Monday, 8 September 2025



మల్లా ప్రగడ ::సుందరకాండ పద్య మాల


1. 11. ఉll  చారణ మార్గమెల్లదలచా స్థితి సీతను జాడనెంచగన్

ప్రేరణ పచ్చికా మెరుపు ప్రీతికరమ్మున తోడుగా జనన్ 

చేరదలంచ రావణ సుచిత్రపు మాయలు నెంచగల్గగన్

ధీరుడు సానువై హనుమ దీక్షల దీరుగ వేగమవ్వగన్


2. ఉ:: పక్షులు కేసరీ చెలుగు ప్రాపున జేసెడి పెద్ద ఘోషగన్

వృక్షములన్ని వేడుకల వృష్టిగ పూవుల రాల్చి మ్రొక్కగన్  

యక్షులు కిన్నెరల్ సహిత యాశ్రయ రూపము సందడించగన్ 

వక్షమహస్తమున్ జరుపు వాలున మారుతి జేయు గర్జనల్ 


3. ఉ: లంగన సాగరోదకము లాలన జేసెడి సాధకమ్ములన్ 

జంగమ దేవరే సదరు సాక్షిగ సంవదనావిశేషముల్  

సంగతి సూర్య చారణుని సాయము నందగ కార్యమంతటన్

ముంగట నింద్ర చంద్రులకు ముప్పును దెల్పెడి చోద్యమెన్నగన్  

(1 

004. ఉ.  దోసిలి జేర్చి తండ్రియగు దొడ్డగు వాయుదివోకసుండనన్,  

ఆశయ సిద్ధి తూర్పుననుఁ గాంచి ప్రయాణము నిశ్చయంబుగన్ 

పాశము రామ దక్షతన బంధన జేసెడి తీరునెంచగన్

రాశిగ సంద్రమందుజల రమ్యత నేర్పులు పొంగి పొర్లగన్


005.ఉ:: సఖ్యత లేని ప్రాంతమున చప్పున కాయము పెంచసాగగన్ 

ముఖ్యము లైన వృక్షములు ముంపుగ గప్పగ పర్వతమ్ములన్   

ముఖ్యముగా సుగంధములు మూకల తీర్చగ సాధ్య మందగన్   

సాఖ్యము రామనామజప సారము పావని ప్రోత్సహమ్ముగన్


006.ఉ: ఉత్తమ తేజదేహమున యున్నగజమ్ము మదోదకమ్ముగన్ 

సత్తువ పీడనమ్మగుట సౌష్ఠవ మంతయు దీప్తి మంతమై 

 విత్తున మొక్కలన్ ననలు  విచ్చిల కన్నుల పండుగా యనన్  

మత్తుగ భీతిచెందిన సుమధ్యమ నిస్వన శబ్దబేధిగన్


007.చం: పడగలు విప్పి సర్పములు పన్నపు బుద్ధిని కాటు వేయగన్ 

వడి విషయమ్ములగ్నిశిఖి వాడిగ వేడిగ ధామమైనిలన్ 

దడ దడలంది ప్రాణులు విధానపరమ్మునఘోష చేయగా

పిడికిలి పట్టి మారుతియు పెచ్చుగ దూకొని  పృథ్వినంతటన్ 


008. శా:  ఆశ్చర్యమ్మొలికే  శరీరముగనే యాకాశ మందన్  సదా  

యాశ్చర్యం హనుమంతురాముని కృపాయాకాంక్ష తీరేట్లుగా 

దుశ్చర్యం సహనం సముద్ర పయనం దూతంపు యుక్తుల్ గనన్   

నిశ్చేష్టమ్ముల సద్యధైర్యముగనే నిర్వాహణా లంఘనల్ 


009.మ: హనుమాన్ వాక్కులు వాయు వేగములనాహార్యమ్ము లై లంకనే  

కనగా నాదివిఁ జేరి సీత నెరిగే కార్యార్థ లక్ష్యమ్ముగా 

ననగన్ రావణ నాశముం గరుపగా నావేశ రూపమ్ముతో   

క్షణమావానర క్లేశ పాటవమునాకాంక్షావివాదమ్ములన్


10.చం. విడిచిన బాణమై కదల విద్దెలు కల్గిన ధైర్య వంతుడున్

 తడబడలేని సాయమిడు తన్మయ రూపముగాంచి వేగమున్ 

వడివడి జాతి వృక్షములు వాటముగా నెదురేగ మోదమున్  

తడిపొడి పుష్ప వృక్షముల తంపర సాగర మందు చేరగన్


11.శా: సూర్యాచంద్రుల నేత్రకాంతులగుటన్ సూత్రమ్ము వేగమ్ముగన్ 

శౌర్యాదేహముచక్రమైకదులగా సౌందర్య ధీరమ్ముగన్ 

కార్యామేఘములన్నితోడుచలనం కార్యమ్ము తీర్చేందుకున్ 

ఆర్యామారుతి మేఘ గర్జనలుగా నాకాశ సౌధంబునన్


12.మ: హనుమాదేశ సముద్రునిన్ చలన వాహమ్ముల్ విశిష్టమ్ము గా 

కనుచూపౌను తరంగలన్నియెగసే కార్యార్థ సాధ్యమ్ముగన్ 

క్షణ ఛాయల్ పది యోజనమ్ములగు దీక్షాధర్మ సంద్రమ్ముగన్ 

గుణదైవాంసులు పుష్పవర్షములిటన్ గుప్పించి ప్రోక్షించగన్ 

(వాహముల్  = బాహువులు)

13.మ. కో. తాగి వేయగ శంఖి నీరు తతంగ మెన్నిన తీరుగా   

వేగి రమ్మున కళ్ల చూపులు వీచి దూకొన కాంతులన్   

సాగు వాలము ఇంద్రదృన్పువు సాక్షియేయగు రీతిగా  

మాఘ మేఘము మాదిరేయగు మారుతీ వడి తీరులే

మైనాకును పలుకులు


14. ఉ. నీపద మందు ధైర్యము వినీలమనస్సున మంతు మారుతీ 

పాపము నెంచబోకు నిను బంచిన  సాహస సేవ కర్మలన్ 

రూపము పెద్దగా నెగయ లోకము లెల్లరు తల్లడిల్లగా  

మీపద సేవ తక్షణము మేమును జేయుదు మయ్య మారుతీ

15.శా:: సత్కార్యమ్మును చేయనెంచిన మహాశాంతమ్ము నన్ సంద్రమే 

సత్కార్యమ్మును మైనకుండుగనగా సాక్షమ్ము సేవా నిధీ 

సత్కార్యమ్ముగనేను రెక్కలుగనే సాధ్యంపు కార్యమ్ముగా  

సత్కార్యమ్మును మారుతీస్థిరముగా సాగించు నీశోధనల్


16.మ::.సుకుమారాంగన సూర్య తేజములుగా, చూపుల్లు చల్లంగ నీ  

సకలమ్మున్ కలబెట్టు వాయువు భవన్ సంతోషమే నెల్లగన్ 

వికసించేలత తీరుగా కదలికల్ విశ్వాస వైనమ్మగా  

ప్రకటించే మది రామ సేవలు గనన్ ప్రాదేశ ప్రక్షాళనన్


17.మ:: ఉపకారమ్మును ధర్మమేనుపకరం బున్నంత మార్గమ్ములన్ 

అపవాదైనను సాయమేనెరుపగా సాధ్యమ్ము తీరేయగున్ 

ఉపదేశమ్ రఘువంశరాము పనిగా నుద్బోధ పొందేందుకున్ 

నుపచర్యల్ స్థితి మైనకుండుపలుకుల్ నూతంపు ధర్మమ్ముగన్


18.ఉ:: వానర శ్రేష్టుడా పలుకు పాలన లాలన నీకు మాత్రమే,  

కానము జానకిన్ వెదుకు కష్టము  రాక్షసు డెత్తుకెళ్ళగా  

జ్ఞానివి సర్వ ధర్మముల జ్ఞాతివి సర్వము నీకసాధ్యమా 

ప్రాణము నీయ త్యాగముల బంధము నీకిది పెద్ద కార్యమా


కీర్తనగా మాలచండి

19. ఉll మహనీయుండగు వాయుపుత్రుడవు రామాభీష్ట కార్యార్థి గా
మహిలో పెద్దలు మీదు సేవనములే మా స్వామి సాయమ్ము లై
సహవాసమ్మున ధర్మమార్గమున నే సాధ్యమ్ము సంభావ్య మై
బహుమానంబగు కంద మూల ఫలముల్ పక్వమ్ము ప్రాప్తమ్ముగన్

20.శా:: ఆతిథ్యమ్మునుఁ బొందినట్లుగనె సాహాయమ్ము సంతోషమున్
మాతా జానకినే గనంగ గమనా మార్గమ్ము సంభావ్యమున్
నీతాదిత్యము సత్త్వమేయగుటకున్ నీయుక్త ప్రాధాన్యముల్
ఖ్యాతే దక్కును సాగరమ్మునకునూ కావ్యమ్ము రామాయణం

.21.ఉ:: హస్తము తట్టివేగముగ హాయిగ పైకెగిరేను మారుతీ
నేస్తము లక్ష్యమేకదల నీమము నెంచిన వేగ మవ్వగన్
ప్రస్తము దేవతల్ సహన పాశము నెంచక హర్షమేయగున్
స్వస్తిగ సిద్ధదీవెనల సాధన యేయగు సంద్ర లంఘనల్


22.ఉ::  విఘ్నము చేయుచున్నవిధి విస్మిత మొందగ సాధికారతన్
విఘ్నము సంద్రమై నిలువ వీక్షణ జూపుల క్రోధమందునన్
విఘ్నము జేయగా హనుమ వీడడు బీరము మాని నెప్పు, డా   
విఘ్నము లన్నిటిన్ దునిమి వేసి జయమ్ముల దెచ్చుదప్పకన్

23. ఉ. చిత్తము చాల నిర్మలము చేతలు ధర్మ నివాస మూలమున్

ఎత్తులు వేయకే సురస యేలను నన్నుగ పట్ట నోర్వగన్
గుత్తగ నోటి విస్తరణ గమ్యము గాంచియు దూకె మారుతీ
ఎత్తుకు పైన నెత్తుల సహించిన వీరుడు వాయుపుత్రుడే

24.మ. కో. సత్యమే అభిరామ లక్ష్మణ సాధ్వి సీతయు తోడుగన్
జాత్య రాక్షస రావణుండగు సాధు వేషము వేసియే
నిత్యమేయన స్నేహ వాక్కులు నిష్ఠ జేయగ మాతనే  
సత్య శోధనలే వహించ సుసాధ్య మాయను కానగన్

25.చం. సురసన నోటి విస్తరణ సూత్రము దాటియు సాహసమ్ముగన్
తరుణము ధర్మకార్యమని తధ్యము తెల్పగ సంబరమ్ముగన్
సరియగుమాటలన్నిటను శాంతిగ విన్న గణాలు సంతసం
బరగగ రామ కార్యమిది పశ్యత గాంచగ నేను సాగెదన్

26.మ. కో.  నేర్పుకోగల మేటి జ్ఞానము నేర్పులే యతి సంపదే

కూర్పు లన్నవి విశ్వసమ్మున గూడు తృప్తల సూత్రమే

నేర్పు పుస్తక మన్న దే యనునిత్యమే యగు శ్రేష్ఠమై 

మార్పు లే ప్రకృతీ విధాతలు మానసమ్మున కాంతులై


27.చం:: సునృతి విధానముల్ గగన సూత్ర మనంగ ప్రయాణముల్ సదా  

యనృతువు లెన్న పాటులవి యక్కర రావు విలంబ రీతులన్ 

సునృపుడుపాథి దాటి పరిశోధన జేయ గణమ్ము మధ్యలన్ 

సునృపులు వానరుల్ విహిత సూక్ష్మము లెన్నగ స్వామి సేవలన్    

28.ఉ:: సాహసి రాక్షసిన్ హనుమ చప్పున సింహిక గాంచి క్రుద్ధుడై   

దేహపు నీడ గాలమగు దీక్షల మాదిరి గుంజ మూలమున్ 

దేహముఁ బెంచగాహనుమ దీటుగ సింహిక కూడ పెంచినన్  

దేహముఁ జీల్చి సింహికను తేర్చెను మారుతి సంబరమ్ముగన్

29.చం.: సుచరితకీర్తిసంపదయు శోభిత సన్నుతదేవతా గణం

బు, చలిత మారుతీ పయన భూమిక యత్నము నెంచ దేవతల్ 

వచనలపుష్పవర్షముల వంద్యపు దీవెన లెల్ల జల్లగా  

నచలమనంతమానసము నమ్మిన భాగ్యము రామకార్యమే

30. ఉll  వానర జన్మ నిచ్చితివి వాక్కుల భాగ్యమనంత శక్తులున్

మానస ధర్మ కృత్యమగు మంజుల రాముని కూర్మినీయగన్ 
కానని నేర్పులన్ మహిమ కాలము స్వామికి సేవ జేయగన్
ప్రాణము లెక్కజేయడిక ప్రాప్తము లిట్టుల దక్క పావనిన్

31. ఉll  ఆటగ నెంచకన్ హనుమ అంకిత శోధన భావనా ధృతుల్

బాటగ మేఘశబ్దముల పాఠము తోడుగ వాయు పుత్రుడే 
దూటుగ కాలనీమమున దూకెను లంక భవాండ ధామమున్
దాటగ సాగరమ్మునిటు తారక రాముని సేవనా కృతిన్

32.ఉ:: దేహము నిందుగన్ హనుమ తీరము చేరగ భీకరమ్ముగన్
ఊహలు సీత జాడలకు నున్నతి భావము జూప నాశగన్
ద్రోహుడు రావణాసురుని ధూర్తము తెచ్చిన జానకింగనన్
మా హనుమయ్యదివ్య పద మంజరి తాకెను స్వర్ణ లంకనున్

33.చం:: అచలిత దీక్షతో హనుమ యంతట లంకను జేరగా వడిన్
సుచరిత మానసంబుగల సుందర వీరుడు ధర్మ దక్షతన్  
ఉచితపు దేహభీషణము నుద్యమచేతల చిన్న జేయగా 
ప్రచలితమే బలీయమన పాటిగ విష్ణువువామనుండయెన్


No comments:

Post a Comment