Tuesday, 30 September 2025

5వ సర్గ

 


సుందరకాండ ఐదవ సర్గ 


01

ఉ.మందర పర్వతమ్మునను మానస లక్ష్మియె కాంతి శోభగన్ 

సుందర సాగరమ్మున సుశోభిత లక్ష్మియు విశ్వ మందునన్ 

పొందిక పద్మమoదు జల పూజిత లక్ష్మియు శాంతి చూపుగన్ 

చందురు నాశ్రయం బిపుడు చక్కని లక్ష్మియు లంక యందునన్

02.

పంజరమందు హంసకళ పాలన లక్ష్మిగ కాంతి పూజ్యమై 

శృంజన ధీర నేనుగగు శృత్వ ము లక్ష్మియు వీర యోధినీ

భంజన సింహవాహయగు భవ్య  సులక్ష్మియు గర్జనేయగున్ 

రంజన చంద్రకాంతియగు రమ్యత లక్ష్మియు లంక యందునన్

03.చం ::వనితలు మాంసభక్షణము వారి ప్రియాతి ప్రియంబు కోపమున్

వణుకుల మధ్య తృప్తిగను వాక్కుల తీరుగ శోభనమ్ముగన్

క్షణమున చీకటేవెలుగు కామ మహత్త్య శుభమ్ము సర్గమున్

మనమది యేకమేసుఖము మాన్య పవిత్రము నిత్య లంకగన్


04.మ.రమణీయాక్ష నరాకృతిం బొ లుచు వర్ణ శ్రేణి  వీణా నులా

పము చేతంకళగన్ మనో మయముగన్ పాదమ్ము నచ్చామృత

త్వము యాత్మాప్రతి పాదకామ్మగుటయున్ దద్వార్ణ మూలమ్ముగన్

సమనీభావము వాణి సత్యమగుటన్ సారూప్య మౌ లంకలో


05.ఉ::మార్చెడి బుద్ధి విద్దెలగు మానవ రాతలు మార్పుకేయగున్ 

గూర్చెడి త్యాగబంధమగు కోర్కెల తీరుగ సేవలేయగున్ 

దీర్చెడి దుఃఖసౌఖ్యముల తీరుగ పొందెడి లాభనష్టముల్ 

చేర్చెడి మాటతీరగుట చిత్తము తీరుగ జీవనమ్ముగన్


06.చం.కులుకులుతీరునేర్ప చిగురూకనిపింపగ నేమి చేసెదన్  

థలుకులయందమoతయు ని థానము మైమరుపౌను డెందమే  

మలుపులహృద్యపువ్వుల సమాన సుకావ్యము తీరుగా నగున్  

తలపులవింతలేవలపుతాకిన సత్యపు నీడతోడుగన్


07.ఉ.శ్రీ రఘురాము వేడుచును శ్రేయము పూజ్యము నెంచకూర్చుమా  

కారణమేమియన్నను సకామ్యము తెల్పి సముద్దరింపుమా  

నేరుగ నమ్ముచూపులతో నిత్యము మేముగ సేవలే సుమా  

ప్రేరణ రామనామమగు ప్రేమను పంచుట స్వామి నిత్యమున్


08.ఉ.పుణ్యము మేలుగోరుటయు పున్నమి వెన్నెల తీరు నాత్మగన్ 

మణ్యము పాప భీతియన మార్గము లేనిది మాన సమ్ముగన్ 

గుణ్యము కీడునెంచగల గుప్తము లీలలు పాప పుణ్యముల్                రుణ్యత దుష్టపాలనయె రుత్వ దురాత్మగ కాలమేయగున్ 


"09.ఉ.అంగన లెల్లసంబరము నానతితృప్తియు నద్భుతమ్ముగు

చ్చంగున తిప్పురక్కసులు చెంతన సఖ్యత జూపు లాహిరీ

ఖంగున మాటశబ్దములు కాలపు రీతిన నేస్తమవ్వగా

సంగతి గుప్తమే మనసు సాగర తోడుగ శాంతనమ్మహో"

10.శా.ఔరాయేమిది యోగయోగ్యతగునే ఔనత్య నాదంబు గా

తీరంబున్ గతి యోర్తు కాలముగనే తీవ్రత్వ సౌఖ్యమ్ముగన్

వైరంభట్టి తటాలునన్ నెగసెలే వైరాగ్య నాధాంబుజన్

నీ రాజ్యమ్మున వారలే శుభ దులై యిష్టమ్ము చందంబుగన్"

11.ఉ:కల్పన నంబరమ్ముననె కట్టుగ వెన్నెల శోభలీనగన్ 

పొల్ప మహీతలమ్మగు నపోహల తీవ్రత నిత్యసత్యమున్ 

తల్పపు లీలలన్నిగన తన్మయ మొందెడి వైభవమ్ముగన్

మల్పులు రాక్షసాళిదగు మాయల నీడన లంకరాజ్యమున్

12.మ 🌸అలరారే మదినందమేసకలమే యాకర్ష యాశ్చర్యమున్ 

గలనవ్వుల్ మది రువ్వుకాంతులుగనేగమ్యమ్ము చేర్చేoచ చూ

పులతోచేరువ రాగ మానసముగాపూజ్యమ్ము దాహమ్ముగన్

పులకించే మది దేహ భావములుగా ముఖ్యమ్ము రాజ్యమ్ముగన్

13: శా:: నిశ్శబ్దమ్మగు నాట్య నాటకముగన్ నీడైన న్యాయమ్ముగన్

నిశ్శబ్దమ్మగు లోలితాభవముగన్ నింగిన్ సముత్సాహమున్

నిశ్శబ్దమ్మగు కాలమున్ కరణిలో నీ మమ్ము లోకమ్ముగన్

నిశ్శబ్దమ్మగుటే స్వరమ్ము వరమై నిర్మోహ దాహమ్ముగన్

14:శా:: నిశ్శబ్దంబగు  గాలి కళగా నిర్మాణ లక్ష్యమ్ముగన్

నిశ్శబ్దంబగు ధ్యాన మార్గముగనున్ నిర్మాణ శాంతమ్ముగన్

నిశ్శబ్దంబగుడెందమే కదిలెడిన్ నిశ్చేష్ట కాలమ్ముగన్

నిశ్శబ్దంబగువెల్గులున్ విమలమై నిత్యమ్ము సత్యమ్ముగన్

15:: సైరా గర్వముగాను గుంభనముగన్ సై సై యనేరాక్షసుల్

ఏరా కైపుగనున్ మదీభవముగానేమాయ చేసావులే

యౌరా యెంత సుఖమ్ము మేకము కళల్ ఔనత్య లక్ష్యమ్ముగన్

పోరా! రమ్మను చూపు రమ్ము నిదియున్ పూజ్యమ్ము నీకేయగున్

16: మ.మదినిచ్చున్ పరువమ్ము చేరగలగన్ మానమ్ము మాధుర్యమున్

చెదిరెన్ దాపము చిన్మయమ్మగుటయే చిత్తమ్ము ధ్యానమ్ముగన్

పదిలమ్మున్ కళ తీరు సఖ్యతగనున్ పాశమ్ము నీడేయగున్

రుధిరమ్మున్ కలుపే ప్రభావముగనున్ రుద్రత్వ కేళీకళా

17:ఉ.మానస మన్మధుండు కల మర్మము గ్రోలుచు పూలగుంపుగన్

మౌనము వీడి సమ్మనము మాన్యత పొందెడి వీలు మేలుగన్

మానస రాజు గూడికథ మన్మధ చేష్టలు కామ్య కామినిల్

గాన మనస్సు నేకమగు గమ్యము తీరుగ కోర్కె రేవుగన్

18:మ.విధికాదే మనసైనవారిసుఖమున్ విజ్ఞాన మేపంచగా

నదిపొందే సహకారమేయను భవంబానంద జీవమ్ముగన్

విధియాడే కళ తప్పదో వయసు గావిశ్వాస సాహిత్యమున్

మదిమాయల్ సహనమ్ము వెంటగనునే సాధించు తీరే యగున్

19:చం.భవభవ భావసంద్రమది బాధ్యత బంధముగాను నాటగన్

నవనవ నాడి తత్త్వమగు నమ్మక మైన యశస్సు తోడుగన్

బవలు సుహాసినీ పిలుపు పాఠము నీడగ తోడు సౌఖ్యమున్

సవరనలేను జీవనము సాధన శోధన యుండ వచ్చుటన్

20.ఉ.కోకిల గానలాలసయు కోర్కెల యుల్లము జల్లుజల్లుగా 

కేకకు కేకతోడగుట కేళివిలాసము తేజరిల్లెగన్ 

నీకది కొంతవింతగుట నెమ్మది నమ్మక జీవగమ్యమున్ 

చాకిరి యేకుమేకనగ జాతర తప్పని సత్యమేయగున్

  21.ఉ.చక్కగ మద్యపానమున జాతర స్త్రీలగు మత్తు వాక్కులే

చుక్కయు గోరి రొమ్ములను  చూపుచు చేష్టలు వింత వింతగా

మక్కువ సుందరాంగులు సమానము సత్పురుషా సమా సుఖం

బొక్కొకవేళ వేడుచునెమ్రొక్కిన భర్తల కౌగిలింతగన్

 22.మకో. స్త్రీలు కేళులు సంగమాసమ శీఘ్ర భోగము సందడే 

స్త్రీలు రంగుగ వస్త్రమాయ శరీర వర్ణన చూపులై 

స్త్రీలు యోగము తోవియోగము తీరు పుష్పమ నస్సుగన్ 

స్త్రీలు నుత్తమ రాజవంశము సేవ లక్ష్యము చూపుటే

:23. భావం బెక్కడ లేక వృత్తి నియమాపాయంబు జింతింప కెం

దేవర్తించి పదార్ధ వంచనలచే దీపించి మూర్జళి సం

భావింపే హనుమా ప్రణీత కృతి సామాన్యా కృతిం బూని పై

పై వన్నెల్ వచరింప దాని తిలకింపంబోరు ధీరోత్తముల్

24. రాతిని నాతిగా మలుపు రాముని లీలలు కాలతీరుగన్

ఖ్యాతిగ సత్యమే పలుకు కాల సు వాక్కుసతీ వియోగమున్

జాతి గుణమ్ముగా హనుమ జాగిల మాదిరి రామ భక్తిగన్

రాతిరి తూర్పు కొండలభిరామము లయ్యెను సూర్యకాంతితోన్

25.ఉ::కేవల చంద్రకాంతిగను కృత్రిమ దేహము గాంచలేకయున్,

తావిరి పుట్టుపుత్తడగు, నాభావన తత్త్వరేఖల గాంచలేకయున్,

పావని పూర్వగాయములు సానలు, దీరిన మేఘరేఖలుల్,

గావున నట్టి సీతగనగానొనరింపగ, నేర్పు పెంపుమున్.

సుందరకాండ.. 5 వ సర్గ సమాప్తం 

****

No comments:

Post a Comment