Wednesday, 8 July 2020

పాండవ చరిత వర్ణనము

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 36 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 15
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 🌻. పాండవ చరిత వర్ణనము - 1 🌻

అథ పాణ్డవ చరిత వర్ణనమ్‌.

అగ్నిరువాచ :

యుధిష్ఠరే తు రాజ్యస్థే ఆశ్రమాదాశ్రమాన్తరమ్‌ | ధృతరాష్ట్రో వనమగాద్గాన్ధారీ చ పృథా ద్విజత 1

అగ్ని పలికెను: ఓ ద్విజుడా! యుద్ధిష్ఠురుడు రాజ్యము చేయుచుంéడగా ధృతరాష్ట్రడును, గాందారియు, కుంతియు, అరణ్యమునకు వెళ్ళి ఒక ఆశ్రమమునుండి మరి యొక ఆశ్రమమునకు సంచరించుచుండిరి.

విదురస్త్వగ్ని నా దగ్ధో వనజేన దివం గతః | ఏవం విష్ణుర్భువో భారమహరద్ధానవాదికమ్‌. 2

ధర్మాయాధర్మానాశాయ నిమిత్తీకృత్య పాణ్డవాన్‌ | స విప్రశాపవ్యాజేన ముసలేనాహనత్కులమ్‌. 3

యాదవానాం భారకరమ్‌-

విదురుడు దావాగ్నిచే దగ్ధుడై మృతి చెందెను. ఈ విధముగ మహావిష్ణువు పాండవులను నిమిత్తముగ చేసి కొని, ధర్మరక్షణముకొరకును, అధర్మవినాశమునకు, పూనుకొని దానవాదిక మగు భూభారమును హరించెను. విప్రశాప మను వంకచే, ముసలముచే, భూభారకర మగు యాదవకులమును నశింపచేసెను.

వజ్రం రాజ్యే7భిషేచయత్‌ | దేవాదేశాత్ర్పభాసే స దేహం త్యక్త్వా స్వయం హరిః 4

ఇన్ద్రలోకే బ్రహ్మలోకే పూజ్యతే స్వర్గవాసిభిః | బలభద్రో7నన్తమూర్తిః పాతాల స్వర్గమీయివాన్‌. 5

శ్రీకృష్ణుడు వజ్రుని రాజ్యాభిషిక్తుని చేసి దేవతల ఆదేశమునే ప్రభాసక్షేత్రమునందు తన దేహమును పరిత్యజించి, ఇంద్రలోక బ్రహ్మలోకములందు స్వర్గవాసులచే పూజింపబడెను. బలరాముడు ఆదిశేషరూపధారి యై పాతాళ స్వర్గము చేరెను.

అవినాశీ హరిర్దేవో ధ్యానిభిర్ధ్యేయ ఏవ సః | వినా తం ద్వారకాస్థానం ప్లావయామాస సాగరః. 6

వినాశరహితు డగు ఆ శ్రీ హరి యోగులచే ధ్యానింపబడు వాడు. అట్టి శ్రీ కృష్ణుడు లేని ద్వారకను సముద్రము ముంచివేసెను.

సంస్కృత్య యాదవాన్‌ పార్థో దత్తోదకధనాదికః | స్త్రియో7ష్టావక్రశాపేన భార్యా విష్ణోశ్చ యాః స్థితాః. 7

పునస్తచ్ఛాపతో నీతా గోపాలైర్లగుడాయుధై ః | అర్జునం హి తిరస్కృత్య పార్థః శోకం చకార హ. 8

వ్యాసేనాశ్వాసితో మేనే బలిం మే కృష్ణసన్నిధౌ య | హస్తినాపురమాగత్య పార్థః సర్వం న్యవేదయత్‌. 9

యుధిష్టిరాయ స భ్రాత్రే పాలకాయ నృణాం తదా |

అర్జునుడు యాదవులకు ప్రేత సంస్కారాదులు చేసి ఉదకధనాదిదానములు చేసెను.

అష్టావక్రుని శాపముచే విష్ణుభార్యలుగా అయిన స్త్రీలను, మరల అతని శాపము చేతనే, కఱ్ఱలు ఆయుధములుగా గల రోపాలకులు అర్జునుని ఓడించి తీసికొని పోయిరి. అర్జునుడు చాల శోకించెను.

వ్యాసు డాతనిని ఊరడించెను. కృష్ణుడున్నప్పుడే నా బలము అని అతడు గ్రహించెను. అతడు హస్తినాపురమునకు వచ్చి, రాజ్యపాలకు డైన యుధిష్ఠిరునకు ఇది యంతయు చెప్పెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 37 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 15
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. పాండవ చరిత వర్ణనము - 2 🌻

తద్థనుస్తాని చాస్త్రాణి స రథస్తే చ వాఇనః. 10

వినా కృష్ణేన తన్నషటం దానం చాశ్రోత్రియే యథా |

కృష్ణుడు ఈ లోకమును విడచి వెళ్ళిపోయిన తోడనే అర్జునుని అదే ధనస్సు, అవే అస్త్రములు, అదే రథము, అవే గుఱ్ఱములు, అవన్నియు శ్రోత్రియుడు కాని వానికి ఇచ్చిన దానము వలె నష్టమైపోయెను.

తచ్ర్ఛుత్వా ధర్మరాజస్తు రాజ్యే స్థాప్య పరీక్షితమ్‌.

ప్రస్థానం ప్రస్థితో ధీమాన్‌ ద్రౌపద్యా భ్రాతృభిః సహ | సంసారానిత్యతాం జ్ఞాత్వా జపన్నష్టశతం హరేః. 12

ధర్మరాజు ఆ వార్త విని, పరీక్షిత్తును రాజ్యపాలనకై నియోగించి, ఈ సంసార మనిత్య మను విషయము గ్రహించినవాడై, ద్రౌపదియు, సోదరులును వెంట రాగా, మహావిష్ణుని అష్టోత్తరశతనాముములు జపించుచు మహా ప్రస్థానమున బయలుదేరెను.

మహాపథే తు పతితా ద్రౌపదీ సహదేవకః | నకులః ఫల్గునో భీమో రాజా వోకపరాయణః. 13

ఇన్ద్రానీతరథారూఢః సానుజః స్వర్గమా స్తవాన్‌ | దృష్ట్వా దుర్యోధనాదీంశ్చ వాసుదేవం చ హర్షితః. 14

ఏత త్తే భారతం ప్రోక్తం యః పఠేత్స దివం వ్రజేత్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మహాభారతాఖ్యానం నామ పఞ్చదశో7ధ్యాయః.

ఆ మహాప్రస్థానమునందు ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడును పడిపోయిరి. రాజు శోకాతురుడయ్యెను. ఆతడు ఇంద్రుడు తీసికొని వచ్చిన రథము నధిరోహించి, సోదరనహితుడై స్వర్గము చేరెను. ఆచట దుర్యోధనాదులను, వాసుదేవుని చూచి సంతసించెను. నీ కీ భారతకథను చెప్పితిని. దీనిని పఠించినవారు స్వర్గమునకు వెళ్లెదరు.

అగ్ని మహాపురాణములో మహాబారతాఖ్యాన మను పంచదశాధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment