Friday 28 February 2020

యుద్ధ కాండము-43

: శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-43
సీత అగ్ని ప్రవేశము

రామాజ్ఞతో, విభీషణుడు వేగముగా అంతఃపురమునకు వెళ్లి తమ స్త్రీలతో అశోకవనమునకు యేగి సీతకు స్నానాది కార్యములు చేయించి దివ్యాభరణములతో అలంకరించి, పల్లకి యందు సీతమ్మను గూర్చుండ జేసి వేగముగా శ్రీరామ సన్నిధికి తోడ్కొని రావలసినదిగా ఆజ్ఞాపించగా వారు అట్లే చేసిరి. అప్పుడు రాముడు ధ్యానమందుండెను. అది తెలిసియు విభీషణుడు వారి యొద్దకు వెళ్లి నమస్కరించి సీతాదేవి వచ్చినదియని తెలిపెను. రావణ భవనంలో సీత ఒక సంవత్సరము ఉన్నదని రామునకు హర్షము, దైన్యము, రోషము కలిగెను. బంధము వీడి నందుకు హర్షము, రావణుని చెరలో దుఃఖముతో ఉన్నందుకు దైన్యము, ఆమెను తిరస్కరించబోవుతున్నందుకు రోషము వచ్చెను. విభీషణుడు సీత వచ్చుచున్నదని త్రోవలో ఎవరు ఉండరాదని ఆజ్ఞాపించగా, శ్రీరాముడు విభీషణునితో ఇట్లు పలికెను.

న గృహాణి న వస్త్రాణి న ప్రాకారా స్తిరస్క్రియాః
నేదృశా రాజ సత్కారా వృత్తమ్ ఆవరణం స్త్రియాః  6.117.26

విభీషణా! ఇల్లు, వస్త్రములు, ప్రాకారములు మున్నగునవి గాని, జనులకు దూరముగా పంపివేయుటకు గాని, ఇట్టి రాజ సత్కారములు స్త్రీకి ఆచ్చాదనమును కలుగ జేయవు. ఆమె సదాచారమే ఆమెకు ఆచ్చాదము. కావున సీత పల్లకి విడిచి నా యొద్దకు వచ్చుగాక. తదుపరి సీత వినయపూర్వకముగా తన సమీపమున నిలబడి యుండుట జూచి, ఆమెతో శ్రీరాముడు తన అభిప్రాయమును ఈ విధముగా చెప్పెను. "నీవు ఆశ్రమమున ఒంటరిగా యున్నప్పుడు రాక్షసుడు నిన్ను తీసుకొని పోయెను. ఆ దోషము నాకు దైవ వశమున సంప్రాప్తించినది. దానిని నేను మానవ సాధ్యమగు ప్రయత్నముచే తొలగించుకొంటిని. శత్రు హస్తమున పడిన నిన్ను చూచి ఓర్వలేక ఆనాడు తపఃశ్శాలి అయి ఆత్మదర్శనము చేసిన అగస్త్యుడు దక్షిణ దిక్కును పొందినట్లు నిన్ను పొందితిని.

సంప్రాప్తమ్ అవమానం య స్తేజసా న ప్రమార్జతి
క స్తస్య పురుషా౭ర్థోఽస్తి పురుష స్యా౭ల్ప తేజసః 6.118.6

ఎవడు సంప్రాప్తించిన అవమానమును తన తేజస్సు చేతను, బలము చేతను తొలగించుకోలేడో, మందబుద్ధియగు అట్టి వానికి గొప్ప పురుషార్థముల వలన ఏమి లాభము? శ్రీరామునికి హృదయములో సీతమ్మ మీద ఎటువంటి సందేహము లేకున్నను, లోకము దృష్టిలో ఎటువంటి అనుమానమునకు తావీయరాదు అని ఆలోచన చేసెను. లోకోపవాదము అనునది ఆయన దృష్టిలో కంటి జబ్బు వలె ఏర్పడినది. కంటికి దీపమును చూడగలిగిన శక్తి యున్నను, జబ్బు గల కన్ను దీపమును ఎలా చూడలేదో అట్లే రాజు కాబోవు రాముని దృష్టికి ప్రజాపవాదమను జబ్బు ఏర్పడినది. ఇంకను రాముడు సీతతో -- ఇప్పుడు నీ చరిత్ర యందు సందేహమునకు అవసరమేర్పడినది. ఆ వాక్యములను విని సీత కన్నీటిచే తడిచిన ముఖమును వస్త్రముచే తుడుచుకొనుచు మెల్లమెల్లగా గద్గద స్వరముతో పతిదేవునితో ఇట్లు పలికెను. 

న తథా౭స్మి మహా బాహో యథా త్వమ్ అవగచ్ఛసి
ప్రత్యయం గచ్ఛ మే యేన చారిత్రే ణైవ తే శపే 6.119.6

మహాబాహు! ఇపుడు మీరు నన్నెట్లు ఊహ చేయుచున్నారో అట్టి దానను నేను కాదు. నన్ను విశ్వసింపుడు. నేను నా సదాచారముపై ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. నేను సందేహింప దానిని కాదు. ఇట్లు చెప్పుచుండ సీత యొక్క కంఠము నిరుద్ద మయ్యెను. ఆమె ఏడ్చుచు, కన్నీరు కార్చుచు, దుఃఖపూరితయై, చింతానిమగ్నయై అచట యున్న లక్ష్మణునితో గద్గద స్వరముతో ఇట్లు పలికెను. "సుమిత్రా నందనా! నా కొరకు చితిని తయారు చేయుము. నా ఈ దుఃఖమునకు ఇదియే మందు. మిధ్యా కళంకితయై నేను జీవించ దలచి లేదు. లక్ష్మణుడు, రాముని మనసును గ్రహించి చితిని సిద్ధము చేసెను. తదుపరి సీత రామునికి ప్రదక్షిణము చేసి ప్రజ్వరిల్లుచున్న అగ్నిహోత్రము వద్దకు చేరెను.

ప్రణమ్య దేవతాభ్య శ్చ బ్రాహ్మణేభ్య శ్చ మైథిలీ
బద్ధా౭౦జలిపుటా చేదమ్ ఉవాచా౭గ్నిసమీపతః     6.119.23

యథా మే హృదయం నిత్యం నా౭పసర్పతి రాఘవాత్
తథా లోకస్య సాక్షీ మాం సర్వతః పాతు పావకః        6.119.24

కర్మణా మనసా వాచా యథా నాతి చరామ్య౭హం
రాఘవం సర్వ ధర్మజ్ఞం యథా మాం పాతు పావక:   6.119.26

ఆదిత్యో  భగవాన్ వాయు: దిశ శ్చంద్ర స్తథైవ చ
అహ శ్చా౭పి తథా సంధ్యే రాత్రి శ్చ పృథివీ తథా     6.119.27

యథా౭న్యే౭పి విజానంతి తథా చారిత్ర సంయుతామ్
ఏవ ముక్త్వా తు వైదేహీ పరిక్రమ్య హుతాశనమ్        6.119.28

సీత, దేవతలకు, బ్రాహ్మణులకు నమస్కరించి చేతులు జోడించుకొని అగ్నిదేవుని సమీపాన ఈ విధముగా చెప్పెను. "నా హృదయము ఒక్క క్షణమైనను శ్రీరాముని నుండి దూరముగా లేనిచో, సమస్త జగత్తుకు సాక్షియగు అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక! కర్మచేతను, వాక్కు చేతను, మనస్సు చేతను, సర్వ ధర్మజ్ఞుడగు శ్రీరామునికి నేను అతిక్రమించనిచో అగ్నిదేవుడు నన్ను రక్షింసీబు గాక! భగవంతుడగు సూర్యుడు, వాయువు, దిక్కులు, చంద్రుడు, పగలు, రాత్రి, సంధ్యలు, భూదేవి, ఇతర దేవతలు నన్ను శుద్ధ చరిత్రతో గూడిన దానినిగా ఎరింగినచో అగ్నిదేవుడు నన్ను రక్షించు గాక!

ఈ ప్రకారముగా చెప్పి సీత అగ్నిదేవునకు ప్రదక్షిణము సెల్ఫీ నిశ్శంకతో గూడిన హృదయముతో ఆ ప్రజ్వలితాగ్ని యందు ప్రవేశించెను.  ఆ సమయమున విశ్రవసుని పుత్రుడగు కుబేరుడు, పితరులతో కూడి యమధర్మరాజు, దేవతల ప్రభువగు ఇంద్రుడు, జలాధిపతియగు వరుణుడు, త్రినేత్రధారియైన పరమశివుడు, బ్రహ్మదేవుడు మొదలగువారు వారివారి వాహనములతో లంకానగరమునకు వచ్చిరి. రాముడు ఏమియు ఎరుగని వానివలె చేతులు జోడించి నిలిచి యుండెను. వారు శ్రీరామునితో - "రామా! నీవు సర్వలోక సృష్టికర్తవు. సర్వజ్ఞుడవు. సీత అగ్నిహోత్రములో పడుట చూచి ఉపేక్షించుట తగునా! మీరు సమస్త దేవతల యందు శ్రేష్ఠుడవగు 'విష్ణువు'. ఈ విషయమును మీరు ఎలా తెలుసుకొనుట లేదు?"
శ్రీరామ జయరామ జయజయ రామ
Only admins can send messages

Thursday 27 February 2020

యుద్ధ కాండము-42

[05:48, 28/02/2020] +91 96180 14862: శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-42
శ్రీరాముని విజయ వార్త సీతాదేవికి తెలుపుట
‌శ్రీరాముడు తన ప్రక్కనే యున్న హనుమతో; "హనుమా! మహారాజగు విభీషణుని అనుమతితో, నీవు లంకలో ప్రవేశించి, రావణ భవనమునకు వెళ్లి విభీషణుని విజయమునకు అతనిని అభినందించుము. అటనుండి వైదేహి వద్దకు యేగి, లక్ష్మణునితో, సుగ్రీవునితో కలసి మేము కుశలముగా యున్నామని, రావణ సంహార మైనదని చెప్పుము. ప్రియమైన ఈ వృత్తాంతమును ఎఱింగించి, ఆమె సందేశమును తీసుకొని రమ్ము" అని ఆదేశించి పంపెను. రామాజ్ఞచే వెంటనే హనుమ అశోకవనమున ప్రవేశించి శరీర సంస్కారము లేకుండా, గ్రహ పేడతో కూడిన రోహిణి నక్షత్రము వలె వృక్షమూలమున ఆనందము లేనిదై రాక్షస స్త్రీలతో ఆవరింపబడి యున్న సీతను చూచెను. హనుమ సీతను చూచి నమస్కరించగా ఆ వచ్చినవాడు తాను పూర్వము చూచిన రామదూతయైన హనుమయేనని  సీతమ్మ గుర్తించెను.  హనుమ  సీతతో; అమ్మా! శ్రీరాముడు తన కుశల వార్త మీకు తెలియ జేయమన్నాడు. రావణుని చంపి  నిన్ను విముక్తి చేయవలెనని ప్రతిజ్ఞ పూని రావణ సంహారము చేసి యున్నాడు. హనుమ ఇట్లు చెప్పగనే సీత మనసు సంతోషముతో ఉప్పొంగినది. ఆనందముతో మాట రాక చూచుచు ఊరకుండెను. అప్పుడు హనుమ అమ్మా! నాతో మాటాడవేమి? అప్పుడు సీత హర్షముతో తొట్రువడుతున్న కంఠముతో పరమ ప్రీతితో ఇట్లు పలికెను. "హనుమా! ప్రభువు విజయ వార్తను వినుట తోడనే మనసున కలిగిన హర్షముచే మాట రాలేదు. ఈ భూమిలో ఇంత మంచి వార్తను ఎఱింగించిన నీకు కానుకగా సమర్పించుటకు ఏమియు లేదని మాటరాక ఊరకుంటిని. నీవు చెప్పిన ప్రియ వచనములను ప్రియమైన వస్తువు ఏదియు కానరావడం లేదు. (అదియే శ్రీరాముడు హనుమను గాడాలింగనము చేసుకొనెను. కానీ సీతమ్మకు అది కుదరదు కదా!)అప్పుడు హనుమ; అమ్మా!  నీవు చెప్పిన ఈ మాట పరమ ప్రీతిని కలిగించినది. హనుమ వాక్యములను విని సీత పరమ ప్రీతితో; ఆనాడు పంపాతీరమున రాముని ప్రశంసలు అందుకొన్నావు. హనుమను సీతమ్మ ఈ విధముగా ప్రశంసించుచున్నది. "నీమాట లోకాతీతమగు లక్షణములతో సంపన్నమైనది. వాక్యము నందలి పదముల ఆకాంక్ష, యోగ్యత, సన్నిధి మొదలగునవి అన్నియు ఉన్నవి. శబ్ద సాధుత్వము భంగపడుట లేదు. వినుటకు ఎంతో మధురముగా యున్నది. నీ బుద్ధి అష్టాంగ సంపన్నమైనది. బుద్ధికి ఎనిమిది అంగములు యుండవలెను. అవి గ్రాహములు, ధారణము, స్మరణము, ప్రతిపాధనము, ఊహ, అపోహ, అర్థవిజ్ఞానము, తత్వజ్ఞానము. ఇవియన్నియు నీకు యున్నవి."  సీతమ్మ ఇట్లు ప్రశంసింపగా చేతులు జోడించి అమ్మా! ఈ రాక్షస స్త్రీలు పూర్వము నేను వచ్చినప్పుడు నిన్ను బెదిరించి దూషించుట చూచాను. ఇప్పుడు నీ ఆజ్ఞ అయినచో నేను వారిని అందరిని సంహరించవలెనని అనుకొంటున్నాను. హనుమ ఇట్లు పలుకగానే వైదేహి ధర్మబద్ధముగా ఇట్లు పలికెను.
రాజ సంశ్రయ వశ్యానాం కుర్వతీనాం పరా౭౭జ్ఞయా
విధేయానాం చ దాసీనాం కః కుప్యే ద్వానరోత్తమ     6.116.38
భాగ్య వైషమ్య యోగేన పురా దుశ్చరితేన చ
మ యైతత్ ప్రాప్యతే సర్వం స్వ కృతం హ్యుపభుజ్యతే            6.116.39
ప్రాప్తవ్యం తు దశా యోగాన్ మయై తదితి నిశ్చితమ్
దాసీనాం రావణస్యా౭హం మర్షయా మీహ దుర్బలా  6.116.40
ఆజ్ఞప్తా రావణే నైతా రాక్షస్యో మామ్ అతర్జయన్
హతే తస్మిన్ న కుర్యుర్ హి తర్జనం వానరోత్తమ      6.116.41
ఈ రాక్షస స్త్రీలు రాజసేవాపరాయణులు. తమ ప్రభువు చేయమనిన పనిని చేయువారలు. పరతంత్రులు. వారు రావణుని దాసీలు. దాసీలపై కోపము తెచ్చుకొనువాడు ఎవరైనా ఉందురా? దాసీలను శాసించిన ప్రభువుపై కోపగించి వలెనే గాని దాసీలపై కాదు. నా దురదృష్టము వలన, పూర్వము ఒనర్చిన దుష్కృతముల వలన నాకు ఈ కష్టములు దాపురించినవి. కనుక వారిని క్షమింపుము.
న పరః పాపమ్ ఆదత్తే పరేషాం పాప కర్మణామ్
సమయో రక్షితవ్య  స్తు సన్త  శ్చారిత్ర  భూషణాః 6.116.43
పాపానాం వా శుభానాం వా వధా౭ర్హాణాం ప్లవంగమ
కార్యం కరుణమ్ ఆర్యేణ న కశ్చిన్ నా౭పరాధ్యతి  6.116.44
లోక హింసా విహారాణాం రక్షసాం కామ  రూపిణమ్
కుర్వతామ్ అపి పాపాని నైవ కార్యమ్ అశోభనమ్ 6.116.45
శ్రేష్ఠుడగువాడు ఇతరులకు చెడ్డచేయు పాపుల యొక్క పాపకర్మను స్వీకరించడు. మరియు త్రిగి వారి యడల పాపపూర్ణమగు ప్రవర్తనమును గావించదలచడు. ఏలయన సాధుపురుషుడు తన ఉత్తమ చరిత్రతోనే విభూషితుడు అగుచున్నాడు. సదాచారమే అతని భూషణమైనది. శ్రేష్ఠుడైనవాడు పాపియైనను, పుణ్యాత్ముడైనను వధింపయోగ్యమైన అపరాథమొనర్చిన వాడైనను, వారందరి యడల దయగలిగి యుండవలెను. ఏలయనిన అపరాథమెపుడు చేయనట్టి ప్రాణి సామాన్యముగా ఎవడును ఉండడు. జనులను హింసించువారు, సదా పాపమునే ఆచరించు వారునగు క్రూర స్వభావము గల పాపులకు కూడా అమంగళమును చేయరాదు.
సీత ఇట్లు వచింప వాక్యకోవిదుడగు హనుమ సతియు, సాధ్వియు, శ్రీరామపత్నియు అగు సీతతో ఇట్లు పలికెను. "తల్లీ! మీరు శ్రీరాముని ధర్మపత్ని. కావున అట్టి సద్గుణములతో గూడి యుండుట సముచితమే. ఇక ఇప్పుడు మీ యొక్క సందేశమును చెప్పుడు". అప్పుడు సీత "హనుమా! నేను భక్తవత్సలుడైన శ్రీరాముని దర్షింప గోరుచున్నాను" అని చెప్పెను. అటు పిమ్మట, హనుమ శ్రీరామునకు సీతా సందేశమును వినిపించగా: శ్రీరాముడు విభీషణునితో సీతమ్మను తల స్నానము చేయించి, దివ్యాభరణములతో అలంకరించి తీసుకొని రమ్మని చెప్పెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

యుద్ధ కాండము-41

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-41
విభీషణుని పట్టాభిషేకము
దేవతలు, గంధర్వులు మొదలగు వారు ఆకాశములో నిలిచి రావణ సంహారమునకు హర్షము వ్యక్తం చేసి, ఆ వృత్తాంతమును చెప్పుకొనుచు తమ స్థానములకు ఎగిరి. శ్రీరాముడు ఇంద్రుని రథమును వెనుకకు పంపెను. తరువాత శ్రీరాముడు సుగ్రీవుని గాఢముగా ఆలింగనము చేసుకొనెను. శ్రీరాముడు, లక్ష్మణునితో "లక్ష్మణా! విభీషణుడు మనపై అనురాగము గల భక్తుడు. నాకు ఎంతయో ఉపకారము చేసినాడు. వెనుక సముద్ర తీరమున విభీషణునకు లంకారాజ్యాభిషేకము చేసినను, ఇప్పుడు విభీషణునికి సింహాసనాధీస్టుని చేసి మకుట ధారణ చేయవలెను". అని చెప్పెను. శ్రీరాముని అభిప్రాయము ప్రకారము సీతమ్మను చేపట్టుటకు ముందే శరణాగతుడైన విభీషణుని లంకారాజ్యాభిషేకము ముఖ్యము. సోదరుని అభిప్రాయము ఎరిగిన లక్ష్మణుడు వానరులతో బంగారు కలశములో సముద్ర జలములు తెప్పించెను.లంకానగర ప్రవేశము చేసినచో తన అరణ్య వాసమునకు భంగమగునని శ్రీరాముడు నగర ప్రవేశమే చేయక లక్ష్మణుని పంపెను.
తత స్త్వేకం ఘటం గృహ్య సంస్థాప్య పరమా౭౭సనే
ఘటేన తేన సౌమిత్రి: అభ్యషి౦చ ద్విభీషణమ్         6.115.14
ల౦కాయాం రక్షసాం మధ్యే రాజానం రామ శాసనాత్
విధినా మంత్ర దృష్టేన సుహృ ద్గణ సమా వృతం      6.115.15
అభ్యషి౦చత్ స ధర్మాత్మా శుద్ధాత్మానం విభీషణమ్
త స్యా౭౭మాత్యా జహృషిరే భక్తా యే చా౭స్య రాక్షసాః 6.115.16
రామాజ్ఞచే లక్ష్మణుడు జలపూర్ణమగు ఘటమును తన చేతిలో పట్టుకొని విభీషణుని సింహాసనంపై కూర్చుండ జేసి రాక్షసులందరు చూచుచుండగా మంత్రహితముగా లంకారాజుగా అభిషేకించెను. రాక్షస మంత్రులు మొదలగు వారు యుద్ధములో పోయినందుకు విభీషణుని ఓదార్చి లక్ష్మణుడు, శ్రీరాముని సన్నిధికి చేరెను.  
ఈ విధముగా విభీషణుని పట్టాభిషేకము ఈశ్వర నామ సంవత్సర చైత్ర శుద్ధ తదియ నాడు జరిగినట్లుగా బ్రహ్మాండ పురాణము తెలియు చున్నది.
శ్రీరామ జయరామ జయజయ రామ

Tuesday 25 February 2020

యుద్ధ కాండము-40

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-40
పతి వియోగమునకు మండోదరి విలపించుట
అచింత్యములగు గొప్ప కర్మల నాచరించు శ్రీరామునిచే చంపబడిన తన భర్తయగు రావణుని చూచి మండోదరి దీనురాలై మహాదుఃఖమును పొంది ఈ ప్రకారముగా విలపింప దొడగెను.
ఇన్ద్రియాణి పురా జిత్వా జితం త్రి భువన౦ త్వయా
స్మరద్భి: ఇవ త ద్వైరమ్ ఇన్ద్రియై: ఏవ నిర్జితః 6.114.18
అవశ్య మేవ లభతే ఫలం పాపస్య కర్మణ:             6.114.25
ఘోరం పర్యాగతే కాలే కర్తా నా౭స్త్య౭త్ర సంశయ:
శుభ కృత్ శుభ మా౭౭ప్నోతి పాప కృత్ పాప మ౭శ్నుతే 6.114.26
విభీషణ స్సుఖం ప్రాప్త స్త్వం ప్రాప్త: పాప మీదృశం
నాథా! మొదట మీరు ఇంద్రియములను జయించియే ముల్లోకములపై విజయమును పొందిరి. ఆ వైరమును జ్ఞప్తియందుంచుకొని ఏమో ఇప్పుడా ఇంద్రియములే మిమ్ములను ఓడించి వేసినవి. మీరు శ్రీరామునితో విరోధము పెట్టుకొనవద్దని ఎన్ని సార్లో చెప్పితిని. కానీ నా మాటలు పెడ చెవిని పెట్టితిరి. దాని ఫలితమే ఈనాడు లభించినది. సమయము  వచ్చినప్పుడు  కర్తకు తన పాపకర్మ యొక్క ఫలము తప్పక లభించును.   శుభకర్మ నొనర్చు వానికి ఉత్తమ ఫలము లభించును. పాపకర్మము చేయువానికి పాపఫలమగు దుఃఖము సంభవించును. విభీషణునకు తన శుభ కర్మల వలననే సుఖము సంప్రాప్తించింది. నీవిట్టి దుఃఖమును అనుభవించ వలసి వచ్చినది. మీ ఇంటి యందు సీత కంటే ఎక్కువ సౌందర్యము గల యువతులెందరో గలరు. కానీ మీరు కామవశులై ఈ విషయమును తెలుసుకొన లేక పోయిరి. మీరు ప్రపంచమును అంతయును క్షోభ పెట్టితిరి. సాదు మహాత్ములను హింసించితిరి. శత్రువుల చెంత బలపూర్వక, అహంకార పూరితములైన మాటలను పలికితిరి. మీరు పెక్కురు కులకాంతులను, గురుసేవాతత్పరులైన స్త్రీలను, ధర్మ పరాయణులైన వారిని విధవలుగా చేసి వారిని అవమానించితిరి.
ప్రవాద: సత్య ఏవా౭యం  త్వాం ప్రతి ప్రాయశో నృప
పతివ్రతానాం నా౭కస్మాత్ పతన్త్య శౄణి భూతలే 6.114.67
మహారాజా! పతివ్రతలు యొక్క కన్నీరు ఈ భూమిపై వ్యర్థముగా పడరాదు. అట్లు పడినచో పెక్కు అనర్థములు సంభవించును అనునది పెద్దల మాట. ఆ జనశ్రుతి నీ విషయమున ఇప్పుడు సత్యమైనది. మీరు మీ యొక్క తేజముచే ముల్లోకములను ఆక్రమించి మిమ్ము మీరు గొప్ప శూరులుగా తలచుకొంటిరి. కానీ ఒక పరాయి స్త్రీని దొంగిలించునంతటి నీచ కార్యమును మీరేల చేసితిరి.
కామ క్రోధ సముత్థేన వ్యసనేన ప్రస౦గినా
నిర్వృత్త స్త్వ త్కృతే౭నర్థ: ౭సోయం మూల హరో మహాన్ 6.114.73
త్వయా కృతమ్ ఇదం సర్వమ్ అనాథం రక్షసాం కులమ్
మారీచ కుంభకర్ణాభ్యాం వాక్యం మమ పితు స్తదా   6.114.78
న శ్రుతం వీరమత్తేన తస్యేదం ఫల మీద్రుశం
కామక్రోధముల వలన ఉత్పన్నమైన దోషముచే ఈ ఐశ్వర్యమంతయు నశించి పోయినది. మరియు సమూలంగా వినాశమొనర్చు ఈ గొప్ప అనర్థము సంప్రాప్తించినది. నేడు సమస్త రాక్షస వంశమును మీరు అనాథమొనర్చితిరి. మీరు మీ బలమును గూర్చిన గర్వముచే మత్తెక్కి యుంటిరి. అందుచే మారీచుడు, కుంభకర్ణుడు, నా తండ్రి చెప్పిన మాటలను సమ్మతించ కుంటిరి. దాని ఫలితమే ఇపుడు మీకు సంభవించినది. ఇట్లు మండోదరి కన్నీరు నిండిన కన్నులతో విలపించి మూర్ఛ నొందెను. అప్పుడామె సవతులిట్లు పలికిరి. మహారాణీ! ప్రపంచము యొక్క స్వరూపము అస్థిరమని మీకు తెలియదా? పరిస్థితి మారినప్పుడు రాజుల సంపద స్థిరముగా యుండదు.
తదుపరి విభీషణునితో గూడ ఇతర రాక్షసులున్ను రావణుని చితిపై వివిధ వస్త్రాలను, పేలాలు ఉంచిరి. అప్పుడు వారి ముఖంపై కన్నీటి ధారలు కారుచుండెను. అప్పుడు విభీషణుడు చితికి యధాప్రకారముగా అగ్ని ముట్టించెను. అయోధ్య కాండలో, సారథి అయిన సుమంత్రునితో, దశరథుడు ఈ విధముగా చెప్పెను.
సుమన్త్రా౭౭నయ మే దారాన్ యే కే చిత్ ఇహ మామకాః
దారైః పరివృతః సర్వై ర్ద్రష్టుమ్ ఇచ్ఛామి ధార్మికం              2.34.10
అర్ధ సప్త శతా స్తా స్తు ప్రమదా: తామ్ర లోచనాః
కౌసల్యాం పరివార్యా౭థ శనై: జగ్ము: ధృత వ్రతాః 2.34.13
సుమంత్రా ఈ భవనమున గల నా భార్యలందరిని తీసుకొని రమ్ము. వారందరితో కూడి నేను రాముని చూడగోరుతున్నాను. అప్పుడు 350 మంది స్త్రీలు నియమనిష్టలతో కౌసల్యను అనుసరించి భవనమునకు చేరిరి.
పై విషయములను బట్టి తెలియునది ఏమనగా దశరథునికి 350 మంది భార్యలు గలరు. అందు ముఖ్యమైన వారు కౌసల్య, కైకేయి, సుమిత్ర. అలాగే రావణునికి కూడా పెక్కు మంది పత్నులు గలరు. కానీ ముఖ్యమైన వారు మండోదరి, ధాన్యమాలిని. రావణునికి మొత్తము ఏడుగురు కొడుకులు. వారు ఇంద్రజిత్తు. అతనినే మేఘనాథుడు అంటారు. ఇతను రావణాసురుని పెద్ద కొడుకు. ఇంకా అతికాయుడు, అక్ష కుమారుడు, దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశిరుడు, ప్రహస్తుడు.  ఇంద్రజిత్తు, అతికాయుడు, ప్రహస్తులను లక్ష్మణుడు సంహరించాడు. అక్ష కుమారుడు, దేవాంతకులను హనుమ సంహరించాడు. నరాంతకుడిని అంగదుడు, త్రిశిరుడ్ని నీలుడు  సంహరించారు. ఇక్కడ గమనించింది ఏమనగా రావణుడు అహంకారి, దుష్ట స్వభావము కలవాడు. అధర్మ పరుడు. వీటి కారణంగానే అతను సంహరింప బడ్డాడు కానీ పరాక్రమము లేక కాదు. అలాగే పరాక్రమము వంతులైనను అతని కొడుకులు గూడ తండ్రి గుణములను కలిగి యున్నారు.  వారు కూడా ఈ కారణంగానే సంహరింప బడ్డారు. ఇంతమంది కొడుకులు గల్గినను తను, తన కొడుకుల అధర్మవర్తన వలన రావణాసురుని ప్రేత సంస్కారము చేయడానికి ఒక్క కొడుకు గూడ మిగిలి లేడు. అతని వంశము మొత్తము సర్వ నాశనము అయ్యినది. అందువలననే విభీషణుడు రావణాసురుని ప్రేత సంస్కారము చేయవలసి వచ్చినది. లోకములో తండ్రి గుణములు కొడుకుకు అబ్బును కావున తండ్రి ధర్మవర్తనతో పిల్లలకు మార్గదర్శనం చేయవలసి యున్నది. ఇదేవిధముగా మహాభారతములో దుర్యోధనుని అహంకారము కారణంగా కౌరవుల వంశము మొత్తము క్షయమైనది. అయితే ఒక సందేహము రావచ్చు. హిరణ్యకశ్యపుడు అధర్మవర్తనుడు అయినను ప్రహ్లాదుడు ఎలా ధర్మపరుడు అయినాడు? ఇక్కడ గమనించితే ప్రహ్లాదుడు గురువుగా నారదుడు ఒసగిన నారాయణ మంత్రము వలన సంస్కరింపబడ్డాడు.
రాముడు సత్యవాది. సత్యవాది యొక్క మాటలు ఎన్నడును హృదా పోవు. యుద్ధము ప్రారంభమునకు ముందు చివరి ప్రయత్నముగా శ్రీరాముడు,  అంగదునితో సంధి  ప్రయత్నము చేసెను. శ్రీరాముడు ఈ విధముగా రావణునికి కబురు పంపెను.  
బ్రవీమి త్వాం హితం వాక్యం క్రియతామ్ ఔర్ధ్వదేకికమ్
సుదృష్టా క్రియతాం ల౦కా జీవితం తే మయి స్థితమ్ 6.41.71
రావాణా! నీ మేలు కొరకై హితవచనములు నుడుపుచున్నాను. రాక్షసులందరు మృతి చెందనున్నారు గావున నీకు పుణ్యలోకములు ప్రాప్తించుకొనుటకై తగిన శ్రాద్ధాది పుణ్య కర్మలను నీ కొరకై నీవే ఆచరించుకొనుము. కడసారిగా లంకను ఒక్కసారి చూచుకొనుము. నీ ఆయువుపట్టు నా చేతిలో యున్నది. చివరికి శ్రీరాముడు వచించినట్లే రావణుడికి శ్రాద్ధము పెట్టుటకు కొడుకులు ఎవ్వరును జీవించి యుండలేదు.
శ్రీరామ జయరామ జయజయ రామ

Monday 24 February 2020

యుద్ధ కాండము-39

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-39
రావణ మృతికి విభీషణుని విలాపము, రాముని అనునయము
సోదరుడు చనిపోయి నేలబడి యున్నాడు. శోకము పెల్లుబికిన విభీషణుడు ఇట్లు విలపింప సాగెను. "నీవు పరాక్రమశాలివి. లోక ప్రఖ్యాతి నొందినవాడివి. శాస్త్రములలో శిక్షణ పొందినవాడివి. అట్టి నీవు ఇప్పుడు నిర్జీవంగా నేలపై పరుండినావు. వెనుక నేను నీకు ఇట్టి దశ వచ్చునని చెప్పియుంటిని. ఆనాడు నా మాటలు నీకు రుచింపలేదు. నీతి మార్గ ప్రవర్తనను, మర్యాదను అతిక్రమించితివి. ధర్మమును నిరోధించితివి. రావణుడు మహాగ్నిహోత్రము. అట్టి అగ్నిని రాముడనే మేఘము చల్లార్చినది". ఈ విధముగా విభీషణుడు శోకించుట చూచి, అర్థ నిశ్చయమును ప్రకట మొనర్చు యుక్తి సంగతములైన మాటలు చెప్పుచు శ్రీరాముడు శోకమగ్నుడగు విభీషణునితో ఇట్లు పలికెను.
నా౭యం వినష్టో నిశ్చేష్ట స్సమరే చండ విక్రమ:
అత్యున్నత మహోత్సాహ: పతితో౭య మశంకిత:           6.112.౧౫
నైవం వినష్టా శోచ్యన్తే క్షత్ర ధర్మ మ౭వస్థితా
వృద్ధి మా౭౭శంసమానా యే నిపతంతి రణా౭జిరే 6.112.16
త దేవం నిశ్చయం దృష్ట్వా తత్త్వ మా౭౭స్థాయ విజ్వర:
య దిహా౭నంతరం కార్యం త ద౭నుచిన్తయ 6.112.20
మరణా౭౦తాని వైరాణి నిర్వృత్తం న: ప్రయోజనం
క్రియతా మ౭స్య సంస్కారో మమా౭ప్యేష యథా తవ 6.112.26
విభీషణా! ఈ వీరుడు యుద్ధము నందు అసమర్థుడై చావ లేదు. ఇతను ప్రచండమైన పరాక్రమమును ప్రకటించెను. ఈతని ఉత్సాహము చాల గొప్పది. ఈతనికి మృత్యువు యెడల ఏ విధమైన భయము లేదు. దైవికముగా ఇతడు యుద్ధమున పడిపోయెను. ఎవరు తమ అభ్యుదయమును గూర్చిన కోరికచే క్షత్రియ ధర్మమందు నిలకడ కలిగి యుద్ధమందు చంపబడుదురో ఆ ప్రకారముగా నశించు జనుల విషయమై శోకించరాదు. శాస్త్రము యొక్క ఇట్టి నిశ్చయమును తెలుసుకొని, సాత్విక బుద్ధిని ఆశ్రయించి నీవు నిశ్చింతగా యుండుము. మరియు ఇప్పుడు ముందు చేయదగిన (ప్రేత సంస్కారము మొదలైన) పనుల విషయమై ఆలోచించుము. విభీషణా! వైరములు మరణము వరకే. మరణించిన పిదప ఆ వైరములు నశించును. ఇప్పుడు మన ప్రయోజనము సిద్ధించింది. కావున ఇపుడు నీవు ఈతని ప్రేత సంస్కారమును గావింపుము. ఈ సమయమున యీతడు నీకెట్లు స్నేహమునకు పాత్రుడై యున్నాడో అట్లే నాకును స్నేహభాజనుడై యున్నాడు.
శ్రీరాముడిట్లు పలుకగా శోకతప్తుడైన విభీషణుడు వారితో తన సోదరునకు హితకరమైనట్టి ఈ వాక్యమును పలికెను.
ఏషో హితా౭గ్ని శ్చ మహా తపా శ్చ 
వేదాన్తగ: కర్మసు చా౭గ్ర్య వీర్య:
ఏతస్య య త్ప్రేత గతస్య కృత్య౦
తత్ కర్తు మిచ్ఛామి తవ ప్రసాదాత్ 6.112.24
ఈ రావణుడు అగ్నిహోత్రియు, మహాతపస్వియు, వేదాంత వేత్తయు, యజ్ఞ యాగాది కర్మలందు శ్రేష్ఠుడైన శూరుడును, మహా కర్మఠుడును అయియున్నాడు. కావున మీ కృపచే నేనే ఇపుడాతని ప్రేతకర్మను చేయదలిచాను.
శ్రీరామ జయరామ జయజయ రామ

Sunday 23 February 2020

యుద్ధ కాండము-38

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-38
రావణ సంహారము
శ్రీరాముడు యుద్ధమునకు సిద్ధపడగా, రావణుడు రథముతో యుద్ధమునకు సిద్ధపడి వచ్చెను. రావణుడు ఆకాశమునే ఆక్రమించుచున్నాడా లేక భూమినే మ్రోగించుచున్నాడా అనునట్లు తన రథముపై కూర్చొని తన సైన్యమునకు ఆనందము కలుగ జేసెను. రథముతో వచ్చుచున్న రావణుడు మేఘము వర్షధారలను వదిలినట్లు బాణవర్షమును గురిపించెను. ఆ విధముగా సంరంభముతో వచ్చుచున్న రావణుని చూచి, రాముడు మాతలితో అతని రథమునకు ఎదురుగా కుడి (సవ్య దిశలో) వైపు నుండి వెళ్లవలెనని చెప్పెను. ఒకరినొకరు ఎదురెదురుగా నిలిచి ఒకరినొకరు చంపుకొనవలెననే పట్టుదలతో పోరు చేయుచుండిరి. గ్రద్దలు గుంపులు గుంపులుగా రావణుని రథముపై తిరుగాడెను. శకున శాస్త్రజ్ఞుడగు రాముడు ఆ శకునములు చూచి విజయము తప్పక కలుగునని ఉత్సాహముతో అధికమైన పరాక్రమము చూపుచుండెను. రావణుడు గదలు, పరిఘలు, చక్రములు, రోకళ్ళు, పర్వత శిఖరములు, వృక్షములు, శూలములు మాయాశక్తిచే అస్త్రబలము వర్షించెను. రకరకముల అస్త్రములతో రాముని రథముపై, వానరులపై పడుచుండెను. అంతరిక్షము బాణములతో నిండెను. రావణుని చూచి రాముడు వానిపై వందలు, వేలు బాణములను గురిపించెను. ఆ యుద్ధము గగుర్పాటు కల్పించినదియై ఉండెను. కొద్ది సేపటిలో భీకరమైన ఆశ్చర్యజనకమై సర్వలోకము చూడదగినదియై యుద్ధము సాగుచుండెను. గాలి వీచుట మానెను. దేవతలు, ఋషులు ఆకాశమున నిలిచి రామునికి మంగళము పలుకుచుండిరి. ఆ యుద్ధమును చూచి దానికి పోలికగా వేరొకటి చెప్పలేక
గగనం గగనా౭౭కారం సాగర: సాగరోపమ:  6.110.23
రామ రావణయో ర్యుద్ధం రామ రావణయో రివ
ఆకాశము ఆకాశము వలననే యున్నది. సముద్రము సముద్రము వలననే యున్నది. అనుటయే తప్ప వానిని పోలినది చెప్పుటకు ఎట్లు లేదో అట్లే రామరావణుల యుద్ధము చెప్పుటకు పోలిక లేదనుచుండిరి. రామునికి కోపము వచ్చి బాణముతో రావణుని శిరస్సును ఖండించెను. వెంటనే దానిని పోలిన వేరొక శిరస్సు మొలచెను. వెంటనే ఆ శిరస్సును కూడా ఖండించెను. మరల శిరస్సు మొలచెను. ఈ విధముగా నూట ఒక్క సార్లు శిరస్సులను చేధించినను మరల మరల శిరస్సులు మొలచుచు రాముని శ్రమ యంతయు నిష్ఫలము అయ్యెను. ఏ బాణములతో మారీచుడు చంపబడెనో, దేనితో ఖరదూషణాదులు, విరాథుడు, కబంధుడు చంపబడిరో ఆ బాణములన్నియు ప్రయోజనము శూన్యము అయినవి. అప్పుడు రావణుడు ఇంకను జాగ్రత్తగా ఆలోచన చేసి రావణుని గుండెలపై కొట్టెను. కోపము గలవాడై రావణుడు గధలను, ముసలములను వర్షించి రాముని నొప్పించెను. ఆ రాత్రి, మరుసటి పగలు అంతయు ఒక్క క్షణకాలం కూడా విరామము లేకుండా యుద్ధము సాగుచుండెను. రాముడుగాని, రావణుడు గాని జయించుట కానరాలేదు. అప్పుడు మాతలి రామునితో బ్రహ్మాస్త్రము ప్రయోగించమని, అతని మరణకాలము ఆసన్నమైనదని చెప్పెను. మాతలి చెప్పగానే ఆనాడు అగస్త్యుడు తనకు ఇచ్చిన అస్త్రము గుర్తు వచ్చెను. (అరణ్య కాండము 12 వ సర్గ) బుసకొట్టుచున్న పామువలె యున్న బాణమును తీసెను. పూర్వము ఈ బాణమును బ్రహ్మ నిర్మించి ఇంద్రునకు ఒసగినాడు. ఆ బాణమే ఇంద్రుడు అగస్త్యునకు ఇచ్చి శ్రీరామునికి ఒసగమని కోరెను. దానిని రామునకు అగస్త్యుడు ఒసగెను. ఆ బాణము యొక్క ప్రక్క రెక్కల యందు వాయుదేవుడు యుండును. మధ్య అగ్నిసూర్యులు ఉందురు. దానిశరీరము ఆకాశ స్వరూపమై యుండును. బరువులో మేరు పర్వతము, మంధర పర్వతము వలె యుండును.    దాని ములుకులు బంగారముతో అలంకరింపబడి యున్నది. సర్వభూతముల యొక్క తేజస్సులతో, సూర్యకాంతిని బోలిన కాంతితో ఆ బాణము నిర్మింపబడినది. పొగతో నున్న కాలాగ్ని వలె యుండును. విషమున త్రాచు పాము వలె యుండును. ఎన్నియో యుద్ధములలో ప్రయోగించబడుటచే రక్తముతో తడిసి యుండును. మహా భయంకరమైనది. వజ్రసారమైనది. దివ్యాస్త్ర మంత్రమును బాణముపై అభిమంత్రించి మహాబలశాలి యగు రాముడు వేదోక్తమగు విధానంతో ధనస్సున సంధించెను.  అస్త్రము తన ధనుస్సు నందు సంధింపగనే సర్వ భూతములు గడగడలాడినవి. అస్త్రములు మంత్ర రూపముగా యుండును. మంత్ర రూపముగా బాణమును సంధింపగనే వాటికి అట్టి శక్తి కలుగును. రాముడు దానిని ప్రయోగించెను. ఆ బాణము రావణుని హృదయములో దూరి రక్తముతో తడిసి రావణుని ప్రాణములు హరించి భూమిలో ప్రవేశించి మరల రాముని అమ్ముల పొదిలోకి వచ్చి దూరెను. రావణుడు మృతుడగుట చూచి దేవదుందుభులు మ్రోగెను. పుష్ప వర్షము కురిసెను. వానర సేన ఎంతయో హర్షమును పొందెను. ఈ విధముగా రావణ సంహారము ధాత నామ సంవత్సరము ఫాల్గుణ బహుళ అమావాశ్య నాడు జరిగినట్లు బ్రహ్మాండ పురాణము ద్వారా తెలియు చున్నది.
శ్రీరామ జయరామ జయజయ రామ

యుద్ధ కాండము-37

[05:49, 23/02/2020] +91 96180 14862: శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-37
అగస్త్య ముని ప్రభావము
అగస్త్య ఇతి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణా. తన తపః ప్రభావముచే వింధ్య పర్వతమును స్థంబింప చేసినాడు కావున ఈయనకు అగస్త్య మహర్షి అని పేరు వచ్చినది. ("అగమ్ (పర్వతం) స్థంభయతీతి అగస్త్య"). సూర్యుని మార్గమునకు (గమనమునకు) అడ్డు వచ్చుచున్న ఈ మహా పర్వతము అగస్త్యుని ఆదేశానుసారం పెరుగుట మానివేసింది. అట్టి ప్రభావశాలి అగస్త్య మహర్షి. స్పందన లేని శూన్య అవస్థకు "అగస్త్యుడు" అని పేరు. నిర్వికల్ప సమాధి అవస్థకు చేరిన తర్వాత ఈ శూన్య అవస్థ ప్రాప్తమగును. వృత్తి రహిత శూన్య అవస్థ యందు ఎల్లప్పుడును ఉండెడి ఉచ్చసాధకుని రామాయణకారుడు "అగస్త్యుడు" అని పేరిడెను. సంసారమును సాగరముతో పోల్చినారు. అలాంటి సాగరమును ఒకే ఆచమనముతో త్రాగినాడు. అటువంటి పరాక్రముడు, పురుషార్థి అగస్త్య మహర్షి. అరణ్యవాసంలో అట్టి  మహర్షి ఆశ్రమమున మూడు పగళ్లు, మూడు రాత్రులు శ్రీరాముడు ఉండెననగా రామసాధకుడు  శూన్య నిర్వికల్ప అవస్థ యందు మూడు రోజులు ఉండెను. వాల్మీకి రామాయణములో అగస్త్య ముని రెండు సార్లు గోచరమగును. మొదటి సారి అరణ్య కాండములో ...
త ద్ధను స్తౌ చ తూణీరౌ శరం ఖడ్గం చ మానద
జయాయ ప్రతిగృహ్ణీష్వ వజ్రం వజ్రధరో యథా   3.12.35
మహర్షి రాముడికి విష్ణు ధనుస్సుని (పూర్వము ఈ వైష్ణవ ధనుస్సు పరశురాముని నుండి శ్రీరామునికి చేరెను. అతడు దీనిని వరుణునికి ఇచ్చెను. ఆ వరుణుడు దీనిని అగస్త్యునికి ఇచ్చెను. ఇప్పుడు మరల అగస్త్యుడు రామునకు ఇచ్చెను), బ్రహ్మగారు ఇచ్చిన సూర్య తేజస్సు కలిగిన బాణాన్ని, ఇంద్రుడు ఇచ్చిన రెండు అక్షయబాణ తూణీరములు, ఒక బ్రహ్మాండమైన పిడి కలిగిన ఖడ్గాన్ని ఇచ్చి, వీటి ద్వారా జయాన్ని పొందు అని ఆశీర్వదించారు. రెండవ సారి యుద్ధ క్షేత్రములో ప్రత్యక్షమై ఆదిత్య హృదయమును బోధిస్తారు.
శ్రీరాముడు, వసిష్ఠ మహర్షి ద్వారా సమస్త జ్ఞానాన్ని తెలుసుకొన్న వాడైనప్పటికి, సర్వ శక్తిమంతుడు అయినప్పటికి, మాయా ప్రభావము వలన సీతాపహరణము తర్వాత దుఃఖితుడై మార్గోపాయము కానరాక అగమ్య గోచరంగా అరణ్యములో సంచరిస్తుండగా అగస్త మహర్షి ఏతెంచి శ్రీరాముని జ్ఞానమును గుర్తు చేసి కర్తవ్య బోధన చేసి పరమేశ్వరుని ప్రార్ధన చేయమని తద్వారా దుఃఖోపశమనము కలుగునని విరజా దీక్ష ఇస్తాడు. ఈ విధముగా శ్రీరాముని చాతుర్మాస్య దీక్ష వలన పరమేశ్వరుడు ప్రత్యక్షమై పాశుపతాస్త్రమును ప్రసాదించి జ్ఞానబోధ చేస్తాడు. ఇదియే శివ-రామ సంవాదరూపమైన పద్మపురాణాతర్గతమైన "శివగీత". (ఇది వాల్మీకి రామాయణములో లేదు).
కాళిదాసు రఘువంశములోను -- ఇంకా బృహత్ సంహిత లో వరాహమిహిరాచార్యుడు "Canopus" అనే అగస్త్య నక్షత్రము ఉదయించడము వర్ణించాడు. అగస్త్యుడు ఉదయించిన వెంటనే నదులన్నీ కూడా మడ్డి తేరుకొని  నిర్మలమైన నీళ్లతో ప్రవహిస్తాయి. టెలిస్కోపులో చూసిన  Scientists ఈ అగస్త్య నక్షత్రము సూర్యుని కంటే 50 లక్షల రెట్ల పెద్దదని, అది ఒక డిగ్రీలో పదోభాగము భూమికి దగ్గరగా వచ్చినా సముద్రాలు ఆవిరై ఇగిరి పోతాయని చెప్పారు. దీనిని బట్టి అగస్త్యుడు సముద్రాల్ని త్రాగాడని భావము. పూర్వము హిమాలయాలకు సూటిగా అగస్త్యుడు ఉత్తర దిశగా ఉదయించే వాడని (మహాభారతము, అరణ్య పర్వము - 101) ఆ తర్వాత భూమి యొక్క ధ్రువము తలక్రిందులుగా తిరుగుట మూలాన దక్షిణంగా ఒంగి, వింధ్యను దాటి ఉదయించాడని తెలియుచున్నది. ఇదియే అగస్త్యుని కథలో -- అగస్త్యమహర్షి వింధ్య పర్వతాల్ని దాటి రావడము. శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతిని పెండ్లి చేసుకున్నప్పుడు పెండ్లి "సదస్యుల" లో యున్న మహర్షులలో అగస్త్య మహర్షి గూడ యున్నారు. వేరొక కథనం ప్రకారం, శివ పార్వతుల కళ్యాణానికి దేవతలు,  ఋషులు అందరు హిమాలయాలకు వచ్చారు. అప్పుడు వారి శక్తికి ఉత్తరాన భూమి క్రుంగి పోవుచుండడం చూసి శివుడు అందరి శక్తికి ఇంచుమించు సమానమైన అగస్త్య భగవానులను దక్షిణ దిక్కున ఉండమని ఆదేశమిచ్చారు. అప్పుడు అగస్త్యులవారు కళ్యాణం చూడలేక పోతున్నందుకు చింతించుచుండగా వారికి అక్కడనుండి కూడా ప్రత్యక్షంగా చూసే వరాన్ని ప్రసాదించారు. అప్పటి నుండి అగస్త్యుడు దక్షిణాన ఉన్నారు. ఆ ప్రదేశము ప్రస్తుతము తమిళనాడులోని కుంభకోణము దగ్గర నల్లూర్ వద్ద ఉన్నదని స్థల పురాణము. అందువలన భూమి సరియైన తన కక్షలో ఉండునని చెప్పాడు. అంటే అగస్త్యుని బరువు మిగిలిన అన్నింటికీ సమానము అని తెలియును. (source: https://temple.dinamalar.com/en/new_en.php?id=367). This temple is known as "Sri Kalyansundareswar Temple" Nallur, near Kumbhakonam, Tamilnadu.  అగస్త్యుడు చెప్పినవి 26 ఋక్సంహిత వేదమంత్రాలు (ఋగ్వేదంలో 1.165వ శ్లోకం నుంచీ 1.191వ శ్లోకం వరకూ). వ్యాసులవారు చేసిన యజ్ఞంలో (అగస్త్యో వామదేవశ్చ జాబాలి రథాకాశ్యపః) అగస్త్యుడు మొదలగు ఋషులు యజ్ఞం చూడడానికి వచ్చారని వ్యాస మహర్షి భారతంలో వ్రాసారు. అంటే వీళ్ళు చిరంజీవులు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆవిరిగా యుండే వాళ్ళ ఆత్మ, వాళ్ళ శరీరాన్ని అట్టి ఆవిరి గడ్డకట్టించి (in the form of ice) స్థూల శరీరాన్ని ధరించగలరు. వారిని "నిర్మాణకాయులు" అంటారు. అంటే శరీరాన్ని ఎప్పుడు పడితే అప్పుడు నిర్మాణం చేసుకోగల సిద్ధపురుషులు. వీరికి మరణంతో పనిలేదు.  పురాతన జపనీస్ గ్రంథం అగస్త్యపర్వ అనేది అగస్త్యుని గురించి రాసిన పుస్తకం. ఈ పుస్తకంలో అగస్త్యుని గొప్ప మహర్షిగా, గురువుగా వర్ణిస్తూ రాశారు. ఈ పుస్తకం యొక్క 11వ శతాబ్దపు ముద్రణ ఇప్పటికీ లభ్యమవుతోంది అని శ్రీ వేదవ్యాస్, ఐఏఎస్ గారు చెప్పారు.
ప్రణవ పంచాక్షరోపనిషత్ప్రపంచంబు
               గడదాక నెఱిగిన కఱకలాని
వాతాపిదైత్యు నిల్వలునితో గూడంగ
                జఠరాగ్ని వ్రేల్చిన సవనరక్త
గోపించి నహుషుని గుంభీవసంబుగా
           హుంకార మిచ్చిన యుగ్రతేజు
వానకాలమునాడు వండునట్టిన నీటి
      కాలుష్య ముడిపెడు కతకఫలము
బాండుభాసిత త్రిపుండ్రాంక ఫాలభాగు
భద్రరుద్రాక్షమాలికా భరితవక్ష
వింధ్యగర్వాపహారి నాపీతజలధి
నయ్యగస్త్య మహర్షి న నభినుతింతు
           - (శ్రీ కాశీ ఖండము; 2. 180)   
ఈ అగస్త్య ముని ప్రభావము కొంత భాగము "అరణ్య కాండ - 5" లో వివరించడమైనది.
శ్రీరామ జయరామ జయజయ రామ
Only admins can send messages

Saturday 22 February 2020

యుద్ధ కాండము-36.2


శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-36.2
ఆదిత్య హృదయము - భావార్థము
యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమర రంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను. యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను.
అగస్త్య మహర్షి చెప్పుచున్నాడు:
ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు. ఈ ఆదిత్యహృదయ అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్ర జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగ ప్రసాదించునది.
ఇది పరమపావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును ఆధివ్యాధులను తొలగించి ఆయుష్ను వృద్ధిపరుచును. సర్వ జపములలో శ్రేష్ఠమైనది. కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యము. అనంతమైన బంగారుకిరణములతో శోభిల్లుచు, జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సుగలవాడు, సమస్త భువనములను నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము. ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు. తేజో రాశి. తన కిరణములచే లోకమునకు శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు. బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు మరియు పితృదేవతలు. వసువులు, సాధ్యులు. అశ్వినీదేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగువారి స్వరూపములు అన్నిము ఇతనివే. షడృతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే.
(సూర్య నామావళి) :-
ఆదిత్యుడు జగత్‌సృష్టికి కారకుడు. జనులు తమవిధులు నిర్వర్తించుటకు ప్రేరణయిచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షములద్వారా జగత్తును పోషించి తన కిరణములను ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండములు ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు. శ్యామవర్ణముగల రథాశ్వములు గలవాడు. అసంఖ్యాకములైన కిరణములు గలవాడు. రథమునకు ఏడు గుఱ్ఱములుగలవాడు. తేజో నిధానములైన కిరణములు గలవాడు. సర్వసంహారకుడు. జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకై ఆవిర్భవించెడివాడు. నిరంతరము తన కిరణములచే ప్రకాశించు చుండువాడు. బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడువారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు, తపింపజేయువాడు. దివ్యములైన వెలుగులను గూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివాసమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితి దేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు. ఆకాశమునకు అధిపతియైనవాడు. రాహువును ఛేదించు లక్షణముగలవాడు. పూర్వాహ్ణమున ఋగ్వేదరూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేదరూపమును, సాయంసమయమున సామవేదరూపమునను అలరారుచుండెడివాడు. ఘనముగా వర్షములను కురిపించుచుండువాడు. అందువలననే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు. వేడిని కలిగియుండువాడు. వృత్తాకారమైన బింబము గలవాడు. విరోధులను రూపుమాపువాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపజేయువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణులయందును అనురక్తి గలిగి యుండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు. నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతియైనవాడు. విశ్వస్థితికి హేతువు. అగ్న్యాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. పన్నెండు రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం.
(సూర్య నమస్కార: ) :-
స్వామీ! నీవు పూర్వగిరియందును, పశ్చిమగిరి యందును విలసిల్లుచుండువాడు. గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ! సూర్యభగవానుడా! నీకు నమస్కారము. జయములను, శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణముగల రథాశ్వములుగలవాడవు. వేలకొలది కిరణములు గలవాడవు. అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగ ప్రయాణించువాడవు. పద్మములను వికసింపజేయువాడవు. జగత్ప్రళయమునకు పిమ్మట మరల సృజించుటకై ఆవిర్భవించు నట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు. కాంతికి నిధియైన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రస్వరూపుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును, శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించి నవారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతఘ్నులను నశింపజేయుచు, దివ్యతేజస్సు విరజిమ్ముచు, జ్యోతులకు అధిపతివైన నీకు నమస్కారము.
బంగారమువంటి వన్నెగలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వజగత్కర్తవు. తమస్సులను పారద్రోలువాడవు. ప్రకాశస్వరూపుడవు. జగత్తున జరిగెడి సర్వజనుల కర్మలకు సాక్షియైన వాడవు. కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము. రఘునందనా! ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమొనర్చును. పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపజేయును. వర్షములను ప్రసాదించు చుండును. ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే యుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే. తత్ఫలస్వరూపమూ ఇతడే. ఇతడు వేదవేద్యుడు. యజ్ఞఫలస్వరూపుడు. లోకములో జరిగెడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు.
(ఫలశ్రుతిః ):-
రఘురామా! ఆపదలయందును, కష్టముల యందును, దుర్గమమార్గములయందును, భయస్థితులయందును ఈ స్వామిని కీర్తించినవారికి నాశము ఉండదు. దేవదేవుడు, జగత్పతియైన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్యహృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహా సంగ్రామము నందు విజయము పొందగలవు. మహాబాహో! రామా! ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలిగి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను. మహాతేజస్వియైన శ్రీరాముడు అగస్త్యమహాముని ద్వారా ఈ ఆదిత్యహృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఆదిత్యహృదయ మంత్రమును మనస్సు నందు నిలుపుకొనెను. పిదమ ముమ్మారు ఆచమించి శుచియై సూర్యభగవానుని జూచుచు ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయెను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను. మిక్కిలి సంతుష్టుడైయున్న ఆ రాముడు రావణుని జూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృతనిశ్చయుడయ్యెను. పిమ్మట దేవతలమధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమును పొందినవాడై, పరమ సంతోషముతో శ్రీరాముని జూచి రామా! త్వరపడుము అని పలికెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

Thursday 20 February 2020

యుద్ధ కాండము-36.1

మిత్రులకు శ్రేయోభిలాషులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-36.1
 

ఆదిత్య హృదయము
ఈ ఆదిత్య హృదయము యుద్ధ కాండము 107 వ సర్గలో కలదు
 

తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం 1
 

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః 2
 

అగస్త్య ఉవాచ:
రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి 3
 

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం 4
 

సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం 5
 

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం 6
 

సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః
ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః 7
 

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః 8


పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః

వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః 9
 

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
(సూర్య నామావళి) :-
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః 10
 

హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్ 11


హిరణ్యగర్భహ్ శిశిరస్తపనో భాస్కరో రవిః

అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్ 12
 

వ్యోమనాథ స్తమోభెదీ ఋగ్ యజుస్సామ పారగః
ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః 13
 

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః 14
 

నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః
తెజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే 15
 

(సూర్య నమస్కార: ) :-
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయె నమః
జ్యోతిర్గణాణాం పతయే దినధిపతయే నమః 16
 

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః 17


నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః

నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః 18
 

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః 19
 

తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనె
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః 20
 

తప్త చామీక రాభాయ హరయే విష్వకర్మణే
నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే 21
 

నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః 22
 

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం 23
 

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వేషు రవిః ప్రభుః 24
 

(ఫలశ్రుతిః ):-
ఏనమాపత్సు కృత్ శ్రేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః 25
 

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి 26
 

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం 27
 

ఏతత్ శృత్వా మహాతెజా నష్టశొకొభవత్తదా
ధారయామాస సుప్రీతొ రాఘవహ్ ప్రయతాత్మవాన్ 28
 

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ 29
 

రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వ యత్నేన మహతా వధె తస్య ధృతోభవత్ 30
 

అథ రవి రవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః
నిశిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి 31
 

శ్రీరామ జయరామ జయజయ రామ

Wednesday 19 February 2020

యుద్ధ కాండము-35

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-35
రామబాణములకు కలత చెందిన రావణుని చూచి, సారథి రథమును యుద్ధభూమి నుండి ప్రక్కకు త్రిప్పుట
‌లక్ష్మణుని మాటలు విని శ్రీరాముడు శత్రువులను సంహరింప నిశ్చయించి ధనస్సును చేపట్టెను. రథముపై రావణుడు, నేలపై రాముడు యుద్ధము చేయదగదని యోచించి దేవరాజగు ఇంద్రుడు తన సారథి యగు మాతలిచే స్వర్గము నుండి రథమును రాముని  వద్దకు పంపెను. మాతలి రాముని వద్దకు వచ్చి రామా! ఇంద్రుడు నీకు విజయము సమకూర్చవలెనని ఈ రథమును పంపినాడు. ఇందు ఇంద్రునిచే పంపబడిన అమోఘమైన విల్లు, కవచము, శక్తి ఉన్నవి. అందుకు సమ్మతించిన రాముడు ఆ రథమునకు ప్రదిక్షణ చేసి నమస్కరించి రథమును అధిరోహించెను. ఆనాడు రామరావణుల యుద్ధము ఓడలు గగుర్పొడుచునదిగా యుండెను. రావణుడు వేసిన గాంధర్వాస్త్రమును రాముడు దైవాస్త్రముచే కొట్టెను. రావణుడు రాక్షశాస్త్రమును, రాముడు గరుడాస్త్రముచే నిరోధించెను. తన అస్త్రములన్నియు నిష్ఫలములు అగుట చూచి రావణుడు ఓర్వలేక ఘోరమగు బాణవర్షమును గురిపించగా రాముడు ధనస్సును సంధింప జాలని వాడై యుండెను. అప్పుడు రావణుడు పది ముఖములతో ఇరువది బాహువులతో మైనాక పర్వతము వలె కనబడెను. అప్పుడు కోపముతో, కన్నులు ఎర్రబారిన రాముని చూచుటకు రావణుడు, సర్వ భూతములు కలత చెందెను. "రామాజయ" అని దేవతులు, "రావణా జయ" అని రాక్షసులు పలుకుచుండిరి. రావణుడు మహత్తరమగు శూలమును చేపట్టి రామునిపై విసరగా, అది మెరుపులతో, ఎనిమిది గంటలతో ధ్వని చేయుచు అంతరిక్షమున వచ్చుటకు చూచి రాముడు దానిని తన బాణములతో నివారించుటకు ప్రయత్నించెను. కానీ ఆ శూలము రామబాణములను అగ్ని ముడుతలను దహించినట్లు దహించి వేసెను. అప్పుడు రాముడు కోపముచే ఇంద్రుడు మాతలిచే పంపిన శక్తిని రావణుని శూలముపై ప్రయోగించెను. ఆ శక్తి యొక్క గంటలు పెద్ద ధ్వని చేయుచు ఆకాశములో ఉల్కలు సంచరించునట్లు శూలముపై పడెను. రాముడు ప్రయత్నపూర్వకంగా రావణుని లలాటము నందు కొట్టగా రావణుడు కూడా అంతే తీవ్రముగా ప్రతిస్పందించెను. రాముడు కోపముతో రావణుని చూచి పరుషముగా "రాక్షసరాజా! జనస్థానమున నా భార్యను ఒంటరిగా యున్నదానిని అపహరించి తెచ్చితివి. నీచునిలా ప్రవర్తించితివి. నేను చూచుచుండగా నీవు సీతను తెచ్చినచో ఆనాడే నీవు మరణించి యుండెదవు. నీ అదృష్టము వలన నీవు నా కంట బడలేదు. నేడు కనబడినావు గాన ఇక నీవు జీవించుట దుర్లభము" అని పలుకుచు పరాక్రమముతో రావణునిపై బాణమును ప్రయోగించెను. అప్పుడు రావణుడు ప్రతీకారము చేయలేక మృత్యువు ఆసన్నమయినదా అనునట్లుండెను. అప్పుడు సారథి రావణుని అవస్థ చూచి మెల్లగా యుద్ధభూమి నుండి రథమును ప్రక్కకు తీసికొనిపోయెను. అందుకు కోపించిన రావణుడు సారథితో "నన్ను నీవు వీర్యము లేనివాడిగా, అశక్తునిగా, పౌరుషము లేనివాడిగా, పిరికివానిగా, ధైర్యము లేనివానిగా, తేజోవిహీనునిగా అనుకొంటివి". శత్రువు చూచుచుండగా నా రథమును ప్రక్కకు నడుపుటచే నేను చిరకాలము నుండి సంపాదించిన కీర్తి, పరాక్రమము, తేజస్సు, ఆత్మవిశ్వాసము నీ వలన నాశనము చేయబడినది" అని తీవ్రముగా సారథిని నిందించెను.
శత్రోః ప్రఖ్యాత వీర్యస్య ర౦జనీయస్య విక్రమైః
పశ్యతో యుద్ధ లుబ్ధోఽహం కృతః కాపురుష స్త్వయా 6.106.6
నా అదృష్టము వలన ప్రసిద్ధమైన పరాక్రమము గల శత్రువు దొరికినాడు. పరాక్రమముతో అతనిని మెప్పించి సంతోషింప చేయదగిన అవకాశము లభించినది అట్టివానితో యుద్ధము చేయవలెనని నేను కోరుచున్నాను. కావున వెంటనే వేగముగా రథమును వెనుకకు మరలింపుము అని ఆజ్ఞాపించెను. సారథి రావణుని హితమును కోరినవాడు. అనునయముతో ఇట్లు పలుకుచున్నాడు. "శత్రువు చేసిన మోసాలకు లొంగినవాడను గాను. వారు నాకు రహస్యముగా లంచమిచ్చి ఆశలు చూపలేదు. మూఢుననుఁ గాదు. మీపై ప్రేమ లేనివాడను గాదు. మీ హితమును మరువలేదు. యుద్ధములో రామబాణం తీవ్రతచే మీరు కొద్దిగా అలసి యున్నారు. మీ ముఖములో కాంతిగాని, హర్షముగాని నాకు కనబడలేదు. గుఱ్ఱములు బాగుగా బడలి యున్నవి. అశుభ చిహ్నములు అధికముగా పొడసూపినవి. సారథి దేశకాలములను గుర్తింపవలెను. రథికుని యొక్క ముఖములో ప్రసన్నత, దైన్యము గమనించ వలెను. కావున రాజా! నీకు, గుఱ్ఱములకు విశ్రాంతి ఒసగవలెనని తీవ్రమగు సహింప శక్యముగాని యుద్ధము నుండి ఒక్క క్షణము విరమింపవలెనని ఖేదము తొలగవలెనని ఈ రథమును ప్రక్కకు తెచ్చినాను. మీరు ఇప్పుడు ఎట్లు ఆజ్ఞాపించిన అట్లు చేయుదును" అని చెప్పెను. అప్పుడు రావణుని కోరికపై సారథి రథమును మరల యుద్ధభూమికి నడిపెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

Tuesday 18 February 2020

యుద్ధ కాండము-34

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-34
రావణుడు యుద్ధమునకు బయిలుదేరుట, రావణుని శక్తిచే లక్ష్మణుడు మూర్ఛ నొందుట
‌లంకలో ఇంటింటా ఆర్తలైన రాక్షస స్త్రీల జాలిగొలుపు రోదన ధ్వనులు రావణుడు వినెను. అతనిలో కోపము ప్రజ్వలించెను. అక్కడ యున్న మహాపార్శ్వుడు మొదలుగా గల సైన్యములను సిద్ధపరచెను. రావణుడు సత్వగంభీరుడు. మహాపార్శ్వ, మహోదర, విరూపాక్షులు ఆదిగా గల సైన్యము వెంట రాగ రావణుడు అనేకమైన ఉత్పాతములను లెక్కజేయక మృత్యుప్రేరితుడై యుద్ధమునకు బయలుదేరెను. క్రోధముచే రావణుని బాణపరంపరకు వానరులు శిరస్సులు ఖండింపబడి కకావికలులైరి. వానరులతో యుద్ధము చేసి రావణుడు శ్రీరాముని చెంతకు వచ్చెను. సుగ్రీవుడు వానరులకు ధైర్యము చెప్పి విరూపాక్షుని మహోదరుడిని సంహరించెను. అంగదుడు మహాపార్శ్వుని సంహరించెను. అప్పుడు రావణుడు క్రోధముతో తామసమగు బ్రహ్మ నిర్మించిన మహాఘోరమగు అస్త్రముచే వానరులను నేల పడగొట్టెను. పద్మపత్ర విశాలాక్షుడు, దీర్ఘబాహువు, మాహాతేజశ్శాలీ అగు రాముడు వానరులకు ధైర్యము నొసగుచు ధనుస్సు చేబూని టంకారము గావించెను. లక్ష్మణుడు ముందుగా తాను యుద్ధము చేయవలెనని కుతూహలంతో రావణునిపై అగ్నిజ్వాలలు వంటి బాణములను రావణునిపై ప్రయోగించెను. రావణుడు లక్ష్మణుని లెక్కజేయక రాముని ముందు నిలిచి తీవ్రమైన బాణవర్షమును గురిపించెను. రాముడు రౌద్రముతో రావణునిపై వరుసగా రౌద్రాస్త్రమును, పరమాస్త్రమును ప్రయోగించెను. రావణుని కవచము అభేధ్యము. రావణుడు అసురాష్ట్రమును ప్రయోగించగా రాముడు ఆగ్నేయాస్త్రమును, పావకాస్త్రమును ప్రయోగించెను. రావణుడు తీవ్రమైన కోపముతో బాణములతో రాముని మర్మస్థానములపై కొట్టెను. అందుకు కోపించిన లక్ష్మణుడు బాణములతో రావణుని ధ్వజమును కొట్టి , సారథిని చంపగా, విభీషణుడు తన గదతో గుఱ్ఱములను నేలకూల్చెను. రావణుడు మహాశక్తిని విభీషణునిపై ప్రయోగించగా దానిని లక్ష్మణుడు ముక్కలు జేసెను. అప్పుడు రావణుడు తన అస్త్రము విభీషణునిపై నిష్ఫలము అయినది అనే ఆక్రోశముతో, లక్ష్మణునిపై ఎనిమిది గంటల మహాధ్వనితో యున్న శక్తిని ప్రయోగించగా రాముడు చూచి (స్వస్త్య ౭స్తు లక్ష్మణా యేతి మోఘా భవ హతోద్యమా) "లక్ష్మణునికి క్షేమము కలుగు గాక. నీలోగల ప్రాణహరణ శక్తి నశించుగాక" అని అనెను.  ఆ శక్తి లక్ష్మణుని వక్షస్థలముపై బడి బలముగా నాటుకొని భూతలముపై నాటుకొనెను. (ముక్తా శూరస్య భీతస్య లక్ష్మణస్య మమజ్జ సా) రాముని వచనముల ప్రభావము వలన అది ప్రాణహరణ శక్తి కోల్పోయి యుండెను.  బలశాలియైన రాముడు ఆ శక్తిని తన రెండు చేతులతో బయిటకు లాగి  విరచి వేసెను. రాముడు అట్లు శక్తిని లాగుచున్నప్పుడు రావణుడు బాణములతో రాముని అవయవములపై కొట్టెను. అప్పుడు రాముడు క్రుద్ధుడై సుగ్రీవాదులతో లక్ష్మణుని జాగ్రత్తగా చూసుకొనమని చెప్పి (అరావణమ్ అరామం వా జగ ద్ద్రక్ష్యథ వానరాః) ఈ జగత్తు నందు రాముడో లేక రావణుడో మిగిలి యుండుట తథ్యమని ప్రతిజ్ఞ చేసెను. ఇట్లు పలికి వాడియగు బాణములతో రావణుని కొట్టెను. తన బహిప్రాణమగు లక్ష్మణుడు యుద్ధభూమిలో పడియుండుట జూచి రాముడు మిగుల చింతాక్రాంతుడయ్యెను. అప్పుడు రాముడు (దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా: తం తు దేశం న పశ్యామి యత్ర  భ్రాతా సహోదర:) ఏ దేశములో నైనను భార్యలు లభింతురు. బంధువులు సమకూరుదురు. కానీ తోడబుట్టిన సోదరుడు లభింపడు అని విలపింపుట చూచి సుషేణుడు రామునితో ఇతను చనిపోలేదు అనెను, అప్పుడు హనుమతో వెంటనే వెళ్లి విశల్య కరణి, సంధాన కరణి, సవర్ణ కరణి, సంజీవని అను ఓషధులను వేగముగా తేవలెనని చెప్పెను. వెంటనే హనుమ ఆ ఓషదిపర్వతము వద్దకు వెళ్లి ఓషధులను గుర్తింపజాలక ఆ ఓషధిపర్వతమును పెకలించుకొని వచ్చెను. సుషేణుడు ఆయా ఓషధులను నూరి లక్ష్మణునికి వాసన చూపగానే అతను పూర్వ శక్తితో లేచి నిలబడెను. లక్ష్మణుడు అప్పుడు రామునితో రావణుని చంపి విభీషణునికి లంకారాజ్యమును పట్టాభిషేకము చేసెదనని ప్రతిజ్ఞ చేసినావు గాన రావణుని చంపి ప్రతిజ్ఞ సూర్యుడు అస్తమించక మునుపే నెరవేర్చమని చెప్పెను.అందుకు శ్రీరాముడు శత్రులను నిర్జింప నిశ్చయించి ధనస్సును చేపట్టెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

Monday 17 February 2020

యుద్ధ కాండము-33

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-33
రాముని పరాక్రమమునకు రాక్షసులు నిహతులగుట
 
యుద్ధములో విభీషణుని సహాయముతో లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించాడని రావణుని మంత్రులు దూతల ద్వారా సమాచారం తెలుసుకొని రావణునికి నివేదించిరి. ఆ వార్త వినగానే తీవ్రమగు దుఃఖముతో రావణుడు మూర్ఛ నొందెను. అప్పుడు రావణుని ముఖము కోపముతో మహార్ణవములో ప్రళయకాలంలో మొసళ్ళు ఒకచోటికి చేరినట్లు,  అతని కోపము పొగతో అగ్నిహోత్రము బయిటికి వచ్చినట్లు పుత్రవధచే సంతాపము నొందిన రావణుడు కోపమునకు వశమాయెను. వెంటనే సీతమ్మను చంపవలెనని నిర్ణయమునకు వచ్చెను. అప్పుడు రావణుడు రాక్షసులకు ధైర్యమును కలుగజేస్తూ నేను అమోఘమైన తపస్సంపన్నుడును, ఎన్నియో దేవాసుర యుద్ధములలో విజయమును సాధించితిని ఇప్పుడే యుద్ధభూమికేగి రామలక్ష్మణులను చంపెదను అనెను. ఈ విధముగా చెప్పి సీత తనకు లొంగినట్లయితే ఇప్పుడు పుత్రవధ జరిగేదికాదు, అని క్రోధముతో ఆశోకవనములోని సీతమ్మ వద్దకు చేరెను. అప్పుడు సీతమ్మ ఎంతయో దుఃఖించుతూ ఆనాడు హనుమతో వెళ్ళలేకపోతిని, రామలక్ష్మణులను ఈ నీచుడు చంపియుండును అనుకొనుచు దిగులు పడెను. దీనురాలైన సీతమ్మను చూచి సుపార్శ్వుడు అను పేరుగల బుద్ధిమంతుడగు ఒక మంత్రి రావణునితో, "ప్రభూ! నీవు కుబేరుని తమ్ముడవు, కోపమునకు వశబడితివి, వేదవిద్యను పూర్తిచేసి అవబృథ స్నానము చేసినవాడవు, స్వకర్మాచరణమున శ్రద్ధ కలవాడవు, స్త్రీని చంపుట తగదు, నీ కోపమును రామునిపై చూపుము, ఈనాడు కృష్ణ పక్ష చతుర్దశి, ఈ మాసపు కృష్ణ పాడ్యమినాడు యుద్ధము ప్రారంభమాయెను, రేపు అమావాస్య, యుద్ధములో రేపు విజయమును ఆర్జించగలవు, రాముని చంపి సీతను పొందుము" అనెను.  దైవవశముచే 
ధర్మబద్ధమగు అతని మాటలు రావణునికి నచ్చి తిరిగి తన భవనమునకు ఏగెను.
లంకలో యుద్ధము ధాతనామ సంవత్సరము ఫాల్గుణ బహుళ పాడ్యమినాడు ప్రారంభమయినది. ఆనాటి రాత్రియే ఇంద్రజిత్తు నాగాస్త్రముచే రామలక్ష్మణులను బంధించాడు. విదియనాడు ధూమ్రాక్షుడు చనిపోయినాడు. తదియనాడు వజ్రదంష్ట్రుడు మరణించాడు. చవితినాడు అకంపనుడు, పంచమినాడు ప్రహస్తుడు అంతమొందినారు. షష్ఠినాడు రావణుని కిరీటము నిలబడినది. సప్తమినాడు కుంభకర్ణుని వధ. అష్టమినాడు అతికాయుడు మొదలగువారు నుడివినారు. నవమినాడు ఇంద్రజిత్తు యుద్ధమునకు వచ్చినారు. ఆరాత్రి కుంభనికుంభులు చనిపోయినవారు. దశమినాడు మకరాక్షుడు చనిపోయినాడు. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి తిథులలో ఇంద్రజిత్తుతో యుద్ధము జరిగినది. అప్పుడు ఇంద్రజిత్తు మరణించాడు. చతుర్దశి నాడు రావణుడు రామునితో యుద్ధమునకు బయిలుదేరుతున్నాడు.
 
సుపార్శ్వుని ఉపదేశముతో రావణుడు దీనుడై సభలో ప్రవేశించి అందరిని యుద్ధమునకు వెళ్ళవలసినదిగా ఆదేశించెను. అప్పుడు లంకలోని మూలబలము మొత్తము యుద్ధమునకు బయలుదేరి భయంకరముగా యుద్ధము చేసిరి. అప్పుడు ఆ వానరులందరూ శ్రీరాముని శరణు జొచ్చిరి. వెంటనే రాముడు మహాపరాక్రమముతో ధనస్సుపట్టి యుద్ధములో ప్రవేశించెను. కొరివి గుండ్రముగా త్రిప్పినప్పుడు ఒకే చక్రము తిరుగుతున్నట్లు ఎట్లు కనబడునో అట్లే గుండ్రముగా వంచి ధనస్సుతో బాణములను సంధించి ప్రయోగించినప్పుడు రాముడు చక్రమునకు మధ్యలో నాభివలె ఒప్పుచుండెను. ఒక్కసారి వేలకొలది బాణములను సంధించి వదులుచుండగా ఎడతెగక వింటినారి ఘోష వినపడుచుండెను. రాముని శరీరమే ఆ ధనుశ్చక్రమునకు మధ్య నాభివలె, అతని తేజస్సే ఇరుసువలె, వింటినారి ధ్వని చక్రపు ధ్వనివలె, వంచిన విల్లు, చక్రము యొక్క నేమివలె, రాముని తేజస్సు; బాణప్రయోగములో చూపు నేర్పరి ప్రభ వలె కనబడుచుండెను. కామరూపులైన రాక్షసులతో రాముడు ఒక్కడే యుద్ధము చేయుచుండెను. సూర్యోదయమునకు ప్రారంభించిన యుద్ధములో పగలు ఎనిమిది ఆగములు అగుసరికి రాక్షస సైన్యము అంతయు నశించెను. అప్పుడు రాముడు తన వెంట యున్న సుగ్రీవ, విభీషణ, హనుమ, జాంబవంతులతో (ఏత ద౭స్త్ర బలం దివ్యం మమ వా త్ర్యమ్బకస్య వా) "ఈ బలము రుద్రునికి నాకే యున్నది. ఇట్టి బలము ఇంకొకరికి లేదు" అనెను. ఇక్కడ శ్రీరామునికి, శివుడికి మధ్య అబేధమును తెలియుచున్నది. ఇంత యుద్ధము చేసిననుఁ రాముడు ఏమియు బడలిక చెందలేదు.
 
ఛందస్సు


ప్రాస - నియతము

వల్లవీవిలాసము - ర/య/య/గగ UIU IUU - IUU UU

జీవనం ధనం చుట్టు తిర్గే యంత్రం
ప్రేమయే ప్రభా చుట్టు తిర్గే మంత్రం
మాయయే పనీ చుట్టు తిర్గే తంత్రం
కాలమే మాట చుట్టు  తిర్గే ఆత్రం  

ఎందుకే మనస్సే - ని చుట్టూ తిర్గే
పొందుకే వయస్సే - నీచుట్టూ తిర్గే
అందుకే యసస్సే - ని చుట్టూ తిర్గే
పట్టుకో తమస్సే - ని చుట్టూ తిర్గే

అందులో సుమించెన్ - ప్రసూనమ్ముల్గా
విందులో బ్రమించెన్ - ప్రమాదమ్ముల్గా
సందులో కామించెన్ - శ్రమాదమ్ముల్గా
పొందులో ఆశించెన్ - ఆత్మాదమ్ము ల్గా   
 
అందుకో సమీపం - భవంగా రావే
చూసుకో సమానం - శుభంగా రావే
వేడుకో సుతారం - జపంగా రావే
ఆశతో ప్రభావం - భయంగా రావే

అందమే మనమ్మున్ - హరించెన్ గాదా
శోధనే  వినమ్మున్ - తరించెన్ గాదా
భోదనే సమమ్మున్ - భరించెన్ గాదా
ప్రేమయే సుమమ్మున్ - సుఖించెన్ గాదా

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
--(())--    

మత్తేభం

mattebham మత్తేభం  
2.గణాలు,.....
స భ ర న మ య వ (లగ)
IIU UII UIU I I I UUU IUU ఇటూ

తరుణంలో శుభ సాధనే మనిషి ఆరోగ్యం సదానందమే
వినయంతో క్రమ సోధనే మమత మాధుర్యం సదాసుందరం
పద పల్కే  శ్రమ ఛేదనే యువత గాంభీర్యం సదావేదనం
గురువే చెప్పిన విద్యయే సమయ సందర్భం సమానం కదా      

చెలిమే జీవిత శోభయా పరము సాపెక్షా సకాలం కదా
కలిమే కీలక కారణం తరము భావప్యా ప్రధానం  కదా 
బలిమే భీకర బోధయా కరము మామంచే సుతారం కదా         
పలికే మాటల భావమే నిజము మౌనంగా సమాధానమే

సమయానంద వినోదమే సమయ భాషల్లే మనస్సే రిం
చి మరోమాట  పఠించకే వినయ సాహిత్యం తపస్సే  భరిం        
చి మహావృక్షము వల్లె జ్ఞానమును సాన్నిత్యం యసస్సే  కుటుం
బ మహత్తే తరుణోదయం మమత మాటల్లో ఉషస్సే కదా  

సమయానందము మల్లి ఉండదులె సంతోషాలు మాయం కదా
సుమ హాసా కధ వల్లె సందియము కారుణ్యాల మాయం కదా
విహరించే విను వీధి సుందరము దృశ్యాదృస్య మాయం కదా
భళిరా ప్రేమను పంచి చీకటిని తర్మే వెల్గు దీపావలే      
 

Sunday 16 February 2020

యుద్ధ కాండము-32

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-32
లక్ష్మణుని తత్వజ్ఞానము
లక్ష్మణుడు ఇంద్రజిత్తు కొరకై శోధన చేసెను. ఇంద్రజిత్తు యుద్ధభూమి నుండి వెడలి తన శక్తిని మరింత ఇనుమడింప ప్రయత్నము చేయుచుండెను. ఇంద్రజిత్తు పన్నాగముతో ఒక మాయాసీతను సృష్టించి హనుమ ముందు సంహరించెను. తల్లియైన సీత మీద ఉన్న అనన్య భక్తి వలన మహా జ్ఞాని అయి యుండియు హనుమ ఆ మాయను గ్రహించలేక దుఃఖ పడి ఆ విషయము ఎరిగించుటకు రామలక్ష్మణుల చెంతకు వెడలెను. మాయను జయించుట కష్టము అనుటకు ఇది ఒక ఉదాహరణ. హనుమ జ్ఞానముపై ఉన్న విశ్వాసముతో రాముడు ఆ మాటను నమ్మెను. దుఃఖముతో ఉండిపోయెను. లక్ష్మణునికి కూడా పీడ కలిగినను తత్వము చెప్పుట ఆరంభించెను. పాపమునకు భయపడి ఇతరులకెవ్వరికి దుఃఖమును కలుగజేయక తమ జీవనమును నడిపించుకొను వ్యక్తులకు అన్ని విధముల కష్టములు కలుగుట, సమాజము నందు గౌరవనీయమైన వ్యక్తులు కూడా అటువంటి వారిపై అన్యాయము చేయుట కద్దు. ఈ విషయములను గురించి విచారించని మరికొంతమంది పాపములను చేయుచు, సమాజమునందు పెద్దలవలె గౌరవింపబడటం కూడా కద్దు. రాముని నిరంతర దుఃఖమును చూచి లక్ష్మణుడు పై విధమైన తత్వ జ్ఞానముతో చెప్పుచుండెను. ఇటువంటి పలుకులే అంతరమున పాపభీతితో డాంబికముగా  నున్న ఈనాటి వ్యక్తులు చెప్పుట చూచెదము.
తం లక్ష్మణోఽథ బాహుభ్యాం పరిష్వజ్య సుదుఃఖితః
ఉవాచ రామమ్ అస్వస్థం వాక్యం హేత్వ౭ర్థ సంహితమ్          6.83.13
శుభే వర్త్మని తిష్ఠన్తం త్వా మా౭౭ర్య విజితేన్ద్రియమ్
అనర్థేభ్యో న శక్నోతి త్రాతుం ధర్మో నిరర్థకః          6.83.14
భూతానాం స్థావరాణాం చ జ౦గమానాం చ దర్శనమ్
యథా౭స్తి న తథా ధర్మ స్తేన నా౭స్తీతి మే మతిః     6.83.15
యథైవ స్థావరం వ్యక్తం జ౦గమం చ తథా విధమ్
నా౭యమ్ అర్థ స్తథా యుక్త స్త్వ ద్విధో న విపద్యతే  6.83.16
య ద్య౭ధర్మో భవే ద్భూతో రావణో నరకం వ్రజేత్
భవాం శ్చ ధర్మ యుక్తో వై నైవం వ్యసన మా౭౭ప్నుయాత్ 6.83.17
యస్మా ద౭ర్థా వివర్ధన్తే యే ష్వ౭ధర్మః ప్రతిష్ఠితః
క్లిశ్యన్తే ధర్మ శీలా శ్చ తస్మా దేతౌ నిర౭ర్థకౌ            6.83.21
వధ్యన్తే పాప కర్మాణో యద్య౭ధర్మేణ రాఘవ
వధ కర్మ హతో ధర్మః స హతః కం వధిష్యతి         6.83.22
అదృష్ట ప్రతికారేణ తు అవ్యక్తే నా౭సతా సతా
కథం శక్యం పరం ప్రాప్తుం ధర్మేణా౭రి వికర్శన         6.83.24
త్వయి ప్రవ్రాజితే వీర గురో శ్చ వచనే స్థితే
రక్షసా౭పహృతా భార్యా ప్రాణైః ప్రియతరా తవ       6.83.41
ఓ! రాముడా! జితేంద్రియుడవై ధర్మాచరణతో సర్వత్రా శుభకర్మ చేయువానికి ఎల్లప్పుడూ ఆటంకములు కలుగుచుండును. ధర్మము నిరర్థకము అను ప్రశ్న ఉదయించుచుండును. నీ అవస్థ అటులనే యున్నది. ధర్మము నిన్ను కష్టముల నుండి తప్పించుటలేదు. కష్టమే నీ ధర్మమైనది. జీవకోటికి, జడవస్తువులకు ధర్మము అనెడిది యుండదు. అవి ఏవిధమైన ధర్మాచరణ చేయనప్పటికిని వాటికి కష్టములు ఏమియు కలుగక తమ అవస్థల యందు సుఖంగానే యుండును. స్థావర జంగమములకు ఏ ధర్మము లేదు కనుక దుఃఖము లేదు. ధర్మాచరణముతో దుఃఖములను కొనితెచ్చుకొనుట వ్యర్థము. ధర్మమున్నచో రావణుడు నరకమునకు పోయి, నీకు ఎటువంటి ఆపత్తుకలుగకూడదు. పూర్తి జీవితమంతయు ధర్మమును తగిన ప్రతిష్ట గౌరవములతో పోషించువారికి ఏ విధమైన కష్టములు, క్లేశములు ఆపత్తి కలుగ కూడదు. అంచేత ఈ ధర్మ రక్షా ప్రయత్నము వ్యర్థము. ఇదంతయు అదృశ్యము, అవ్యక్తము అయినచో ధర్మాచరణ యొక్క ఆవశ్యకత ఏమి? ఏమి జరుగవలెనో అది జరుగును. రామా! నీవు రాజ్యమును స్వీకరించక పోవుటవలన ధర్మము నెరవేర్చ బడలేదు. ధనము, అంగబలం ఉన్నవారి దగ్గరే అన్ని ఉన్నట్లు. అనేక యుగముల తర్వాత కూడా భర్త్రుహరి తన వైరాగ్య శతకంలో "సర్వే గుణా కాంచనం ఆశ్రయంతి" అనే భావాన్ని ప్రకటించాడు. ఈ వాదన అన్ని కాలముల యందు సమాజములో కొనసాగుచున్నది. రామా! నీవు గురువుల వచనములను పాటించుట ధర్మముగా తలచినావు.అయిననుఁ ప్రియపత్నిని రాక్షసుడు గొనిపోయెను. ధర్మాచరణము వలన అర్థము లేదు. 
పై విధమైన విచారణ అనాత్మవాదులు మరియు "సర్వంక్షణికం" అని భావించెడి వారు చేయునది.  అటువంటి అనాత్మవాదులు క్షణభంగుర వాదులైన వారికి తగిన ప్రత్యుత్తరమిచ్చి భారతీయ సమాజమును మరల వైదిక పరమైన సనాతన తత్వము, ఆత్మవాదమునకు తీసుకొని వచ్చుటకై రామాయణము మార్గదర్శకం చేయబడినది. కేవలము ప్రవచనము చెప్పుట, వినుట వలన గాక ఆచరణ పూర్వకమైన ధ్యేయమును ముందుంచుకొనవలెను. రామాయణ కాలము నందు కూడా వివేకవంతులైన లక్ష్మణుడు వంటి వారుకూడా ధర్మాచరణ, పాపభీతి ఇటువంటి వాదనతో క్షణికముగా విడిచి పెట్టేవారని ద్యోతకమవుతున్నది.
ఈ సంసారము నందు అజేయుడుగా యుండుట కొరకై ఒక యజ్ఞము చేయమని, ఆ యజ్ఞము పూర్తి అగు వరకు వేరొక చోటికి పోగూడదని ఇంద్రజిత్తుకు గురువు చెప్పెను. అందువలన అజ్ఞాత స్థానమున, నలువైపులా గట్టి బందోబస్తు చేసి ఇంద్రజిత్తు యజ్ఞమును ఆరంభించెను. కానీ విభీషణునికి ఆ యజ్ఞ స్థలము తెలియును. యజ్ఞము పూర్తి అయినచో ఇంద్రజిత్తు అజేయుడు అవును గాన ఆ యజ్ఞమును చెడగొట్టి అతని సంహారమే మేలని విభీషణుడు చెప్పగా శ్రీరాముడు లక్ష్మణునికి అనుమతి ఇచ్చెను. లక్ష్మణునికి కర్తవ్యము జ్ఞాపకమునకు వచ్చెను. యజ్ఞము పూర్తిగాకుండా ఇంద్రజిత్తును వధింపవలెను. తన సుఖదుఃఖములు ఎవరు గుర్తించినను, లేకపోయినను  వారి దుఃఖములను, వారే మ్రింగికొని  సమాధాన పరచుకొనవలెను. తమ అశ్రువులను తామే తుడుచుకొనవలెను. అటువంటి గంభీర స్వభావులు, సమాజ హితైభిలాషులు తమను తాము సముదాయించుకొని, మనస్సును ధృడము చేసుకొని, ఆపత్తులపై స్వారీ చేయుచు జీవన మార్గమును నిర్ణయించుకొందురు. అదియే వారి భగవత్ స్వరూపము. సాధారణ వ్యక్తి ఆపత్తులలో మునిగి కొట్టుకొని పోవును. కానీ ధీర పురుషులు క్షణ భంగురమైన లాభములపై మోహమును పొందక తమ ధర్మ చరిత్రను, వ్యక్తిత్వమును నిలబెట్టుకొని సత్యమార్గమునే అనుసరింతురు. అనంతమైన దుఃఖమును సహించుతూ తమ ఆదర్శమును వదిలిపెట్టరు. అటువంటి రామలక్ష్మణులు సమాజమునకు సదా ఆదర్శపురుషులు.
శ్రీరామ జయరామ జయజయ రామ

మత్తకోకిల సృష్టిధర్మము (పద్యపుష్పలు)
mallapragada sri devi raamakrishna 

  

ఉత్తమోత్తము సృష్టిధర్మము మూలభావము జీవితం  
సత్యవాదము ధర్మమార్గము మొహమంత్రము జీవితం
మత్తకోకిల మంజునాదము వందేమాతర జీవితం
చిత్తశుద్ధికి కార్యసిద్ధికి బ్రహ్మరాత ఏ జీవితం .........
  
సర్వలోకము సుందరత్వము చిత్రయోగము జీవితం 
సర్వకాలము నిత్యయోగము విద్యమార్గము జీవితం
సర్వ యోగము యజ్ఞదీపిక మంత్రభావము జీవితం
సర్వలక్ష్యము భక్తివేడుక యుక్తివాదన జీవితం .......

జీవితానికి నవ్వుసొంపులు వింతమాయలు తప్పదే
విశ్వజీవము  ప్రేమసూత్రము నిత్యనామము తప్పదే
భావితాత్వము సంఘదీపము ధర్మశాస్త్రము తప్పదే
కావ్యభావము నిత్యరాగము సోఖ్యమానము తప్పదే .....


కర్ణమూలము గాయపర్చకు మాటపోటుతొ నిత్యమూ
కార్యసాధన నీరుకార్చకు బేధబోధతొ నిత్యమూ
వీర్యసంపద వ్యర్ధపర్చకు వేశ్యకుల్కుతొ నిత్యమూ
సర్వసమ్మతి అందిపుచ్చుకొ ఇష్టగోష్టిగ నిత్యమూ .......

దూదిరేగియు గాలికమ్మియు ఊపిరాడక రోగిగా
ఆదమర్చియు ఉండుటెందుకు చీడపీడతొ రోగిగా
మందభాగ్యగ మందువాడక అంటురోగిగ మారగా
ఎంతచెప్పిన ఎన్నిఅన్నను ఒప్పుకోనని రోగిగా   ........

సత్య భాషణ ఎంతచెప్పిన పట్టుకోదులె మానసా
నిత్య పోషణ ఎంతచేసిన గుర్తురాదుగ మానసా
నిత్య వేషము వేయుటెందుకు భక్తివచ్చున మానసా
నిత్య వేదము పాడుటెందుకు ముక్తి రాదుగ మానసా ......

వెన్నెలంతయు కమ్ముకున్నను కాల మాయకు చిక్కెనే 

వన్నె చిన్నెల చిందు చూపులు చిన్నబోయిన దక్కునే
కన్నె మోనము ఖంగు తిన్నను వట్టి చూపులు కక్కెనే
చిన్న పెద్దయు అడ్డు వచ్చిన ఆశ పాశము ఏడ్చెనే .......

దాహమే ఇక తీరదా అని పేరు పేరున కోరగా
అహమే ఇక అడ్డువచ్చిన ఆకలాకలి కోరగా
మోహమే ఇక వెంబడించిన కింద మీదను కోరగా
ఊహయే ఇక నన్ను చేరగ ఏది ఏమని కోరగా .......

జీవ హానియు వద్దురా మరి మూగ ప్రేమను పొందుదాం
దివ్వ మైనది జీవితమ్ములె శాంతి దూతగ. మారురా
కావ్యమై  కదిలేవులే నిను నన్నునూ కరుణా దయా
సవ్యమై మది లోక రక్షక మమ్ము చూసేటి దైవమే .......

డబ్బు జబ్బుయు వద్దువద్దును అన్నముంటెను చాలుగా
డబ్బు మాటలు గబ్బులేపును రుబ్బినా అవి మారునా
జబ్బు జబ్బని నోట అన్నను మందు పట్టక తగ్గునా
నిబ్బరమ్ముగ ఉండ గల్గిన ముందు అంతయు కార్యమే ......

ప్రాభవం మరి హృద్యమే వనికే కదా నిను నన్నునూ
వైభవం మరి కావ్యమే కధగాకదా కళ కానుకా
జబ్బుయే మది మార్చుటే విధి ఆటగా నిను నన్నునూ
డబ్బుయే నిను నన్నునూ మది మార్చకే తిధి దైవమా ......

కొమ్మ కొమ్మ యు రాచుకున్నాను వేడిపుట్టును తెల్సుకో
బొమ్మ బొమ్మయు పెళ్లి ఆటలు నిజ మవ్వును తెల్సుకో
అమ్మ అత్తయు నవ్వులాటలు కాపురం అని తెల్సుకో
బామ్మ తాతయు సత్య వాక్కులు జీవితం అని తెల్సుకో.......

ఆశ పాశము అట్ట హాసము వద్దుఅన్నను చేరుటే
విశ్వ మోహము సత్ప్రవర్తన సంఘ మార్పలు వచ్చుటే
ఈశ్వరుడు  యె లోక రక్షక ధర్మ పాలక ధీరుడే
విశ్వ మోహిని వింత ఆటకు రామ తత్వము గెల్చుటే......

భక్తి యే మన శాంతిగా సుమయం సుసద్విని యోగమే
రక్తి యే సుఖ శాంతికి వినయం వినమ్రత యోగమే
శక్తి యే విధి శాంతి కి సఫలం సమగ్రత యోగమే
యుక్తి యే సతి శాంతి కి పతి ధర్మమే గతి యోగమే......

స్వార్ధ మన్నది జాతి సంపద కానె కాదియు మమ ని
స్వార్ధమే మది శాంతి సౌఖ్యము ప్రేమ పాశము దేశమే
అర్ధమే గతి పోరుసల్పుట దేశ రక్షణ కొరకే ముద్దులే
వ్యర్థ మన్నది చేయకుండగ సైని కుండుగా రక్షణే......

సాహితీ సుమ మాలికా సమ గౌరవం ఇక ఇచ్చుటే
వాహిణీ వర వేదికా కధ కావ్వ పాలనా నుంచుంటే
సాహిత్యం జప హోమ ద్రవ్యము ధర్మరక్షణ మార్గమే
దాహమే కవి సార్వభౌముల శాంతికోరుట లక్ష్యంగా......

పైట చెంగులొ గాలి దూరియు గోలచేయుట ఎందుకో
ఆట కాదిది యవ్వనమ్మున ఉర్కు పర్గులు ఎందుకో
మాట చిందక గాలి సవ్వడి భరించే ఎద ఎందుకో
కాట లాగున ఉండ లేకయు నీతి ఒప్పుట ఎందుకో......

అమ్మ ఎప్పుడు శాంతి నిచ్చియు ఓర్పు పంచియు జీవితా
శమ్మునే సుమ గంధమై మమరక్షణే నిజ శక్తియై
కామితార్ధము బిడ్డకోర్కలు తీర్చుటే సతి  ధర్మమై
అమ్మకష్టము తీర్చలేనిది ఆదరించుట ఉత్తమం......


ఏమి చెప్పెద ఏమె ఏమేమె ఏరు వాక ల పొంగులే
కమ్ము కున్నవి పాల పొంగులు వెంబ డించెను ఎందుకే
చిమ్ము తున్నవి మేఘ జల్లులు చిందు లేయుట ఎందుకే
నమ్మి చేరితి వమ్ము చేయక ఊహ కల్లలు చేయకే.........


అబ్బొఅందము అంతకంతకు పొందు సొంతము పొందుకే
పబ్బమెందుకు జబ్బచర్చియు ముందు దూకియు అందుకో
దిబ్భమోహము పెట్టు టెందుకు అందు తున్నవి సర్దుకో
అబ్బ చెంతకు వచ్చి చేరియు జాగు చేయుట ఎందుకో......

వంపుసొంపుల వల్లెవాటము వంతువంతుగ చూసుకో
ఇంపుగుండును మబ్బు చాటున మెఘ మందము చూసుకో
తప్పుఒప్పుల మాట వద్దులె ఆది అంతము సొంతమే
ఒప్పు కోవుట విప్పి చూపుట సంత సమ్ముయు ముద్దుకే......

మల్లె పువ్వు లు జాజి పువ్వులు తన్మయత్విగ ఊగుటే
గొల్ల భామకు వక్షొ జమ్ములు బంతులల్లెను ఊగుటే
వల్ల మాలిన భక్తి భావము నుండె వారికి కుంపటే
వల్లు మండిన జల్లు ఉండిన చల్లగుండిన దుప్పటే......

కన్ను గొట్టియు వంపు తిర్గియు నడ్డి చూపియు పిర్దులే
చిన్ని ఆశకు పైకి ఎత్తియు గూట మాశకు 
కన్నెసౌఖ్యము కన్నమిన్నుయు కానరాకయు చిందులే
మన్నుతిన్నయు బిడ్డవల్లెను నోటవేలును దూర్చెగా....
ఉల్లిపాయలు దంచి అల్లము మిర్చిరుబ్బియు పప్పులో 
లొల్లిచేయక నూనె బాండియు పెట్టియే సెగ పెంచియే 
చిల్లు గారెను తీసిచూపియు తొందతొందర గాచెసే 
అల్లిబిల్లిగ తిర్గుగారెను వేలుపెట్టియు మింగెనే  ......



*గండూష మథ కుర్వీత*
*శీతేన పయసా ముహుః,*
*కఫతృష్ణామలహరం*
*ముఖాంత శ్శుద్ధికారకమ్.*
*కుర్యా ద్ద్వాదశ గండూషాన్*
*పురీషోత్సర్జనే తతః,*
*మూత్రోత్సర్గే తు చతురో*
*భోజనాంతే తు షోడశ.*

చన్నీటితో అనేకసార్లు పుక్కిలించాలి. ఆవిధంగా చేయడం వల్ల కఫము, దప్పిక, దుర్వాసన హరించును. నోరు శుభ్రం అవుతుంది. మలవిసర్జన తరువాత పన్నెండుసార్లు, మూత్ర విసర్జన తరువాత నాలుగు సార్లు, భోజనం తరువాత పదహారు సార్లు పుక్కిలించాలి.

*మ.స్మృ.*

యుద్ధ కాండము-31

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-31
లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు హతుడగుట
ఇంద్రజిత్తు విభీషణుని మాటలను విని తీవ్రమైన క్రోథముతో, ప్రళయకాల మృత్యువువలె శత్రువినాశకరమగు బాణములను దాల్చి రథముపై దూకి లక్ష్మణుని ఎదురుగా నిలిచాడు. లక్ష్మణుని మహావేగముగల బాణములతో కొట్టగా, లక్ష్మణుడు పొగలేని అగ్నివలె కనబడెను. లక్ష్మణుడు, ఇంద్రజిత్తుల యుద్ధము ఆకాశములో రెండు గ్రహములు పోరాడుచున్నట్లు యుండెను. కోపగించిన లక్ష్మణుడు ఇంద్రజిఒత్తుపై పామువలె బుసగొట్టు బాణమును ప్రయోగించగా, ఇంద్రజిత్తు మొహము వివర్ణమయ్యెను. ఇది విభీషణుడు గమనించి లక్ష్మణునితో ఇంద్రజిత్తు ఓడిపోవు చిహ్నములు గనబడుతున్నాయి కావున త్వరపడమని చెప్పెను. ఇట్లు అనగానే  లక్ష్మణుడు విషముగల మహాసర్పముల వంటి బాణములను ప్రయోగించగా ఇంద్రజిత్తు ఒక్క క్షణము తెలివి తప్పి మరియొక క్షణములో హనుమ, లక్ష్మణునిపై తీవ్రమైన బాణములు వేసెను. ఈ విధముగా వారిరువురు భీమ పరాక్రమముతో పోరాడుచుండిరి. అప్పుడు విభీషణుడు గమనించి రాముని సేవకునిగా, వానరులకు ఉత్సాహము గల్పించుతూ, రావణునికి ఈ ఇంద్రజిత్తు ఒక్కడే ఆధారము గావున పరాక్రమించమని ప్రోత్సహించుతూ తాను గూడ యుద్ధమునకు దిగెను. విభీషణుడు అట్లు ప్రోత్సహించగా అప్పుడు వానరులకు, రాక్షసులకు మధ్య భీకర పోరు జరిగెను. లక్ష్మణుడు, ఇంద్రజిత్తు మధ్య పోరుతో అంతరిక్షము అంతయు ఆచ్చాదితమయ్యెను. ఆకాశము బాణములతో చీకటి అయ్యెను. రక్తపు నదులు ప్రవహించుచుండెను. లక్ష్మణుడు ఇంద్రజిత్తు యొక్క రథమును గుఱ్ఱములు, సారథితో సహా మట్టుబెట్టెను. ఇంద్రజిత్తులో ఉత్సాహము తగ్గెను. అప్పుడు ఇంద్రజిత్తు క్షణ కాలములో నగరమునకు వెళ్లి మరియొక రథమును, బాణములను తీసుకొని యుద్ధభూమికి వచ్చి వానరులను తీవ్రముగా క్షోభ పెట్టెను. అతని హస్తలాఘవమునకు లక్ష్మణుడు ఎంతయో అచ్చెరు నొందెను. ఇంద్రజిత్తు వరుసగా రౌద్రాస్త్రమును, ఆగ్నేయాస్త్రమును, ప్రయోగించగా లక్ష్మణుడు వారుణాస్త్రమును, మహేశ్వరాస్త్రమును ప్రయోగించెను. అప్పుడు లక్ష్మణుడు శ్రేష్ఠమైన శరమును ధనుస్సు నందు సంధించి అర్థసాధకమగు ఒక వాక్యమును పలికినాడు.
ధర్మాత్మా సత్యసంధ శ్చ రామో దాశరథి ర్యది
పౌరుషే చా౭ప్రతి ద్వన్ద్వ: శరైనం జహి రావణిమ్      6.91.73
"దశరథ పుత్రుడగు రాముడు ధర్మాత్ముడు, సత్యసంధుడు, పౌరుషములో ఎదురులేనివాడు అయినచో, ఓ! బాణమా! నీవు రావణుని పుత్రుని చంపుము" అని బాణమును ఆకర్ణాంతము లాగి ఇంద్రజిత్తుపై వదలినాడు. వెంటనే ఇంద్రజిత్తు యొక్క శిరస్సు నేలబడినది.
లక్ష్మణుడు చెప్పిన ఈ శ్లోకము రామాయణములో ఒక మంత్రము. దీనిని సిద్ధి మంత్రము అందురు. ఈ మంత్రం ప్రభావము వలన ఇంతకు మునుపు వ్యర్థమైన అస్త్రముల వలె గాకుండా వ్యర్థము గాలేదు. దీనితో రాముడు ధర్మాత్ముడని, సత్యసంధుడని, పౌరుషములో ఎదురులేనివాడని ఋజువైనది. చెట్టు చాటు నుండి వాలిని సంహరించిన రాముడు ధర్మాత్ముడా!, పట్టాభిషేకమునకు అంగీకారము తెలిపి వనవాస దీక్ష తీసుకొనుట సత్యసంధతయా!, ఖరునితో యుద్ధము చేయునప్పుడు మూడు అడుగులు వెనుకకు వేయుట  పౌరుషములో ఎదురులేనివాఁడా! అను సందేహములను నివారించినది. అంతియే గాక రాముడు పాయసమునకు పుత్రుడు గాని దశరథునికి పుత్రుడా! అను సందేహమునకు కూడా ఋజువు కనబడినది.
రామాయణము పారాయణము చేయువారు ఈ శ్లోకమును మూల మంత్రముగా జపింతురు. ఏదైనా కార్యములో సిద్ధి కలగ వలెనన్న ఈ శ్లోకమును ధ్యానించినచో, జపించినచో తప్పక కార్యసిద్ధి కలుగునని శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యులవారు సెలవు ఇచ్చిరి. అంతియేగాక ఈ శ్లోకమును జయమంత్రముతో (ఇది సుందర కాండలో యున్నది) కూడి ధ్యానించినచో/జపించినచో అమోఘమైన ఫలితములు  పొందవచ్చు.
ఇంద్రజిత్తు నేలకూలతతో వానరుల ఆనందమునకు అవధులు లేకపోయెను. వారందరు రాముడు ఉన్న ప్రదేశమునకు వచ్చిరి. లక్ష్మణుడు శ్రీరామునికి నమస్కరించెను. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుని శిరస్సును నిండు ప్రేమతో మూర్కొనెను. ఇంద్రజిత్తు మరణించుటతో రాక్షసులందరిని మనము జయించినట్లే. ఈ విధముగా ఆ రామచంద్రప్రభువు తమ్మునకు ఊరట గూర్చి తనవిదీర  హృదయమునకు హత్తుకొనెను.
శ్రీరామ జయరామ జయజయ రామ

Friday 14 February 2020

యుద్ధ కాండము-30

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-30
 
ఇంద్రజిత్తు మాయాసీతను సృష్టించి హనుమ ఎదురుగా చంపివేయుట
శ్రీరాముని మనోభావములను గుర్తించి, ఇంద్రజిత్తు యుద్ధరంగము నుండి మరలి లంకానగరమున ప్రవేశించెను. ఇంద్రజిత్తు మాయచే సీతను కల్పించి రథముపై కూర్చుండబెట్టి ఆమెను చంపుటకు సిద్ధపడెను. రథముపై ఏకవేణితో యున్న సీతను హనుమ చూచి మిగుల చింతాక్రాంతుడయ్యెను. అప్పుడు అడ్డుకొనుటకు హనుమ వానరులతో కూడి ఇంద్రజిత్తు రథమును చేరుకొనుటకు పరిగెత్తెను. అప్పుడు ఇంద్రజిత్తు తన ఒర నుండి కత్తిని లాగి కొట్టుచుండగా, సీత రామా! రామా! అని అరచుచుండెను. ఇంద్రజిత్తు హనుమతో "రాముడు ఎవతె కోసమై వచ్చినారో అట్టి సీతను చంపెదను" అని చెప్పి హనుమ చూచుచుండగా ఆ మాయాసీతను చంపెను. హనుమ వానరులకు ధైర్య వచనములు చెపుతూ ఇంద్రజిత్తును ఎదిరించుటకు సిద్ధపడెను. తరువాత ఇంద్రజిత్తు వారిపై తీవ్రమైన బాణప్రయోగము చేసెను. అప్పుడు హనుమ వానరులతో సహా ఈ విషయము రామలక్ష్మణులకు ఎరిగించుటకై వెనుకకు మరలెను. హనుమ వెనుకకు వెళ్ళుట గమనించి ఇంద్రజిత్తు ఇదే సమయమని నికుంభిలా హోమము చేయుటకు సిద్ధపడెను. యజ్ఞభూమిలో శాస్త్రోక్తముగా అగ్నిని ప్రజ్వలింప జేసెను. మాంసముతో, రక్తముతో అగ్నిని సంతృప్తి పరచు చుండెను. ఇంతలో హనుమ రాముని వద్దకు చేరి దుఃఖియై మేము చూచుచుండగానే ఇంద్రజిత్తు సీతమ్మను చంపినాడు అని చెప్పెను. ఆ మాట వినగనే రాముడు మొదలు నరికిన చెట్టు వలె మూర్ఛనొంది నేలపై పడిపోయెను. రాముని దుఃఖమును చూచి లక్ష్మణుడు అతనిని ఎంతయో ఊరడించెను. అప్పుడు విభీషణుడు శ్రీరామునితో "రామా! దురాత్ముడైన రావణుడు అభిప్రాయమును నేను ఎరుగుదును. ఎట్టి క్లేశము వచ్చినను సీతమ్మపై యున్న మోహముచే చంపుటకు సిద్ధపడడు. ఎన్ని బాధలైనను సహించును గాని సీతమ్మను నీకు అప్పగిచ్చుటకు ఒప్పుకొనలేదు. రాక్షసుడగు ఇంద్రజిత్తు వానరులను మోహమున బడవేసి నికుంభిలా హోమము చేయుటకు వెడలెను. ఆ హోమము పూర్తి కాక మునుపే సేనా సహితముగా ఆ మందిరమునకు వెడలవలెను. హోమము పూర్తియైనచో అతడు అవధ్యుడు. హోమము వదలి అతడు బయిటకు వచ్చునట్లు చేయవలెను. కావున మా వెంట లక్ష్మణుని పంపుము" అని చెప్పెను.  అందుకు శ్రీరాముడు అనుజ్ఞ యిచ్చెను.
 
అక్కడ కొంత దూరములో వ్యూహాత్మకంగా నిలిచి యున్న ఇంద్రజిత్తు బలములను గాంచెను. ఇంద్రజిత్తు వద్దకు సమీపించి అతడు చేయుచున్న యాగమును భగ్నమొనర్చుటకై సన్నద్ధుడై దుర్భేధ్యముగా యున్న ఆ రాక్షస బలమందు లక్ష్మణుడు ప్రవేశించెను. అప్పుడు విభీషణుడు, లక్ష్మణునితో ఈ అభిచార హోమ కార్యములు ముగియక మునుపే ఈ రాక్షస సేనను మట్టి గరిపించినచో ఇంద్రజిత్తు మనకు కనపడును. విభీషణుని సూచనతో లక్ష్మణుని సారథ్యములో హనుమదదాది వానరాలు ఒక్కసారిగా ఇంద్రజిత్తు మరియు అక్కడున్న సమస్త వానర సేనలు ఆక్రమణ చేసిరి. అందుకు కినుక వహించిన ఇంద్రజిత్తు స్వయముగా హనుమతో యుద్ధమునకు పూనుకొనెను. అది చూచి లక్ష్మణునితో, విభీషణుడు; "లక్ష్మణా! ఆ రావణ కుమారుడు ఇంద్రుని జయించాడు. కావున అతనిని వెంటనే సంహరింపుము" అనెను. అంతియేగాక ఇంద్రజిత్తు చేయుచున్న హోమమును, అక్కడ భూతములకు బలి ఇచ్చు మర్రిచెట్టును విభీషణుడు లక్ష్మణునికి చూపి, ఇంద్రజిత్తు ఆ మర్రిచెట్టు వద్దకు రాకుండా నివారింప వలెనని చెప్పెను. లక్ష్మణుడు ఆ మాటలను విని తన ధనస్సుతో చిత్రవిచిత్రములుగా ధ్వని చేయుచు ఇంద్రజిత్తును యుద్ధమునకు పిలిచెను. లక్ష్మణుని వెనుక యున్న విభీషణుని చూచి ఇంద్రజిత్తు ఈ విధముగా దూషించెను.
 
గుణవాన్ వా పరజనః స్వజనో నిర్గుణోఽపి వా
నిర్గుణః స్వజనః శ్రేయాన్ యః పరః పర ఏవ సః        6.87.15

య: స్వపక్షం పరిత్యజ్య పరపక్షం నిషేవతే
స స్వపక్షే క్షయం ప్రాప్తే పశ్చాత్ తై రేవ హన్యతే        6.87.16
 
శత్రువు గుణవంతుడే గావచ్చు. తనవారు గుణము లేనివారే గావచ్చు. గుణము లేనివారైనను తనవారితో కలసి యుండుటయే శ్రేయస్కరము. ఎప్పుడైనను శత్రువు శత్రువే. తన పక్షమును వీడి పరపక్షమును ఒకనాడు చేరినను, తనవారు అందరూ చనిపోయిన తర్వాత శత్రువు వానిని కూడా తప్పక చంపును. అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తుతో "రాక్షసా! నా స్వభావమును నీవు ఎరుగుదవు. అపౌరుష్యమును వదిలము.
 
ధర్మాత్ ప్రచ్యుత శీలం హి పురుషం పాప నిశ్చయం 6.87.21
 
త్యక్త్వా సుఖ మ౭వాప్నోతి హస్తా దా౭౭శీ విషం యథా
హింసా పరస్వ హరణే పర దారా౭భిమర్శనం                          6.87.22

పరస్వానాం చ హరణం పర దారా౭భిమర్శనమ్       6.87.23
సుహృదా మ౭తి శ౦కా౦ చ త్రయో దోషాః క్షయావహాః

దర్మ భ్రష్టమైన శీలము గలవాడు, పాపపు తలంపులు గలవాడు, అగు పురుషునకు దూరముగా యున్నవాడు తీవ్రమగు విషముగల పాముకు దూరమగునట్లు సుఖము గలుగును. దర్మ భ్రష్టమైన శీలము గలవాని ఇల్లు ఎంత ప్రమాదకరమో హింస, పరధన అపహరణము, పర భార్యాస్పర్శనము అంత ప్రమాదకరములు. నిప్పు అంటుకొనిన ఇంటిని ఎలా విడువ వలెనో అట్లే పరధనమును, పరభార్యను చేపట్టిన వానిని కూడా విడువవలెను. పరధనమును హరించుట, పరస్త్రీని కూడుట, తనను ప్రేమించిన మిత్రుని శంకించుట అను మూడు దోషములు మనుజునికి వినాశనమును తెచ్చి పెట్టును. ఈ దోషములచే నా సోదరుడు వినాశనమును కొని తెచ్చుకొన్నాడు. నీవు బాలుడవు. ఆ మర్రిచెట్టులో ప్రవేశింపజాలవు. రామలక్ష్మణులను ఎదిరించి బ్రతుకుట కష్టము. ఈ విధముగా విభీషణుడు ఇంద్రజిత్తుతో పలికినాడు.
శ్రీరామ జయరామ జయజయ రామ

Thursday 13 February 2020

యుద్ధ కాండము-29

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-29

సుగ్రీవుని ఆజ్ఞపై వానరులు లంకను దహించివేయుట
ఆ తరువాత సుగ్రీవుడు హనుమతో కుంభకర్ణుడు చనిపోయినాడు. రావణ సుతులు చాలా మంది చనిపోయినవారు. ఇంక రావణుడు తన పట్టణమును రక్షించుకొను అవకాశము లేదు. కాన మన వానరులు లంకా నగరమును దహించి వేయమని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు వానరులు ఆ భయంకరమైన రాత్రి యందు జ్వలించుచున్న కాగడాలతో లంక నగరంలోని పురద్వారములను, భవనములను, రాజవీధులను, ఉప వీధులను ఉత్సాహముతో నిప్పు పెట్టగా అవియన్నియు అగ్నికి ఆహుతి అయ్యెను. అగ్నిజ్వాలలచే వ్యాప్తములైన బహిర్ద్వారములు వర్షాకాలమందు విధ్యుత్కాంతులచే చుట్టబడిన మేఘమువలె ఒప్పుచున్నవి. అక్కడ ఉన్న నాగరికులు అందరు హాహాకారములు చేసిరి. అగ్నిచే దహింపబడుచున్న ఆ లంకకు చుట్టునుగల సాగరము తననీటిపై అగ్నిజ్వాలలు నీడలు ప్రతిఫలించుచుండుటచే అది ఒక ఎర్ర సముద్రము వలె కనబడెను. అంతట ఓషదుల ప్రభావము వలన శరీర బాధలు తొలగిన రామలక్ష్మణులు తమ ధనస్సులను చేబూని ధనుష్టంకారము చేయగా రాక్షసులెల్లరు భీతిల్లిరి. రాముని ధనుస్సు నుండి వచ్చిన బాణముల దాటికి కైలాస శిఖరము వంటి లంకానగర గోపురము శిధిలమై క్రిందపడిపోయెను. రాక్షసులకు అది ప్రళయ రాత్రివలె గనిపించెను. సుగ్రీవుని అనుజ్ఞ మేరకు వానరవీరులు కాగడాలు పట్టుకొని రావణుని అంతఃపురమునకు సమీపించిరి. అప్పుడు రావణుడు క్రుద్ధుడై కుంభకర్ణుని పుత్రులైన కుంభ నికుంభులను గొప్ప రాక్షస సేనతో వారికి తోడుగా యూపాక్షుడు, శోణితాక్షుడు, ప్రజంఘుడు, కంపనుడు యుద్ధమునకు బయలుదేరిరి. అప్పుడు జరిగిన యుద్ధము నందు అంగదుడు కంపనుని, శోణితాక్షుని, ప్రజంఘుని; ద్వివిదుడు శోణితాక్షుని; మైందుడు యూపాక్షుని, సుగ్రీవుడు కుంభుని; హనుమ నికుంభుని; శ్రీరాముడు మకరాక్షుని వధించిరి.
ఇంద్రజిత్తు అదృశ్యుడుగా యుండి యుద్ధము చేయుట
అప్పుడు మహాకుపితుడైన రావణుడు, ఇంద్రజిత్తును ఆదేశించుతూ ఇట్లు పలికెను.
 
జహి వీర మహా వీర్యౌ భ్రాతరౌ రామ లక్ష్మణౌ
అదృశ్యో దృశ్యమానో వా సర్వథా త్వం బలా౭ధికః  6.80.3
 
వీరుడా! నీవు శత్రువులకు కనబడచుగాని, కనబడకుండగాని యుద్ధము చేయగల గొప్ప నేర్పరివి. కనుక నీవు మహావీరులైన రామలక్ష్మణులను జయింపుము అని సెప్పి పంపెను. ఇంద్రజిత్తు రాజాజ్ఞను శిరసావహించి యజ్ఞభూమి యందు విధ్యుక్తముగా అగ్నిని వ్రేల్చెను. ఇంతలో ఋత్విక్కులు ధరించుటకై రాక్షస స్త్రీలు ఎర్రని తలపాగాలు తీసుకొని హోమము చేయుచున్న ప్రదేశమునకు వచ్చిరి. పిమ్మట హోమవేదికకు చుట్టును శస్త్రములను, రెల్లుగడ్డి పత్రములను అస్తరణములుగాను, రావిచెట్టు పిల్లలను సమిధలుగాను, ఋత్విక్కులకై ఎర్రని వస్త్రములను, నల్లని ఇనుపస్రువమును యుంచిరి. రెల్లు పరకలతో   గూడిన తోమరములను యజ్ఞవేదికకు నలువైపులా చేర్చిరి. పిదప సజీవంగా యున్న నల్లని మేకను బలి యిచ్చిరి. అప్పుడు పొగలు లేని అగ్నిజ్వాలలు ఒక్కసారిగా పైకి లేచెను. అందుండి అగ్నిదేవుడు స్వయముగా వ్యక్తమై ఆహుతులను స్వయముగా స్వీకరించెను. పిదప అతడు అంతర్థాన శక్తి గలిగిన నాలుగు గుఱ్ఱములు, వాడియైన బాణములు, ధనస్సులతో గూడియున్న రథమును అధిరోహించెను. అట్టి రథముతోను, బ్రహ్మాస్త్రముతోను గూడి, మహాబలశాలియైన ఆ ఇంద్రజిత్తు శత్రువులకు ఎదిరింప శక్యము గాని వాడై యుండెను. అప్పుడు ఇంద్రజిత్తు అక్కడయినా రాక్షసులతో "నేను రామలక్ష్మణులను, సకల వానరులను సంహరించి నా తండ్రియైన రావణునకు యుద్ధ విజయమును చేకూర్చెదను" అని చెప్పి అంతర్ధానమయ్యెను.
 
ఇంద్రజిత్తు రావణునిచే ప్రేరితుడై, మిగుల క్రుద్ధుడై వానరుల మధ్య యున్న రామలక్ష్మణులపై సంతత ధారగా బాణవర్షమును కురిపించెను. ఎవ్వరికిని కనబడకుండ ఇంద్రజిత్తు ప్రయోగించు బాణములకు కోపముతో రామలక్ష్మణులు అతనిపై దివ్యాస్త్రములను ప్రయోగించిరి. మహాబాహువుయైన ఇంద్రజిత్తు మబ్బు మాటున యుండి గురిపించుచున్న బాణవర్షమునకు రామలక్ష్మణులు రక్తసిక్తులయ్యిరి. అంతట లక్ష్మణుడు మిగుల కోపించి బ్రహ్మాస్త్రమును ప్రయోగించుటకు సిద్ధమయ్యెను. అప్పుడు రాముడు లక్ష్మణునితో ...
 
తమ్ ఉవాచ తతో రామో లక్ష్మణం శుభ లక్షణమ్
నైకస్య హేతో రక్షాంసి పృథివ్యాం హన్తు మ౭ర్హసి 6.80.38
 
అయుధ్యమానం ప్రచ్ఛన్నం ప్రా౦జలిం శరణా౭౭గతమ్
పలాయన్తం ప్రమత్తం వా న త్వం హన్తుమ్ ఇహా౭ర్హసి 6.80.39
 
య ద్యేష భూమిం విశతే దివం వా
 రసాతలం వా౭పి నభ స్తలం వా
 ఏవం నిగూఢోఽపి మమా౭స్త్ర దగ్ధః
 పతిష్యతే భూమి తలే గతా౭సుః 6.80.42
 
సోదరా! ఒక్కనికొరకై భూమండలమున యున్న సమస్త రాక్షసులను సంహరించుట సముచితము గాదు. యుద్ధము చేయనివాడు, దాగుకొనిన వాడు, చేతులు జోడించుకొని శరణు పొందినవాడు, యుద్ధమున పారిపోయినవాడు, పిచ్చివాడు - అట్టివారిని చంపరాదు. అప్పుడు రాముడు ఇంద్రజిత్తును మాత్రమే చంపుటకు పూనుకొని లక్ష్మణునితో "ఇతడు భూతలమున ప్రవేశించినను, స్వర్గమునకు ఏగినను, రసాతలమున జొచ్చినను, ఆకాశమందున్నను నా అస్త్రములచే దగ్ధుడై, ప్రాణరహితుడై తప్పక భూమిపై పడిపోగలడు" అని పలికి ఇంద్రజిత్తును చంపుటకు ఉపాయమును ఆలోచించసాగెను.
 
శ్రీరామ జయరామ జయజయ రామ

Wednesday 12 February 2020

యుద్ధ కాండము-28

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-28

హనుమ సంజీవని పర్వతమును తీసుకొని వచ్చుట
జాంబవంతుడు హనుమతో "కపివరా! ఈ వానరులను కాపాడుటకు నీవే సమర్థుడవు. కావున ముందునకు వచ్చి కటిబద్ధుడవు కమ్ము. పరాక్రమించుటకు నేవే సమర్థుడవు, ఇదియే తగిన సమయము. వ్యధకు గురియైన ఈ రామలక్ష్మణులకు గ్రుచ్చుకొన్న బాణములను తొలగింపుము. నీవు వెంటనే సముద్రము మీదుగా అంతరిక్షమున పయనించి హిమవత్పర్వతమునకు వెళ్లుము. అక్కడ ..
 
తతః కా౦చన మ౭త్యుచ్ఛమ్ ఋషభం పర్వతోత్తమమ్
కైలాస శిఖరం చా౭పి ద్రక్ష్య స్య౭రినిషూదన           6.74.30
 
తయోః శిఖరయో ర్మధ్యే ప్రదీప్త మ౭తుల ప్రభమ్
సర్వౌషధి యుతం వీర ద్రక్ష్యసి ఔషధి పర్వతమ్  6.74.31
 
తస్య వానర శార్దూల చతస్రో మూర్ధ్ని సంభవాః
ద్రక్ష్య స్యోషధయో దీప్తా దీపయన్త్యో దిశో దశ 6.74.32
 
మృత సంజీవనీం చైవ విశల్య కరణీమ్ అపి
సావర్ణ్య కరణీం చైవ సంధాన కరణీ౦ తథా 6.74.33
 
తాః సర్వా హనుమన్ గృహ్య క్షిప్ర మా౭౭ గన్తు మ౭ర్హసి
ఆశ్వాసయ హరీన్ ప్రాణై ర్యోజ్య గన్ధవహా౭౭త్మజ 6.74.34
 
హనుమా! హిమాలయ పర్వతములపై నీకు స్వర్ణమయమై, అత్యున్నమైన "వృషభగిరి" అను ఒక మహాపర్వతము, కైలాస శిఖరము కనబడును. ఆ వృషభగిరికిని కైలాస శిఖరమునకు మధ్య సాటిలేని తేజస్సుతో చక్కగా వెలుగొందు చుండెడి "ఓషది పర్వతము" కనబడును. అది వివిధములగు ఓషదులకు నిలయము. ఆ శిఖరంపై దివ్యములైన నాలుగు ఓషదులు నీకు గోచరించును. అవి దివ్య కాంతులతో దశ దిశలను ప్రకాశింప చేయుచుండును. మృతసంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సావర్ణ్యకరణి అను నాలుగు మహౌషదులను[1] తీసుకొని శీఘ్రముగా మరలి రమ్ము.  ఆ ఓషదుల ప్రభావంతో వానరులను సజీవులను గావించి వారికి స్వస్థత గూర్పుము. అప్పుడు హనుమ జాంబవంతుని మాటలను విన్నంతనే రెట్టించిన పరాక్రమముతో, శ్రీరాముని ధ్యానము చేసి, ఆకాశ గమనమునకు వీలుగా ప్రాణవాయువును నిరోధించి,  త్రికూట పర్వతము నుంచి ప్రచండ వేగముతో మింటికి ఎగిరెను. అప్పుడు ఆ కపివీరుని వేగమునకు వృక్ష సమూహములు, గిరిశిఖరములు, మహాపాషాణములు, త్రికూట పర్వతముపై స్థిర నివాసమున్న వానరములు పైకి ఎగిరి కొంత తడవు పిమ్మట బలహీన పడి సముద్రములో పడిపోయినవి. ఈ విధముగా హనుమ ఆకాశమార్గమున/అంతరిక్షము పయనించి హిమవత్పర్వతమును గాంచెను.  ఆ పర్వత ప్రదేశమున బ్రహ్మ నివాస స్థానము, కైలాసము, ఇంద్రుడు నివశించు ప్రదేశము, శివుడు విలాసముగా తన శరములను ప్రయోగించెడి భూమి, హయగ్రీవుడు ఆరాధించెడి స్థానము, ఈశ్వరునిచే ఖండితమైన బ్రహ్మ శిరస్సు పడిన చోటు, యమకింకరులు అప్పుడప్పుడు విశ్రాంతిగైకొనెడి ప్రదేశము, బ్రహ్మ ఇంద్రునకు వజ్రాయుధమును అనుగ్రహించిన ప్రదేశము, కుబేరుని నిలయము, సూర్యుని భార్య యగు ఛాయాదేవి[2] ప్రీతి కొరకు సూర్యకాంతిని తగ్గించుటకై విశ్వకర్మ భాస్కరుని బంధించిన ప్రదేశము, దేవతలకు దర్శనము కొరకై బ్రహ్మ ఆసీనుడగు ప్రదేశము, శంకరుడు తన ధనస్సును నిలిపెడు చోటు, పాతాళమును ప్రవేశించు ప్రదేశము మున్నగు విశిష్ట స్థానములను ఆ మారుతి దర్శించెను. జాంబవంతుని సూచన ప్రకారము సర్వఔషధ పర్వతమును మారుతి గాంచెను. అతడు ఆ పర్వతమునకు ప్రదక్షణమొనర్చి తనకు అవసరమగు ఓషదులకొరకై అన్వేషింప సాగెను. అప్పుడు ఆ దివ్య ఔషదములు తమను తీసుకొనిపోవుటకు ఎవరో వచ్చినారని గ్రహించి అదృశ్యమాయెను. అప్పుడు హనుమ ఆ ఓషదులు శ్రీరామునికి వారు చేయుచున్న అనాదరణకు క్రుద్ధుడై ఆ పర్వతమును పెకిలించి, చేబూని, ఆకాశమునకు ఎగిరెను. ప్రచండ వేగముతో ఆ పర్వతమును గైకొని త్రికూట పర్వతమునగల వానర సైన్యము మధ్య దిగెను.  ఆ ఓషదుల ప్రభావమున రామలక్ష్మణులకు తగిలిన గాయములు మటుమాయముగాగా ఎప్పటివలె తేజోమూర్తులైరి. పిమ్మట వానరులు గూడ స్వస్థత చేకూరి పునర్జీవితులై, గాయములు తొలగి, ఆరోగ్యవంతులైరి. వానర రాక్షస వీరుల మధ్య నేటి వరకు జరిగిన యుద్ధములో మృతులైన రాక్షసులను, రావణుని ఆజ్ఞ మేరకు ఆయన గౌరవము నిలుపుటకై సముద్రమున పడవేసిరి. అందువలన మృతులైన రాక్షసులు ఎవరును పునర్జీవితులు కాలేదు. తరువాత మారుతి ఆ ఓషధీశైలమును శీఘ్రముగా హిమవత్పర్వతమునకు చేర్చి మరుక్షణమే శ్రీరాముని వద్దకు వచ్చెను.
శ్రీరామ జయరామ జయజయ రామ
[1]
"మృతం సంజీవయతి ఇతి మృతసంజీవనీ":  మృతి చెందిన వారిని బ్రతికించునది.
"జీవనానంతరం సంచారక్షమాతాయై విశల్యం కరోతి - ఇతి విశల్యకరణీ": ప్రాణములు వచ్చిన పిమ్మట అటునిటు సంచరించుటకు వీలుగా బాధలను తొలగించునది.
"విశల్యేకృతే  త్వచస్సంధానం కరోతి ఇతి సంధానకరణి": గాయములు మానినంతనే చర్మమును యథాస్థికి తెచ్చునది.
"తథోవ్రణ కృత వైవర్ణం విహాయ ప్రదేశాంతర సావర్ణ్యం కరోతి ఇతి సావర్ణ్యకరణి": గాయములు మానిన చోట్ల ఏర్పడిన మచ్చలను రూపుమాపి, యథాప్రకారముగా శరీరమును (చర్మమును) శోభిల్ల చేయునది.
[2] ఉష, పద్మిని, ఛాయ, సంజ్ఞ అను నలుగురును సూర్యుని భార్యలు. ఛాయ యొక్క కుమారుడు శని. సంజ్ఞ యొక్క కుమారుడు  

Tuesday 11 February 2020

యుద్ధ కాండము-27

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-27
ఇంద్రజిత్తు యుద్ధ విజృంభణ
 
సూర్యకాంతితో ఆకాశము ప్రకాశించునట్లు ఇంద్రజిత్ యుద్ధభూమిని జేరెను. తన రథము చుట్టూ సైనికులను నిలిపెను. రాక్షస శ్రేష్ఠుడు మంత్రపూర్వకముగా అగ్నిహోత్రములో హోమము చేసెను. హవిస్సులతో, మాలికల్తో, గంథములతో అగ్నిహోత్రుని ఆరాధించెను. శస్త్రములను, రెల్లును అగ్నిహోత్రమునకు చుట్టును అర్పించెను. ఉక్కుతో హోమము చేయు సాధనమును అనగా స్రువమును కల్పించెను. యుద్ధభూమి యందు అగ్ని చుట్టును దర్భలను, చిన్న ఈటెలను పరచి, సజీవంగా యున్న నల్లని మేక యొక్క కంఠమును పట్టుకొనెను. పిదప దానిని అగ్నికి ఆహుతి ఇచ్చెను. అప్పుడు పొగలేని అగ్నిజ్వాలలు ఒక్కసారిగా ప్రజ్వలించినవి. అందు విజయ సూచకమైన చిహ్నములు గోచరించినవి. అంతట అగ్నిదేవుడు మేలిమి బంగారు ఆభరణములను ధరించి ప్రదక్షణ పూర్వకముగా తిరుగుచున్న జ్వాలలు గలవాడై స్వయముగా వచ్చి ఆ ఆహుతిని (హోమద్రవ్యమును) స్వీకరించెను. తదుపరి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమును ఆవాహనమొనర్చి, తనధనస్సును, రథమును అచట ఉంచి, బ్రహ్మాస్త్ర మంత్రములచే వాటిని అభిమంత్రించెను. ఆ రావణ సుతుడు అగ్నికి హవిస్సులను సమర్పించుచు, బ్రహ్మాస్త్రమును ఆహ్వానించుచున్నప్పుడు సూర్యచంద్రులు, నక్షత్రములు, అంతరిక్షమున గల ఇతర ప్రాణులు భీతికి లోనయ్యెను. అగ్నివలె తేజోమూర్తియు, మహేంద్రుని వలె మిక్కిలి ప్రభావశాలియు, అద్భుతమైన మంత్రశక్తి గలవాడును ఐన ఇంద్రజిత్తు తన అగ్నికార్యములు (హోమములు) పూర్తియైన పిమ్మట ధనుర్భాణములతో, ఖడ్గములతో రథాశ్వములతో, సారథితో సహా కూడి ఆకాశమునకు ఎగిరి అంతర్ధానమయ్యెను.  అప్పుడు జరిగిన మహాసంగ్రామములో ఇంద్రజిత్తు బాణపు దెబ్బలచే అనేకమైన వానరులు నెలకొరిగిరి. కాలాగ్ని వలె వానరులందరూ దహించుచుండిరి. వానర సైన్యమంతయు బాణములచే మూర్ఛ నొందెను. రక్తము స్రవించు చుండెను. సైన్యము వ్యాకులము నొందెను. ఇది చూసి ఇంద్రజిత్తు ప్రీతీ నొందెను. అప్పుడు ఇంద్రజిత్తు తన సైన్యమును వదలి తాను ఎవ్వరికి కనబడకుండా తీవ్రమగు కారుమబ్బు జలధారలు వర్షించునట్లు బాణవర్షమును వర్షించు చుండెను. ఆ బాణవర్షముచే రామలక్ష్మణులను సైతము చీకాకు పరచెను. రాముడు మహాశక్తి  కలవాడయ్యు  ఇంద్రజిత్తు వర్షించుచున్న బాణములను చూచి లక్ష్మణునితో "లక్ష్మణా! యీతడు బ్రహ్మాస్త్రముచే మన సైన్యము నంతయు పడగొట్టి మనలను కూడా చీకాకు పరచుచున్నాడు. బ్రహ్మ ఒసగిన వరముచే మనకు కనబడకుండా ఆకాశమున సంచరించుచున్నాడు. కావున ధైర్యముతో ఓరిమి వహించుము". అనెను. ఇంద్రజిత్తు హర్షముతో రామలక్ష్మణులతో సహా వానర వీరులందరు నేలపై పడి యుండుట చూచి విజయగర్వంతో లంకలో ప్రవేశించెను. ఈ విధముగా ..
 
సప్త షష్టి ర్హతాః కోట్యో వానరాణాం తరస్వినామ్
అహ్నః ప౦చమ శేషేణ వల్లభేన స్వయమ్భువః  6.74.12
 
ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్ర ప్రభావముచే మిగుల బలపరాక్రమవంతులైన వానరులు అరువదియేడు కోట్ల మంది ఆ సాయంకాలమున హతులైరి. భీతిని కొల్పుచున్న వానర సైన్యమును చూచి హనుమంతుడు, విభీషణుడు జాంబవంతుని వెతకసాగిరి. వయోవృద్ధుడు, బ్రహ్మదేవుని సుతుడు అయిన జాంబవంతుడు బాణములచే గాయపడి యుండుట చూచిరి. వారు జాంబవంతునితో నీ ప్రాణములకు ముప్పు వాటిల్లలేదుగదా అని అడిగిరి. అప్పుడు జాంబవంతుడు విభీషణునితో …..
 
అ౦జనా సుప్రజా యేన మాతరిశ్వా చ నైరృతా
హనూమాన్ వానర శ్రేష్ఠః ప్రాణాన్ ధారయతే క్వచిత్ 6.74.18
 
శ్రుత్వా జామ్బవతో వాక్యమ్ ఉవా చేదం విభీషణః
  ఆర్య పుత్రా వ౭తిక్రమ్య కస్మాత్ పృచ్ఛసి మారుతిమ్  6.74.19
 
 నైవ రాజని సుగ్రీవే నా౭౦గదే నా౭పి రాఘవే
 ఆర్య సందర్శితః స్నేహ: యథా వాయు సుతే పరః 6.74.20

 విభీషణ వచః శ్రుత్వా జామ్బవాన్ వాక్యమ్ అబ్రవీత్
 శృణు నైరృత శార్దూల యస్మాత్ పృచ్ఛామి మారుతిమ్   6.74.21
 
 తస్మిన్ జీవతి వీరే తు హత మ౭ప్య౭హతం బలమ్
 హనూమ త్యుజ్ఝిత ప్రాణే జీవన్తోఽపి వయం హతాః            6.74.22
 
 ధరతే మారుతి స్తాత మారుత ప్రతిమో యది
 వైశ్వానర సమో వీర్యే జీవితా౭౭శా తతో భవేత్                6.74.23
 
అంజనాపుత్రుడు, వానరోత్తముడైన హనుమ క్షేమముగా యున్నాడా! అని అడిగెను. అందుకు విభీషణుడు జాంబవంతునితో, రామలక్ష్మణుల క్షేమ సమాచారం గాకుండా హనుమ క్షేమము అడిగావు కారణమేమని అడిగెను. అందుకు జాంబవంతుడు హనుమ జీవించి యున్నచో వానర సైన్యము చచ్చినను, బ్రతికి యున్నట్లే, ఆ మారుతి ప్రాణములను విడిచినచో మనమందరము బ్రతికి యున్నను చచ్చిన వారితో సమానమే. పిదప వాయుసుతుడైన హనుమ జాంబవంతునికి ప్రణమిల్లెను.