Sunday, 29 May 2016

సుందరకాండ - సుందర తత్త్వం - daily serial (1)

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ: - 
ప్రాంజలి ప్రభ - సుందర తత్త్వం -
సర్వేజనా  సుఖినోభవంతు 


హనుమజయంతి సందర్బముగా సుందరకాండ వచస్సును ప్రతిఒక్కరికి అర్ధం అయ్యే విధముగా హనుమంతుని సహాయముతో నేను వ్రాయుట ప్రారంభించినాను, ప్రతి ఒక్కరికి " సీతారామాంజనేయ" కృపాకటాక్షాలు అందాలని ఆశిస్తున్నాను, ఎందఱో మహానుభావులు అందరికి వందనములు. 
 
ఆదికవి వాల్మీకి రచించిన ప్రతి శ్లోకం భావాన్ని ముందు పొందు పరుస్తున్నాను, అది కూడా చివర "ను" అనే అక్షరంతో వ్రాయటం జరిగింది, సుందర తత్వాన్ని మాత్రం నేను వర్ణించు కుంటూ వస్తు న్నాను, తప్పులుంటే తెలుపగలరు, ప్రతి ఒక్కరు చదివి  చదవమని చెప్పగలరు, అందరూ హనుమంతుని కృపకు పాత్రు లగుదురు, ఇది ఖశ్చితము, నేను సంవస్చరము నుండి నా బ్లాగులో వ్రాస్తున్నాను, ఇప్పుడే వెబ్సైటు ఫేస్ బుక్ ద్వారా   అందరికి తెలిపి సీతారామాంజనేయ కృపకు పాత్రులుకాగలరని ఆశిస్తున్నాను. 
    
సుందరకాండ - సుందర తత్త్వం - తెలుగు వచస్సు ( 1వ సర్గము ) 

అసంఘటితమైన శక్తిఉన్నా హనుమంతుడు అణిగి మణిగి ఉండి, అందరి ఆదరణ పొందుతూ, తన్ను ఆదరించి తన కర్తవ్యాన్ని భోధించిన, రాముని కార్యమును సఫలీకృతము చేయటకు, నిగ్రహ శక్తితో మహేంద్ర గిరి పర్వతముపై ఉండి, చేయ వలసిన కార్యమును ఆలోచిస్తూ ఉండగా తన తోటి వానరు లందరూ బాధలో ఉండుట గమనించెను.

****

  
* (1)(  కార్యము సాధించ గలమని ప్రతి ఒక్కరికి, నిగ్రహ శక్తి ఉండాలి అందరకు, నమ్మకము, ఆత్మ విశ్వాసము  ఉండాలి ).

జాంబ వంతుడు, వానరులందరు, కలసి  సీతాన్వేషినిమిత్తం దక్షిణ దిక్కు అంతా చూసినను సీత జాడ కనుగొన లేక పోయెను,  వానరరాజు, ఇచ్చిన సమయము మించి పోయినది, ముందుకు పోవు మార్గము లేక, వెనుకకు పోలేక,  దిగులుతో అందరూ ప్రాణార్పణం చేయ తలంచెను.

 *(2) అవేశము లో ఉన్నప్పుడు ఆలోచనా శక్తి నశించును, చేతకాని వారిగా మార్చును)   
(*) అను భవజ్ఞులు చెప్పేమాటలు ఆలకించి అనుకరించ వలెనని తెలియ బడుతుంది 

అందరితో అంగదుడు, జటాయువును తలస్తూ విలపించసాగెను, కార్యార్దమై జటాయువు భాత్రు (అన్న) సంపాతి అంగదుని కలిసెను,

సంపాతి దక్షిణదిక్కున లంకలో సీత రావణుని బందీలో ఉందని చెప్పెను,  అందరు కలసి, సముద్ర వడ్డుకు చేరి సముద్రాన్ని దాట తలచెను.

 *3 ( ఆశించిన పనికి దేవుడు సహాయము చేస్తాడనుటకు ఇది ఒక నిదర్సనం, నాయకుడనేవాడు పలువిధాలుగా అలోచించుటవల్ల  మంచి వారికి మంచే జరుగును అని ఒక నిదర్సనం ఆలోచనలు కుడా మంచిగా వచ్చును  )      

సంపాతికి సీత జాడ తెలుపగా రెక్కలు వచ్చి వెళ్ళేను, వానరులు సముద్రాన్ని దాటగల శక్తి గూర్చి తెలుపెను,  అంగదుడు, జాంబవంతుడు సంశయములో పడెను,  సముద్రాన్ని దాటుటకు అందరు  హనుమంతుని ప్రేరేపించెను.

4* ( శక్తిని మించిన కార్యమని తలచుట సహజము, పెద్దల మాటను అనుకరించుట ఇంకా అవసరము, ఎవరి శక్తి వారు తెలుపుట కూడా  ఒక అవసరము, అందుకే జాంబవంతుడు హనుమంతుని శక్తి తెలిసినాడు కనుక ప్రేరేపించుటకు ముందు వచ్చును, పెద్దలను గౌరవించ టం వల్ల సీతాన్వే షనకు మార్గము సులభమాయెను)      
(*)ప్రోత్సాహం కొండంత   బలం అని తెలుపుతున్నది, ఏ పరిస్థితులలోను నిరుత్సాహ పరచకూడదు . 
రామనామ జపంతో, హనుమంతుడు మహేంద్రగిరిపై ఉండెను, జాంబవంతాదులందరూ కలసి హనుమంతుని పొగడెను తనశక్తి తనకే తెలియక ప్రొత్సాహముతో  శక్తిని పెంచుకొనెను, చారులు సంచరించే మార్గానా సముద్రంపై పోవుట నిశ్చయించెను.

*(5. పసి పిల్లవానికి  పాలు త్రాగితే ఎంత సంతోషమో, రామనామ జపమే హనుమంతునకు అంతకన్నా ఎక్కవ సంతోషము, తనలో ఉన్న ఆత్మ తేజాన్నిఉత్తేజ పరిస్తే ఎటువంటి వారైన కార్యసాదకులుగా మారుతారు, ఓం శ్రీ రామ్ , ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ అంటూ ఆధారము లేని గగన మార్గం ఎన్నుకోవటం ఒక నిదర్సనం, ఆధారము లేక పోయినా సాధించగలమని తపన ఉండుటే ఇందులో నీతి) 


                                                                                                   ( 1వ సర్గము - ఇంకా ఉంది  )


*****


 సుందరకాండ - సుందర తత్త్వం - తెలుగు వచస్సు ( 1వ సర్గము - ఇంకా ఉంది  )

* పచ్చిక బీల్లపై ఉన్న హనుమంతుడు ఆకు పచ్చని వర్ణముతోను, పచ్చిక బీల్లపై ఉన్ననీటి బిందువులు వైడూర్యమణుల    వలే మెరుపులతోను, దూరముగా ఉన్న  జలము పై సూర్య కిరణాల ప్రభావ వెలుగులతోను, ధీరుడైన హనుమంతుడు మహేంద్రగిరిపై సీఘ్రముగా సంచరించెను.

 *(6) ఏ  శుభకార్యము జరగాలన్న పచ్చటి తోరణాలు కట్టుట, మెరుస్తున్న కాంతి పుంజాలను వ్రెలాడదీస్తూ, పరిశుబ్రమైన జలమును నిలువచేస్తూ, సూర్య కిరణాలతో గాలి ప్రవేసించు నట్లు చేసితే అందరూ హాయిగా సంచరిన్చగలరని వాల్మీకి మనకు భోధించారు )          

* మహేంద్రగిరిపై చిత్రవర్ణములుగల ధాతువుల తోను, యక్షులు, కిన్నరులు, గంధర్వులు, దేవతామూతృల తోను, స్వేచ్చ జీవులుగా సింహాలు, ఉత్తమ గజాల సంచారముల తోను,  హనుమంతుడు మహ హృదయముతో  ఐరావతం వలే ప్రకాశించెను


* (7) ఒక వివాహ వేడుకలో పలురకాలు వస్త్రాలు ధరించిన స్త్రీలు పురుషులు, వేదాలు వల్లించే పండితులు, మంచిగా భుజించే వారు, మంచి చెడుల సంబాషించుకొనే వారు సింహం వాలే అజమాయషీ చేసి ప్రవర్తించేవారు, గజం వలె మొద్దు చాకిరీ చేసేవార్లు    మద్య ఎత్తైన పీఠంపై  నూతన వదూవరులు మహ హృదములో ఐరావతం వలే ప్రకాశిస్తూ ఉండాలనేది ఈ శ్లోకం నీతి)     

^ సకల విద్యలు నేర్పిన గురువు గారగు సూర్యనికి నమస్కరించెను, బాల్యంలో భాధపెట్టిన దేవతల రాజైన ఇంద్రునికి నమస్కరించెను, సృష్టికర్త ఐన బ్రహ్మదేవునకు, సకల భూతములకు నమస్కరించెను.


*(8) ఏపని అయినా చేసేముందు, ప్రయాణానికి  పోయే ముందు,  శుభకార్యము చేసే ముందు ఎవరైనా సరే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాన్నీ ముందుగా ప్రార్ధించాలి, తరువాత తల్లి తండ్రులకు, మనకన్నా పెద్దలైన గురువులకు అధికారులకు ప్రణామాలు చేయాలి, స్నేహితులను, భందువులను  ప్రతి ఒక్కరిని చక్కగా పలకరిస్తూ ముందుకు సాగా లనేదే ఈ శ్లోక భావం)         

* మారుతి కడలిపై గగన సీమలో ప్రయాణం చేయ తలంచెను, మారుతి తూర్పునకు తిరిగి తండ్రి ఐన వాయుదేవునకు నమస్కరించెను, దక్షణదిక్కుకు తిరిగి వెళ్ళుటకు శిరస్సు పైకి ఎత్తి ఆబోతువలె ప్రకాశించెను.


* (9) మనం  చేసే కార్యము ఎంతో  కష్టమని అనుకో కూడదు,  ఎందుకంటే తూర్పునకు తిరిగి ముందుగా తల్లి తండ్రులకు నమస్కరించి మరలా దక్షణ దిక్కుకు తిరిగి చేయవలసిన కార్యమును మొదలు పెట్టి నట్లైతే ఎక్కడలేని శక్తి మీలో  ప్రవేసిస్తుందని, ఎదురు లేకుండా పని సాను కూలముగా జరుగు తుందని ఈ శ్లోక భావం)      

* హనుమంతుడు పౌర్ణమినాడు సముద్రుడు పొంగినట్లుగా శరీరాన్ని పెంచెను, వానరు లందరూ చూచు చుండగా రామకార్యము కొరకు ఆకాశమార్గమున ప్రయాణం చేసెను, 


*(10) సముద్రములో ఎన్నిజీవులున్నాయొ అంతమంది మానవులు శుభకార్యానికి సహకరిస్తారు, ఆ పరిస్తితిలో మనోధైర్యము పెరిగి పిల్లల పెళ్లి మేళ తాళాలతో జరుపుటకు దృడసంకల్పంతో ప్రయాణం చేయాలన్నదే ఇందులో నీతి)   
****** 

సుందరకాండ - సుందర తత్త్వం - తెలుగు వచస్సు ( 1వ సర్గము )3/15

  పాదాల కదలికలకు చెట్లపై ఉన్న పక్షులు భయపడెను, వక్షస్థల ఘాతముతో చెట్లు కూలి పోయెను, సింహం విజ్రుమ్భించి నట్లు విజ్రుం భించగా మృగాలు మరణించెను, మద్యమ జ్వాలలతో కూడిన అగ్ని నుండి ధూమము బయలు దేరెను,          
*(11) శుభ కార్యము జరుగుతున్నప్పుడు ఆకాశ కదలికలు, భూమి కదలిక ఉంటె శుభ సూచకాలని ఇందు మూలముగ తెలియ చేస్తున్నారు, సంకల్ప సిద్దితో ముందుకు పోయేవారి రూపమ్ ఎప్పుడూ  సింహములా ఉంటుంది, కొన్ని మాటలు జ్వాలలుగా మరికోన్నిమాటలు చల్లని జల్లులుగా మానవులను ఆవహిస్తూ ఉంటాయనే గ్రహించాలి,  శుభకార్యాన్ని పడుచేయాలనే దుర్మార్గుల గుండెల్లో సింహ స్వప్నం  ఉండాలనేది ఇందు నీతి)    

కొలుచుటకు శక్యము కానంత పెద్దదిగా శరీరమును పెంచెను, చేతులతోనూ, పాదములతోను, పర్వతమును గట్టిగా నొక్కెను
పర్వతము ఒక్కసారి ఊగగా చెట్లపైఉన్న పూవ్వులన్ని రాలెను, హనుమంతునిపై పుష్పాభిషేకమువల్ల పుష్పముల కొండవలె  ఉండేను.
*(12) శుభకార్యము చేసేవారు ఎవరా అని తెలుసు కోలేని విదముగా లీనమై పోవాలనే విషయాన్ని, ఉస్చాస నిస్వాసాలు మెత్తము కార్యదీక్షపై ఉంచి ఎవరు ఎమన్నా పట్టించుకోకుండా ఉండాలని, పెళ్ళిలో పుష్పాలు పంచుట కూడా  ఇందులో భాగమే,   అందరి దృష్టిలో మహానుభావుడు పూజింప దగిన మహాత్ముడు అనిపించుకోవాలని తెలియ పరిచిన నీతి)   

పర్వతముపై మదించిన ఏనుగులు మదోదకమును కార్చు చుండెను, పర్వతముపై ఉన్న ప్రాణులన్నీ వికృతమైన స్వరముతో అరచు చుండెను, సమస్త వర్ణ శిలలమద్య అగ్ని పుట్టివర్ణ దూమములు వచ్చు చుండెను, భూప్రకమ్పనల మద్య హనుమంతుడు బయలు దేరుటకు నిశ్చయించెను . 


*(13) వివాహమునందు మదించిన వారు అంటే అత్యధికంగా  ధనమున్నదనే గర్వపడేవారు, ఎవరికీ తోచిన విధముగా వారు కల్పించి  కధలు చెప్పుకుంటూ పెళ్లిని వర్ణంచేవారు, కామంతో విర్ర వీగేవారు, నన్నే చూడాలని కేశాలు విరబూసుకొని, అరువు తెచ్చిన నగలు పెట్టుకొని ఆకర్షణ కోసం పాకు లాడేవారు, ఎన్ని తగాదాలు వచ్చిన, ఎన్ని పొగలు వెంబడించిన మనోనిగ్రహ శక్తితో "కర్త"  ఉండాలనేదే ఇందు నీతి)             


తొకలపై స్వస్తిక్ చిహ్నములుగల సర్పములు నిలిచెను, విషము క్రక్కుచూ దంతములతో శిలలను కరచెను, శిలలు అగ్నిజ్వాలకు దగ్ధమై వేయి ముక్కలై ఎగెరెను, గిరిపై ఓషధ చెట్లు ఉన్న, శాంతింప చేయలేక పోయెను.


*(14 ) వివాహ వేదికలో కొందరు పెద్దలు, స్నేహితులు  సహకరిస్తూ సహాయము చేసే విధముగా ఉండాలని, ఓర్వలేవారు, తంపులు పెట్టేవారు ఉంటారు, జాగర్తగా ఉండాలని, హొమంలో సమిధులు ఆహుతి అవుతూ ఆ పొగ అంతా ఆవహించి చెడుని నాశనము చేయ గలదని ఇందు మూలముగా తెలుసుకోగలరు, కొందరు వితండ వాదులు, మూర్కులు, త్రాగినవారు  ఉంటారు, వారిని ఎటువంటి మందు శాంతిప చేయలేదని జాగర్తగా వారినుండి తప్పించుకొని కార్యము చేయాలనేదే ఇందు నీతి)    

భూతాలు పర్వతమును బద్దలు చేయు చున్నాయని తలచెను,  తినుచున్న లేహ్యములు, భక్ష్యములు, మాంసములు విడిచెను,  మునులు, యక్షులు,  విద్యాధరులు వారి స్త్రీలతో పైకే ఎగిరెను , అణిమా సిద్దులుగల విద్యాధరులు హనుమంతుని చూసి ఆరాదించెను
 

*(15) వివాహ వేడుకల లో సన్నాయి మాలములుతో,  కర్ణ ఖటోరమైన శబ్ధములతో బ్యాన్డుమేలములతో, పర్వతాలు బద్దలు చేయు శబ్దాలతో ఊరే గింపులు చేస్తున్నారు,    లేహ్యములు, భక్ష్యములు, మాంసములు భుజించుటకు చేస్తున్నారు  అవి ఆరగించి పెద్ద లందరూ నవ వదువులకు దీవించి ఆసీర్వాదములు  ఇవ్వటమే ఇందు ప్రధానము.
***** 


సుందరకాండ - సుందర తత్త్వం - తెలుగు వచస్సు ( 1వ సర్గము )


మెడలో హారములతోను ,  పాదములకు అందెలతోను, భుజములకు దండ కడియములతో,చేతులకు కంకణముల తోను, విద్యాదర స్త్రీలు ఆశ్చర్యపడుచు, భయముతో తమ ప్రియుల తోను, విద్యాధరులు పర్వతముపై నిలిచి హనుమంతుని గూర్చి సంభాషించెను. 
* (16)వివాహ వేడుకల ఊరేగింపులను  స్త్రీలు పురుషులు అందరూ చూసి,  కొందరు ఇద్దరు ఈడు అనేవారు, మరి కొందరు కాకిపిల్లకు దొండ పండు అనేవారు, మరికొందరు పెద్దలను గూర్చి సంభాషించు  కొనేవారు అనేదే నీతి   

శోభగల హనుమంతుడు భుజమును,  కంఠంను వంచెను, తేజస్సును,వీర్యమును,బలమును, పెంచి ఊపిరి బిగపట్టెను, 
నేత్రములు పెకిఎత్తి, పాదములతో గిరిని అదిమి  పై ఎగెరెను, మహాబలశాలీ, వానర శ్రేష్టుడు చేతులను చేర్చి సముద్రముపై చేరెను   
*(17) ఎవరైనా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళాలన్న, పైకి ఎగరాలన్న హనుమంతుని ద్యానిస్తే తప్పక విజయము సాధించును.

మకరములకు నివాసమైన సముద్రమును దాట దలచెను, పర్వతమువంటి శరీరముగల హనుమంతుడు ఒక్కసారి కదలెను, రోమములు దులుపుకొని, మహా మేఘము వలె ఘర్జించెను , రామునికోరకు, వానరులకోరకు సముద్రముపై లంఘించెను .
(*(18) మనం బయలు దేరేటప్పుడు ఎన్నో అవాంతరాలు వస్తాయి, అయిన వాటిని ఎదుర్కొని  శక్తి మన శరీరములోనే అంతర్గతముగా శక్తి ఉండును, అదే మనకు శక్తిని వాక్కును నిగ్రహించుకొని ముందుకు సాగాలి.)
    
హనుమంతుని సముద్రలంఘనము గగనమునుండి   దేవలోకమునకుపోయిఅక్కడ సీతనువెదికెదను, కానరానిచో లంకకు పోయి రావణుని నగరముతోసహా తే గలగు తాను,  ఆకాశమునుండి వానర వీరులందరికి మారుతి అమృత మాటలు పల్కెను.  గమ్భీరముగా జెప్పుచూ నొక్క యూపు లొ సముద్రముపై కెగసెను.
(*(19)  మనం బయటకు వెల్లేటప్పుడు చేయవలసిన పని ఖచ్చితముగా చేయగలనని అందరికి గట్టిగా నమ్మేటట్లు చెప్పవలెను, మనం చేయలేని పనులుకూడ చేయగలనని చెప్పి అందరికి  ధైర్యము కలిగించి మరీ వెళ్ళవలెను, ఇది గ్రహించ గలరు.)      

అతని తొడల వేగమునుండి వచ్చిన గాలికి చెట్లువ్రేళ్ళతో సహా పైకి ఎగేరెను, దూరమునకు పోవు భందువులను పంపినట్లుగా కొంతదూరము పోయెను, మరలి చెట్లు అన్ని సముద్రములో రెక్కలు తెగిన పర్వతముల వలే పడెను, మహ సముద్ర మంతా పగటి పూట నక్షత్రాలతో నిండిన ఆకాశంవలె ప్రకాశించెను.
(*(20) కొత్తగా పెళ్ళైన వధూవరులతో  అందరూ కలసి కొంత దూరము దాకా నడచి వారు వెళ్ళాక చూసి తర్వాత  వెనుకకు వచ్చుట సహజము, అందరూ ఎవరి ఇంటికి వారు వెల్లుటే ఇది సత్యము. వివాహము చేసుకొనేటప్పుడు తలంబ్రాలు వధూవరులు ఒకరి తలపై ఒకరు పోసుకుంటూ సంతోషముగా ఉండుట  చూసిన వారికీ ఏంతో సంతోషముగా ఉంటుంది, అపుడు అందరు దీవెనలు అందిస్తారు, మేలతాలాలు మ్రోగిస్తారు, దేవతలే దిగివచ్చి ఆసీర్వాదములు పచుతున్నట్లు పెళ్లి పందిరి అంతా ప్రకాశ వంత మైన వెలుగులు విస్తరించును ఇదియే ఈ శ్లోకంలో నీతి)       


*******


సుందరకాండ - సుందర తత్త్వం - తెలుగు వచస్సు ( 1వ సర్గము )

భూతాలు పర్వతమును బద్దలు చేయు చున్నాయని తలచెను,   తినుచున్న లేహ్యములు, భక్ష్యములు, మాంసములు విడిచెను  మునులు, యక్షులు,  విద్యాధరులు వారి స్త్రీలతో పైకే ఎగిరెను, హనుమంతుడు పాద స్పర్స అంత అమోఘం.
*21. మంచివారు మనగ్రామ్గలో ఉనె అంటా మంచి జరుగును అనిభావించాలి, మంచి వారు లేని ప్రాంతము ఎప్పుడూ భూమి ప్రకంపనలు వస్తాయి, తినే ఆహారము దొరకక భాదలు వహించాలసు వస్త్గుంది, వలసి పోయే పరిస్తితి వస్తుంది అది గమనిమ్చుటే  ఈ శ్లోకం నీతి      

మెడలో హారములతోను ,  పాదములకు అందెలతోను, భుజములకు దండ కడియములతో,చేతులకు కంకణములతోను
విద్యాదరస్త్రీలు ఆశ్చర్యపడుచు, భయముతో తమ ప్రియులతోను , విద్యాధరులు పర్వతముపై నిలిచి హనుమంతుని గూర్చి సంభాషించెను.
*22. ధనవంతులు సంపాదించిన ధనములో కొంత బంగారములోకి మారుస్తారు, వాటి రక్షణ కోసం బ్యాంకుల్లో దాచుతారు,  కొందరునిత్యము ధరిస్తూ ఉన్నారు, కాని అనుకోని పరిస్తితిలో దొంగిలించటం జరిగిందని, రక్షణ కాశము అవుతుందని అంటే బంగారము గూర్చి, ధనవంతుని గూర్చి పలువిధాలుగా సంభా షించుకుంటారనేది ఇందు నీతి.
     
శోభగల హనుమంతుడు భుజమును,  కంఠంను వంచెను, తేజస్సును,వీర్యమును,బలమును, పెంచి ఊపిరి బిగపట్టెను
నేత్రములు పెకిఎత్తి, పాదములతో గిరిని అదిమి  పైకి  ఎగెరెను, మహాబలశాలీ, వానర శ్రేష్టుడు చేతులను చేర్చి సముద్రముపై చేరెను, 
 

*23. ప్రతిఒక్కరు తేజస్సును,వీర్యమును,బలమును పెంచు కుంటూ ఉండాలి, అవసరము వచ్చినప్పుడు అధర్మాన్ని ఎదుర్కొనుటకు పతిఒక్కరు సంఘటితంగా ఏకమై ముందుకు సాకి చేతులు చేతులు కలిపి ఉద్యమించాలి.
 
మకరములకు నివాసమైన సముద్రమును దాట దలచెను, పర్వతమువంటి శరీరముగల హనుమంతుడు ఒక్కసారి కదలెను, రోమములు దులుపుకొని, మహా మేఘము వలె ఘర్జించెను, రామునికోరకు, వానరులకోరకు సముద్రముపై లంఘించెను.
*24. మనం బ్రతకల్సింది ఇతరులు కోసం అని గమనించాలి, సముద్రం లాంటిమన మనస్సును అదుపులో పెట్టుకొని ప్రవర్తించాలి,  అవసర మైనప్పుడు ధర్మం కొరకు తప్పని పరిస్తితిలో దుర్మార్గానిపై  ఘర్జన చేయాలనేదే, స్నేహితులను బంధు వులను ఆదుకోవాలనేదే  ఇందు నీతి.
    
గగనమునుండి   దేవలోకమునకుపోయిఅక్కడ సీతనువెదికెదను, కానరానిచో లంకకు పోయి రావణుని నగరముతోసహా తేగలగు తాను , ఆకాశము నుండి వానర వీరులందరికి మారుతి అమృత మాటలు పల్కెను, గమ్భీరముగా జెప్పుచూ నొక్కఊపులో సముద్రముపై కెగసెను, అణిమా సిద్దులుగల విద్యాధరులు హనుమంతునిచూసి ఆరాధించెను. 
 

*25. ఏవిషయమైన ఘమ్భీరముగ చెప్పాలి, చెప్పిన మాటను నిలబెట్టు కోవాలి, ఎవ్వరి మనస్సును నొప్పించక అందరి మనస్సు శాంత పరిచే మాటలు పలకాలి అనేడి ఇందు నీతి .

*****


సుందరకాండ - సుందర తత్త్వం - తెలుగు వచస్సు ( 1వ సర్గము )5/20
అతని తొడల వేగమునుండి వచ్చిన గాలికి చెట్లువ్రేళ్ళతో సహా పైకి ఎగేరెను, దూరమునకు పోవు భందువులను పంపినట్లుగా కొంతదూరము పోయెను, మరలి చెట్లు అన్ని సముద్రములో రెక్కలు తెగిన పర్వతముల వలే పడెను, మహ సముద్ర మంతా పగటి పూట నక్షత్రాలతో నిండిన ఆకాశంవలె ప్రకాశించెను.
(*26 పెళ్లి చేసి  వధువరులను  సాగనంపేటప్పుడు కొంత దూరము వచ్చి వెనుకకు వెళ్ళుట    అనేది హనుమంతుని వెంబడించిన చెట్లులాగా ఉంటుంది, పిల్లను పంపిన తర్వాత  అన్దరూ నీరసముగా అన్నిసర్డుకొని వేల్లుటే వజ్ర  హతమైన పర్వతాలు ఒక్కసారిగా  కూలినట్లు వారి మనసు భధకరముగా  మారుతున్నదనేదే  ఇందు నీతి)   

హనుమంతుని రెండు బాహువులు పాము పడగలువలే కనిపించెను, అతని రెండు నేత్రములు పర్వతముపై రెండు అగ్నిజ్వాల లవలే  ప్రకాశించెను,    అతని వాలము ఇంద్ర ద్వజము వలే ధగ ధగ మెరుయు చుండెను, అతని ముఖము సంద్యారాగముతో కూడిన సూర్యబింబమువలె నుండెను.
(*27. నిత్య అగ్ని హోత్రుని  దృష్టి చూడాలంటే అందరికీ కష్టమే, వారి చేతులు చూడగా పాము పడగల వలె కనిపించును, నేత్రములు అగ్నిగోళముల వలె కనిపించును. ముఖము బ్రహ్మ   వర్చస్సుతో వెలుగు చుండును  అటువంటి వారికి పాదాబివందనాలు చేసి ఆసీర్వాదము  పొందాలన్నది ఇందు నీతి, .కోపముగా  ఉన్నవారి  కళ్ళు  కుడా  అగ్నిలా  వెలుగుతూ  ఉండటాయి అటువంటి వారి   ముందు   జాగర్తగా   ఉండాలనేదే   ఇందు నీతి.
      
హనుమంతుని  ఎఱ్ఱనైన పిరుదులు బ్రద్దలైన ధాతుశిలలవలె నుండెను, అతని జంకల నుండి వచ్చేవాయువు మేఘము యురుము వలె నుండెను, ఉత్తరము నుండి దక్షణ దిక్కు వైపు పోవు ఉల్క వలే ప్రయాణించు చుండెను ,  రామభాణము ఎంత వేగముగా పోవునో అంతే వేగముగా పోఉ చుండెను
(*28 కొందరి శరీర అవయవాలు బహు చక్కగా ఉండునని, మరి కొందరివి వికృతముగా ఉండునని ఇందు మూలముగ తెలియు చున్నది, కొందరి మాట శబ్దానికి మించి ఉండునని, వేగము, మాట,   తోక చుక్క కన్నా మించి ఉండు నని ఇందు మూలముగా తెలుసుకోవచ్చు ననేదే నీతి    

హనుమంతుడు  త్రాడును తెంచుకొని పరుగెడుతున్న ఎనుగువలె నుండెను, అతని ముఖము చుట్టు తోక ఉండగా సూర్యునివలె ప్రకాశించు చుండెను,  అతని నీడ సముద్రము పై పడి ఒక పెద్ద నౌక వలె కనబడు చుండెను, వక్షస్తలము నుండి వెడలిన గాలిచే కెరటములు రెండంతలు ఎగసి పడు చుండెను
(*29) ఒక్కోక్కరు నడుస్తుంటే  భూమి, గాలి , కంపిస్తున్నది, కొందరి ముఖముచూస్తె వేలుగుతోనిండి పోతున్నది, కిరణాల తాకిడికి నీడ ఆవహిస్తున్నది, అందు చెఅ ప్రతిఒక్కరు త్రాడును తెంచుకొని పరుగెడుతున్న ఎనుగువలె నుందాలన్నదే ఇన్దునీతి      

ఉత్తరమునుండే వచ్చే వాయువు హనుమంతునికి ఎగురుటకు  తోడ్పడెను,  తాకాలని కేరటములు పైకి ఎగిరి పెద్ద గుంటగా ఏర్పడి పైకి ఎగురు చుండెను, భూమి యందు ఉన్నసముద్రమును మారుతి త్రాగుచున్నట్లుగా కన బడెను, హనుమంతుడు ఆకాశమున తలపైకి ఎత్తిన ఆకాశాన్ని  మ్రింగి నట్లుండెను
(*30) కొందరి చూపులు మింగెసి నట్లుగాను, మరికొందరి చూపులు తాగేసినట్లుగాను ఉన్న వారిదగ్గర జాగర్తగా ఉండాలనేదే ఇందు నీతి, మన ప్రయాణములో ఎన్నో ఆటంకాలు వచ్చిన ధైర్యముగా ముందుకు పోవాలన్నదే ఇందునీతి.

  **********
 
ఆధారము లేకుండ  రెక్కల పర్వతమువలె హనుమంతుడు ప్రకాశించు చుండెను, మేఘ పంక్తులలోకి పోవుచూ బయటకు వచ్చుచూ గరుత్మంతుడివలె ఉండెను,ఎరుపు,నలుపు,తెలుపు,పచ్చ, మేఘాలల్లో హనుమంతుడు ముచ్చటగా నుండెను
హనుమంతున్ని చూసిన ఋషీశ్వరులు, దేవతలు, గంధర్వులు పరాక్రమమును  ప్రశంసించెను
*(31) కొందరకి తన శక్తి అసలు తెలియదు, అనుకున్న పని అనుకున్న సమయముము కన్నా ముందే చేయగలుగుతారు, ఎందరు ఎదుర్పడినా ఎన్నిఅవాంతరాలు వచ్చిన తన కార్యమును తను చేసినవారికి,  అందరి దీవెనులు ఉంటాయని  ఈ శ్లోకభావం.

కొండంత ఎత్తుగా లేచుచున్న సముద్ర తరంగములను వక్షస్థలముతో 'డి' కొని ఎగేరెను,  హనుమంతుని తో వచ్చే గాలి, మేఘముల గాలి, సముద్రపు గాలి కలసి భీకరశబ్దముగా వినబడెను, సముద్రములో ఉన్న తరంగాలన్ని భూమి ఆకాశాన్ని తాకు చున్నట్లుగా ఉండెను, ఎగసిపడుతున్న సముద్ర తరంగాలను లెక్క పెట్టు చున్నాడా అన్నట్లు దాటు చుండెను .
*(32) ఎవరైనా సరే తప్పని సరి పరిస్తితిలో పనిచేయాలంటే  గుండె ధైర్యముతో, శబ్ధకాలుష్యాన్ని తట్టుకొని, ఈర్శ్య ద్వేషాలను తట్టుకొని, ఎగసి పడుతూ అడ్డు వచ్చిన వారిని  దాటుకుంటూ  ఎంత మంది అడ్డువచ్చారో లేక్క కట్టుకుంటూ ముందుకు  సాగాలన్నదే ఇందు నీతి.  .   

తిమింగళములు, మొసళ్ళు, వస్త్ర విహీనులయన మనుష్యుల్లా  ఉండెను, సర్పములు హనుమంతుని చూసి గరుత్మంతుడని భావించి భయ పడెను, హనుమంతుడు ఆకాశములో మేఘముల కన్న ముందుకు పోవు చుండెను. మేఘాలచే కప్పబడుచు బయటకువచ్చుచూ ఉండే చంద్రుడిలా ప్రకాశించు  చుండెను
*(33) కొందరు నీ పనికి అడ్డు పడుటకు, ఆక ర్షిమ్చుటకు, వస్త్ర విహీనులై , ఎంతో భయము నటించేవారు ఉంటారు జాగర్తగా మేలగాలనేదే ఇందు నీతి, చూపి చూపనట్లుగా మనసును లాగేవారు ఉంటారు జాగర్తగా మనం ప్రవరిమ్చాలనేదే ఇందు నీతి.  

హనుమంతుని నీడ సముద్రము మీద పది యోజనాలతో విస్తీర్ణముగను, ముప్పది యోజనాల పొడవుతో ఉండెను,  దేవా దాన గంద ర్వులు పుష్ప వృష్టిని కురిపించెను, హనుమంతుని చూసి దేవగణాలన్ని పరమా నందమును పొందెను  
*(34) కొందరు కార్య సాధకులుగా ముందుకు సాగేటప్పుడు వారి నీడను వారే చుడలేరు, ఎంత విస్తీర్ణము ఉందో చెప్పలేరు అనేదే తెలుసు కోవలసిన విషయం మరియు పనిలో ఉన్నప్పుడు పనివిషయము తప్ప అన్య విష యము ఆలోచించ కూడ దనేది ఇందు లోనీతి  

******     
 

  



Monday, 8 February 2016

ఓం శ్రీ రామ్



ఓం శ్రీ రామ్ 
సుందరకాండము (ప్రార్ధనలు , చదివే విధానాలు , మహత్యము ఇందు తెలుపట జరిగినది
http://vocaroo.com/i/s0cVY1nZccrF

పూజా విధానము , సుందరకాండ కధాసంగ్రహము(32.53)
http://vocaroo.com/i/s081gnAPROHI 

దయచేసి సుందరకాండము అన్ని భాగములు వినుట మంచిది , రోజుకొక భాగాముచోప్పున వినుట ఇంకా మంచిది
మొదటి సర్గము (44. 48)
http://vocaroo.com/i/s0nZWsGQxQlR 

జి.కే.8. 21http://vocaroo.com/i/s1Ib9PnPedha 

మొదటి సర్గము (2వ భాగము 52. 55 )
http://vocaroo.com/i/s0Yqxsjx5srK 

మొదటి సర్గము 3వ బాగము (22. 55)
http://vocaroo.com/i/s0Gxng2Fo6p3 

రెండవ సర్గము (33. 15)
http://vocaroo.com/i/s0TGFkHkxGRk 

మూడవ సర్గము (33. 15)
http://vocaroo.com/i/s0AKAVMt8o4v 

 నాల్గవ సర్గము (23. 02)
http://vocaroo.com/i/s1p0jv2JU6Ta 

ఐదవ  సర్గము (   )
http://vocaroo.com/i/s0PO35vQ8moq

ఆరవ  సర్గము (   )
http://vocaroo.com/i/s1RJnWIOta23 

ఏడవ  సర్గము (   )

http://vocaroo.com/i/s1HkU9YKtC1P 

8
http://vocaroo.com/i/s1cuiOPF5xxp 
 9
http://vocaroo.com/i/s1CM1r6NOmdu 

10
http://vocaroo.com/i/s1jc8m8AS2RG 


11
11http://vocaroo.com/i/s1x6zbaFYd5a 

12
http://vocaroo.com/i/s0ZbDvfCWyLI 

13
http://vocaroo.com/i/s0CMcSXPDrkn 
 14
http://vocaroo.com/i/s0yC0WuIM4v8 
15

http://vocaroo.com/i/s12rVGIdxkO2

16.

http://vocaroo.com/i/s1FWhclztQA3

17
http://vocaroo.com/i/s023vbY75qjl




Thursday, 19 November 2015

ప్రాంజలిప్రభ - సుందర కాండ తెలుగు వచస్సు (60వ సర్గ)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ 
శ్రీ మాత్రే నమ:
శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ: 
Hanuman Images & HD Photo


60వ సర్గ నుండి 66వ సర్గ వరకు (వాల్మికి రామాయణములోని 203 శ్లోకాల  తెలుగు వచస్సు)
("హనుమంతుడు సీత దురవస్థను వర్ణించి చెప్పి లంకను ఆక్రమించుట కై వానరులను ప్రోస్చాహ పరుచుట  " లంకను జయించి సీతను మనమే తీసుకొని రావలేనని అంగదుడు ఉత్సాహముతో పలుకుట, అట్లు చేయుట యుక్తము కాదని జాంబవంతుడు చెప్పుట, వానరులు మధువనములో ప్రవేసించి మధువును, ఫలములను యదేష్టముగా తినుట, వానర రక్షకులను నేలపై పడవేసి ఈడ్చుట. వానరులు దధి ముఖుని ఇతర వానర రక్షకులను పరాభవిమ్చుట,  దధి ముఖుడు భ్రుత్యు సహితుడై సుగ్రీవుని వద్దకు వెళ్ళుట,  మధువనమును వానరులు ద్వంసం చేసినారని ధది ముఖుని నుండి విని,  హనుమ దాదులు కార్యము సాధించి యుండురని సుగ్రీవుడు ఊహిమ్చుట. ధదిముఖుని ద్వారా సుగ్రీవ సందే శమును విని హనుమంతుడు మొదలైన వానరులు కిష్కింధకు వెళ్ళుట, హనుమంతుడు శ్రీ  రామునకు నమస్కరించి తాను  సీతను చూచినట్లు తెలుపుట. హనుమంతుడు శ్రీ రామునకు సీతా వృత్తాంత మంతయు చెప్పుట. రాముడు సీత  వృత్తాంతము విని చూడా మణిని చూచుచు సీతకొరకు విలపించుట.  )

60వ సర్గ నుండి 62వ సర్గ వరకు (వాల్మికి రామాయణములోని 82 శ్లోకాల  తెలుగు వచస్సు)




63వ సర్గ నుండి 64వ సర్గ వరకు (వాల్మికి రామాయణములోని 78 శ్లోకాల  తెలుగు వచస్సు)

                    http://vocaroo.com/i/s0pJfJ4wH8HH





Saturday, 31 October 2015

ప్రాంజలిప్రభ - సుందర కాండ తెలుగు వచస్సు (59వ సర్గ)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ 
శ్రీ మాత్రే నమ:
శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ: 


59వ సర్గ (వాల్మికి రామాయణములోని 36 శ్లోకాల  తెలుగు వచస్సు)
("హనుమంతుడు సీత దురవస్థను వర్ణించి చెప్పి లంకను ఆక్రమించుట కై వానరులను ప్రోస్చాహ పరుచుట  ")

శ్రీ రాముని వలనను, సుగ్రీవుని సంబ్రమము వలనను 
సీత శీలంను చూచిన నా మనస్సు సంతోష భరితమాయెను 
 ఓ వానరులారా సీత శీలం ఆమె రూపానికి తగి యుండెను
లంకలో సీత  చూసిన హనుమంతుడు తన్మయత్వం చెందినట్లు పలికెను

సీత తపోబలముతో అన్ని లోకాలను పోషించగలగును
అధర్మమును అనగ త్రొక్కుటకు లోకాలను భాస్మముచేయగలుగును
రాక్షరాజు తపసంపన్నుడు, సీతను మృత్యువు కోసమే భందిమ్చెను
కావున సీతను స్పృసించిన అతని శరీరము నష్టబడకుండా ఉండెను 


అగ్నిజ్వాల కూడా చేయలేని పని క్రోధకలుషితురాలగు సీత చేయ గలుగును 
ఇంతవరకు నేనులంకలో నిర్వహించిన విషయాలన్నీ మీకు విన్న వించాను 
జామ్బవంతుడు  మొదలగు కపివీరులందరి అనుజ్ఞ కోసం వేచు వున్నాను
అనుకుంటున్నా సీతాదేవిని రామలక్ష్మణుల వద్దకు తీసుకొని వెల్లుటకు న్యాయమగును 


నేను చాలావరకు లంకను దహింప చేసి వచ్చినాను 
రావణుడిని సంహరించుటకు నేనొక్కడినే చాలును
సైన్యముతో వచ్చిన రావణున్ని నేను ఎదుర్కోనగలను
అతని పుత్రులను కూడా యుద్దములో నేను ఎదుర్కోనగలను 

యుద్దములో నేను నిరంతరం వర్షించిన శిలావృష్టి సైనికులను
రాక్షసులను వధించుటకు మీ అనుమతి కోసం వేచి ఉన్నాను
కడలితీరము దాటినాదాటవచ్చును, పర్వతం చలిమ్చవచ్చును
యుద్దములో జామ్బవంతున్ని శత్రుసేన కదల్చజాలలేకుండును   

మహాత్ములైన పవనుడు, నీలుడు చూపుచే పర్వతమే భస్మమగును
మైన్దునితోను, అంగదునితోను యుద్దములో ఎదుర్కొనే శక్తి లేదును  
అశ్వనీ దేవతా పుత్రులు మైన్ద దివిదులను ఎదుర్కొనే శక్తి  లేదును
సమర అభి లాషులు మీరందరూ  ఉండగా జయము కలుగును  

నేను లంకను కాల్చి, కొందరి రాక్షసులను సంహరించి వచ్చాను
రాఘవుని స్నేహము పొందిన సుగ్రీవునకు జయమని చెప్పాను 
నేను రామచంద్రుడి యొక్క దాసుడను, వాయు పుత్రుడను
హనుమంతుడని శత్రు  రావణునితో సహా అందరికి చెప్పాను 


  సీత శింశుపా వృక్షము క్రింద శోకిస్తూ ఉండెను 
సీత శోకసంతాపముచే కృశించి కాంతి లేకుండా ఉండెను
సీత రావణుని ఖైదీలొ ఉన్న లెక్క చేయ కుండా ఉండెను 
సీత శ్రీ రామచంద్రుని యందు సదా అనురక్తి కలిగి ఉండెను  

ఏకవేణి, ఏక వస్త్రముధరించి నేలపై పరుందిడినదియును 
వాడిపోయిన అంగములుగల సీత భర్త హితము కోరుకోను చుండెను  
హిమపాతముచే నష్ట శోభపద్మినివలె సీత విలపిస్తూ ఉండెను 
రావణుని ఎటువంటి అర్ధము ఆశించక మరణమును కోరుకోను చుండెను 



నేను సీత కెటులో విశ్వాసము కలిగించి వచ్చి నాను రామసుగ్రీవ సఖ్యత గూర్చి, వానరుల గూర్చి చెప్పినాను
భర్త యందు సీతకు మహా భక్తి కలిగి యుండెను 
సీత రావణున్ని సంహారిన్చలేకపోవటం రావణుడు భక్తి పరుడును

శ్రీరాముడు రావణుని వధకు కేవలము నిమిత్త మాత్రమె యగును 
రావణుడు చేసిన పాపమే అతనిని మృత్యువై కబలించును
సీత రాముని వియోగము వలన భాదలో మునిగి యుండెను 
నేను చెప్పినదాని ననుసరించి చేయవలసినది చేయవలెను 

శ్రీ సుందర కాండ 59వ సర్గ సమాప్తము

Sunday, 11 October 2015

ప్రాంజలిప్రభ - సుందర కాండ తెలుగు వచస్సు (58వ సర్గ)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ 
శ్రీ మాత్రే నమ:
శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ: 



58వ సర్గ (వాల్మికి రామాయణములోని 169 శ్లోకాల  తెలుగు వచస్సు)
("జాంబవంతుడు అడుగగా హనుమంతుడు లంకకు బయలు దేరినది మొదలు జరిగిన విషయములు చెప్పుట ")

మహేంద్ర పర్వతముపై  హనుమంతుని రాక కొరకు హనుమంతుని తెచ్చే సందేశము కొరకు వేచి వున్నారు.  హనుమంతుని సింహ నాదముతొ దిగులుగా ఉన్న వానరులందరికి  ఉత్స్చాహము ఏర్పడెను సంతోషముతో గంతులు వేసెను 
హనుమంతుడు పర్వతముపై దిగిన వెంటనే వానరులందరూ జాంబవంతుడు, అంగదుడు కలసి ఆహ్ఫానిమ్చెను.  పరస్పరము కల్లుసుకొని మిక్కిలిసంతోశము పొందెను అక్కడ ఉన్న శిలలపై అందరు విశ్రాంతి తీసుకొనెను.  ప్రీతి సంహృష్టుడగు జాంబవంతుడు ప్రీతి మంతుడైన ఆ పవనందనుని జరిగిన కార్యమును గూర్చి వృత్తాంతము అడిగెను. 
ఓ మహాకపి నీవు సీతను ఎట్లు చూచితివి?  ఆమె అక్కడ ఎట్లు వున్నది?  క్రూర కర్ముడగు ఆ లంకాధీసుడు  ఆమె విషయమున ఎట్లు వ్యవహరించు చున్నాడు?  ఈ విషయమున్తయు నీవు మాకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పుము. 
  
ఆమెను నీవు ఏవిధముగా  వెతికితివి ?  ఈవిషయము లన్నింటిని మనము ముందు చేయవలసిన కార్యక్రమమును 
గూర్చి తిరిగి ఆలోచిన్చేదము?  కిష్కిందకు  మనము ఎ విషయము చేయవలెను?  దేనిని దాచవలెను?  నీవు బుద్దిమంతుడవు కావున ఈ విషయము లన్నింటిని వివరించి చెప్పుము .


జామ్బవంతునిచే నియుక్తుడైన హనుమంతుడు సంతోషముతో శ్రీ సీతాదేవికి శిర:ప్రణామమును చేసి ప్రత్యుత్తర మోసంగెను


నేను ఏకాగ్రతతో మీరందరూ చూస్తున్నప్పుడు మహేన్ద్రపర్వతము నుండి  ఆకాశమునకు ఎగిరితిని.  నేను వెళ్ళు మార్గమున విఘ్న్రరూపమున ఒక సువర్ణ శిఖరము అడ్డుగా నిలబడి ఉండెను. వెంటనే నేను నా ప్రయాణమునకు విఘ్నమని తలంచి బ్రద్దల కొట్టవలెనని అనుకొంటిని . నేను నా వాలముతో  ప్రహారము చేయగా సూర్యసన్నిభమైన దాని శిఖరము వేయి విధములుగా వ్రక్కలాయెను


నా ప్రయత్నం అర్ధం చేసుకొని ఆ మహాగిరి ఈ విధముగా పలికెను.  పుత్రా యని మధురముగా పలికి నా మనస్సుకు మిక్కిలి ఆనందము కలిగించుచూ ఇట్లు పలికెను


నేను నీకు పినతండ్రిని, నీ తండ్రి యగు వాయుదేవునకు స్నేహితుడను నాపేరు మైనాకుడు. నేను ఈ సాగారమందు నివసించు చున్నాను  
పూర్వము పర్వతములకు రెక్కలు ఉండేవి, అవి అకాసమున తిరుగుతూ ప్రజలను భాదించు చుండెను ప్రజల ఆర్తనాదములు మహేంద్రుడు పర్వతాల రెక్కలను తన వజ్రాయుధముతొ చేధించెను. నేను మాత్రము మహాత్ముడగు నీ తండ్రిచే తప్పింప బడితిని. 


వత్సా నీ తండ్రి యగు వాయుదేవుడు నన్ను ఈ సముద్రములో 
పడవేసేను. జయరిందమా శ్రీ రామ చంద్రునకు నేను కుడా సహాయము చేయవలసి యున్నది. శ్రీ రాముడు ధర్మాత్ముడు మహేన్ద్రునితో సమాన మైన వాడు. 


మహాత్ముడైన మైనాకుని మాటలు విని నా కార్యమును నివేదించితిని అప్పుడు నా మనస్సు ముందుకు వెళ్ళుటకు ఉత్సాహపడు చుండెను.  అమహత్ముడైన మైనాకుడు కూడా  నాకు అనుజ్ఞనిచ్చెను. ఆ 
పర్వతము తన మానుష శరీరముతొ మాయమయ్యెను. తిరిగి నేను మంచి వేగముతో మిగిలిన మార్గము ప్రయాణము చేయుట ప్రారంభిం చితిని నేను చాలాసమయము వరకు వేగముగా ప్రయాణముచేయ సాగితిని. 


సముద్ర మద్య భాగమున నాగామాతయగు సురసనయనను దేవత కన్పించేను ఆ సురసా దేవి నాతొ ఇట్లు పలికెను. ఓ హరిసత్తమా నీవు నాకు  భక్షణముగా ప్రసాదింప బడితివి కావున నేను నిన్ను భక్షిమ్చెదను.  నీవు ఆహారముగా దేవతలచే కల్పించ బడితివి.  


నేను సురస మాటలకు వివరణ వదనుడనై ప్రాంజలి ఘటించి ఆమె ఎదుట నిలబడి ఇట్లు పలికితిని. 


ఓ దేవి శ్రీ మంతుడును నగు శ్రీ రాముడు తన సోదరుడగు లక్ష్మణుడి  తోను, సీతాదేవితోడను దండకావనమును ప్రవేసించిను. రావణుడను దురాత్ముడు ఆ శ్రీ రాముని భార్యయగు సీతాదేవిని అపహరించినాడు.  శ్రీ రాముని యాజ్నపై ఆమె యోద్దకునేను దూతగా పోవుచున్నాను.  నీవు శ్రీ రాముని రాజ్యమున నివసించు చున్నవు.  కావున అతనికి సహాయము చేయడగియున్నావు లేదా సీతాదేవిని చూచి అక్లిష్కకర్ముడగు రాముని గూడా తరువాత దర్శించి నీ ముఖమున పడ గలను.  నీకు నిజముగా  ప్రతిజ్ఞ ప్పూర్వకముగా చెప్పుచున్నాను.


అప్పుడు సురస నాకు ఆహారమైన ఎ ప్రాణి కుడా నన్ను అతిక్రమించి ముందునకు పోజాలదు. ఇదినాకున్నవరము అని పలుకగా నేను దశయొజనములు శరీరమును పెంచితిని, వెంటనే సురస కూడా  నా ప్రమాణము కంటే పెద్దగా పెంచెను 


ఆమె ముఖమట్లు విశాలముగా తెరుచుకోనగా నేను నా శరీరము చిన్నదిగా చేసి అంగుష్ట ప్రమానముగా మారి సురస నోటిలోనికి ప్రవేశించి తక్షణమే బయటకు వచ్చి వేసితిని అప్పుడు సురస నాతో నిజరూపమున  ఇట్లు పలికెను 


ఓ కపిశ్రేష్ట నీవు కార్యసిద్దికోరకు సుఖముగా ప్రయాణము సాగించుము విదేహుని కూతురగు సీతాదేవిని మహాత్ముడగు రామునితో కలియునట్లు చెయ్యుము.  ఓ మహా బాహువగు వానరా సుఖముగా వర్ధిల్లుము.  అప్పుడు సకల భూతములు సాదు వాదములు పల్కి నన్ను ప్రసంసించేను.  నేను దశదిశలు చూడగా నా గతిని ఆపు చేసిన దేదియో నా కిక్కడ కన్పించుట లేదు. అప్పుడు నేను ఇట్లా అలొచించినాను.  నా గమనమునకు విఘ్నము కల్గుతున్నది కాని విఘ్నం కల్గించు రూపమ్ము ఏమియు కన్పించుటలేదు.  అట్లు ఆలోచించు చుండగా క్రిందకు నా చూపును సారించాను.  అక్కడ నీటి పై పరుండిన భయంకరమగు ఒక రాక్షసి కన్పించెను.  ఆ రాక్షసి నన్ను ఆకర్షిమ్చు తూ నన్ను లాగుతున్నది, నిర్భయముగా నీతో ఇట్లు పల్కెను. 


ఓ వానరా ఎక్కడకు పోవుచున్నావు ? ఆకలి గొన్న నాకు  ఆహారము అవుము, చిరకాలము నుండి  ఆహారవర్జితమైన నా దేహమును సంతోష పెట్టుము.  మంచిది అని నా శరీరమును పెంచినాను, ఆమె ముఖము కూడా నన్ను మింగేటట్లు పెద్దగా పెంచెను. నా విసాలమగు రూప మును మార్చి అతి చిన్నదిగా చేసి ఆమె గుండెలో చేరి నా వాడియైన గూళ్ళతో మర్మావయవములను చీల్చి ఆకాసము లోనికి ఎగిరితిని అపుడు ఆమె హృదయము పగిలి లవణ సముద్రముపై అది చని పోయెను. అప్పుడు ఆకాశ సంచారులు సింహిక అను రాక్షసి అవలీలగా హనుమంతుని చేతిలో మరణించినది అనెను

ఆమెను చంపినతర్వాత చాలాదూరము ప్రయాణము చేసి పర్వతాలన్క్రుతమైన సముద్రతీరమున ఉన్న లంకా పట్టనమును చూచితిని అక్కడ పర్వతము పై ఉండి  సూర్యుదు అస్తమించువరకు ఉండి రాక్షసులకు తెలియకుండా చిన్న రూపములో  లంకలోకి  ప్రవేసించ బోతున్నప్పుడు మేఘమువలె ఉన్న ఒక స్త్రీ నా ఎదుట ప్రత్యక్షమయ్యెను 

అమెకేశములు మండుచున్న అగ్నివలె నేర్రగా ఉండెను.  ఆమె నను చంపుట గమనించి నేనే ముష్టిఘాతముతో ఆమెను ప్రహరించి ఆమెను జయించి ప్రదీప కాలమున లంకలో ప్రవేశించబోయాను.  అప్పుడు ఆమె నాతొ ఇట్లన్నది.  ఓ వీరా నేను లంకా నగారిని నీ పరాక్రముచే నిర్జితురాల నైతిని నన్ను జయించితివి కనుక నీవు మొత్తము రాక్షసులను సంపూర్ణ ముగా జయించ గలవు అనెను. 

ఆ నగరమంతా తిరుగుచూ రావణ అంత:హపురమున జానకిని కానలేక పోయినాను నేను చాలా దు:ఖించినాను అప్పుడే బంగారు ప్రాకారముతొ చుట్టబడిన గృహమును చూసాను, దానిని దాటిన తర్వాత  వనమును చూసినాను అక్కడ ఒక గొప్ప అశోక వృక్షము వుండెను అక్కడ సింసపా వృక్ష మునకు సమీపము ననే  సర్వాంగ సుందరి యగు సీత యగు
పించెను

యౌవన మద్యస్త్ధమును కమల పత్రముల వలె విశాలమైన నేత్రములు గలదియును ఉప వాసముచే కృసిమ్చిన మేముగలదియును ఏక వస్త్రమును దుమ్ముచే మాసిన కేశ పాసము గలదియును, శోక సంతాపములచే వివర్ణమైన శరీరము కలదియును భర్త్రుహిత పరాయణ యును, వికృతా కారముగల క్రురు రాండ్రగు రాక్షస స్త్రీలచే  రక్త మాంస ములను భుజించు ఆడుపులులచే చుట్టు ముట్ట బడిన లేడివలే పరివేష్టి0ప బడినదియును, రాక్షస స్త్రీల మద్యన ఉన్నదియును వారిచే బెదిరింపబడు చున్నదియును, ఏక వేణిని ధరించినదియును ధీనురాలును, భర్తుచింతా పరాయణము హిమహతమైన పద్మలతవలె వన్నెదరిగిన అంగములు కలదియును, రావణుని వలన ఎట్టి  ప్రయోజనుమును ఆసిమ్చనదియును మరణిమ్చవలెనని నిశ్చయమునకు వచ్చినదియును అగు సీతను చాలావేగమున ఆమె సీతా అని గుర్తించ గలిగినాను. రామపత్నియగు సీతను ఆ స్థితిలో చూచుచూ  అక్కడనే యశోక వృక్షముపై ఉండి  పోయాను.     
     
ఇంతలొ రావణుని భవణమునందు కాంచీధ్వని కాలియందెల చప్పుడు కోలాహలము వినిపించెను అప్పుడు నేను గాబరా పడి రూపమును తగించుకొని పక్షి రూపమున దట్టమైన ఆవృక్షము మీద  ఉన్నాను.  అప్పుడు సీత ఉన్న చోటుకి రావణుడు భార్యలతో వచ్చెను.. అప్పుడు సీతాదేవి తన ఊరువులను గట్టిగా ముడుచు కొనిస్తనములను చేతితో కప్పు కొని కూర్చుండెను  

అప్పుడు భయముతో ఉన్న సీతతొ రావణుడు ఓ భామిని నన్ను ఎక్కువగా నాదరిమ్పుము అని పల్కెను.  ఓ గర్వంతురలా నీవు దర్పముచే నన్ను అభినందింప కున్న రెండు మాసముల తరువాత నీ రక్తమును త్రాగగలను

దురాత్ముడగు రావణుని మాటలకు సీత ఈ విధముగా పల్కెను. ఓ రాక్షసాదిమా "అమిత తేజస్సుగల రామునికి భార్యయును, ఇక్ష్వాకువంశ  ప్రభువగు దశరధునికి కోడలును నగు నన్ను కూయరాని కూతలు కూయు నీ జిహ్వా ఊడి ఏల నేలపై పడలేదు? ఓ అనార్య నా భర్త దగ్గర లేనప్పుడు అపహరించి తెచ్చిన నీకు గల పరాక్రమ మేమి ? నీవు మహాత్మునికి కన్పిమ్పనేలేదు అట్టి పిరికి పంద వగు నీవు రామునితో నెలా తులతూగెదవు"
 రామునికి దాస్యమాచరించే యోగ్యత కూడా నీకు లేదు, శ్రీ రాముడు అజేయుడు, సత్య వచనుడు, సూరుడు, రణములయందు స్లాఘింప బడిన వాడు. 

జానకి మాటలకు రావణుడు జితాగ్ని వలే మండుచు నేత్రములు త్రిప్పుచూ పిడికలు బిగించి చంపుటకై ఉద్యమించెను.
అప్పుడు స్త్రీ లందరూ హ హా కారములు చేసిరి ఆ స్త్రీల మద్య నుండి  ఆ దురాత్ముని భార్యయగు మండోదరి వచ్చి అతనిని అడ్డు కొనెను. కామ పీడితుడైన అతనితో మృదు మధురముగా మాటలు పల్కేను 
దేవెంద్రునితో సమానమైన పరాక్రమము గలవాడవు,   నీకు సీతతొ పనియేమి? నాతొ రమిమ్పుము.  సీత నా కంటే ఎక్కువ అందకత్తె  కాదు.  దేవ గంధర్వ కన్యలతో రమిమ్పుము.  సీత నెల యాసిమ్చెదవూ? అప్పుడు  ఆ స్త్రీలందరూ కలసి మహా బలసాలియగు నిశాచరుని లెవదీసుకొని రావణ వణమునకు వెంటనే తీసుకొనిపొయెను 

రావణుని ఆజ్ఞప్రకారము వికృతమైన మోముగల రాక్షస స్త్రీలు కూరములు, దారునములు, నగు పల్కులతొ సీతను మిక్కిలి బెదిరించెను.  కాని సీతాదేవి మాత్రము వారి పలుకులను గడ్డి పోచక్రింద  తీసుకొనెను.  వారు చేసిన గర్జనలు కుడా సీత వద్ద నిరర్ధక మయ్యెను. కొందరు సీతను కష్టపెట్టు చుండిరి, మరికొందరు రావణుని వద్దకు సీత విషయము చెప్పుటకు వెల్లిరి. చేయునది ఎమీ లేక చివరకు వారు నిద్రకు వసులైనారు. అప్పుడు సీత మిక్కిలి దు:ఖముతో విలపించెను. 

వారి మద్య లో త్రిజట  లేచి  ఇట్లు పలికెను. నేను ఈ రోజు రోమ హర్షమైన ఒక స్వప్నము చూచితిని.  అది రాక్షుల వినాసమును, ఈమె భర్త యొక్క విజయమను చూచినాను. మనమందరమూ ఈమెను కష్టపెట్ట కుండా క్షమాభిక్ష పెట్టమని కోరుకుందాము . ఈమే రాఘవుని నుండి రాక్షస గణమును రక్షించ గలదు. 
అప్పుడు సీత త్రిజట మాటలు విని భర్తయొక్క విజమును గూర్చిన హర్ష పు వాక్కులు వినెను.  ఇది సత్యమే యైన నేను మిమ్ములను రక్షిమ్చగలను అని పల్కెను . 

నేను ఆమె భాదను తొలగించుటకు ఇక్ష్వాకు వంశమును గూర్చి ప్రసంసించితిని ఆమాటలు విని నీవెవ్వడవు, ఎవ్వనిచే పంపపడితివి, ఓ వానర శ్రేష్ట ఇచ్చటకెట్లు వచ్చితివి? నీకు రామునిపై గల ప్రీతికి కారణమేమి? నీవు సత్యవచనములు తెలియ పరుచుము అనెను 
నేను ఆ మాటలు విని ఇట్లు పలికెను. నేను సుగ్రీవునివద్ద మంత్రిని, సుగ్రీవుదు రామునితోస్నేహము చేసినాడు, రామదూఅగా నేను ఇక్కడకు వచ్చినాను నా వద్ద ఉన్న శ్రీ రాముడు  ఇచ్చిన అంగులీకమును చూపి నమస్కరిస్తూ దీనిని నీకు శ్రీరాముడు ఇమ్మని చెప్పినాడు, నీ యాజ్ఞ  కొరకు వేచియున్నాను, నేను చేయదగినది  తెలుసుకోన కోరుచున్నాను, నిన్ను రామ లక్ష్మణుల వద్దకు నా వీపుపై తీసుకొని వెల్లెదను, నీ వేమి యందువు? అని పలికి నిలుచొని ఉన్నాను

జనక నందిని యగు సీత నా ఈ వచనములు విని బాగుగా ఆలోచించి యిట్లు పలికెను.  రాఘవుడు రావణుని సంహరించి నన్ను తీసుకొని పోవుట న్యాయము కదా, నేను నీతొ వచ్చుట  ధర్మము కాదు.. పూజ్యు  రాలైన సీతాదేవికి ప్రణామమును చేసి అభిజ్ఞానమును యాచించితిని.  అప్పుడు సీత ఇది ఉత్తమ మయినది అని చెపుతూ సందేశమును కూడా  ఇచ్చినది.  నేను బయలు దేరునప్పుడుమరలా ఇట్లు పలికెను.  ఓ హనుమా రాఘవునకు నావార్తను తెలిపి సుగ్రీవ సహితముగ వచ్చి రావణుని సంహరించి నన్ను తీసుకొని వెల్లే విధముగ నా భాదలు చెప్పి కొంచము పుణ్యము కట్టు కొనుము అన్నది, హనుమా వేరొక విధముగా జరిగినా రెండు మాసములు మాత్రమె నేను జీవించెదను.  ఆపై రాఘవునికి నేను అగుపించను. అనాధవలెమృత్యవాత పడెదను. అన్ని విషయములు రామునకు చెప్పగలవని కోరుచున్నానను.  ఆమాటలకు నాకు కోపం వచ్చినది, నేను చేయ వలసిన కార్యశేషమును గూర్చి ఆలొచించితిని.
   
నేను నాశరీరమును పెద్దదిగా చేసి బంగారు తీగల్ల మెరుస్తున్న వనమును ధ్వంసము చేయదలచి నాశనము చెసితిని, నిద్రనుండి లేచిన రాక్షస స్త్రీలు నన్ను చూసి భయము చెంది వన విధ్వంసమును గూర్చి రావణునికి చెప్పిరి. రాక్షస స్త్రీల మాటలకు రావణుడు కోపముతో బహుదుర్జయులను నగు కింకరులను రాక్షసులను, ఎనుబది వేలమంది సైనికులను నాపై యుద్దమునకు పంపెను.  వారి నందరిని మట్టు  పెట్టితిని, పెక్కబలము గలవారు రావణుని వద్దకు పపోయి  కింకరులు సైన్యము హతమైనట్లుగా చెప్పెను.    

అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చెను అక్కడ దగ్గరగా ఉన్న చైత్యప్రాసాద మును పగలగొట్టి, అక్కడ కాపలాకాయుచున్న నూరు మంది సైనికులను ఆ స్థంభముతోనే హతమార్చితిని.ఆ తరువాత రావణుడు జంబుమాలిని ఘోర రాక్షసులను నాపై పంపెను, వారిని నేను పరిఘతో తోనే తుదముట్టించితిని. తరువాత మంత్రి పుత్రులను పంపగా వారిని యమపురికి పమ్పినాను. రావణుడు కోపముతో 5గురు సేనాధి పతులను పంపెను వారిని కూడా నేను సైన్యముతో సహా అందరిని సంహరించితిని. 

దశగ్రీవుడు బాగుగా అలోచించి తన కుమారుడైన అక్షకుమారున్ని నాతో యుద్దము చేయుటకు పంపెను. అతడు రణమున పండితుడు, నాతో  సమానముగా యుద్దము చేయు చున్నాడు, చిన్న వాడైన పెద్ద వాడిగా నాతొ యుద్దము చేసెను. అప్పుడు నేను అతడు ఆకాసమున ఎగురు చుండగా అతని పాదములు పట్టి వంద సారులు త్రిప్పి నేలపై చూర్ణ మగునట్లు కొట్టగా అతడు మరణిమ్చెను.   రావణుడు తన పెద్ద కుమారుడు ,తనంత బలము, దైవశక్తి ఉన్నా మేఘనాదుడ్ని యుద్దమునకు ప్రోస్చహించెను.  కొన్ని నీతి వాక్యములు చెప్పి నన్ను యుద్దములో జయించి విజయము సాధించ వలెనని దీవించి నాపైకి పంపెను.  

అతడు ధర్మపరుడు, బలవంతుడు, అస్త్ర శస్త్రములలో ఆరి తేరినవాడు, నా పైన అద్భుతంగా యుద్దము చేసెను, ఆటను ప్రయోగించిన అస్త్రములన్ని వ్యర్ధమైనట్లు గా భావించి నామీద బ్రహ్మాస్త్రము ప్రయోగించెను.  బ్రహ్మ మీద గౌరవించి నేను క్రింద పడిపోయాను,  రాక్షసులు నన్ను త్రాల్లతో కట్టి రావణుని వద్దకు బలవంతముగా తీసుకొని వెళ్ళెను. 

రావణుడు నన్ను చూసెను, నేను రావణున్ని చూసాను, రావణుడు తన మంత్రులచేత నా రాక గూర్చి ప్రశ్నిమ్చమని ఆజ్ఞ వేసెను. వారు నా లంకనగరము వచ్చుట, యుద్దములో రాక్షసులను వధను గురించి నన్ను అడిగెను. అప్పుడు నేను రావణునికే సమాధాను చెప్పను. ఇది అంతయు సీతార్ధముగ నేను చేసాను, ఓ రాజ నేను ఆమె దర్సనముకోరి నీ యింటికి వెతుకుచూ వచ్చాను, సీతను చూసాను,  నేను వాయుదేవుని ఔరస పుత్రుడను, నా పేర హనుమంతుడు.  నేను సుగ్రీవుని వద్ద మంత్రిని. నేను శ్రీ రాముని దూతగా నీ దగ్గరకు వచ్చాను. నేను చెప్పే ధర్మార్ధ సహితమైన, హిత వాక్యములను వినవలెను. 

ఓ రాక్ష్సేస్వారా హరీస్వరుదు అగుసుగ్ర్రివుడు ఏకాగ్రత పూర్వకముగా చెప్పిన వాక్యమును నేను నీకు చెప్పు చున్నాను, సుగ్రీవుడు  నీ క్షేమసమాచారము అడిగినాడు    రామునకు సుగ్రీవునకు స్నేహము కుదిరెను.  వారు ఒకరి కొకరు ప్రతిజ్ఞ చేసికొనెను, రాముడు తన భార్య రాక్షసునిచే అపహరింప బడెను సహాయము చేయమని కోరెను, సుగ్రీవుడు వాలిని వధించి వానర రాజ్యము ఇప్పించమని కోరెను. 
ఇరువురు అగ్ని సాక్షిగా వప్పందము కుదుర్చుకొనెను.నీకు ముందే తెలుసు వాలి, అట్టి వాలిని ఒక్క భాణముతో వధించెను, సుగ్రీవునకు వానరాజ్యము ఇచ్చెను, సుగ్రీవుడు సీతను వెదుకుటకు నలుదిక్కులా వానరులను పంపెను, నేను దక్షణ దిక్కున లంకలో సీత  ఉన్నట్లు తెలుసుకొని వచ్చాను, నేను సీత  కొరకు రాక్షసులను వధిన్చాను, వానర వీరులు వచ్చి నిన్ను, నీ రాక్షసులను వధించక ముందే  సీతను తీసుకువెల్లి రాఘవునకు అర్పిమ్పుము. అన్న మాటలకు రావణుడు కోపముతెచ్చుకొని తీవ్రముగా నన్ను చూసెను. 

దురాత్ముడైన రావణుడు నన్ను వదిమ్చమని ఆజ్ఞాపించెను. ఆమాటలకు అతని సోదరుడు విభీషణుడు చాలా మేధావి, ఓ రాజా నీ ఆజ్ఞ రాజశాస్త్రములలొ ఎక్కడా దూత వధ అనేది లేదు.  దూత  వధ సమర్ధనీయము కాదు అని తెలియపరిచి రాక్షస ప్రభువుని క్షమా భిక్షను నా కొరకు కోరెను.    
    
రావణుడు విభీషణుని మాటలను గౌరవించి లంగూలమును ధహిమ్పుడు అని ఆజ్ఞాపించెను. అప్పుడు రాక్షస వీరులన్దరు నా తోకకు నిప్పు పెట్టి లంక నగరమునా త్రిప్ప సాగెను. నేను వచ్చిన పని సఫలమైనది ఇంకా లంకానగరము దగ్ధము చేసి తిరిగి వెల్లెదను అని తలంచినాను, నా రూపమును చిన్నది చేసి కట్టులు ఊడగా నా రూపాన్ని పెద్దదిగా మార్చి లంకా నగరంలోని భవణాలకు అగ్నిని పంపి దహింప చేయగా దానికి గాలి తోడై లంకా నగరము దగ్దము చేసెను,నేను సముద్రములో తోకను చల్లార్చుకొన్నాను, అప్పుడే నేను సీతకు రక్షణను కల్పించకుండా స్వామివారికి ద్రోహం చేసానని భాదపడినాను, అప్పుడే చారణులు మాటలలో శుభ వార్తను నేను విన్నాను. సీత దగ్దము కాలేదు అన్న మాటలు. 

అప్పుడు సంతోషముతో ఆలోచించాను, నావాలము దాహించక చల్ల గా ఉన్నది, సీతాదేవే అగ్ని ఒక అగ్ని వేరొక అగ్ని దాహించదు, ఆమె ప్రతివ్రత ఆమె బ్రతికే ఉండును అని భావించి వెనక్కు ఆమె ఉన్న చేట్టు వద్దకు వెళ్లి ఆమెకు నమస్కారము చేసి ఆమె ఇచ్చిన సందేశమును తీసుకొని మిమ్ము చూచుటకు అరిష్టపర్వతమునుండి ఆకాశ మార్గములో ప్రయాణించి మీ రంద్దరున్న ఈ పర్వతము వద్దకు వచ్చాను, మిమ్మలన్దర్నీ చూడగలిగాను. శ్రీ రాముని యనుగ్రహము వలన మీ అందరి ప్రతాపమువలన, సుగ్రీవుని కార్యార్ధనై నేను నిది యంతయు  ఆచరించితిని. ఇది యంతయు నేన్నక్కడ యదొచితముగా  నెరవెర్చితిని.  నేను చేయగా మిగిలిన కార్యము నంతయు మీరు పూర్తి
 చేయ గలరు. సీతను చూసాను అన్న వాక్కులు హనుమంతుని నోటివెంట విని ఆనంద పారవశ్యములో మునిగి పోయారు అందరు .

సుందరకాండ 58వ సర్గము సమాప్తము
  




Monday, 5 October 2015

ప్రాంజలిప్రభ - సుందర కాండ తెలుగు వచస్సు (57వ సర్గ)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ 
శ్రీ మాత్రే నమ:
శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ: 


57వ సర్గ (వాల్మికి రామాయణములోని 53 శ్లోకాల  తెలుగు వచస్సు)
("హనుమంతుడు సముద్రమును దాటి జామ్బవాదంగదాదులను
 చేరుట ")

బుజంగ, యక్ష, గన్ధర్వలు, కిన్నరు లను
వికసిత కమలోత్పలములు కలదియును
చంద్రుడును కుముదముతొ రమ్యమైనదియును
సూర్యుడను జలకుక్కటముతో నొప్పుచున్నదియును

పుష్యమి శ్రవణ నక్షత్రములును
మేఘాలు, కలహంసలు కలదియును
కుజుడు ఎడ్డ ముసలి కలదియును
ఐరావతము మహాద్వీపము కలదియును  

 
స్వాతి యను హంస చే  విలసితమును
వాయుసమూహమును తరంగములతోను
చంద్రాలువులను శిశిరమగు జలములతోను
సముద్ర ఉపరితలం పైన పయనించుచుండెను

హనుమంతుడు ఆకాశము మ్రింగు చున్నట్లును
చంద్రమండలమును గోళ్ళతో గీకు చున్నట్లును 
మేఘజలములను క్రిందకు లాగు చున్నట్లును
నక్షత్ర సూర్యమండల సహితముగా పోవుచుండెను  

    
హనుమంతుడు వాయువేగాముకంటే ఎక్కువ వేగముతోను
ఏ మాత్రము అలసట చెందక అకాశము ననే సముద్రమును
సముద్రపై భాగమున రెక్కలుగలిగిన మహాపర్వతమువలెను
పెద్ద ఓడ మహా సముద్రము లో దాటిన్నట్లు దాటు చుండెను


మేఘములు శ్వేత,రక్త నీల,మాంజిష్ట హరితారుణ వర్ణములతో ప్రకాశించు చుండెను
సకల దేవతలు తమ వాహనాలతో వెళ్ళుతున్నా హనుమంతుడు దాటు చుండెను
ధవళామ్బరధారి అయిన  ఆ మహవీరుదు దృశ్యా దృశ్య శరీరుడై చంద్రునివలె ఉండెను
మటి మాటికి మేఘాలలోకి పోయి తిరిగి వచ్చే గరుడు వలే హనుమంతుడు ఉండెను 

  
హనుమంతుడు ఘమ్బీరమైన నాదము చేస్తూ బయలు దేరేను
సముద్రమద్య భాగముణ ఉన్న మైనాకునితాకి భాణమువలె బయలు దేరేను
ఉత్తరదిక్కున ఉన్న మహేంద్ర పర్వతమును చూసి పెద్దగా నాదము చేసెను
అప్పుడు ఆ నాదము పది దిక్కులు ప్రతి ధ్వనిమ్చుచుచూ వానరులను చేరెను

వానరులందరూ మేఘ గార్జనను బోలిణ  హనుమంతుని గర్జణను వినెను
వానరు లాందరూ ఔత్సక్యముతోఉండి వృద్దు డైన జాంబవంతుని కలిసెను
జాంబవంతుడు ఉస్చాహము తో అంగద  వానరుల తో ఇట్లు పలికెను
హనుమంతుడు క్రుతార్ధుడై వచ్చుచున్నాడు సందేహము అనిపల్కెను

 
హనుమంతుని చూచు కోరికతో వానరులందరూ చెట్లు ఎక్కెను
ఒక పర్వత శిఖరమునుండి మరోశిఖరముపై దుముకు చుండెను
ఒక వృక్ష పాదాగ్రము నుండి మరొక వృక్షము మీదకు దుమికెను
కొందరు వానరులు వృక్షాగ్రమునున్న కొమ్మలకు వ్రెలాడుచుండెను

కొందరు వానరులు చేతులతో గాలిలో ఊపు చుండెను
హనుమంతుడు మహేంద్ర పర్వతము పైకి వచ్చి దిగెను
వానరులందరూ చేతులు కట్టుకొని నిలబడి ఉండెను
వానరులందరూ అంగదుడు జాంబవంతుడు ఆహ్వానిమ్చెను 


హనుమంతుడు రావడం వానరాలు చూసి చాలా సంతోషము పొందెను
ప్రతిఒక్కరు వికసించిన మోఖములతో ఆనందముగా ఉండెను
మూలములను ఫలములను కానుకలను తీసికొని వచ్చి ఇచ్చెను
రోగము లేకుండా తిరిగి వచ్చిన హనుమంతుని అందరూ కలసి
 పూజించెను

హనుమంతుడు వృద్ధులైన జాంబవంతునకు అంగదునకు అందరికి నమస్కారము చేసెను 
వానరులందరు అనుగ్రహిమ చేసుకొనిరి అప్పడు సీతను చూసితిని అని చెప్పెను  
హనుమంతుడు అంగదుని హస్తము పట్టుకొని అందరిని కలుసు కొనెను 
మహేంద్ర పర్వతముపై  రమనీయమైన ప్రదేశమున హనుమంతుడు కూర్చుండెను 

హనుమంతుడు వానరశ్రేష్టలలొ సంతోషముగా ఇట్లుపలికెను 
ఎట్టి దోషములేని ఎకవస్త్రము ధరించి స్త్రీల మద్య సీతను చూసినాను
ఆమె స్నానసంస్కరములు లేక కృసించి ఉప వాసముతొ ఉండెను
హనుమంతుడుపలికిన సీతనుచూచినాను అన్నమాటలకు సంతోషము  కలిగెను 

కొందరు వానరులు సింహనాదము చేసెను 
కొందరు వానరులు కిచ కిచ అని ఎగురు చుండెను 
కొందరు తోకను ఎత్తి సంతోషముతో ఎగెరెను
కొందరు హనుమంతుని తాకి సంతోషించు చుండెను 

హనుమంతుడు కూర్చొనగ అందరి మద్య అంగదుడు పలికెను 
హనుమంతుని బలములోగాని, పరాక్రములోగాని సాటిలేరనెను
ఏమి నీప్రభుభక్తి, ఏమి నీ పరాక్రమము, ఎమినీధైర్యము అని పలికెను
అదృష్టవశముచె సీతావియొగము తో ఉన్నరామని సోకముతోలగి పోవును 

వానరులు జాంబవంతుడు అంగదుడు హనుమంతుడు సీతల తలము పై కూర్చుండెను
వానరులందరూ సీత రావణుల గురించి వినవలెనని కోరికతో ప్రాంజలులై ఉండెను 
హనుమంతుడు క్కూర్చున్న ప్రదేశము దివ్యకాంతులతో వెలుగు చుండెను 
హనుమంతుడు కూర్చున్న ప్రదేశము ఇంద్రుని వలే ప్రకాశ వంతునిగా ఉండెను 

శ్రీ సుందరకాండ 57వ సర్గ సమాప్తము

ప్రాంజలిప్రభ - సుందర కాండ తెలుగు వచస్సు (56వ సర్గ)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ 
శ్రీ మాత్రే నమ:
శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ: 

56వ సర్గ (వాల్మికి రామాయణములోని 51 శ్లోకాల  తెలుగు వచస్సు)
("హనుమంతుడు మరలా సీత దర్శనము చేసి లంకనుండి  బయలుదేరి సముద్రమును లంఘించుట ")  
హనుమంతుడు శిన్సపా  వృక్షమూలమున ఉన్న జానకిని సమీపించెను
అదృష్టము వలన నిన్ను అక్షతరాలుగా నేను కనుగొన కలిగినాను అనెను
ఆమెకు నమస్కరించు చుండగా ఆ జానకీ మా త మరలమరలా చూచెను
భర్త స్నేహన్వితుడైన హనుమంతునితో అమృత మైన వాక్కులు పలికేను
ఓ అనఘా ఉచితమని తలచిన ఒక్క దినము ఇక్కడ ఉండవలెను
ఏదైనా గుప్త ప్రదేశమున ఉండి  విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళవలెను
ఓ వానరా నీవుదగ్గర ఉండుటవలన అనంత దు:ఖము లేకుండును
హనుమా నీవువెళ్లివచ్చేవరకు నేను బ్రతుకుదునని విశ్వాసము లేదును 

ఓ మహావీర ఒక దు:ఖము తరువాత మరియొక దు:ఖమును పొందు తున్నాను
నేను మనస్సును వికలము చేయు సోకముచే నిత్యమూ కృ సిమ్చు చున్నాను
ఇట్టి నాకు నీ యొక్క ఆదర్శనము ఇంకా హృదయ విదారకము గా నుండెను
ఓవీరా నాకుసందేహము నిలిచిఉన్నది, వానరసైన్యము కడలిదాటి ఎట్లు రాగలుగును

నీవు గరుత్మంతుడు,వాయుదేవుడు ముగ్గురు మాత్రమే దాటి రాగలుగును
వీరుడగుసుగ్రీవుడు, కపి భల్లూక సైన్యము,రాజుత్రులు ఎట్లు దాటి రాగలుగును        
ఓ కార్య విశారదా నా ప్రశ్నకు నీవు ఏమి అలోచించి నావో నాకు  చెప్ప వలెను
ఓ శత్రునాశనా నీవొక్కడివే ఈ కార్యమును సాధించగలవని నాకు తెలియును

ఓ వానర ఈ రాక్షసులను నీవుజఇంచిన శ్రీ రాముని విజయము ఎట్లు కలుగును
పరబలార్ధనుడగు శ్రీ రాముడు తన సేనల తో లంకను వ్యాకుల పరచవలెను
రావణున్ని,  రాక్షసులను జయించి నన్ను తీసుకొని వెళ్ళిన ధర్మమే అగును
ఓమహాత్మా శ్రీ రాముని మనసెరిగి ఏది అనురూపముగానుండునో అట్లే చెప్పవలెను

హనుమంతునితో పలికిన సీతాదేవి హేతుయుక్తమైన పలుకులను
అందరికి తెలుప మన్న అర్దయుక్త మైన ప్రేమ యుక్త మైన వాక్కును
పేరు పేరు న నమస్కారయుక్తమైన, స్నేహయుకమైన మాటలను
విని సీతాదేవికి ప్రదక్షణము చేసి వినయము గా నుంచొని ఉండెను



వానరభల్లూక ప్రభువగు సుగ్రీవుడు నిన్ను రక్షిమ్చుతానని ప్రతిజ్ఞ చేసెను
ఓ వైదేహి కోట్ల వానరులతో సుగ్రీవుడు అతి త్వరలో లంకకు చేర గలుగును
రామలక్ష్మణులువచ్చి లంకానగరమంతా భాణములతో ద్వంసము చేయును
ఓసుందరి త్వరలో రఘురాముడు రాక్షససహిత  రావణున్ని సంహరిమ్చును






ఓ జానకి కొంచము ధైర్యమును చిక్క  బెట్టుకొని ఉండవలెను  
ఓ సుందరి రాక్షసులను చంపి నిన్ను అయోధ్యకు  తీసుపోగలుగును
నీకు శుభమగుగాక  కొంత సమయము ఓపిక పట్ట వలెను
నీవు చూడగలవు భందువులతో రాక్షసేంద్రుడు నిహితుడగుటను




అమ్మా నిన్ను శశాంకునితొ కలియు రోహిణి వలెను
నీవు కుడా రామునితో త్వరలో కలువ గలుగును
శత్రువులను రాముడు  సంహరించి నీ సోకమును
తొలగించి పూర్ణ సంతోషము నీకు కలిగించును

  

జానకిని ఓదార్చి వెల్లుటకు న్నిశ్చఇంచుకొని అభివాదము చేసెను 
ఇప్పటివారు ప్రముఖులైన రాక్షసులను చంపినాను
లంకానగరము వ్యాకులపరచి రావణున్ని వంచిన్చినాను
అని తలుస్తూ కపివరుడు అరిష్ట పర్వతమును అధిరోహించెను


పర్వతముపై ఎత్తైన పద్మ వృక్షములుగల నల్లని పంక్తులను
శ్రుంగాన్తరము లందు వ్రేలాడు మేఘములనే ఉత్తరీయమును
శుభకరమైన సూర్య కిరణములచె మేల్కొనబడు చుండుటను
 ఉదాత్తములైన గైరి కాది ధాతువులను నిమేషరహితములగు నుండెను 


నదులలోని జలరాసుల గమ్భీరఘొష వేదఘోషా యుక్తముగను 
సలయేరు ధ్వనులతో దేవదారు వృక్షములచే పగది నొప్పుచుండుటను
జలప్రపాత నిర్ఘొషములచె అరచు చున్నట్లు కదిలే వనములను 
కంపించు చున్న అరిష్ట పర్వతముపై కపివరుడు నదిరోహించెను


గాలిచే నిండిన వేణువులతోను, వెదుల్లతోను
ఘొరములైన సరములు పూత్క్ర్తులతోను
దీర్ఘవిశ్వాసములు విడుచు చున్నదియును
పర్వతము పై భాగము కూయుచున్నట్లుండెను  


అక్కడ మంచుపొగమూలమున గంభీరముగా ఉన్న గిరిగుహలతోను
ద్యాణమార్గమునకు వీలుగ ప్రశాంత వాతావరణము ఉండుట చేతను
పర్వతము మేఘాలపాదములు తాకుచున్నట్లు కనబడుచుండుటను
చిన్నచిన్న పర్వతముల సమూహాలతో చక్కని ఆనందముకల్గించెను


మేఘ పంక్తులతో కూడిన శిఖరములతో ఆకాశమును కప్పినట్లు కన బడెను
పర్వతముణ ఉన్నగుహలలో అద్భుతమైన కాంతి ఆకాశము తాకు చుండెను
సాల-తాల- అస్వకర్ణ వృక్షములు, వెదుళ్ళు అనేక మైనవి  అక్కడ ఉండెను
సర్ప సముదాయముతోను, మృగగణములచే వ్యాప్తమై, లతలతో ఉండెను


పర్వతముపై మహర్షులు, గంధర్వులు, కిన్నరులు, కిన్పుషులు
యక్షులను
తపమాచారించు చుండెను, ఇంకా మధురమైన లతా ఫల వృక్షము లుండెను
సెల యేరుల పరుగులు, గుహలలో సింహాల ఘర్జనులు పులి ఘా0డ్రిం పులను
వినబడుటను, మారుతికి పూర్తి సంతోషము కలిగించే ప్రదేశసముగా ఉండెను 


పర్వతముపై ఉన్న శిలలు హనుమంతుని పాదముల క్రిందపడి పెద్ద శబ్దంతో నలిగి చూర్ణమై పోయేను
మహాకపి లవణసముద్రమును ధక్షినతీరమునుండి ఉత్తరతీరమునకు పోవు కోరికతో శరీరముపెన్చెను
పర్వతమునుండి మీనములతోను, ఉరగములతోను ఉండిన భయంకరమైన సముద్రమును చూసెను
హనుమంతుడు వాయువు మేఘమును తరిమినట్లుగా ధక్షణమునుండి ఉత్తర దిక్కుకు బయలుదెరెను

పర్వతము మీద ఉన్న అన్ని ప్రాణులు శిఖరములు వృక్షుములు గొప్పధ్వనిచేస్తూ కృంగి పోయెను
హనుమంతుని వేగమునకు వృక్షములు వజ్రాయుదముతో నరకినట్లుగా ముకలై నేలపై పడిపోయెను
గుహలలో ఉన్న సకలప్రాణులు గోప్పధ్వనులు చెస్తూ అకాసము చేదిన్చినట్లుగా  మారి పోయెను
తపమాచారించు ఋషులు, భయముచే వ్యాకులచెంది ఉన్నవారు ఉన్నట్లుగా పైకి గాలిలోకి ఎగెరెను           



ఆ కపివరుడు భయంకరమైనదియును అలల తాకిడులుగల మహా సముద్రతీరము కలదియును
అగు  లవణ సముద్రమును తేలికగా  దాటుటకు ఒక్కసారి ఓం శ్రీ రామ్ అంటూ పైకి ఎగేరెను
హనుమంతునిచే త్రొక్కబడిన  పర్వతము ఉన్నత శిఖరములతో రసాతలమునకు పోయెను
పదియోజనములు వెడల్పు ముప్పది యోజనాలు ఎత్తుగల ఆ పర్వతము భూమితో సమానమాయెను

శ్రీ సుందర కాండ నందు 56వ సర్గ సమాప్తము