Thursday 23 July 2020



🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 50 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 24
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. కుండ నిర్మాణాగ్ని కార్యవిధి - 1 🌻

అథ చతుర్వింశోధ్యాయః 24
అథ కుణ్డనిర్మాణాగ్ని కార్యాదివిధిః

నారద ఉవాచ :
అగ్నికార్యం ప్రవక్ష్యామి యేన స్యాత్సర్వకామభాక్‌ | 
చతురభ్యధికం వింశమజ్గులం చతురస్రకమ్‌ 1

సూత్రేణ నూత్రయిత్వా తు క్షేత్రం తావత్ఖనీత్సమమ్‌ | 
ఖాతస్య మేఖలాః కౌర్యాస్తక్త్యా చైవాజ్గులద్వాయం 2

సత్ఞ్వాదిసంజ్తాః పూర్వాస్యాద్ధ్వాదశాజ్గులముచ్ఛ్రితాః | 
అష్టాజ్గులా ద్వ్యజ్గులాథ చతురజ్గులవిస్తృతా. 3

యోనిర్దశాజ్గులా రమ్యా షట్‌చతుర్ద్వ్యజ్గులాగ్రగా | 
క్రమాన్నిమ్నా తు కర్తవ్యా పశ్చిమాశావ్యవస్థితా. 4

అశ్వత్థపత్రసదృశీ కిఞ్చిత్కుణ్డ నివేశితా | 
తుర్యాజ్గులాయతం నాలం పఞ్చదశాజ్గులాయతమ్‌. 5

మూలన్తు త్య్రజ్గులం యోన్యా అగ్రం తస్యాః షడజ్గులమ్‌ | 
లక్షణం చై కహస్తస్య ద్విగుణం ద్వికరాదిషు. 6

నారదుడు పలికెను:

అన్ని కోరికలను తీర్చు అగ్నికార్యమును చెప్పెదను. ఇరవైనాలుగు అంగుళముల చతురస్ర క్షేత్రమును సూత్రముతో కొలచి సమముగా అంతటను సమముగా త్రవ్వవలెను. ఆ విధముగా త్రవ్వినదానికి రెండంగుళములు విడచి మేఖలలు (ఒడ్డాణము వంటి కట్లు) చేయవలెను. 

సత్త్వము మొదలగు పేర్లుగల ఆ మేఖలలు పూర్వాభిముఖములు గాను, పండ్రెండు అంగుళములు ఎత్తు కలవిగా ఉండవలెను. ఒకటి ఎనిమిది అంగుళముల విస్తారము కలది, రెండవది రెండు అంగుళములు విస్తారము కలది, మూడవది నాలగు అంగుళముల విస్తారము కలది అయి ఉండవలెను. 

పది అంగుళముల రమ్యమైన యోని ముందు వైపు వరుసగా ఆరు-నాలుగు-రెండు అంగుళములు ఎత్తు ఉండవలెను. పడమట నున్న దానిని క్రమముగా లోతుగా నుండు నట్లు చేయవలెను. రావి ఆకు ఆకారములో నున్న దానిని కొద్దిగా కుండములోనికి చేర్చి నిర్మింపవలెను. 

దాని నాళము నాలుగు, ఐదు, పది అంగుళాల పొడవు ఉండవలెను. ఆ యోనియొక్క మూలము మూడు అంగుళములు, దాని అగ్రము ఆరు అంగుళములు ఉండవలెను. ఏకహస్తకుండలక్షణము ద్విహస్తకుండాదుల విషయమున రెట్టింపు అగుచుండును.

ఏకత్రిమేఖలం కుణ్డం వర్తులాది వదామ్యహమ్‌ | 
కుణ్డార్ధే తు స్థిరం సూత్రం కోణ యదతిరిచ్యతే. 7

తదర్దం దిశి సంస్థాప్య భ్రామితం వర్తులం భవేత్‌ |

ఒక మేఖల, మూడు మేఖలలు గల వర్తులాదికుండములను గూర్చి చెప్పెదను. కుండము యొక్క అర్థమునందు సూత్రము నుంచగా కోణమునందు మిగిలిన ఆ సూత్రములోని అర్ధమును దిక్కునందుంచి త్రిప్పినచో అది వర్తుల మగును. 7

కుణ్డార్ధం కోణభాగార్దం దిశా చోత్తరతో బహిః 
పద్మాకారే దలాని స్యుర్మేఖలాయాంతు వర్తులే. 8

పూర్వపశ్చిమతో యత్నల్లాఞ్ఛయిత్వా తు మధ్యతః | 
సంస్థాప్య భ్రామితం కుణ్డమర్థచన్ద్రం భవేచ్ఛుభమ్‌. 9

కుండార్ధమును మించిన కోణభాగార్ధమును బయట ఉత్తరభాగమున పెంచి పూర్వపశ్చిమములు వైపు బైటకు చాపి మద్యమునందు ఉంచి సూత్రము త్రిప్పినచో అర్ధచంద్రాకార మైన శుభకరమైన కుండము ఏర్పడును. పద్మాకారమైన వర్తులకుండమునందు మేఖలయందు దలము లుండును.

బాహుదణ్డప్రమాణన్తు హోమార్థం కారయే త్సృచమ్‌. 10

సప్తపఞ్చాజ్గులం వాపి చతురస్రం తు కారయేత్‌ | 
త్రిభాగేన భవేద్గర్తం మధ్యే వృత్తం సుశోభనమ్‌. 11

తిర్యగూర్ధ్వం సమం ఖాత్వా బహిరర్ధం తు శోధయేత్‌ | 
అఙ్గులస్య చతుర్థాంశం శేషార్ధార్ధం తథాన్తతః 12

ఖాతస్య మేఖలాం రమ్యాం శేషార్దేన తు కారయేత్‌ | 
కణ్ఠం త్రిభాగవిస్తార మఙ్గుష్ఠక సమాయతమ్‌. 13

సార్దమఙ్గుష్ఠకం వా స్యాత్తదగ్రే తు ముఖం భవేత్‌ | 
చతురజ్గుల విస్తారం పఞ్చాఙ్గుషలమథాపి వా. 14

త్రికం ద్వ్యఙ్గులకం తత్స్యాన్మధ్యం తస్య సుశోభనమ్‌ | 
ఆయామస్తత్సమ స్తస్య మధ్య నిమ్నః సుశోభనః.

సుషిరం కణ్ఠదేశే స్యాద్విశేద్యావత్కనీయసీ | 
శేషం కుణ్డం తు కర్తవ్యం యథారుచి విచిత్రితమ్‌ . 16

హోమము చేయుటకై చేయు ప్రమాణము లేదు పండ్రెండు అంగుళముల ప్రమాణము గల సృక్కును చేయించవలెను. దాని మూలభాగము చతురస్రముగా ఏడు లేదా ఐదు అంగుళములు ఉండవలెను. 

దాని మధ్యయందు త్రిభాగమున అందమైన, వర్తులాకార మైనగర్తము (గొయ్యి) ఉండవలెను. అడ్డముగా, పై భాగమున సమముగా ఆ గర్తము నిర్మించి పైన అర్ధాంగుళ భాగమును శోధించవలెను. (చెక్కి నున్నగా చేయవలెను).

 నాల్గవ వంతు అంగుళమును మిగిలిన అర్ధములో అర్థమును కూడ శోధించవలెను. మిగిలిని అర్ధముచే గుర్తమునకు రమ్యమైన మేఖలను ఏర్పరుపవలెను. 

త్రిభాగవిస్తారము కలదియు, అంగుష్ఠ మంత ఆయతు మైనదియు అగు కంఠమును చేయవలెను. దాని అగ్రమునందు నాలుగు లేదా ఐదు అంగుళముల ప్రమాణము గల ముఖ ముండవలెను. దాని మధ్యము ఆరు అంగుళముల ప్రమాణ ముండవలెను. 

దాని ఆయామము కూడా అంతయే ఉండి మధ్యమున పల్లమై అందముగా ఉండవలెను. దాని కంఠదేశమునందు చిటికెనవ్రేలు ప్రవేశించు నంత రంధ్ర ముండవలెను. మిగిలిన కుండము ( స్రుక్కు/ముఖము) అభిరుచి ననుసరించి విచిత్రముగ చేయవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 51 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 24
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. కుండ నిర్మాణాగ్ని కార్యవిధి - 2 🌻

స్రువం తు హస్తమాత్రం స్యాద్ధణ్డకేన సమన్వితమ్‌ | వటుకం ద్వ్యజ్గులం వృత్తం కర్తవ్యం తు సుశోభనమ్‌. గోపదం తు యథా మగ్నమల్పపఙ్కే తథా భవేత్‌ |

స్రువము దండముతో సహా చేయి పొడ వుండవలెను. కొంచెము పంకమునందు ఆవు పాదము దిగిన లోతు ఎంట్లుండులో ఆ విధముగా అందమైన, రెండు అంగుళముల వృత్తము చేయవలెను.

ఉపలిప్య లిఖేద్రేఖామజ్గులాం వజ్రనాసికామ్‌. 18

సౌమ్యాగ్రాం ప్రథమాం తస్యాం రేఖే పూర్వముఖే తయోః | మధ్యే తిస్ర స్తథా కూర్యాద్దక్షిణాది క్రమేణ తు.

అగ్నికుండమును అలికి, అంగుళముప్రమాణము గల వజ్రనాసికాలేఖను గీయవలెను. అది ఉత్తరాగ్ర మగు మొదటి రేఖ. దానిపై పూర్వాభిముఖములైన రెండు రేఖలు గీయవలెను. వాటి మధ్య దక్షిణాదిక్రమమున మూడు రేఖలు గీయవలెను.

అలంకృత్వా మూర్తిమతీం క్షిపేదగ్నిం హరిం స్మరన్‌.

ఏవముల్లిఖ్య చాభ్యుక్ష్య ప్రణవేన తు మన్త్రవిత్‌ | విష్టరం కల్పయేత్తేన తస్మిన్‌ శక్తిం తు వైష్ణవీమ్‌ 20

మంత్రవేత్త ఈ విధముగా రేఖలు గీసి, ప్రణవ ముచ్చరించును నీళ్ళు చల్లి, ఓంకారము నుచ్చరించుచు పీఠమును కల్పించి దానిపై మూర్తిమతి యాగు వైష్ణవీశక్తిని అలంకరించి, విష్ణువును స్మరించుచు అగ్నిని ఉంచవలెను.

ప్రాదేశమాత్రాః సమిధో దత్త్వా పరిసముహ్య తమ్‌. 21

దర్భైస్త్రిధా పరిస్తీర్య పూర్వాదౌ తత్ర పాత్రకమ్‌ |
అసాదయేదిధ్మవహ్ని భూమౌ చ స్రుక్‌స్రుమద్వయమ్‌. 22

జానెడు పొడవు గల సమిధల నుంచి ఆ అగ్నిని ప్రజ్వలింపచేసి పూర్వాదిదిక్కులందు దర్భలు మూడు విధములుగా (చుట్టూ) పరచి, వాటిపై పాత్రను, ఇధ్మమును వహ్నిని సమీపమున నుండు నట్లు చేసి స్రుక్కున, స్రువమును భూమిపై ఉంచవలెను.

అజ్యాస్థాలీం చరుస్థాలీం కుశాజ్యం చ ప్రణీతయా |

ప్రోక్షయిత్వా ప్రోక్షణీం చ గృహీత్వా పూర్వ వారిణా. 23

పవిత్రాన్తర్హితే హస్తే పరిస్రావ్య చ తజ్జలమ్‌ | ప్రాజ్నీత్వా ప్రోక్షణీపాత్రం జ్యోతిరగ్రే నిధాయ చ. 24

éతదద్భిస్త్రిశ్చ సంప్రోక్ష్య ఇధ్మం విన్యస్య చాగ్రతః |

ప్రణీతాయం సపుష్పాయాం విష్ణుం ధ్యాత్వోత్తరేణ చ. 25

ఆజ్యస్థాలీమథాజ్యేన సంపూర్యాగ్రే నిధాయ చ |

సంప్లవోత్పవనాభ్యాం తు కుర్యాదాజ్యస్య సంస్కృతిమ్‌. 26

అఖణ్డితాగ్రౌ నిర్గర్భౌ కుశౌ ప్రాదేశమాత్రకౌ | తాభ్యాముత్తానపాణిభ్యామఙ్గుష్ఠానామికే నతే. 27

ఆజ్యాస్థాలిని, చరుస్థాలిని, కుశాజ్యమును ప్రణీతచే ప్రోక్షించి, ప్రోక్షిణిని గ్రహించి దానిని నీటితో నింపి, ఆ నీటిని పవిత్రముచే కప్పబడిన హస్తమునందు జారవిడిచి, ప్రోక్షణీపాత్రమును తూర్పుగా తీసికొని వెళ్ళి, దానిని అగ్నికీ ఎదురుకుగా ఉంచి, దానిని ఉదకముచే మూడు సార్లు ప్రోక్షించి, ఎదుట నుంచి, ఉత్తరమున పుష్పలముతో కూడిన ప్రణీతపై విష్ణువును ధ్యానించి, ఆజ్యసాత్రను ఆజ్యముతో నింపి ఎదుట ఉంచి, తెగని చిగుళ్ళు గల, గర్భము లేని జానెడు పొడవైన రెండు కుశములను వెల్లగితల చేయబడిన హస్తములచే బొటనవ్రేలితోను అనామికతోను పట్టుకొని, వాటిని నేతలో ఇటు నటు త్రిప్పినేతిని సంస్కరించవలెను.

ఆజ్యం తయోస్తు సంగృహ్య ద్విర్నీత్యా త్రిరవాజ్‌క్ష పేత్‌ |
స్రక్స్రువౌ చాపి సంగృహ్య తాభ్యాం ప్రక్షిప్య వారిణా. 28

ప్రతప్య దర్భైః సంమృజ్య పునః ప్రక్షాల్య చైవ హి | నిష్టప్య స్థాపయిత్వాతు ప్రణవేనైవ సాధకః 29

ప్రణవాదినమోన్తేన పశ్చాద్దోమం సమాచరేత్‌ |

వాటి ఆజ్యమును సంగ్రహించి, రెండు పర్యాయములు తీసి, మూడు పర్యాయములు క్రిందికి చిమ్మవలెను. 

వాటితో స్రుక్స్రువములను గ్రహించి, నీటిచే తడిపి, వెచ్చచేసి, దర్భలచేత తుడిచి, మరల కడిగి, వెచ్చచేసి, ఓంకారము నుచ్చరించుచు క్రింద ఉంచి, సాధకుడు, పిమ్మట ఓంకారము మొదట ఉచ్చరించుచు, చివర 'నమః' అని లనుచు పిమ్మట హౌమము చేయవలెను.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 53 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 24
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. కుండ నిర్మాణాగ్ని కార్యవిధి - 4 🌻

తత్ర శక్తిం న్యసేత్పశ్చాత్పార్థివీం బీజసంజ్ఞికామ్‌ | తన్మాత్రాభిః సమస్తాభిఃసంవృత్తం పార్థివం శుభమ్‌. 46

అఖణ్డం తద్భవం ధ్యాయేత్తదాధారం తదాత్మకమ్‌ |
తన్మధ్యే చిన్త యేన్మూర్తిం పౌరుషీం ప్రణావాత్మికామ్‌. 47

పిమ్మట దానియందు పృథివాకార మైనదియు, బీజ మను పేరు గలదియు అగు శక్తిని ఉంచవలెను. 

సమస్తమైన తన్మాత్రలచే ఏర్పడినది, పృథివీవికారము, శుభమైనదియు, అఖండము, దాని (శక్తి) నుండి పుట్టినది. తత్స్వరూపమును అగు దాని ఆధారమునుధ్యానించవలెను. దాని మధ్యయందు ప్రణవరూపమైన పురుషమూర్తిని ధ్యానించవలెను.

లిఙ్గం సంక్రామయేత్పశ్చాదాత్మస్థం పూర్వంసంస్కృతమ్‌ |
విభక్తేన్ద్రియ సంస్థానం క్రమాద్వృద్ధం విచిన్తయేత్‌. 48

పిమ్మట, పూర్వము సంస్కరింపబడిన, తనలో నున్న లింగశరీరమును దానిమీదికి సంక్రమింపచేయవలెను. అది క్రమముగా విభక్తమైన ఇందియములు, ఆవయవస్థితి కలదై వృద్ధిపొంది నట్లు చింతించవలెను.

తతో7ణ్డమబ్దమేకం తు స్థిత్వా విశకలీకృతమ్‌ | ద్యావాపృథవ్యౌ శకలే తయోర్మధ్యే ప్రజాపతిమ్‌. 49

జాతం ధ్యాత్వా పునః ప్రేక్ష్యప్రణవేన తు తం శిశుమ్‌ |
మన్త్రాత్మకతనుం కృత్వా యతాన్యాసం పురోదితమ్‌. 50

విష్ణుహస్తం తతో మూర్ధ్ని దత్త్వా ధ్యాత్వా తు వైష్ణవమ్‌ | ఏవమేకం బహూన్వాపి జపిత్వా ధ్యానమోగతః.

కరౌ సంగృహ్య మూలేన నేత్రే బద్ధ్వా తు వాససా | నేత్ర మన్త్రేణ మన్త్రీతాన్‌ సదశేనాహతేను తు. 52

కృతపూజో గురుః సమ్యగ్ధేవదేవస్య తత్త్వవాన్‌ | శిష్యాన్‌ పుష్పఞ్జవిభృతః ప్రాఙ్ముఖానుపవేశయేత్‌. 53

పిమ్మట అండము ఒక సంవత్సరముపాటు ఉండి బ్రద్ధలైనట్లును అ ముక్కలు ద్యులోక పృథివీలోకములైనట్లును, వాటి మధ్య ప్రజాపతి జనించి నట్లును ధ్యానించవలెను. 

మరల చూచి, ఆ శిశువును ప్రణవముచే, పూర్వము చెప్పనట్లుగా న్యాసములు చేసి మంత్రాత్మక మగు శరీరము కలవానినిగా చేయవలెను. పిమ్మట శిరస్సుపై విష్ణుహస్తము నుంచి, వైష్ణవమంత్రమును ధ్యానించవలెను. 

ఈ విధముగా ధ్యానయోగముతో ఒకటి గాని, అనేకము గాని జపించి, హస్తములను మొదళ్ళయందు పట్టుకొని, మాంత్రికుడు నేత్రమంత్రము చదువుచు అంచుతో (జాలుతో) కూడిన చినగని వస్త్రముచే ఆ శిష్యుల నేత్రములు బంధించవలెను. 

తత్త్వము నెరిగి గురువు బాగుగా దేవదేవుని పూజించి, దోసిళ్లలో పుష్పములు ధరించి యున్న ఆ శిష్యులను పూర్వాభిముఖులనుగా కూర్చుండబెట్టవలెను.

అర్చియేయుశ్చ తే7ప్యేవం ప్రసూతా గురుణా హరిమ్‌ | క్షిప్త్వా పుష్పాఞ్జలిం తత్ర పుష్పాదిభిరన న్తరమ్‌. 54

వాసుదేవార్చనం కృత్వా గురోః పాదార్చనం తతః | విధాయం దక్షిణాం దద్యాత్సర్వస్వం చార్ధమేవ వా. 55

ఆ శిష్యులు కూడ గుర్వనుజ్ఞ పొంది, అచట పుష్పాంజలిని చల్లి హరిని పూజింపవలెను. పిమ్మట పుష్పాదులతో వాసుదేవార్చనము చేసి. తరువాత గురుపాదార్చనము చేసి సర్వస్వమును గాని, దానిలో సగము గాని గురుదక్షిణగా ఇవ్వవలెను.

గురుః సంశిక్షయేచ్ఛిష్యాంసై#్తః పూజ్యో నామభిర్హరిః | విష్వక్సేనం యజేదిశం శఙ్కచక్రగదాధరమ్‌. 56

తర్జయన్తం చ తర్జన్యా మణ్డలస్థం విసర్జయేత్‌. 57

విష్ణునిర్మాల్యమఖిలం విష్వక్సేనాయ చార్పయేత్‌.

గురువు శిష్యులకు బోధించవలెను. వారు నామములతో హరిని పూజించవలెను. 

శంఖచక్రగదాధిరియై, తర్జనితో జళిపించుచున్న ప్రభు విష్వక్సేనుని పూజించి మండలమునందున్న హరికి ఉద్వాసన చెప్పవలెను. విష్ణునిర్మాల్యము నంతను విష్వక్సేనునకు సమర్పింపవలెను.

ప్రణీతాభి స్తథాత్మానమభిషిచ్య చ కుణ్డగమ్‌. 58

మహ్నిమాత్మని సంయోజ్మ విష్వక్సేనం విసర్జయేత్‌ | బుభుక్షుః సర్వమాప్నోతి ముముక్షుర్లీయతే హరౌ. 59

ఇత్యాతి మహాపురాణ ఆగ్నేయే కుణ్డనిర్మాణాద్యగ్ని కార్యాదికథనం నామ చతుర్వింశోధ్యాయః.

ప్రణీతలలో తనపైజలము చల్లుకొని, కుండములో నున్న అగ్నిని తనలో చేర్చికొని విష్వక్సేనుని విసర్జన చేయవలెను. 

ఈ విధముగ చేసినచో భోగములు అనుభవింప కోరిక గలవాడు సకలభోగములను పొందును. మోక్షేచ్ఛగల వాడు హరియందు లీను డగును.

అగ్ని మహాపురాణములో కుండనిర్మాణాగ్నికార్యాది కథన రూప మగు

ఇరువదినాల్గవ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

Sunday 19 July 2020

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 47 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 23
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ఆదిమూర్త్యాది పూజావిధి  - 1 🌻
సర్వకార్య జయమునకు

నారదుడు పలికెను.

విప్రులారా! ఏ పూజావిధిచే సర్వకార్యకామములును లభించునో దానిని చెప్పెదను. పాదప్రక్షాళనము చేసికొని, ఆచమనము చేసి, మౌన మవలంబించి, రక్ష చేసికొని, తూర్పుగా తిరిగి, స్వస్తికాసనమునందు కాని, పద్మాననము నందు గాని, మరొక ఆసనమునందు కాని కూర్చుండి, నాభి మధ్యలో నున్నదియు, ధూమ్రవర్ణము కలదియు, తీవ్ర వాయురూప మైనదియు అగు "యం" బీజమును ధ్యానించుచు శరీరమునుండి సకలకల్మషములను శోషింపచేయవలెను 

హృదయపద్మ మధ్యమునందున్న తేజోనిధి యగు "క్షౌం" అను బీజమును స్మరించుచు, క్రిందికిని, పైకిని, అడ్డముగను ప్రసరించే జ్వాలలచే కల్మషమును దహించవలెను. 

ఆకాశమునందు చంద్రుని ఆకారము వంటి ఆకారమును ధ్యానము చేయవలెను. 

దాని నుండి స్రవించుచున్నదియు, సుఘమ్నా నాడిద్వారా సమస్త నాడులందును వ్యాపించుచున్నదియు, హృదయ పద్మమును వ్యాపించుచున్నవియు ఆగు అమృతధారలచేత తన దేహమును ని పవలెను 4, 5

శోధనము చేసి తత్త్వనానము చేయవలెను. పిమ్మట కరశుద్ధి కొరకు అస్త్రవ్యాపకముద్రలను, చేయవలెను. కుడిచేతి ఆంగుష్ఠమునుండి కరతలము వరకు న్యాసము చేయవలెను. 

దేహమునందు పన్నెండు అక్షరముల మూల మంత్రముతో హృదయము, శిరస్సు, శిఖ వర్మ, అస్త్రము, నేత్రములు, ఉదరము, శరీరము వెనుక భాగము, బాహువులు, ఊరువులు, మోకాళ్లు, పాదములు అను ద్వాదశాంగములపై న్యాసము చేయవలెను ముద్రనిచ్చి విష్ణువును స్మరించి, ఆష్టోత్తరశతజపము చేసి పూజింపవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌻. ఆదిమూర్త్యాది పూజావిధి  - 2 🌻
సర్వకార్య జయమునకు

జలకుంభమును ఎడమ వైపునను, పూజాద్రవ్యములను కుడి వైపునను ఉంచవలెను. అస్త్రముచే ప్రక్షాళనచేసి గంధపుష్పాన్వితము నైన అర్ఘ్యములను ఉంచవలెను. 

సర్వవ్యాప్తము, జ్యోతిఃస్వరూపము అయిన చైతన్యములను "అస్త్రాయఫట్‌" అని అభిమంత్రించిన, ఉదరముచే యోగబీజము నడిపి. హరిని ధ్యానించి, పూర్వాదియోగ పీఠము నందు ధర్మమును. వైరాగ్యమున, ఐశ్వర్యమును, ఆగ్నేయదిక్కు మొదలైన వాటిని, ఆధర్మము మొదలగు అంగములకు, పీఠమునందు కూర్మమును, అనంతుని, యముని, సూర్యాదుల మండలములను, విమల మొదలగు కేసరస్థానము నందున్న గ్రహణములను, కర్ణిక (ఈ పద్మము మధ్యనున్న దుద్దు యందున్న గ్రహణములనుముందు తన హృదయము నందు ధ్యానము చేసి పిమ్మట మండలము పై ఆవాహనము చేసి అర్చించవలెను. 

వైష్ణవ విద్యానుసారముగా అర్ఘ్య-పాద్య- ఆచమన - మధుపర్క - స్నాన, వస్త్ర - యజ్ఞోపవీత - అలంకార - గంధ - పుష్ప - ధూప - దీప- నైవేద్యములను సమర్పింపవలెను. 

పూర్వాది దిక్కులందు అంగదేవతలను పూజించవలెను. తూర్పు-పడమర దిక్కులందు గరుత్మ తుని, కుడివైపున చక్రమును, గదను, ఎడమవైపున శంఖమును, ధనస్సును ఉంచవలెను దేవుని ఎడమవైపున అంబుల పొదులను, కుడివైపున ఖడ్గమును. ఎడమ వైపున డాలును ఉంచవలెను. కుడి వైపున అగ్రభాగమున పుష్టిని ఉంచవలెను. 9-16

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 47 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 23
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ఆదిమూర్త్యాది పూజావిధి  - 1 🌻
సర్వకార్య జయమునకు

అథ త్రయోవింశో೭ధ్యాయః
అథాదిమూర్త్యాదిపూజావిధికథనమ్‌

నారద ఉవాచ:

వక్ష్యే పూజావిధిం విప్రా యం కృత్వా సర్వమాప్నుయాత్‌ |  
ప్రక్షాలితాం ఘ్రిరాచమ్య వాగ్యతః కృతరక్షణః 1

ప్రాజ్ముఖః స్వస్తికం బద్ద్వా పద్మాద్యపరమేవ వా | 2

యం భీజం నాభిమధ్యస్థం ధూమ్రం చణ్డానిలాత్మకమ్‌.
విశోషయేదశేషం తు ధ్యాయన్కాయత్తు కల్మషమ్‌ |

నారదుడు పలికెను.

విప్రులారా! ఏ పూజావిధిచే సర్వకార్యకామములును లభించునో దానిని చెప్పెదను. పాదప్రక్షాళనము చేసికొని, ఆచమనము చేసి, మౌన మవలంబించి, రక్ష చేసికొని, తూర్పుగా తిరిగి, స్వస్తికాసనమునందు కాని, పద్మాననము నందు గాని, మరొక ఆసనమునందు కాని కూర్చుండి, నాభి మధ్యలో నున్నదియు, ధూమ్రవర్ణము కలదియు, తీవ్ర వాయురూప మైనదియు అగు "యం" బీజమును ధ్యానించుచు శరీరమునుండి సకలకల్మషములను శోషింపచేయవలెను 

క్షౌం హృత్పంజ్వజమధ్యస్థం బీజం తేజోనిధిం స్మరన్‌ 3

అథోర్ధ్వతిర్యగ్గాభీస్తు జ్వాలాభిః కల్మషం దహేత్‌ |

హృదయపద్మ మధ్యమునందున్న తేజోనిధి యగు "క్షౌం" అను బీజమును స్మరించుచు, క్రిందికిని, పైకిని, అడ్డముగను ప్రసరించే జ్వాలలచే కల్మషమును దహించవలెను. 

శశజ్కాకృతివద్ధ్యాయేదమ్భరస్థం సుధామ్భుభిః 4

హృత్పద్మవ్యాపిభిర్దేహం స్వకమాప్లాపయేత్సుధీః | 
సుఘమ్నాయోనిమర్గేణ సర్వనాడీవిసర్పిభి. 5

ఆకాశమునందు చంద్రుని ఆకారము వంటి ఆకారమును ధ్యానము చేయవలెను. 

దాని నుండి స్రవించుచున్నదియు, సుఘమ్నా నాడిద్వారా సమస్త నాడులందును వ్యాపించుచున్నదియు, హృదయ పద్మమును వ్యాపించుచున్నవియు ఆగు అమృతధారలచేత తన దేహమును ని పవలెను 4, 5

శోధయిత్వా న్య సేత్తత్త్వం కరశుద్ధిరథాస్త్రకమ్‌ | 
వ్యాపకం హస్తయోరాదో దక్షిణాఙ్గుష్ఠతోఙ్గకమ్‌ 6

మూలం దేహే ద్వాదశాఙ్గం న్యసేన్మన్త్రైర్ధ్విషట్కకైః | 
హృదయం చ శిరశ్చైవ శిఖావర్మాస్త్రలోచనే 7

ఉదరం చ తథా పృష్ఠం బాహూరూ జానుపాదకమ్‌ |
ముద్రాం దత్త్వా స్మర్వేద్వివ్ణుం జప్త్వాష్టశతమర్చయేత్‌. 8

శోధనము చేసి తత్త్వనానము చేయవలెను. పిమ్మట కరశుద్ధి కొరకు అస్త్రవ్యాపకముద్రలను, చేయవలెను. కుడిచేతి ఆంగుష్ఠమునుండి కరతలము వరకు న్యాసము చేయవలెను. 

దేహమునందు పన్నెండు అక్షరముల మూల మంత్రముతో హృదయము, శిరస్సు, శిఖ వర్మ, అస్త్రము, నేత్రములు, ఉదరము, శరీరము వెనుక భాగము, బాహువులు, ఊరువులు, మోకాళ్లు, పాదములు అను ద్వాదశాంగములపై న్యాసము చేయవలెను ముద్రనిచ్చి విష్ణువును స్మరించి, ఆష్టోత్తరశతజపము చేసి పూజింపవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 48 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 23
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ఆదిమూర్త్యాది పూజావిధి  - 2 🌻
సర్వకార్య జయమునకు

వా మేతు వర్థనీం న్యస్య పూజాద్రవ్యం తు దక్షిణ | ప్రక్షాళ్యాస్త్రేణ చార్ఘే7థ గన్దపుష్పాన్వితే న్యసేత్‌ 9

చైతన్యం సర్వగం జ్యోతిరస్త్రజప్తేన వారిణా | షడన్తేనతు సంసిచ్య హస్తే ధ్యాత్వా హరిం పరే 10

ధర్మం జ్ఞానం చ వైరాగ్యమైశ్వర్యం వహ్నిగిఙ్ముఖాన్‌ | అధర్మాదీని గాత్రాణి పుర్వాదౌ యోగపీఠకే 11

కూర్మం పీఠే హ్యనన్తం చ యమం స్యూర్యాదిమణ్డలమ్‌ | విమలాద్యాః కేసరస్థానగ్రహాః కర్ణికాస్థితాః 12

పూర్వం స్వహృదయే ధ్యాత్వా ఆవాహ్యార్బేచ్చ మణ్డలే |

అర్ఘ్యం పాద్యం తథాచామం మధుపర్కం పునశ్చ తత్‌.

స్నానం వస్త్రోపవీతం చ భూషణం గన్దపుష్పకమ్‌ | ధూపదీపనైవేద్యాని పుణ్డరీకాక్షవిద్యయా. 14

యజేదఙ్గాని పూర్వాదౌ ద్వారి పూర్వే పరేణ్డజమ్‌ |

దక్షేచక్రం గదాం సౌమ్యకోణ శఙ్ఖం ధనుర్వ్యసేత్‌. 15

దేవన్య వామతో దక్షే చేషుధీ ఖడ్గమేవ చ | వామే చర్మ శ్రియం దక్షేపుష్టిం వామేగ్రతో న్యసేత్‌ . 16

జలకుంభమును ఎడమ వైపునను, పూజాద్రవ్యములను కుడి వైపునను ఉంచవలెను. అస్త్రముచే ప్రక్షాళనచేసి గంధపుష్పాన్వితము నైన అర్ఘ్యములను ఉంచవలెను. 

సర్వవ్యాప్తము, జ్యోతిఃస్వరూపము అయిన చైతన్యములను "అస్త్రాయఫట్‌" అని అభిమంత్రించిన, ఉదరముచే యోగబీజము నడిపి. హరిని ధ్యానించి, పూర్వాదియోగ పీఠము నందు ధర్మమును. వైరాగ్యమున, ఐశ్వర్యమును, ఆగ్నేయదిక్కు మొదలైన వాటిని, ఆధర్మము మొదలగు అంగములకు, పీఠమునందు కూర్మమును, అనంతుని, యముని, సూర్యాదుల మండలములను, విమల మొదలగు కేసరస్థానము నందున్న గ్రహణములను, కర్ణిక (ఈ పద్మము మధ్యనున్న దుద్దు యందున్న గ్రహణములనుముందు తన హృదయము నందు ధ్యానము చేసి పిమ్మట మండలము పై ఆవాహనము చేసి అర్చించవలెను. 

వైష్ణవ విద్యానుసారముగా అర్ఘ్య-పాద్య- ఆచమన - మధుపర్క - స్నాన, వస్త్ర - యజ్ఞోపవీత - అలంకార - గంధ - పుష్ప - ధూప - దీప- నైవేద్యములను సమర్పింపవలెను. 

పూర్వాది దిక్కులందు అంగదేవతలను పూజించవలెను. తూర్పు-పడమర దిక్కులందు గరుత్మ తుని, కుడివైపున చక్రమును, గదను, ఎడమవైపున శంఖమును, ధనస్సును ఉంచవలెను దేవుని ఎడమవైపున అంబుల పొదులను, కుడివైపున ఖడ్గమును. ఎడమ వైపున డాలును ఉంచవలెను. కుడి వైపున అగ్రభాగమున పుష్టిని ఉంచవలెను. 9-16

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

Friday 10 July 2020


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 38 🌹 
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 16
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 🌻. బుద్ధావతార కధనము 🌻 

అథ షోడశోధ్యాయః.
అథ బుద్ధాద్యవతార కథనమ్‌.

అగ్ని రువాచ :

వక్ష్యేబుద్ధావతారం చ పఠతః శృణ్వతోర్ధదమ్‌ | పురా దైవాసురే యుద్ధే దైత్యైద్దేవాః పరాజితాః. 1

రక్ష రక్షేతి శరణం వదన్తో జగ్మురీశ్వరమ్‌ | మాయామోహస్వరూపో7సౌ శుద్ధోదనసుతోభవత్‌. 2

మోహయామాస దైత్యాంస్తాంస్త్యాజితా వేదధర్మకమ్‌ | తే చ బౌద్ధా బభూవుర్హి తేభ్యోన్యే వేదవర్జితాః.

అగ్ని పలికెను. బుద్ధావతారమును గూర్చి చెప్పెదను. ఇది చదువువానికిని వినువానికిని గూడ మంచి ప్రయోజనమును చేకూర్చును. పూర్వము దేవాసుర యుద్ధము జరిగెను. ఆ యుద్ధమున పరాజితు లైన దేవతలు ''రక్షింపుము రక్షింపుము అని ప్రార్థించుచు పరమేశ్వరుని శరణు జొచ్చిరి. 

అపుడు మాయామోహ స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు శుద్ధోదనుని కుమారుడుగా జనించి, దైత్యులకు మోహము కలిగించి, వారు వేదధర్మమును విడచునట్లు చేసెను. వారందరును బౌద్ధులైరి. 

ఆ పరమేశ్వరుడే ఆర్హతుడై, మిగిలిన వేదవర్జితుల నందరిని ఆర్హతులను చేసెను. ఈ విధముగ దైత్యులు వేద ధర్మాదివర్జితు లైన పాషండులుగా ఆయిరి.

నారకార్హం కర్మ చక్రుర్గ్రహీష్యన్త్యధమాదపి | సర్వే కలియుగా న్తే తు భవిష్యన్తి చ సఙ్కరాః. 5

దస్యవః శీలహీనాశ్చ వేదో వాజసనేయకః | దశ పఞ్ఛ చ శాఖా వై ప్రమాణంను భవిష్యతి. 6

వారు నరకమును ఇచ్చు కర్మలు చేసిరి. వీరందరును అధమునినుండి కూడ ప్రతి గ్రహము చేయుదురు. కలియుగాంతమున సంకర మగుదురు. శీలరహితు లైన దొంగ లగుదురు. పదునైదు శాఖలు గల వాజసనేయ వేదము ప్రమాణము కాగలదు.

ధర్మకఞ్చకసంవీతా అధర్మరుచయ స్తథా | మానుషాన్‌ భక్షయిష్యని వ్లుచ్ఛాః సార్థివరూపిణః. 7

ధర్మ మను చొక్కా తొడిగికొనిన వ్లుచ్ఛులు, రాజులై, అధర్మమునందు ఆసక్తి కలవారై మనుష్యులను భక్షించగలరు. (పీడించగలరు.)

కల్కీ విష్ణుయశఃపుత్రో యాజ్ఞవల్క్యపురోహితః | ఉత్సదయిష్యతి వ్లుచ్ఛాన్‌ గృహీతాస్త్రః కృతాయుధః. 8

విష్ణుయశుని కుమారుడును, యాజ్ఞవల్క్యుడు పురోహితుడుగా కల వాడును అగు కల్కి ఆయుధములలో మిక్కిలి నేర్పరియై, అస్త్రములను ధరించి వ్యచ్ఛులను నశింపజేయును.

స్థాపయిష్యతి మర్యాదాం చాతుర్వర్ణ్యే యథోచితామ్‌ | ఆశ్రమేషు చ సర్వేషు ప్రజాః సద్ధర్మవర్త్మని. 9

నాలుగు వర్ణములందు తగిన కట్లుబాట్లు చేయగలడు. ప్రజలను నాలుగు ఆశ్రమములందును, సద్దర్మమార్గము నందును నిలుపగలడు.

కల్కిరూపం పరిత్యజ్య హరిః స్వర్గం గమిష్యతి | తతః కృతయుగం నామ పురావత్సంభవిష్యతి. 10

విష్ణువు కల్కిరూపమును విడచి స్వర్గమునకు వెళ్లును. పిమ్మట పూర్వము నందు వలె కృతయుగ మేర్పడును.

వర్ణాశ్రమాశ్చ ధర్మేషు స్వేషు స్థాస్యన్తి సత్తమ | ఏవం సర్వేషు కల్పేషు సర్వమన్వన్తరేషు చ. 11

అవతారా ఆసంఖ్యాతా అతీతానాగతాదయః | విష్ణోర్దశావతారాఖ్యాన్యః పఠేచ్ఛృణుయాన్నరః. 12

సోవాప్తకామో విమలః సకులః స్వర్గమాప్నుయత్‌ | ధర్మాధర్మవ్యవస్థాన మేవం వై కురుతే హరిః. 13

అవతీర్ణశ్చ స గతః సగ్గాదేః కారణం హరిః |

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే బుద్ధకల్క్యవతారవర్ణనం నామ షోడశోధ్యాయ.

ఓ మునీ ! వర్ణాశ్రమములు తమ తమ ధర్మములను ఆచరించును, ఈ విధముగా శ్రీమహావిష్ణువు అన్ని కల్పములందును, అన్ని మన్వంతరములందును అనేకము లైన అవతారము లెత్తుచుండును. 

గడచినవి, రానున్నవి అవతారములు ఎన్నియో లెక్కకు మించి ఉన్నవి. విష్ణు దశావతారములను పఠించినవాడును, వినినవాడును, పాపములు నశించి, సర్వకామములు పొంది, కులముతో కూడి స్వర్గము చేరును. 

విష్ణువు ఈ విధముగ ధర్మాధర్మవ్యవస్థ చేయుచుండును సృష్ట్యాదులకు కారణ మైన ఆ హరి ఈ విధముగ అవతరించి మరల (స్వర్గమునకు) వెళ్ళిపోయెను.

ఆగ్ని మహాపురాణమున బుద్ధకల్క్యవతారవర్ణన మను షోడశాధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 39 🌹 
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 17
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 🌻. జగత్ సృష్టి వర్ణనము - 1 🌻 

అథ సృష్టివర్ణనమ్‌
అగ్ని రువాచ :

జగత్సర్గాదికాం క్రీడాం విష్ణోర్వక్ష్యే7ధునా శృణు | స్వర్గాదికృత్స సర్గాదిః సృష్ట్యాదిః సగుణోగుణః. 1

అగ్ని పలికెను- ఇపుడు విష్ణువుయొక్క జగత్సృష్టలి మొదలగు క్రీడను గూర్చి చెప్పెదను, వినుము. స్వర్గాదులను నిర్మించిన ఆతడే సృష్టికి ఆది యైనవాడు ఆతడు గుణములు కలవాడు. నిర్గుణుడు కూడ.

బ్రహ్మావ్యక్తం సదగ్రేభూన్న ఖం రాత్రిదినాదికమ్‌ ప్రకృతిం పురుషం విష్ణుం ప్రవిశ్యాక్షోభయత్తతః. 2

ప్రారంభమున సద్రూప మేన బ్రహ్మయే ఆవ్యక్తావస్థలో ఉండెను. ఆకాశము గాని, రాత్రి గాని, పగలు కాని లేకుండెను. (ఆ బ్రహ్య) ప్రకృతిని, పురుషు డైన విష్ణువును ప్రవేశించి క్షోభింపచేసెను.

సర్గకాలే మహత్తత్త్వ మహఙార స్తతోభవత్‌ | వైకారిక స్తైజసశ్చ భూతారిశ్చైవ తామసః. 3

సృష్టి సమయయున ఆ ప్రకృతి పురుషుల క్షోభవలన మహత్తత్త్వము జనించెను. దానినుండి ఆహంకారము జనించెను. ఇంద్రియాది వికారములకు కారణ మైన అహంకారము తైజనము. పంచభూతములకు కారణ మైనది తామసము.

అహఙ్కారాచ్ఛబ్దమాత్రమాకా శమబవత్తతః | స్పర్శమాత్రోనిల స్తస్మాద్రూపమాత్రోనలస్తతః. 4

రసమాత్తరా ఆప ఇతో గన్ధమాత్రా మహీ స్మృతా | అహఙ్కారాత్తామసాత్తు తైజసానీన్ద్రియాణి చ. 5

వై కారికా దశ దేవా మన ఏకాదశేన్ద్రియమ్‌ | తతః స్వయమ్భూర్భగవాన్‌ సిసృక్షుర్వివాధాః ప్రజాః. 6

అప ఏవ సనర్జాదౌ తాసు వీర్యమపాసృజత్‌ | ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసూనవః. 7

ఆయనం తస్య తాః పూర్వం తేన నారాయణః స్మృతః |

ఆహంకారమునుండి శబ్దతన్మాత్రరూప మైన ఆకాశము. దానినుండి స్పర్శతన్మాత్రరూప మైన వాయువు, దానినుండి రూపతన్మాత్రరూప మైన అగ్ని, దానినుండి రసతన్మాత్రరూప మైన ఉదకము, దానినుండి గంధతన్మాత్రరూప మైన పృథివియు జనించెను. 

ఇవన్నియు తామసాహంకారము నుండి జనించెను. పిదప (తైజసాహంకారము నుండి తైజసమైన ఇంద్రియములు పది వైకారికదేవతలు, పదకొండవ ఇంద్రియ మైన మనస్సు పుట్టినవి. 

పిమ్మట భగవంతుడైన బ్రహ్మ వివిధ ప్రజలను సృజింప దలచినవాడై ముందుగా జలమును సృజించెను. దానియందు తన వీర్యమును విడచెను. 

ఉదకమునకు నారములు అని పేరు. ఆవి నరుని వలన పుట్లెను. కదా. పూర్వము నారములు అనగా ఉదకములు, నరునకు స్థాన మాయెను. ఆందుచే ఆతడు నారాయణు డని చెప్పబడెను.

సశేషం....

🌹 🌹 🌹 🌹 

 🌻. జగత్ సృష్టి వర్ణనము - 2 🌻 

హిరణ్యవర్ణమభవత్తదణ్డముదకేశయమ్‌. 
తస్మిఞ్జజ్ఞే స్వయం బ్రహ్మా స్వయంభూరితి నః శ్రుతమ్‌ | 8

ఉదకములో నున్న ఆ వీర్యము బంగారు వర్ణము గల అండముగా అయెను. దానియందు స్వయంభు దైన బ్రహ్మ జనించెనని మేము వింటిమి.

హిరణ్యగర్భో భగవానుషిత్యా పరివత్సరమ్‌. 9

తదణ్డమకరోద్ధ్వెదం దివం భువమథాపి చ | తయోః శకలయోర్మధ్యే ఆకాశమసృజత్ర్పభుః. 10

అప్సు పారిప్లవాం పృథ్వీం దిశశ్చ దశధాదధే | తత్ర కాలం మనో వాచం కామం క్రోధమథో రతిమ్‌. 11

ససర్జ సృష్టిం తద్రూపాం స్రష్టుమిచ్ఛన్‌ ప్రజాపతిః |

బగవంతు డైన హిరణ్యగర్భుడు ఆ అండమునందు పరివత్సరము కాల ముండి, దానిని రెండు వ్రక్కలుగా చేసి ద్యులోకమును, భూలోకమును నిర్మించెను.

 ఆ రెండు వ్రక్కల మధ్మయందు ఆకాశమును సృజించెను. ఉదకము నుందు తేలుచున్న భూమిని, పది దిక్కులను సృజించెను. 

అచట కాలమును, మనస్సును, వాక్కును, కామమును, క్రోధమును, మరియు రతిని నిర్మించెను. ప్రజాపతి ఈ రాబోవు సృష్టిని పైన చెప్పిన ఆకాశాదులతో సంబంధించిన దానినిగా చేయదలచి, ముందుగా వాటిని సృజించెను.

విద్యుతోశనిమేఘాంశ్చ రోహితేన్ద్రధనూషి చ. 12

వయాంసి చ ససర్జాదౌ వర్జన్యం బాధ వక్త్రతః | బుచో యజూంషి సామాని నిర్మమే యజ్ఞసిద్దయే. 13

మేఱుపులను, వజ్రమును (పిడుగును). మేఘములను, రక్తమును, ఇంద్రధనస్సును లేదా ఎఱ్ఱని రంగుగల ఇంద్రధనుస్సులను, పక్షులను వర్జన్యుని సృజించెను 

పిదప యజ్ఞసిదికొరకై ముఖమునుండి బుగ్యజుఃసామవేదములను సృజించెను.

సాధ్యాం సైరయజద్దేవాన్‌ భూతముచ్ఛావచం భుజాత్‌ | సనత్కుమారం రుద్రం చ సర్జ క్రోధసమ్బవమ్‌.

మరీచిమత్ర్యజీరసం పులస్త్యం పులహం క్రతుమ్‌ | వసిష్ఠం మానసాః సప్త బ్రహ్మాణ ఇతి నిశ్చితాః. 15

సపైతే జనయన్తి స్మ ప్రజా రుద్రాశ్చ సత్తమ |

ఆ వేదములచే సాధ్యులను, దేవతలను ఉద్దేశించి యజ్ఞము చేసెను. అనేక విధముల లగు భూతములను సృజించెను. భుజమునుండి సనత్కుమారుని, క్రోధమునుండి రుద్రుని సృజించెను. 

మరీచి, ఆత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు. క్రతువు, వసిష్ఠుడు అనువారిని సృజించెను. ఈ ఏడుగురును బ్రహ్మమానసపుత్రు లగు బ్రహ్మ లని ప్రసిద్ది చెందిరి. 

ఈ సప్త బ్రహ్మలును. రుద్రులను ప్రజాసృష్టి చేసిరి.

ద్విదా కృత్వాత్మనో దేహమర్దేన పురుషోభవత్‌ | అర్దేన నారీ తస్యాం స బ్రహ్మా వై చాసృజత్ర్పజాః. 16

తన దేహమును రెండు భాగములుగా చేసి. ఒక భాగము పురుసుడు గాను, మరొక భాగము స్త్రీగాను అయి బ్రహ్మ ఆమె యందు ప్రజలను సృజించెను.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే జగత్సర్గవర్ణనం నామ సప్తదశోధ్యాయః.

అగ్ని మహాపురాణమునందు జగత్సృష్టివర్ణన మను సప్తదశాధ్యాయము సమాప్తము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 41 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 18
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. స్వాయంభువ వంశ వర్ణనము - 1 🌻

అథ అష్టాదశోధ్యాయః

స్వాయమ్భువవంశవర్ణనమ్‌

అగ్ని రువాచ :

ప్రియవ్రతోత్తానపాదౌ మనః స్వాయమ్భువః సుతౌ | అజీజనత్సుతాం రమ్యాం శతరూపాం తపోన్వితామ్‌. 1

కామ్యాం కర్దమ భార్యాతః సమ్రాట్‌ కుక్షిర్విరాట్‌ ప్రభుః |

స్వాయంభువమనువు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కుమారులను, తపఃవాలిని యగు శతరూప యను సుందరి యగు కుమార్తెను జనింపచేసెను.

సురుచ్యాముత్తమో జజ్ఞీ పుత్ర ఉత్తానపాదతః 2

సునీత్యాం తు ధ్రువః పుత్రస్తపస్తే పే స కీర్తయే | ధ్రువో వర్షసహస్రాణి త్రీణి దివ్యాని హే మునే. 3

ఉత్తానపాదుని వలన సురుచియందు ఉత్తము డను పుత్రుడును, సునీతయందు ధ్రువు డను పుత్రుడును జనించిరి. ఓ మునీ ! ధ్రువుడు, కీర్తికొరకై, మూడు వేల దివ్యవర్షములపాటు తపస్సు చేసెను.

తస్త్మె ప్రీతో హరిః ప్రాదాన్మున్యగ్రే స్థానకం స్థిరమ్‌ |

శ్లోకం పపాఠ హ్యుశనా వృద్ధిం దృష్ట్వా స తస్య చ 4

అహో7స్య తపసో వీర్యమహో శ్రుతమహాద్భుతమ్‌ | యమద్య పురతః కృత్వా ద్రువం సప్తర్షయఃస్థితాః. 5

ఆతని విషయమున సంతసించిన విష్ణువు ఆతనికి సప్తర్షులకంటె ముందు స్థిర మైన స్థానము నిచ్చెను. ఆతని అభివృద్దిని చూచి ఉశనుడు ఒక శ్లోకమును (ప్రశంసావాక్యమును) చదివెను. ''ఈతని తపస్సుయొక్క ప్రభావము ఎంత గొప్పది! ఈతని శాస్త్రజ్ఞాన మెంత అద్భుత మైనది! సప్తర్షులు కూడ ఈతని తమ ఎదుట నిలుపుకొని యున్నారు కదా!

తస్మాచ్ఛిష్టిశ్చ భవ్యశ్చ ధ్రువాచ్చమ్భుర్వ్యజాయత | శిష్టేరాదత్త సుచ్ఛాయా పఞ్చ పుత్రానకల్మషాన్‌. 6

రిపుం రిపుఞ్జయం రిప్రం వృకలం వృకతేజసమ్‌ | రిపోరాధత్త బృహతీ చాక్షుషం సర్వతేజసమ్‌. 7

ధ్రుపునకు శిష్ట, భవ్యుడు శంభవు అను కుమారులు జనించిరి. శిషికి సుచ్ఛాయవలన, రిపువు. రిపుంజయుడు, రిప్రుడు, వృకలుడు, వృకతేజసుడు అను పుణ్యాత్ములైన కుమారులు జనించిరి. రిపువుకు బృహతియందు చాక్షుషుడు, సర్వతేజసుడు అను పుత్రులు జనించిరి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌻. స్వాయంభువ వంశ వర్ణనము - 2 🌻

అజీజనత్పుష్కరిణ్యాం వీరణ్యాం చాక్షుషో మనుమ్‌ | మనోరజాయన్త దశ నడ్వలాయాం సుతోత్తమాః. 8

ఊరుః పూరుః శతద్యుమ్నస్తపస్వీ సత్యవాక్కవిః | అగ్నిష్టురతిరాత్రశ్చ సుద్యుమ్నశ్చాతిమన్యుకః. 9

చాక్షుషుడు పుష్కరిణిలో, వీరణియందు మనువును జనింపచేసెను. మనువునకు, నడ్వలయందు ఊరుడు, పూరుడు, తపస్వి, సత్యవాక్కు, కవి, అగ్నిష్టుడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, అతిమన్యుకుడు అను పదిమంది సుతోత్తములు జనించిరి.

ఊరోర్జనయత్పుత్రాన్‌ షడాగ్నేయా మహాప్రభాన్‌ | అఙ్గం సుమనసం స్వాతి క్రతు మఙ్గిరసం గయమ్‌. 10

ఊరునివలన ఆగ్నేయ అంగుడు, సుమనసుడు, స్వాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు అను కాంతిమంతులగు ఆరుగురు కుమారులను కనెను.

అఙ్గాత్సునీధాపత్యం వై దేనమేకం వ్యజాయత | అరక్షకః పాపరతః స మతో మునిబిః కుశెః. 11

అంగునకు సునీథుని కుమార్తెయందు రేను డను ఒక కుమారుడు జనించెను. పాపాసక్తుడై ప్రజారక్షణము చేయని ఆ వేనుని మునులు కుశములను ప్రయోగించి సంహరించిరి.

ప్రజార్థమృషయో7థాస్య మమన్ధుర్దక్షిణం కరమ్‌ | వేనస్య మథితే పాణౌ సమ్బభూవ పృథుర్నృపః. 12

పిమ్మట మునులు సంతానము కొరకై వేనుని కుడిచేతిని మధించగా దానినుండి పృథుచక్రవర్తి జనించెను

తం దృష్ట్వా మునయః ప్రాహురేష వె ముదితాః ప్రజాః | కరిష్యతి మమాతేజా యశశ్చ ప్రాప్స్యతే మహత్‌.

మును లందరును ఆతనిని చూచి - ''మహాతేజశ్శాతి యైన ఇతడు ప్రజలను రంజింపచేయగలడు. గొప్ప కీర్తిని కూడ పొందగలడు'' అని పలికిరి.

సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹

 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 43 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 19
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. స్వాయంభువ వంశ వర్ణనము - 3 🌻

స ధన్వీ కవచీ జాతస్తేజసా నిర్దహన్నివ | పృథుర్వెన్యః ప్రజాః సర్వా రరక్ష క్షత్రపూర్వజః. 14

క్షత్రియుల పూర్వపురుషుడును, వైన్యుని కుమారుడును, తేజస్సుచే దహింపచేయుచున్నట్లు కనబడుచున్నవాడును అగు ఆ పృథువు దనస్సును, కవచమును ధరించి ప్రజ లందరిని రక్షించెను.

రాజసూయాభిషి క్తానామాద్యః స పృధివీపతిః | తస్మాచైవ సముత్పన్నౌ నిపుణౌ సూతమాగధౌ. 15

తత్‌ స్తోత్రం చక్రతుర్వీరౌ రాజాభూజ్జనరఞ్జనాత్‌ | దుగ్ధా గౌస్తేన సస్యార్థం ప్రజానాం జీవనాయ చ 16

ఆ రాజు రాజసూయ యాగము చేసి అభిషేకము పొందిన వారిలో మొదటివాడు. ఆతని నుండి పుట్టిన-నేర్పరులైన వీరులైన సూతమాగథులు ఆతనిని స్తుతించిరి. ఆతడు ప్రజల జీవనమున కుపయోగించు సస్యములను సంపాదించుటకై భూమిని సిదికెను.

సహ దేవ్తెర్మునిగణౖర్గన్ధర్వైః సాప్సరోగణౖః | పితృభిర్దానవైః సర్పైర్వీరుద్బిః పర్వతైర్జనైః. 17

తేషు తేషు చ పాత్రేషు దుహ్యమాన వసున్దరా | ప్రాదాద్యధేప్సితం క్షీరం తేన ప్రాణానధారయత్‌. 18

దేవతలును మునిగణములను, గంధర్వులును, అప్సరోగణములను, పితృదేవతలును, దానవులును, సర్పములును, లతలును, పర్వతములను, జనులును, ఆ యా పాత్రలలో పిదుకగా భూమి వారివారికి కావలసిన క్షీరము నిచ్చెను. దానిచే వారందరును ప్రాణధారణము చేసిరి.

పృథోః పుత్రౌ తు ధర్మజ్ఞౌ జజ్ఞాతే7న్తర్థిపాలితా | శిఖణ్డినీ హవిర్దాన మన్తర్భాణ ద్వ్యజాయత. 19

హవిర్దానాత్‌ షడాగ్నేయీ ధిషణాజనయత్సుతాన్‌ | ప్రాచీనబర్హిషం శుక్రం గయం కృష్ణం ప్రజాజినౌ. 20

పృథుచక్రవర్తికి ఆంతర్ది, పాలితుడు అను ధర్మవేత లైన ఇరువురు కుమారులు నించిరి. శిఖండిని అంతర్ధ నుండి హవిర్ధాను దనెడు కుమారుని కనెను. అగ్ని పుత్రి యగు ధిషణ హవిర్దానుని వలన ప్రాచీనబర్హిస్సు, శుక్రుడు, గయుడు. కృష్ణుడు, వ్రజుడు, అజినుడు అను ఆరుగురు కమారులను కనెను.

సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹

 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 44 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 20
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. స్వాయంభువ వంశ వర్ణనము - 4 🌻

ప్రాచీనాగ్రాః కుశస్తస్య పృథివ్యాం యజతో యతః | ప్రాచీనబర్హిర్బగవాన్మహానాసీత్‌ ప్రజాపతిః. 21

యజ్ఞము చేయుచున్నప్పుడు కుశలు, వాటి అగ్రములు తూర్పు వైపున కుండు నట్లు భూమిపై పరవబడెను. అందుచే పూజ్యు డైన ఆ ప్రజాపతికి ''ప్రాచీన బర్హిస్సు'' అను పేరు వచ్చెను.

సవర్ణా7ధత్త సాముద్రీ దశ ప్రాచీనబర్హిషః | సర్వే ప్రచేతసో నామ ధనుద్వేదస్య పారగాః. 22

సముద్రుని కుమార్తె యైన సవర్ణ ప్రాచీనబర్హిస్సువలన పదిమంది కుమారులను కనెను వారందరికిని ప్రచేతను లనియే పేరు. వారందరును ధనుర్వేదమునందు పరిపూర్ణప్రజ్ఞ కలవారు.

అపృథగ్ధర్మచరణాస్తే7తప్యన్త మహత్తపః | దశ వర్షసహస్రాణి సముద్రసలిలేశయాః. 23

ఒకే విధముగా ధర్మము నాచరించుచున్న వారందరును సముద్ర జలమున నివసించి పది వేల సంవత్సరములు గొప్ప తపస్సు చేసిరి.

ప్రజాపతిత్వం సంప్రాప్య తుష్టా విష్ణోశ్చనిర్గతాః | భూః ఖం వ్యాప్తం హి తరుబిస్తాంస్తరూనదహంశ్చ తే.

ముఖజాగ్ని మరుద్భ్యాం చ దృష్ట్వాచాథ ద్రుమక్షయమ్‌ | ఉపగమ్యాబ్రవీదేతాన్రాజా సోమః ప్రజాపతీన్‌. 24

కోపం యచ్చత దాస్యన్తి కన్యాం వోమారిషాం వరామ్‌ | తపస్వినో మునేః కణ్డోః ప్రవ్లూెచాయం మయ్తెవ చ.

భవిష్యం జానతా సృష్టా భార్యా వో7స్తు కులఙ్కరీ | అస్యాముతృద్యతే దక్షః ప్రజాః సంవర్దయిష్యతి. 26

వారు విష్ణువునుండి ప్రజాపతిత్వమును పొంది, సంతసించినవారై సముద్రజలమునుండి లేచిరి అపుడు భూమ్యాకాశములు వృక్షములచే వ్యాప్తములై యుండెను వారు తమ ముఖమునుండి పుట్టిన అగ్ని వాయువులచే ఆ వృక్షములను దహింపచేయ మొదలిడిరి. అపుడు రాజైన సోముడు ప్రజాపతుల దగ్గరికి వెళ్లి-- ''కోపమును ఉపసంహరింపుడు భవిష్యత్తును గూర్చి తెలిసిన నేను తపశ్శాలి యగ కండుముని కుమార్తె యైన ప్రవ్లూెచయందు ఉత్తమురాలగు మారిషయను కన్యను జనింపచేసితిని ఆమెను మీకు ఇచ్చెదరు. ఆమె మీ వంశమును వృద్ది పొందించు బార్య యగుగాక. ఆమెయందు పట్టిన దక్షుడు ప్రజలను వృద్దిపొందించును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 45 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 21
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. స్వాయంభువ వంశ వర్ణనము - 5 🌻

ప్రచేతసస్తాం జగృహుర్దక్షోస్యాం చ తతోభవత్‌ | అచరాంశ్చచరాంశ్చైవ ద్విపదోథ చతుష్పదః. 27

స సృష్ట్వా మనసా దక్షః పశ్చా ద సృజత స్త్రియః | రదౌ స దశ ధర్మాయ కశ్యపాయ త్రయోదశ. 28

సప్తవింశతిం సోమాయ చతస్రోరిష్టనేమయే | ద్వే చైవ బహుపుత్రాయ ద్వే నై వాఙ్గిర సే హ్యదాత్‌. 29

తాను దేవశ్చ నాగాద్యా మైథునాన్మనసా పురా |

ప్రచేతసులు ఆమెను స్వీకరించిరి. ఆమెకు దక్షుడును కుమారుడు జనించెను. ఆతడు మనస్సుచే స్థావరజంగమములకు, ద్విపాత్తులను (మనుష్యులు మొదలగువారిన) చతుష్పాత్తులను (నాలుగు కాళ్ళుగల పశ్వాదులను.) సృజించి పిమ్మట స్త్రీలను సృజించెను. వారిలో పదిమందిని యమధర్మరాజునకును, పదముగ్గురిని కశ్యపునకును, సోమునకు ఇరువది యేడుగురిని, అరిష్టనేమికి నలుగురిని, బహుపుత్రునకు ఇద్దరిని, ఆంగిరసునకు ఇద్దరిని ఇచ్చెను. పూర్వము వారియందు మానస మైథునముచే దేవతలును నాగాదులను జనించిరి.

ధర్మసర్గం ప్రవక్ష్యామి దశపత్నీషు ధర్మతః. 30

విశ్వేదేవాస్తు విశ్వాయాః సాధ్యాన్సాధ్యావ్యజాయత | మరుత్త్వన్త్యా మరుత్త్వన్తౌ వసోస్తు వసవోభవన్‌. 31

భానోస్తు బానవః పుత్రా ముహూర్తాస్తు ముహూర్తజాః | లమ్బాయా ధర్మతో ఘోషో నాగవీథీ చ యామిజా

పృథివీ విషయం సర్వం మరుత్వత్యాం వ్యజాయత | సఙ్కల్పాయాస్తు సఙ్కల్పా ఇన్ధోర్నక్షత్రతః సుతాః.

ఆపోధ్రువశ్చ సోమశ్చ ధరశ్చైవానలోనలః | ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవోష్టౌ చ నామతః. 35

యమధర్మరాజునకు తన పదిమంది భార్యలవలన కలిగిన సంతానమును గూర్చి చెప్పెదను. విశ్వకు విశ్వేదేవతలు, సాధ్యకు సాధ్యులు, మరుత్వలకి ఇద్దరు మరుత్వంవతులు, వసువునకు వసువులు భానువుకు బానువలు, ముహూర్తకు ముహూర్తులు, లంబకు ఘోషుడు, యామికి నాగవీధి, మరుత్వతికి పృథివీ సంబద్దమగు సకల వస్తుజాతము, సంకల్పకు సంకల్పులు జనించిరి. చంద్రునకు నక్షత్రముల వలన ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు, ఎనమండుగురు వసువులను జనించిరి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 46 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 22
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. స్వాయంభువ వంశ వర్ణనము - 6 🌻

ఆపస్య పుత్రో వై తణ్డ్యః శ్రమః శాన్తో మునిస్తధా | ధ్రువస్య కాలో లోకాన్తో వర్జాః సోమస్య వై సుతః. 36

ధరస్య పుత్రో ద్రవిణో హుతహవ్యవహ స్తథా | మనోహరాయాః శిశిరః ప్రాణోథ రమణ స్తథా. 37

పురోజవోనిలస్యాసీ ధవిజ్ఞాతోనలస్య చ | అగ్నిపుత్రః కుమారశ్చ శరస్తమ్బే వ్యజాయత. 38

తస్య శాఖో విశాఖశ్చ నైగమేయశ్చ పృష్ఠజః | కృత్తికాతః కార్తికేయో యతిః సనత్కుమారకః. 39

ఆపుని కుమారులు వైతండ్యుడు, శ్రముడు, శాంతుడు, ముని అనువారు. లోకాంతుడైన కాలుడు ధ్రువుని కుమారుడు. వర్చసుడు సోముని కుమారుడు. ద్రవిణుడు, హుతహవ్యవహుడు శిశిరుడు, ప్రాణుడు, రమణుడు అనువారు ధరునికి మనోహరయ దు కుమారులుగా జనించిరి. అనిలుని కుమారుడు పురోజపుడు. అనలుని కుమారుడు అవిజ్ఞాతుడు. కుమారుడు అగ్నిపుత్రుడుగా శరస్తంబమునందు జనించెను. ఆతని తరువాత శాఖుడు, విశాఖుడు, నైగమేయుడును పట్టిరి కృత్తిక నుండి కార్తి కీయుడును, యతియైన సనత్కుమారుడును పుట్టిరి.

ప్రత్యూషాద్దేవలో జజ్ఞే విశ్వకర్మా ప్రభాయుతః | కర్తా శిల్పసహస్రాణాం త్రిదశానాం చ వర్దకిః. 40

మనుష్యాశ్చోపజీవన్తి శిల్పం వై భూషణాదికమ్‌ |

వేలకొలది శిల్పములను చేయువాడును, దేవతల వడ్రంగియు, కాంతిమంతుడును ఆగు విశ్వకర్మయను దేవలుడు ప్రత్యుషునినుండి జనించెను. మనుష్యులు భూషణాది శిల్పములను జీవనాధారముగా చేసి కొనుచుందురు.

సురభీ కశ్యపాద్రుద్రానేకాదశ విజజ్ఞుషీ. 41

మహాదేవప్రసాదేన తపసా భావితా సతీ | అజైకపాదహిర్బుధ్న్య స్త్వష్టా రుద్రశ్చ సత్తమ. 42

త్వష్టుశ్చైవాత్మజః శ్రీమాన్విశ్వరూపో మహాయశాః | హరశ్చ బహురూపశ్చ త్ర్యమ్బకశ్చాపరాజితః 43

వృషాకపిశ్చ శమ్బుశ్చ కపర్దీ రైవత స్తథా | మృగవ్యాధశ్చ సర్పశ్చ కపాలీ దశ చై కకః. 44

రుద్రాణాం చ శతం లక్షం యైర్వ్యాప్తం సచరాచరమ్‌ |

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే స్వాయమ్భువ మనువంశవర్ణనం నామాష్టదశోధ్యాయః

సురభి తపస్సుచే పవిత్రీకృతురాలై, మహాదేవుని ప్రసాదముచే ఏకాదశరుద్రులను కనెను. మేక పాదము వంటి ఒక పాదము గల అహిర్బుధ్న్యుడు, త్వష్టయను రుద్రుడు, బహురూపుడు, హరుడు, పరాజితుడు కాని త్ర్యంబకుడు, వృషాకమియు, కపర్ద (జటా) ధారియగు శంభువు, రైవతుడు, మృగవ్యాధుడు, సర్పుడు, పదకొండవవాడైన కపాలియు, చరాచర జగుత్తును వ్యాపించిన కోట్లకొలది రుద్రులు జనించిరి. శ్రీమంతుడును, మహా యశః శాలియు అగు విశ్వరూపుడు త్వష్ట కుమారుడు.

అగ్ని మహాపురాణములో స్వాయంభువమనువంశకర్ణన మన అష్టాదశాధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

Wednesday 8 July 2020

పాండవ చరిత వర్ణనము

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 36 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 15
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 🌻. పాండవ చరిత వర్ణనము - 1 🌻

అథ పాణ్డవ చరిత వర్ణనమ్‌.

అగ్నిరువాచ :

యుధిష్ఠరే తు రాజ్యస్థే ఆశ్రమాదాశ్రమాన్తరమ్‌ | ధృతరాష్ట్రో వనమగాద్గాన్ధారీ చ పృథా ద్విజత 1

అగ్ని పలికెను: ఓ ద్విజుడా! యుద్ధిష్ఠురుడు రాజ్యము చేయుచుంéడగా ధృతరాష్ట్రడును, గాందారియు, కుంతియు, అరణ్యమునకు వెళ్ళి ఒక ఆశ్రమమునుండి మరి యొక ఆశ్రమమునకు సంచరించుచుండిరి.

విదురస్త్వగ్ని నా దగ్ధో వనజేన దివం గతః | ఏవం విష్ణుర్భువో భారమహరద్ధానవాదికమ్‌. 2

ధర్మాయాధర్మానాశాయ నిమిత్తీకృత్య పాణ్డవాన్‌ | స విప్రశాపవ్యాజేన ముసలేనాహనత్కులమ్‌. 3

యాదవానాం భారకరమ్‌-

విదురుడు దావాగ్నిచే దగ్ధుడై మృతి చెందెను. ఈ విధముగ మహావిష్ణువు పాండవులను నిమిత్తముగ చేసి కొని, ధర్మరక్షణముకొరకును, అధర్మవినాశమునకు, పూనుకొని దానవాదిక మగు భూభారమును హరించెను. విప్రశాప మను వంకచే, ముసలముచే, భూభారకర మగు యాదవకులమును నశింపచేసెను.

వజ్రం రాజ్యే7భిషేచయత్‌ | దేవాదేశాత్ర్పభాసే స దేహం త్యక్త్వా స్వయం హరిః 4

ఇన్ద్రలోకే బ్రహ్మలోకే పూజ్యతే స్వర్గవాసిభిః | బలభద్రో7నన్తమూర్తిః పాతాల స్వర్గమీయివాన్‌. 5

శ్రీకృష్ణుడు వజ్రుని రాజ్యాభిషిక్తుని చేసి దేవతల ఆదేశమునే ప్రభాసక్షేత్రమునందు తన దేహమును పరిత్యజించి, ఇంద్రలోక బ్రహ్మలోకములందు స్వర్గవాసులచే పూజింపబడెను. బలరాముడు ఆదిశేషరూపధారి యై పాతాళ స్వర్గము చేరెను.

అవినాశీ హరిర్దేవో ధ్యానిభిర్ధ్యేయ ఏవ సః | వినా తం ద్వారకాస్థానం ప్లావయామాస సాగరః. 6

వినాశరహితు డగు ఆ శ్రీ హరి యోగులచే ధ్యానింపబడు వాడు. అట్టి శ్రీ కృష్ణుడు లేని ద్వారకను సముద్రము ముంచివేసెను.

సంస్కృత్య యాదవాన్‌ పార్థో దత్తోదకధనాదికః | స్త్రియో7ష్టావక్రశాపేన భార్యా విష్ణోశ్చ యాః స్థితాః. 7

పునస్తచ్ఛాపతో నీతా గోపాలైర్లగుడాయుధై ః | అర్జునం హి తిరస్కృత్య పార్థః శోకం చకార హ. 8

వ్యాసేనాశ్వాసితో మేనే బలిం మే కృష్ణసన్నిధౌ య | హస్తినాపురమాగత్య పార్థః సర్వం న్యవేదయత్‌. 9

యుధిష్టిరాయ స భ్రాత్రే పాలకాయ నృణాం తదా |

అర్జునుడు యాదవులకు ప్రేత సంస్కారాదులు చేసి ఉదకధనాదిదానములు చేసెను.

అష్టావక్రుని శాపముచే విష్ణుభార్యలుగా అయిన స్త్రీలను, మరల అతని శాపము చేతనే, కఱ్ఱలు ఆయుధములుగా గల రోపాలకులు అర్జునుని ఓడించి తీసికొని పోయిరి. అర్జునుడు చాల శోకించెను.

వ్యాసు డాతనిని ఊరడించెను. కృష్ణుడున్నప్పుడే నా బలము అని అతడు గ్రహించెను. అతడు హస్తినాపురమునకు వచ్చి, రాజ్యపాలకు డైన యుధిష్ఠిరునకు ఇది యంతయు చెప్పెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 37 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 15
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. పాండవ చరిత వర్ణనము - 2 🌻

తద్థనుస్తాని చాస్త్రాణి స రథస్తే చ వాఇనః. 10

వినా కృష్ణేన తన్నషటం దానం చాశ్రోత్రియే యథా |

కృష్ణుడు ఈ లోకమును విడచి వెళ్ళిపోయిన తోడనే అర్జునుని అదే ధనస్సు, అవే అస్త్రములు, అదే రథము, అవే గుఱ్ఱములు, అవన్నియు శ్రోత్రియుడు కాని వానికి ఇచ్చిన దానము వలె నష్టమైపోయెను.

తచ్ర్ఛుత్వా ధర్మరాజస్తు రాజ్యే స్థాప్య పరీక్షితమ్‌.

ప్రస్థానం ప్రస్థితో ధీమాన్‌ ద్రౌపద్యా భ్రాతృభిః సహ | సంసారానిత్యతాం జ్ఞాత్వా జపన్నష్టశతం హరేః. 12

ధర్మరాజు ఆ వార్త విని, పరీక్షిత్తును రాజ్యపాలనకై నియోగించి, ఈ సంసార మనిత్య మను విషయము గ్రహించినవాడై, ద్రౌపదియు, సోదరులును వెంట రాగా, మహావిష్ణుని అష్టోత్తరశతనాముములు జపించుచు మహా ప్రస్థానమున బయలుదేరెను.

మహాపథే తు పతితా ద్రౌపదీ సహదేవకః | నకులః ఫల్గునో భీమో రాజా వోకపరాయణః. 13

ఇన్ద్రానీతరథారూఢః సానుజః స్వర్గమా స్తవాన్‌ | దృష్ట్వా దుర్యోధనాదీంశ్చ వాసుదేవం చ హర్షితః. 14

ఏత త్తే భారతం ప్రోక్తం యః పఠేత్స దివం వ్రజేత్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మహాభారతాఖ్యానం నామ పఞ్చదశో7ధ్యాయః.

ఆ మహాప్రస్థానమునందు ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడును పడిపోయిరి. రాజు శోకాతురుడయ్యెను. ఆతడు ఇంద్రుడు తీసికొని వచ్చిన రథము నధిరోహించి, సోదరనహితుడై స్వర్గము చేరెను. ఆచట దుర్యోధనాదులను, వాసుదేవుని చూచి సంతసించెను. నీ కీ భారతకథను చెప్పితిని. దీనిని పఠించినవారు స్వర్గమునకు వెళ్లెదరు.

అగ్ని మహాపురాణములో మహాబారతాఖ్యాన మను పంచదశాధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

Saturday 4 July 2020

మహాభారతఖ్యాన మను చతుర్దశాధ్యాయము




🌻. భారతము వాఖ్యానం  - 3 🌻

జితో యుదిష్ఠిరో భ్రాతృయుతశ్చారణ్యకం య¸°. 20

వనే ద్వాదశ వర్షాణి ప్రతిజ్ఞాతాని సో7నయత్‌ | అష్టాశీతి సహస్రాణి భోజయన్‌ పూర్వవద్ధ్విజాన్‌ . 21

సధౌమ్యో ద్రౌపదీషష్ఠ స్తతః ప్రాయాద్విరాటకమ్‌ | కజ్కో ద్విజో హ్యవిజ్ఞాతో రాజా భీమో7థ సూపకృత్‌.

బృహన్నడార్జునో భార్యా సైరన్ధ్రీ యమజౌ తథా | అన్యనామ్నా భీమసేనః కీచకం చావధీన్నిశి. 23

ద్రౌవదీం హర్తుకామం తమర్జునశ్చాజయత్కురూన్‌ | కుర్వతో గోగ్రహాదీంశ్చ తైర్‌జ్ఞాతాః పాణ్డవా అథ. 24

ద్యూతమునందు ఓడిపోయిన యుధిష్ఠిరుడు సోదరులతోడను, ద్రౌపదితోడను, ధౌమ్యునితోడను అరణ్యమునకు వెళ్లి ప్రతిజ్ఞచేసిన విధముగ అచట పండ్రెండు సంవత్సరములు గడపెను. అచట పూర్వము నందు వలె, ప్రతిదివసము నందును, ఎనుబది ఎనిమిదివేలమంది బ్రాహ్మణులకు భోజనము పెట్టుచుండెను. పిమ్మట వారందరును విరాటుని చేరిరి. యుధిష్ఠిరుడు కంకుడనెడు. బ్రాహ్మణుడుగను, భీముడు వంటవాడుగను, అర్జునుడు బృహన్నలగను అయి ఇతరులకు తెలియ కుండునట్లు అచట నివసించిరి. నకులసహదేవులు వేరు పేర్లుతో ఉండిరి. ద్రౌపదిని హరింప నభిలషించిన కీచకుని భీమ సేనుడు రాత్రివేళ సంహరించెను. గోగ్రహణాదికమును చేయ వచ్చిన కౌరవులను అర్జునుడు జయించెను. అప్పుడు ఆ కౌరవులు వారు పాండవు లని గుర్తించిరి.

సుభద్రా కృష్ణభగినీ అర్జునాత్సమజీజనత్‌ | అభిమన్యుం దదౌ తసై#్మ విరాటశ్చోత్తరాం సుతామ్‌. 25

కృష్ణుని సోదరియైన సుభద్రకు అర్జునునివలన అభిమన్యడను కుమారుడు కలిగెను. విరాటుడు అతనికి తన కుమార్తెయైన ఉత్తర నిచ్చెను.

ఆసిత్సప్తాక్షౌహిణీశో ధర్మరాజో రణాయ సః | కృష్ణో దూతో7బ్రవీద్గత్వా దుర్యోధన మమర్షణమ్‌. 26

ఏకాదశాక్షౌహిణీశం నృపం దుర్యోధనం తదా | యుధిష్ఠిరాయార్ధరాజ్యం దేహి గ్రామాంశ్చ పఞ్ఛ వా. 27

యుధ్యస్వ వా వచః శ్రుత్వా కృష్ణమాహ సుయోధనః |

ధర్మరాజు యుద్ధమునకై ఏడు అక్షౌహిణుల సైన్యమును నన్నద్దము చేసికొనెను. కృష్ణుడు అమర్ష పూర్ణుడును, పదకొండు అక్షోహిణులకు అధిపతియు అగు దుర్యోధనుని వద్దకు దూతగా వెళ్లి - "యుధిష్ఠిరునకు సగము రాజ్యము నిమ్ము. లేదా ఐదు గ్రామాల నైన ఇమ్ము. అట్లు కానిచో యుద్ధము చేయము" అని చెప్పెను. ఆ మాటలు విని సుయోధనుడు శ్రీ కృష్ణునితో ఇట్లు పలికెను.

సుయోధన ఉవాచ:

భూసూచ్యగ్రం న దాస్యామి యోత్స్యే సఙ్గ్రహణోద్యతః 28

అగ్నిరువాచ:

విశ్వరూపం దర్శయిత్వా అధృష్యం విదురార్చితః | ప్రాగద్యుధిష్ఠిరం ప్రాహ యోధయైనం సుయోధనమ్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మహాభారతాఖ్యానం నామ త్రయోదశో7ధ్యాయః

సుయోధను డిట్లనెను - ''సూది మోపినంత నేల నైనను ఇవ్వను. యుద్దము చేసెదను. యుద్ధమునకై సిద్ధముగా ఉన్నాను." అగ్ని పలికెను. అంత శ్రీ కృష్ణుడు ఎదిరింప శక్యముకాని విశ్వరూపము చూపి, విదురుని చేత పూజింపబడినవాడై, యుధిష్ఠిరుని దగ్గరకు వెళ్లి, "ఆ సుయోధననితో యుద్ధము చేయుము" అని చెప్పెను.

అగ్ని మహాపురాణములో భారతాఖ్యన మన పదమూడవ అధ్యయము సమాప్తము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌻. భారత వ్యాఖ్యానము - 4 🌻

అగ్నిరువాచ:

¸°ధిష్ఠిరీ కురుక్షేత్రం య¸° దౌర్యోధనీ చమూః | భీష్మద్రోణాదికాన్‌ దృష్ట్వా నాయుధ్యతి గురూనితి. 1

పార్థం హ్యువాచ భగవాన్నశోచ్యా భీష్మముఖ్యకాః | శరీరాణి వినాశీని న శరీరీ వినశ్యతి. 2

అయమాత్మా పరం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి విద్ధితమ్‌ | సిద్ధ్యసిధ్ధ్యో సమో యోగీ రాజధర్మం ప్రపాలయ.

యధిష్ఠిరుని సేనయు, దుర్యోధనుని సేనయు కురుక్షేత్రమును చేరినవి. అర్జునుడు భీష్మద్రోణాదులను చూచి యుద్ధము చేయడని తెలిసికొని, భగవంతుడైన శ్రీకృష్ణు డాతనితో ఇట్లనెను. భీష్మాదులను గూర్చి శోకింప పనిలేదు. శరీరములు నశించును గాని ఆత్మ నశించదు. ఈ జీవాత్మ పరమాత్మయే. "నేనే పరబ్రహ్మను" అని తెలిసికొనుము. ప్రయత్నము సిద్ధించినను, సిద్ధింపకున్నను సమబుద్ధి కలవాడవై, యోగివై, రాజధర్మమును పాలించుము.

కృష్ణోక్తో7థార్జునో7యుధ్యద్రథస్థో వాద్యశబ్దవాన్‌ | భీష్మః సేనాపతిరభూ దదౌ దౌర్యోధనే బలే. 4

పాణ్డవానాం శిఖాణ్డీ చ తయోర్యుద్దం బభూవ హ | ధార్తారాష్ట్రాః పాణ్డవాంశ్చ జఘ్నుర్యుద్ధే సభీష్మకాః. 5

ధార్తరాష్ట్రాన్శిఖణ్డ్యాద్యాః పాణ్డవా జఘ్నరాహవే | దేవసురసమం యుద్ధం కురుపాణ్డవసేనయోః 6

బభూవ ఖస్థ దేవానాం పశ్యతాం ప్రీతివర్ధనమ్‌ |

ఈ విధముగా కృష్ణుడు ఉపదేశించగా అర్జునుడు రథముపై నెక్కి, వాద్య శబ్దములు చేయుచు యుద్ధము చేసెను. మొదట దుర్యోధన సైన్యమునకు భీష్ముడు సేనాపతి యయ్యెను. పాండవలకు శిఖండి సేనాపతి అయ్యెను. ఆ రెండు సైన్యములకును యుద్ధము జరిగెను. భీష్మునితో కూడన కౌరవులు యుధ్ధమునందు పాండవులను కొట్టిరి. శిఖండి మొదలగు పాండవ పక్షీయులు యుద్ధమునందు కౌరవులను కొట్టిరి. కురుపాండవ సేనల మధ్య యుద్ధము, ఆకాశము నుండి చూచుచున్న దేవతలకు ప్రీతిని వృద్ధిపొందించుచు, దైవాసుర యుద్ధము వలె జరిగెను.

భీష్మో7సై#్త్రః పాణ్డవం సైన్యం దశాహోభిర్న్యపాతయత్‌. 7

దశ##మే హ్యర్జునో బాణౖర్భీష్మం వీరం వవర్ష హా | శిఖణ్డీ ద్రుపదోక్తో7సై#్త్రర్వవర్ష జలదో యథా. 8

హస్త్యశ్వరథపాదాతమన్యోన్యాస్త్రనిపాతితమ్‌ |

భీష్ముడు పది దివసములలో, అస్త్రములచే పాండవ సైన్యమును ధ్వంసము చేసెను. పదవ రోజున, అర్జునుడు వీరుడైన భీష్మునిపై బాణవర్షము కురింపించెను. ద్రుపదుడు ప్రేరేపించగా శిఖండి కూడ, మేఘమువలె అస్త్రములను వర్షించెను. పరస్పరము ప్రయోగించిన అస్త్రజాలముచే ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు నేలపై కూలెను.

భీష్మః స్వచ్ఛన్దమృత్యశ్చ యుద్దమార్గం ప్రదర్శ్య చ. 9

వసూక్తో వసులోకాయ శరశయ్యాగతః స్థితః | ఉత్తరాయణమీక్షంశ్చ ధ్యాయన్‌ విష్ణుం స్తువన్‌ స్థితః 10

స్వేచ్ఛామరణము గల భీష్ముడు తనతో ఎట్లు యుద్ధము చేయవలెనో పాండవులకు చెప్పి వసువులచేత ప్రేరితుడై, వసులోకమునకు తిరిగి వెళ్ళదలచి, శరశయ్యాగతుడై విష్ణువును ధ్యానించుచు, స్తుతించుచు, ఉత్తారాయణమునకై వేచి యుండెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹 

🌻. భారత వ్యాఖ్యానము - 5 🌻

దుర్యోధనే తు శోక్తార్తే ద్రోణః సేనాపతి స్త్వభూత్‌ | పాణ్డవే హర్షితే సైన్యే దృష్టద్యుమ్నశ్చమావతిః 11

దుర్యోధనుడు శోకార్తు డయ్యెను అపుడు ద్రోణుడు సేనాధిపత్యము వహించెను. సంతసించిన పాండవ సైన్యమున దృష్టద్యుమ్నుడు సేనాపతి అయ్యెను.

తయోర్యుద్దం బభూవోగ్రం యమరాష్ట్ర వివర్ధనమ్‌ | విరాటద్రుపదాద్యాశ్ఛ విమగ్నా ద్రోణసాగరే. 12

వారిరువురికిని యముని రాష్ట్రమును పెంచు యుద్ధము జరిగెను. ద్రోణుడను మహాసముద్రమునందు విరాట ద్రువదాదులు మునిగిపోయిరి.

దౌర్యోధనీ మహాసేనా హస్త్యశ్వరథపత్తనీ | దృష్ఠద్యుమ్నాధిపతినా ద్రోణః కాల ఇవాబభో. 13

హస్త్యశ్వరథవదాతులు గల దుర్యోధనసేన కూడ పాండవసేనాపతియైన దృష్ఠద్యుమ్ముని చేత (చంపబడెను). ద్రోణుడు యుద్దమునందు యముడు వలె కన్పట్టెను.

హతో7శ్వత్థామా చేత్యుక్తేద్రోణః శస్త్రాణి చాత్యజత్‌ | ధృష్టద్యుమ్నశరాక్రాన్తః పాతితః స మహీతలే. 14

వఞ్చమేహని దుర్ధర్షః సర్వక్షత్రం ప్రమథ్యం చ |

అశ్వత్థామ మరణించెను. అను మాట విని ద్రోణుడు ఆయుధములను విసర్జించెను. ఎదిరింప శక్యము కాని అతడు సర్వక్షత్రియులను సంహరించి ఐదవ దివసమున ధృష్టద్యుమ్నుని బాణములచే కొట్టబడి మరణించెను.

దుర్యోధనే తు శోకార్తేకర్ణః సేనాపతి స్త్వభూత్‌.15

అర్జునః పాణ్డవానాం చ తయోర్యద్ధం బభూవ హ | శస్త్రాశస్త్రి మహారౌద్రం దేవాసురరణోపమ్‌. 16

దుర్యధనుడు శోకార్తుడయ్యెను. అపుడు కర్ణుడు సేనాపతి ఆయెను. అర్జునుడు పాండవుల సేనాపతి ఆయెను వారిరువురును శస్త్రములతో ఒకరి నొకరు కొట్టుకొనగా భయంకరమైన, దేవాసురయుద్ధతుల్య మగు యుద్ధము జరిగెను.

కర్ణార్జునాఖ్యే సఙ్గ్రామే కర్ణో7రీనవధీచ్ఛరైః | ద్వితీయో7హని కర్ణస్తు అర్జునేన నిపాతితః. 17

కర్ణార్జునసంగ్రామమునందు కర్ణుడు బాణములతో శత్రువులను సంహరించెను. రెండవ రోజున కర్ణుని అర్జునుడు సంహరించెను.

శల్యో దినార్ధం యయుధే హ్యవధీత్తం యుధిష్ఠిరంః | యుయుధే భీమసేనేన హతసైన్యః సుయోధనః. 18

బహున్‌ హత్వా నరాదీంశ్చ భీమసేన మథద్రవత్‌ | గదయా ప్రహరన్తం తు భీమస్తం హి వ్యపాతయత్‌.

గదయాన్యానుజాం స్తస్య తస్మిన్నష్టాదశే7హని |

శల్యుడు సేనాధిపత్యమును వహించి అర్ద దివనము యుద్దము చేసెను. యుధిష్ఠిరు డాతనిని సంహరించెను. సైన్యము నశించగా సుయోధనుడు భీమసేనునితో యుద్ధము చేసెను. చాలమంది సైనికులు మొదలగు వారిని చంపి అతడు భీమసేనుని మీదకు వెళ్ళెను. భీమసేనుడు గదతో యుద్ధము చేయుచున్న ఆతనిని ఆతని తమ్ములను పదు నెనిమిదవ దినమున పడగొట్టెను.

రాత్రౌ సుషుప్తం చ బలం పాణ్డవానాం న్యపాతయత్‌. 20

అక్షౌహిణీ ప్రమాణం తు అశ్వత్థామా మహాబలః | ద్రౌపదేయాన్‌ స పాఞ్చాలాన్‌ దృష్టద్యుమ్నం చ సో7వధీత్‌.

మహాబలశాలి యైన అశ్వత్థామ, రాత్రియందు నిద్రించుచున్న, పాండవుల, అక్షౌహిణీప్రమాణము గల సేనను ద్రౌపదీపుత్రులను, పాంచాలులను, ధృష్టద్యుమ్నుని చంపెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 35 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 14
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భారత వ్యాఖ్యానము - 6 🌻

పుత్రహీనాం ద్రౌపదీం తాం రుదన్తీమర్జున స్తతః | శిరోమణిం చ జగ్రాహ ఐషీకాస్త్రేణ తస్య చ. 22

పిమ్మట అర్జునుడు పుత్రహీనురాలై విలపించుచున్న ద్రౌపదిని చూచి ఆమెను ఓదార్చుటకై, ఐషీకాస్త్రముచే అశ్వత్థామ శిరోమణిని గ్రహించెను.

అశ్వత్థామాస్త్రనిర్దగ్థం జీవయామాస వై హరిః | ఉత్తరాయాస్తతో గర్భం స పరీక్షిదభూన్నృపః . 23

శ్రీ కృష్ణుడు అశ్వత్థామాస్త్రముచే దహింపబడుచున్న ఉత్తరాగర్భమును రక్షించెను. పిమ్మట ఆ గర్భన్ధశిశువు పరీక్షిన్మహారాజు ఆయెను.

కృతవర్మా కృపో ద్రౌణిస్త్రయోముక్తాన్తతో రణాత్‌ | పాణ్డావాః సాత్యకిః కృష్ణః సప్తముక్తా న చాపరే. 24

ఆ యుద్దమునుండి, కృతవర్మ కృపాచార్యులు, అశ్వత్థామ అను ఈ ముగ్గురు మాత్రమే ప్రాణములతో బయటపడిరి. పాండవ పక్షమున పంచపాండవులు, సాత్యకి, కృష్ణడు ఈ ఏడుగురు మాత్రమే మిగిలిరి. మరెవ్వరును మిగలలేదు.

స్త్రియశ్చార్తాః సమాశ్వాస్య భీమాద్యైః స యుధిష్ఠిరః | సంస్కృత్య ప్రహతాన్వీరాన్దత్తోదకధనాదికః 25

భీష్మాచ్ఛాన్తనవాచ్ఛ్రుత్వా ధర్మాన్‌ సర్వాంశ్చ శాన్తిదాన్‌ |

రాజధర్మాన్‌ మోక్షధర్మాన్‌ దానధర్మాన్నృపో7భవత్‌. 26

అశ్వమేధ దదౌ దానం బ్రహ్మణభ్యో7రి మర్దనః |

యుధిష్ఠిరుడు దుఃఖర్తాలైన స్త్రీలను ఓదార్చి, భీమాదినమేతుడై, మరణించిన వీరు లందరికిని ప్రేత సంస్కారములను చేసి, వారికై ఉదక ధనాదిదానములు చేసి, శంతనుకుమారుడైన భీష్మునినుండి శాంతిని కలిగించు సమస్త ధర్మములను, రాజధర్మములను, మోక్షధర్మములను, దానధర్మములను విని, రాజయ్యెను. éశత్రుసంహారి యైన ఆతడు ఆశ్వమేధ మాచరించి, బ్రాహ్మణులకు దానము లిచ్చెను.

శ్రుత్వార్జునాన్మౌసలేయం యాదవానాం చ సంక్షయమ్‌ | రాజ్యే పరీక్షితం స్థాప్య సానుజః స్వర్గమాప్తవాన్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మహాభారతాఖ్యానం నామ చతుర్దోశో7ధ్యాయః

ముసలము పుట్టి యాదవు లందరును నశించి రను విషయమును అర్జునునినుండి తెలిసికొని పరీక్షిత్తను రాజ్యాభిషిక్తుని చేసి, సోదరసహితుడై స్వర్గము చేరెను.

అగ్ని మహాపురణమునందు మహాభారతఖ్యాన మను చతుర్దశాధ్యాయము సమాప్తము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹