Tuesday, 30 September 2025

5వ సర్గ

 


సుందరకాండ ఐదవ సర్గ 


01

ఉ.మందర పర్వతమ్మునను మానస లక్ష్మియె కాంతి శోభగన్ 

సుందర సాగరమ్మున సుశోభిత లక్ష్మియు విశ్వ మందునన్ 

పొందిక పద్మమoదు జల పూజిత లక్ష్మియు శాంతి చూపుగన్ 

చందురు నాశ్రయం బిపుడు చక్కని లక్ష్మియు లంక యందునన్

02.

పంజరమందు హంసకళ పాలన లక్ష్మిగ కాంతి పూజ్యమై 

శృంజన ధీర నేనుగగు శృత్వ ము లక్ష్మియు వీర యోధినీ

భంజన సింహవాహయగు భవ్య  సులక్ష్మియు గర్జనేయగున్ 

రంజన చంద్రకాంతియగు రమ్యత లక్ష్మియు లంక యందునన్

03.చం ::వనితలు మాంసభక్షణము వారి ప్రియాతి ప్రియంబు కోపమున్

వణుకుల మధ్య తృప్తిగను వాక్కుల తీరుగ శోభనమ్ముగన్

క్షణమున చీకటేవెలుగు కామ మహత్త్య శుభమ్ము సర్గమున్

మనమది యేకమేసుఖము మాన్య పవిత్రము నిత్య లంకగన్


04.మ.రమణీయాక్ష నరాకృతిం బొ లుచు వర్ణ శ్రేణి  వీణా నులా

పము చేతంకళగన్ మనో మయముగన్ పాదమ్ము నచ్చామృత

త్వము యాత్మాప్రతి పాదకామ్మగుటయున్ దద్వార్ణ మూలమ్ముగన్

సమనీభావము వాణి సత్యమగుటన్ సారూప్య మౌ లంకలో


05.ఉ::మార్చెడి బుద్ధి విద్దెలగు మానవ రాతలు మార్పుకేయగున్ 

గూర్చెడి త్యాగబంధమగు కోర్కెల తీరుగ సేవలేయగున్ 

దీర్చెడి దుఃఖసౌఖ్యముల తీరుగ పొందెడి లాభనష్టముల్ 

చేర్చెడి మాటతీరగుట చిత్తము తీరుగ జీవనమ్ముగన్


06.చం.కులుకులుతీరునేర్ప చిగురూకనిపింపగ నేమి చేసెదన్  

థలుకులయందమoతయు ని థానము మైమరుపౌను డెందమే  

మలుపులహృద్యపువ్వుల సమాన సుకావ్యము తీరుగా నగున్  

తలపులవింతలేవలపుతాకిన సత్యపు నీడతోడుగన్


07.ఉ.శ్రీ రఘురాము వేడుచును శ్రేయము పూజ్యము నెంచకూర్చుమా  

కారణమేమియన్నను సకామ్యము తెల్పి సముద్దరింపుమా  

నేరుగ నమ్ముచూపులతో నిత్యము మేముగ సేవలే సుమా  

ప్రేరణ రామనామమగు ప్రేమను పంచుట స్వామి నిత్యమున్


08.ఉ.పుణ్యము మేలుగోరుటయు పున్నమి వెన్నెల తీరు నాత్మగన్ 

మణ్యము పాప భీతియన మార్గము లేనిది మాన సమ్ముగన్ 

గుణ్యము కీడునెంచగల గుప్తము లీలలు పాప పుణ్యముల్                రుణ్యత దుష్టపాలనయె రుత్వ దురాత్మగ కాలమేయగున్ 


"09.ఉ.అంగన లెల్లసంబరము నానతితృప్తియు నద్భుతమ్ముగు

చ్చంగున తిప్పురక్కసులు చెంతన సఖ్యత జూపు లాహిరీ

ఖంగున మాటశబ్దములు కాలపు రీతిన నేస్తమవ్వగా

సంగతి గుప్తమే మనసు సాగర తోడుగ శాంతనమ్మహో"

10.శా.ఔరాయేమిది యోగయోగ్యతగునే ఔనత్య నాదంబు గా

తీరంబున్ గతి యోర్తు కాలముగనే తీవ్రత్వ సౌఖ్యమ్ముగన్

వైరంభట్టి తటాలునన్ నెగసెలే వైరాగ్య నాధాంబుజన్

నీ రాజ్యమ్మున వారలే శుభ దులై యిష్టమ్ము చందంబుగన్"

11.ఉ:కల్పన నంబరమ్ముననె కట్టుగ వెన్నెల శోభలీనగన్ 

పొల్ప మహీతలమ్మగు నపోహల తీవ్రత నిత్యసత్యమున్ 

తల్పపు లీలలన్నిగన తన్మయ మొందెడి వైభవమ్ముగన్

మల్పులు రాక్షసాళిదగు మాయల నీడన లంకరాజ్యమున్

12.మ 🌸అలరారే మదినందమేసకలమే యాకర్ష యాశ్చర్యమున్ 

గలనవ్వుల్ మది రువ్వుకాంతులుగనేగమ్యమ్ము చేర్చేoచ చూ

పులతోచేరువ రాగ మానసముగాపూజ్యమ్ము దాహమ్ముగన్

పులకించే మది దేహ భావములుగా ముఖ్యమ్ము రాజ్యమ్ముగన్

13: శా:: నిశ్శబ్దమ్మగు నాట్య నాటకముగన్ నీడైన న్యాయమ్ముగన్

నిశ్శబ్దమ్మగు లోలితాభవముగన్ నింగిన్ సముత్సాహమున్

నిశ్శబ్దమ్మగు కాలమున్ కరణిలో నీ మమ్ము లోకమ్ముగన్

నిశ్శబ్దమ్మగుటే స్వరమ్ము వరమై నిర్మోహ దాహమ్ముగన్

14:శా:: నిశ్శబ్దంబగు  గాలి కళగా నిర్మాణ లక్ష్యమ్ముగన్

నిశ్శబ్దంబగు ధ్యాన మార్గముగనున్ నిర్మాణ శాంతమ్ముగన్

నిశ్శబ్దంబగుడెందమే కదిలెడిన్ నిశ్చేష్ట కాలమ్ముగన్

నిశ్శబ్దంబగువెల్గులున్ విమలమై నిత్యమ్ము సత్యమ్ముగన్

15:: సైరా గర్వముగాను గుంభనముగన్ సై సై యనేరాక్షసుల్

ఏరా కైపుగనున్ మదీభవముగానేమాయ చేసావులే

యౌరా యెంత సుఖమ్ము మేకము కళల్ ఔనత్య లక్ష్యమ్ముగన్

పోరా! రమ్మను చూపు రమ్ము నిదియున్ పూజ్యమ్ము నీకేయగున్

16: మ.మదినిచ్చున్ పరువమ్ము చేరగలగన్ మానమ్ము మాధుర్యమున్

చెదిరెన్ దాపము చిన్మయమ్మగుటయే చిత్తమ్ము ధ్యానమ్ముగన్

పదిలమ్మున్ కళ తీరు సఖ్యతగనున్ పాశమ్ము నీడేయగున్

రుధిరమ్మున్ కలుపే ప్రభావముగనున్ రుద్రత్వ కేళీకళా

17:ఉ.మానస మన్మధుండు కల మర్మము గ్రోలుచు పూలగుంపుగన్

మౌనము వీడి సమ్మనము మాన్యత పొందెడి వీలు మేలుగన్

మానస రాజు గూడికథ మన్మధ చేష్టలు కామ్య కామినిల్

గాన మనస్సు నేకమగు గమ్యము తీరుగ కోర్కె రేవుగన్

18:మ.విధికాదే మనసైనవారిసుఖమున్ విజ్ఞాన మేపంచగా

నదిపొందే సహకారమేయను భవంబానంద జీవమ్ముగన్

విధియాడే కళ తప్పదో వయసు గావిశ్వాస సాహిత్యమున్

మదిమాయల్ సహనమ్ము వెంటగనునే సాధించు తీరే యగున్

19:చం.భవభవ భావసంద్రమది బాధ్యత బంధముగాను నాటగన్

నవనవ నాడి తత్త్వమగు నమ్మక మైన యశస్సు తోడుగన్

బవలు సుహాసినీ పిలుపు పాఠము నీడగ తోడు సౌఖ్యమున్

సవరనలేను జీవనము సాధన శోధన యుండ వచ్చుటన్

20.ఉ.కోకిల గానలాలసయు కోర్కెల యుల్లము జల్లుజల్లుగా 

కేకకు కేకతోడగుట కేళివిలాసము తేజరిల్లెగన్ 

నీకది కొంతవింతగుట నెమ్మది నమ్మక జీవగమ్యమున్ 

చాకిరి యేకుమేకనగ జాతర తప్పని సత్యమేయగున్

  21.ఉ.చక్కగ మద్యపానమున జాతర స్త్రీలగు మత్తు వాక్కులే

చుక్కయు గోరి రొమ్ములను  చూపుచు చేష్టలు వింత వింతగా

మక్కువ సుందరాంగులు సమానము సత్పురుషా సమా సుఖం

బొక్కొకవేళ వేడుచునెమ్రొక్కిన భర్తల కౌగిలింతగన్

 22.మకో. స్త్రీలు కేళులు సంగమాసమ శీఘ్ర భోగము సందడే 

స్త్రీలు రంగుగ వస్త్రమాయ శరీర వర్ణన చూపులై 

స్త్రీలు యోగము తోవియోగము తీరు పుష్పమ నస్సుగన్ 

స్త్రీలు నుత్తమ రాజవంశము సేవ లక్ష్యము చూపుటే

:23. భావం బెక్కడ లేక వృత్తి నియమాపాయంబు జింతింప కెం

దేవర్తించి పదార్ధ వంచనలచే దీపించి మూర్జళి సం

భావింపే హనుమా ప్రణీత కృతి సామాన్యా కృతిం బూని పై

పై వన్నెల్ వచరింప దాని తిలకింపంబోరు ధీరోత్తముల్

24. రాతిని నాతిగా మలుపు రాముని లీలలు కాలతీరుగన్

ఖ్యాతిగ సత్యమే పలుకు కాల సు వాక్కుసతీ వియోగమున్

జాతి గుణమ్ముగా హనుమ జాగిల మాదిరి రామ భక్తిగన్

రాతిరి తూర్పు కొండలభిరామము లయ్యెను సూర్యకాంతితోన్

25.ఉ::కేవల చంద్రకాంతిగను కృత్రిమ దేహము గాంచలేకయున్,

తావిరి పుట్టుపుత్తడగు, నాభావన తత్త్వరేఖల గాంచలేకయున్,

పావని పూర్వగాయములు సానలు, దీరిన మేఘరేఖలుల్,

గావున నట్టి సీతగనగానొనరింపగ, నేర్పు పెంపుమున్.

సుందరకాండ.. 5 వ సర్గ సమాప్తం 

****

 

సుందర కాండ.. 4 వ సర్గ

01. మ.కో.కామ రూప్యత తేజశాలిగ కాలనేర్పుగ శ్రేష్టుడై

క్షేమమాచరణమ్ము శత్రువు క్షే మశాంతికి వీరుడై
ప్రాకరమ్మున దూకి లంకన వామ పాదము మోపగా
చాకచక్యము గాను దూకెను తాను నమ్మిన మార్గమున్

02.రాజవీధిన పుష్పవెళ్ళువ రాతి రందున గాంచగా
భాజ భవ్యత ముత్య కాంతుల భాగ్య తీరున గాంచగా
తేజ మవ్వగ నవ్వులేయగు తీవ్ర వాద్యము గాంచగా
యోజనాస్థితి మేఘకాంతులు యోగ్యతేయన లంకగన్

03. తెల్లని మేఘమాలలగు దీప్యపు కాంతులు లంకయందునన్

మెల్లగ రాక్షసాగృహము మేలుగ నేప్రవహించ వాకిలిన్
చల్లగ మేలుకొల్పగుట జాతికి యాంకిత కాంతి పుంజమున్
ఉల్లము జల్లుగాయగుట యున్నత భావము లంకయందునన్

4.శా ::ఆశ్చర్యమ్మగు శోభరాక్షసగృహా యాకార పద్మమ్ముగన్
ఆశ్చర్యమ్మగు దీప్యమానముగనున్ ఆకాశ సౌదంబుగన్
ఆశ్చర్యమ్మగుసర్వతోసుఖముగన్ ఆనంద మేముఖ్యమున్
ఆశ్చర్యమగు రాజమార్గములతల్ ఆకర్ష యాకాంక్షగన్

5:శా::చప్పుళ్లే విన మేడనిక్కవనితా జా డ్యమ్ము ఊపుల్లుగన్ 

చప్పుల్లేవిన మల్ల యుద్ధపు కళా జబ్బల్లు ఘాతంబులున్

చెప్పుల్లే విన రక్ష ఘర్జనలవిచిత్రమ్ము గానుండగన్ 

చప్పుల్లేవిన వేగ సైనికులగన్ చేసేటి యార్భాటమున్


6:శా::బ్రహ్మాండంబున సర్వ వై భవములున్ పద్మమ్ము తీరేయగున్

 బ్రహ్మాండంబున రమ్యతా కళలుగన్ బ్రహ్మోత్స వమ్మేయగున్

 బ్రహ్మాండంబునరావణా గృహము యున్ భద్రమ్ము వైభోగమున్

బ్రహ్మాండబున గుండ లంక శుభముగన్ బంధమ్ము పిల్పే యగున్


7::కొందరు యజ్ఞ దీక్షలతొ గొప్పగ వేదము శబ్దగీతమున్ 

కొందరు దర్భలేకరము లోజప హోమము చేయుచుండగన్ 

కొందరు యెద్దుచర్మమగు బొంతలు చుట్టియు సర్వ రక్షగన్ 

కొందరు ముండనమ్ముగను కొల్వగు రక్షణ రాక్ష సేంద్రులున్


8::కొందరు కూట మద్గరము కోరిన యాయుధ ధారులేయగున్ 

కొందరు కుంటి వాళ్ళుగను నోంటిగ కళ్ళ వాళ్ళగన్ 

కొందరు పొట్టివాళ్ళగను పూజ్యము చన్నులు లేని వాళ్ళగన్ 

కొందరు వంకరాముఖము కోరిక రాక్షస గల్గి యుండిరీ


9:చం.పనులను యెన్ని చేసినను పాఠము నాకగు గాన మాధురీ

కనులకు నమ్మశక్యమగు కాలము తీరున వాంఛ లీలగన్

ఆణువణువేసుధాలతలు ఆశ్రిత పిల్పుల మాదిరేయగున్

 తనువుకు తృప్తిదాహమగు తన్మయ లక్ష్యము లంకయందునన్


10:శా.పుష్పాలాం కృత దైవ సన్నిధిగనున్ శోభా ప్రభావమ్ముగన్ 

భాష్పoబుల్ సుమశోభసంత సముగన్ బంధుత్వ 

తత్భావమున్ 

నిష్పాక్షంబగు జీవితమ్ముసమరం నీడల్లె సౌగంధిగన్

దుష్పాధమ్ములుగాని తాండవమగున్ సూక్ష్మమ్ము యే మాటగన్


11:ఉ.దేహపు గుండెదిట్టమగు దివ్యము తేజము కాపు కాచుచున్ 

మోహపు దేశమందు కళ మోక్షము జూపుచు కొంత వింతగన్ 

స్నేహము శంకరా యనుచు శీ ఘ్రము పిల్పులు విన్నపా లుగన్

దాహము తీర్చుతీరుగను ధన్యత తెల్పుచు లంకయందునన్


12:ఉ.సుందర నందనమ్ముయగు శోభిలు సుందరి దేహ తాపముల్ 

కొందరు ప్రేమ జూపులగు గూల్చ మనస్సును బుద్ధిహీనులై 

కందెను సర్గమేయనుచు కల్మష తీరున రెచ్చకొట్టుచున్ 

పొందవివేకమయ్యదియె భూమిగ లంకన చూచెమారుతీ


13:చం.పలుకుయె మన్ననన్నొసగు పాశము పెంచు శుభంబు తోడుగా 

తలపులు తప్పునొప్పులగు తన్మయ మొoద వికాస మవ్వగా 

మెలుకువ మేటి దీక్షలగు మేదిని మోహము గాంచ తీరుగా 

సులభము కాదు జానకిని చూచుటయు నిక్కము కష్టమేయగున్


14:ఉ౹౹పంచగ కాలమాయె,తలపండిన సత్యము నీతులాయె,శా

 పించెడి ధర్మమాయె,నిజ మెంచెడి వారలు నెక్కువాయె,ప్రా

పంచక భోగమాయె,పరి పాలన నీడచరిత్రమాయె,ర

క్షించుము దీనులౌ ప్రజల సేమములారసి లంక యందునన్

15:చం.మనసుకు చాల కష్టమగు మాయలు తీరున కర్మ లంకగన్ 

క్షణమున కోపతాపముల కార్యము జేయుచు నున్న తీ రుగన్ 

ఋణమును తీర్చు విద్దేలగు భూమినసత్యము సంపదే యగున్ 

తనమన భేదమేయనక తత్త్వపు బోధను గాంచ మారుతీ


16:ఉ.దారిని జూపుమా మనసు దైన్యము నుంచితి నిద్దరింపుమా 

నేరుగ జేరలంకగను నీదయ నేనుగ జూడ నిక్కడన్ 

కారణమేనుసీతగన కార్యము ధన్యత నొందు వీలుగన్

శ్రీరఘు నందనా శరణు శ్రేయము గూర్చుము లంకనందునన్


17:ఉ.శ్రద్దగనే భవంతులగు సామ్యపు సుందర వైభవమ్ముగన్ 

సిద్ధులు పొందరక్కసులు చిత్తము భక్తిగరాజ్యమoదునన్ 

బుద్ధులు నేర్పునోర్పుగను పూజ్యులు పూజలు చేయు చుండగన్

విద్దెలు యున్నవారికళ వేడుక తీరుగ నేస్తలంకగన్


18.తొందరలేక వెత్కెదను తోట గృహంబులు గట్టుగట్టుగన్ 

ఇందున యెoదుజూచినను యీశ్వర లీలలు లంకయందునన్ 

సందులు వీధులన్నిదయ సఖ్యత గాంచుట నేను జూచితీ 

యందున కానలేక మది యాసల జానకి రామభక్తిగన్


Saturday, 27 September 2025

 


🎶 సుందరకాండ కీర్తన 🎶

పల్లవి

రామదూత హనుమా

రామబంటువు నీవే సుమా

దీక్షా తత్వ భక్తశ్యామా

ప్రేమతో మమ్ము గనుమా

చరణం 1

చప్పుడు వింటి సందడి నిండెను

మనసున దప్పుడె యోచన కలిగెను

ధ్వనియది సత్యమో మిధ్యయో గదా

తిప్పలు పోవు మార్గమును తెలుపవా

చరణం 2

రత్నకాంతుల వస్త్రవైభవమున్

లంకను నిండె స్త్రీల గోప్యతయున్

యంగచౌష్టవమున్ యత్నముగ చూచెదన్

రావణపురమున్ హనుమంతుఁడు జూచెదన్

చరణం 3

నవనాడి రాత్రుల కలలలోన

సీతమ్మరొ జ్ఞాపకమే నాలోన

నవనీతమువలె నాకంతరమున్

నవవిద్యలవాక్కు వెలుగున్ ఇమ్ము

చరణం 4

రామ తైలము లేని దీపమునై

రామ శీలముగున్న రూపమునై

రామ నామమునే జపించుచునై

ప్రేమముని పాలించు దోషమునై

చరణం 5

ప్రశ్నగ లంకిని పలుకుచునై

ప్రశ్నగ ధైర్యమును నింపుచునై

ప్రశ్నకు వానరుని జ్ఞానమునై

ప్రశ్నయందు విజయం సాధించునై

చరణం 6

సాగునె జీవనౌక భవసాగరమున్

తూగుచు యాటుపోటులలోనున్

యోగపథానువర్తనముగనున్

ముక్తికై జానకీపతిని జపించున్

చరణం 7

భీకర రూపముగ లంకిని బాదెదన్

శ్రీకర పాహిమాం మని రక్షించెదన్

ఏకకు యాంజనేయముని నమ్మెదన్

దివ్య రౌద్రముని జయముగా గానెదన్

చరణం 8

లంకిని మాటలతో సమాధానమై

సీతా దర్శనమే సదుపాయమై

రామదూతుడున్ శివవంశజుడై

దివ్య కృపామయుడై రక్షించెదన్


ముగింపు (పల్లవి పునరావృతం)

రామదూత హనుమా

రామబంటువు నీవే సుమా

దీక్షా తత్వ భక్తశ్యామా

ప్రేమతో మమ్ము గనుమా 🙏


👉 

Wednesday, 24 September 2025

3వ సర్గ

 01.మకో.మంద మారుత చల్లగాలులు మానసమ్మును తేల్చగన్

సందు మేఘము లంకనందున సందడేసుఖ మివ్వగన్

చందనమ్మగు వాసనేమది చాకచక్యము నేర్పుగన్

అందమా బహుసుందరం మ ది ఆశ తీర్చెడిలంకయున్


02.చం::మెరుపులుగాసమమ్మగుట మేలుగ జేయుట నిత్య వైభవమ్ 

తరువులతోనుతేలగలతన్మయభాగ్య భవంతి కాంతులున్ 

చెరువులు నందుపక్షులవిచిత్రము జూపెడిరాజ హంసలున్ 

అరుపులులేనిసంగతులుగానుయె నిశ్శబ్దమవ్వ లంకగన్


03.మకో.ఏంత చెప్పగ తక్కువేయగు యెంచ లేనిది వైభవమ్

కాంతి యంతయు చూడ చక్కగ కాలతీరుగ యుండగన్

బ్రాంతి కాదది యక్షరాలగు బంధ పిల్పుగ నేయగున్

శాంతి మార్గము శోభలే గతి శాసనమ్మగులంకగన్


04.మ.కో ఎందు కింత భయమ్ము తోనన  యెల్లలన్నియు రక్షగన్ 

చిందులేసెడి రక్షయోధులు చెప్పుమాటలు యాటలన్ 

మందువల్లన నీతి తప్పని మత్తుయెక్కిన వారుగన్ 

అందుకేయది మత్తు సంపద గాను గానగ వచ్చుచున్


05.చప్పుడు వింటి నయ్యదియె సందడి బెంచగ మానసంబునం
దప్పుడె యోచనల్ కలుగు నా ధ్వని సత్యమొ! మిధ్యయో!గదా!
యెప్పటికప్పుడే మనసు నింతగ నారడి బెట్టునదేదొ? యేమొ? యీ
తిప్పలు పోవు మార్గమును తెల్పున దేదియొ తోచకున్నదే!

06. మకో.రత్న కాంతుల వస్త్రవైభవ రాశి బోసిన తీరుగా


యత్న ప్రాయపు స్త్రీల స్థణ్యము లాశ తీర్చెడి గోప్యత న్
రత్న మేయగు యంగచౌష్టము రవ్వ కాంతుల నీడలో
యత్నమంతయు జూడచక్కగ యాకలేయగు లంకగన్

07.మ::నవనాడీ మయరాత్రముల్ కనవలెన్,నాతల్లి సీతమ్మరో..
భవరూపమ్ముగ బాధ్యతన్ గనుచు,నాభాగ్యమ్ము కారుణ్యతన్
నవనీతమ్మగుచిత్తమందిరముతో  నానందియై సౌఖ్యముల్
నవవిద్యామది దివ్యవాక్కు నిడగా నాబుద్దిగ వెత్కెదన్.

06. మకో.రత్న కాంతుల వస్త్రవైభవ రాశి బోసిన తీరుగా


యత్న ప్రాయపు స్త్రీల స్థణ్యము లాశ తీర్చెడి గోప్యత న్
రత్న మేయగు యంగచౌష్టము రవ్వ కాంతుల నీడలో
యత్నమంతయు జూడచక్కగ యాకలేయగు లంకగన్

07.మ::నవనాడీ మయరాత్రముల్ కనవలెన్,నాతల్లి సీతమ్మరో..
భవరూపమ్ముగ బాధ్యతన్ గనుచు,నాభాగ్యమ్ము కారుణ్యతన్
నవనీతమ్మగుచిత్తమందిరముతో  నానందియై సౌఖ్యముల్
నవవిద్యామది దివ్యవాక్కు నిడగా నాబుద్దిగ వెత్కెదన్.

08.మ.కో.రామ తైలము లేనిదీపము రవ్వ కాంతిగ చిత్తమున్
రామ శీలము గున్న రూపము రక్ష పొందని వైనమున్
రామ నేడుగ కోపమున్నను రమ్యతేయగు డొల్లగన్
ప్రేమ పాలిత తప్పు దొర్లిన పిచ్చియేమది తీరుగన్

09.ప్రశ్నగ రాక్షసస్వరము రావణ పాలన లంఖినీవచన్
ప్రశ్నగ శబ్దమై పలుకు రాక్షస మాయగ యడ్డు పల్కుగన్
ప్రశ్నగ నీవుయెవ్వడవు ప్రాణము తీసెద ఖచ్చితమ్ముగన్
ప్రశ్నకు వానరుండు సహపాఠము చెప్పుచు ధైర్యముంచగన్

10.ఉ౹౹సాగునె జీవనౌక భవ
సౌఖ్యసుధాంబుధికాల మార్పుగన్
తూగదె యాటుపోటులకుఁ దూల్చవె బాధల తీరు తప్పదున్
భోగ విలాససంపదలఁ బొంగక, నేనుగ గ్రుంగిపోక,స
ద్యోగపధానువర్తనమె యుక్తము ముక్తికిజానకీపతీ

11.శా::స్త్రీరూపమ్మున యున్న లంఖిని కళే శీఘ్రమ్ము రౌద్రమ్ముగన్
సారూప్యంహనుమా నిమిత్త పలుకే సంతృప్తి గాచూచెదన్
కోరీ లంకను గాంచ వచ్చితిని సకోపమ్ము నీకెందుకున్
నారీవచ్చినదారినేవెడెలెదా నమ్మాలి నాపల్కులన్

12.భీకర రూపిలంఖిని దభీయని బాదెను ఆంజనేయుగన్
ఘీకర శబ్దమైహనమ గేలిగ కోపము వచ్చి కొట్టగన్
శ్రీకర పాహిమామ్ మనసు శీగ్రము రక్షణ చేయుమా యనెన్
ఏకకు యాంజనేయ మము విద్దెల కావుము లంఖినీయనెన్

లంఖిని హనుమంతునితో పలికెను

13.శా:సామాన్యుండవునీవునన్నువిడిచే సాగించ లేవానరా
నామాయాప్రభవమ్ముగాను
వధనాకార్యమ్ము ప్రాణమ్ముగన్
నీమాయల్ ననుగాను యేమి యనకే నేతాడ రౌద్రమ్ముగన్
సామాన్యమ్మన శబ్దమే ప్రభువమున్ సామర్ధ్య హింసించగన్

[25/09, 19:36] Mallapragada Ramakrishna: 05.చప్పుడు వింటి నయ్యదియె సందడి బెంచగ మానసంబునం
దప్పుడె యోచనల్ కలుగు నా ధ్వని సత్యమొ! మిధ్యయో!గదా!
యెప్పటికప్పుడే మనసు నింతగ నారడి బెట్టునదేదొ? యేమొ? యీ
తిప్పలు పోవు మార్గమును తెల్పున దేదియొ తోచకున్నదే!

24 ఏమని చెప్ప చేర గిరి యిచ్ఛగ దర్శనకాంక్ష తీర్చగన్
మామది శోధనాచరిత మార్గము యేలను తండ్రి నాకుగన్
సామము బుద్ధితత్త్వమగు సాధ్యము నెంచను లేకనుండితిన్
ప్రేమగ నిన్ను కొల్వగల ప్రేరణ చాలును నాకు యిప్పుడున్

15.గుట్టలు పుట్టలే వెతక గుట్టున పట్టగ లేక పోవగన్
పట్టున గట్టిపట్టుగల బ్రత్కగు జానకి నీడ వెత్కగన్
మట్టున బెట్ట రాక్షసుల మాయలు యన్నియు ధైర్య ధీరగన్
జట్టులు గున్న సైనికుల జా డ్యము మార్చెను వాయుపుత్రుడున్

16.లంఖిని ప్రోశ్చాహం

నీవే శ్రీ శివవంశజుండవని నేనిష్టా గరిష్టాత్మతో
భావిoతున్ సతతమ్ము దీనునకు భావ్యం వేదియో చూపి  నీ
సేవల్ గైకొనమయ్య అజ్నుతను నా చెనైన కార్యంబు వో
దేవా దీనశరణ్య దివ్యగుణవార్ధీ వాయు పుత్రుడా

17.కాంతల వస్త్ర వైభవము కాముక లీలలుగాను గాంచగా
పొంతన స్త్రీల భవ్యముయె పూజ్యపు గొప్యత గాను నుండగా
పంతము యంగ చౌష్టవము పాఠ్యము సంతసమేను తీరుగా
యంతయు జూడచక్కగ సయోధ్యత తీరున గాంచ మూలమున్

18.శా::లంకాపట్టణమున్ దురాత్మకళలే దుర్బద్ధి తో నిండుటన్
ఇంకానీవుగవెళ్లి సీతగనుమా యిచ్చాను సారమ్ముగన్
ఇంకానందిగశాపమున్నదిలే యీశ్వర సంకల్పమున్
సంకోచించక సీత రామకలుపూ సందర్బమేనీకుగన్

సుందర కాండ 3 వ సర్గ సమాప్తము


Thursday, 18 September 2025

హనుమాన్ కీర్తనలు 2 వ సర్గ

 *అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా*

*నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా*

*|అన్నపూర్ణాదేవి|* 


*విశ్వైకనాథుడే విచ్చేయునంటా*

*నీ ఇంటి ముంగిటా* *నిలుచుండునంటా*

*lఅన్నపూర్ణాదేవిl*


*నా తనువునో తల్లి నీ సేవ కొరకు*

*అర్పింతు నోయమ్మ పై జన్మ వరకు*

*నా ఒడలి అచలాంశ నీ పురము జేరి*

*నీ పాద ముద్ర తో నెగడాలి తల్లి*

*lఅన్నపూర్ణాదేవిl*


*నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి*

*నీ పాద పద్మాలు కడగాలి తల్లి*

*నా తనువు తేజోంశ నీ గుడికి చేరి* 

*నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి*

*lఅన్నపూర్ణాదేవిl*


*నా తనువు మరుదంశ నీ గుడికి చేరి* 

*నీ చూపు కొసలలో విసరాలి తల్లి*

*నా తనువు గగనాంశ నీ మనికి జేరి*

*నీ నామ గానాలు మోయాలి తల్లి*

*lఅన్నపూర్ణాదేవిల్

****

కీర్తన.. 789

పల్లవి

రామకార్యమునకు రామదూతుడై

హనుమ మంగళమూర్తి – జయ జయమూర్తి


చరణం – 1

వచ్చిన కార్యమునకై వాక్కున దృఢముగా

దీక్షతొ సాగెడి ధీరత మహిమగా

హేమలంక చేరెడి తేజమున గర్వముగా

రామకార్య సిధ్ధికి రమ్యునై నిలువగా


చరణం – 2

శక్యమునైనది సూక్ష్మ రూపముతో గాని

అశక్యమేమియే వాయుపుత్రునకాని

సాహసమంతయు సాధ్యమై నిలిచెని

రామదూతుడి భక్తి రత్నమై వెలిగెని


చరణం – 3

సీత జాడకై సాగె సేవా మనసుతో

మంచి మార్గములలో మంగళాత్ముడై

లంకలో శోధన జేయు దీక్షతతో

జానకిని గాంచెడు జయహనుమతో

👉

[23/09, 06:35] Mallapragada Ramakrishna: కీర్తన..101112

పల్లవి

విశ్వాసమే జీవన ధర్మము

విశ్వాసమే మంగళ మర్మము


చరణం – 1

పుస్తకమే ఈ బ్రతుకు పుణ్య–పాపములతో నిండి

మాయల మధ్యన మౌనమై నిలిచెను గమ్యమై

వాక్కుల తీరున ధర్మమై వెలిసెను

ప్రస్తుత లక్ష్యమై ప్రాభవమై నిలిచెను


చరణం – 2

విశ్వాసము సుధీచరితమై విద్యలతో యోగమై

యుగాల వెంట కదులెను వీణామాధుర్యమై

హృదయ విస్తారమై గుణముగా నిలిచెను

ప్రేమముగా జీవకాలని వెలిగించెను

👉

పల్లవి:హనుమంతా

సరగున రారమ్ము ప్రోవ జయహనుమంతా !

సహజ భక్తివహి సింహ వీర హనుమంతా !!


చరణం 1:

సీతారామ నామముల జపమున భాసిల్లున్

సత్యధర్మ సౌధమున నివసియున్

మాతృభక్తి గల వీర ! మారుతి సూతా !

దాససేవ గల వీర ! దయామయ హనుమంతా !!


చరణం 2:

లంకలో ప్రవేశించు లావణ్యమున్ చూపితివి

దశముఖుని దర్పము దహించితివి

రామదూతుడవు నీవు రక్షకుడవు నీవు

రాజమౌలికి మణియవు ! జయహనుమంతా !!


*శ్రీ బాలా త్రిపురసుందరి స్తోత్రం*

*కదంబ వనచారిణీం ముని కదంబ కాదంబినీం*

*నితంబ జిత భూధారం సురనితంబిని సేవితాం*

*నవంబురుహ లోచనాం అభినవాంబుదా శ్యామాలాం*

*త్రిలోకజన కుటుంబనీం త్రిపుర సుందరీ మాశ్రయే*

*కదంబవన వాసినీం కనకవల్లకీ ధారణీం*

*మహార్షమణి హారిణీం ముఖసముల్ల సద్వారుణీం*

*దయా విభవ కారిణీం విశదలోచనీం చారిణీ*

*త్రిలోకజన కుటుంబనీం త్రిపుర సుందరీ మాశ్రయ*

*కందబ వన శాలయా కుఛ బరోల్ల సన్మాలయా*

*కుచో పామిత శైలయా గురుకృపాల సద్వేలయా*

*మదారుణ కపోలయా మధురగీత వాచాలయా*

*కయాపి ఘన లీలయా తపచితవయం లీలయా*

*కందబ వన మధ్యగం కనక మండలోపస్థితాం*

*షడంబ రుహ వాసినీం సతత సిద్దసౌదామినీం*

*విడంబిత జపారుచిం వికచచంద్ర చూడామణీం*

*త్రిలోకజన కుటుంబనీం త్రిపుర సుందరీ మాశ్రయే*

*కుచాంచిత విపంచితాం కుటిల కుంతలాలంకృతం*

*కుశే శయనివాసినీం కుటిల చిత్తవిద్వేషణీం*

*మదారణ విలోచనాం మనసి జారి సంమోహినీం*

*మాతంత ముని కన్యకాం మధుర భాషిణి మాశ్రయే*

*స్మరతే ప్రథమ పుష్టిణీం రుధిర బిందు నీలాంబరాం*

*గ్రుహిత మధు పాత్రికాం మధు విఘూర్ణ నేత్రంచలం*

*ఘనసథిన భారోనతాం గలిత చూలికాం శ్యామలాం* 

*త్రిలోకజన కుటుంబనీం త్రిపుర సుందరీ మాశ్రయే*

*సకుంకుమ విలేపనాం అళిజ చుంబి కస్తూరికాం*

*సమందహసితేక్షణాం సచర చాప పాశాంకుశాం*

*అశేష జన మోహినీం అరుణ మాల్య భూషాంబరాం*

*జపా కుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం*

*పురందర పురంధ్రికాం చికుర బంధ సైరంధ్రికాం*

*పితామహ పతివ్రతాం పటు పటీర చర్చారతాం* 

*ముకుంద రమణీమణి లసదలంక్రియా కారిణీం*

*భజామి భువానాంబికాం సురవధూటితా చేటికాం*


*ఇతి శ్రీమద్ శంకరాచార్య విరచిత త్రిపురసుందరి స్తోత్రం సంపూర్ణం.*🙏


🌸🌸🌸🌸🌸🌸


అర్హత కీర్తన

పల్లవి

అర్హత లేని దారిగను ఆనతి కల్గదులే నిజమ్ముగన్

అర్హత గల్గు వానికిని ఆంజని పుత్రుని ప్రేమ యుండుటన్ ॥


చరణము 1

అర్హత యాంజనేయుని సహాయ రమామది రామ డెంచగన్

అర్హత నమ్మకమ్మగు సమాజయ స్నేహము తీరుయేయగున్ ।

అర్హత ధైర్య సాహసము సామ్య మనస్సుగ నెంచగల్గగన్

అర్హత యే శుభమ్ముగను ఆనతి మీరని ఆంజనేయుడున్ ॥


చరణము 2

అర్హత వాక్యముగ చెప్పిన ఆచరణ తీరము మేలుగన్

అర్హత విద్య కలిగిన వాడు వినయమునే గల్గుచుండగన్ ।

అర్హత దివ్య సేవగతం ఆరతి లేని దారముగనన్

అర్హత యే భవాబ్ధితరము ఆనతి శాంతి దాయకున్ ॥


చరణము 3

అర్హత పూజ గీతముగ ఆరతి వెలుగును జూపగన్

అర్హత యందు భక్తి గల వాడికి ఫలించును మోక్షపథమన్ ।

అర్హత వీరహనుమ గుణ గాధలతోడు మేలుకొనున్

అర్హత యే సుపథంబుగ సమాజమునందు శాశ్వతమున్ ॥

👉


ర్తన (ఆది తాళం, హంసధ్వని రాగం సూచన)

పల్లవి

రామకార్య సిద్దికి మారుతీ వందనము

భక్తుల హృదయమందు నిలిచే నిత్య స్మరణము ॥


అనుపల్లవి

తల్లిదండ్రులు గురువులారూ దారులారూ నీకే సమము

నిత్యసత్య స్మరణముతో జానకీపతి నీవే శరణము ॥


చరణము 1

మనమున నెంచు కార్యములు మాన్యత నందు వెలసెను

క్షణములు జేరును సకాలమై సదా గమ్యమై యుందు

గుణములు నిండిన సంగతుల కలిసిన భాగ్యములందు

మనసగు రామకార్యమున్ మారుతి లంఘనమై యుందు ॥


చరణము 2

తల్లియు దండ్రియు గురువులారూ నీవే శరణమై

కల్లలు కాని కరుణయై సంబర సమ్మతమై యుందు

నొల్లనో వేరుదైవమును నిత్యసత్యమై నిలిచెను

ఉల్లమునందు స్మరణతో జానకీపతీ శరణమై యుందు ॥


చరణము 3

సమయచిత్తము లేనియై సత్వతత్త్వము ప్రశ్నలై

సమరమై యున్న కల్పన సంధి గష్టముగ వెలసెను

అమలుకాలమున్ ధర్మమై అంధకారమై నిలిచెను

ప్రముఖులైన వారియందు ధర్మమార్గము నిత్యమై యుందు ॥

👉

🎶 కీర్తన (ఆది తాళం – కీరవాణి రాగం సూచన)

పల్లవి

రామకార్య సిద్దికి మారుతీ శరణమై యుందు

భక్తుల హృదయమందు నిలిచే నిత్యసత్యమై యుందు ॥

అనుపల్లవి

జానకీపతీ పాదము నిత్యమై శరణమై యుందు

ధర్మమార్గమందు దివ్యశక్తి జాగ్రత్తై యుందు ॥

చరణము 1

మనమున నెంచు కార్యములు మాన్యత నందు వెలసె యుందు

క్షణములు జేరును సకాలమై సదా గమ్యమై యుందు

గుణములు నిండిన సంగతుల కలిసిన భాగ్యములందు

మనసగు రామకార్యమున్ మారుతి లంఘనమై యుందు ॥

చరణము 2

తల్లియు దండ్రియు గురువులారూ నీవే శరణమై యుందు

కల్లలు కాని కరుణయై సంబర సమ్మతమై యుందు

నొల్లనో వేరుదైవమును నిత్యసత్యమై నిలిచె యుందు

ఉల్లమునందు స్మరణతో జానకీపతీ శరణమై యుందు ॥

చరణము 3

సమయచిత్తము లేనియై సత్వతత్త్వము ప్రశ్నలై యుందు

సమరమై యున్న కల్పన సంధి గష్టముగ వెలసె యుందు

అమలుకాలమున్ ధర్మమై అంధకారమై నిలిచె యుందు

ప్రముఖులైన వారియందు ధర్మమార్గము నిత్యమై యుందు ॥

చరణము 4

చంద్రుని కాంతి పుంజములు చంద్రిక రూపమై యుందు

చంద్రుని మచ్చపొడ దివ్య సాతమై శోభిలై యుందు

చంద్రుడు విష్ణు చక్రముగా తనరించు సూచకమై యుందు

చంద్రుని సోయగమ్ములు తోడన సీత శోధనమై యుందు ॥

చరణము 5

దిగుడు బావులు పెక్కులై నట తేలగిల్లినవై యుందు

మొగలి పువ్వుల మల్లెల మొగ్గలే విరబూయ యుందు

ఎగయు కొండ వాగులు ఇప్పపూవుల మంకెలై యుందు

సొగసుగా శిఖరాగ్ర శోభతో లంకనగరమై యుందు ॥

చరణము 6

భోగవతీపురాధిపతి పూజ్య కుబేరునై యుందు

యోగము రావణుండును యోగ్యత పొందినై యుందు

భాగము పాలనలో దీర్ఘ లంకనగరమై యుందు

త్యాగ కుబేర సంచిత కాంచన రూపమై యుందు ॥

👉

రెండవ సర్గ

 1. చంll  మనమున నెంచుకార్యములు మాన్యత నందక గాసిలేలనో   

క్షణములు వచ్చు నింకను సకాలము జేరగ వేచియుండినన్   

గుణముల నెన్న సంగతుల కూరిమి భాగ్యము లెన్నొ గల్గగన్ 

మనసగు  రామకార్యమున మారుతి లంఘన జేసె లంకకున్

2. ఉ౹౹ తల్లియుఁ దండ్రియున్ గురవు దారుల సర్వము నాకు నీవెగా 

కల్లలు కావు నీ కరుణ కాన్కలు  సంబర సమ్మ తమ్ము; నే 

నొల్లను వేరు దైవమును నోచగ మిమ్ముల నిత్యసత్యమై 

యుల్లము నందునీ స్మరణ యుండగఁ దీర్చుము జానకీ పతీ


3. త:: సమయ చిత్తము లేనిదూతల సత్వ తత్త్వము ప్రశ్నయై 

సమరమైనను గాని, కల్పన సంధి యైననుఁ గష్టమే 

అమలు కాల ప్రవృత్తి ధర్మ ము అంధకారములై గనన్  

ప్రముఖులైనను ధర్మమార్గమె బాధ్యతేయగు నిత్యమున్


4. ఉ:: చంద్రుని కాంతి పుంజములు చంద్రిక ప్రాపున వెల్గు దారులై  

చంద్రుని కున్నమచ్చపొడ సాతము జూపగ లంక శోభిలన్ 

చంద్రుడు విష్ణుమూర్తి కర చక్రముగా తనరించు సూచికన్ 

చంద్రుని సోయగమ్ములనిజమ్ములు తోడన సీత శోధనన్


5. త. దిగుడు బావులు పెక్కులై నట తేలగిల్లిన నాచుతో  

మొగలి పువ్వులు కొండమల్లెలు మొగ్గలే విరబూయగా  

ఎగయు సన్నటి కొండ వాగులు ఇప్ప పూవులు మంకెలూ  

సొగసుగా శిఖరాగ్ర శొన్నపు శోభ లున్నవి లంకలో


6. ఉ.  భోగవతీపురాధిపతి పూజ్య కుబేరుని రాజ్యమేయగున్ 

యోగము రాక్షసుండునిట యోగ్యత చెందగ సమ్మతమ్మునన్ 

భాగము రావణుండు తన పాలిట జేయగ దీర్చెలంకనున్ 

త్యాగ కుబేరు సంచిత వితానము కాంచన లంకయే యగున్


7. ఉ:: వచ్చిన కార్యమున్నడరు వాటున దీక్షగ నెట్లు  తేర్చెదో 

కచ్చిత బుద్ధి సూక్ష్మతల కారణ నిర్ణయ శోధనా ప్రతుల్  

మెచ్చిన రామ కార్యమున మీరిన లంఘన శక్యతా తతుల్  

హెచ్చిన తేజమున్ హనుమ హేమపు లంకను జేరె నప్పుడున్


8. ఉ:: శక్యము కాదు రాక్షసుల సన్నిధి సీతను గాంచ నేరికిన్  

శక్యము సూక్ష్మ రూపముల సంచిత  చేతల హన్మ కేయగున్     

శక్యము కానిదా విహిత సంహత కార్యము సూనృతమ్ము గా  

శక్యము వాయు పుత్రునకు సాధ్యము గాదన నన్యమెక్కడన్


9. చ: అనయము సీత జాడ గను యంకిత సేవల లంక జేరగన్ 

ఎనదగు మంచి మార్గమున, హెచ్చిన సంవిధ ప్రత్యయమ్ము లన్ 

ఘనతర! జానకీ సతిని గాంచగ లంక సమీక్షలెన్నగన్ 

అణకువ లైన విద్యలలొ అంజని పుత్రుడు మంగళాత్ముడై


: 10. ఉ. విస్తరణమ్ము నన్ తిరిగి విగ్రహ రూపముఁ బెంచి లంకనున్ 

శస్తము లైనకార్య ములు జానకినిన్ గను సంగతుల్ వినన్  

మస్తము నందు ముఖ్యముగ మారుతి దల్చిన ధర్మకార్యమై   

ప్రస్తుత రామ సేవలకు ప్రాంజలి యొగ్గి ప్రయాణ మందగన్


 11. శా: విశ్వాసమ్మున వాయు నందనుడు వైవిధ్యమ్ము లెన్నోగనన్

విశ్వాసమ్మును వీడకన్ కడిమితోవేసారు సాధ్యమ్ములన్

విశ్వాసాద్య గుణమ్ములన్ మదిని సంవేద్యమ్ము లౌ దీవెనల్

విశ్వాశాభినివేశసాధనలు విశ్వేశానతిన్ బొందగా


 12. ఉ.: వ్యాకుల మున్న కార్యములు వాటముగానగు సంశయమ్ములన్  

స్వీకరణమ్ము లైన ఘన స్నేహిత సేవన సంవిధమ్మునన్    

సాకములీవివేకపద సాధన శోధన కార్య సూత్రముల్  

ఏకమె సీతజాడలకు హేతువు లెన్నగ నిశ్చయమ్ము నన్


 13. ఉ:: గర్వము హెచ్చి కళ్ళనెటు గానక రాక్షస రావణుండిలన్ 

నిర్వచనమ్ము లీయదగు నిశ్చల పుత్రిక జానకీ సతిన్ 

ఉర్వికె కీడుగా చెరల నొగ్గున నుంచగ పట్టు కొచ్చినన్ 

ఖర్వము వానికిన్ నణచు కార్యము జేయగ శోధనార్థమై


 14. చం. మనసున దైత్యమాయలకు మ్లానములై తడబాటు చెందగా  

తనరగు కార్య పాటవము తప్పిన వాలున నిర్గుణమ్మునన్ 

ఘనమగు శౌర్య తేజములు కాంచన లంకను జూడ వశ్యమై 

తనరగ నాంజనేయుడు నుదారత జెందగ లంక శోభలన్


 15. చం:: మలుపులదీర్చి లంకనటు మారుతి పట్టిన పట్టు వీడకన్

కలనగు విద్య లన్ సమయ కారణ తీరులు సమ్మతమ్ముగా 

చెలిమికి వశ్యమైన తగు సేవలు నిశ్చిత ధర్మ నీమమై 

నెలవుల శోధనల్ విధుల నేర్పుగ జేయగ లంకనందునన్

 16. శా:: నాదమ్ముల్ నినదించ సాగె నటగా నాలంక రాజ్యమ్మునన్ 

క్రోధమ్మున్ హనుమయ్య గట్టి ప్రకటాక్రోశమ్ము నెట్టించగా   

శోధింపుల్ తనరించ నంత ప్రతిగా శోభించు లంకన్ గనన్  

బాధించన్ స్వగతాన లంక సిరులన్ ప్రాకాశ్యమున్ మెచ్చి నన్

 17. ఉll  నమ్మక ముంచగా నియత న్యాయము లన్ సరి దీర్చగా నగున్

నమ్మిన విశ్వ నీతినిట నర్తన జేయగ నీశుడుండగన్

నెమ్మనమున్ పరాకుగొన నిశ్చయముల్ విధి వశ్యమే యగున్

నమ్మగ ధర్మమున్ చెడిన నల్వజనుండిల లేడు సత్యమై


 18. మll   ప్రకటించన్ గడు భావ్య చింతనల సంప్రాప్తమ్ము సంధిల్లమై 

సకలానుగ్రహ సేవలన్ సహనమే సామర్థ్య సంభావనై  

ఒకటే బాస నొకే శరంబనగ విద్యోతమ్ము ప్రాబోధికన్ 

ముకులమ్మై విరులంతటా పరచ నా భూమాత రామార్థికిన్


  1. మll కలలన్నీ కదిలించమానసమునన్ గాలాను గుణ్యమ్ముగా
    ఫలితమ్ముల్ మును ముందుగా గదియ సంప్రాప్యమ్ము లెచ్చించగా
    అలవోకై గలుగన్ విశేషముగ ప్రహ్రాదమ్ము కల్గించగా
    అలలన్నీ పరుగందుచర్యలనగా జ్ఞానాతి రేకమ్ములన్

: 20. :: చంll విషయము లంకనందునవివేకము జూపగ సీతజాడలన్
మిషలుగ నెంచి రాక్షసులు మిథ్యల జూపగ జంకు లేకనే
కషణము లైన తీర్పులను గాదిలి శోధల నించ రాదనన్
మిషములనెన్ని జూపభయ మెన్నక జాగృతి జూపి దీటుగా

21ఉ:: మేడలు స్వర్ణ కాంతుల ప్రమేయమునన్ ప్రభవించ లంకనన్
వాడలు రత్న రాసులుగ వాకిట ముంగిల రంగవల్లులై
జాడలు వజ్ర కాంతుల ప్రసారము లెన్నిన శోభనా తతుల్
నీడల మచ్చుకే గనని నిశ్చల కాంతుల లంక నుండగన్

22మ. కో. ఏమి జెప్పిన తక్కువే నన యింపు లెచ్చిన లంకలో
స్వామి కార్యము నాదరింపగ సంశయమ్మును మానగా
రామ నామము మంత్రముల్ సడి రాక్షసమ్ముల గూల్చగా
ఏమి జేసిన సీత మాతను ఏరి జూచుట నిక్కువమ్

సుందర కాండ 2 వ సర్గ (వృత్త పద్యమాల ) సమాప్తము 

Thursday, 11 September 2025


హనుమ కీర్తన 🎶313233

పల్లవి

జయ హనుమంతా జయ హనుమంతా — రామ సేవకున్

జయ మారుతీశా జయ ధీరవీరా — రామ సేవకున్॥

చరణం 1

ఆటగ నెంచిన అంకితచేత — శోధన చేసిన రామ సేవకున్

బాటగ మేఘపు నాదముతో — పయనమెరిగిన రామ సేవకున్

దూటగా కాలమును దూకి — లంకను చేరిన రామ సేవకున్

దాటిన సాగర గంభీరమున — తారకుడైన రామ సేవకున్॥

చరణం 2

దేహమునిందగ చేరి తీరం — జాడ వెతికిన రామ సేవకున్

ఊహలతో సీత రూపమును — భావించిన రామ సేవకున్

ద్రోహి రావణ ధూర్త కర్మ — బోధించిన రామ సేవకున్

స్వర్ణలంకను జాడించినది — దివ్యపదముల రామ సేవకున్॥

చరణం 3

అచల దీక్షతో లంక జేరిన — ధర్మదక్షుడు రామ సేవకున్

సుందర వీరుడై సదాచార — మనసు కలిగిన రామ సేవకున్

ఉచిత దేహ భీషణముతో — శత్రువున జేయు రామ సేవకున్

ప్రచలిత వీర్యముతో వెలసిన — విష్ణు వామన రామ సేవకున్॥

🎶 ఇది పాడేటప్పుడు పల్లవిని మధ్య మధ్యలో పునరావృతం చేస్తే బావుంటుంది.

👉  

కీర్తన — హనుమా

పల్లవి:

చీకటి వెలుగులే జీవిత యాత్రలో రాహు, రామునే ఆశ్రయమే

దీర్ఘ దాహమున ఎండకిరణాల్లో తీరనిది — రామునే ఆశ్రయమే

చరణం 1:

చీకటి వెలుగులు జీవనలో తప్పవని నమ్మురు కన్నా మనమే

ఎండమావుల రాజ్యంలో దాహమే కొమ్మలపై నాటుకపోయినదనే

అంతరాలనంతట అల్లలు వేసి వినమ్రుని ఆవేదన పలికెను నేను

రామదీపమే పరివారమై మించిన వెలుగు — రామునే ఆశ్రయమే

చరణం 2:

ప్రకృతి వికృతుల మధ్య ప్రాణ సంఘటనలు కదలకుండా నిలిచును

చిన్న చిన్న పరివర్తనలే వదులుగా మనసుల్ని జారదీయును

ఎపుడు ఎక్కడ అనుకున్నా సామరస్యమేమో మరిచిపోతుందని చింతన

ఆ సమయమున వస్తావని నమ్మి నిలిచెనే రామునే ఆశ్రయమే

చరణం 3:

ఎవరికి ఎవరు అక్కరకు తోడు రారు అని అడిగి నమ్మకలో కోలుకొను

పరిస్థితులే బలవంతమైతే మనసు మోసుకుందని సశంకత్వములు తెరచును

అయినా నిలబడుటకు, ఆశ చేయుటకు నీ పేరు అలిక్కించుమంటెను నాదీపం

ఆ వెలుగులోనే అందరికి ఆశకాంతి — రామునే ఆశ్రయమే

పల్లవి పునరావృతం:

చీకటి వెలుగులే జీవిత యాత్రలో రాహు, రామునే ఆశ్రయమే

దీర్ఘ దాహమున ఎండకిరణాల్లో తీరనిది — రామునే ఆశ్రయమే

🙏

కీర్తన... 27282930

పల్లవి:

రాముని నామమే మా జీవకార్యమే

మారుతి శక్తియే మా ధర్మభాగ్యమే


చరణము 1 

సునృతి విధానముల్ గగనయానమున్ కార్యమే

యనృతువు లెక్కలేని యత్నములన్నియు భాగ్యమే

సునృపుని పాథి దాటి పరిశోధన గణ కార్యమే

సునృపుల వానరులతో విహిత సూక్ష్మము ధర్మమే


చరణము 2 

సాహసి హనుమ జంపెన సింహికదగ్గర కార్యమే

దేహపు నీడల గణనతో దీక్షగాంచుట భాగ్యమే

దేహము పెంచిన సింహికను సమరమున్ కార్యమే

దేహముఁ జీల్చి తేర్చెను మారుతి సంబర ధర్మమే


చరణము 3 

సుచరిత కీర్తి శోభిత దేవతా గణ భాగ్యమే

చలిత మారుతి పయనమునకై యత్నమున్ కార్యమే

వచన పుష్పవర్షములతో వందనమిచ్చుట భాగ్యమే

నిశ్చల మనస్సు నమ్మిన రామకార్యమే ధర్మమే


చరణము 4 

వానర జన్మనిచ్చిన వాక్కులలో ధర్మమే

మానస ధర్మ కృత్యమగు మంజుల రాముని ధర్మమే

కాలమునంతట మహిమగా స్వామి సన్నిధి ధర్మమే

ప్రాణము లెక్కలేనిది లభ్యమైన పావన ధర్మమే

పల్లవి పునరావృతం:

రాముని నామమే మా జీవకార్యమే

మారుతి శక్తియే మా ధర్మభాగ్యమే

👉

కీర్తన

పల్లవి 22232425

విఘ్నములే రానియెడల

వీర హనుమంతుడే విజయం సాధించు గదా

ధర్మకార్యము దాటని మార్గం లేదు

రామనామమే రక్ష కవచమయ్యెదా

చరణము – 1

విధి విస్మితమయ్యెను విఘ్నములు చూచి

వీరుడు కోపమందు వీక్షణముచేసెను

విధములన్నిటిని తొలగించి బలముతో

జయములు సాధించెడి వాయుపుత్రుడే

చరణము – 2

చిత్తము నిర్మలమే చేతలు ధర్మమయమే

సురస యేలనొచ్చి నన్ను పరీక్షించె

గుత్తగ నోటి విస్తరణ దాటె సాహసము

ఎత్తుకు పైకెగరె మహావీరుడే

చరణము – 3

జాత్య రాక్షసుడైన రావణుని మాయ

సాధువేషముచేసి సత్యము దాచెను

నిత్యమయిన స్నేహవాక్కులు వినినా

సత్య శోధనచేత మోసమును గెలిచె

చరణము – 4

సురస నోటినుండి దాటెను ధర్మముతో

సత్యమని తెలుపెను సంబరముగ గణములకు

రామకార్యమిదే నా మార్గమని చెప్పి

సర్వలోకమునకు శాంతియుగ మిచ్చెను

ఇది గానం చేయగలిగే సరళ కీర్తనరూపం.


👉 

పల్లవి.. 192021

జయ జయ హనుమంతా రామదూతా కరుణాసాగరా

జయ జయ మారుతాత! దాసభక్తా రఘురామేశ్వరా

చరణం 1

మహనీయున్ వాయుపుత్రున్ రామాభీష్టకార్యవినుతా

మహిలో పెద్దలపై సేవచేసె మా స్వామి సంతోషితా

సహవాసమున ధర్మమార్గసాధనమై మహోన్నతా

బహుమానముగా కందమూలఫలమిచ్చె భక్తహృదయప్రీతా

చరణం 2

ఆతిథ్యమునందుచు సంతోషమున సహాయమిచ్చితా

మాతా జానకినే గమనా మార్గమునుఁ బోధించితా

నీత్యాదిత్యుని సత్త్వమై నీయుక్తప్రాధాన్యముగ

ఖ్యాతిదక్కె సాగరమునకై రామకావ్యమున వెలిగితా

చరణం 3

హస్తముతట్టి వేగముగ పైకెగసి విహరించితా

నేస్తమున్ లక్ష్యమున్ చేరదలచి పర్వతమున్ దాటితా

దేవతల సహనమున్ పాశములనెరుగక ఆనందితా

స్వస్తిసిద్ధదీవెనలతో సాగరమున్ లంఘించితా

👉


కీర్తన.. 161718

పల్లవి

జయ జయ రఘువంశరామ దూతా హనుమంతా!

దయతో భక్తుల పాలనా శరణాగత రక్షకా!


చరణం 1

సుకుమారాంగన సూర్య తేజముల చూపులే చల్లని వెలుగులయ్యా

వాయువు భవుని సంతోషముగా, వికసింతు విశ్వాసమయ్యా

రామ సేవల పరిమళముగా, మది మధురమై వెలిసెయ్యా

ప్రకాశింతు నీ కరుణయే, ప్రాదేశ ప్రక్షాళనయ్యా


చరణం 2

ఉపకారమనే ధర్మములోనూ ఉపకరించుటే నీ గుణమయ్యా

అపవాదమైనా సాయమిచ్చే సాధనలోన నిత్యమయ్యా

రఘువంశరామ ఉపదేశమునకై నుద్బోధమిచ్చు మధురమయ్యా

ధర్మముల నిలయుడవు నీవే మైనకుని పలుకులయ్యా


చరణం 3

వానర శ్రేష్టుడా! నీ పాలన లాలన భక్తులకు మాత్రమేనయ్యా

జానకిని వెదుకుట కష్టమయ్యా రాక్షసునెత్తి యెళ్ళినయ్యా

జ్ఞానములోన ధర్మములోనూ నీకే సర్వమును సాధ్యమయ్యా

ప్రాణమును నీ త్యాగముగా చేసి నిలిచే పరమకార్యమయ్యా


🎶 ఇలా సాగేలా రాగానికి (మోహనమ్ లేదా కల్యాణి) తగినట్లుగా చరణాలను సున్నితమైన లయలో మార్చాను.

👉

పల్లవితో:

భజన కీర్తన

పల్లవి

హనుమన్నా, తిమ్మన్నా, దిక్కన్నా,

మనందరికి రా మన్నా ॥


చరణం – 1

లంగన సాగరానలము లాలన జేయుచు ప్రార్థనేయగున్

జంగమ బ్రహ్మదేవుణకు జాగర భూతల వందనమ్ముయున్

సంగతి సూర్యదేవులకు సాధన చేసెది కార్యమంతయున్

ముంగర ఇంద్ర వాయువుకు ముచ్చట జేసియు సంభ్రమించగన్ ॥


చరణం – 2

గణపతి వందనంబు జేసె గిరి సుత పూజలయంబుగన్

సునిశ్చల ధైర్య మంకురమై సుఖములయు సాధనంబుగన్

మనసు మాధవ పాదములే మౌనముగా నిలిపియుండగన్

తనకే శంకర శక్తి యనున్ తనయుడై నిలిచెను గాక ॥


చరణం – 3

దివ్యరాజ గణేశ పూజను దినములందున జరుపుచున్

భవ్య రామరాజ కీర్తన యెల్ల సమయముల జేయుచున్

సత్యధర్మముతోన గాక శాంతియై నిలుచు సద్భక్తులన్

నిత్యహర్షముతోన జేయు నిరంతర మంగల వందనమ్ ॥


చరణం – 4

దోసిలి జేర్చి తండ్రియగు దొడ్డగ వాయు దెవుండు ప్రార్థనన్

ఆశయ సిద్దిదక్షణము కాంచి ప్రయాణము నిత్యయంబుగన్

పాశము రామ లక్ష్యమగు ప్రార్థన చేసియు దేహ మెంచగన్

రాశిగ యర్ణవమ్ముకళ రమ్యత గు ర్చుచు పొంగి పొర్లుటన్ ॥


👉 ఇది ఒక భజనమాలలా పాడవచ్చు.

ప్రతి చరణం తర్వాత పల్లవి "హనుమన్నా, తిమ్మన్నా..." పునరావృతమవుతుంది.

*****

హనుమద్భక్తి కీర్తన.. 10/9
పల్లవి
జయ జయ హనుమంతా రామదూతా
కార్యసాధకా మహా వీరా జయహో జయహో ॥
అనుపల్లవి
కనురెప్పలా కదలికల గాలిలో
సింహగర్జన చేయుచూ అంబరంలో
మేఘాల మధ్య మెరుపులై జ్వలించెను
కెరటములా కదలికలై సాగెను
రామబాణమై శక్తిగ వెలిసెను
రఘుకుల రక్షక దూతుడై నడచెను ॥

చరణము 1
పడగలు విప్పి సర్పములు పాశముగా కాటు వేయగా
వడి విషయమ్ము అగ్నిశిఖ వేడిముగా దహనమైసెగా
దడ భయమొంది ప్రాణులు ఘోషములు చేయగా
పిడికలు పట్టి మారుతి తుఫాను భూమిని కంపించె ॥

చరణము 2 
ఆశ్చర్యముగ శరీరము అంబరమందే సభలాగ
యాశ్చర్యమై రామకృపాకాంక్ష తీర్చుటకై
దుశ్చర్యమును సహనముతో సముద్ర యాత్ర సాగి
నిశ్చార్ధముగ మునిధైర్యముతో లంఘన సాగించె ॥

చరణము 3 
వాయువేగముగ వాక్కులు బాణములై లంకకే చేరి
సీతాశోధనకై గమ్యముగా కార్యార్ధమై సాగి
రావణ బంధన భీతి లేక కార్యమును తీర్చె
వానరసేనలో ధైర్యముగనే క్షేమము నింపె ॥

🌸 *****
కీర్తన
పల్లవి
హనుమంతుని లీల యాత్ర – మేఘ సముద్ర గగన మాధుర్య
రామ నామ జప ధ్యాసతో – సాగె సాగరమున్ లీలగా
అనుపల్లవి
అంబర మబ్బుల వేగమై – ఆంజనేయుని తోడై నడచగా
సంద్రము తరంగ లీలలై – సేవ మార్గమున్ వెలసెను
చరణము 1
శరదృతువు కాంతులందున్ – ధ్యాస రాముని గాధలందున్
గాలి వేగము రాగమై – గగన గమనమున్ తోడైయున్
నిర్విరామమై రాత్రి లోన – జ్వాలల రూపమై దివ్యమున్
రామనామ జప శక్తితో – యాంజనేయుడు గమ్యమందున్
చరణము 2
శ్వేత మేఘముల చీరలందున్ – ఎర్ర కాంతి కిరీటమందున్
చింతలే చెరిపి నీవు రావా – చిత్తమునందున్ నిత్యమున్
ఆడమబ్బుల జంటలందున్ – వేగవంతమై తోడై నడవున్
మౌనమందున పాటలందున్ – మేఘములైన పాడగ నీవే
చరణము 3
పూల సౌరభం తోడై నడచున్ – పూలవానలై మోహమందున్
సంద్రమే పొంగి పాడగా – సేవక శ్వాసలై నిలచున్
జీవమంతయు నీకే అర్పణ – శక్తి అంతయు నీకే సేవ
రామ భక్త హనుమంత – రమ్య లీలలే సదా మాకు
👉 ఈ కీర్తనను కళ్యాణి రాగం, ఆది తాళంలో పాడితే చాలా మధురంగా ఉంటుంది.
******

సుందరకాండ కీర్తన.. 11/09

రాగం : ఆరబ్హి (ధైర్యం, వీరత్వం వ్యక్తం చేయటానికి అనుకూలమైన రాగం)

తాళం : ఆది

పల్లవి :

జయ జయ హనుమంతా రామదూతా

జయ జయ వీరహనుమంతా


చరణం 1 :

విడిచిన బాణమై వేగముతోనన్

తడబడని ధైర్యముతో సాగుచున్నన్

వృక్షముల నీడలై నిలిపిన శక్తిన్

సాగర తీరమందు చేరిన శౌర్యన్


చరణం 2 :

సూర్య చంద్ర నేత్రముల కాంతి యైనన్

సౌర్యదేహముతో చక్రమై నడచినన్

మారుతి గర్జనలతో విహరించు వీరన్

ఆకాశమందు వెలసిన దివ్య రూపన్


చరణం 3 :

హనుమాదేహ సముద్రమై విరాజిన్

తరంగముల లయమై వేగము చూపిన్

దేవగణములు పుష్పవర్షము జేసి

పూజ్యుడై నిలచె పరాక్రమ శూరన్

ముగింపు (పల్లవి పునరావృతం) :


జయ జయ హనుమంతా రామదూతా

జయ జయ వీరహనుమంతా


🌸 ఈ కీర్తనను ఆరబ్హి రాగం, ఆది తాళం లో పాడితే హనుమంతుని శౌర్యం, భక్తి రెండూ మిళితమై అద్భుతంగా వినిపిస్తుంది.

*****

సుందరకాండ గానం.. 12/09

పల్లవి

జయ జయ హనుమంతా రామదూతా

జయ జయ సత్కార్య సాధకా


చరణం 1 

నిజమా కలయా నీ రూపమా

నిరతరమై వెలసె దివ్యకాంతమా

చిరునవ్వులో విధి దేవతా

హృదయమున నింపె సౌఖ్యమా


చరణం 2 

ఆకాశమున సాగుచున్ చూచి

దేవతల హృదయములు నిండుచున్ పొగడి

వీరముతో వెలసె రామదూతుడా

దివ్యకార్య సాధనమై నిలిచినోడా


చరణం 3 

సత్కార్యమే సాగర సహకారం

సత్కార్యమే మైనాక సేవారూపం

సత్కార్యమే రెక్కల ద్వారమై

మారుతీక్షణమున సాగె మార్గమై

*****

సుందర కాండ గానం


పల్లవి

నిజమా కలయా నీవు – నా మది దివ్యసౌందర్యమే

విధి రూపిణీ నీవే – నా గుండె గాగనములో

ఓహో నిజమా కలయా!

హనుమంతుడు గగనమున వెలయా!


అనుపల్లవి

సత్కార్యం జేయు వీరుడా – మారుతీ కీర్తి గావహించు

సేవాసాక్షి మైనాకుడా – సాగర శాంతి సాగరించు


చరణం..1

చిరునవ్వు యందు మాయ గానమై వెలసితివే

మధురస్మిత సుధారసమై హృదయమున నిండితివే

అనుమానమందు ఆశ కాంతిగా వెలిగితివే

నీవు గాక మరెవరూ – నా దైవ రూపమూ


చరణం....2

వేగముతో సాగెడి వానరవీరుడా

విశ్వమున నింపెడి రామదూతుడా

చిరునవ్వు వీరమున వెలసె రూపుడా

దేవతల మనసుల నందు దివ్యకాంతుడా


చరణం... 3

రెక్కలే దారమై నిలిచి – వేగముతో సాగెదా

సంకల్ప సత్యమై వెలిగి – సౌఖ్యమును నింపెదా

ప్రకృతి సహకారమై నిలిచి – పథమును చూపెదా

హనుమ దివ్యకార్యమై – హృదయమున వెలుగెదా


******



Monday, 8 September 2025



మల్లా ప్రగడ ::సుందరకాండ పద్య మాల


1. 11. ఉll  చారణ మార్గమెల్లదలచా స్థితి సీతను జాడనెంచగన్

ప్రేరణ పచ్చికా మెరుపు ప్రీతికరమ్మున తోడుగా జనన్ 

చేరదలంచ రావణ సుచిత్రపు మాయలు నెంచగల్గగన్

ధీరుడు సానువై హనుమ దీక్షల దీరుగ వేగమవ్వగన్


2. ఉ:: పక్షులు కేసరీ చెలుగు ప్రాపున జేసెడి పెద్ద ఘోషగన్

వృక్షములన్ని వేడుకల వృష్టిగ పూవుల రాల్చి మ్రొక్కగన్  

యక్షులు కిన్నెరల్ సహిత యాశ్రయ రూపము సందడించగన్ 

వక్షమహస్తమున్ జరుపు వాలున మారుతి జేయు గర్జనల్ 


3. ఉ: లంగన సాగరోదకము లాలన జేసెడి సాధకమ్ములన్ 

జంగమ దేవరే సదరు సాక్షిగ సంవదనావిశేషముల్  

సంగతి సూర్య చారణుని సాయము నందగ కార్యమంతటన్

ముంగట నింద్ర చంద్రులకు ముప్పును దెల్పెడి చోద్యమెన్నగన్  

(1 

004. ఉ.  దోసిలి జేర్చి తండ్రియగు దొడ్డగు వాయుదివోకసుండనన్,  

ఆశయ సిద్ధి తూర్పుననుఁ గాంచి ప్రయాణము నిశ్చయంబుగన్ 

పాశము రామ దక్షతన బంధన జేసెడి తీరునెంచగన్

రాశిగ సంద్రమందుజల రమ్యత నేర్పులు పొంగి పొర్లగన్


005.ఉ:: సఖ్యత లేని ప్రాంతమున చప్పున కాయము పెంచసాగగన్ 

ముఖ్యము లైన వృక్షములు ముంపుగ గప్పగ పర్వతమ్ములన్   

ముఖ్యముగా సుగంధములు మూకల తీర్చగ సాధ్య మందగన్   

సాఖ్యము రామనామజప సారము పావని ప్రోత్సహమ్ముగన్


006.ఉ: ఉత్తమ తేజదేహమున యున్నగజమ్ము మదోదకమ్ముగన్ 

సత్తువ పీడనమ్మగుట సౌష్ఠవ మంతయు దీప్తి మంతమై 

 విత్తున మొక్కలన్ ననలు  విచ్చిల కన్నుల పండుగా యనన్  

మత్తుగ భీతిచెందిన సుమధ్యమ నిస్వన శబ్దబేధిగన్


007.చం: పడగలు విప్పి సర్పములు పన్నపు బుద్ధిని కాటు వేయగన్ 

వడి విషయమ్ములగ్నిశిఖి వాడిగ వేడిగ ధామమైనిలన్ 

దడ దడలంది ప్రాణులు విధానపరమ్మునఘోష చేయగా

పిడికిలి పట్టి మారుతియు పెచ్చుగ దూకొని  పృథ్వినంతటన్ 


008. శా:  ఆశ్చర్యమ్మొలికే  శరీరముగనే యాకాశ మందన్  సదా  

యాశ్చర్యం హనుమంతురాముని కృపాయాకాంక్ష తీరేట్లుగా 

దుశ్చర్యం సహనం సముద్ర పయనం దూతంపు యుక్తుల్ గనన్   

నిశ్చేష్టమ్ముల సద్యధైర్యముగనే నిర్వాహణా లంఘనల్ 


009.మ: హనుమాన్ వాక్కులు వాయు వేగములనాహార్యమ్ము లై లంకనే  

కనగా నాదివిఁ జేరి సీత నెరిగే కార్యార్థ లక్ష్యమ్ముగా 

ననగన్ రావణ నాశముం గరుపగా నావేశ రూపమ్ముతో   

క్షణమావానర క్లేశ పాటవమునాకాంక్షావివాదమ్ములన్


10.చం. విడిచిన బాణమై కదల విద్దెలు కల్గిన ధైర్య వంతుడున్

 తడబడలేని సాయమిడు తన్మయ రూపముగాంచి వేగమున్ 

వడివడి జాతి వృక్షములు వాటముగా నెదురేగ మోదమున్  

తడిపొడి పుష్ప వృక్షముల తంపర సాగర మందు చేరగన్


11.శా: సూర్యాచంద్రుల నేత్రకాంతులగుటన్ సూత్రమ్ము వేగమ్ముగన్ 

శౌర్యాదేహముచక్రమైకదులగా సౌందర్య ధీరమ్ముగన్ 

కార్యామేఘములన్నితోడుచలనం కార్యమ్ము తీర్చేందుకున్ 

ఆర్యామారుతి మేఘ గర్జనలుగా నాకాశ సౌధంబునన్


12.మ: హనుమాదేశ సముద్రునిన్ చలన వాహమ్ముల్ విశిష్టమ్ము గా 

కనుచూపౌను తరంగలన్నియెగసే కార్యార్థ సాధ్యమ్ముగన్ 

క్షణ ఛాయల్ పది యోజనమ్ములగు దీక్షాధర్మ సంద్రమ్ముగన్ 

గుణదైవాంసులు పుష్పవర్షములిటన్ గుప్పించి ప్రోక్షించగన్ 

(వాహముల్  = బాహువులు)

13.మ. కో. తాగి వేయగ శంఖి నీరు తతంగ మెన్నిన తీరుగా   

వేగి రమ్మున కళ్ల చూపులు వీచి దూకొన కాంతులన్   

సాగు వాలము ఇంద్రదృన్పువు సాక్షియేయగు రీతిగా  

మాఘ మేఘము మాదిరేయగు మారుతీ వడి తీరులే

మైనాకును పలుకులు


14. ఉ. నీపద మందు ధైర్యము వినీలమనస్సున మంతు మారుతీ 

పాపము నెంచబోకు నిను బంచిన  సాహస సేవ కర్మలన్ 

రూపము పెద్దగా నెగయ లోకము లెల్లరు తల్లడిల్లగా  

మీపద సేవ తక్షణము మేమును జేయుదు మయ్య మారుతీ

15.శా:: సత్కార్యమ్మును చేయనెంచిన మహాశాంతమ్ము నన్ సంద్రమే 

సత్కార్యమ్మును మైనకుండుగనగా సాక్షమ్ము సేవా నిధీ 

సత్కార్యమ్ముగనేను రెక్కలుగనే సాధ్యంపు కార్యమ్ముగా  

సత్కార్యమ్మును మారుతీస్థిరముగా సాగించు నీశోధనల్


16.మ::.సుకుమారాంగన సూర్య తేజములుగా, చూపుల్లు చల్లంగ నీ  

సకలమ్మున్ కలబెట్టు వాయువు భవన్ సంతోషమే నెల్లగన్ 

వికసించేలత తీరుగా కదలికల్ విశ్వాస వైనమ్మగా  

ప్రకటించే మది రామ సేవలు గనన్ ప్రాదేశ ప్రక్షాళనన్


17.మ:: ఉపకారమ్మును ధర్మమేనుపకరం బున్నంత మార్గమ్ములన్ 

అపవాదైనను సాయమేనెరుపగా సాధ్యమ్ము తీరేయగున్ 

ఉపదేశమ్ రఘువంశరాము పనిగా నుద్బోధ పొందేందుకున్ 

నుపచర్యల్ స్థితి మైనకుండుపలుకుల్ నూతంపు ధర్మమ్ముగన్


18.ఉ:: వానర శ్రేష్టుడా పలుకు పాలన లాలన నీకు మాత్రమే,  

కానము జానకిన్ వెదుకు కష్టము  రాక్షసు డెత్తుకెళ్ళగా  

జ్ఞానివి సర్వ ధర్మముల జ్ఞాతివి సర్వము నీకసాధ్యమా 

ప్రాణము నీయ త్యాగముల బంధము నీకిది పెద్ద కార్యమా


కీర్తనగా మాలచండి

19. ఉll మహనీయుండగు వాయుపుత్రుడవు రామాభీష్ట కార్యార్థి గా
మహిలో పెద్దలు మీదు సేవనములే మా స్వామి సాయమ్ము లై
సహవాసమ్మున ధర్మమార్గమున నే సాధ్యమ్ము సంభావ్య మై
బహుమానంబగు కంద మూల ఫలముల్ పక్వమ్ము ప్రాప్తమ్ముగన్

20.శా:: ఆతిథ్యమ్మునుఁ బొందినట్లుగనె సాహాయమ్ము సంతోషమున్
మాతా జానకినే గనంగ గమనా మార్గమ్ము సంభావ్యమున్
నీతాదిత్యము సత్త్వమేయగుటకున్ నీయుక్త ప్రాధాన్యముల్
ఖ్యాతే దక్కును సాగరమ్మునకునూ కావ్యమ్ము రామాయణం

.21.ఉ:: హస్తము తట్టివేగముగ హాయిగ పైకెగిరేను మారుతీ
నేస్తము లక్ష్యమేకదల నీమము నెంచిన వేగ మవ్వగన్
ప్రస్తము దేవతల్ సహన పాశము నెంచక హర్షమేయగున్
స్వస్తిగ సిద్ధదీవెనల సాధన యేయగు సంద్ర లంఘనల్


22.ఉ::  విఘ్నము చేయుచున్నవిధి విస్మిత మొందగ సాధికారతన్
విఘ్నము సంద్రమై నిలువ వీక్షణ జూపుల క్రోధమందునన్
విఘ్నము జేయగా హనుమ వీడడు బీరము మాని నెప్పు, డా   
విఘ్నము లన్నిటిన్ దునిమి వేసి జయమ్ముల దెచ్చుదప్పకన్

23. ఉ. చిత్తము చాల నిర్మలము చేతలు ధర్మ నివాస మూలమున్

ఎత్తులు వేయకే సురస యేలను నన్నుగ పట్ట నోర్వగన్
గుత్తగ నోటి విస్తరణ గమ్యము గాంచియు దూకె మారుతీ
ఎత్తుకు పైన నెత్తుల సహించిన వీరుడు వాయుపుత్రుడే

24.మ. కో. సత్యమే అభిరామ లక్ష్మణ సాధ్వి సీతయు తోడుగన్
జాత్య రాక్షస రావణుండగు సాధు వేషము వేసియే
నిత్యమేయన స్నేహ వాక్కులు నిష్ఠ జేయగ మాతనే  
సత్య శోధనలే వహించ సుసాధ్య మాయను కానగన్

25.చం. సురసన నోటి విస్తరణ సూత్రము దాటియు సాహసమ్ముగన్
తరుణము ధర్మకార్యమని తధ్యము తెల్పగ సంబరమ్ముగన్
సరియగుమాటలన్నిటను శాంతిగ విన్న గణాలు సంతసం
బరగగ రామ కార్యమిది పశ్యత గాంచగ నేను సాగెదన్

26.మ. కో.  నేర్పుకోగల మేటి జ్ఞానము నేర్పులే యతి సంపదే

కూర్పు లన్నవి విశ్వసమ్మున గూడు తృప్తల సూత్రమే

నేర్పు పుస్తక మన్న దే యనునిత్యమే యగు శ్రేష్ఠమై 

మార్పు లే ప్రకృతీ విధాతలు మానసమ్మున కాంతులై


27.చం:: సునృతి విధానముల్ గగన సూత్ర మనంగ ప్రయాణముల్ సదా  

యనృతువు లెన్న పాటులవి యక్కర రావు విలంబ రీతులన్ 

సునృపుడుపాథి దాటి పరిశోధన జేయ గణమ్ము మధ్యలన్ 

సునృపులు వానరుల్ విహిత సూక్ష్మము లెన్నగ స్వామి సేవలన్    

28.ఉ:: సాహసి రాక్షసిన్ హనుమ చప్పున సింహిక గాంచి క్రుద్ధుడై   

దేహపు నీడ గాలమగు దీక్షల మాదిరి గుంజ మూలమున్ 

దేహముఁ బెంచగాహనుమ దీటుగ సింహిక కూడ పెంచినన్  

దేహముఁ జీల్చి సింహికను తేర్చెను మారుతి సంబరమ్ముగన్

29.చం.: సుచరితకీర్తిసంపదయు శోభిత సన్నుతదేవతా గణం

బు, చలిత మారుతీ పయన భూమిక యత్నము నెంచ దేవతల్ 

వచనలపుష్పవర్షముల వంద్యపు దీవెన లెల్ల జల్లగా  

నచలమనంతమానసము నమ్మిన భాగ్యము రామకార్యమే

30. ఉll  వానర జన్మ నిచ్చితివి వాక్కుల భాగ్యమనంత శక్తులున్

మానస ధర్మ కృత్యమగు మంజుల రాముని కూర్మినీయగన్ 
కానని నేర్పులన్ మహిమ కాలము స్వామికి సేవ జేయగన్
ప్రాణము లెక్కజేయడిక ప్రాప్తము లిట్టుల దక్క పావనిన్

31. ఉll  ఆటగ నెంచకన్ హనుమ అంకిత శోధన భావనా ధృతుల్

బాటగ మేఘశబ్దముల పాఠము తోడుగ వాయు పుత్రుడే 
దూటుగ కాలనీమమున దూకెను లంక భవాండ ధామమున్
దాటగ సాగరమ్మునిటు తారక రాముని సేవనా కృతిన్

32.ఉ:: దేహము నిందుగన్ హనుమ తీరము చేరగ భీకరమ్ముగన్
ఊహలు సీత జాడలకు నున్నతి భావము జూప నాశగన్
ద్రోహుడు రావణాసురుని ధూర్తము తెచ్చిన జానకింగనన్
మా హనుమయ్యదివ్య పద మంజరి తాకెను స్వర్ణ లంకనున్

33.చం:: అచలిత దీక్షతో హనుమ యంతట లంకను జేరగా వడిన్
సుచరిత మానసంబుగల సుందర వీరుడు ధర్మ దక్షతన్  
ఉచితపు దేహభీషణము నుద్యమచేతల చిన్న జేయగా 
ప్రచలితమే బలీయమన పాటిగ విష్ణువువామనుండయెన్