ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ
శ్రీ మాత్రే నమ:
58వ సర్గ (వాల్మికి రామాయణములోని 169 శ్లోకాల తెలుగు వచస్సు)
("జాంబవంతుడు అడుగగా హనుమంతుడు లంకకు బయలు దేరినది మొదలు జరిగిన విషయములు చెప్పుట ")
మహేంద్ర పర్వతముపై హనుమంతుని రాక కొరకు హనుమంతుని తెచ్చే సందేశము కొరకు వేచి వున్నారు. హనుమంతుని సింహ నాదముతొ దిగులుగా ఉన్న వానరులందరికి ఉత్స్చాహము ఏర్పడెను సంతోషముతో గంతులు వేసెను
హనుమంతుడు పర్వతముపై దిగిన వెంటనే వానరులందరూ జాంబవంతుడు, అంగదుడు కలసి ఆహ్ఫానిమ్చెను. పరస్పరము కల్లుసుకొని మిక్కిలిసంతోశము పొందెను అక్కడ ఉన్న శిలలపై అందరు విశ్రాంతి తీసుకొనెను. ప్రీతి సంహృష్టుడగు జాంబవంతుడు ప్రీతి మంతుడైన ఆ పవనందనుని జరిగిన కార్యమును గూర్చి వృత్తాంతము అడిగెను.
ఓ మహాకపి నీవు సీతను ఎట్లు చూచితివి? ఆమె అక్కడ ఎట్లు వున్నది? క్రూర కర్ముడగు ఆ లంకాధీసుడు ఆమె విషయమున ఎట్లు వ్యవహరించు చున్నాడు? ఈ విషయమున్తయు నీవు మాకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పుము.
ఆమెను నీవు ఏవిధముగా వెతికితివి ? ఈవిషయము లన్నింటిని మనము ముందు చేయవలసిన కార్యక్రమమును
గూర్చి తిరిగి ఆలోచిన్చేదము? కిష్కిందకు మనము ఎ విషయము చేయవలెను? దేనిని దాచవలెను? నీవు బుద్దిమంతుడవు కావున ఈ విషయము లన్నింటిని వివరించి చెప్పుము .
జామ్బవంతునిచే నియుక్తుడైన హనుమంతుడు సంతోషముతో శ్రీ సీతాదేవికి శిర:ప్రణామమును చేసి ప్రత్యుత్తర మోసంగెను
నేను ఏకాగ్రతతో మీరందరూ చూస్తున్నప్పుడు మహేన్ద్రపర్వతము నుండి ఆకాశమునకు ఎగిరితిని. నేను వెళ్ళు మార్గమున విఘ్న్రరూపమున ఒక సువర్ణ శిఖరము అడ్డుగా నిలబడి ఉండెను. వెంటనే నేను నా ప్రయాణమునకు విఘ్నమని తలంచి బ్రద్దల కొట్టవలెనని అనుకొంటిని . నేను నా వాలముతో ప్రహారము చేయగా సూర్యసన్నిభమైన దాని శిఖరము వేయి విధములుగా వ్రక్కలాయెను
నా ప్రయత్నం అర్ధం చేసుకొని ఆ మహాగిరి ఈ విధముగా పలికెను. పుత్రా యని మధురముగా పలికి నా మనస్సుకు మిక్కిలి ఆనందము కలిగించుచూ ఇట్లు పలికెను
నేను నీకు పినతండ్రిని, నీ తండ్రి యగు వాయుదేవునకు స్నేహితుడను నాపేరు మైనాకుడు. నేను ఈ సాగారమందు నివసించు చున్నాను
పూర్వము పర్వతములకు రెక్కలు ఉండేవి, అవి అకాసమున తిరుగుతూ ప్రజలను భాదించు చుండెను ప్రజల ఆర్తనాదములు మహేంద్రుడు పర్వతాల రెక్కలను తన వజ్రాయుధముతొ చేధించెను. నేను మాత్రము మహాత్ముడగు నీ తండ్రిచే తప్పింప బడితిని.
వత్సా నీ తండ్రి యగు వాయుదేవుడు నన్ను ఈ సముద్రములో
పడవేసేను. జయరిందమా శ్రీ రామ చంద్రునకు నేను కుడా సహాయము చేయవలసి యున్నది. శ్రీ రాముడు ధర్మాత్ముడు మహేన్ద్రునితో సమాన మైన వాడు.
మహాత్ముడైన మైనాకుని మాటలు విని నా కార్యమును నివేదించితిని అప్పుడు నా మనస్సు ముందుకు వెళ్ళుటకు ఉత్సాహపడు చుండెను. అమహత్ముడైన మైనాకుడు కూడా నాకు అనుజ్ఞనిచ్చెను. ఆ
పర్వతము తన మానుష శరీరముతొ మాయమయ్యెను. తిరిగి నేను మంచి వేగముతో మిగిలిన మార్గము ప్రయాణము చేయుట ప్రారంభిం చితిని నేను చాలాసమయము వరకు వేగముగా ప్రయాణముచేయ సాగితిని.
సముద్ర మద్య భాగమున నాగామాతయగు సురసనయనను దేవత కన్పించేను ఆ సురసా దేవి నాతొ ఇట్లు పలికెను. ఓ హరిసత్తమా నీవు నాకు భక్షణముగా ప్రసాదింప బడితివి కావున నేను నిన్ను భక్షిమ్చెదను. నీవు ఆహారముగా దేవతలచే కల్పించ బడితివి.
నేను సురస మాటలకు వివరణ వదనుడనై ప్రాంజలి ఘటించి ఆమె ఎదుట నిలబడి ఇట్లు పలికితిని.
ఓ దేవి శ్రీ మంతుడును నగు శ్రీ రాముడు తన సోదరుడగు లక్ష్మణుడి తోను, సీతాదేవితోడను దండకావనమును ప్రవేసించిను. రావణుడను దురాత్ముడు ఆ శ్రీ రాముని భార్యయగు సీతాదేవిని అపహరించినాడు. శ్రీ రాముని యాజ్నపై ఆమె యోద్దకునేను దూతగా పోవుచున్నాను. నీవు శ్రీ రాముని రాజ్యమున నివసించు చున్నవు. కావున అతనికి సహాయము చేయడగియున్నావు లేదా సీతాదేవిని చూచి అక్లిష్కకర్ముడగు రాముని గూడా తరువాత దర్శించి నీ ముఖమున పడ గలను. నీకు నిజముగా ప్రతిజ్ఞ ప్పూర్వకముగా చెప్పుచున్నాను.
అప్పుడు సురస నాకు ఆహారమైన ఎ ప్రాణి కుడా నన్ను అతిక్రమించి ముందునకు పోజాలదు. ఇదినాకున్నవరము అని పలుకగా నేను దశయొజనములు శరీరమును పెంచితిని, వెంటనే సురస కూడా నా ప్రమాణము కంటే పెద్దగా పెంచెను
ఆమె ముఖమట్లు విశాలముగా తెరుచుకోనగా నేను నా శరీరము చిన్నదిగా చేసి అంగుష్ట ప్రమానముగా మారి సురస నోటిలోనికి ప్రవేశించి తక్షణమే బయటకు వచ్చి వేసితిని అప్పుడు సురస నాతో నిజరూపమున ఇట్లు పలికెను
ఓ కపిశ్రేష్ట నీవు కార్యసిద్దికోరకు సుఖముగా ప్రయాణము సాగించుము విదేహుని కూతురగు సీతాదేవిని మహాత్ముడగు రామునితో కలియునట్లు చెయ్యుము. ఓ మహా బాహువగు వానరా సుఖముగా వర్ధిల్లుము. అప్పుడు సకల భూతములు సాదు వాదములు పల్కి నన్ను ప్రసంసించేను. నేను దశదిశలు చూడగా నా గతిని ఆపు చేసిన దేదియో నా కిక్కడ కన్పించుట లేదు. అప్పుడు నేను ఇట్లా అలొచించినాను. నా గమనమునకు విఘ్నము కల్గుతున్నది కాని విఘ్నం కల్గించు రూపమ్ము ఏమియు కన్పించుటలేదు. అట్లు ఆలోచించు చుండగా క్రిందకు నా చూపును సారించాను. అక్కడ నీటి పై పరుండిన భయంకరమగు ఒక రాక్షసి కన్పించెను. ఆ రాక్షసి నన్ను ఆకర్షిమ్చు తూ నన్ను లాగుతున్నది, నిర్భయముగా నీతో ఇట్లు పల్కెను.
ఓ వానరా ఎక్కడకు పోవుచున్నావు ? ఆకలి గొన్న నాకు ఆహారము అవుము, చిరకాలము నుండి ఆహారవర్జితమైన నా దేహమును సంతోష పెట్టుము. మంచిది అని నా శరీరమును పెంచినాను, ఆమె ముఖము కూడా నన్ను మింగేటట్లు పెద్దగా పెంచెను. నా విసాలమగు రూప మును మార్చి అతి చిన్నదిగా చేసి ఆమె గుండెలో చేరి నా వాడియైన గూళ్ళతో మర్మావయవములను చీల్చి ఆకాసము లోనికి ఎగిరితిని అపుడు ఆమె హృదయము పగిలి లవణ సముద్రముపై అది చని పోయెను. అప్పుడు ఆకాశ సంచారులు సింహిక అను రాక్షసి అవలీలగా హనుమంతుని చేతిలో మరణించినది అనెను
ఆమెను చంపినతర్వాత చాలాదూరము ప్రయాణము చేసి పర్వతాలన్క్రుతమైన సముద్రతీరమున ఉన్న లంకా పట్టనమును చూచితిని అక్కడ పర్వతము పై ఉండి సూర్యుదు అస్తమించువరకు ఉండి రాక్షసులకు తెలియకుండా చిన్న రూపములో లంకలోకి ప్రవేసించ బోతున్నప్పుడు మేఘమువలె ఉన్న ఒక స్త్రీ నా ఎదుట ప్రత్యక్షమయ్యెను
అమెకేశములు మండుచున్న అగ్నివలె నేర్రగా ఉండెను. ఆమె నను చంపుట గమనించి నేనే ముష్టిఘాతముతో ఆమెను ప్రహరించి ఆమెను జయించి ప్రదీప కాలమున లంకలో ప్రవేశించబోయాను. అప్పుడు ఆమె నాతొ ఇట్లన్నది. ఓ వీరా నేను లంకా నగారిని నీ పరాక్రముచే నిర్జితురాల నైతిని నన్ను జయించితివి కనుక నీవు మొత్తము రాక్షసులను సంపూర్ణ ముగా జయించ గలవు అనెను.
ఆ నగరమంతా తిరుగుచూ రావణ అంత:హపురమున జానకిని కానలేక పోయినాను నేను చాలా దు:ఖించినాను అప్పుడే బంగారు ప్రాకారముతొ చుట్టబడిన గృహమును చూసాను, దానిని దాటిన తర్వాత వనమును చూసినాను అక్కడ ఒక గొప్ప అశోక వృక్షము వుండెను అక్కడ సింసపా వృక్ష మునకు సమీపము ననే సర్వాంగ సుందరి యగు సీత యగు
పించెను
యౌవన మద్యస్త్ధమును కమల పత్రముల వలె విశాలమైన నేత్రములు గలదియును ఉప వాసముచే కృసిమ్చిన మేముగలదియును ఏక వస్త్రమును దుమ్ముచే మాసిన కేశ పాసము గలదియును, శోక సంతాపములచే వివర్ణమైన శరీరము కలదియును భర్త్రుహిత పరాయణ యును, వికృతా కారముగల క్రురు రాండ్రగు రాక్షస స్త్రీలచే రక్త మాంస ములను భుజించు ఆడుపులులచే చుట్టు ముట్ట బడిన లేడివలే పరివేష్టి0ప బడినదియును, రాక్షస స్త్రీల మద్యన ఉన్నదియును వారిచే బెదిరింపబడు చున్నదియును, ఏక వేణిని ధరించినదియును ధీనురాలును, భర్తుచింతా పరాయణము హిమహతమైన పద్మలతవలె వన్నెదరిగిన అంగములు కలదియును, రావణుని వలన ఎట్టి ప్రయోజనుమును ఆసిమ్చనదియును మరణిమ్చవలెనని నిశ్చయమునకు వచ్చినదియును అగు సీతను చాలావేగమున ఆమె సీతా అని గుర్తించ గలిగినాను. రామపత్నియగు సీతను ఆ స్థితిలో చూచుచూ అక్కడనే యశోక వృక్షముపై ఉండి పోయాను.
ఇంతలొ రావణుని భవణమునందు కాంచీధ్వని కాలియందెల చప్పుడు కోలాహలము వినిపించెను అప్పుడు నేను గాబరా పడి రూపమును తగించుకొని పక్షి రూపమున దట్టమైన ఆవృక్షము మీద ఉన్నాను. అప్పుడు సీత ఉన్న చోటుకి రావణుడు భార్యలతో వచ్చెను.. అప్పుడు సీతాదేవి తన ఊరువులను గట్టిగా ముడుచు కొనిస్తనములను చేతితో కప్పు కొని కూర్చుండెను
అప్పుడు భయముతో ఉన్న సీతతొ రావణుడు ఓ భామిని నన్ను ఎక్కువగా నాదరిమ్పుము అని పల్కెను. ఓ గర్వంతురలా నీవు దర్పముచే నన్ను అభినందింప కున్న రెండు మాసముల తరువాత నీ రక్తమును త్రాగగలను
దురాత్ముడగు రావణుని మాటలకు సీత ఈ విధముగా పల్కెను. ఓ రాక్షసాదిమా "అమిత తేజస్సుగల రామునికి భార్యయును, ఇక్ష్వాకువంశ ప్రభువగు దశరధునికి కోడలును నగు నన్ను కూయరాని కూతలు కూయు నీ జిహ్వా ఊడి ఏల నేలపై పడలేదు? ఓ అనార్య నా భర్త దగ్గర లేనప్పుడు అపహరించి తెచ్చిన నీకు గల పరాక్రమ మేమి ? నీవు మహాత్మునికి కన్పిమ్పనేలేదు అట్టి పిరికి పంద వగు నీవు రామునితో నెలా తులతూగెదవు" .
రామునికి దాస్యమాచరించే యోగ్యత కూడా నీకు లేదు, శ్రీ రాముడు అజేయుడు, సత్య వచనుడు, సూరుడు, రణములయందు స్లాఘింప బడిన వాడు.
జానకి మాటలకు రావణుడు జితాగ్ని వలే మండుచు నేత్రములు త్రిప్పుచూ పిడికలు బిగించి చంపుటకై ఉద్యమించెను.
అప్పుడు స్త్రీ లందరూ హ హా కారములు చేసిరి ఆ స్త్రీల మద్య నుండి ఆ దురాత్ముని భార్యయగు మండోదరి వచ్చి అతనిని అడ్డు కొనెను. కామ పీడితుడైన అతనితో మృదు మధురముగా మాటలు పల్కేను
దేవెంద్రునితో సమానమైన పరాక్రమము గలవాడవు, నీకు సీతతొ పనియేమి? నాతొ రమిమ్పుము. సీత నా కంటే ఎక్కువ అందకత్తె కాదు. దేవ గంధర్వ కన్యలతో రమిమ్పుము. సీత నెల యాసిమ్చెదవూ? అప్పుడు ఆ స్త్రీలందరూ కలసి మహా బలసాలియగు నిశాచరుని లెవదీసుకొని రావణ వణమునకు వెంటనే తీసుకొనిపొయెను
రావణుని ఆజ్ఞప్రకారము వికృతమైన మోముగల రాక్షస స్త్రీలు కూరములు, దారునములు, నగు పల్కులతొ సీతను మిక్కిలి బెదిరించెను. కాని సీతాదేవి మాత్రము వారి పలుకులను గడ్డి పోచక్రింద తీసుకొనెను. వారు చేసిన గర్జనలు కుడా సీత వద్ద నిరర్ధక మయ్యెను. కొందరు సీతను కష్టపెట్టు చుండిరి, మరికొందరు రావణుని వద్దకు సీత విషయము చెప్పుటకు వెల్లిరి. చేయునది ఎమీ లేక చివరకు వారు నిద్రకు వసులైనారు. అప్పుడు సీత మిక్కిలి దు:ఖముతో విలపించెను.
వారి మద్య లో త్రిజట లేచి ఇట్లు పలికెను. నేను ఈ రోజు రోమ హర్షమైన ఒక స్వప్నము చూచితిని. అది రాక్షుల వినాసమును, ఈమె భర్త యొక్క విజయమను చూచినాను. మనమందరమూ ఈమెను కష్టపెట్ట కుండా క్షమాభిక్ష పెట్టమని కోరుకుందాము . ఈమే రాఘవుని నుండి రాక్షస గణమును రక్షించ గలదు.
అప్పుడు సీత త్రిజట మాటలు విని భర్తయొక్క విజమును గూర్చిన హర్ష పు వాక్కులు వినెను. ఇది సత్యమే యైన నేను మిమ్ములను రక్షిమ్చగలను అని పల్కెను .
నేను ఆమె భాదను తొలగించుటకు ఇక్ష్వాకు వంశమును గూర్చి ప్రసంసించితిని ఆమాటలు విని నీవెవ్వడవు, ఎవ్వనిచే పంపపడితివి, ఓ వానర శ్రేష్ట ఇచ్చటకెట్లు వచ్చితివి? నీకు రామునిపై గల ప్రీతికి కారణమేమి? నీవు సత్యవచనములు తెలియ పరుచుము అనెను
నేను ఆ మాటలు విని ఇట్లు పలికెను. నేను సుగ్రీవునివద్ద మంత్రిని, సుగ్రీవుదు రామునితోస్నేహము చేసినాడు, రామదూఅగా నేను ఇక్కడకు వచ్చినాను నా వద్ద ఉన్న శ్రీ రాముడు ఇచ్చిన అంగులీకమును చూపి నమస్కరిస్తూ దీనిని నీకు శ్రీరాముడు ఇమ్మని చెప్పినాడు, నీ యాజ్ఞ కొరకు వేచియున్నాను, నేను చేయదగినది తెలుసుకోన కోరుచున్నాను, నిన్ను రామ లక్ష్మణుల వద్దకు నా వీపుపై తీసుకొని వెల్లెదను, నీ వేమి యందువు? అని పలికి నిలుచొని ఉన్నాను
జనక నందిని యగు సీత నా ఈ వచనములు విని బాగుగా ఆలోచించి యిట్లు పలికెను. రాఘవుడు రావణుని సంహరించి నన్ను తీసుకొని పోవుట న్యాయము కదా, నేను నీతొ వచ్చుట ధర్మము కాదు.. పూజ్యు రాలైన సీతాదేవికి ప్రణామమును చేసి అభిజ్ఞానమును యాచించితిని. అప్పుడు సీత ఇది ఉత్తమ మయినది అని చెపుతూ సందేశమును కూడా ఇచ్చినది. నేను బయలు దేరునప్పుడుమరలా ఇట్లు పలికెను. ఓ హనుమా రాఘవునకు నావార్తను తెలిపి సుగ్రీవ సహితముగ వచ్చి రావణుని సంహరించి నన్ను తీసుకొని వెల్లే విధముగ నా భాదలు చెప్పి కొంచము పుణ్యము కట్టు కొనుము అన్నది, హనుమా వేరొక విధముగా జరిగినా రెండు మాసములు మాత్రమె నేను జీవించెదను. ఆపై రాఘవునికి నేను అగుపించను. అనాధవలెమృత్యవాత పడెదను. అన్ని విషయములు రామునకు చెప్పగలవని కోరుచున్నానను. ఆమాటలకు నాకు కోపం వచ్చినది, నేను చేయ వలసిన కార్యశేషమును గూర్చి ఆలొచించితిని.
నేను నాశరీరమును పెద్దదిగా చేసి బంగారు తీగల్ల మెరుస్తున్న వనమును ధ్వంసము చేయదలచి నాశనము చెసితిని, నిద్రనుండి లేచిన రాక్షస స్త్రీలు నన్ను చూసి భయము చెంది వన విధ్వంసమును గూర్చి రావణునికి చెప్పిరి. రాక్షస స్త్రీల మాటలకు రావణుడు కోపముతో బహుదుర్జయులను నగు కింకరులను రాక్షసులను, ఎనుబది వేలమంది సైనికులను నాపై యుద్దమునకు పంపెను. వారి నందరిని మట్టు పెట్టితిని, పెక్కబలము గలవారు రావణుని వద్దకు పపోయి కింకరులు సైన్యము హతమైనట్లుగా చెప్పెను.
అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చెను అక్కడ దగ్గరగా ఉన్న చైత్యప్రాసాద మును పగలగొట్టి, అక్కడ కాపలాకాయుచున్న నూరు మంది సైనికులను ఆ స్థంభముతోనే హతమార్చితిని.ఆ తరువాత రావణుడు జంబుమాలిని ఘోర రాక్షసులను నాపై పంపెను, వారిని నేను పరిఘతో తోనే తుదముట్టించితిని. తరువాత మంత్రి పుత్రులను పంపగా వారిని యమపురికి పమ్పినాను. రావణుడు కోపముతో 5గురు సేనాధి పతులను పంపెను వారిని కూడా నేను సైన్యముతో సహా అందరిని సంహరించితిని.
దశగ్రీవుడు బాగుగా అలోచించి తన కుమారుడైన అక్షకుమారున్ని నాతో యుద్దము చేయుటకు పంపెను. అతడు రణమున పండితుడు, నాతో సమానముగా యుద్దము చేయు చున్నాడు, చిన్న వాడైన పెద్ద వాడిగా నాతొ యుద్దము చేసెను. అప్పుడు నేను అతడు ఆకాసమున ఎగురు చుండగా అతని పాదములు పట్టి వంద సారులు త్రిప్పి నేలపై చూర్ణ మగునట్లు కొట్టగా అతడు మరణిమ్చెను. రావణుడు తన పెద్ద కుమారుడు ,తనంత బలము, దైవశక్తి ఉన్నా మేఘనాదుడ్ని యుద్దమునకు ప్రోస్చహించెను. కొన్ని నీతి వాక్యములు చెప్పి నన్ను యుద్దములో జయించి విజయము సాధించ వలెనని దీవించి నాపైకి పంపెను.
అతడు ధర్మపరుడు, బలవంతుడు, అస్త్ర శస్త్రములలో ఆరి తేరినవాడు, నా పైన అద్భుతంగా యుద్దము చేసెను, ఆటను ప్రయోగించిన అస్త్రములన్ని వ్యర్ధమైనట్లు గా భావించి నామీద బ్రహ్మాస్త్రము ప్రయోగించెను. బ్రహ్మ మీద గౌరవించి నేను క్రింద పడిపోయాను, రాక్షసులు నన్ను త్రాల్లతో కట్టి రావణుని వద్దకు బలవంతముగా తీసుకొని వెళ్ళెను.
రావణుడు నన్ను చూసెను, నేను రావణున్ని చూసాను, రావణుడు తన మంత్రులచేత నా రాక గూర్చి ప్రశ్నిమ్చమని ఆజ్ఞ వేసెను. వారు నా లంకనగరము వచ్చుట, యుద్దములో రాక్షసులను వధను గురించి నన్ను అడిగెను. అప్పుడు నేను రావణునికే సమాధాను చెప్పను. ఇది అంతయు సీతార్ధముగ నేను చేసాను, ఓ రాజ నేను ఆమె దర్సనముకోరి నీ యింటికి వెతుకుచూ వచ్చాను, సీతను చూసాను, నేను వాయుదేవుని ఔరస పుత్రుడను, నా పేర హనుమంతుడు. నేను సుగ్రీవుని వద్ద మంత్రిని. నేను శ్రీ రాముని దూతగా నీ దగ్గరకు వచ్చాను. నేను చెప్పే ధర్మార్ధ సహితమైన, హిత వాక్యములను వినవలెను.
ఓ రాక్ష్సేస్వారా హరీస్వరుదు అగుసుగ్ర్రివుడు ఏకాగ్రత పూర్వకముగా చెప్పిన వాక్యమును నేను నీకు చెప్పు చున్నాను, సుగ్రీవుడు నీ క్షేమసమాచారము అడిగినాడు రామునకు సుగ్రీవునకు స్నేహము కుదిరెను. వారు ఒకరి కొకరు ప్రతిజ్ఞ చేసికొనెను, రాముడు తన భార్య రాక్షసునిచే అపహరింప బడెను సహాయము చేయమని కోరెను, సుగ్రీవుడు వాలిని వధించి వానర రాజ్యము ఇప్పించమని కోరెను.
ఇరువురు అగ్ని సాక్షిగా వప్పందము కుదుర్చుకొనెను.నీకు ముందే తెలుసు వాలి, అట్టి వాలిని ఒక్క భాణముతో వధించెను, సుగ్రీవునకు వానరాజ్యము ఇచ్చెను, సుగ్రీవుడు సీతను వెదుకుటకు నలుదిక్కులా వానరులను పంపెను, నేను దక్షణ దిక్కున లంకలో సీత ఉన్నట్లు తెలుసుకొని వచ్చాను, నేను సీత కొరకు రాక్షసులను వధిన్చాను, వానర వీరులు వచ్చి నిన్ను, నీ రాక్షసులను వధించక ముందే సీతను తీసుకువెల్లి రాఘవునకు అర్పిమ్పుము. అన్న మాటలకు రావణుడు కోపముతెచ్చుకొని తీవ్రముగా నన్ను చూసెను.
దురాత్ముడైన రావణుడు నన్ను వదిమ్చమని ఆజ్ఞాపించెను. ఆమాటలకు అతని సోదరుడు విభీషణుడు చాలా మేధావి, ఓ రాజా నీ ఆజ్ఞ రాజశాస్త్రములలొ ఎక్కడా దూత వధ అనేది లేదు. దూత వధ సమర్ధనీయము కాదు అని తెలియపరిచి రాక్షస ప్రభువుని క్షమా భిక్షను నా కొరకు కోరెను.
రావణుడు విభీషణుని మాటలను గౌరవించి లంగూలమును ధహిమ్పుడు అని ఆజ్ఞాపించెను. అప్పుడు రాక్షస వీరులన్దరు నా తోకకు నిప్పు పెట్టి లంక నగరమునా త్రిప్ప సాగెను. నేను వచ్చిన పని సఫలమైనది ఇంకా లంకానగరము దగ్ధము చేసి తిరిగి వెల్లెదను అని తలంచినాను, నా రూపమును చిన్నది చేసి కట్టులు ఊడగా నా రూపాన్ని పెద్దదిగా మార్చి లంకా నగరంలోని భవణాలకు అగ్నిని పంపి దహింప చేయగా దానికి గాలి తోడై లంకా నగరము దగ్దము చేసెను,నేను సముద్రములో తోకను చల్లార్చుకొన్నాను, అప్పుడే నేను సీతకు రక్షణను కల్పించకుండా స్వామివారికి ద్రోహం చేసానని భాదపడినాను, అప్పుడే చారణులు మాటలలో శుభ వార్తను నేను విన్నాను. సీత దగ్దము కాలేదు అన్న మాటలు.
అప్పుడు సంతోషముతో ఆలోచించాను, నావాలము దాహించక చల్ల గా ఉన్నది, సీతాదేవే అగ్ని ఒక అగ్ని వేరొక అగ్ని దాహించదు, ఆమె ప్రతివ్రత ఆమె బ్రతికే ఉండును అని భావించి వెనక్కు ఆమె ఉన్న చేట్టు వద్దకు వెళ్లి ఆమెకు నమస్కారము చేసి ఆమె ఇచ్చిన సందేశమును తీసుకొని మిమ్ము చూచుటకు అరిష్టపర్వతమునుండి ఆకాశ మార్గములో ప్రయాణించి మీ రంద్దరున్న ఈ పర్వతము వద్దకు వచ్చాను, మిమ్మలన్దర్నీ చూడగలిగాను. శ్రీ రాముని యనుగ్రహము వలన మీ అందరి ప్రతాపమువలన, సుగ్రీవుని కార్యార్ధనై నేను నిది యంతయు ఆచరించితిని. ఇది యంతయు నేన్నక్కడ యదొచితముగా నెరవెర్చితిని. నేను చేయగా మిగిలిన కార్యము నంతయు మీరు పూర్తి
చేయ గలరు. సీతను చూసాను అన్న వాక్కులు హనుమంతుని నోటివెంట విని ఆనంద పారవశ్యములో మునిగి పోయారు అందరు .
సుందరకాండ 58వ సర్గము సమాప్తము

No comments:
Post a Comment