Tuesday, 28 April 2015

19. ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (19వ సర్గము)


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:


 19 వ సర్గ (వాల్మికి రామాయణములోని 32 శ్లోకాల  తెలుగు వచస్సు)
(రావణున్ని చూడగానే  దు:ఖ -భయ-చింతలతో-మునిగిన సీత అవస్థ)


విదేహ రాజకుమారి, సుందరమైన సీత, కటి ప్రదేశములో ఉండెను
రూప యవ్వన సంపన్నుడు, ఉత్తమభూషనముల భూషితుడును 
రాక్షస రాజైన రావణుడు సీత ఉన్న ప్రదేశము దగ్గరకు  వచ్చెను 
గాలికి అరటిచెట్టు కంపించినట్లు సీత రావణున్ని చూసి కంపించెను

రావణుడు రాక్షసీగనములచె రక్షిమ్పబడుచున్న సీతను చూచెను 
సీత సుందరమైన దేహకాంతితోను, విశాలనేత్రములు కలదియును
సీతాదేవి ఊరువలతొ వక్షమును, భాహువులతో వక్షోజాలములను 
కప్పుకొని వేరొక మార్గము లేక రోదనము చెస్తూ భూమిని చూచు చుండెను

వ్రతములో ఉన్న సీత కటిక నేలపై కూర్చొని విలపించు చుండెను
వృక్షమునుండి ఛేదింపబడి నాలపై పడివున్న కొమ్మ వలే ఉండెను
అలంకరించు కొనదగిననను, అలంకరించు కోకుండా ఉండెను 
ద:ఖార్తయగు సీత, సముద్రములో శిధిలమైన నావవలె ఉండెను

బురద అంటుకొనిన తామర పూవువలె ప్రకాసించిన వెలుగు లేకుండెను 
సీత మనస్సు రధములో భర్త వద్దకు వెళ్ళు చున్నట్లు ఉండెను 
భుద్ది కలవాడైన రామచంద్రుని మనసు చూడాలనిపించు చుండెను
ఉత్తమ సౌందర్యముగల సీత రామునివద్దే చిత్తమును నిలిపి ఉంచెను  

కృశించినదియును, రోదన పరయును
అసహాయయును, సింతాశోకమగ్నయును 
హద్దులేని దు:క్ఖమును అనుభవించు చున్నదియును
శ్రీరామచంద్రుని సర్వాత్మనా సీత అనుకరించుచుండెను 

సీత మణిమంత్రములచేత కట్టుబడి కొట్టుకోనుచున్న ఆడత్రాచువలెను    ధూమమములొ ఉక్కిరి బిక్కిరి అగుచున్న రోహిణి వలెను 
వృత్తశీలసపన్నమును, అచారవంతమునగు కులమున జన్మించి నదియును
సీత ఉత్తమకులమున పరిణయమాడి దుష్కులమున పుట్టినదానివలె ఉండెను 

అసత్య దోషారోపనము చేత చెడిపోయిన కీర్తివలెను
అద్యయనము లేక పోవుటచే శిధిలమైన విద్యవలెను
ఏంటో గొప్ప కీర్తిని గడించిన, క్షీనించిన కీర్తివలెను
అవమానింప బడిన శ్రద్దవలె సీత ఉండెను 

క్షీనించి పోయిన పూజవలెను
దెబ్బ తిన్న ఆశ వలెను 
రావాల్సిన రాకుండా పోయిన లాభం వలెను
నెరవేర్చ వలసిన ఆజ్ఞ వలే సీత ఉండెను

తొక్కి వేయబడిన పద్మ లత వలెను 
శూరులందరూ చనిపోయిన సేవవలెను
చీకటి కప్పిఉన్న కాంతి మాయ వలెను 
ఏందీ పోయిన నదివలె సీత ఉండెను 

ఉత్పాత సమయమునందు మండుచున్న దిక్కు వలెను 
ఒకరికోసం చేసిన మరొకరిని నష్టపరిచిన పూజవలెను 
అపవిత్ర వస్తువుల స్పర్శచే అపవిత్రమై పోయిన అగ్నివేదికవలెను
రాహువు మింగగా చంద్రుని కాంతి పోయినట్లు సీత ఉండెను

భయపెట్ట బడిన విహంగములు కలదియును
ఏను తొండముచే నాశనము చేయ బడుచున్నదియును
చెల్లా చెదరగాఉన్న పద్మ సరసివలె ఉన్నదియును 
నలుగు మొదలగునవి లేక సరస్సులో పద్మమువలె,కృష్ణ పక్ష నిశవలె సీత ఉండెను 

భర్త శోకముచే పీడితురాలై యుండెను
ఏందీ పోయిన నదివలె విలపించు చుండెను 
కృష్ణ పక్షరాత్రి వలె శొభావిహీను రాలై ఉండెను
వేడికి ఎండిన తామర తూదువలె సీత ఉండెను 

ఉపవాసము చేతను దు:ఖము చేతను 
ఆలోచనల చేతను, భయము చేతను 
దుర్బలురాలై కృశించి దైన్యముతో ఉండెను 
రామద్యానమును గొప్పతపస్సుగా సీత చేయు చుండెను

అందమైన కనురేప్పలతో చివర ఎర్రగాను 
దోషాలేశము కూడాలేని సీత నలువైపుల చూచుచున్నదియును 
అచంచమైన పాతివ్రత్యమును పాటించు చున్నదియును 
అట్టి సీతను రావణుడు నేను చెప్పినట్లు విననిచో చంపెదను అనెను

శ్రీ సుందరకాండ 19వ సర్గ సమాప్తము  

Wednesday, 22 April 2015

18. ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (18వ సర్గము

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ: 18 వ సర్గ (వాల్మికి రామాయణములోని 32 శ్లోకాల  తెలుగు వచస్సు)
పుష్పించిన వృక్షములతో నిండిన అశొకవనమును
విదేహ రాజకుమారి యొక్క స్పష్ట దర్శనమును 
రాక్షస స్త్రీలు నిద్రపోవుటకు ప్రయత్నిమ్చుటను
ఆలోచిస్తుండగానే రాత్రి చాలావరకు గడచిపోయెను 

రాత్రి యొక్క చివరిజామున షడంగవేద వేత్తలను
అనేక మహాయజ్ఞములు చేయు పండితులను 
మంత్రాలను చదివే బ్రహ్మ రాక్షషలవేద ఘోషను
హనుమంతుడు వృక్షముపై నుండి గమనిస్తుండెను 

మహాబాహువులు గల దశఖంటుడను
మంగలవాద్యములతోను ఇతరవాద్యములతోను
సుప్రభాతముతో రావణున్ని మేల్కొల్పెను 
జారిపోయిన వస్త్రముగలవాడైన రావణుడు నిద్రలేచెను 

అత్యుత్కటమైన మదముగల రావణునకు సీత స్మృతికి వచ్చెను      
సీతా విషయమునందు మన్మదుడు ప్రేరేపిమ్పగా కామముతో ఉండెను 
సీతను పదే పదే తలుస్తూ తనలో ఉన్నకామమును అనుచుకోలేక పోయెను 
కాలమునకు లొంగి పోయినవాడై సీతయందు లగ్నమైన మనస్సుతో ఉండెను

రావణుడు సమస్తమైన ఆభరణములను అలంకరించు కొనెను
సకలవిధములైన పుష్పమాలను ధరించి సోభాముతో ఉండెను
మదించిన పక్షులు విచిత్రముగా అరుచు చుండెను 
అశోకవనములో ఉన్న సీతను చూచుటకు బయలుదేరెను

మహేంద్రువెనుక దేవతాస్త్రీలు నడిచినట్లు రావణునివేనుక స్త్రీలు నడుచు చుండెను 
కొందరు స్త్రీలు బంగారు దీపములను, వింజామరలను, విసిన కర్రలను 
మరికొందరు బంగారు పాత్రలలో నీల్లు తీసుకొని నడుచు చుండెను
మరియొక స్త్రీ శ్వేతచ్చత్రము పట్టుకొని రావణుని వెనుకనే వెళ్ళెను

మెరుపు తీగలు మేఘమును అనుసరించినట్లు రావణుని భార్యలు అను సరించెను 
రానుని భార్యలు భర్త గౌరవము చెడకుండా ప్రక్కగా నడుచు చూ ఉండెను 
దేహములపై ఉన్న హారములు అటు ఇటు కదిలి జారిపోయిన నడుస్తూ   ఉండెను 
రావణుని ఉత్తమ స్త్రీలు నిద్రమత్తుతో నడుచుట హనుమంతుడు చూచెను 

భార్యలు ముఖములు చెమట పట్టి  కురులు విరబోసి కొని నడుచు చుండెను 
కొందరు మద్యపాన మత్తులో, నిద్రచేత తూలుతూ నదుస్తూ అనుకరించెను 
స్త్రీల ధరించిన పుష్పములు నలిగిపొఐ కెశములలొ చిక్కుకొని యుండెను 
రావణుడు బంగారుముఖద్వారములున్న వీధులను చూచుచు వనంలోకి  ప్రవేశించెను 

మహాబల సంపంనుడగు మంద బుద్ధియును
కామ పరాధీనుడును నగు ఆ కామినీపతియును
విద్యుల్లతలవలె ఉన్న భార్యలతో నడిచెను 
సీతపై మనస్సుతో మెల్ల మెల్లగా నడుచుచుండెను 

ఊహింప నంత బల,పౌరుషాలు కలవాడును
సుఘందితైలములచే తడుపబడుచున్న కాగడాలను 
కాంచనీ ధ్వనులతో స్త్రీలు రావణుడితో నడిచెను
అట్టి వారిని వాయుపుత్రుడు చూస్తూ ఉండెను   

 రాక్షస రాజు కామ దర్ప మద యుక్తుడు గాను 
కుటిలమైన, ఎర్రనైన  చూపులు గల వాడును 
దనూరహితుడగు కామదేవుని బోలినవాడును
తెల్లని నురుగు వంటి వస్త్రము ధరించిన రావణున్ని చూసెను 

హనుమంతుడు ఆకులతో ఉన్న కొమ్మ మీద అణిగి మణిగి యుండెను 
రావణుడి వస్త్రమును విలాసముగా లాగుకోనుచు నడుచు చుండెను 
దగ్గరగా వస్తున్న మహారాజును రావణుడిగా మారుతి గుర్తించెను
రూప యవ్వన సంపన్నలగు స్త్రీలు  రావణుడుతో నడుచుచూ ఉండెను 

హనుమంతుడు రావణునియోక్క తేజముచే తిరస్క్రుతుడై యుండెను
శంఖువువలె నిక్కపొడుచు కోనిన చేవులగల వాడైన రావణుడును 
విశ్రవసుని పుత్రుడగు మహాబల సంపంనుడగు రాక్షసాదిపతియును 
విచిత్ర ఆభరణములు ధరించిన స్త్రీలతొ ఉన్న రావణున్ని చూసెను 

ఉత్తమస్త్రీ పరివేష్టితుడైనా తారాపరివృతుడైన చంద్రుని బోలియున్న వాడును
రావణుడు మృగ పక్షి రావ నినాదితమగు ఆ ప్రమదా వనమును ప్రవేశించెను
 ఉత్తమ గృహం లో నిద్రించి నప్పుడు చూసిన రావణుడే ఇతడని గ్రహించెను 
హనుమంతుడు చెట్టు కొమ్మపై ఉండి  కొంచము క్రిందకు దిగి చూస్తూ ఉండెను

నల్లని కేశ పాశములు గల సీతయును 
సుందరమగు కతుభాగాముకల సీతయును 
నిరంతర మైన స్తనములు గల సీతను
నల్లని నేత్రములుగల సీతను రావణుడు సమీపించెను

సుందర కాన్దమునన్దు 18వ సర్గ సంమాప్తము

Monday, 20 April 2015

17. ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (17వ సర్గము

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ: 17 వ సర్గ (వాల్మికి రామాయణములోని 32 శ్లోకాల  తెలుగు వచస్సు)
హంస స్వచ్చమైన నీల వర్ణముగల జలములో విహరిన్చుటకు వచ్చెను 
అట్లే ఉదయ సమయము నుండి చంద్రుడు నిర్మలమైన ఆకాశములోకి ప్రవేశించెను 
చంద్రుని యొక్క సీతల కిరణములు వాయు పుత్రుడగు మారుతిని  సేవించెను 
నిర్మలమైన కాంతిని సీతాదేవికి సహాయము చేవలెనని చంద్రుడు అనుకోను చుండెను 
పూర్ణ చంద్రుని మోము గలదియును, శోకభారముచె కృంగు  చున్నదియును 
అగు సీతను హనుమంతుడు నీటిలొ బరువుతో నిండిన నావ వలే ఉండెను
స్క్షీతాదెవిచూడ నెంచి ప్రక్కన ఉన్న భయంకరమైన రాక్షస స్త్రీలను చూసేను 
సీత యొద్ద కూర్చున్న రాక్షస స్త్రీలను హనుమంతుడు భీకరరూపాలను చూసెను
సీతాదెవి ప్రక్కన రాక్షస వనితలను వర్ణించెను 
ఘోర రూపములొ ఒక కన్ను, ఒక చెవి కలిగిన స్త్రీలు ఉండెను
పెద్ద చెవులు కలిగి, అసలుచెవులు లేకుండా ఉన్న స్త్రీలు ఉండెను
శంఖమును బోలిన అనగా నిక్కపోడుచుకున్న చెవులుండెను 
తలవరకూ వ్యాపించిన ముక్కుగలభయంకరమైన స్త్రీలు ఉండెను
అతి ప్రవృద్దమైన ఊర్ద్వ శరీరము కలదియును 
సన్నగా పొడవుగా  కంఠం కలవారును 
శరీరరమంతా దట్టమైన రోమాలు కలవారును
దీర్ఘమైన కర్ణములు, లలాటములుకలవారును

దీర్ఘమైన ఉదర పయోధరములు కలవారును
వ్రేలాడు పెదవులు, గడ్డమునకంటు  పెదవుల కలవారును 
పోట్టి వారును, మిక్కిలి పొడవైన వారును 
మరుగుజ్జుగా, వికటముగా ఉన్నవారును

వంకరముఖముతొ భయంకరముగా ఉన్నవారును 
పసుపుపచ్చ నేత్రములతొ భయపెట్టే వారును
 బాగా నల్లగా, అతి లావుగా ఉన్నవారును 
కలహాప్రియులు, కోపస్వభవముకలవారును 

పందులు లేళ్ళు, మోఖములవలె కొందరుండెను 
పులులు, దున్నపోతు, మోఖములవలె కొందరుండెను      
ఏనుగులు, ఒంటెలు మోఖములవలె కొందరుండెను 
గుర్రము మొఖము పాదాలు,  కలిగి ఉండెను


కొందరి తలలు గుండె లోనికి చొచ్చుకొని ఉండెను
గాడిద చెవుల వాల్లు, గుర్రపు చేవులవాల్లు ఉండెను
కోతిచేవులవాళ్ళు, ముక్కులు లేనివాళ్ళు ఉండెను
               ఏనుగు పాదములు, గోపాదములున్నవారుండెను

పాదములందు రోమములు దట్టముగా ఉన్నవారును
పెద్ద పెద్ద తలలు, పెద్ద పెద్ద స్తనములు ఉన్నవారును 
ఏనుగు తొండము వంటి ముక్కులు గలవారును 
నాలికచాపి భయంకరముగా నృత్యము చేయువారును 

నల్లని ఇనుముతో చేసిన సూలములను ధరించిన వారును 
సమ్మెట, ఇనప గదలను ధరించిన వారును
ఎత్తుపల్లు మూతి వంకరగా ఉన్నవారును 
వ్రేలాడు పొట్ట, పెద్ద పెద్ద కేశములు కలవారును 

భయంకరమైన పోగావంటి జుట్టు కలవారును 
రక్త మాంసములతొ నిండిన శరీరము కలవారును
నిరంతరము మద్య పానముచేయుచున్నవారును  
చూసెవారికి గగుర్పాటు కల్గించే స్త్రీలను మారుతి చూసెను

 సీతా దేవి వర్ణన 
కాంతి తరిగి నదియును, శోకసంతప్తయును 
 మురికిగా ఉన్న కేశములు కలిగినదియును
ఆకాశమునుండి భూమిపైరాలిన తారను బోలినదియును
ఉత్తమైన భూషణములు పెట్టుకొననిదియును

చారిత్రమున పేరు  గాంచినదియును 
పతిదర్శమునకు నొచుకొననిదియును 
భర్త్రువాత్చాల్య భూషితయును
 రాక్షస రాజుగు రావణునికి బందీయును

భందువులకు దూరముగా  ఉన్నదియును
సింహమునకు చిక్కిన ఆడేనుగును బోలినదియును
వర్షాకాలము గడచినా నవృతమైన చంద్రరేఖను బోలినదియును
రాక్షస వశములొ చిక్కి కర్మకు భద్దురాలై యుండెను

అశొకవాటికలొ ఉండి  కూడా  మునకలు వేయు చుండెను
సీత పంకములో ఉన్న పద్మనాళమువలే మలినమై యుండెను
అంగులీ స్పర్స లేని వీణలా మూగబొయి సీత అక్కడ ఉండెను 
 పుష్ప హీనమై  ఉన్నలతవలె ఉన్న సీతను హనుమంతుడు దర్శించెను

సీతాదేవి నలిగి, మాసిపోయిన వస్త్రమును చుట్ట బెట్టుకొని  ఉండెను
లేడిపిల్ల కళ్ళ వంటి కళ్ళుగల సీతాదేవి మొఖము ధీనముగా ఉండెను 
భార్త పరాక్రముబలము తెలుసుకొన్న సీత అధైర్య పడ కుండెను
ఆమె పాతివ్రత్యమే  రక్షించు చుండెను అట్టి సీతను మారుతి చూసెను 

అశోక వృక్షమునందు నాల్గు వైపులా భయంకరమైన రాక్షసులు ఉండెను
సీతాదేవి దు:ఖసాగరము ఉన్న ఓడలిపై మాలిన్యము పేరుకొని యుండెను 

రాజపుత్రికయును,  అనిందితయును, దశరధమహారాజు కోడలియును
అగు సీతాదెవిని లక్ష్మీ సంపంనుడగు హనుమంతుడు  చూసేను 

 భయపడిన ఆడలేడి పిల్ల చూసినట్లు కళ్ళను అటు ఇటు తిప్పుచుండెను 
సీత  వెడి నిట్టుర్పులకు చిగురించిన వృక్షములు కాల్చివేయు చున్నట్లుండెను 
అమె శొకముల ప్రొగువలె పైకి లేచిన ద:ఖ తరంగములవలె ఉండెను
అట్టి సీతను హనుమంతుడు చూసి అపారమైన  ఆనందముపొందెను

రాక్షస స్త్రీల భాదను తట్టుకొని ఓర్పు వహించినసీత భూదేవి వలే ఉండెను   
సీత ఆహారము తీసుకొక బోయిన అవ యవములలో ఎట్టిమార్పు లేకుండెను
శ్రీ రామచంద్రుని తలుస్తూ మత్తుని కలిగించు నెత్రములుగల  సీత విలపిస్తూ ఉండెను 
అట్టి సీతను హనుమంతుడు చూసి రామచంద్రునకు లక్ష్మనునికి  నమస్కారము చేసెను

శ్రీ సుందర కాండ నందు 17వ సర్గ సమాప్తము    

 

Saturday, 18 April 2015

16. ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (16వ సర్గము )


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:

 16 వ సర్గ (వాల్మికి రామాయణములోని తెలుగు వచస్సు)
హనుమంతుడు ప్రశంసింప దగిన సీతను 
గునాబిరాముడగు రామచంద్రుడను 
ఒక్క క్షణం సీత ఉన్న పరిస్తిని తలచి విలపించెను 
 హనుమంతుడు మరల అలోచనలో మునిగిపోయెను 

రాముని భార్య అయిన సీతకు కూడా కాలము అతిక్రమించ లేకుండెను  
రామచంద్రుని యొక్కయు వ్యవసాయము నెరిగిన సీత అగుట చేతను 
వినయ విదేయుతులున్నలక్ష్మనునకు వదినగా సీత పూజ్యురాలును
వర్షాకాలములొగూడ గంగానది  అంతగా క్షోభించనట్లుగా సీత ఉండెను

 సీత తుల్యమైన శీలము వయస్సు వృత్తము గలదియును
తుల్యమైన వంశములో పుట్టి  రామచంద్రునకు భార్య అయి యుండెను
తుల్య వంశములో పుట్టిన సీత రామచంద్రున్ని తగిన  భర్తగా పొందెను
లక్ష్మీదేవివలె ఉన్న సీతను చూసి హనుమంతుడు  సంతోషించెను

హనుమంతుడు రామునివద్దకు మనసారా పోయి ఇట్లను కొనెను
సీత కొరకే సకల వరుల తో రాముడు  స్నేహము కలిపెను
సీత కొరకే కదా రాముడు బలశాలియిన వాలిని సంహరించెను 
పరాక్రమముచేత రావణునితో సమానమైన కభందుని సంహరించెను

ఈమె కొరకే భయంకరమైన పరాక్రముగల విరాధుడనే రాక్షసుడిని చంపెను 
ఈమె కొరకే కదా రాముడు జనస్తానములో అగ్నిజ్వాలలవంటి భానములను
భయంకరమైన కర్మగాల 14వేల మంది రాక్షసులను రాముడు చంపెను 
ఖరుని,త్రిశిరస్సుని,మహబలశాలి అయిన దూషణున్ని సంహరించెను

ఈమె మూలముగనె సుగ్రీవుడు వాలిపాలితమైన వానరైశ్వర్యమును పొందెను 
నేను ఈమె కోసమే కదా సముద్రమును దాటి లంకను దర్శించినాను
ఈమె కొరకే సముద్రమువరకు వ్యాపించిన భూమినే కాదు జగత్తును
తలకిందలు చేసినా యుక్తమే, అని హనుమంతుడు తలంచెను  

త్రిలోకమందలి రాజ్యమా లేక జనకాత్మజయగు సీత  అని ప్రశ్నవేసు కోనినను
జవాబుగా త్రిలోక రాజ్యము సీత యొక్క ఒక కలకు గూడా సమానము కాదనెను
ఈమె ధర్మశీలుడును, మహాత్ముడును, మిదిలాదిపతియగు జనకుని పుత్రికయును
దృడ మైన పాతివ్రత్యము కలిగియున్న సీత ఈమె అని నిర్ధారించు కొనెను

యజ్ఞభూమిలొ నాగలితోదున్నినప్పుడు భూమి చేదిమ్చుకొని బైటకు వచ్చిన సీత ఈమేను
పరాక్రమవంతుడు, పూజిమ్పదగినశీలముగలవాడు దశరధమహరాజు పెద్ద కోడలు ఈమేను
ధర్మమము తెలిసినవాడు, కృతజ్ఞుడు, బుద్ధిమంతుడుగా ప్రసిద్ది పొందిన వాడును 
అయిన శ్రీ రామచంద్రుడి భార్యయగు సీత ఇక్కడ రాక్షస స్త్రీలకు వశమై యుండెను

భర్త మీద ఉన్న ప్రెమచేత ఈమె సమస్త భోగములను విడిచెను 
ఈ కష్టములు లెక్కచేయక నిర్జనవనములో ప్రవేశించెను
భర్తకు సేవ చేయుట యందు ఆశక్తి కలదై ఉండెను 
దుంపలతోను, ఫలములతోను సంతుష్టి చెంది జీవించెను 

వనములోఉన్న పర్ణ శాలే మహాభవనమువలె సంతోషముగా ఉండేను  
బంగారం శరీరముగలదీ, ఎల్లపుడు నవ్వుతూమాట్లాడు నదియును
ఆపదలు ఈమెకు కావలసినవి కాదు కానీ భాధలు అనుభవిస్తుండెను
రావణుడు ఎంత భాధపెట్టిన తన ఉత్తమ శీలమును విడువకుండా ఉండెను

రామచంద్రుడు సీతను చూచిన పరమానంద భరితుడగును
దప్పికకొన్నవాడు చలివెంద్రముచూసి సంతోషించినట్లు సంతోషించును
రాజ్యబ్రష్టుడైన రాజు తిరిగి తనరాజ్యము పొందినట్లు పొందును 
రాఘవుడు ఈమెను తిరిగి పొందుటవలన మిక్కిలి ప్రీతి పొందును 

కామ భోగములను త్యజించినదియును 
భందు జన  విరహితయును 
ఈమె పతిసమాగమా కాంక్షతో తన దేహమును
విడువక ధరించి రామునికొరకు వేచి యుండెను

ఈమె రామునియందే మనస్సును లగ్నము చేసి యుండెను 
ఈమె పుష్ప ఫలములు చూడకుండా రాక్షస స్త్రీలతొ ఉండెను
ఈమె ద్యానముతో శ్రీరామచంద్రుని దర్శనము చేసుకోను చుండెను
ఈమె భర్త అనే అలంకారము లేకుండుటవలన శోభించకుండా ఉండెను 

నల్లని కేశములు కలదియును 
కమల పత్రముల వంటి కన్నులు కలదియును 
సుఖములనుభవింప తగినదియును
ద:ఖముతో ఉన్న సీతను చూసి మారుతి భాధపడెను 

పృద్వివలె మిక్కిలి ఓర్పుకలదియును
రాముని ప్రీమకు దూరమయ్యెను
రాక్షస స్త్రీల వేదింపులు దగ్గరాయెను
కన్నులవేమ్బడి కన్నీరు కార్చుతూ ఉండెను 

మంచు చేత కప్పు బడిన పద్మముల వలెను 
వ్యసనముల పరంపరచేత పీడింప బడుచున్నదియును
మగచాక్రవాకములేని ఆడచక్రవాకమువలె విరహముతొ ఉండెను
శొచనీయ అవస్తను పొందుతూ విలపించు చుండెను 

నీశ్చయముగా సీత నగలకన్నా భర్తే ముఖ్యమని చాటి చెప్పెను
సీత విరహముతొ రామచంద్రుడు దు:ఖముతో జీవించు చుండెను
శ్రీరామచంద్రుడు నిగ్రహించుకొని సీతను తలుస్తూ జీవించి యుండెను
సీత యున్న స్థితిని, రామచంద్రుని పరిస్థితిని చూసి మారుతి భాదపడెను 

పువ్వులతో సాఖాగ్రములు వంగిన అశోక వృక్షములను
మంచుతోలగిపోవుటచే ప్రకాశించుతున్న సహస్త్రకిరణములను
భర్తనే తలుస్తున్న సీతకు అధిక శోకము కలిగించు చుండెను


         ఈమె సీతయె అని నిశ్చయమునకు వచ్చి హనుమంతుడు                 వృక్షము  పైనే ఉండెను

శ్రీ సున్దరకాన్దమునన్దు 16వ సర్గ సంమాప్తము

Friday, 17 April 2015

15. ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (15వ సర్గము )


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
 15 వ సర్గ (వాల్మికి రామాయణములోని తెలుగు వచస్సు)

అశొకవనము కల్పలతలతో వృక్షములతో శోభిల్లు చుండెను
దివ్యగంధములతోను, రసములతొను పరిపూర్ణమైనదియును
మృగ, పక్షి సమూహములతొ అన్ని వైపుల చక్కగా ఉన్నదియును 
పెద్ద భవనములతో ఉన్న రాక్షసులు ఉన్న ప్రాంతమును మారుతి చూసెను

కోయిలల మధురకలధ్వనులతోను మార్మోగుచున్నదియును
కలువలు, పద్మాలు  సువర్ణ వర్ణములో వెలుగు చుండెను 
నడి బావులు ప్రక్క పెక్కు  ఆసనాలు, తివచీలు పరిచియుండెను
అనేక భూగ్రుహములతొ నందనవనము వాలే ఉండెను 

సర్వఋతువులయందు  పూచె పూలు అన్ని అక్కడ పూయు చుండెను
ఫలవంతములైన వృక్షములతో కూడు కొని దట్టముగా  ఉండెను
అక్కడ అశొక వృక్షములు సూర్యొదయ ప్రభవలె వెలుగు చుండెను 
అక్కడ అన్నిప్రజ్వలిస్తున్నట్లు హనుమంతుడు చూసెను 

పక్షులు చెట్ల కొమ్మలను పత్ర రహితముగా చేయు చుండెను
చెట్లపై ఉన్న పూలన్ని మంటలవలె మండు  చుండెను 
వందలకొలది పక్షులు చెట్లపై వ్రాలి పైకి ఎగురు చుండెను 
సాఖాగ్రమునుండి మొదళ్ళవరకు పుష్పములు వంగి నేలను తాకుచుండెను  

గన్నేరు చెట్లతోనూ, నిండుగా పూచినమొదుగ పూలతోను 
పున్నాగ చెట్లను,ఏడాకుల అరటిచెట్లను,సంపెంగ చెట్లను
గుగ్గిల చెట్లను, అనేక చెట్లుతో, పుష్పాలతో శోభిల్లు చుండెను 
అక్కడ పుష్పములు రత్నమువలె వజ్రములవలె మెరియుచుండెను 

వృక్షములు బంగారువన్నెతోను, అగ్ని శిఖవలె వెలుగు చుండెను 
కొన్నివృక్షములు కాటుకువన్నెతోను దేవతా ఉద్యానవనమువలె ఉండెను
ఉద్యానవనములు దివ్యముగా మకరందములునువెదజల్లు చుండెను 
అక్కడ పూలన్ని వెలుగుతూ రెండవ ఆకాశ నక్షత్రాలవలె ఉండెను

పుష్పములు రత్నములతో వెలసిల్లి 5వ సముద్రమువలె ఉండెను
మృగ పక్షి సంఘములు అనేక విధములుగానాదములు చేయు 
 చుండెను
సుఘంద పరిమళాలతో శోభిల్లు చున్న వనములు చూసెను 
గంధమాదన పర్వతమువలె ఉండుట హనుమంతుడు చూసెను


వానరపుంగవుడుకొంత దూరములొ చైత్య ప్రాసాదమును చూసెను
ఆ ప్రాసాదము లోపల అత్యన్నతమైన వేయి స్తంభములు ఉండెను
కైలాస పర్వతమువలె తేజోవంతమై తెల్లగా యుండెను 
పగడపుమేట్లతోను, బంగారువేదికలతోను మిరమిట్లుగొల్పుచుండెను

నిర్మలమైన చైత్య ప్రాసాదమువల్ల నాకాశము నొరయు చున్నట్లుండెను
ఆ చైత్య ప్రాసాదదర్సనానంతరము అతడొక దీనురాలుగు స్త్రీని చూసెను
ఆమె మలినమైన వస్త్రములను ధరించి రాక్షస స్త్రీల పరివేష్టితమై  యుండెను
ఉవవాసములచె కృశించి, ధీనురాలై , ధీర్ఘ విశ్వాసములను విడుచు చుండెను

ఆమె వీలైన రూపముతో  వేల్గొందు  దేహకాంతి కలిదియును
పచ్చని వన్నె గల మాసిన పట్టు వస్త్రమును ధరించి నదియును
 ఆమె అలంకార రహితయై పొగతో కప్పుబడిన కాంతి వలేఉండెను
పద్మములు లేని సరస్సువలె అలంకార రహితయగు స్త్రీ ఉండెను 

భోజనము చేయక కృశించి నదియును
కన్నీటితో నిండిన మోముకలదియును 
ధీనురాలును చింతా శోకమగ్నయును
నిత్యమూ దు:ఖమును మునిగిదియును 

తన ప్రియజనమును దర్శిమ్పనిదియును 
రాక్షసగణముచే నిత్యముచూచు చున్నదియును
అంగారక గ్రహముచే పీడితమైన రోహిణివలెను
చాల కష్టము మీద ఈమె సీత యని గుర్తించెను

లేళ్ళకు దూరమై వేట కుక్కలకిచిక్కిన ఆడలేడి  వలే యుండెను
కటి ప్రదేశమువరకు వ్రేలాడుచున్న, నల్లత్రాచువంటి ఒక జడతోను 
వర్షాకాలాంతమునందు నల్లని వృక్షపంక్తితో కూడిన భూమివలే యుండెను 
దు:ఖములచే సంతృప్తిరాలును, ఎటువంటి వ్యసనములులేని ఒక స్త్రీని చూచెను

ఆమె శుక్ల పక్షారంభమునండలి చంద్రరేఖవలె మిక్కిలి శుద్ధముగా ఉండెను 
హనుమంతుడు ఆలోచించి నిశ్చయముగా ఈమె సీతయని అను కొనెను
ఆమె గురుతు పట్టుటకు వీలైన రూపముతొ వేల్గొందు  దేహకాంతి కల దియును 
ధూమజాలముచె కప్పు బడిన అగ్నిశిఖలను బోలియున్న ఒక స్త్రీని మారుతి చూసెను 

నిండు చంద్రుని బోలు మోము గలదియును 
సుందరమగు కను బొమలు గలదియును 
గుండ్రమైన సుందరమగు  పయోధరములు గలదియును
సుగ్రదితములగు అవయవములు కలదియును 

పద్మ పత్రములను బోలిన కన్నులు కలదియును
కామదేవుని యిల్లాలగు రతి దేవిని పోలినదియును
 సమస్తలోకములో ఉన్న ప్ర్రాణులకు ఇష్టమైనదియును 
 పున్నమి చెంద్రుని వెన్నెల కాంతిగల సీతను మారుతి చూసెను

మిక్కిలి మలినముగా విశాల నేత్రములు కలదియును 
రావణుడు అపహరించి తెచ్చిన సీత ఈమె అయి ఉండవచ్చును
యుక్తా యుక్తములైన హేతువులచే ఆమె సీత అని ఊహించెను
ఎట్లాచూడబడునొ అట్టిరూపముగా ఉన్న స్త్రీ ని సీత అని అను కొనెను

ఈమె దేహకాంతిచే అనీ దిక్కుల యందలి చీకటిని పోగొట్టు చుండెను
 మయూరివలె అందమైనదియును, దొండపండుపెదవులు కలదియును
మహోత్తరమైన శోకజాలముచే ఆచ్చాదితమై విశేషముగా సోభిమ్ప 
నిదియును 
సన్ననినడుము ఉన్న ఒక స్త్రీని చూసి ఆమెసీతఅని హనుమంతుడను   కొనెను 

సందేహముతో నిండిన స్మరణ శక్తి వలెను 
క్రింద పడి పోయి నశించిన సమృద్దివలెను
అనుకొనివిధముగా దెబ్బతిన్న శ్రద్దవలెను
కోర్కలు సఫలములు కాక భగ్నమైన ఆశలవలెను 

విఘ్నములతో కూడిన కార్య సిద్దివలెను
కాలుష్యముతో కలుషితమైన బుద్దివలెను
ఆభూతమైన అపవాదముచె పతితమైన కీర్తివలెను
రామసేవ ప్రతిభంధముచేత వ్యధను పొందుచుండెను

స్త్రీ రక్షోగణములచే పీడించ బడు చున్నదియును 
 మృగ సాబకమును పోలిన కన్నులు కలదియును 
కలతచెందిన మోఖముతో ఇటు నటు చూచు చున్నదియును
అబలయును, కన్నీటితో నిండి యున్న స్త్రీని సీత అనిగుర్తించెను

కనురెప్పలుకదిలిస్తూ, దీర్ఘవిశ్వాసములు విడుచు చున్నదియును
అలంకార రహితముగా మలపంకములు మధ్యేనే  ఉన్నదియును
మేఘములుకప్పిన చంద్రకాంతి వలే ఉన్న సీతను చూసేను 
మననములేక వేదవిద్య శిధిలమైనట్లు సీతను చూసి బుద్ధి  సందేహములో పడెను

అలంకార రహితయగు సీతను సంస్కార రహితమై అర్ధాంతరమును 
విశాల నేత్రములుగల దోషరహితులైన జనక మహారాజకుమార్తెను
యుక్తా యుక్తములైన హేతువలచేత ఆమె ఖచ్చితముగా సీతె యగును 
భోధించు వాక్కు కలిగిన స్త్రీని సీత అని హనుమంతుడు గుర్తించెను 

సీత  ఎప్పుడు రాముని ప్రేమ కొరకు ఆభరణములు అలంకరించు కొని యుండును 
అట్టి ఆభరణములే ఇప్పుడు సీత శరీరముపై ప్రకాశించు చుండెను 
చక్కగా మెరుస్తున్న కర్ణాభరణములను, కుండలములు ధరించు యుండెను
మణులు, పగడములు పొదగబడిన కంకణములను ధరించు యుండెను 

సీత ధరించిన ఆభరణములు చాలా కాలమునుండి ఉండుటవల్ల నల్లగా ఉండెను 
సీత అక్కడ పర్వతము మీద వదిలిన నగలు ఇక్కడ కనబడ కుండెను
       అక్కడ సీత ఏమివదలలేదో ఆ నగలన్నీఇక్కడ కనబడు చుండెను 
రాముడు మాతోచేప్పిన ఆభరణములు సీత వద్ద ఉన్నట్లు మారుతి గమనించెను

ఆభరణములతో వదిలాన వస్త్రము, ఇప్పుడు దరించ వస్త్రము ఒకటేనని గుర్తించెను 
సీత ధరించిన వస్త్రము రెండవ వస్త్రమువలె వన్నే తగ్గినట్లు కనబడు చుండెను 
ఈమె ఆనాడు ఆభరణములు వస్త్రముతో సహా క్రింద పడ వేసినట్లు ఊహించెను 
ధీనావస్తలొ ఉన్న సీతను ఏవిధముగా కలవాలని మారుతి ఆలోచించు చుండెను

రావణుడు అపహరించి తెచ్చిన రాముని ప్రియురాలిన సీత ఈమై ఉండును
రాముని మనస్సులో ప్రియురాలిన సీత మారకుండా స్తిరముగా ఉండెను 
ఈ దేవి రూపము రాముని తలుస్తూ దేహ దెహావయవములు మారకుండా ఉండెను 
సీత అందమును స్మరిస్తు రామచంద్రుడు దేహదారుడ్యముగా ఉండెను

   రాముడు కనబడ కుండా పోయిన స్త్రీ కదా అని జాలి చూపెను
నేను తప వేరెవ్వరు రక్షకులు లేరని మనస్సుతో దయ చూపెను 
కనబడకుండా వెళ్ళినది భార్య అగుటచే శొకముతో ఉండెను 
ఆమె ప్రియురాలు అగుటచే ప్రేమతో మిక్కిలి సంతాపము పొందెను 

ఈదేవి మనస్సు ఎప్పుడు భర్త అయిన రామచంద్రుని పైనను 
శ్రీ రామచంద్రుని మనస్సు ఎప్పుడు భార్య అయిన సీత పైనను 
సీత రాముడే నన్ను రక్క్షించుతాడని నమ్మకముతోను ఉండెను
శ్రీ రామచంద్రుడు సీత ఏలోకంలో ఉన్న రక్షించగలనని  అనుకొనెను

యోవనమదము ఉప్పొంగుచున్న రాముడు సీత కొరకు వేచి ఉండెను 
భార్య దూరము అవుటకు చాల దుష్కరమైన కార్యము చేసి యుండవచ్చును 
హనుమంతుడు దృడసంకల్పముతొ చేట్టుక్రిందున్న స్త్రీ ని సీత అని గుర్తించెను
హనుమంతుడు స్రీ రామచంద్రుని మనస్సులో సమీపించి మిక్కిలి ప్రశంసించెను    

స్రీ సుందర కాండమునందు 15వ సర్గము సమాప్తము

Tuesday, 14 April 2015

ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (14వ సర్గము )ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్        ఓం శ్రీ రామ్
శ్రీ మాత్రేనమ:
శ్రీ సీతారామచంద్రా బ్యానమ:
14 వ అధ్యాయము ( 50 శ్లోకముల తెలుగు వచస్సు )

ఒక ముహూర్త కాలము వరకు ఆలోచించి మనస్సుతో సీతను సమీపించెను
శారీరకముగా రావణ భవణము నుంచి అశోక వనికా ప్రాకారముపై దూకెను
ప్రాకారము పై ఉండి ఉప్పొంగిన శరీరము కలవాడై సంతోషము చెందెను
వసంతాదియందు  పుష్పితమైన అగ్రభాగాముగల వృక్షములను చూసెను 

 
అక్కడ మద్ది చెట్లను, అశోకవృక్షములను, చక్కగా పుస్పించిన సంపెంగ వృక్షములను
విరిగి చెట్లను, నాగా కేసర వృక్షములను, మామిడి చెట్లను కపిముఖ వృక్షములను
ఇంకను  లతా శత సమన్వితమును, మామిడి తొపుల తో ఉన్న వృక్ష వాటికను
అల్లెత్రాటి నుండి విడిచిన బాణమువలె  చెట్లను దాటుతూ ముందుకు పోయెను   వసంత ప్రారంభ సమయాన వివిద వర్ణములు గల పుష్పములను 
పక్షులు, మృగములు, విహరించుటచే, విచిత్రముగాను 
పక్షుల గుంపులు ఉదయించు చున్న సూర్యుడు వలెను
అట్టి అశోకవనమును హనుమంతుడు ప్రవేశించెను

పుష్ప ఫలములు గల నానా విధ వృక్షములను నిండినదియును
ముత్తెములు,కోయిలలు, బ్రమరములు నిత్యము ఉన్న ప్రదేశమును  
మృగపక్షి సమాకులమును, మదించిన నెమళ్ళ నిత్యనినాదితమును 
పక్షి సంఘములతో కూడుకొన్న అశోకవనమును హనుమంతుడు చూసెను

అశోక వాటిక యందు అనిందితమైన అంగములు కలదియును 
బహు సుందరములగు నితంబములు కలదియును 
సుఖముగా నిద్రిస్తున్న పక్షి సంఘములను లేవగోట్టేను 
ఎగురుచున్న విహంగములవల్ల చెట్లపైన పూలు వర్షముగా కురిసెను 

పుష్పములచే నాచ్చాదితుడైన మారుతి పుష్పమయమైన కొండవలె ఉండెను
సర్వభూతములు హనుమంతుని చూసి వసంతుడను కొనెను
పుష్పములచే అలంకృతయగు ప్రియదవలె ప్రకాశించు చుడెను
హనుమంతుని పాదస్పర్సకు వృక్షములపైన పూలు రాలిపడెను 

వృక్షములన్నియు పందెములో ఓడిన జూదగాండ్లవలె ఉండెను
చెట్లపైన ఉన్న పత్రాలు, పుష్పాలు, ఫలాలు వెంటనే రాల్చెను 
వృక్షములన్నియు గాలికి ఎగిరి, విరిగి చెల్లా చెదరగా పడి ఉండెను
వృక్షములు హనుమంతుని హస్తములచేత, పాదములచేత నలిగి ఉండెను 

ఆ ప్రాత్నమంతా విడిపోయిన కెశముల వెలెను
దంతములు గల అధిరోష్టముగలదియును 
నఖ దంత క్షతములు గల స్త్రీ వలెను 
విరిగిపోయిన వృక్షములు అక్కడ ఉండెను 

వాయువు విధ్యపర్వతముపై మేఘములను చెదర కొట్టబడెను        
హనుమంతుడు  మనోహరమైన మణి భూములను చూచెను
 హనుమంతుడు బలముచే తీగలను, పొదలను చేదిమ్చెను 
వాన రాధిపతి ప్రాకాశించుచున్న కాంచన భూములు చూసెను

గుండ్రనివి, చతురస్త్రములు గల దిగుడు బావులను చూసెను 
ముత్తెములు పగడములు తో ఉన్న యిసుకతొ నిర్మించబడి యుండెనుతల ప్రదేశములో చిత్ర  విచిత్రమైన కాంచన వృక్షములు ఉండెను
పద్మములు, కలువలు గుంపులు గుంపులుగా వికసించి ఉండెను

చక్రవాకపక్షులు, నీటి కొళ్ళు,హంసలు,సారస పక్షులు కూతలు వినబడుచుండెను
దిగుడు బావుల తీరముల యందు కల్ప వృక్షకుసుమాలతో కప్పి యుండెను
గంనేరుచేట్లతోను, గుల్మములతోను నిండిన వనములతో నావృతమై  ఉండెను 
మేఘము వంటి ఎత్తైన పర్వతములను హనుమంతుడు అక్కడ చూసెను  

పర్వతముల మద్య అక్కడక్కడ నివాస యోగ్యమైన గుహలు ఉండెను 
పక్షిసంఘములతోను, పద్మలతలతోను ఉన్న సరోవారములు ఉండెను 
బహుపత్రములతొను, అన్నివైపుల వృత్తముగా శింశుపా వృక్షములు ఉండెను 
పెక్కుభూభాగములు, కొండవాగులు అగ్నివలె వెలుగుతూ సువర్ణమై   ఉండెను 

శింశుపా వృక్షము చుట్టూ అనేక బంగారు వృక్షములు  ఉండెను
ఆ  వృక్షములు గాలికి కదిలి చిరిగంటల వలే మ్రోగు చుండెను
ఇంకా అక్కడ చంపక వృక్షములు, చందన వృక్షములు ఉండెను
దట్టముగా ఉన్న శింశుపా వృక్షము నెక్కి ఆలోచించు చుండెను


పక్షి సమూహములతొ సేవింప బడుచున్న పద్మ సరస్సు రమ్యముగా ఉండెను 
రాముని పట్టపు రాణి యగు సీత తప్పక  ఈ పద్మ సరస్సు వద్దకు వచ్చును 
మనోహరురాలు, పతివ్రత ఐన సీతకు  ఈ వనము సంచరించ తగి యండెను
దుఖితురాలైన సీత అటు ఇటు తిరిగుచూ ఈవనముమునకు తప్పక రాగలుగును 

రాముని గూర్చిన ఆలోచనలచే కృశించి పోయినదియును 
చిన్న లేడి కళ్ళు వంటి కళ్ళు గల సూత రాముని పూజ్యురాలును 
ఈ ఉద్యాన పరిచయంతో సీత దేవి భాదతో తప్పక రాగలుగును
సుందర నేత్రములు గల సీత భర్త గూర్చి భాదపడి యుండ వచ్చును

సర్వదా ప్రేమ  శక్తులు ఉన్న రాముని ప్రియురాలును  
మంచి శరీరముకలిగి యౌవన మద్యస్తు రాలును 
సంద్యాకాలమున సంద్యానిమిత్తము ఇక్కడకు రాగలగును
పవిత్ర జలముగల ఈ ప్రాంతము సీతవచ్చిన నేనుచూడ గలుగుతాను


పర్వతము మీదనుండి జాలు వారుతున్న నదియును
నది మగనిమీద అలిగి వానిని విడిచివచ్చే భామవలె ఉండెను 
నీటిలోపడిన కొమ్మలు భర్తవదిలి వచ్చుట ఉత్తముము కాదని హెచ్చరించెను
భందువుల మాటవిని భార్య భర్తను చేరినట్లు నది కదలివైపు పైకి ఎగపాకేను 

రాముని ప్రేమ పాత్రులైన సీత ఇక్కడ తప్పక ఉండ వచ్చును 
చంద్రబింబము వంటి మోఘముగల జానకి ఇక్కడకు రా వచ్చును 
పలువిధములైన ఆలోచనలతో నాలుగు దిక్కులు వెతికెను
హనుమంతుడు కొమ్మలమద్య ఉండి అంతా పరిశీలిస్తు చూచు చుండెను 

శ్రీ సున్దరకాన్దములొ 14 వ సర్గ సమాప్తము
Wednesday, 8 April 2015

ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (13వ సర్గము )

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:

విమాన గృహములనుండి ప్రాకారముల మీదకు దూకి వేదకసాగెను 
మేఘములోని మెరుపువలె హనుమంతుడు వేతక సాగెను
రావణుని భవనమన్తా ఒక్క సారి చూసి మనసులో ఇట్లనుకోనేను 
ఎంత వెతికిన రాముని ప్రియసఖిని చూడలేక పోయినాను
నదులు,  కోనేరులు, భూమి అంతా వెతికినాను సీత కనబడ కుండెను 
 భవనములు, వెతికినను సీత జాడతెలుసుకొనే అవ కాశము లేకుండెను
 విదేహ తనయ సీత ఎక్కడ ఉన్నదో తెలుసుకొనుట కష్టమాయ్యేను 
గ్రద్దరాజగు సంపాతి రావణుని భవనములో ఉన్నదని మాట వమ్మాయెను 

ఒకవేళ సీత రావణుడు బలత్కరిమ్పగా వసురాలై లొంగి పోయి ఉండును
ఆకాశమార్గమున తెచ్చునప్పుడు రావణుని చేతినుండి సముద్రములో పడి యుండును 
ప్రాణ రక్షణకోసం రావణుని చేతినుండి తప్పించుకొని సముద్రములో దూకి యుండును 
రావణుడే సీతను భక్షించు మని రాక్షసులకు ఆజ్ఞ ఇచ్చి యుండ వచ్చునుహారామా! హా లక్ష్మణా !హా అత్త లారా విలపించి శరీరము త్యాగము చేసి యుండును 
రామ ముఖద్యాన పరురాలగు, దీనురాలగు, కరుణాలవల్లి, మృతి చెంది  యుండును 
రావణుని భార్యలచే దోషరహితురాలగు సీతాదేవి భక్షించ బడి యుండును 
సీత పంజరములో చిక్కిన గోరువంకవలె ధు:క్కిస్తూ  బ్రతికి యుండ వచ్చును 

జనకుని కులమున పుట్టినదియును, ఉత్పల పత్రాక్షియును
రాముని పత్ని యగు సీత రావణునికి ఎట్లా వశమగును 
కనపడక పోయినాను, రామవిరహముతో మృతురాలు ఆయినను 
రామచంద్రునకు సీతజాడ తెలుపక ఇక్కడే వెతుకుతూ తిరిగేదను

తెల్పన ఇబ్బంది యగును, తెలపక పోయిన దోషము అగును
ఈ విషయయము చాలా గోప్యముగా ఏమి చేసి దాచవలయును
ఏమిచేయవలయునో సమయోచిత నిర్ణయము తీసుకొనవలెను
సీతజాడ తెలియకుండా కిష్కిందకు పోవుదునేని పురుషార్ధము సాధింప బడును 

నాయొక్క సముద్ర లంఘనం అంతా వ్యర్ధము అయ్యెను 
లంకా నగరమంతా వెతుకుటకు కాలం నష్టం మయ్యెను
రాక్షస రాజు, రాక్షసకన్యలు దర్సనం వ్యర్ధమయ్యేను 
నేను వెళ్ళిన సుగ్రీవుడు ఏమిఅనును వానరులు ఏమి అడుగును

రామచంద్రునితో సీత జాడ తెలియ లేదన్న జీవితము త్యజించును 
రాముడ్ని ఘాడముగప్రేమించు మేధావియగు లక్ష్మణుడు మరణించును 
రామలక్ష్మణులు లేరని తెలిసిన భరతశత్రుఘ్నులు మరణించును
పుతృలు జీవించిలేరని తెలిసిన కౌసల్య,సుమిత్ర,కైకేయి మరణించును 

రాముని దుస్థితినిచూసి సత్యసంధుడగు సుగ్రీవుడు జీవితము త్యజించును   
ధీనురాలు, దు:ఖచిత్తయును, భర్త్రుశోకపీడితయగు రుమ జీవితము త్యజించును
వాలి మరణముచే ద:ఖితురాలగు తార గూడ జీవితము త్యజించును   
వానరులందరూ తలలు బ్రద్దలు కొట్టుకొని జీవితము త్యజించును


వానరులు మంచి మాటలు చెప్పేవారు, ఆదరించు వారులేక మరణించును
వనములందును, పర్వతములందును, సంచరించకఏంతోదిగులు చెందును
క్రీదా సుఖములను అనుభ వించక తలలు బ్రద్దలు కొట్టు కొని మరణించును
వానరుల భార్య పుత్రులు అందరు కలసి సముద్రములో పడి మరణించును

కొందరు వానరులు దొరికిన విషమును త్రాగియును
మరికొందరు తాడును ఉరిగా తలకు వేసుకొనియును
ఇంకొందరు అగ్నిని రగిల్చి దానిలో దుముకుటయును
వానరులందరూ ఉపవాసములతొ ఉంది మరణించును

నేను తిరిగి వెళ్ళిన ఇక్ష్వాకు వంశము నశించును
వానరులు నశిమ్చి భయంకరమైన విషాదము సంభవించును
నేను ఎట్టి పరిస్తితులలో కిష్కిందకు వెళ్ళనే వెళ్ళను       
హనుమంతుడు వచ్చును, శుభవార్త తెచ్చును అని అందరు జీవించును

సీత కనిపించు వరకు నియమమును పాటించెదను
వృక్షములనందు నివసించి చేతిలో పడినదానిని గ్రహించేదను
దుంపలు,ఫలములు  తినుచు ఉదకముత్రాగి జీవించెదను
జలప్రాయ ప్రదేశము నందు వాన ప్రస్త జీవితము గడిపెదను

లేదా చితిని ఏర్పరుచుకొని ప్రజ్వలించుచున్న అగ్నిలో ప్రవేసిమ్చేదను
అన సన వ్రతమును అవలంభించి జంతువులకు అహార మగుదును
జలప్రవేశము చేయుట ఋషి సంమతమని భావింఛి మరణిమ్చేదను     
నేను సీత చూడక నా కీర్తి మాలిక శాశ్వితముగా భగ్నమై పోవును


సీతను చూడకుండగా నియతెంద్రుడునై తాపస వృత్తిని ఉండేదను 
జానకి కన బడక పోయినను తిన్నగా జలములో పడెదను
జీవిత నాశనమునకు పక్కు దోషములు కానవచ్చు చుండెను
జీవించి యున్న తప్పక ఎప్పటి కైనా సీతను చూడగలను

ద:ఖముతో హనుమంతుడు శోకమును దాత జాలక పోయెను
ధైర్యవంతుడైన హనుమంతుడు తక్షణ కర్తవ్యము ఏమిటని ఆలోచించెను
సీత కనిపించక పోయిన రావణునికి గుణపాటము చెప్పి వెల్లెదను
పశువుని పశుపతిని అర్పించినట్లు నేను రావణున్ని రాముడికి అర్పించెదను

చింతా క్రాంతుడై, ద్యానశొక కులస్వాంతుడగు కపివరుడు విచారించెను
రామ పత్నిని చూసె వరకు తిరిగి తిరిగి ఈ లంకను గాలించేదను
రాఘవున్ని తెచ్చిన సీత కానరాక వానరులను కోపాగ్నిచే దహించును
నేను ఇక్కడనే నియ తెంద్రియుడైన, నియతహారుడునై నివసించెదను


      

మహా వృక్ష సంపన్నమగు విశాలమైన ఆశోకవనమును వెదక వలెననుకొనేను
వసువులను, ఆశ్వనీ దేవతలను, దేవతలరాజైన ఇంద్రునకును,మరుత్తులకును
నమస్కరించి రాక్షసుల దు:ఖమును వృద్ధి పొందించుటకై వనం లోనికి పోయెను
రాక్షసులనుజయించి తపోధనునకు సిద్ధిని అందించినట్లు సీతరామునివద్దకు చేర్చేదను

చింత చేత దుర్బలములైన ఇంద్రియములను హనుమంతుడు వృద్ధి పొందించెను
హనుమంతుడు క్షణ కాలము ఆలోచించి అశోకవ్వనప్రవేశోద్యుక్తుడై  వచ్చెను 
రామ చంద్రునకు, సీతా దేవికి, లక్ష్మణునికి నమస్కారము చేసి బయలుదేరేను
అశోక వనమంతా  రాక్షసులతో నిండినదై వృక్షములతో వ్యాకులమై యుండెను

ఆశోకవనము సంస్కారములచేత సంస్కృతమై పుణ్యప్రదముగా ఉండియుండెను
ఉద్యాన వనము నందు  రక్షక భటులు వియమితు లై వృక్షములను రక్షించును
అక్కడ పూజ్యుడైన వాయు దేవుడు కుడా తీవ్రత్వము లేకుండా గాలి  వీచెను
రాముని కార్యము చేయుటకు రావణునికి కనబడకుండా శరీరము చిన్నది చేసెను

బుషిగణములు, దేవతలు నాకు ఇక్కడ కార్యసిద్ది కలుగ చేయమని ప్రార్ధించెను
బ్రహ్మదేవున్ని, దేవతల్ని, అగ్ని, దేవెందృడ్ని, వరుణ్ణి,  ప్రార్ధించి  వేడుకొనెను
చంద్ర సూర్యులను, అశ్వనీదేవతలను, రుద్రుడ్ని, కార్యసిద్ధిఇవ్వమని ప్రార్ధించెను
సకలభూతములను, సర్వేస్వరున్ని, ఇతరదేవతలను, కార్యసిద్ధికి సహకరించమనేను

ఎత్తైన నాసికము, తెల్లని దంతములు, తామర రేకుల వంటి నెత్రములను
చంద్ర బింబము వలేఉన్న రామపత్నిసీత ముఖమును ఎప్పుడుచూచెదను
నీచుడు, పాపాత్ముడు, భయమును కలిగించే వేషములు మార్చే వాడును
రావణుడు ఆబలఅయిన సీతను తెచ్చిన అమే నాకుఎప్పుడు కనిపించును

శ్రీ సుందర కాండ మునందు 13 వ సర్గము సమాప్తము