Monday 22 June 2020

. హరి వంశ వర్ణనము

ప్రాంజలి  ప్రభ  🌻. జగత్ సృష్టి వర్ణనము - 1 🌻 

అథ సృష్టివర్ణనమ్‌

అగ్ని రువాచ :

అగ్ని పలికెను- ఇపుడు విష్ణువుయొక్క జగత్సృష్టలి మొదలగు క్రీడను గూర్చి చెప్పెదను, వినుము. స్వర్గాదులను నిర్మించిన ఆతడే సృష్టికి ఆది యైనవాడు ఆతడు గుణములు కలవాడు. నిర్గుణుడు కూడ.

ప్రారంభమున సద్రూప మేన బ్రహ్మయే ఆవ్యక్తావస్థలో ఉండెను. ఆకాశము గాని, రాత్రి గాని, పగలు కాని లేకుండెను. (ఆ బ్రహ్య) ప్రకృతిని, పురుషు డైన విష్ణువును ప్రవేశించి క్షోభింపచేసెను.

సృష్టి సమయయున ఆ ప్రకృతి పురుషుల క్షోభవలన మహత్తత్త్వము జనించెను. దానినుండి ఆహంకారము జనించెను. ఇంద్రియాది వికారములకు కారణ మైన అహంకారము తైజనము. పంచభూతములకు కారణ మైనది తామసము.

ఆహంకారమునుండి శబ్దతన్మాత్రరూప మైన ఆకాశము. దానినుండి స్పర్శతన్మాత్రరూప మైన వాయువు, దానినుండి రూపతన్మాత్రరూప మైన అగ్ని, దానినుండి రసతన్మాత్రరూప మైన ఉదకము, దానినుండి గంధతన్మాత్రరూప మైన పృథివియు జనించెను. 

ఇవన్నియు తామసాహంకారము నుండి జనించెను. పిదప (తైజసాహంకారము నుండి తైజసమైన ఇంద్రియములు పది వైకారికదేవతలు, పదకొండవ ఇంద్రియ మైన మనస్సు పుట్టినవి. 

పిమ్మట భగవంతుడైన బ్రహ్మ వివిధ ప్రజలను సృజింప దలచినవాడై ముందుగా జలమును సృజించెను. దానియందు తన వీర్యమును విడచెను. 

ఉదకమునకు నారములు అని పేరు. ఆవి నరుని వలన పుట్లెను. కదా. పూర్వము నారములు అనగా ఉదకములు, నరునకు స్థాన మాయెను. ఆందుచే ఆతడు నారాయణు డని చెప్పబడెను.

సశేషం....

🌹 🌹 🌹 🌹 
తెలుగు భావము 
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 39 🌹, ✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 17, సేకరణ : ప్రసాద్ భరద్వాజ/ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ .

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 27 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 12
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. హరి వంశ వర్ణనము  - 2 🌻

ఇత్యుక్త్వా సా చ శుమ్భాదీన్‌ హత్వేన్ద్రేణ చ సంస్తుతా | ఆర్యా దుర్గా వేదగర్భా అమ్బికా భద్రకాల్యపి. 12

భద్రా క్షేమ్యా క్షేమకరీ నైకబాహుర్నమామి తామ్‌ |

త్రిసంధ్యం యః పఠేన్నామ సర్వాన్కామానవాప్నుయాత్‌. 13

ఇట్లు పలికి ఆమె అంతర్ధానము చెందినది. ఆమె పూర్వము శుంభాది రాక్షసులను సంహరించి దేవేంద్రునిచే "ఆర్యా! దుర్గా. వేదగర్భా, అంబికా, భద్రకాళీ, భద్రా, క్షేమ్యాక్షేమకరీ, నైకబాహుః అను పేర్లు గల నిన్ను నమస్కరించుచున్నాను." అని స్తుతింపబడినది. ఈ నామములను త్రిసంధ్యలందును చదువువాడు సమన్తకామములను పొందును.

కంసోపి పూతనాదీంశ్చ ప్యైషయద్భాలనాశనే | యశోదాపతినన్దాయ వసుదేవేన చార్పితౌ. 14

రక్షణాయ చ కంసాదేర్భితేనేవ హి గోకులే | రామకృష్ణౌ చేరతుస్తౌ గోభిర్గోపాలకైః సహ. 15

సర్వస్య జగతః పాలౌ గోపాలౌ తౌ బభూవతుః |

ఆ బాలుని చంపుటకై, కంసుడు, పూతన మొదలగు వారిని పంపెను. 

కంసుని నుండి భయపడినవాడు వలె వసుదేవునిచే యశోదాపతియైన నందునికి రక్షణార్థమై ఈయబడిన రామకృష్ణులు గోకులము నందు గోవులతోడను, గోపాలకులతోడనుకలిసి సంచరించిరి. జగత్తునకు పాలకులైనా వారు గోపాలులైరి.

కృష్ణశ్చోలూఖలే బద్ధో దామ్నా వ్యగ్రయశోదయా. 16

యమలార్జునమధ్యే7గాద్భగ్నౌ చ యమలార్జునౌ |

విసుగు చెందిన యశోదచేత రోటికి కట్టబడిన కృష్ణుడు జంటగా పెరిగిన రెండు అర్జునవృక్షములు మధ్యకు వెళ్ళగా అవి భగ్నమైనవి.

పరివృత్తశ్చ శకటః పాదక్షేపాత్త్సనార్థినా. 17

పూతనా స్తనపానేన సా హతా హన్తకుముద్యతా | వృన్దావనగతః కృష్ణః కాలియం యమునాహ్రదాత్‌. 18

జిత్వా నిఃస్సార్య చాబ్దిస్థం చకార బలసంస్తుతః | క్షేమం తాలవనం చక్రే హత్వా ధేనుకగర్ధభమ్‌. 19

బృందావనమందున్న శ్రీకృష్ణుడు స్తన్యమును కోరుచు పాదములను విసరి శకటాసురుని తల క్రిందు చేసెను. 

తను చంపుటకై ఉద్యమించిన పూతనను స్తన్యమును త్రాగి చంపివెసెను. కాలియుని జయించి అతనిని యమునాహ్రదము నుండి వెడలగొట్టి సముద్రమునందు నివసించునట్లు చేసెను. 

బలముచే స్తుతింపబడిన అతడు గర్దభరూపమున నున్న ధేనుకాసురుని చంపి తాలవనమును క్షమకరమైన దానినిగా చేసెను.

అరిష్టవృషభం హత్వా కేశినం హయరూపిణమ్‌ | శక్రోత్సవం పరిత్యజ్య కారితో గోత్రయజ్ఞకః. 20

వృషభ రూపముననున్న అరిష్టాసురుని చంపి హయరూపములో ఉన్న కేశిని సంహరించెను. శక్రోత్సవమును మాన్పి పర్వతపూజ చేయించెను.

పర్వతం ధారయిత్వా చ శక్రాద్వృష్టిర్నివారితా | నమస్కృతో మహేన్ద్రేణ గోవిన్దో7థార్జునో7ర్పితః 21

ఇన్ద్రోత్సవస్తు తుష్టేన భూయః కృష్ణేన కారితః |

పర్వతమును ఎత్తి దేవేంద్రుడు కురిపంచిన వర్షము నివారించెను. దేవేంద్రుడు శ్రీకృష్ణునికి నమస్కరించి అర్జునుని సమర్పించెను. కృష్ణుడు సంతసించి ఇంద్రోత్సవము చేయించెను.

రథస్థో మథురాం చాగాత్కంసోక్తాక్రూరసంస్తుతః 22

గోపీభిరనురక్తాభిః క్రీడితాభిర్నిరీక్షితః | రజకం చాప్రయచ్ఛనతం హత్వా వస్త్రాణి చాగ్రహీత్‌. 23

సహ రామేణ మాలాభృన్మాలాగకారే వరం దదౌ | దత్తునాలేపనాం కుబ్జామృజుం చక్రే7హనద్గజమ్‌. 24

మత్తం కువలయాపీడం ద్వారి రఙ్గం ప్రవిశ్య చ | కంసాదీనాం పశ్యతాం చ మఞ్చస్థానాం నియుద్దకమ్‌.

చక్రే చాణూరమల్లేన ముష్టికేన బలోకరోత్‌ | చాణూరముష్టికౌ తాభ్యాం హతౌ మల్లౌ తథాపరౌ. 26

కంసుడు పంపిన ఆక్రూరుడు స్తుతింపగా శ్రీకృష్ణుడు రథము నెక్కి మథురకు వెళ్లెను. అతడు ఆ విధముగా వెళ్ళిపోవునపుడు అతనితో క్రీడించిన, అనురక్తలైన గోపికలు అతనిని చూచుచు నిలబడిపోయిరి. 

వస్త్రముల నడుగగా ఇవ్వని రజకుని చంపి వస్త్రములను గ్రహించెను. రామునితో కలిసి పుష్పమాలలు ధరించి మాలాకారునకు వరమిచ్చెను. అంగరాగమునిచ్చిన కుబ్జకు గూను పోవునట్లు చేసెను.

 రాజద్వారమునందున్న మదించిన కువలయాపీడమను గజమును సంహరించెను. రంగస్థలమును ప్రవేశించి, అసనములపై కూర్చున్న కంసాదులు చూచుచుండగా చాణూరముల్లునితో మల్లయుద్ధము చేసెను. బాలరాముడు ముష్టికుడను మల్లునితో చేసెను. వారిరువురు ఆ చాణూరముష్టికులను మల్లులను, ఇతరులను చంపిరి.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 39 🌹 
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 17
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 28 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 12
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. హరి వంశ వర్ణనము  - 3 🌻

మథురాధిపతిం కంసం హత్వాం తత్పితరం హరిః | చక్రే యాదవరాజానమస్తిప్రాప్తీచ కంసగే. 27

జరాసన్దన్య తే పుత్రౌ జరానన్దస్తదీరితః | చక్రే స మథురారోధం యాదవైర్యుయుధే శరైః 28

శ్రీకృష్ణుడు మథురాపతి యైన కంసుని చంపి అతని తండ్రనని రాజుగా చేసెను. కంసుని భార్యలైన ఆస్తి-ప్రాప్తి అనువారు జరాసంధుని కుమార్తెలు. వారు ప్రేరేపింపగా జరాసంధడు మథురానగరమును ముట్టడించెను. యాదవులు బాణములతో అతనితో యుద్దము చేసిరి.

రామకృష్ణౌ చ మథురాం త్యక్త్వా గోమన్తమాగతా | జరాసన్ధం విజిత్యాజౌ పౌండ్రకం వాసుదేవకమ్‌. 29

పురా చ ద్వారకాం కృత్వా న్యవసద్యాదవై ర్వృతః |

రామకృష్ణులు మథరను విడచి గోమంతమునకు వచ్చిరి. యుద్ధమున జరాసంధని జయించి, పౌండ్రక వాసుదేవుని కూడ జయించి, శ్రీకృష్ణుడు ద్వారకానగరమును నిర్మించి అందు యాదవులతో నివసించెను.

భౌమం తు నరకం హత్వా తేనానీతాశ్చ కన్యకాః. 30

దేవగన్ధర్వయక్షాణాం తా ఉవాహ జనార్ధనః | షోడశస్త్రీసహస్రాణి రుక్మిణ్యాద్యాస్తథాష్ట చ. 31

జనార్దనుడు, భూమి పుత్రుడైన నరకాసురిని చంపి, అతనిచే బంధింపబడిన దేవగంధర్వ యక్షకన్యలను వివాహామాడెను. 

ఈ విధముగ అతడు కూడ పదహారువేలమంది స్త్రీలను, రుక్మిణి మొదలగు ఎనమండుగురిని వివాహమాడెను.

సత్యభామాసమాయుక్తో గరుడే నరకార్దనః | మణిశైలం సరత్నే చ ఇన్ద్రం జిత్వా హరిర్దివి. 32

పారిజాతం సమానీయ సత్యభామా గృహేకరోత్‌ |

నరకాసురసంహారియైన ఆ హరి సత్యభామా సహితుడై గరుడారూడుడై స్వర్గలోకమునకు వెళ్ళి అచట ఇంద్రుని జయించి, మణిశైలమును, రెండు రత్నములను, పారిజాతవృక్షమును తీసికొని సత్యభామా గృహమున ఉంచెను.

సాందీపనేశ్చ శస్త్రాస్త్రం జ్ఞాత్వాం తద్భాలకం దదౌ. 33

జిత్వా పఞ్చజనం దైత్యం యమేన చ సుపూజితః | అవధీత్కాలయవనం ముచుకున్దేన పూజితః. 34

వసుదేవం దేవకీం చ భక్తాన్విప్రాంశ్చ సోర్చయత్‌ |

సాందీపని నుండి శస్త్రాస్త్రముల నభ్యసించి, మరణించిన అతని కుమారుని మరల తీసికొని వచ్చి ఇచ్చెను. 

పంచజనుడను దైత్యుని సంహరించి యమునిచే పూజింపబడెను. కాలయవనుని సంహరించి ముచుకుందనిచే పూజింపబడెను. దేవకీవసుదేవులను భక్తులను, విప్రులను పూజించెను.

రేవత్యాం బలభద్రాచ్చ జజ్ఞాతే నిశఠోల్ముకౌ. 35

కృష్ణాత్సామ్బో జామ్బవత్యామన్యాస్వన్యే7భన్సుతాః |
ప్రద్యుమ్నోభూచ్చ రుక్మిణ్యాం షష్ఠేహ్ని స హృతో బలాత్‌. 36

శమ్బరేణామ్బుధౌ క్షిప్తో మత్స్యో జగ్రాహా ధీవరః | తం మత్స్యం శమ్బరాయాదాన్మాయావత్త్యెచ శమ్బరః.

మాయావతీ మత్సమధ్యే దృష్ట్వా స్వం పతిమాదరాత్‌ | పుషోష సా తం చోవాచ రతిస్తేహం పతిర్మమ.

కామస్త్వం శమ్భునానఙ్గః కృతో7హం శమ్భరేణ చ |
హృతా న తస్య పత్నీ త్వం మాయాజ్ఞః శమ్బరం జహి.

బలభద్రునకు రేవతియందు నిశఠుడు, ఉల్ముకుడు అను ఇరువురు కుమారులు కలిగిరి, కృష్ణునకు జాంబవతి యందు సాంబుడు పుట్టెను. ఇతర భార్యలయందు ఇంకను కొందరు పుత్రులు పుట్టిరి. రుక్మిణియందు ప్రద్యుమ్నుడు పుట్టెను. 

అరవదినమున ఆ శిశువును శంబరుడు బలాత్కారముగా అపహరంచి సముద్రములో పారవేయగా ఒక మత్స్యము పట్టుకొనెను. (మ్రింగెను) ఆ మత్స్యమును ఒక జాలరి పట్టుకొనెను. దానిని శంబరున కిచ్చెను. 

శంబరుడు మాయావతి కిచ్చెము. మాయావతి మత్స్యగర్భములో నున్న తన పతిని చూచి అదరముతో పెంచెను అతనితో ఇట్లనెను. " నేను నీ రతిని. నీవు నాపతివైన మన్మథుడవు. 

శివుడు నీకు శరీరము లేకుండునట్లు చేసెను. నన్ను శంబరుడు హరించెను. నేను అతని భార్యను కాదు. నీవు మాయలు తెలిసిన వాడవుగాన ఈ శంబరుని సంహరించుము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 39 🌹, ✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు, ప్రథమ సంపుటము, అధ్యాయము - 17, సేకరణ : ప్రసాద్ భరద్వాజ/ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 26 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 12
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. హరి వంశ వర్ణనము  - 1 🌻

అథ శ్రీహరివంశ వర్ణనమ్‌.
అగ్ని రువాచ :

హరివంశం ప్రవక్ష్యామి విష్ణునాభ్యమ్భుజాదజః | బ్రహ్మణో త్రిస్తతః సోమః సోమాజ్జాతః పురూరవాః 1

తస్మాదాయురభూత్తస్మాన్నహుషో7తో యయాతికః | యదుం చ తుర్వసుం తస్మాద్దేవయానాప్యజాయత. 2

ద్రుహ్యుం చానుం చ పూరం చ శర్మిష్ఠా వార్షపర్వణీ | యదోః కులే యాదవాశ్చ వాసుదేవస్తదుత్తమః. 3

అగ్ని పలికెను - హరివంశమును చెప్పెదను. విష్ణునాభికమలము నుండి బ్రహ్మ పుట్టెను. బ్రహ్మకు అత్రి, అతనికి సోముడు, అతనికి పురూరవుడు, అతనికి ఆయువు, అతనికి నహుషుడు, అతనికి యయాతి పుట్టిరి, అతనినుండి దేవయాని యదువు, తుర్వసుడు అను కుమారులను, వృషవర్వుని కుమారైయైన శర్మిష్ఠ ద్రుహ్యు-అను పూరులు అనెడు కుమారులను కనిరి. యదువు కులముందు యాదవులు పుట్టిరి. వాసుదేవుడు వారిలో ఉత్తముడు.

భువో భారావతారార్థ దేవక్యాం వసుదేవతః | హిరణ్యకశిపోః పుత్రాః షడ్‌ గర్భా యోగనిద్రయా. 4

విష్ణుప్రయుక్తయా నీతా దేవకీజఠరం పురా | అభూచ్చసప్తమో గర్భో దేవక్యా జఠరాద్బలః 5

సంక్రామితోభూద్రోహిణ్యాం రౌహిణయస్తతో హరిః | కృష్ణాష్టమ్యాం చ నభసి అర్థరాత్రే చతుర్భుజః 6

భూ భారమును తొలగించుటకై పూర్వజన్మలో హిరణ్యకశివుని ఆరుగురు పుత్రులు దేవకి యందు వసుదేవుని వలన, విష్ణు ప్రేరిత యైన యోగమాయ- ప్రభావముచే పుట్టిరి. బలరాముడు దేవికి సప్తమ గర్భముగా అయెను. అతడు రోహిణి యందు సంక్రమింపజేయబడి రౌహిణయుడాయెను. పిమ్మట చతుర్భుజుడైన హరి శ్రావణ కృష్ణపక్ష్యష్టమి యందు అర్ధరాత్రమున జనించెను.

దేవక్యా వసుదేవేన స్తుతో బాలో ద్విబాహుకః | వసుదేవః కంసభయాద్యశోదాశయనే నయత్‌. 7

యశోదాబాలికాం గృహ్య దేవకీ శయనే నయక్‌ | కంసో బాలధ్వనిం శ్రుత్వా తాం చిక్షేప శిలాతలే. 8

రెండు భాహువులు గల బాలుడుగా మారిన ఆ చతుర్భుజుని దేవకీ వసుదేవులు స్తుతించిరి. వసుదేవుడు కంసునికి భయపడి ఆ పిల్లవానిని తీసికొని వెళ్లి యశోద పక్కలో పరుండబెట్టి యశోద కుమార్తెను తీసికొని వచ్చి దేవకి పక్కలో పరుండ బెట్టెను. కంసుడు పిల్ల ఏడ్చిన ధ్వని విని ఆ శిశువును శిలపై వేసి కొట్టెను.

వారితోపి స దేవక్యా మృత్యుర్గర్భోష్టమో మమ| శ్రుత్వాశరీరిణీం వాచం మత్తో గర్భాః సుమారితాః 9

సమర్పితాస్తు దేవక్యా వివాహసమయేరితాః | సా క్షిప్తా బాలికా కంసమాకాశస్థా7బ్రవీదిదమ్‌. 10

దేవకి వారించినను "నీ అష్టమగర్భము నాకు మృత్యుహేతువు" అని పలుకుచు అట్లుచేసెను. ఆకాశవాణిని విని అతడు దేవకి వివాహసమయమున చెప్పిన ప్రకారము తన కిచ్చన శిశువులనందరిని పూర్వము చంపివేసెను. క్రిందికి విసరి వేయబడిన ఆ బాలిక అకాశముపైకి ఎగిరి కంసునిలో ఇట్లు పలికెను.

బాలికోవాచ:

కిం మాయా క్షిప్తయా కంస జాతో యస్త్వాం వధిష్యతి | సర్వస్వభూతో దేవానాం భూభారహరణాయ సః.

బాలిక పలికెను. కంసా; నన్ను విసిరివేసి ఏమి ప్రయోజనము? దేవతలకు సర్వన్వము వంటివాడు ఒకడు భూభారమును తొలగించుటకై పుట్టినాడు. అతడు నిన్ను చంపివేయగలడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 27 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 12
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. హరి వంశ వర్ణనము  - 2 🌻

ఇత్యుక్త్వా సా చ శుమ్భాదీన్‌ హత్వేన్ద్రేణ చ సంస్తుతా | ఆర్యా దుర్గా వేదగర్భా అమ్బికా భద్రకాల్యపి. 12

భద్రా క్షేమ్యా క్షేమకరీ నైకబాహుర్నమామి తామ్‌ |

త్రిసంధ్యం యః పఠేన్నామ సర్వాన్కామానవాప్నుయాత్‌. 13

ఇట్లు పలికి ఆమె అంతర్ధానము చెందినది. ఆమె పూర్వము శుంభాది రాక్షసులను సంహరించి దేవేంద్రునిచే "ఆర్యా! దుర్గా. వేదగర్భా, అంబికా, భద్రకాళీ, భద్రా, క్షేమ్యాక్షేమకరీ, నైకబాహుః అను పేర్లు గల నిన్ను నమస్కరించుచున్నాను." అని స్తుతింపబడినది. ఈ నామములను త్రిసంధ్యలందును చదువువాడు సమన్తకామములను పొందును.

కంసోపి పూతనాదీంశ్చ ప్యైషయద్భాలనాశనే | యశోదాపతినన్దాయ వసుదేవేన చార్పితౌ. 14

రక్షణాయ చ కంసాదేర్భితేనేవ హి గోకులే | రామకృష్ణౌ చేరతుస్తౌ గోభిర్గోపాలకైః సహ. 15

సర్వస్య జగతః పాలౌ గోపాలౌ తౌ బభూవతుః |

ఆ బాలుని చంపుటకై, కంసుడు, పూతన మొదలగు వారిని పంపెను. 

కంసుని నుండి భయపడినవాడు వలె వసుదేవునిచే యశోదాపతియైన నందునికి రక్షణార్థమై ఈయబడిన రామకృష్ణులు గోకులము నందు గోవులతోడను, గోపాలకులతోడనుకలిసి సంచరించిరి. జగత్తునకు పాలకులైనా వారు గోపాలులైరి.

కృష్ణశ్చోలూఖలే బద్ధో దామ్నా వ్యగ్రయశోదయా. 16

యమలార్జునమధ్యే7గాద్భగ్నౌ చ యమలార్జునౌ |

విసుగు చెందిన యశోదచేత రోటికి కట్టబడిన కృష్ణుడు జంటగా పెరిగిన రెండు అర్జునవృక్షములు మధ్యకు వెళ్ళగా అవి భగ్నమైనవి.

పరివృత్తశ్చ శకటః పాదక్షేపాత్త్సనార్థినా. 17

పూతనా స్తనపానేన సా హతా హన్తకుముద్యతా | వృన్దావనగతః కృష్ణః కాలియం యమునాహ్రదాత్‌. 18

జిత్వా నిఃస్సార్య చాబ్దిస్థం చకార బలసంస్తుతః | క్షేమం తాలవనం చక్రే హత్వా ధేనుకగర్ధభమ్‌. 19

బృందావనమందున్న శ్రీకృష్ణుడు స్తన్యమును కోరుచు పాదములను విసరి శకటాసురుని తల క్రిందు చేసెను. 

తను చంపుటకై ఉద్యమించిన పూతనను స్తన్యమును త్రాగి చంపివెసెను. కాలియుని జయించి అతనిని యమునాహ్రదము నుండి వెడలగొట్టి సముద్రమునందు నివసించునట్లు చేసెను. 

బలముచే స్తుతింపబడిన అతడు గర్దభరూపమున నున్న ధేనుకాసురుని చంపి తాలవనమును క్షమకరమైన దానినిగా చేసెను.

అరిష్టవృషభం హత్వా కేశినం హయరూపిణమ్‌ | శక్రోత్సవం పరిత్యజ్య కారితో గోత్రయజ్ఞకః. 20

వృషభ రూపముననున్న అరిష్టాసురుని చంపి హయరూపములో ఉన్న కేశిని సంహరించెను. శక్రోత్సవమును మాన్పి పర్వతపూజ చేయించెను.

పర్వతం ధారయిత్వా చ శక్రాద్వృష్టిర్నివారితా | నమస్కృతో మహేన్ద్రేణ గోవిన్దో7థార్జునో7ర్పితః 21

ఇన్ద్రోత్సవస్తు తుష్టేన భూయః కృష్ణేన కారితః |

పర్వతమును ఎత్తి దేవేంద్రుడు కురిపంచిన వర్షము నివారించెను. దేవేంద్రుడు శ్రీకృష్ణునికి నమస్కరించి అర్జునుని సమర్పించెను. కృష్ణుడు సంతసించి ఇంద్రోత్సవము చేయించెను.

రథస్థో మథురాం చాగాత్కంసోక్తాక్రూరసంస్తుతః 22

గోపీభిరనురక్తాభిః క్రీడితాభిర్నిరీక్షితః | రజకం చాప్రయచ్ఛనతం హత్వా వస్త్రాణి చాగ్రహీత్‌. 23

సహ రామేణ మాలాభృన్మాలాగకారే వరం దదౌ | దత్తునాలేపనాం కుబ్జామృజుం చక్రే7హనద్గజమ్‌. 24

మత్తం కువలయాపీడం ద్వారి రఙ్గం ప్రవిశ్య చ | కంసాదీనాం పశ్యతాం చ మఞ్చస్థానాం నియుద్దకమ్‌.

చక్రే చాణూరమల్లేన ముష్టికేన బలోకరోత్‌ | చాణూరముష్టికౌ తాభ్యాం హతౌ మల్లౌ తథాపరౌ. 26

కంసుడు పంపిన ఆక్రూరుడు స్తుతింపగా శ్రీకృష్ణుడు రథము నెక్కి మథురకు వెళ్లెను. అతడు ఆ విధముగా వెళ్ళిపోవునపుడు అతనితో క్రీడించిన, అనురక్తలైన గోపికలు అతనిని చూచుచు నిలబడిపోయిరి. 

వస్త్రముల నడుగగా ఇవ్వని రజకుని చంపి వస్త్రములను గ్రహించెను. రామునితో కలిసి పుష్పమాలలు ధరించి మాలాకారునకు వరమిచ్చెను. అంగరాగమునిచ్చిన కుబ్జకు గూను పోవునట్లు చేసెను.

 రాజద్వారమునందున్న మదించిన కువలయాపీడమను గజమును సంహరించెను. రంగస్థలమును ప్రవేశించి, అసనములపై కూర్చున్న కంసాదులు చూచుచుండగా చాణూరముల్లునితో మల్లయుద్ధము చేసెను. బాలరాముడు ముష్టికుడను మల్లునితో చేసెను. వారిరువురు ఆ చాణూరముష్టికులను మల్లులను, ఇతరులను చంపిరి.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 28 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 12
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. హరి వంశ వర్ణనము  - 3 🌻

మథురాధిపతిం కంసం హత్వాం తత్పితరం హరిః | చక్రే యాదవరాజానమస్తిప్రాప్తీచ కంసగే. 27

జరాసన్దన్య తే పుత్రౌ జరానన్దస్తదీరితః | చక్రే స మథురారోధం యాదవైర్యుయుధే శరైః 28

శ్రీకృష్ణుడు మథురాపతి యైన కంసుని చంపి అతని తండ్రనని రాజుగా చేసెను. కంసుని భార్యలైన ఆస్తి-ప్రాప్తి అనువారు జరాసంధుని కుమార్తెలు. వారు ప్రేరేపింపగా జరాసంధడు మథురానగరమును ముట్టడించెను. యాదవులు బాణములతో అతనితో యుద్దము చేసిరి.

రామకృష్ణౌ చ మథురాం త్యక్త్వా గోమన్తమాగతా | జరాసన్ధం విజిత్యాజౌ పౌండ్రకం వాసుదేవకమ్‌. 29

పురా చ ద్వారకాం కృత్వా న్యవసద్యాదవై ర్వృతః |

రామకృష్ణులు మథరను విడచి గోమంతమునకు వచ్చిరి. యుద్ధమున జరాసంధని జయించి, పౌండ్రక వాసుదేవుని కూడ జయించి, శ్రీకృష్ణుడు ద్వారకానగరమును నిర్మించి అందు యాదవులతో నివసించెను.

భౌమం తు నరకం హత్వా తేనానీతాశ్చ కన్యకాః. 30

దేవగన్ధర్వయక్షాణాం తా ఉవాహ జనార్ధనః | షోడశస్త్రీసహస్రాణి రుక్మిణ్యాద్యాస్తథాష్ట చ. 31

జనార్దనుడు, భూమి పుత్రుడైన నరకాసురిని చంపి, అతనిచే బంధింపబడిన దేవగంధర్వ యక్షకన్యలను వివాహామాడెను. 

ఈ విధముగ అతడు కూడ పదహారువేలమంది స్త్రీలను, రుక్మిణి మొదలగు ఎనమండుగురిని వివాహమాడెను.

సత్యభామాసమాయుక్తో గరుడే నరకార్దనః | మణిశైలం సరత్నే చ ఇన్ద్రం జిత్వా హరిర్దివి. 32

పారిజాతం సమానీయ సత్యభామా గృహేకరోత్‌ |

నరకాసురసంహారియైన ఆ హరి సత్యభామా సహితుడై గరుడారూడుడై స్వర్గలోకమునకు వెళ్ళి అచట ఇంద్రుని జయించి, మణిశైలమును, రెండు రత్నములను, పారిజాతవృక్షమును తీసికొని సత్యభామా గృహమున ఉంచెను.

సాందీపనేశ్చ శస్త్రాస్త్రం జ్ఞాత్వాం తద్భాలకం దదౌ. 33

జిత్వా పఞ్చజనం దైత్యం యమేన చ సుపూజితః | అవధీత్కాలయవనం ముచుకున్దేన పూజితః. 34

వసుదేవం దేవకీం చ భక్తాన్విప్రాంశ్చ సోర్చయత్‌ |

సాందీపని నుండి శస్త్రాస్త్రముల నభ్యసించి, మరణించిన అతని కుమారుని మరల తీసికొని వచ్చి ఇచ్చెను. 

పంచజనుడను దైత్యుని సంహరించి యమునిచే పూజింపబడెను. కాలయవనుని సంహరించి ముచుకుందనిచే పూజింపబడెను. దేవకీవసుదేవులను భక్తులను, విప్రులను పూజించెను.

రేవత్యాం బలభద్రాచ్చ జజ్ఞాతే నిశఠోల్ముకౌ. 35

కృష్ణాత్సామ్బో జామ్బవత్యామన్యాస్వన్యే7భన్సుతాః |
ప్రద్యుమ్నోభూచ్చ రుక్మిణ్యాం షష్ఠేహ్ని స హృతో బలాత్‌. 36

శమ్బరేణామ్బుధౌ క్షిప్తో మత్స్యో జగ్రాహా ధీవరః | తం మత్స్యం శమ్బరాయాదాన్మాయావత్త్యెచ శమ్బరః.

మాయావతీ మత్సమధ్యే దృష్ట్వా స్వం పతిమాదరాత్‌ | పుషోష సా తం చోవాచ రతిస్తేహం పతిర్మమ.

కామస్త్వం శమ్భునానఙ్గః కృతో7హం శమ్భరేణ చ |
హృతా న తస్య పత్నీ త్వం మాయాజ్ఞః శమ్బరం జహి.

బలభద్రునకు రేవతియందు నిశఠుడు, ఉల్ముకుడు అను ఇరువురు కుమారులు కలిగిరి, కృష్ణునకు జాంబవతి యందు సాంబుడు పుట్టెను. ఇతర భార్యలయందు ఇంకను కొందరు పుత్రులు పుట్టిరి. రుక్మిణియందు ప్రద్యుమ్నుడు పుట్టెను. 

అరవదినమున ఆ శిశువును శంబరుడు బలాత్కారముగా అపహరంచి సముద్రములో పారవేయగా ఒక మత్స్యము పట్టుకొనెను. (మ్రింగెను) ఆ మత్స్యమును ఒక జాలరి పట్టుకొనెను. దానిని శంబరున కిచ్చెను. 

శంబరుడు మాయావతి కిచ్చెము. మాయావతి మత్స్యగర్భములో నున్న తన పతిని చూచి అదరముతో పెంచెను అతనితో ఇట్లనెను. " నేను నీ రతిని. నీవు నాపతివైన మన్మథుడవు. 

శివుడు నీకు శరీరము లేకుండునట్లు చేసెను. నన్ను శంబరుడు హరించెను. నేను అతని భార్యను కాదు. నీవు మాయలు తెలిసిన వాడవుగాన ఈ శంబరుని సంహరించుము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 32 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 13
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భారతము వాఖ్యానం  - 3 🌻

జితో యుదిష్ఠిరో భ్రాతృయుతశ్చారణ్యకం య¸°. 20

వనే ద్వాదశ వర్షాణి ప్రతిజ్ఞాతాని సో7నయత్‌ | అష్టాశీతి సహస్రాణి భోజయన్‌ పూర్వవద్ధ్విజాన్‌ . 21

సధౌమ్యో ద్రౌపదీషష్ఠ స్తతః ప్రాయాద్విరాటకమ్‌ | కజ్కో ద్విజో హ్యవిజ్ఞాతో రాజా భీమో7థ సూపకృత్‌.

బృహన్నడార్జునో భార్యా సైరన్ధ్రీ యమజౌ తథా | అన్యనామ్నా భీమసేనః కీచకం చావధీన్నిశి. 23

ద్రౌవదీం హర్తుకామం తమర్జునశ్చాజయత్కురూన్‌ | కుర్వతో గోగ్రహాదీంశ్చ తైర్‌జ్ఞాతాః పాణ్డవా అథ. 24

ద్యూతమునందు ఓడిపోయిన యుధిష్ఠిరుడు సోదరులతోడను, ద్రౌపదితోడను, ధౌమ్యునితోడను అరణ్యమునకు వెళ్లి ప్రతిజ్ఞచేసిన విధముగ అచట పండ్రెండు సంవత్సరములు గడపెను. అచట పూర్వము నందు వలె, ప్రతిదివసము నందును, ఎనుబది ఎనిమిదివేలమంది బ్రాహ్మణులకు భోజనము పెట్టుచుండెను. పిమ్మట వారందరును విరాటుని చేరిరి. యుధిష్ఠిరుడు కంకుడనెడు. బ్రాహ్మణుడుగను, భీముడు వంటవాడుగను, అర్జునుడు బృహన్నలగను అయి ఇతరులకు తెలియ కుండునట్లు అచట నివసించిరి. నకులసహదేవులు వేరు పేర్లుతో ఉండిరి. ద్రౌపదిని హరింప నభిలషించిన కీచకుని భీమ సేనుడు రాత్రివేళ సంహరించెను. గోగ్రహణాదికమును చేయ వచ్చిన కౌరవులను అర్జునుడు జయించెను. అప్పుడు ఆ కౌరవులు వారు పాండవు లని గుర్తించిరి.

సుభద్రా కృష్ణభగినీ అర్జునాత్సమజీజనత్‌ | అభిమన్యుం దదౌ తసై#్మ విరాటశ్చోత్తరాం సుతామ్‌. 25

కృష్ణుని సోదరియైన సుభద్రకు అర్జునునివలన అభిమన్యడను కుమారుడు కలిగెను. విరాటుడు అతనికి తన కుమార్తెయైన ఉత్తర నిచ్చెను.

ఆసిత్సప్తాక్షౌహిణీశో ధర్మరాజో రణాయ సః | కృష్ణో దూతో7బ్రవీద్గత్వా దుర్యోధన మమర్షణమ్‌. 26

ఏకాదశాక్షౌహిణీశం నృపం దుర్యోధనం తదా | యుధిష్ఠిరాయార్ధరాజ్యం దేహి గ్రామాంశ్చ పఞ్ఛ వా. 27

యుధ్యస్వ వా వచః శ్రుత్వా కృష్ణమాహ సుయోధనః |

ధర్మరాజు యుద్ధమునకై ఏడు అక్షౌహిణుల సైన్యమును నన్నద్దము చేసికొనెను. కృష్ణుడు అమర్ష పూర్ణుడును, పదకొండు అక్షోహిణులకు అధిపతియు అగు దుర్యోధనుని వద్దకు దూతగా వెళ్లి - "యుధిష్ఠిరునకు సగము రాజ్యము నిమ్ము. లేదా ఐదు గ్రామాల నైన ఇమ్ము. అట్లు కానిచో యుద్ధము చేయము" అని చెప్పెను. ఆ మాటలు విని సుయోధనుడు శ్రీ కృష్ణునితో ఇట్లు పలికెను.

సుయోధన ఉవాచ:

భూసూచ్యగ్రం న దాస్యామి యోత్స్యే సఙ్గ్రహణోద్యతః 28

అగ్నిరువాచ:

విశ్వరూపం దర్శయిత్వా అధృష్యం విదురార్చితః | ప్రాగద్యుధిష్ఠిరం ప్రాహ యోధయైనం సుయోధనమ్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మహాభారతాఖ్యానం నామ త్రయోదశో7ధ్యాయః

సుయోధను డిట్లనెను - ''సూది మోపినంత నేల నైనను ఇవ్వను. యుద్దము చేసెదను. యుద్ధమునకై సిద్ధముగా ఉన్నాను." అగ్ని పలికెను. అంత శ్రీ కృష్ణుడు ఎదిరింప శక్యముకాని విశ్వరూపము చూపి, విదురుని చేత పూజింపబడినవాడై, యుధిష్ఠిరుని దగ్గరకు వెళ్లి, "ఆ సుయోధననితో యుద్ధము చేయుము" అని చెప్పెను.

అగ్ని మహాపురాణములో భారతాఖ్యన మన పదమూడవ అధ్యయము సమాప్తము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

Wednesday 17 June 2020

🌻. ఉత్తరకాండ వర్ణనము 🌻

శ్రీ మదగ్ని మహాపురాణము - 25 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 11
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ఉత్తరకాండ వర్ణనము 🌻

అథ ఏకాదశోధ్యాయః.

అథోత్తరకాణ్డవర్ణనమ్‌.

నారద ఉవాచః

రాజ్యస్థం రాఘవం జగ్మురగస్త్యాధ్యాః సుపూజితాః|

ఋషయ ఊచుః :

ధన్యస్త్వం విజయీ యస్మాదిన్ద్రజిద్వినిపాతితః

నారదుడు పలికెను. రాజ్యము చేయుచున్న రామునివద్దకు పూజనీయులైన అగస్త్యాదులు వెళ్లిరి. ఋషులు ఇట్లు పలికిరి-నీవు ఇంద్రజిత్తును సంహరించితివి. ఈ విధముగ విజయవంతుడవైన నీవు ధన్యుడవు.

బ్రహ్మాత్మజః వులస్త్యోభూద్విస్రవాస్తస్య కైకసీ | పుష్పోత్కటా భ్రూత్ప్రథమా తత్పుత్రో భూద్ధనేశ్వరః 2

కైకస్యాం రావణో జజ్ఞే వింశద్బాహుద్ధశాననః | తపసా బ్రహ్మదత్తేన వరేణ జితదైవతః 3

కుమ్భకర్ణః సనిద్రో భూర్ధర్మిష్ఠో భూద్విభీషణః | స్వసా శూర్పణఖా తేషాం రావణాన్మేఘనాదకః. 4

ఇన్ద్రం జిత్వేన్ద్రజిచ్ఛాభూద్రావణాదధికో బలీ | హతస్త్వయా లక్ష్మమేన దేవదేః క్షేమమిచ్ఛతా. 5

బ్రహ్మకు పులస్త్యుడను కుమారుడు కలిగెను. అతని కుమారుడు విశ్రవసుడు. అతని భార్య కైకసి. అతని ప్రతము భార్య పుష్పోద్భవ. పెద్దదైన పుష్పోద్భవకు కుబేరుడు పుత్రుడుగ జనించెను. కైకసికి ఇరువది బాహువులును, పదిముఖములును గల రావణుడు పుట్టెను. అతడె బ్రహ్మ ఇచ్చిన వరములచే దేవతల నందరిని జయించెను. నిద్రాపరవశుడైన కుంభకర్ణుడును, ధార్మికుడైన విభీషణుడును పుట్టిరి. వారికి శూర్పణఖ సోదరి. రావణునకు మేఘనాదుడను కుమారుడు పుట్టెను. రావణుని కంటె అధికబలవంతుడైన అతడు ఇంద్రుని జయించి ఇంద్రజిత్తను పేరు పొందెను. దేవతాదుల క్షేమమునకై నీవు లక్ష్మణునిచే చంపించితిని.

నారద ఉవాచ:

ఇత్యుక్త్వా తే గతా విప్రా అగస్త్యాద్యా నమస్కృతాః | దేవప్రార్థిత రామోక్తః శత్రుఘ్నో లవణార్దనః 6

అభూత్పూర్మథురా కాచి ద్రామోక్తో భరతోవధీత్‌ | కోటిత్రయం చ శై లూషపుత్రాణాం నిశితైః శరైః 7

శైలూషం దుష్టగన్దర్వం సిన్ధుతీరం నివాసినమ్‌ | తక్షం చ పుష్కరం పుత్రం స్థాపయిత్వాథ దేశయోః. 8

భరతో7గాత్సశత్రుఘ్నో రాఘవం పూజయన్‌ స్థితః | రామో దుష్టాన్ని హత్యాజౌ శిష్టాన్‌ సంపాల్య మానవః.

ఆ అగస్త్యాదులగు బ్రాహ్మణులు ఈ విధముగ చెప్పి రామునిచే పూజితులై వెళ్లిపోయిరి. దేవతలచేత ప్రార్థింపబడిన రాముని అజ్ఞచే శత్రఘ్నుడు లవణుడను రాక్షసుని సంహరించెను. పూర్వము మథుర అను పట్టణ మొకటి ఉండెను. రామునిచే అజ్ఞాపింపబడిన భరతుడు తీక్‌ష్ణములైన బాణములచే మూడు కోట్ల శైలూషపుత్రులను సంహరించెను. సిందుతీరమునందు నివసించు దుష్టగంధర్వుడైన శైలూషుని కూడ చంపెను. పిమ్మట ఆ దేశములలో పుత్రులైన తక్షుని, పుష్కరిని పాలకులనుగా చేసి భరతుడు శత్రఘ్న సమేతుడై వచ్చి రాముని సేవించెను. ఈ విధముగ మానవరూపుడైన రాముడు దుష్టులను యుద్దమున సంహరించి శిష్టులను పాలించెను.

పుత్రౌ కుశలవై జాతౌ వాల్మీకే రాశ్రమే వరౌ | లోకాపవాదాత్త్యక్తాయాం జ్ఞాతౌ సుచరిత శ్రవాత్‌. 10

రాజ్యే7భిషిచ్య బ్రహ్మహమస్మీతి ద్యానతతత్పరః | దశ వర్షససాహ్రణి దశ వర్ష శతానిచ.

సజ్యం కృత్వా క్రతూన్‌ కృత్వా స్వర్గం దేవార్చితో య¸° |

సపౌరః సానుజః సీతాపుత్రో జనపదాన్వితః 12

లోకాపవాదముచే విడువబడిన సీతకు వాల్మీక్యాశ్రమములో జనించిన కుశలవులను, వారు చేసిన రామాయణ కథశ్రవణమును బట్టి తెలిసుకొని వాళ్ళను రాజ్యమునందు అభిషిక్తులను చేసెను. ఈ విధముగ రాముడు ఆ పరమాత్మనే నేను అను ధ్యానమునందు తత్పరుడై పదివేల సంవత్సరముల కాలము ధనస్సుచే లోకములను రక్షించుచు, అనేక యాగములు చేసి. దేవతలు కొనియాడ, పౌరులును, తమ్ములను వెంటరాగా స్వర్గమునకు వెళ్ళెను. సీతా పుత్రుడైన కుశుడు రాజ్యము పొందెను.

అగ్ని రువాచ :

వాల్మీకిర్నారదాచ్ఛ్రుత్వా రామాయణమకార యత్‌ | సవిస్తరం య ఏతచ్చ శృణుయాత్స దివం వ్రజేత్‌. 13

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ఉత్తరకాణ్డ వర్ణనం నామ

ఏకదశోధ్యాయః

అగ్ని పలికెను. వాల్మీకి నారదుని నుండి విని రామాయాణమును సవిస్తరముగ రచించెను. దీనిని వినువాడు స్వర్గమునకు వెళ్ళును.

అగ్ని మహాపురాణమునందు రామాయణమున ఉత్తరకాండవర్ణనమున ఏకాదశాధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

Thursday 4 June 2020

🌻. యుద్ధకాండ వర్ణనము - 1 🌻

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 21  / Agni Maha Purana -  3  🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
🌻. ప్రథమ సంపుటము, అధ్యాయము - 10
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. యుద్ధకాండ వర్ణనము - 1 🌻

అథ దశమోధ్యాయః
అథ యుద్ధకాణ్డ వర్ణనమ్‌.
నారద ఉవాచః

రామో క్తశ్బాఙ్గదో గత్వాం రావణం ప్రాహ జానకీ | దీయతాం రాఘవాయాశు అన్యథా త్వం మరిష్యసి. 1

నారదుడు చెప్పెను: రాముడు పంపగా అంగదుడు వెళ్ళి రావణునితో ఇట్లు చెప్పెను. "వెంటనే సీతను రామునకు ఒప్పగించుము. కానిచో మరణింపగలవు"

రావణో హన్తుమద్యుక్తః | సఙ్గ్రామోద్ధతరాక్షసః | రామాయహ దశగ్రీవో యుద్ధమేకం తు మన్యతే. 2

యుద్ధమునకై ఉద్దతులైన రాక్షసుల గల రావణుడు అతనిని చంపుటకు ప్రయత్నించెను. అతడు తిరిగివచ్చి. "దశగ్రీవుడు యద్ధమును మాత్రమే కోరుచున్నాడు" అని రామునితో చెప్పెను.

రామో యుద్ధాయ తచ్చ్రుత్వా లఙ్కాం స కపి రాయ¸°| వానరా హనుమాన్మైన్దోద్వివిదో జామ్బవాన్నలః. 3

నీలస్తారో7ఙ్గదో ధుమ్రః సుషేణః కేశరీ గజః| పనసో వినతో రమ్భః శరభః క్రథనో బలీ. 4

గవాక్షో దధివక్త్రశ్చ గవయో-గంధమాదనః | ఏతే చాన్యే చ సుగ్రీవ ఏతైర్యుక్తో హ్యసంఖ్యకైః 5

ఆ మాట విని రాముడు వానరసమేతుడై లంక చేరెను. హనుమంతుడు మైందుడు, ద్వివిదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, తారుడు, అంగద-ధూమ్ర-సుషేణులు, కేనరి, గజ - పనస - వినత - రంభ - శరభ క్రథనులు, బల శాలియైన గవాక్షుడు; దధివక్త్ర - గవయ - గంధమాదనులు, తదితర వానరులును వెళ్ళిరి. వీరితోడను, అసంఖ్యాకులగు ఇతరవానరులతోడను కూడిన సుగ్రీవుడు కూడ వెళ్ళెను.

రక్షసాం వానరాణాం చ యుద్ధం సఙ్కులమాలభౌ | రాక్షసా వానరాఞ్జఘ్నః శరశక్తిగదాదిభిః 6

వానరా రాక్షసాఞ్జఘ్నుః నఖద న్తశిలాదిభిః | హస్త్యశ్వరథపాదాతం రాక్షసానాం బలం హతమ్‌. 7

వానరరాక్షసుల మధ్య సంకుల యుద్ధము కొనసాగెను. రాక్షసులు బాణములు, శక్తులు, గదలు మొదలగు వాటితో వానరులను కొట్టిరి. వానరులు, గోళ్ళు దంతములు, శిలలు మొదలగు వాటితో వానరులను కొట్టిరి. రాక్షసుల ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు-ఈ రూపములో నన్ను సైన్యము చంపబడెను.

హనుమాన్గిరశృఙ్గేణ ధూమ్రాక్షమవధీద్రిపుమ్‌ | అకమ్పనం ప్రహస్తం చ యుధ్యన్తం నీల ఆవధీత్‌. 8

హనుమంతుడు శత్రువైన ధూమ్రాక్షున పర్వతశిఖరముతో చెంపెను. నీలుడు యుద్ధము చేయుచున్న అకంపన- ప్రహస్తులను చెంపెను.

ఇన్ద్రజిచ్ఛరబన్దాచ్చ విముక్తౌ రామలక్ష్మణౌ | తార్‌క్షసన్దర్శనాద్బాణ్ణర్జఘ్నతూ రక్షసాం బలమ్‌. 9

గరుత్మంతుని దర్శనముచే ఇంద్రజిత్తు ప్రయోగించిన శరబంధమునుండి విములైన రామలక్ష్మణులు బాణములతో రాక్షససైన్యమును సంహరించిరి.

రామః శ##రైర్జర్జరితం రావణం చాకరోద్రణ | రావణః కుమ్భకర్ణం చ బోధయమాస దుఃఖితః 10

రణరంగమున రాముడు బాణములచే రావణున జర్జరశరీరునిగా చేసెను. రావణుడు దుఃఖితుడై కుంభకర్ణుని మేల్కొలిపెను.

కుమ్భకర్ణః ప్రబుద్ధోథ పిత్వా ఘటసహస్రకమ్‌ | మద్యస్య మహిషాదీనాం భక్షయిత్వాహ రావణమ్‌. 11

నిద్రనుండి లేచిన కుంభకర్ణుడు వేయి కడవల మద్యము త్రాగి మహిషాదిమాంసము భుజించి రావణునితో ఇట్లు పలికెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 22 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 10
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. యుద్ధకాండ వర్ణనము - 2 🌻

కుంభకర్ణ ఉవాచ:

సీతాయా హరణం పాపం కృతం త్వం హి గరుర్యతః | అతో గచ్ఛామి యుద్ధాయ రామం హన్మి సవానరమ్‌.

కుంభకర్ణుడు పలికెను. నీవు సీతాహరణమను పాపకార్యము చేసితివి. అయినను నీవు నాకు అన్న కానయుద్ధమునకు వెళ్ళి వాన రసహితుడైన రాముని సంహరించెదను.

నారద ఉవాచః

ఇత్యుక్త్వా వానరాన్సర్వాన్‌ కుమ్భకరణో మమర్దహ | గృహీతస్తేన సుగ్రీవః కర్ణనాసం చక ర్త సః. 13

కర్ణనాసావిహీనో7సౌ భక్షయామాస వానరాన్‌ | రమో7థ కుమ్భకర్ణస్య బాహూ చిచ్ఛేద సాయకైః. 14

తతః పాదౌ తతశ్ఛిత్త్వా శిరో భూమౌ వ్యపాతయత్‌ |

కుంభకర్ణుడీ విధముగ పలకి వానరులందరిని మర్దించెను. అతడు సుగ్రీవుని పట్టుకొనగా, సుగ్రీవుడు వాని చెవులను, ముక్కును, కొరికివేసెను. చెవులు ముక్కులేని అతడు వానరులను భక్షించెను. పిమ్మట రాముడు బాణములతో కుంభకర్ణుని బాహువులను, పాదములను చేధించి అతని సిరస్సు నేలపై పడవేసెను.

అథ కుమ్భో నికుంభశ్చ మకరాక్షశ్చ రాక్షసః 15

మహోదరో మహాపార్శ్వో మత్త ఉన్మత్త రాక్షసః | ప్రఘసో భాసకర్ణశ్చ విరూపాక్షశ్చ సంయుగే. 16

దేవాన్తకో నరాన్తశ్చ త్రిశిరాశ్చాతికాయకః | రామేణ లక్ష్మణనైతే వానరైః సవిభీషణౖః. 17

యుధ్యమానాస్తథా హ్యన్యే రాక్షసా భువి పాతితాః |

పిమ్మట రామలక్ష్మణులును, వానరులును, విభీషణుడును కుంభ-నికుంభ-మకరాక్ష - మహోదర-మహాపార్శ్వ-మత్త-ఉన్మత్త-ప్రఘన-భాసకర్ణ-విరూపాక్ష-దేవాంతక-నరాంతక, త్రిశిరస్క-అతికాయులను రాక్షసులను, యుద్దము చేయుచున్న ఇతర రాక్షసులను సంహరించిరి.

ఇన్ద్రజిన్మాయయా యుద్ధ్యన్రామాదీన్స మ్బబన్ద హ. 18

వరదత్తైర్నా గబాణౖరోషధ్యా తౌ విశల్యకౌ | విశల్యయావ్రణౌ కృత్వా మారుత్యానీతపర్వతే. 19

హనూమాన్ధారయామాస తత్రాగం యత్ర సంస్థితః|

మాయతో యుద్ధము చేయుచు ఇంద్రజిత్తు రామాదులను వరలబ్ధములైన నాగబాణములైన నాగబాణములచే బంధించెను. హనుమంతుడు తాను తీసికొవచ్చిన పర్వతముపై ఉన్న విశల్యయను ఓషధిచేత రామలక్ష్మణులను శల్యరహితులను చేసి ఆ పర్వతమును దాని చోట ఉంచెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
 💎💥💎💥💎💥💎

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 23 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 10
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. యుద్ధకాండ వర్ణనము - 3 🌻

నికుమ్భిలాయాం హోమాది కుర్వన్తతం హి లక్ష్మణః #9; 20

శ##రైరిన్ద్రజితర వీరం యుద్ధే తం తు వ్యశాతయత్‌ | రావణః శోకసన్తప్తః సీతాం హన్తుం సముద్యతః. 21

అవిన్ద్యావారితో రాజా రథస్థః సబలో య¸°|

నికుంభిలలో హోమాదికముచేయుచున్న ఆ ఇంద్రజిత్తులను లక్ష్మణుడు బాణములతో సంహరించెను. రావణుడు శోకసంతప్తుడై సీతను చంపుటకు ఉద్యమింపగా అవింధ్య వారించెను. అతడు సేనాసమేతుడై రథము నెక్కి యుద్ధమునకై వెళ్శెను.

ఇన్ద్రోక్తో మాతలీ రామం రథస్థం ప్రచకార తమ్‌. 22

రామారావణయోర్యద్ధం రామరావణయోరివ | రావణో వానరాన్‌ హన్తి మారుత్యాద్యాశ్చ రావణమ్‌. 23

ఇంద్రుడు పంపగా మాతలి వచ్చి రాముని రథారూడుని చేసెను. రామరావణుల యుద్దమునకు రామరావణ యుద్ధమే సాటి. రావణుడు వానరులను కొట్టగా, హనూమదాది వానరులు రావణుని కొట్టిరి.

రామః శ##సై#్త్రస్తమసై#్త్రశ్చ వవర్ష జలదో యథా | తస్యధ్వజం స చిచ్ఛేద రథమశ్వాంశ్చ సారథిమ్‌. 24

దనుర్బాహూంశ్ఛిరాం స్యేవ ఉత్తిష్ఠన్తి శిరాంసి హి | పైతామహేన హృదయం భిత్వా రామేణ రావణః 25

భూతలే పాతితః సర్వై రాక్షసై రురుదుః స్త్రియః|

రాముడు మేఘము వలె ఆ రావణునిపై అస్త్రాస్త్రములను కురిపించెను. అతని ధ్వజమును భేదించి, రథమును భగ్నముచేసి గుఱ్ఱములను, సారథిని చంపి, అతని ధనస్సును, బాహ్మావులను, శిరస్సులను ఛేదించెను, కాని అతని శిరస్సుమరల మరల మొలుచు చుండెను. అపుడు రాముడు బ్రహ్మాస్త్రముచే అతని హృదయమును భేదించి నేలపై కూల్చెను. రాక్షసుల నందరిని కూడ పరిమార్చెను. స్త్రీలు విహత భర్తృకలై ఏడ్చరి.

ఆశ్వాస్యతంచసత్కృత్య రామాజ్ఞప్తో విభీషణః 26

హనూమతానయద్రామః సీతాం శుధ్ధాం గృహీతవాన్‌ | రామో వహ్నౌ ప్రవిష్టాం తాం శుద్ధామిన్ద్రాదిభిః స్తుతః

బ్రహ్మణా ధశరథేన త్వం విష్ణూ రాక్షస మర్దనః | ఇన్ద్రో7ర్చితో7మృతవృష్ట్యా జీవయామాస వానరాన్‌ . 28

రాముని ఆజ్ఞచే విభీషణుడు ఆ స్త్రీలను ఓదార్చెను. రాముని పూజించెను. రాముడు హనుమంతుని ద్వారా సీతను రప్పించి, అగ్ని ప్రవేశముచే శుద్ధరాలగు ఆమెను స్వీకరించెను. ఇంద్రాదిదేవతలును, బ్రహ్మయు, దశరథుడును "నీవు రాక్షససంహారివైన విష్ణువే" అని అతనిని స్తుతించిరి. రాముడు కోరగా ఇంద్రుడు అమృతము కురిపించి వానరులను పునరుజ్జీవితులను చేసెను.

రామేణ పూజితా జగ్ముర్యుద్దం దృష్ట్వా%ివం చ తే | రామే విభీషణాయాదాల్లఙ్కా మభ్యర్చ్య వానరాన్‌. 29

ఆ దేవతలు యుద్ధము చూచి రామునిచే పూజితులై స్వర్గమునకు వెళ్ళిరి. రాముడు వానరులను గౌరవించి, లంకా రాజ్యమును విభీషణున కిచ్చెను.

ససీతః పుష్పకే స్థిత్వా77గతమార్గేణ వై గతః | దర్శయన్వనదుర్గాణి సీతాయై హృష్ణమానసః 30

సీతాసమేతుడై పుష్పకమునెక్కి, సంతసించిన మనస్సు కలవాడై, సీతకు వనములను, దుర్గమ భూములను చూపుచు, వచ్చిన మార్గముననే అయోధ్య వైపు తిరిగి వెళ్ళెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 24 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 10
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. రామాయణ యుద్ధకాండ వర్ణనము - 4 🌻

భరద్వాజం నమస్కృత్య నన్దిగ్రామం సమాగతః | భరతేన నతశ్చాగాదయోధ్యాం తత్ర సంస్థితః. 31

భరద్వాజునకు నమస్కరించి అచట నుండి నందిగ్రామమునకు వెళ్ళి, భరతునిచే నమస్కరింపబడివాడై అయోధ్యకు వెళ్ళెను.

వసిష్ఠాదీన్నమస్కృత్య కౌసల్యాం చైవ కైకయీమ్‌ | సుమిత్రాం ప్రాప్తరాజ్యోథ ద్విజాతీన్సో7భ్యపూజయత్‌.

వసిష్ఠాదులకు నమస్కరించి,కౌసల్యా-కై కేయి-సుమిత్రలకు కూడ నమస్కరించి, రాజ్యమును పొంది బ్రహ్మణులను పూజించెను.

వాసుదేవం స్వమాత్మానమశ్వమేధైరతయజత్‌ | సర్వదానాని స దదౌ పాలయామాస స ప్రజాః 33

పుత్రవద్దర్మకామాదీన్‌ దుష్టనిగ్రహేణ రతః |

పిమ్మట అశ్వమేధయాగములచే వాసుదేవుడైన తనను తానే ఆరాధించెను. సర్వదానములను ఇచ్చెను. ప్రజలను పుత్రులను వలె పాలించెను. దుష్టులను నిగ్రహించుటయందు అసక్తుడై ధర్మకామాదులను పాలించెను.

సర్వధర్మపరో లోకః సర్వసస్యా చ మేదినీ | నాకాలమరణశ్చాసీద్రామే రాజ్యం ప్రశాసతి.

ఇత్యాది మహాపురాణ అగ్నేయే రామాయణ యుద్ధకాణ్డ వర్ణనం నామ దశమోధ్యాయః.

రాముడు రాజ్యమును పాలించిన కాలమున ప్రజలందరును తమ ధర్మములను పాలించుటయందు అసక్తులైరి. అకాలమరణము చెందనవాడెవ్వడును లేకుండెను.

అగ్ని మహాపురాణమున రామాయణమునందలి యుద్దకాండవర్ణనమను దశమాధ్యాయము సమాప్తము.

సశేషం... 

🌹 🌹 🌹 🌹