Saturday, 18 April 2015

16. ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (16వ సర్గము )


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:

 16 వ సర్గ (వాల్మికి రామాయణములోని తెలుగు వచస్సు)
హనుమంతుడు ప్రశంసింప దగిన సీతను 
గునాబిరాముడగు రామచంద్రుడను 
ఒక్క క్షణం సీత ఉన్న పరిస్తిని తలచి విలపించెను 
 హనుమంతుడు మరల అలోచనలో మునిగిపోయెను 

రాముని భార్య అయిన సీతకు కూడా కాలము అతిక్రమించ లేకుండెను  
రామచంద్రుని యొక్కయు వ్యవసాయము నెరిగిన సీత అగుట చేతను 
వినయ విదేయుతులున్నలక్ష్మనునకు వదినగా సీత పూజ్యురాలును
వర్షాకాలములొగూడ గంగానది  అంతగా క్షోభించనట్లుగా సీత ఉండెను

 సీత తుల్యమైన శీలము వయస్సు వృత్తము గలదియును
తుల్యమైన వంశములో పుట్టి  రామచంద్రునకు భార్య అయి యుండెను
తుల్య వంశములో పుట్టిన సీత రామచంద్రున్ని తగిన  భర్తగా పొందెను
లక్ష్మీదేవివలె ఉన్న సీతను చూసి హనుమంతుడు  సంతోషించెను

హనుమంతుడు రామునివద్దకు మనసారా పోయి ఇట్లను కొనెను
సీత కొరకే సకల వరుల తో రాముడు  స్నేహము కలిపెను
సీత కొరకే కదా రాముడు బలశాలియిన వాలిని సంహరించెను 
పరాక్రమముచేత రావణునితో సమానమైన కభందుని సంహరించెను

ఈమె కొరకే భయంకరమైన పరాక్రముగల విరాధుడనే రాక్షసుడిని చంపెను 
ఈమె కొరకే కదా రాముడు జనస్తానములో అగ్నిజ్వాలలవంటి భానములను
భయంకరమైన కర్మగాల 14వేల మంది రాక్షసులను రాముడు చంపెను 
ఖరుని,త్రిశిరస్సుని,మహబలశాలి అయిన దూషణున్ని సంహరించెను

ఈమె మూలముగనె సుగ్రీవుడు వాలిపాలితమైన వానరైశ్వర్యమును పొందెను 
నేను ఈమె కోసమే కదా సముద్రమును దాటి లంకను దర్శించినాను
ఈమె కొరకే సముద్రమువరకు వ్యాపించిన భూమినే కాదు జగత్తును
తలకిందలు చేసినా యుక్తమే, అని హనుమంతుడు తలంచెను  

త్రిలోకమందలి రాజ్యమా లేక జనకాత్మజయగు సీత  అని ప్రశ్నవేసు కోనినను
జవాబుగా త్రిలోక రాజ్యము సీత యొక్క ఒక కలకు గూడా సమానము కాదనెను
ఈమె ధర్మశీలుడును, మహాత్ముడును, మిదిలాదిపతియగు జనకుని పుత్రికయును
దృడ మైన పాతివ్రత్యము కలిగియున్న సీత ఈమె అని నిర్ధారించు కొనెను

యజ్ఞభూమిలొ నాగలితోదున్నినప్పుడు భూమి చేదిమ్చుకొని బైటకు వచ్చిన సీత ఈమేను
పరాక్రమవంతుడు, పూజిమ్పదగినశీలముగలవాడు దశరధమహరాజు పెద్ద కోడలు ఈమేను
ధర్మమము తెలిసినవాడు, కృతజ్ఞుడు, బుద్ధిమంతుడుగా ప్రసిద్ది పొందిన వాడును 
అయిన శ్రీ రామచంద్రుడి భార్యయగు సీత ఇక్కడ రాక్షస స్త్రీలకు వశమై యుండెను

భర్త మీద ఉన్న ప్రెమచేత ఈమె సమస్త భోగములను విడిచెను 
ఈ కష్టములు లెక్కచేయక నిర్జనవనములో ప్రవేశించెను
భర్తకు సేవ చేయుట యందు ఆశక్తి కలదై ఉండెను 
దుంపలతోను, ఫలములతోను సంతుష్టి చెంది జీవించెను 

వనములోఉన్న పర్ణ శాలే మహాభవనమువలె సంతోషముగా ఉండేను  
బంగారం శరీరముగలదీ, ఎల్లపుడు నవ్వుతూమాట్లాడు నదియును
ఆపదలు ఈమెకు కావలసినవి కాదు కానీ భాధలు అనుభవిస్తుండెను
రావణుడు ఎంత భాధపెట్టిన తన ఉత్తమ శీలమును విడువకుండా ఉండెను

రామచంద్రుడు సీతను చూచిన పరమానంద భరితుడగును
దప్పికకొన్నవాడు చలివెంద్రముచూసి సంతోషించినట్లు సంతోషించును
రాజ్యబ్రష్టుడైన రాజు తిరిగి తనరాజ్యము పొందినట్లు పొందును 
రాఘవుడు ఈమెను తిరిగి పొందుటవలన మిక్కిలి ప్రీతి పొందును 

కామ భోగములను త్యజించినదియును 
భందు జన  విరహితయును 
ఈమె పతిసమాగమా కాంక్షతో తన దేహమును
విడువక ధరించి రామునికొరకు వేచి యుండెను

ఈమె రామునియందే మనస్సును లగ్నము చేసి యుండెను 
ఈమె పుష్ప ఫలములు చూడకుండా రాక్షస స్త్రీలతొ ఉండెను
ఈమె ద్యానముతో శ్రీరామచంద్రుని దర్శనము చేసుకోను చుండెను
ఈమె భర్త అనే అలంకారము లేకుండుటవలన శోభించకుండా ఉండెను 

నల్లని కేశములు కలదియును 
కమల పత్రముల వంటి కన్నులు కలదియును 
సుఖములనుభవింప తగినదియును
ద:ఖముతో ఉన్న సీతను చూసి మారుతి భాధపడెను 

పృద్వివలె మిక్కిలి ఓర్పుకలదియును
రాముని ప్రీమకు దూరమయ్యెను
రాక్షస స్త్రీల వేదింపులు దగ్గరాయెను
కన్నులవేమ్బడి కన్నీరు కార్చుతూ ఉండెను 

మంచు చేత కప్పు బడిన పద్మముల వలెను 
వ్యసనముల పరంపరచేత పీడింప బడుచున్నదియును
మగచాక్రవాకములేని ఆడచక్రవాకమువలె విరహముతొ ఉండెను
శొచనీయ అవస్తను పొందుతూ విలపించు చుండెను 

నీశ్చయముగా సీత నగలకన్నా భర్తే ముఖ్యమని చాటి చెప్పెను
సీత విరహముతొ రామచంద్రుడు దు:ఖముతో జీవించు చుండెను
శ్రీరామచంద్రుడు నిగ్రహించుకొని సీతను తలుస్తూ జీవించి యుండెను
సీత యున్న స్థితిని, రామచంద్రుని పరిస్థితిని చూసి మారుతి భాదపడెను 

పువ్వులతో సాఖాగ్రములు వంగిన అశోక వృక్షములను
మంచుతోలగిపోవుటచే ప్రకాశించుతున్న సహస్త్రకిరణములను
భర్తనే తలుస్తున్న సీతకు అధిక శోకము కలిగించు చుండెను


         ఈమె సీతయె అని నిశ్చయమునకు వచ్చి హనుమంతుడు                 వృక్షము  పైనే ఉండెను

శ్రీ సున్దరకాన్దమునన్దు 16వ సర్గ సంమాప్తము