెవ్వరుయన్న వాసిమోక్షముదక్కు
వరమంత్రపదము శివానిదెలుప

తే.
రామరామేతిమంత్రపు రమ్యతెరిగి
రామ రామ రామయనుచు రాత్రిపగలు
రక్షగోరెడు భజన నారక్షపదము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: రామా రామా మంత్రం ప్రపంచమున నిర్మలమైన మంత్రం .
వైదేహికెప్పుడు ప్రాణమంత్రం. విబుధవరేణ్యుల స్తోత్రమంత్రము.
విశ్వవిఖ్యాతమంత్రము. దశరథసుతమంత్రము. రాక్షససం హారమంత్రము.
జగతీజనుల మోక్షసాధనమైన మంత్రము. రఘుపతీ, దాశరథీ , జానకీశ !
నీ స్వకీయమంత్రము మాకు ముక్తి చేకూరు మంత్రం }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము -055/102

సీతాయా దక్షిణే పార్శ్వే లక్ష్మణస్య చ పార్శ్వత:
తన్మధ్యే రాఘవం వందే ధనుర్బాణధరం హరిం
చంద్రోపమం మలయచందనచర్చితాంగం
మందారపుష్పపరిపూజితపాదపద్మం
బ్రహ్మేంద్రవంద్య మనిశం మునిబృందసేవ్యం 
వందే~ అరవిందనయనం రఘురామచంద్రం

సీ.
సతిసీత కుడివైపు సౌమిత్రి ఎడమను
సరిమధ్య రాముడు సదనుడైన

శరచాపధరహరి శశినిభ శమనుడు
మలయచందనదేహ మోక్షణుడని

పారిజాతార్చిత పాదపద్మంబులే
పరమేష్టి పర్జన్య పూజితమని

మునిబృంద శిరములు మోకరిల్లగజూసి
పద్మాక్షుపదములే పారమంటి

తే.
పవనసూనుడు పదముల పట్టిజూప
పరమపదమను పథమును పట్టు పదము
"పాహిరామ"పదము నిత్యపఠనపదము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: సీతాలక్ష్మణుల మధ్య ధనుర్బాణములనుధరించియున్న విష్ణురూపుడగు రాముని ప్రణమిల్లుచున్నాను. చంద్రునితో తుల్యుడు మలయపర్వతచందనచర్చితాంగుడు, మందారపుష్పసమ్మానిత 
పాదపద్మయుతుడు, నిరంతర సరస్వతీశ్వర దేవేంద్ర మునిజన వందితుడు, అరవిందాక్షుడైన రఘూద్వహుని ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసమ {056/102}

ఇక్ష్వాకునందనం సుగ్రీవపూజితం
త్రైలోక్యరక్షకం సత్యసంధం సదా,
రాఘవం రఘుపతిం రాజీవలోచనం
రామచంద్రం భజే రాఘవేశం భజే !

సీ.
ఇక్ష్వాకునందనా ఇనకులచంద్రమా
ఇనసూను హితపూజితేశ రామ!

ముల్లోకరక్షకా! మూడుకాలంబుల
మడమతిప్పని సత్యమూర్తి రామ!

రఘవంశనరపాల! రాఘవా! రఘుపతే!
రాజీవలోచనా! రామచంద్ర!

రాఘవేంద్రా! రామ! రక్షమాం రక్షమాం
రామభక్తాశ్రయ రక్షధామ!

తే.
"రామ' రాక్షసగుణరజోరసవినాశ!
"రామ" రాజీవహృదయాంతరాళతోష!
"రామ" రాహిత్యమానసారాటపోష!
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: మనువంశాబుధి పూర్ణచంద్రుడు,
సుగ్రీవసమర్చితాంఘ్రికమలుడు, త్రైలోక్యరక్షకుడు, సత్యసంధుడు, సత్యవాక్పాలకుడు, రఘురామస్వామి, కంజాయతనేత్రుడైన రామచంద్రుని, రాఘవుని ప్రణమిల్లుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {057/102}

బ్రహ్మామృతానంద ఫలప్రదాయినం
వేదాంతవిఙ్ఞానసుగంధ పుష్పితం,
సీతాశుభాంగాంచితబాహుశాఖినం
శ్రీ రామకల్పద్రుమ మాశ్రయామ:

సీ.
బ్రహ్మజ్ఞానామృత బ్రహ్మానందఫలము
బ్రహ్మాండమునకిచ్చు బ్రహ్మపదము

వేదాంతసుజ్ఞాన విటపసుగంధంబు
విరితేనెలుగజేయు విష్ణుపదము

వరదేహివైదేహి వరదేహమునుజుట్టు
వృక్షశాఖల బాహువృత్తవరము

శ్రీరామచంద్రు నాశ్రితకల్పతరువని
శరణుగోరితి రామ! శరణమివ్వు

తే.
కామధేనువు "శ్రీరామ" కల్పతరువు
పారిజాతము శ్రీరామ పానసుధయు
మోక్షమంత్రము "శ్రీరామ" మోదపదము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము:అమృతరసము ఊటకారు బ్రహ్మానందమనెడు ఫలప్రదాయి, వేదాంతఙ్ఞానమనెడు సుగంధపుష్పితుడు, భూమిజాత విభుడు,
సీతదేవి శుభమైన దేహమందొప్పుచున్న చేయి అనేడికొమ్మ కలిగిన శ్రీ రామమూర్తి అను కల్పవృక్షమునాశ్రయించుచున్నాను }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {058/102}

కనకనికషభాసా సీతయాలింగితాంగో
నవకువలయదామశ్యామవర్ణాభిరామ:
అభినవ ఇవ విద్యున్నండితో మేఘఖండ
శ్శమయతు మమ తాపం సర్వదా రామచంద్ర:

సీ.
ఒరపుగీటుమెరుపు ఒడిసిపట్టుపసిడి
ఒంటికాంతులసీత ఒడలుగలుప

నల్లకలువదండ నాదను వర్ణంబు
నీలమేఘశ్యామ! నిన్నుజేర

నూత్నవిద్యుత్ఖణి నారదంబునొదిలి
నారాయణాంశయై నెనరుసేయ

ఈతిబాధలనెల్ల ఇక్కట్లకథలెల్ల
ఇలనుండి తొలగించు ఈప్సితపద!

తే.
అమ్మసీతమ్మకౌగిలి అనువుసఖుడు
భక్తహనుమయ్యకౌగిలి భరణహితుడు
కనులగనిపించి కరుణించి కౌగిలిగొన
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము:బంగారపు ఒరపుగీటు కాంతిగల సీతచె కౌగిలింపబడిన దేహము కలిగి, నల్లకలువదండవలె చామనచాయతో మనోహరుడై, క్రొత్తమెఱుపుతోకూడినమేఘపు (ఖండము) ముక్కయైనట్టి రామచంద్రుడు సదా నా సంసారబాధలను శాంతింపచేయుగాక! }

శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {059/102}

అలం శాస్త్రాభ్యాసై రల మసకృదామ్నాయ పఠనై
రలం తీర్థస్నానై రల మఖిలయాగవ్రతజపై:
అలం యోగాభ్యాసై రల మపి మహాపాతకభియా
య దస్మాకం రామస్మరణమహిమా సో విజయతే

సీ.
శాస్త్రపాఠములేల? శబ్దబ్రహ్మములేల?
శ్రుతమోహస్వర శ్రవణమేల?

తీర్థమునకలేల? తిరుగంగ గుడులేల?
యజ్ఞవ్రతజపపు యోచనేల?

యోగపాఠములేల? యమబాధ భయమేల?
యిన్ని మాటలవేల? ఇనకులేశ!

ఒక్కటే మంత్రంబు ఒక్క "రామా" యన్న
నామస్మరణతోటి నాకమందు

తే.
ఎన్ని తిరిగితి ప్రతిచోట ఎదను వదిలి
ఎన్ని పలికితి నోటను ఎరుక మరచి
అన్ని నీవని తెలియంగ ఆత్మపథము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: శాస్త్ర పాఠములేల ? వేదపఠనములేల? విచారమేల?
గంగానదీతీరస్నానములేల ? జప తపములు వ్రతములు సల్పుటేల?
యాగములు ఉపవాసములు తీర్థయాత్ర లేల ? మరణభయమేల ?పాపభీతియునేల ? రామనామస్మరణమాహాత్మ్యము మాకు తెలిసినపుడు వీటివిచారములేల ? }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {060/102}

సీతామనోమానసరాజహంస సంసారసంతాపహర క్షమావాన్,
శ్రీరామదైత్యాంతక శాంతరూప శ్రీతారకబ్రహ్మ నమోనమస్తే.

సీ.
సరసిజేక్షణసతీ సత్యమానససరో
రాజసాన్వితదీప్త రాజహంస

సంసారసాగర సంతాపతారణ
సహనవారధిశిలా శోభితపద!

సురవైరిహరరామ! సుమనశమనసోమ
సుగుణశరణధామ! సుకృతకామ!

సత్య తారక శుభ సచ్చిదార్ణవసోమ!
సన్నుతిగొనుభక్త శరణధామ!

తే.
సత్యధర్మములొదలని సత్యనామ!
సత్యపథమున నడిపించు సత్యధామ!
సత్యమొదలని స్వరమందు సత్యపదము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము:సీతాదేవి చిత్తమనెడు మానససరస్సునకు రాజహంసవైన ఓ శ్రీ రామా ! సంసారబాధలను మానుపు ఓ రామా ! శాంతస్వరూపా రామా ! దైత్యాంతకా ! శ్రీ తారకబ్రహ్మా శ్రీ రామా నమో నమస్తే! }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {061/102}

కదా వా సాకేతే విమల సరయూతీరపులినే
సమాసీన శ్శ్రీమద్రఘుపతిపదాబ్జే హృది భజన్,
అయే రామస్వామిన్ జనకతనయావల్లభ విభో
ప్రసీదేతి క్రోశ న్నిమిషమివ నేష్యామి దివసాన్.

సీ.
సాకేతపురమందు సలిలసరయూతీర
సైకతశ్రేణుల శిఖరమందు

సీతతోకూర్చుండు శ్రీరామచంద్రుని
పాదపద్మంబుల పట్టుకొనుచు

ఎప్పుడుందును రామ? ఎన్నడందును రామ
ఎల్లకాలంబుల ఎరుకనెరిగి

దినములే నిముసమై దిక్కునీవనిజెప్పు
ఎల్లలెరుగని శాంతి ఎదురుజూడ?

తే.
ఎదర నీవని దెలిపేటి ఎరుక దెలిపి
మదిని నీవని దెలియంగ మౌనమిచ్చి
హృదయమంతయు నిండిన హృద్యపదము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: అయోధ్యలో నిర్మలమైన సరయూ తీరమందలి ఇసుక తిన్నెయందు కూర్చుండి శ్రీ రామచంద్రుని పాదపద్మములు సేవించుచు ఓ స్వామీ శ్రీ రామా ! సీతేశా ! నన్ను రక్షించుమని మొరలిడుచు బహుదినములు నిముసమువలె ఎప్పుడు వెళ్ళబుచ్చగలనో ??? }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {062/102}

కదా వా సాకేతే తరుణతులసీకాననతలే
త్య్ర పశ్యన్నవిహతవిశాలోర్ధ్వతిలకం,
అయే సీతానాథ స్మృతజనపతే దానవజయి
స్ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యమి దివసాన్.

సీ.
వరసీమసాకేత వనతులసీలతా
వరణమధ్యమునుండు వేదికందు

విశ్వమంత విశాల విశ్వరూపవదన
విమలకల్యాణ రవితిలకుగని

వరసీతాపతే! వారిజాప్తకులజా!
వైరిదానవహర! వారిజాక్ష!

వర్షంబు నిముసమై వెళ్ళబుచ్చుతునుంటి
వేళమార్చగ రామ! వేగరమ్ము

తే.
ఎదర వనముల పశువుల ఎరుకనగవు
ఎరుక దెలియని శిశువుల ఎదనునగవు
ఎదల ఫణితిగ వినిపించు ఎరుకపదము
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: అయోధ్యలో లేతతులసీ వనమందుండి అవిచ్చిన్నమై విశాలమైన శ్రీ కల్యాణ ముఖమున నిలువు తిలకము కలిగిన రాముని చూచుచు ఓ సీతాపతీ ! విదేహజాధిపతి ! కాకుత్థేశ ! కౌసల్యాపుత్రా !హరీ ! స్మృతజనపతే ! దానవసం హారా ! నన్ను రక్షింపుమని మొరలిడుచు బహుదినములు నిముసమువలె ఎప్పుడు వెళ్ళబుచ్చగలనో ? }


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {063/102}

కదా వా సాకేతే మణిఖచితసింహాసనతలే
సమాసీనం రామం జనకతనయాలింగితతనుం,
అయే సీతారామ తృటితహరధన్విన్ రఘుపతే 
ప్రసీదేతి క్రోశ న్నిమిషమివ నేష్యామి దివసాన్.

సీ.
సాకేతపుర సభాసదనపీఠమునందు
స్వర్ణసింహాసన వాసిబెంచి

సతిసీతనొదలక సఖ్యతజూపించి
శివునివిల్లుందుంచి సీతగెలుచు

రామచంద్రా! నన్ను రక్షింపుమని వేడు
దినములే నిముసమై దిక్కుదెలుప

ఎన్నినాళ్ళీగతి? ఎటులజేరను రామ?
ఎరుకనేర్పుము మదినేలికగుచు

తే.
ఎవరు నీవని అడుగుటే ఎచ్చుకోలు
ఎచట నీవని తిరుగుటే ఎడదనెగులు
ఎరుక నీవని తెలిపేటి ఏలికనిన
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: సాకేత సభాంతరస్థలి మణిఖచిత సింహాసనమందు కూర్చున్న శ్రీ రాముని, భూతనయాలింగితుడైన దేహముకలవానిని, ఓ సీతా రామా ! శివచాపఖండనా ! ధరాపుత్రీపతీ ! రఘుపతీ !నన్ను రక్షింపుమని మొరలిడుచు బహుదినములు నిముసమువలె ఎప్పుడు వెళ్ళబుచ్చగలనో ?}


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము {064/102}

మార్గేమార్గే శాఖినాం రత్న వేదీ
వేద్యాం వేద్యాం కిన్నరీబృందగీతం,
గీతే గీతే మంజులాలాపగోష్ఠీ
గోష్ఠ్యాం గోష్ఠ్యాం త్వత్కథా రామచంద్ర.

సీ.
బాటబాటలవెంట బాహువులను చెట్లు
విటపిమూలము రత్నవేదికైన

వాసివేదికలందు వాద్యబృందకృతులు
వినెడికృతులసాగు వెలపుగోష్ఠి

వెలపుగోష్ఠివెలుగు వేల్పురాముని కథ
కథను కథను రామకరుణ దెలుప

తెలిసితెలియజెప్పు తెలివి అమృతమైన
తెలియనివి తెలుపు తెరగు రామ!

తే.
అధరమధురత అనవరతార్థమెరిగి
పదముపదమున పావనపదము పలుక
మరలిమరలి మదిమురళి మరులుగొనెడు
రామ రామ రామమయము రామపథము!

{ముఖ్యార్థము: సాకేతపురీ ప్రతి మార్గమందు ప్రతి తరువుక్రింద రత్నవేదికలు, ప్రతి వేదికయందు కిన్నరీ బృందగీతం, ప్రతిగీతమందు మృదువైన మధురగోష్టి ప్రతిగోష్ఠియందు శ్రీరామ ! నీ కథగలదు. అమృతధారగ్రోలు భక్తులకుమృతిలేదు.నీకథామృతము నాకిమ్మని ప్రణమిల్లుచున్నాను}


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము 065/102)

వృక్షేవృక్షే వీక్షితా: పక్షిసంఘా:సంఘేసంఘే మంజులామోదవాక్యం
వాక్యేవాక్యే మంజులాలాపగోష్ఠీ గోష్ఠ్యాగోష్ఠ్యాం తత్కథా రామచంద్ర

సీ.
చెట్టుచెట్టునజూడ చివురుకొమ్మలమీద
చేరిజుచెడి రామచిలుకగుంపు

గుంపుగుంపునమాట గుండెలింపగుపాట
తేనెలూరెడి రామ తీపిపాట

పాటపాటలనుండు పావనభావంబు
భావచర్చల రామభాగవతులు

భాగవతకథనంత భగవంతుడిలజూప
పక్షికీర్తన నాదు పదము రామ!

తే.
స్వరము అస్వరమున అనశ్వరము "రామ"
ప్రకృతి ఆకృతిగొనిజేయు ప్రణుతి "రామ"
భావరాగార్చకాభూష భాష "రామ"
రామ రామ రామమయము రామపథము!

(ముఖ్యార్థము: శ్రీ రామా !!!సాకేత పురీ మార్గమందు ప్రతి వృక్షమందు పక్షి సమూహాలు గాన వచ్చును.ప్రతి పక్షి సమూహమందు గాన మాధుర్య సంతోష వాక్యము గలదు.ప్రతి వాక్యమందు మృదువైన ప్రసంగము గలదు. ప్రతి ప్రసంగమునందు కర్ణపర్వమైన నీ కథా సుధ గలదు.)


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - 076/102

లోకత్రాణానుకారీ దశవదన శిర:పజ్త్కి విఛ్ఛేద కారీ
లంకా లంకారహారీ భృగుతనయ మనస్సర్వ గర్వాప హారీ
సీతా సీమంత కారీ మణిమయ మకుటో దివ్యకొదండ ధారీ
శ్రీ రామ: పాప హరీ శమయతు దురితం భూమి భారాప హారీ

{ముఖ్యార్థము: లోకసంరక్షణము చేసి, రావణ దశశిరస్సులను తెగటార్చి, లంకాపట్టణశోభను హరించి, పరశురామ మనో గర్వమడచి , సీతాదేవి పాపటను దిద్ది ( అలంకారమొక యోగ విలాసము) మాణిక్య కిరీటంధరించి, దివ్యకోదండధారి, సర్వ పాపహారియై, భూభారం తగ్గించి మాదురితములన్ని పోగొట్టుచున్న శ్ర్రీ రామచంద్రునకు ప్రణమిల్లుచున్నాను}

సీ.
భువనరక్షణమెల్ల భుజధర్మముగజూపి
రావణు తలదొంతి రూపుమాపి

లంకరక్కసి జంపి లంకకు తలదీసి
ఖండపరుశు గండు దండిగణచి

సతిసీత నుదుటను సీమంత బొట్టెట్టు
మణిమయాలంకృత మకుటధారి

కోదండధనుధారి కుటిలాత్మసంహారి
పాపపంకిలహర పాదధారి!

తే.
అమరవందిత శరధారి! అసురవైరి 
అఖిలమునిజన అమలాత్మ అధరవారి
అధరమధువన "శ్రీరామ" అమృతమయము
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసమ 101/102

“రా” శబ్దోచ్చారమాత్రేణ ముఖాన్నిర్యాంతి పాతకా:
పున:ప్రవేశభీత్యా చ “మ” కారస్తు కవాటవత్

{"రా" అను శబ్దము ఉచ్చరణ చే పాపాలన్నీ నోటినుండి వెడలిపోవును. ఆ పాపాలన్నీ మరల ప్రవేశించు నను భయముచే "మ" కారము తలుపువలె అడ్డును "}

సీ.
"రా" యను శబ్దమే రాజీవపుణ్యంబు
మహనీయమదియేను మానసంబు

రాముయనుచు పాపరాక్షసంబెల్లను
మారాడక విడును మోముదరిని

రావచ్చు మరియను రాక్షసభయమెల్ల
"మ"యనుచు బలుకంగ మరలిరాని

రాజమార్గద్వారరాహిత్యపథముగా
మా రాముడాపునే మనమునిండి

తే.
రామపదముల బట్టుటే రామరక్ష
రామ పదమును బలుకుటే రామరక్ష
రామ రామరామేతియే రాత్రహరము
రామ రామ రామమయము రామపథము!


శ్రీ ఆదిశంకర భగవత్పాద విరచిత శ్రీ రామ కర్ణామృతం -ప్రథమాశ్వాసము - 102/102

శ్రీ రామాయణ మాది కావ్యమృషిణా వాల్మీకినా నిర్మితం
వేదాంతార్థ విశారదై రనుదినం స్త్యుత్యం సురైరర్చితం
శ్రోతౄణామఘనాశనం సురతరో స్తుల్యం తు ముక్తి ప్రదం
యే శృణ్వంతి పఠంతి రామచరితం తే యాంతి విష్ణో:పదం

సీ.
బుషియైన వాల్మీకి ఋక్కులంగలబోసి
రామాయణంబుగా వ్రాయనదయు

వేదాంతపరమార్థవిషయసారధనుల
కనుదినస్తోత్రంబు అమరనుతము

శ్రవణమాత్రంబునే శమలనాశముజేయు
మందారతరుసమ ముక్తిపథము

వినినంత యనినంత విష్ణుసాయుజ్యంబు
విధిగను బొందరే విమలజనులు

తే.
రామచరితంబు వినినంత రమము జెవుల
రామచరితంబు ననినంత రమము జిహ్వ
రామచరితంబు దెలియుటే రమము శమము
రామ రామ రామమయము రామపథము!

{"వాల్మీకి మహర్షి ప్రణీతమై, వేదాంతార్థ విశారదుల నిత్య ప్రార్థనా స్తోత్రప్రాయమై, దేవతలచే అర్చించబడి, విన్నవారి పాపప్రక్షాళనచేసి,కల్పవృక్షమై, మోక్షప్రదాయిని,రామ చరిత్రమైన రామాయణమను ఆది కావ్యమును ఏవరు వినుచున్నారో వారు విష్ణుసాయుజ్యమును పొందుచున్నారు "}

శ్రీ రామాయణ శ్రవణ ఫల సారాంశం శ్రీ ఆది శంకరులు అనుగ్రహించిన శ్లోకం -శ్రీ రామ కర్ణామృతం ప్రథమాశ్వాశం సంపూర్ణం- సర్వం శ్రీ సీతా రామచంద్ర పరబ్రంహార్పణమస్తు
--((**))--

Monday, 25 February 2019

💐మారుతీ శతకము ***





💐మారుతీ శతకము💐 తేదీ:16-12-2019సం.
ఈ శతక కర్త పేరు గోపీనాథము వేంకటకవి. వీరునెల్లూరు జిల్లా, కావలి తాలూకాలోని లక్ష్మీపురాగ్రహార వాస్తవ్యులు. సాహిత్య పరిశోధకుల అభిప్రాయాన్నిబట్టి వీరు క్రీ.శ.1813
సం. శ్రీముఖ సంవత్సరమున జన్మించినట్లు తెలుస్తున్నది. వీరు తమ పదహారవ యేట వేదాద్రినరసింహస్వామిఉత్స వాలకు వెళ్ళగా అచ్చట ఒక మహాయోగి మంత్రోపదేశం
వలన వీరికి అనర్గళ కవితాధార యలవడినట్లుగా వీరి గ్రంధములవలన తెలుస్తున్నది. వీరు తన విద్వత్కవితా ప్రతిభ చేత వేంకటగిరి సంస్థానాధిపతులను మెప్పించి వారి ఆస్థానకవిగా నియమితులైనారు. వీరు రామభక్తులు. మారుతీ శతకము వీరి తొలి కృతి. దీనిని తమ పదహారవ
యేట రచించినారట. ఆతరువాత తన ఇరవయ్యవయేట శ్రీరామాయణ రచన ప్రారంభించి అయిదేండ్లకు ముగించి నారు. ఆ రామాయణమే గోపీనాథ రామాయణంగా ప్రసిద్ధి
కెక్కినది. తదనంతర కాలంలో వీరు చెసిన ఇతర రచనలు శ్రీకృష్ణజన్మఖండము, భగవద్గీతా శాస్త్రము,శ్రీరామస్తవము, బ్రహ్మానంద శతకము, శిశుపాలవధము(మాఘకావ్యము),
శ్రీరాధికాపరిణయము, తిరునాళదండకము మొllవి.

శార్దూల మత్తేభ ఛందస్సులలో వ్రాయబడిన'మారుతి శతకము'లో 116 పద్యాలు వున్నాయి. ఈ పద్యాలలో ఆంజనేయస్వామివారి చరిత్ర,పుట్టుక మొదలుకొనిస్వామి ని గూర్చిన విశేషాలు, స్వామి చేసిన మహత్కార్యాలు రస రమ్యంగా వర్ణింపబడినాయి. రోజుకు కొన్ని పద్యాలను
తాత్పర్య సహితంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేయ దలచాను. భక్తులు, మిత్రులు, సాహిత్యాభిమానులు చదువుదురుగాక!
శతకం చివరిపద్యంలోకవిచెప్పుకున్న దాన్ని బట్టి కవి గారి
తండ్రి పేరు పద్మనాభ శాస్త్రి గారని తెలుస్తున్నది.

ఇంక మారుతీ శతకంలోనికి ప్రవేసిద్దాము.

1)శా. శ్రీమద్రామ పదారవిందయుగళిన్‌ సేవించి, యస్మద్గురు,
స్వామిన్‌ వేడ్క భజించి, సత్కవి నమస్కారంబుఁ గావించి, వా,
గ్భూమప్రౌఢిమ నీకు నొక్క శతకంబున్‌ భక్తి నర్పించెదన్‌,
నా మీదం గృపజేసి కైకొను మమంద ప్రీతి తో మారుతీ!

తాll సీతారామచంద్రమూర్తి యొక్క పద్మములవంటి పాద ద్వయమును భక్తితో పూజించి, వేదాద్రి క్షేత్రములో మంత్రో పదేశముతో నన్ను అనుగ్రహించిన యోగిపుం గవుడైన నా గురుదేవుని సంతోషముతో స్మరించి, నాకు పూర్వులూ సమకాలికులూ అయిన సత్కపు లందరకూ నమస్కరించి, నాకు దైవదత్తముగా లభించినపాండిత్య ప్రతిభా పాటవములతో , ఓమారుతీ (ఆంజనేయ స్వా మీ!) నీ ప్రతిభావిశేషాలను వర్ణిస్తూ స్తుతిస్తూ నీ గూర్చి ఒక పద్య శతకాన్ని రచించి నీకు సభక్తికంగా సమర్పించ దలచాను.నాయందు దయయుంచి నాయీ కృతినిప్రేమ పూర్వకంగా స్వీకరించి నన్ను కృతార్థుని చేయి స్వామీ!.

2)మ. అనఘా! నీవు జనించి నప్పుడె సముద్యద్భూరి తేజంబునన్‌, 
వినువీథిం గనుపట్టుబాలరవిసద్బింబంబు నీక్షించి, యె, 
ఱ్ఱని పండంచు గ్రసింప బత్రిపతిలీలన్‌ వేడ్క మున్నూరు యో,
జనముల్‌ మింటికి దాటితౌఁ ద్రిభువనశ్లాఘ్యుండవై మారుతీ!

తాత్పర్యం:- ఓ ఆంజనేయ స్వామీ! నీవు అంజనాదేవీ గర్భాన జన్మించిన తొలిరోజులలోనే, ఆకాశంలో గొప్ప తేజస్సుతో ప్రకాశించే బాల సూర్యణ్ణి చూసి, ఎర్రని పండనుకున్నావు. దాన్ని పట్టుకొని తినాలనే ఆసక్తితో గరుత్వంతుని (పత్రిపతి)వలె అత్యంత వేగవంతుడవై,
భూమి నుండి మూడువందల యోజనాల దూరం ఎగురుతూ వెళ్ళావు ( ఆ సందర్భంలో ప్రమాదాన్ని పసిగట్టిన దేవేంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టగా స్వామి దవడలు దెబ్బతిన్నాయి). శౌశవంలోనే ఇంతటి అనితర సాధ్యమైన ప్రయత్నం చేసి, ముల్లోకాలలో
వుండే వారితో స్తుతింపబడినావు.
ఇంకావున్నాయి.,

 3)మll నిజగర్భస్థితశైవతేజము, సమున్నిద్రాత్మతేజంబుఁ గూ, 
డ జగత్ప్రాణుఁ డమోఘ కేసరివనాట క్షేత్రమందర్థి నిం, చ, 
జయశ్రీ మహిమాప్తి నయ్యుభయతేజంబుల్‌ రహిన్‌ మిశ్రమై,
త్రిజగంబుల్‌ గొనియాడ బుట్టితివి గాదే నీవిలన్‌ మారుతీ!

తాత్పర్యం:- జగత్ప్రాణుడైన వాయుదేవుడు, అగ్నిదేవుని ద్వారా తనకందజేయబడిన శివతేజాన్ని, తన స్వతేజం తో మిళితం జేసి, వనంలో తపస్సుచేస్తున్న కేసరి అను
వానరుని భార్య దోసిటలో పడవేయగా ఆమె దాన్ని ఫల మని భావించి దైవప్రసాదంగా తలంచి భుజించినది. శివ వాయువుల ఉభయ తేజముల మహిమ వలన గర్భందాల్చిన అంజనాదేవికి, ముల్లోకాలలో కొనియాడబడెడి విశిష్ట వ్యక్తిగా జన్మించితివి గదా స్వామీ!
వైశాఖ మాసం కృష్ణ పక్షం లో దశమి నాడుశనివారం పూర్వా భాద్ర నక్షత్రం లో వైద్రుతీ యోగం లో మధ్యాహ్న సమయం లో ,కర్కాటక లగ్నం లో అంజనా దేవికి ఆంజనే యుడు జన్మించాడు. బంగారు రంగు, పింగళ వర్ణం గలనేత్రాలు, స్వర్ణ హారం, బంగారు యజ్ఞోపవీతం, మణుల
నూపురాలతో, ధ్వజము, వజ్రాయుధం, అంకుశం, గొడుగు, పద్మం అనే శుభ చిహ్నాలు పాదాలలో వున్నవాడు , పొడవైన తోక గల వాడు, వజ్ర దేహంతో ప్రకాశించే వాడు పెద్ద
దవడలు కలవాడు, కటి సూత్రం కౌపెనం (గోచి) తో వున్న గొప్ప బాహువులతో విరాజిల్లు తున్న కపిరూపం లో ఆంజనేయ బాలుడు విరాజిల్లాడు. దేవతలు పుష్ప వర్షం కురిపించారు. అంజనకు పుట్టిన వాడు కనుక ఆంజనేయుడు పేరు .కేసరి కుమారుడు కనుక కేసరినందనుడు.
వాయువు వర ప్రసాదం తో పుట్టాడు కనుక వాయునందనుడు, అనిల సుతుడు అయ్యాడు..అగ్ని తేజం కూడావుండటం తో అగ్ని సంభవుడని, శివ పార్వతుల తేజస్సుకల్గివుండటం తో పార్వతీ నందనుడనీ, శంకర సుతుడనిపిలువ బడు తున్నాడు. సకల దేవతలతేజస్సుతోజన్మించి
నందున సర్వ దేవాత్మకుడు అన్నారు .

”ఆన్జనేయః పూజితేస్చేత్ –పూజిత సర్వ దేవతాః
”అందుకే ఆన్జనేయుడిని పూజిస్తేసకల దేవతలను పూజించినట్లే నని బ్రహ్మ దేవుడు చెప్పాడు .

4)మllఅనిమేషేభము తెల్లపండనుచుబాల్యక్రీడలన్‌మ్రింగనొ,
య్యన డాయం బవిచే బలారి నినుమూర్ఛాక్రాంతునిం జేయ బూ,
ర్వనగాధిత్యక మీఁద వామహనువున్‌ భగ్నంబుగా వ్రాలినన్‌,
హనుమంతుండను పేరు నాడమరె నీకన్వర్థమై మారుతీ!

తాత్పర్యం:- ఓ స్వామీ! నీవు చిన్నపిల్లవానిగావున్నప్పుడొకసారి ఆటగోలుగా, ఆకాశంలో తూర్పు దిక్కునఉదయ సూర్యుని చూచి, ఆతనిని ఒక తెల్లని పండుగా భావించి,మ్రింగాలనే తలంపుతో ఆకాశంలోకి ఎగిరిపోతూసూర్యనిసమీపించ బోయావు. అప్పుడు ప్రమాదాన్ని పసిగట్టిన
దేవేంద్రుడు తన వజ్రాయుధంచే ఎదురుపడి కొట్టగా,ఎడమ దౌడ భగ్నమై నీవు స్పృహ కోల్పోయి ఉదయాద్రిశిఖరతలాన పడిపోయినావు. అప్పటి నుండి నీ యొక్క
'హనువు' అనగా 'దౌడ' కొట్టవచ్చినట్లు కనిపించుచుడటంవలన నీవు హనుమంతుడనే పేరుగలవాడివయ్యావు.ఇంకావున్నాయి.,

5)మll అపుడా గంధవహుండు నీదయిన మూర్ఛావస్ థ వీక్షించి,
తా,గుపితుండై నిజమూర్తి వైభవము సంకోచిం పఁగాఁ జేయ న,
చ్చపు గూర్మిన్‌ నిఖిలాస్త్రశస్త్రముల బంచత్వంబు లేకుండ స,
త్కృపతో నీకు వరంబులిచ్చిరి గదా బృందారకుల్‌ మారుతీ!

తాత్పర్యం:- గత పద్య భావానకి కొనసాగింపుగా..
ఓ మారుతీ ! ఇంద్రుని వజ్రాయుధ ఘాతంతో దెబ్బతిన్న దవడ గలవాడై ఉదయాద్రి శిఖర తలాన నీవు మూర్ఛితుడవై పడిపోగా, అప్పుడది చూసిన, నీతండ్రియగు వాయు
దేవుడు (గంధవహుండు) కోపించన వాడై తాను వీచుటమాని స్థబించి పోయాడు. (వాయువు వీచనిదే జీవులప్రాణాలు నిల్వవు, క్షణంలోలోకాలుకల్లోలమైపోగా)బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై వాయుదేవుని శాంతపరచారు, నిజమైన ప్రేమతో కృపాళువులై ఏవిధమైన అస్త్రములతోగానీ,
శస్త్రములతో గానీ నీకు హాని (లేదా మరణము) సంభవింపదని వరములు ఇచ్చారు కదా స్వామీ!

6)మll ఒక పాదంబు మహోదయాచలముపై నొప్పారఁగా నుంచి వే,
ఱొక పాదం బపరాద్రి మీఁద నిడి యయ్యుష్ణాంశుచే బల్విడిన్‌,
సకలామ్నాయము లభ్యసించిన భవచ్చా తుర్య మేమందు దా,
పక దివ్యోరుతర ప్రభావము నుతింపన్‌ శక్యమే? మారుతీ!

తాత్పర్యం:- ఓ మారుతీ! బాల్యములో నీవు ఒక పాదాన్ని నూర్యోదయం అయ్యే ఉదయగిరిపైననూ, వేరొక పాదాన్ని సూర్యుడు హస్తమించే పశ్చిమగిరిపైననూవుంచి‌,సూర్యుని
ద్వారా సకల వేదవేదాంగములను నేర్చుకొనుటలో నీవు చూపిన ఓర్పూనేర్పలను గూర్చి ఏమని చెప్పగలము.దివ్య మైన అనితరసాధ్యమైన గొప్పదైన నీ ప్రతిభాపాటవము లను ఉన్నవి వున్నట్లుగా ప్రస్తుతించి చెప్పటం ఎవరికైనా సాధ్యమౌతుందా? అంటే సాధ్యముకాదని భావము.
ఇంకావున్నాయి.,

7)మల్ బలవంతుండగువాలి ప్రోలు వెడలింపం,
బత్నిఁగోల్పోయిమి క్కిలి దుఃఖంబున ఘోరకాననములం గ్రీడించి వర్తించు నా,
జలజాప్తాత్మజు నొజ్జ పట్టి యని యశ్రాంతంబుఁ జేపట్టి యా
బలభిత్సూతికిఁ జిక్కకుండ ననుకంపం బ్రోవవే మారుతీ!

తాత్పర్యం:- ఓ మారుతీ! ఇంద్రుని అంశతో జన్మించినవాడు మరియు మహాబలవంతుడగు వాలి ( వానరరాజ్యమైనకిష్కిధాధిపతి) చేత కిష్కింధాపురము నుండి వెళ్ళగొట్టబడిన వాడగు సుగ్రీవుడు, తన భార్యను కోల్పోయి, తీరనిదుఃఖంతో కీకారణ్యములలో తిరుచున్నప్పుడు, అతడు నీగురువగు సూర్యదేవుని పుత్రుడగట వలన ఆతనిపై ప్రేమా భిమానాలూ చూపూతూ, అతణ్ణి ఎల్లప్పుడూ అంటిపెట్టుకొని వుంటూ వాలికిచిక్కకుండాకాపాడితివికదా,స్వామీ!

8)మllతనపత్నిం దిలకింపుచున్‌ నిబిడకాంతారోర్వివర్తించు రా,
మ నరేంద్రోత్తము పాలి కర్కజుఁడు పంపం భిక్షువే షంబునన్‌,జని,
సుగ్రీవుని చందముం దెలిపి యాక్ష్మానాథుదోడ్తెచ్చి, మె,
ల్లన నయ్యిద్దఱకుం ధనంజయుని మ్రోలన్‌ సఖ్యసంబంధమున్‌ ,
వినయం బొప్ప ఘటింపఁ జేసినది నీవే కాదొకో మారుతీ!

తాత్పర్యం:- ఓ మారుతీ! అపహరణకు లోనైన తనభార్య ను వెదకుచూ దట్టమైన అడవులలో తిరుగుచూ (ఋష్య మూక పర్వత సమీపానికి) వచ్చిన, శ్రీరామ రాజేంద్రుని కడకు, సుగ్రీవుడు పంపగా బిక్షకుని వేషంలో వెళ్ళి, (చక్క గా సంభాషించి, శ్రీరాముని మొప్పుబొంది) సుగ్రీవుని దుర వస్థను వివరించి, (శ్రీ రామ లక్ష్మణులను నీ రెండు భుజముల మీద ఎక్కించుకొని, కొండ మీద భయకంపితుడై కలవర పడుతున్న) సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళ్ళి, శ్రీరామ సుగ్రీవులకు అగ్నిసాక్షిగా మైత్రీబంధాన్ని కుదిర్చిన వినయశీలుడవు నీవే కదా స్వామీ!

మారుతి! రామనామమున మగ్నుడ! సేవకుడై నిరంతరం
శ్రీరఘురామ దూతవయి సీతను గాంచి పురంబు గాల్చుచున్
పోరున లక్ష్మణుండు పడ పర్వతమున్ గొని తెచ్చి కాచుచున్
కోరిక దీర్చు దేవ! నను గావుము, నిత్యము వందనంబిదే.



Wednesday, 14 June 2017


                             ఓం శ్రీ  రాం  ఓం శ్రీ  రాం  ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                                  శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
                         ప్రాంజలి - సుందరాకాండ తెలుగు వచస్సు (12వ సర్గ)

అంత: పురమంతా అంగుళం కూడా వదలకుండా వెతికేను, రావణుని భార్యలందరినీ పరిసీలించి మరీ చూసేను, నేను చేసిన శ్రమ అంతా నిష్పరోయోజన మయ్యేను, సీత ఉన్న ప్రాంతము ఎక్కడ  ani  తెలుసు కోలేక పోయెను.

హనుమంతుడు లతాగృహములను, చిత్రగ్రుహములను వెతికేను, ఏంతో అందమైన, పతివ్రతా ఐన, సీత  కాన రాకుండేను, రఘునందనుని భార్య సిత కనబడకపోవుటవల్లెఈవిధముగాతల  పోసేను,  
ఎంత వెతికినను కానరాక పోతే సీత మరణించి ఉండ వచ్చునని అను కొనెను .

సీల రక్షణతో ఉన్న సీత, లొంగక పొతే రాక్షస రాజు చంపి యుండ వచ్చును, విక్రుతాకర  కారాముగల రాక్షసులు వేధింపులకు తట్టుకోలేక మరణించ వచ్చును, రావణుని భార్యల వత్తిడులను తట్టుకోలేక, అధారము లేక మరణించ వచ్చును, పుణ్యమైనా ధర్మ మార్గమున ఎక్కడైనా గుప్త ప్రదేశములో ఉండి యుండ వచ్చును.                  

సీత జాడ తెలియకుండా నేను సుగ్రీవునివద్దకు వెళ్ళనే వెళ్ళను, సుగ్రీవుడు ఆజ్ఞను పాటించని వారిని తీవ్రముగా దండిన్చును, సుగ్రీవునకు సీత కాన రాలేదు అన్న నన్ను శిక్షిమ్చును, వానారులందరికి సీత కనబడలేదని చెప్పిన లాభము లేకుండును. 

ఉత్తరతీరమునందు ఉన్న వానరులకు నేను ఏమి చెప్పవలెను, వానరుల అడిగే ప్రశ్నలకు ఏమి సమాధానము ఇవ్వ వలెను, లంకలో ఎమిచేసితివి, ఏమి చూసితివి, అన్న ఏమి చెప్పవలెను
నేను అక్కడకు వెళ్ళకుండా ఇక్కడే ప్రాయోపవేశము చేసెదను.

వృద్దుడగు జాంబవంతుడు అడిగిన ఏమి చెప్పవలెను, అంగదునకు, వానరులందరికి ఏమి చెప్పి నమ్మిమ్చగలను, నేను (అనిర్వేదము)దిగులు చెందక  పట్టుదలతో మరల వెతికేదను, అనిర్వేదము మానవులకు సర్వకార్యములందు ప్రవర్తిమ్పచేయు చుండెను.

అనిర్వేదము మానవులకు తలపెట్టిన పని సఫలమగునట్లు చేయును, అందుకే ఇంకా నేను వేతకని ప్రాంతములన్ని వెతికెదను, పానశాలలు, పుస్పగ్రుహములు, క్రీడాగ్రుహములను వేదికేదను, ఉద్యాన వీధులను, వెతుకుచూ మరల అన్వేషణ ప్రారంభిమ్చేను.

భూమి లోపల గృహములను, భూమి పైన ఉన్న గృహములను, ఇంటిపైకి ఎక్కియును, క్రిందకు దూకియును, వెతక సాగెను, ఒకచోట నిలబడి, మరల కదిలి, నడుస్తూ, పరిగెడుతూవెల్లసాగెను
హనుమంతుడు అక్కడ ఉన్న ప్రదేశ మంతయు వెతికేను. 

ప్రాకారములు ఉన్న వీధులలో తలుపులు తెరచి వెతికేను, కొన్ని గృహముల తలుపులు త్రొయుచూ వెతికేను, దిగుడుబవులను, సరస్సులను వెతికేను, హనుమంతుడు వెదకని ప్రదేశము లేకుండా వెదికేను.

వికృతాకార రాక్షస స్త్రీలను చూసెను, సౌందర్యములో సాటిలేని స్త్రీలను చూసెను, అందమైన పిరుదులు కలిగినవారిని చూసెను, హనుమంతునకు ఎంత వెతికినను  సీత కానరాకుండెను. 

రాక్షస రాజు బలాత్కారముగా తెచ్చిన నాగ కన్యలను చూసెను, సీత గురించు ఆలోచిస్తూ హనుమంతుడు నిరుస్చాహ పడెను, తాను చేసిన సముద్ర లంఘనము వ్యర్ధమైనదని భావించెను,
దు:ఖముచేత ఏమిచేయవలెనో అని ఆలోచనలో ఉండి పోయెను.

     శ్రీ  సుందరా కాండ మునందు  12వ సర్గము సమాప్తము

Tuesday, 6 June 2017


ఓం శ్రీ  రాం -  శ్రీ మాత్రే నమ: -  శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
 ప్రాంజలి - సర్వేజనా సుఖినోభవంతు
ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:
సుందరకాండ 5వ సర్గ

హనుమంతుడు లంకానగరములో ప్రవేశించాడు, అక్కడ రాత్రి పేజీలుగా కనిపిస్తున్నది, ఎందుకనగా ఆకాశములో చీకటి రాత్రులందు తారాగతుల మద్య చంద్రుడు ప్రకాసించు  చుండెను. నక్షత్ర వెలుగులు విరజిమ్ము చుండెను. పృద్విమీద వెన్నెల అనే చాందిని కుడ్డ పరిచినట్లు చంద్రుడు వెలుగుచుండెను.తెల్లటి గోవుల మధ్య  గోసాలలో విహరించి మత్త వృషభము వలే చంద్రుడు ఉండెను.  హనుమంతునకు ప్రతి అంగుళము కనబడునట్లు వెన్నెలను కురిపిస్తున్నాడు చంద్రుడు.
వెన్నెలలో లంకలో  ఉన్న గృహాలను చూస్తూ ముందుకు నడుస్తున్నాడు హనుమంతుడు.

చంద్రుడు లోకములోని పాపాలను (చీకట్లో చేసేవి)  నాశనము  చుండెను, నదులు కలవటం వళ్ళ
చంద్రుడు మహాసముద్రమును ఉప్పొంగునట్లు చేయుచుండెను, ప్రకృతిలో ప్రశాంత వాతావరణము కల్పించి,  చంద్రుడు సకల భూతములను ప్రకాశింప చేయుచున్నాడు 

చంద్రుడు భూమిపై ప్రభాత సమయమున మందర పర్వతము నందును, చంద్రుడు ప్రదోష కాలమున మహా సాగరము నందును, చంద్రుడు పగటి వేలల యందు పద్మము లందును
చంద్రుడు సుందరమైన నిశాకరుని యందు  వెలుగు చుండెను.

చంద్రుడు నింగిలో వెలుగు చుండగా శ్రీ  రామచంద్రుని ఒక్కసారి మనసులో తలచుకొని  హనుమంతుడు నెమ్మదిగా నడక సాగెను. 

చంద్రుడు వెండి పంజరములో ఉన్న హంస వలెను, మందార చలముయోక్క గుహనందుఉన్న సింహము వలెను, చంద్రుడు మహా గజము పై అధిరోహించిన వీరునుని వలెను, చంద్రుడు ఆకాశగతుదై అద్భుతముగా ప్రకాశించు చుండెను. 

తీక్షనమైన కొమ్ములు గల ఆంబోతు వలెను, ఉన్నత శిఖరములుగల హిమపర్వతము వలెను,
బంగారు తొడుగు దంతములుగల గజము వలెను,చంద్రుడు పున్నమి వెన్నెలను ఎప్పుడు ప్రకాశిమ్చు చుండెను.

చంద్రుడు శిలాతలముపై పరుండిన సింహము వలెను, చంద్రుడు మహారణమునకు వచ్చిన మత్త గజము వలెను, చంద్రుడు రాజ్యాభిషేకమునకు వచ్చిన మహారాజు వలెను,  చంద్రుడు వెలుగును పంచుటను హనుమంతుడు చూచెను

చంద్రుని మీద ఉన్న మంచు తుప్పరులు తొలగి పోయెను, చంద్రునిలో ఉన్న నిశ్చలమైన ప్రకాశలక్ష్మికి ఆశ్రయ మయ్యెను, మాలిన్యమంతా పోయి చెవుల పిల్లివలె కనబడు చుండెను,
చంద్రబింబము హనుమంతునకు మరియు లంక అంతా వెలుగును విరజిమ్మెను.

వెన్నెలచే నష్టమైన తిమిర దోషము కలదియును, రాక్షసులు మాంసాహారరూపమైన దోషము కలదియును, స్త్రీల హృదయములందు ప్రేరితమైన కామదోషము కలదియును, స్వర్గ ప్రకశమై వెలుగుచున్న చంద్రుడను హనుమంతుడు చూచెను.

కర్ణ సుఖములు కల్గించు వీణానాదములు వినబడు చుండెను, సచ్చరిత్రగల స్త్రీలు పతులతో నిద్రించు చుండెను, రౌద్రాకారులగు రాక్షసలు విహారము చేయు చుండెను, హనుమంతుడు  వింతవేషాలతో ఉన్న రాక్షసులను చూచెను.

కొందరు రాక్షసులు ఛాతిలతో ' డి ' కొట్టు కొను చుండెను, కొందరు రాక్షసులు ఇష్టమైన కాంతలను ఆట పట్టించు చుండెను, కొందరు రాక్షసులు ద్రుడమైన  ధనస్సులను లాగు చుండెను, కొందరు రాక్షసులు చిత్ర, విచిత్ర మైన  వేషములు వేయు చుడెను.

రాక్షస స్త్రీలు పరస్పరము ఒకరి కొకరు ఆక్షేపించు కొనుచుండెను, తమ బలసిన భుజాలు పట్టుకొని ఒకరికొకరు ఊపుకొను చుండెను, రాక్ష స్త్రీలు పానమత్తుచే పరాకగా ఒకరికొకరు మాట్లాడు చుండెను, కొందరు మత్తుచే భీకరంగా అరుస్తూ భాణాలను సంధించు చుండెను.

కొందరు స్త్రీలు చందన లేపములు పూసికొని ఉండెను, కొందరు మంచి అందము కలిగియుండి నిద్రించు చుండెను, అందమైన మోముగల కొందరు మగువలు నవ్వు చుండెను,  స్త్రీలు కోపముతో దీర్ఘమైన విస్వాసములు విడుచు చుండెను.

లంకా నగరంలో గొప్ప బుద్ధిమంతులను, సమ్మనితములైన ఉత్తమ పురుషులను, మంచి శ్రద్దావంతులగు అందమైన రాక్షసులను, మంచి పేరుతొ మంచిగా మాట్లాడు వారును,
అందమునకు తగ్గ గుణములు కలవారును, తేజముతో వేల్గొందు తున్న రాక్షసులను,
ప్రశాంతముగా వికృతాకారముగా ఉన్న రాక్షసులను, విశ్వవిక్యాత రాక్షసులను హనుమంతుడు చూసెను .

మంచి స్వభావము, శ్రద్ద భావము గలవారును, ప్రియుల యందును, పానమందును లగ్నమైనవారును, తారలవలె వేల్గొందు కొందరు అందమైన రాక్షస స్త్రీలను, స్త్రీలు ప్రియులపై ప్రేమాతిసయములు చూపుట మారుతి చూసెను

కొందరు స్త్రీలు ప్రియుల కౌగిలంతలలో చిక్కి సిగ్గు పడుచుండెను, స్త్రీలు పతిసుఖమును పొంది ఆత్యానంద భరతులైన వారును, పుష్పములు కప్పిన పక్షులవలె కొందరు స్త్రీలు ఉండెను,
కొందరు స్త్రీలను మేడలపైన ఉండుట హనుమంతుడు చూచెను

మన్మదావేశముతొ కూడిన స్త్రీలు, భర్తల వడిలో ఉండెను, భర్తలప్రేమకు పాత్రులైన స్త్రీలు రతికేళీలు సలుపు చుండెను, కొందరుస్త్రీలు పురుషులతో ధర్మమార్గమున సంసారము చేయు చుండెను.

రతీమన్మదులుగాఉన్న రాక్షసులను హనుమంతుడు చూసెను, కొందరు స్త్రీలు వస్త్ర విహీనులై నగ్నంగా బంగారు తీగవలె  నుండెను,  అత్యధిక సంభోగముతో పుట్టముకట్టిన బంగారము వలే నుండెను, కొందరి స్త్రీల శరీరవర్ణము చంద్రునిలో మచ్చరంగు వలే నుండెను,  కొందరు స్త్రీలు ప్రియుని వియోగాముతో భాదపడు చుండెను.

పుష్పమాలను ధరించి హర్షము గలవారై మనోహరముగా నుండెను, అన్దమైనమొముగలిగి, సుందరమైన కుచములు కలిగి ఉండెను, సుందరమైన నేత్రములు విద్యులతలవలె ప్రకాశిమ్చు చుండెను, స్త్రీలు భూషనాలు ధరించి ఇష్ట ప్రియుల ఆలింగనంలో ఉన్నట్లు మారుతి చూచెను.  

అతి ప్రాచీన మైన ధర్మము నందును, మన్మధుని చేత శోభాయుక్త  మైనదియును, నిత్యమూ భర్తనే తలచు చున్నదియును, స్త్రీలలలో  శ్రేష్టమైనదియును, అన్ని కాలములో ఎప్పుడు ఎవ్వనవతిగా ఉండ గలినదియును, అన్ని విధములుగా వైవిష్టము గల సీతా దేవి కాన రాకుండెను

విరహ దీపము చేత  పీడింమ్ప బడుచున్నదియును, ఏకధారగా కన్నీరు కారుస్తూ కంఠం తడిసి నదియును, ఉత్తమ హారము ధరించి, చక్కని కను రెప్పలు కలదియును, మనోహరమైన కంఠశ్వరము కలదియును, నృత్యము చేయని ఆడనెమలి వలే సీత కన బడ కుండెను.

అస్పష్టముగ కనబడు చంద్రరేఖను బోలినదియును, ధూలిచె ధూపరమైన బంగారు రేఖను బోలినదియును, దెబ్బ తగిలి మానినప్పుడు నిల్చిన వర్ణ రేఖను బోలినదియును, గాలిచేత చెదర గొట్టబడిన మేఘరేఖను బోలినదియును, వివిధ వర్ణ రేఖలు గల సీతాదెవి మాత్రము కనబడ కుండెను.

ఎంత సేపు వెతికినా సీతామాత కాన రాకుండెను, రాముని యొక్క దుఃఖము ఏవిధముగా తొలగించగలను, రాముని యొక్క కార్యము నేను ఏవిధముగా నెరవేర్చ గలను, నిగ్రహాశక్తి పరుడైన హనుమంతుడు కొన్నిక్షణాలు ఉస్చాహ శూన్యుడయ్యెను.

శ్రీ వాల్మీకి మహాముని సంస్కృతం లో విరచిమైన 5వ సర్గ తెలుగు వచస్సు సమాప్తము

 శ్రీ రామ్   ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రామ్ 

ఓం శ్రీ  రాం -  శ్రీ మాత్రే నమ: -  శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
 ప్రాంజలి - సర్వేజనా సుఖినోభవంతు
ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:
 

సుందర కాండము నందు 6వ సర్గ

లంకా నగర వైభవాలు చూసి హనుమంతుడు ఒక్కసారి ఆశ్చర్యపడినాడు, సూర్యుని బోలి  మిక్కిలి ప్రకాశించు ప్రాకారములను, రాక్షాసిధిపతి యోక్క ఎడంతస్తుల భవనములను, రాక్షసులచే రక్షింప  బడుచున్న భవనములను, కామరూపుడగు హనుమంతుడు యదేస్చగా చూస్తూ ముందుకు సాగెను. 

వెండితో లిఖించబడిన చిత్తరవులను, బంగారు మలాముతో చేయబడిన సింహద్వారములను,
సింహములచే రక్షింప బడుచున్న మహా భవనములను, సౌర్యలలక్ష్మీ సంపన్నుడైన హనుమంతుడు చూడసాగెను. 

ఏనుగుపై ఆసీనులైన మావటి వాండ్రను, వేగముగా రధములు లాగు అశ్వములను, సింహ వ్యాఘ్ర చర్మములను ధరించిన రాక్షసులను, ఏనుగు దంతములకు బంగారు తొడుగులను ఉండుట   చూచెను. 

వెండితోను పంచలోహములతో చేసిన ప్రతిమలను, విచిత్రముగా శబ్దము చేయుచు గాలిలో  ఎగురుతున్న భవనములను, రత్నములతో పొదగబడిన బహుమూల్యములైన ఆసనములను
మహా వీరులుండే భవనములను హనుమంతుడు చూసెను. 

కనివిని ఎరుగని అద్బుత ద్రుస్యములను, నానా ప్రాకారముల మీద మృగ-పక్షుల చిత్రములను,
వినయ యుక్తులగు రాక్షస భార్యలను, హనుమంతుడు చూసి ఏంతో  ఆనందించెను

రాజులు నివసిమ్చుటకు సమస్త హంగులు కలదియును,  మిక్కిలి ముఖ్యమైన చందనములతో సంపన్న మైనదియును, మహాజనులు వేచి ఉండు రాక్షసేంద్రుని భవనమును, సింహముతో నొప్పు వనమువలె ఉన్న రాజా భావనమును మారుతి చూసెను.

భవనములో ఎందఱో ఉత్తమ స్త్రీలు నివసించి ఉండెను, భేరి మృదంగద్వనులతో ప్రతిద్వనించు  చుండెను, శంఖనాదములతో నిత్య దేవతార్చనలు చేయుత కూడా అక్కడ చూసేను.  

పర్వదినములందు వివిధ హోమములు చేయుచుండెను, పూర్ణిమ అమావాశ్యనందు ప్రత్యేక పూజలు జరుగు చుండెను, భవన మద్య బాగము పైకప్పు నందు రత్నములు పొదగి యుండెను,
అక్కడ గంమ్భీరమైన నిశ్శబ్దము కూడా ఆవహించి ఉండెను, తేజోవంతముగా వెలుగుతున్న భవనమును హనుమంతుడు చూసెను.

ప్రహస్తుని భవనమును చూసి, మహహ పార్శుని భవనమును వెదికెను, కుంభ కర్ణుని భవనము చూసి,  ప్రక్కనే ఉన్న వనములు వెతికెను, విరూపాక్ష గృహమును వెతికి, ప్రక్కనున్న గృహములను వెతికెను, లంకా నగరికి అలంకారములుగా ఉన్న భవనములను మారుతి చూసెను.

మహోదర, విద్యుజిహ్వ,  విద్యున్మాలు,గృహములను, బహుద్రంష్ట, సుకుల, బుద్దిమంతుడైన సారని, గృహములను,   జంబుమాలి, సుమాలి, విష్ణుభక్తుడగు విభీషణ, గృహములను, 
ఇంద్రజిత్తు గృహమును, హనుమంతుడు సీత కొరకు వెతికెను.

ద్రుమాక్ష, సంపాతి, విద్యుద్రూప, భీమ, ఘన, గృహములను, విఘన, శుకనాభ, చక్ర, శర, కపట, హ్రస్వకర్ణ, గృహములను, దంష్ట్ర,మహాకపి రశ్మికెతు, సూర్య శత్రు, వజ్రకాయ, గృహములను, యుద్ధొన్మత్త,  రాక్షసుల గృహములను హనుమంతుడు వెదికెను. 

విద్యుజిహ్వ, ద్విజిహ్వ, హస్తి ముఖి, గో ముఖి గృహములను, కరాల, విశాల,సోనితాక్షులు ఇండ్లను వరుసక్రమంలో వెతికెను, ఐస్వర్యముతో తులతూగు గొప్ప గొప్ప భవణములను వెతికి, లక్ష్మి సంపన్నుడైన హనుమంతుడు రావణ గృహమునకు వచ్చెను. 

రక్షకు రాండ్రలుగా వికార నేత్రములు గల రాక్షస స్త్రీలను చూచెను, స్త్రీలు శూలములను, బల్లెములను, మద్గరములను ధరించెను,  ఎరుపు,తెలుపు, అనేక రంగులుగల జాతి గుర్రములను చూచెను, మంచివస్త్రములు, బంగారునగలతోఉన్నస్త్రీలను కూడా మారుతి చూసెను. 

మంచి జాతికి చెందిన, చక్కగా, బలంగా, ఉన్న ఏనుగులను, శత్రువులను భంజిమ్చే గొప్ప యుద్ధ  ఏనుగులను, గజ శిక్షణ పొందిన రాజ భవనంలో ఉన్న ఏనుగులను, ఐరావతము వంటి బలముగల ఏనుగులను హనుమంతుడు చూసెను. 

ప్రాతకాల సూర్యుని  వెలుగుతున్న శిబికలను చూసెను, వివిధాకారముగల పల్లకీలను, రధములను చూసెను, చిత్రములైనా లతాగ్రుహములను, చిత్రశాలను చూసెను, పగటిపూట ఉపయోగించే భవనమును హనుమంతుడు చూసెను.

కాష్టమైన క్రీడా పర్వతములను, విశాలమైన మైదానములను, రమనీయమైన కామగ్రుహములను, విలాస భావనములను చూసెను,  నెమలి నృత్యములతోను, పక్షుల కూతలతోను ఉన్న గృహమును
మందార చలమువలె సున్నితమైన దానిని హనుమంతుడు చూసెను. 

పై కప్పు అనంత రత్నములు పాడగా బడి యుండెను, పెక్కు నిధులు ఉండి రక్షక భటులు కాపలా కాయుచుండెను, ధీరులు, పురుషులుచే ననుష్ఠింపబడు దేవాలయమును చూసెను, హనుమంతుడు అది భూతపతి నివాస స్థానమని గ్రహించెను

ఆ భవనమంతా మహా శివుని  తెజస్సుతోను, రావణ తపశక్తి  ప్రభావ  తెజస్సు తోను, బంగారము, వజ్రాలు, రత్నాల తెజస్సుతోను, సూర్య తేజస్సుతో ఉన్న దేవాలయమును మారుతి చూసెను

మధు పత్రాలను, రక్త పాత్రలను, జంతు చర్మాలను, మాంసము వండే పెద్ద పెద్ద పాత్రలతో ఉన్న గృహమును, స్వర్ణముతో తయారు చేయ బడిన ఎత్తై న సింహాసనాలను, స్వర్ణ మయమగు మంచములను హనుమంతుడు చూసెను.

అందేలా యొక్క జుమ్కారముల తోడను, మృదంగ తాళముల నిర్ఘోషముల తోడను, పెద్దగా మ్రోగు తూర్య ధ్వనుల తోడను, కుబేరుని భవనము వలే విశాల మైనదియును, పెక్కు ప్రాసాదములతొ ఉన్నదియును, స్త్రీ రత్న శతములతో వ్యాప్త మైనదియును, విశాలమగు అంత:పుర కక్షలతో ఉన్నదియును, రావణుని మహా గృహమును హనుమంతుడు చూసెను


సుందర కాండము నందు 6వ సర్గ సమాప్తము
--((*))--
   

                              ఓం శ్రీ  రాం    ఓం శ్రీ  రాం     ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                                  శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
                                  సుందర కాండము నందు 7వ సర్గ

హనుమంతుడు లంకానగరములో సీత కొరకు వెతుకుతున్నాడు, లంకా నగరము గురించి ఆదికవి వర్ణించిన విధము ఈవిధముగా వివరించారు
 
నీళ మనులతొ పొదగ బడిన బంగారు కిటికీలను, పక్షి సమూహములు చేయు మదుర స్వరములను, వర్షా కాలములో మేఘములచే మెరిసే మెరుపులను, వేలుగు విరజిమ్ముచున్న  భవనములను హనుమంతుడు చూసెను. 

రాక్షసలు  స్వబలముతో నిర్మించిన గృహములను, బహువిధములైన రత్నములతో నిర్మించినవియును, దేవతలు, అసురులు, పూజింప దగినవి యును, ఎట్టి దోషములేని గృహములను మారుతి చూసెను.

సాక్షాత్తు మయునిచే నిర్మించ బడినవియును, భూలోకంలో సకలగుణ శ్రేష్టము లైనవియును
ఉన్నతమైన మేఘములు వలే తెల్లనియును, బంగారు నగిషి  దిద్దిన భవనములను చూసెను.

 అక్కడ భూమి పర్వత పంక్తులతో ఉండెను, పర్వతములపై వృక్ష సముదాయముతో నిండియుండెను, వృక్షములపై పుష్ప సముదాయములతో నిండి యుండెను, పుష్పములు, కింజుల్కములతో రేకులతో నిండి యుండెను.

పద్మాకారములో శ్వేత భవనములు యుండెను, పద్మములతో సరస్సులు నిండి యుండెను, 
పద్మములపై కింజల్కములు నిండియుండెను, పువ్వులతో ఉన్నతమైన వనములుండెను. 

వెండి, పగడములతొ నిర్మింపబడిన విహంగములుండెను, రత్నములతో చిత్రమైన సర్పములు చెక్కబడి యుండెను, మంచి అవయవ సంస్థానముగల జాతిగుఱ్ఱములు ఉండెను, అనేక పగడములు గల విమానమును హనుమంతుడు చూసెను.

బంగారంతో చేయబడిన పుష్పములతో నొప్పు రెక్కలుండెను, లీలగా క్రిందకు వంపబడిన కుటిలమైన పక్షము లుండెను, సాక్షాత్తు కామదేవుని దివ్య సుందర రూపాలుండెను., సుందరమైన ముక్కులుగల పక్షులు ప్రకాశించుచుండెను.

పద్మాల సరస్సునందు ఒక పద్మముపై లక్ష్మీదేవి యుండెను, ఇరువైపులా గజముల తోండము లందు పద్మాల కాడలుండెను, లక్ష్మీదేవి సుందరమైన హస్తము లందు పద్మములు ఉండెను.

బంగారముతో చెక్కబడిన లక్ష్మీదేవి చిత్రమును మారుతి చూసెను, సర్వప్రశస్యముగా ఉన్న లంకాపట్టణమంతా తిరుగు చుండెను,    పతి, గుణ, ద్యానముచే, ఉన్న సీత మాత్రము కనబడ కుండెను.

భర్తతోడు లేక, స్తైర్యమును కోల్పోయిన జానకి కానరాకుండెను, బహువిధములుగా నాలోచించి సీత కొరకు మారుతి వెతికెను. 

నిశిత బుద్ధియును, ధర్మ మార్గ వర్తియును,  సూక్ష్మ  దర్శనముగల మహాత్ముడును
అప్రతి హతమైన దృష్టిగల హనుమంతుడు, సీత కన్పడక పోవుటవలన దు:ఖా క్రాంతుడయ్యేను

సుందర కాండము నందు 7వ సర్గ  సమాప్తము

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
 

--((*))--

                             ఓం శ్రీ  రాం    ఓం శ్రీ  రాం   ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                                  శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
                                   సుందరకాండము నందు 8వ సర్గ

హనుమంతుడు అద్భుతమైన విమానము చూసాడు, దానిలో ఉన్న వీణలు విశేషాలు తెలుసుకొని సంతోషం వ్యక పరిచాడు.
 
విశ్వకర్మచే నిర్మిమ్చబడిన అత్యుత్తమమైన మెరుపు విమానమును, ఆదిత్య మార్గ చిహ్నమువలె కనబడుచు ప్రసంసింప బడుచున్నదియును, అమితమైన సౌందర్యముగల ప్రతిమలతో శొభించు చున్నదియును, పవననందనుడు మధ్యభాగమున ఉన్న విమానమును చూసెను. 

ప్రయత్న పూర్వకముగా ఏదియు నిర్మించ బడ నిదియును, బహు మూల్యమైన రత్నములు లేని భాగమనేది లేనిదియును, దేవ విమానము వలె విశేషమైన శక్తి కలదియును, అద్బుతమైన విమానమును పవన నందనుడు చూసెను. 

తపోనిష్టచే  సంప్రాప్త మైనదియును, పరాక్రమముచే నార్జింప బడినది యును, మనస్సును బట్టి ప్రయాణము చేయునదియును, రచనా విశేషములతో నిర్మించ బడినదియును, ఎక్కిన వాని మనస్సును బట్టి వేగముగా పోవు నదియును, శత్రువులకు కాన రాకుండా అడ్ డగించుటకు వీలు లేనిదియును,  వాయువేగాముతో, సమాన వేగముగా, పోవు విమానమును చూసేను.

పుణ్యవంతులు, మహాత్ములు ప్రయాణము చేయుటకు వీలున్నదియును, విమానమును కుండలములతో శోభిల్లు చున్న వారును, అధికమైన ఆహారమును  భుజించు వారును, గుండ్రని కండ్లుగల ఆకాశ సంచారుము చేయగల రాక్షసులను, మొదలగు వారితో పాటు పిశాచములు నడుపు విమానము చూసెను.

వసంత  ఋతువులో వికసించే పుస్పముల వలెను, మనోహరమైన శరత్కాల చంద్రునివలెను,
వసంతము కంటే మనోహరమైన పుష్పక వినమును, విశిష్టరూపముగా ఉన్న విమానమును హనుమంతుడు చూసెను.

సుందరకాండము నందు 8వ సర్గ సమాప్తము 



ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                                  శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
                                   సుందర కాండమునందు 9సర్గ(మొదటి భాగము )

హనుమంతుడు రాక్షసేంద్రుని మహాభవనమును చూడ మొదలు పెట్టెను                  

రాక్షసేంద్రుని మహాభవనము అర్ధ యోజనము వెడల్పుగాను, ఒక  యోజనము పొడవు కలిగి బహు ప్రాసాదములతొ ఉండెను, అక్కడఉన్న భవనములు చూస్తు రావణుని భవనమునకు పోయెను,
 విశాల నేత్రములుగల సీత కొరకు హనుమంతుడు  వెతుకు చుండెను.

నాలుగు దంతములు, మూడు దంతములు గల ఏనుగులను, ఏనుగులపై  ఆయుధాలు ధరించిన మహా రాక్షసులను, నాల్గు దిశలు భవనమునకు  రక్షగా ఉన్న రాక్షసులను, లక్ష్మీ సంపన్నుడైన హనుమంతుడు చూసెను. 

జలములో ఉన్న  ఏనుగులను,మోసల్లను, మత్యములను,  తిమింగలములను, అనేక మైన విష సర్పములను, అ ప్రదేశము గాలికి కదిలే సముద్రము వలే నుండెను, రాజకన్యలు, అనేక మంది స్త్రీలు గల భవనమును చూసెను.

కుబేరుని వద్దను, ఇంద్రుని వద్దను, చంద్రుని వద్దను, ఎలక్ష్మీ నివసిమ్చునో ఆ లక్ష్మీ రావణ గృహమునందుండెను, కుబేర ,యమ, వరుణుల యోద్దగల సకల సమ్రుద్ధములను, అంతకన్నా ఎక్కువగా రాక్షస  గృహమున తనరారు చుండెను.  

బ్రహ్మాను తపస్సుచె మెప్పించి కుబేరుడు పుష్పక విమానము పొందెను, రాక్షసేంద్రుడు పరాక్రమముచే కుబేరుని జయించి విమానము పొందెను, ఆ విమానమునందు వెండి బంగారము తో నిర్మించిన  చిత్రములుండెను, తోడేళ్ళ చిత్రములతో రత్న కాంతులతో అద్భుతముగా వెల్గొందు చుండెను.

పుష్పక విమానము మేరు మంధర పర్వతమువలె ఉండెను, ఆకాశము తాకుచున్నాట్లుగా అద్బుతమైన సౌదాలతో ఉండెను, ఆ విమానము అన్నిదిశలలో అలంకృతమై ఆకర్షిస్తూ ఉండెను
 మనస్సు ను ప్రసాన్తపరిచి సంతోషాన్ని ఇచ్చే విమానమును చూసెను. 

అగ్ని, సూర్యులవలె వెలుగొందుతూ సుందరముగా ఉన్నదియును, హేమ సోపాన సంయుక్త మైన శ్రేష్టమైన విమానమును చూసెను, ఉత్తమ ఘన్ధముగల రక్త చందన యుక్తమగు విమానముచు చూసెను., విశ్వకర్మచే విశేషముగా నిర్మించబడిన విమానమును మారుతి చూసెను

పాన భక్ష్య అన్నములవలన కలిగినదియును, నలుదిక్కుల వ్యాపించిన సువాసనను కలిగినది యును, దివ్య ఘన్ధముచెత మూర్తీభవించిన సువాసన కలదియును, వాసనలను గ్రహిస్తూ హనుమంతుడు సీతకొరకు వెతుకు చుండెను. 

ఏనుగు దంతములచే నిర్మించబడిన వివిదాకృతులను, ముత్యములు, పగడములు, రత్నములు, ఉన్న బొమ్మలను, భందు ప్రీతితొ తనను ఆహ్వానిస్తునట్టు, స్త్రీఅల పలకరిమ్పులను, అక్కడ ఇటురమ్ము  ఇటురమ్ము అని పిలిచినట్లు మారుతి భావించెను.  

ప్రుద్విపై పెద్ద బంగారు తివాచీలు పరుచబడి ఉండెను, మత్త విహంగములతో సుఘంధ పరిమళాలు వీచు చుండెను, పెక్కు స్తంభములతో ఉన్నభవనము దివికి ఎగురుచున్నట్లు ఉండెను,  గ్రహాది చిత్రాంకితమగు ఆ శాల భూమివలె విస్తీర్ణముగా ఉండెను

ప్రక్కపై పరచు జంపఖానాలు హంసలను బోలి తెల్లగా నుండెను, పాత్ర పుష్పోపహరములచె ఆశాల యమునా నదివలే కాంతిగా ఉండెను, ధూపములచె నిండియున్న సుఘంధములు ఘుభాలించు  చుండెను, హనుమంతునకు ఆప్రదేశము కాంతిజనకమై మనసును ఉల్లాసపరిచెను

శోకమును పోగొట్టునదియును కాంతికి ఉత్పత్తి స్తానమైన దివ్యశాలను, శబ్ద, స్పర్స, రూప, రస,గంధములను '5' ఇందిరియార్ధములతోను, దేవలోకములో ఉన్నట్లు 5 ఇంద్రియములు మారుతికి  తృప్తి పరిచెను, ఆ ప్రాంతము తల్లి వడిలో ఉన్నట్లు హనుమంతునకు సంతోషము కల్గెను. 
                                                                                                           ఇంకా ఉన్నది 



                         ఓం శ్రీ  రాం    ఓం శ్రీ  రాం    ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                                  శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
                                   సుందర కాండమునందు 9సర్గ(రెండవ భాగము )

అక్కడ దీపముల కాంతి చేతను, రావణుని తెజము చేతను, పుష్పక విమానము కాంతి తోను, ఆభరణాల కాంతితోను, ఏకాంతముగా వెలుగుతున్న కాంచన దీపముల తోను, సిద్ధి శక్తులతో ఉన్న ప్రాంతము హనుమంతుడు చూసెను.

నానా వర్ణములుగల వస్త్రములను, పుష్పహరములు ధరించిన స్త్రీలను, నానా వేష భూషితులై తివాచీలపై పరుండిన ఉత్తమ స్త్రీలను, అర్ధరాత్రియందు వివిధ క్రిడలచే అలసివళ్ళు మరచి నిద్రిస్తున్న స్త్రీలను, శబ్దములేక నిశ్చలముగా ఉన్న నరనారీ సహాస్త్రమును మారుతి చూసెను.

హంస బ్రమరములుగల మహా పద్మము వలే ఉన్న స్త్రీలను, నిమిళి నేత్రములు, పద్మ ఘంధములు గల స్త్రీలను, వికసించిన పద్మములవలె, మకుళితమైన పద్మములవలె ఉన్న స్త్రీలను, వికసించిన పద్మములపై మదించిన తుమ్మెదలను మారుతి చూసెను. 

పద్మవదన స్త్రీల మద్య రావణుడు నిద్రించు చుండెను, తారల మద్య వెన్నెల కురిపించే చెంద్రుడిలా ఉండెను, స్త్రీలందరు ఆకాశమునుండి రాలిన తారలుగా ఉండెను, స్త్రీల ముఖ పద్మముల బట్టి వారి గుణములు తెలిసెను. 

పాన క్రీడా సమయంలో విపర్యస్తమైన కెశములుగల స్త్రీలను, పెద్ద పెద్ద పూల చెండ్లు ధరించి క్రీడలొ రాలినపూలుగల స్త్రీలను, నుదుట తిలక చెదిరి ఘాడ నిద్రలో మైమరిచి ఉన్న   స్త్రీలను
కాలి అందెలు, హారులు, పడి ఉన్న స్త్రీలను మారుతి చూసెను.

ముత్యాల హారములు తెగి,  రాలిన ముత్యాలమద్య ఉన్న స్త్రీలను, పై వస్త్రములు మొత్తము జారి,  వివస్త్రగా కనబడుతున్న స్త్రీలను, రసనా దామములు తెగి మత్తు మత్తుగా కదులుతున్న స్త్రీలను
 భారమును మోస్తున్నఆడు గుఱ్ఱపు పిల్లవలెఉన్న స్త్రీలను మారుతి చూసెను. 

మహావనములో గజ రాపిడికి రాలిన పూలవలె ఉన్న స్త్రీలను, నలిగి, తెగిన పుష్పాలపై కదులుతూ పరుండిన స్త్రీలను, కర్ణములకు ధరించిన కుండలములు క్రింద పడేసిన స్త్రీలను
స్త్రీల నిజరూపలను చూసి మనోనిబ్బరముగా హనుమంతుడుండెను.

చంద్ర సూర్యులను బోలిన స్తనములపై హారములున్న స్త్రీలను, స్త్రీల రోమ్ములపై ఉన్న హారములు నిద్రించు హంసలు వలే ఉండెను,  బంగారువర్ణము కలిగి ఆభరణములతో స్త్రీలు, చక్రవాకములవలె ఉండెను, వైడూర్య ఆభరణములు ధరించిన స్త్రీలు నీటి కాకులవలె ఉండెను  

కొందరి స్త్రీల పిరుదులు ఇసుక తిన్నేలుగా కనబడు చుండెను, కొందరు స్త్రీలు చక్రవాక పక్షులతో శోభించు చున్న నదులవలె ఉండెను, ప్రేమాది భావములుగల మొసల్లుగా, కీర్తులె తోరణాలుగల స్త్రీలుఉండెను,చిరుమువ్వలె మొగ్గలుగా గల స్త్రీలను హనుమంతుడు చూసెను. 

ముఖముపైఉన్నకేశములు గాలికి కదిలి శొభయామానముగా నుండెను, స్త్రీల శరీరము పై ఉన్న చీర  చేరుగులు జండాల వలే ఎగురు చుండెను, స్త్రీల యోక్క కర్ణ  కుండలములు క్రింద పడి  సవ్వడి చేయు చుండెను,స్త్రీలశ్వాస-నిశ్వాసము వళ్ళ వస్త్రములు ఎగురుటను మారుతి చూసెను.

భార్యలురావణుని మోము అని బ్రాంతిచె సవతులను ముద్దుపెట్టు కొనెను, అస్వతంత్రులు రావణునిగా ఊహించి ఉత్తమస్త్రీలను చుంబించు చుండెను,  ప్రత్యేకముగా తయారుచేసిన మద్యమును త్రాగిన స్త్రీలు అక్కడ ఉండెను, సుఖకరమైనదియగు వదన శ్వాసము రావణుని సేవించినట్లు మారుతి చూసెను.

ఒక స్త్రీ మరియొక స్త్రీవక్ష స్తలముపై తల పెట్టుకొని నిద్రించెను, ఆమె భుజము తలకడగా చేసుకొని మరియొక స్త్రీ నిద్రించు చుండెను,ఒక స్త్రీ మరియొక స్త్రీతొడనే దిండుగా పెట్టుకొని నిద్రించు చుండెను, ఇంకొకస్త్రీ ఆమె యొక్క స్తనములనే దిండుగా పెట్టుకొని నిద్రించు చుండెను

కొందరు స్త్రీలు మదమునకు లోనై తొడలనె ఆశ్రయించి నిద్రించు చుండెను, పార్శములను, కటి ప్రదేశములను ఆశ్రయించి పెనవేసుకొని యుండెను, కొందరి స్త్రీలు స్నేహముతో శరీరముపై శరీరము చేర్చి నిద్రించు చుండెను, స్త్రీలుపరస్పరము ఊరు,పార్స,కటి, పృష్టముల నాశ్రయించి కౌగలించు కొనెను. 

వికసించిన పుస్పములవలె, వికసించిన స్త్రీలమఖాలు కనబడు చుండెను, పుష్పాలన్నీ దారంతో కట్టిన దండలాగా, స్త్రీలు ఒకరికొకరు చుట్టుకొనెను, స్త్రీలందరు వనంలో దట్టముగా ఉన్న పుస్పాలవలె పెనవేసుకొని ఉండెను, తుమ్మెదలు పువ్వు నుండి  పువ్వుపైకి పోయినట్లు స్త్రీలు కలసి ఉండెను. 

స్త్రీలపై ఉన్న ఆభరణములను, మేనిపై ధరించిన వస్త్రములను, కొప్పులపై ధరించిన పూలను, ఎవరివో అర్ధకాకుండగా ఉండెను, నిద్రలొ ఉన్న రావణుని తేజస్సును, స్త్రీల ఆభరణాల వెలుగును,  నిర్నిమేష నేత్రములతో రావణుడు స్త్రీలను చూచు చుండెను. 

అక్కడ రావణుని మరులుగొని దైత్యులు, గంధర్వుల వనిత లుండెను, అక్కడ రావణునిపై ప్రేమతో వచ్చిన, మదవతులైన స్త్రీలు ఉండెను, అక్కడ కోందరు స్త్రీలు రావణునిపై మన్మద ప్రేరణ కలిగి  ఉండెను,రావణుని ప్రక్కన మద మత్తులైనస్త్రీలను హనుమంతుడు చూచెను. 

అక్కడ బలత్కారముగా తెచ్చిన స్త్రీలు అనేవారు లేకుండెను, అక్కడ కొందరు స్త్రీలు రావణుని గుణసంపదచే వచ్చినవారై ఉండెను, అక్కడ రావణుని భార్యలలో ఇతరలుకు బార్య లైనవారు లేకుండెను, అక్కడ రావణునిపై తప్ప, ఇతరులపై ప్రేమ ఉన్న భార్యలు లేకుండెను. 

 రావణుని భార్యలలో నీచకులములొ పుట్టిన వారు లేకుండెను, రావణుని భార్యలలో తక్కువ అందము, హీనసత్వురలు లేకుండెను,  భార్యలలో ఉత్తమమైన భూషణములు ధరింపని వారు లేకుండెను, రావణునిచే బలాత్కారముగా తేబడిన సీత కాన రాకుండెను

హనుమంతుడు మనసులో అనుకొనెను రావణుని ఐశ్వర్యమునకు సీత లొంగి పోయి ఉండ వచ్చునను కొనెను,.  ఆది కవి వ్రాసిన ఈభావనను వివిధకవులు ఈ విధముగా వివరించారు.
రావణుని భార్యలను చూసినట్లుగా, రాముని భార్య అగు సీతను చూసిన జన్మ సఫలమగును,
రావణుని భార్యలను చూసినట్లుగా,  సీతను కుడా భార్యగా  అనుకున్న సర్వనాశన మగును

 రావణుని భార్యలను చూసినట్లుగా, భర్తే ఆరాధ్య దేవతాగా ఉన్నసీతను కామించిన బ్రష్టుడగును,
రావణునిచే తేబడిన సీత మరెక్కడన్నా ఉన్న వానరుల  ప్ర్రయత్నము విఫలము కాకుండును,
సీత తప్పక అందరికంటే గొప్ప గుణము కలిగి ఉండును, రావణుడు సీతను అపహరించి చేయ కూడని పని చేసిన వాడయ్యేను, భర్త లేని సమయాన చౌర్య రూపమున సీతను అపహరించి తెచ్చెను

హనుమంతుడు దుఃఖముతో  సీత కానక మనస్సులో భాద వ్యక్తీ కరించెను.

స్రీ సుందర కాండమునందు 9సర్గ సమాప్తము


--(*)--
                       ఓం శ్రీ  రాం   ఓం శ్రీ  రాం   ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                                  శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
                                   సుందర కాండము నందు  10 వ సర్గ

రాజభవనము అంతను వెతుకుచూ శయ్యాసనాగారమును చూసెను, రత్న, స్పటిక, మాణిక్యములతో అలంకరించబడిన మంచములను చూసెను, మంచములు, ఆసనములు, దంతపు నగిషీలతొ చేసిన చిత్రములు చూసెను, అత్యుత్తమైన సుఘంధ పరిమళాలతో ఉన్న గృహమును మారుతి  చూసెను. 

శయనా గృహమునందు ఒక ప్రక్క ఉత్తమమైన వస్త్రములు ఉంచెను,  మరో ప్రక్క చంద్రునితో సమానమైన శ్వేత చత్రమును ఉంచెను, అక్కడ శయనము చుట్టూ అశొక మాలలు కట్ట బడి యుండెను,  ఆ ప్రాంతము అగ్నితో సమానమైన వెలుగును హనుమంతుడు చూసెను. 

రావణుని వర్ణన 

శయనముపై  మేఘమువలె ఉన్న  రావణుడు నిద్రించు చుండెను, ఉత్తములైన కుండలములు, హారములు రావణుడు ధరించి యుండెను, మహాబాహువులు గల రావణుడు ఎఱ్ఱని నేత్రములు కలిగి ఉండెను, బంగారు వస్త్రములు ధరించిన రావణున్ని హనుమంతుడు చూసెను.   

సుఘంధము, ఎర్రచందనము పూసుకున్న రావణుడు నిద్రించు చుండెను, సంజ ఛాయలచే నేర్రబడి, విద్యులేఖా యుక్తమును బోలిన రావణుడు ఉండెను, స్వేచ్చ సారముగా రూపమును మార్చుకోగల అతని రూపం అందముగా ఉండెను, వృక్షములతో,పొదలతో నిండియున్న మందర పర్వతమువలె రావణుడుండెను. 

రావణుడు రాత్రియందు ప్రియరాన్డ్రతో  క్రీడించి విశ్రాంతిగా నిద్రించెను, మధుర రసాన్ని  త్రాగిన రావణుడు సుఖముగా నిద్రించు చుండెను, రాక్షస కన్యలకు ప్రియుడైన రావణుడు ఘాడముగ నిద్రించు చుండెను, వీరుడైన రాక్షసాదిపతిని పవన పుత్రుడగు హనుమంతుడు చూసెను. 

తీర్ఘ విశ్వాసములతో బుసలు కొట్టుచున్న సర్పమువలె రావణుడు ఉండెను, హనుమంతుడు రావణున్ని చూసి భయముతో దూరముగా వెళ్లి చూడ  సాగెను,  హనుమంతుడు  మరియొక వేదికపైకి ఎక్కి రాక్షస ప్రవరున్ని చూడ సాగెను,  మదపుటేనుగు సెలయేరులో ఉండి నిద్రపోతున్నట్లు రావణుడు ఉండుట చూసెను. 

రాక్షసేంద్రుని రెండు భాహువులు ఇంద్ర ద్వజముల వలే ఉండెను,   బాహువుల మీద ఇరావతము పొడిచిన గాయములు కనబడు చుండెను, బుజముల మీద విష్ణు చక్ర ప్రహారములు కాన బడుచుండెను, బలసిన  de దెహమునకు భుజాలు చాలా బలముగా కనబడు చుండెను.

రావణుని యొక్క  రెండు భుజములు పర్వత శిఖరములవలె ప్రకాశించు చుండెను, రావణుని రెండు భాహువులు పర్వతముపై నిద్రించు మహాసర్పముల వలే ఉండెను, రావణుని భాహువులకు   సుఘంద  ద్రవ్యములు పూత పూయ బడి యుండెను, భాహువులకు కుందేటి రక్తమువలె ఎర్రనైన చల్లని ఘంధము పూయ బడి యుండెను.

రాసా- పున్నాగ- పుష్పములను బోలి సౌరభము కలదియును, ఉత్తమమము లగు పొగడ పూల వంటి వాసన గలదియును, మృష్టాన్నరస సంయుక్తమును, మధు పానమును కూడు కొన్నదియును, రాక్షసేన్ద్రుని శ్వాస ఆ గృహము అంతా వ్యాపించుత హనుమంతుడు చూచెను. 

రావణుని ముఖము మణులతో ఉన్న బంగారు కిరీటమువలె ప్రకాశించు చుండెను, రావణుని వక్షము మద్య రత్నాలతో ఉన్న ధగ ధగ మెరుస్తూ పెద్ద హారము ఉండెను, రావణుడు  మిక్కిలి విలువగల పసుపు పచ్చని ఉత్తరీయము ధరించి ఉండెను, రావణుడు మినుముల రాసివలె నల్లని వర్ణముతో, ఎర్రని నెత్రముల ప్రకాశించు చుండెను.  

రావణుడు నిద్రిస్తున్నప్పుడు నాల్గు దిక్కులా విద్యుదీపములు వెలుగు చుండెను, రావణుని యొక్క సర్వావయవాలు  మెరుస్తు యుగ పురుషుడుగా కనబడు చుండెను, రాక్షసుని పాదముల వద్ద నిద్రిస్తున్న అతని భార్యలు అప్సరసలగా కనబడు చుండెను, ఆతని సౌందర్యము ఇంతఅని వర్ణించుట ఆబ్రహ్మాకు కుడా తగునా అనిపించు చుండెను.

శ్రేష్టమైన కుండలములు ధరించినవారును, ఎప్పుడు వాడి పోనీ పూలను ధరించిన వారును
చంద్రునివలె కాంతి వంతమైన ముఖము కలవారును, రావణుని భార్యలను వానారాధిపతి చూసెను, నృత్యవాద్యములనందు నైపుణ్యము కలవారును, విలువగల బంగారు ఆబరణములు ధరించినవారును, రాక్షసేంద్రుని కౌగిలిలొ చిక్కిన వారును, రావణుని భార్యలను హనుమంతుడు చూసెను.

భార్యలకు వజ్రములతో పొదగబడిన బంగారు కుండలములు ఉండెను, భార్యల బాహువుల యందు బంగారు కడియములు ధరించి యుండెను, భార్యల ముఖము ఒక దివ్యమైన వెలుగుగా వెలిగి పోవు చుండెను, భార్యలందరూ నక్షత్రములవలె వేలుగుచున్నట్లు హనుమంతుడు చూసెను. 

తీగలాగ సన్నని నడుముగల రావణుని భార్యలు మద్యమును త్రాగి ఉండెను, కొందరు మదము చేతను, అధిక  రతికేళి చేతను అలసి సొమ్మసిల్లి  యుండెను, ఎక్కడ అవకాసము దొరికే అక్కడ ఉన్న స్త్రీలను వారికి కౌగలించుకొని యుండెను, బలసి యున్న మనోహరమైన స్త్రీలను హనుమంతుడు అక్కడ ఉండుట చూసెను. 

 అంగ విన్యాసముతొ, నృత్యము చేసి, అలసినవారును, న్నృత్యానుకూలముగా అవయవములను ఉంచి నిద్రించు వారును, వీణను వాయిస్తూ, కరచుకొని, వళ్ళు మరచి, నిద్రిస్తున్న స్త్రీలను
 మహానదిలో తెప్పకు చుట్టుకొన్న లతలవలె స్త్రీలు  ఉండెను. 

చంకలో గుమ్మేటతో ఒక నీల నేత్రి నిదిరించు చుండెను, పిల్లవాడ్ని పెట్టుకొని నిద్రించి వాత్చల్యముగల తల్లివలె ఉండెను, అందమైన అంగములుగల ఒక స్త్రీ తప్పెటను హత్తుకొని నిద్రించు చుండెను, ఆ స్త్రీ ప్రియున్ని ఆలింగనము చేసికొని నిద్రించు కామినివలే ఉండెను.

 కమలములవంటి కళ్ళుగల యువతి వేణువును కౌగలించుకొని నిద్రించు చుండెను, ఆమె  ప్రియతమని ఎకాంత ప్రదేశమునందు గ్రహించి శయనించి ఉండెను, నియతముగా నృత్యముచేయు మరియొక స్త్రీ సప్తతంత్రులు వీణను మీటుచుండెను,   ఆ  వీణను హత్తుకొని ఉన్న స్త్రీ కాంతునితో నిద్రించు భామినివలె ఉండెను.  

 మదముతో ఉన్న ఒక స్త్రీ మ్రుదంగమును హత్తుకొని నిద్రించుచు ఉండెను, బలసిఉన్న ఆ స్త్రీ మృదంగమే భర్త అని భావించి హత్తుకొని నిద్రించు చుండెను, మద్య పాన మత్తులో ఉన్న ఒక స్త్రీ తప్పెటను కౌగలించుకొని నిద్రించు చుండెను, కామ మత్తులో ఉన్న  స్త్రీలను హనుమంతుడు చూస్తు ముందుకు పోయెను.

ఒక స్త్రీ ఆడంబరము అనే వాయద్యమును గట్టిగా బాహు పాశమున బిగించెను, మరొకస్త్రీ నీటి కలశమును బోర్లించుకొని తడిసిన  పుష్పాలవలె శోభిల్లు చుండెను,  ఒక స్త్రీ తనచేతులతో కలశములు బోలిన వక్షోజాలను పాట్టుకొని నిద్రించు చుండెను, పూర్న చంద్రుని మోము గల ఒఅక స్త్రీ మరొక స్త్రీని కౌగలించుకొని నిద్రించు చుండెను. 

హనుమంతుడు పచ్చని శరీర కాంతిచే బంగారములా మెరుస్తున్న ఒక స్త్రీని చూసెను, రావణుని ఇష్టసఖి, సౌందర్యవతి అయిన మండోదరి నిద్రించు చున్నదియును, సౌందర్య యవ్వణంలో ఉన్న స్త్రీని చూసి హనుమంతుడు సీత అని ఆనందించెను, శయనంపై ఉన్న ఆమె స్తితిని చూసి వెంటనే హనుమంతుడు దైన్యము పొందెను.

హనుమంతుడు వాలముతో నేలపై కొట్టెను, కపి సహజ స్వభావముతో ముద్దుపెట్టుకొని ఆనందము అనుభవించెను, హనుమంతుడు గంతులు వేస్తూ  పైకి క్రిందకు పరుగెడుతూ ఉండెను, మారుతి స్తంభములపై ప్రాకుచు, తిరిగి క్రిందకు దూకుచూ ఉండెను.

 సుందర కాండము నందు  10 వ సర్గము సమాప్తము 


                                 ఓం శ్రీ  రాం   ఓం శ్రీ  రాం   ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                                  శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
                               సుందర కాండము నందు 11 వ స్వర్గ


నిద్రిస్తున్న వనితను  సీత అని ఆలోచన విడిచి స్వస్త చిత్తుడాయెను, సీతను గూర్చి పలు విధముల ఆలోచించి చింతకు లోనయ్యేను, సీతా మహాసాద్వికి రామునితో విరహితయై నిద్ర అనేది లేకుండెను,
రాముని తలుస్తూ ఎటువంటి ఆహారమును తీసుకోకుండా ఉండెను. 

భర్త లేనిచోట ఉన్నసీత ఎట్టి అలంకారము చేసు కోకుండా ఉండును, పతివ్రత ఐన సీత ఎటువంటి మద్యమును సేవించకుండా ఉండును, పరపురుషుని ప్రక్క సీత ఎట్టి పరిస్తితిలో నిద్రించాకుండా ఉండును, హనుమంతుడు ఆమె సీత కాదని భావంచి సీత కొరకు వెతుకుట ప్రారంభించెను. 

దేవతలరాజు ఇందృడు వచ్చి సీతను కామించిన సీత త్రుణీకరించును, సీత రామ చంద్రునితో సమానమైన వారు అసలు లేరని వాదించును, సీత సందర్సన కౌతూహలము గల వానరాధిపతి అక్కడ సంచరించెను, సీతను వెదుకుటకు హనుమంతుడు మరలా ప్రయత్నించు చుండెను.

పానభూమి యందు కొందరు స్త్రీలు అధిక రతితో అలసి యుండెను, మరి కొందరు పాటలు పాడుట వల్ల అలసి సొమ్మసిల్లి యుండెను, నృత్యము చేయుటవల్ల పాదముల నేప్పులతో మూలుగు చుండెను,
కొందరు అధికపానమత్తుచే శిధిల శరీరముగలవారై నిద్రించు చుండెను.     

అక్కడ వేలకొలది స్త్రీలు వివిధ అలంకారములతో ఉండెను, కొందరు స్త్రీలు సౌందర్యాది విషయముల గూర్చి ముచ్చటించు చుండెను, గీతముల లోని అర్ధములను గూర్చి ఒకరి కొకరు చెప్పు కోను చుండెను, కాలమును బట్టి తగు విధముగా అక్కడ ఉన్న స్త్రీలు పలుకు చుండెను.

రావణుడు ఆవుల మద్య ఉన్నమత్త వృషభమువలె ఉండెను, రాక్షసేశ్వరుడు ఆడేనుగులచే పరివృతమైన మదపు టెనుగు వలే ఉండెను, రాక్షసరాజు గృహము అంత సర్వ కామోపేతముగా ఉండుట గమనించెను, యవ్వన పొంగులతో ఉన్న నారీ సహస్రమును హనుమంతుడు చూసెను.

పాన సాల యందు లేళ్ళు మరియు మహిషముల యొక్క మాంస ములను, సువర్ణ పాత్రల యందు  భజిమ్ప బడిన నేమ్మల్లు, కోళ్ళు యొక్క మాంస ములను, అక్కడక్కడ పెరుగు లవణము కలిపినా వివిధములైన మేక పోతు మాంసములను,  ఎనుబందులు, పక్షులు యొక్క మాంసములను హను మంతుడు చూసెను. 

తినుటకు సిద్ధముగా ఉన్న కొక్కర మాంసములను, అనేక రకములుగా తయారు చేసిన మేక మాంసములను, కొమ్ము చేపలను, కుందేటి మాంసమును, గొర్రెమాంసమును, సగము తిన్న దున్నబోతు మాంసమును హనుమతుడు చూసెను.

ద్రాక్ష దానిమ్మ రసములతో తయారు చేసిన రసమును, ప్రధానముగా పులుపు ఉప్పు తో చేసిన పదార్ధములను, పాన పాత్రలయందు పడ వేసిన వివిధ ఫలములను, పుష్పాలతో శోభగా ఉన్న ప్రాంతమును మారుతి చూసెను.

పాన సాలల యందు అగ్ని లేకుండగనే మండు చున్నట్లు గమనించెను,  మాంసమును మంచి పాకాది సంస్కారములచే సంస్కరించెను, అనేక పద్ధతులతో భక్షములను తయారుచేసి ఇంపుగా అమర్చేను, అక్కడకొన్ని సయనములు, ఆసనములు ఖలీగ ఉండుట మారుతి చూసెను.

దివ్యమైన స్వచ్చమైన అనేక విధములగు సహజ మద్యములను, వివిధ ద్రవ్యములతో తయారు చేయ బడిన కుత్రిమ మద్యమమములను, అనెక విధములుగా పోపులు పెట్ట బడిన పదార్ధములను,
బంగారు,స్పటిక పాత్రలతో పానభూమి సొభిల్లు చుండెను. 

విప్పపూలు మొదలగు పూలతొ చేయబడిన పుస్పాసవములను, ఖర్జూరపు పళ్ళతో చేయబడిన ఫలాసవములను,  ద్రాక్షపల్లతో  చేయబడిన ద్రాక్షా సవములను, మధుర భరితమైన పదార్ధాలతో పానభూమి సోభిల్లుచుండెను.

అక్కడ మద్యముతో నిండిన బంగారు భాండములను, పూర్తిగా త్రాగిన మణులతో చేసిన రక్త పాత్రలను
వివిధ భాక్షముల్తో నిండిన వెండి పాత్రలను, సగము త్రాగిన పాత్రలను హనుమంతుడు చూసెను. 

ఒక ఆబల మరియొక ఆబల వస్త్రములను అపహరించి నిద్రించు చుండెను, ఒక యువతి ఆమె వద్దకు చేరి ఘాడముగా ఆలింగనముచేసి నిద్రించు చుండెను, నిద్రించు చున్న స్త్రీ యొక్క వస్త్రము యజ్ఞాస్వము వలె ఎగురు చుండెను, మంద మారుతముచే పై వస్త్రములు మెల్లగా కదులు చుండుట మారుతి చూసెను. 

చల్లని చందనముల యోక్క మధుర రసముల యొక్క వాసనలను, మద్యముయోక్క, వివిధ పుష్పముల యోక్క వాసనలను, ఘంధ లేపణలు పూసుకున్న వారి వాసనలను, పుష్పక విమానములో నుండి వచ్చు వాసనలను మారుతి గమనించెను.

ఆ గ్రుహములొ కొందరు స్త్రీలు నిగ నిగ లాడుచు శ్యామల వర్ణములు కలిగి ఉండెను, మరి కొందరు స్త్రీలు బంగారమువలె మెరుస్తూ స్వేత వర్ణము గలగి ఉండెను, అధిక రతిచే అలసి పోయినా స్త్రీలు ఇంకా అందముగా కనబడుచుండెను, హనుమంతుడు స్త్రీలను చూస్తు సీత కనారాక దిగులు పడు చుండెను. 

హనుమంతునకు ధర్మలోప భయ శంకితుడై సందేహము ఉదయించెను, నిద్రించు చున్న  స్త్రీలను చూచుట మిక్కిలి ధర్మనాశనమని భావించెను,  నా దృష్టి ఇంత వరకు ఎన్నడును పర దారులపై ప్రవర్తించ లేదియును, కాని ఇక్కడ  పరదార పరి గ్రహీత యగు రావణుడు చూడబడు చుండెను.

ధీరచిత్తుడగు హనుమంతునకు మనస్సునందు ఆలోచన ఉదయించెను, నేను రావణ స్త్రీల నందరిని  యదేస్చగా చూడ గలుగు చున్నాను, సర్వెంద్రియములకు మనసే కారణము కనుక ఆ మనసే నాకు స్తిరముగా ఉండెను, కాని మానసిక వికారము అనేది  కలుగ లేదని హనుమంతుడు తలచెను. 

సీతకొరకు నేను మరొక ప్రదేశమునకు పోయి  వేదికెదను, స్త్రీల మధ్యకు పోయి  స్త్రీల నందరిని  పరిసీలిస్తు సీత కొరకు వేదికేదను, జంతువు బట్టి  అజంతువులు ఉన్న చోట వెతుకు చుండ వలెను, లెల్ల మధ్యకు పోయి స్త్రీలను వెతుకుట ఏమి లాభము కలుగును. 

నేను నిష్కల్ముష మైన మనస్సుతో ఈ ప్రాంత మంతా వేదుకు చున్నాను, అంత:పురములో దేవ, ఘంధర్వ, నాగ కన్యలను చూచు చున్నాను, ఎంత వెతికినను పతి వ్రతయగు సీత మాత్రము కాన రాకుండెను, పట్టు వీడకుండుగా పట్టుదలతో వెతికితే సీత కానవచ్చునని తలంచెను.

సుందర కాండము నందు 11 వ స్వర్గము సమాప్తము

    --((**))--




                                                           
 

Monday, 6 February 2017

సౌందర్యలహరి



సౌందర్యలహరి

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)
(శ్రీ లలితాంబికాయైనమః)
శ్రీ దేవీ సౌందర్యం , స్వరూప, సంస్థితి, గుణ, చేష్టా, ప్రభావ
తత్వ సౌందర్యముల స్థూల, సూక్ష్మ , సూక్ష్మ తర, సూక్ష్మ తమ, 
భేదాలతో అత్యంత మనోహరంగా వర్ణన చేయడం వలన 
శ్రీ శంకర భగవత్పాద విరచిత ఈ దేవీ స్తుతి " .సౌందర్య లహరి"
అయ్యింది .

దేవీ భక్తులకు ఇది ఎంతో ప్రయోజన కారి కావాలని
ఆకాంక్షిస్తున్నాను.


శ్లోకము (1)
శివ శక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభవితుం
న చే దేవం దేవో నఖలు కుశలః స్పన్దితు మపి
అతస్త్వా మారాధ్యాం హరిహర విరిఞ్చాదిభిరపి
ప్రణన్తుం స్తోతుంవా కథ మకృత పుణ్యః ప్రభవతి !!


ప్రతిపదార్థము
శక్త్యాః= శక్తితో, యుక్త= కూడియుండగా, శివ= శివుడు, ప్రభవితుం= సృష్టిచేయ,
శక్తః = సమర్థతగలవాడు (అవుతున్నాడు), ఏవం = ఇట్లు, నచేత్ = కాకున్నట్లయితే
దేవః = శివుడైనా, స్పందితుం అపి = చలింౘడానికి, నకుశలః = సామర్థ్యం గలవాడు
కాడు, అతః = అందుచేత, హరిహరవిరించాది భిరపి = బ్రహ్మ, విష్ణు, శివులచేత
సైతం, ఆరాధ్యం = పూజింౘుటకుతగిన, త్వాం = నిన్ను, ప్రణంతుం= నమస్కరింౘడానికిగాని, స్తోతుంవా= స్తుతింౘడానికిగాని, అకృతపుణ్యః = పుణ్యం
చేయనట్టివారికి, కథం = ఎట్లు, ప్రభవతి = శక్తి వస్తుంది ?


అమ్మా, ఓ భగవతీ! సర్వ మంగళ సహితుడైన శివుడు జగన్నిర్మాణ శక్తివయిన నీతో కూడితేనే కానీ జగాల
ను సృజించటానికి సమర్థుడు కాడు. అలా నీతో కూడక పోతే ఆ దేవుడు తాను కదలటానికి సైతం అశక్తుడు. కాబట్టి హరి హర బ్రహ్మాదుల చేతను పూజింపదగిన నిన్ను మ్రొక్కటానికి గాని, స్తుతించటానికి గాని పూర్వజన్మలో పుణ్యం చేయని వ్యక్తి ఎలా సమర్థుడు అవుతాడు ? కాడు.

పుణ్యం లేనివారెవ్వరూ ఆజగన్మాతను స్తుతింౘడానికి అర్హులుకానేరరు. " నాకుశక్తి ఉంది " అనటం మనం తరుచూ వింటుంటాం. ఆ శక్తి అనేకరకాలు. కొందరికి రాసేశక్తి, కొందరికిమాట్లాడేశక్తి, కొందరికి అభయనించే శక్తి . ఇలా ఏ శక్తి యైనా ఆ ఆదిశక్తి అంశ అని తెలుసుకోవాలి.
--((**))--


1 శ్లో|| శివః శక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభవితుం
న చే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మపి |
అతస్త్వా మారాధ్యాం హరిహర విరఞ్చాదిభిరపి
ప్రణంతుం స్తో్తుంవా కథ మకృత పుణ్యః ప్రభవతి ||

అమ్మా, ఓ భగవతీ! సర్వమంగల సహితుడయిన శివుడు జగన్నిర్మాణశక్తివయిన నీతో కూడితేనేకాని జగాలను సృజించడానికి సమర్థుడు కాడు; నీతో కూడకపోతే ఆ దేవుడు తాను కదలటానికి సైతం అశక్తుడు. అలాంటప్పుడు హరి హర బ్రహ్మాదుల చేతను పూజింపదగిన నిన్ను మ్రొక్కటానికిగాని, స్తుతించటానికి గాని పూర్వజన్మలో పుణ్యం చేయని వ్యక్తి ఎలా సమర్థుడవుతాడు? కాడు.
*************
 
సౌందర్యలహరి
2 శ్లో|| తనీయాంసం పాంసుం తవచరణ పజ్కేరుహ భవం
విరిఞ్చిస్సఞ్చిన్వన్ విరచయతి లోకా నవికలమ్ |
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్ ||

ఓ మాతా! బ్రహ్మదేవుడు నీ చరణకమలాలలో పుట్టిన కించిత్తు పరాగాన్ని గ్రహించి లోకాలను ఎలాటి వైకల్యం లేకుండ సృజిస్తూన్నాడు. ఈ ఇంచుకపదరజస్సునే మహావిష్ణువు కూడా ఆదిశేషుడై తన వేయి శిరస్సులతో భారంగా మోస్తున్నాడు. దానినే శివుడు చక్కగామొదిపి తన శరీరానికి విభూతిగా అలదు కొంటున్నాడు.
*************

సౌందర్యలహరి
3 శ్లో|| అవిద్యానా మంతస్తిమిర మిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబక మకరంద స్రుతి ఝరీ |
దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి ||
అమ్మా! నీ పాదరేణువు అజ్ఞానుల తమోంధకారాన్ని పోగొట్టే సూర్యద్వీప నగరం. ఆ నీ పాదలేశం మందబద్ధులైన జడులకు జ్ఞానమనే మకరందాన్ని జాలువార్చే ప్రవాహం; లేమిచేత కుంగిపోయే దరిద్రులకు, సకలసంపదలనిచ్చే చింతామణుల శ్రేణి. అంతేగాక జనన మరణ సంసారరూపమైన సాగరంలో మునిగి దరిగానక తపించే వారికి - విష్ణువు అవతారమైన ఆదివరాహస్వామియొక్క కోర అవుతోంది. అంటే ఉద్ధరించేది; సంసార సాగరాన్ని తరింపజేసేది అని భావం.సౌందర్యలహరి

4 శ్లో|| త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా |
భయాత్త్రాతుం దాతుం ఫలమపిచ వాఞ్చాసమధికం
శరణ్యే లోకానాం తవహిచరణా వేవ నిపుణౌ ||

భగవతీ! లోకశరణ్యా! ఇంద్రాదులైన దేవతాగణం తమ హస్తాలలో అభయ వరముద్రలను ధరించి వరాలను, అభయాన్ని ప్రసాదిస్తున్నారు. నీవు మాత్రం హస్తాలలో ఎలాంటి వరాభయముద్రలను ధరించవు కదా! కారణం, ఓ అంబా! భక్తులను భయం నుంచి రక్షించడానికి వారు కోరిన దానికన్నా అధిక ఫలాన్నిఒసగడానికి, ఆడంబరమైన బాహ్యప్రదర్శ లేని నీ పాదసరోజములే చాలును.
*************

సౌందర్యలహరి
5 శ్లో|| హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ |
స్మరో పి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా
మునీనా మప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ ||

ఓ జగన్మాతా! ప్రణమిల్లే భక్తజనులకు సౌభాగ్యాన్ని ప్రసాదించే నిన్ను, పూర్వం శ్రీహరి ఆరాధించి సుందరాంగియై, త్రిపురాలను తెగటార్చి క్రోధావిష్టుడైన శివుడి మనసులో సైతం కామవికారాన్ని కలిగించి క్షోభపెట్టగలిగాడు. అలాగే మన్మథుడు నిన్ను కొలిచి, తన సతి రతీదేవి కన్నులను రంజింపచేయగల సౌందర్యాన్ని పొంది, ఆ రూపుతో అరణ్యాలలోతపస్సు చేసుకునే మునుల మనస్సులలో కామాభిలాష కలిగించటానికి సమర్థుడైనాడు. ఔరా! నీ ప్రసాద మహత్తు అద్భుతం కదా!

సౌందర్యలహరి
6 శ్లో|| ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః
వసంత స్సామంతో మలయమరు దాయోధన రథః |
తథా ప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్
అపాజ్గాత్తే లబ్ధ్వా జగదిద మనజ్గో విజయతే ||

ఓ హిమగిరి కుమారీ! మన్మథుడి విల్లు పువ్వులతోరూపొందించబడినది; వింటినారి తుమ్మెదల శ్రేణి; పుష్ప నిర్మితమైన బాణాలూ ఐదు అతడి అమ్ముల పొది; కాలబద్ధుడై మళ్ళీ మళ్ళీ వచ్చే వసంతుడు అతడి సామంతుడు; అతడి యుద్ధరథం నిరంతరం చలించే రూపులేని మలయమారుతం; ఇలా పనికిరాని పరికరాలు కలిగిన మన్మథుడు అంగ రహితుడు; బలిష్టమైన మేనులేని వాడు. అయిననూ, నిన్నారాధించి, నీ కడగంటి కటాక్షంతో ఈ జగత్తును తన ఆధీనములోనికి తెచ్చుకుంటున్నాడు.
*************

సౌందర్యలహరి
7 శ్లో|| క్వణత్కాఞ్చీదామా కరికలభ కుంభస్తననతా
పరిక్షీణామధ్యే పరిణత శరచ్చంద్రవదనా |
ధనుర్బాణాన్ పాశం సృణి మపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః పురమథితు రాహో పురుషికా ||

గణగణమని మ్రోగుతున్న చిరుగంటలతో కూడిన మొలనూలు కలదీ, గున్న ఏనుగు కుంభస్థలాలతో సాటివచ్చే కుచముల భారంచే కాస్త ముందుకు వంగినదీ, సన్నని నడుము కలదీ, శరత్కాల పూర్ణచంద్రుడి వంటి నెమ్మోము కలదీ, చెరకు వింటిని, పుష్పబాణాలను, పాశాన్ని, అంకుశాన్నిచేతుల్లో ధరించినదీ, త్రిపురాలను మట్టుపెట్టిన శివుడి శౌర్యస్వరూప ఐన భగవతీదేవి మా ఎదుట సుఖాసీనయై ప్రత్యక్షమగుగాక!.

సౌందర్యలహరి
8 శ్లో|| సుధాసింధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే|
శివాకారే మఞ్చే పరమశివపర్యజ్కనిలయామ్
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ ||

తల్లీ! పాలకడలి నడుమ నెలకొన్న రత్నాల దీవిలో, కల్పవృక్షాల వరుసతో చుట్టబడినదైన కదంబచెట్ల పూలతోటలలో చెలువొందే చింతామణులతో నిర్మితమైన గృహంలో, పరబ్రహ్మ అయినటువంటి పరమశివ పర్యంకనిలయవై, మంగళరూపమైన ( త్రికోణపు) పానుపుపై, నిరతిశయానంద ప్రవాహ స్వరూపిణివైన నిన్ను కొందరు ధన్యులుమాత్రం సేవిస్తున్నారు. (అందరికీ సామాన్యంగా నీ సేవ లభించదని భావం).