Thursday 4 June 2020

🌻. యుద్ధకాండ వర్ణనము - 1 🌻

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 21  / Agni Maha Purana -  3  🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
🌻. ప్రథమ సంపుటము, అధ్యాయము - 10
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. యుద్ధకాండ వర్ణనము - 1 🌻

అథ దశమోధ్యాయః
అథ యుద్ధకాణ్డ వర్ణనమ్‌.
నారద ఉవాచః

రామో క్తశ్బాఙ్గదో గత్వాం రావణం ప్రాహ జానకీ | దీయతాం రాఘవాయాశు అన్యథా త్వం మరిష్యసి. 1

నారదుడు చెప్పెను: రాముడు పంపగా అంగదుడు వెళ్ళి రావణునితో ఇట్లు చెప్పెను. "వెంటనే సీతను రామునకు ఒప్పగించుము. కానిచో మరణింపగలవు"

రావణో హన్తుమద్యుక్తః | సఙ్గ్రామోద్ధతరాక్షసః | రామాయహ దశగ్రీవో యుద్ధమేకం తు మన్యతే. 2

యుద్ధమునకై ఉద్దతులైన రాక్షసుల గల రావణుడు అతనిని చంపుటకు ప్రయత్నించెను. అతడు తిరిగివచ్చి. "దశగ్రీవుడు యద్ధమును మాత్రమే కోరుచున్నాడు" అని రామునితో చెప్పెను.

రామో యుద్ధాయ తచ్చ్రుత్వా లఙ్కాం స కపి రాయ¸°| వానరా హనుమాన్మైన్దోద్వివిదో జామ్బవాన్నలః. 3

నీలస్తారో7ఙ్గదో ధుమ్రః సుషేణః కేశరీ గజః| పనసో వినతో రమ్భః శరభః క్రథనో బలీ. 4

గవాక్షో దధివక్త్రశ్చ గవయో-గంధమాదనః | ఏతే చాన్యే చ సుగ్రీవ ఏతైర్యుక్తో హ్యసంఖ్యకైః 5

ఆ మాట విని రాముడు వానరసమేతుడై లంక చేరెను. హనుమంతుడు మైందుడు, ద్వివిదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, తారుడు, అంగద-ధూమ్ర-సుషేణులు, కేనరి, గజ - పనస - వినత - రంభ - శరభ క్రథనులు, బల శాలియైన గవాక్షుడు; దధివక్త్ర - గవయ - గంధమాదనులు, తదితర వానరులును వెళ్ళిరి. వీరితోడను, అసంఖ్యాకులగు ఇతరవానరులతోడను కూడిన సుగ్రీవుడు కూడ వెళ్ళెను.

రక్షసాం వానరాణాం చ యుద్ధం సఙ్కులమాలభౌ | రాక్షసా వానరాఞ్జఘ్నః శరశక్తిగదాదిభిః 6

వానరా రాక్షసాఞ్జఘ్నుః నఖద న్తశిలాదిభిః | హస్త్యశ్వరథపాదాతం రాక్షసానాం బలం హతమ్‌. 7

వానరరాక్షసుల మధ్య సంకుల యుద్ధము కొనసాగెను. రాక్షసులు బాణములు, శక్తులు, గదలు మొదలగు వాటితో వానరులను కొట్టిరి. వానరులు, గోళ్ళు దంతములు, శిలలు మొదలగు వాటితో వానరులను కొట్టిరి. రాక్షసుల ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు-ఈ రూపములో నన్ను సైన్యము చంపబడెను.

హనుమాన్గిరశృఙ్గేణ ధూమ్రాక్షమవధీద్రిపుమ్‌ | అకమ్పనం ప్రహస్తం చ యుధ్యన్తం నీల ఆవధీత్‌. 8

హనుమంతుడు శత్రువైన ధూమ్రాక్షున పర్వతశిఖరముతో చెంపెను. నీలుడు యుద్ధము చేయుచున్న అకంపన- ప్రహస్తులను చెంపెను.

ఇన్ద్రజిచ్ఛరబన్దాచ్చ విముక్తౌ రామలక్ష్మణౌ | తార్‌క్షసన్దర్శనాద్బాణ్ణర్జఘ్నతూ రక్షసాం బలమ్‌. 9

గరుత్మంతుని దర్శనముచే ఇంద్రజిత్తు ప్రయోగించిన శరబంధమునుండి విములైన రామలక్ష్మణులు బాణములతో రాక్షససైన్యమును సంహరించిరి.

రామః శ##రైర్జర్జరితం రావణం చాకరోద్రణ | రావణః కుమ్భకర్ణం చ బోధయమాస దుఃఖితః 10

రణరంగమున రాముడు బాణములచే రావణున జర్జరశరీరునిగా చేసెను. రావణుడు దుఃఖితుడై కుంభకర్ణుని మేల్కొలిపెను.

కుమ్భకర్ణః ప్రబుద్ధోథ పిత్వా ఘటసహస్రకమ్‌ | మద్యస్య మహిషాదీనాం భక్షయిత్వాహ రావణమ్‌. 11

నిద్రనుండి లేచిన కుంభకర్ణుడు వేయి కడవల మద్యము త్రాగి మహిషాదిమాంసము భుజించి రావణునితో ఇట్లు పలికెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 22 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 10
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. యుద్ధకాండ వర్ణనము - 2 🌻

కుంభకర్ణ ఉవాచ:

సీతాయా హరణం పాపం కృతం త్వం హి గరుర్యతః | అతో గచ్ఛామి యుద్ధాయ రామం హన్మి సవానరమ్‌.

కుంభకర్ణుడు పలికెను. నీవు సీతాహరణమను పాపకార్యము చేసితివి. అయినను నీవు నాకు అన్న కానయుద్ధమునకు వెళ్ళి వాన రసహితుడైన రాముని సంహరించెదను.

నారద ఉవాచః

ఇత్యుక్త్వా వానరాన్సర్వాన్‌ కుమ్భకరణో మమర్దహ | గృహీతస్తేన సుగ్రీవః కర్ణనాసం చక ర్త సః. 13

కర్ణనాసావిహీనో7సౌ భక్షయామాస వానరాన్‌ | రమో7థ కుమ్భకర్ణస్య బాహూ చిచ్ఛేద సాయకైః. 14

తతః పాదౌ తతశ్ఛిత్త్వా శిరో భూమౌ వ్యపాతయత్‌ |

కుంభకర్ణుడీ విధముగ పలకి వానరులందరిని మర్దించెను. అతడు సుగ్రీవుని పట్టుకొనగా, సుగ్రీవుడు వాని చెవులను, ముక్కును, కొరికివేసెను. చెవులు ముక్కులేని అతడు వానరులను భక్షించెను. పిమ్మట రాముడు బాణములతో కుంభకర్ణుని బాహువులను, పాదములను చేధించి అతని సిరస్సు నేలపై పడవేసెను.

అథ కుమ్భో నికుంభశ్చ మకరాక్షశ్చ రాక్షసః 15

మహోదరో మహాపార్శ్వో మత్త ఉన్మత్త రాక్షసః | ప్రఘసో భాసకర్ణశ్చ విరూపాక్షశ్చ సంయుగే. 16

దేవాన్తకో నరాన్తశ్చ త్రిశిరాశ్చాతికాయకః | రామేణ లక్ష్మణనైతే వానరైః సవిభీషణౖః. 17

యుధ్యమానాస్తథా హ్యన్యే రాక్షసా భువి పాతితాః |

పిమ్మట రామలక్ష్మణులును, వానరులును, విభీషణుడును కుంభ-నికుంభ-మకరాక్ష - మహోదర-మహాపార్శ్వ-మత్త-ఉన్మత్త-ప్రఘన-భాసకర్ణ-విరూపాక్ష-దేవాంతక-నరాంతక, త్రిశిరస్క-అతికాయులను రాక్షసులను, యుద్దము చేయుచున్న ఇతర రాక్షసులను సంహరించిరి.

ఇన్ద్రజిన్మాయయా యుద్ధ్యన్రామాదీన్స మ్బబన్ద హ. 18

వరదత్తైర్నా గబాణౖరోషధ్యా తౌ విశల్యకౌ | విశల్యయావ్రణౌ కృత్వా మారుత్యానీతపర్వతే. 19

హనూమాన్ధారయామాస తత్రాగం యత్ర సంస్థితః|

మాయతో యుద్ధము చేయుచు ఇంద్రజిత్తు రామాదులను వరలబ్ధములైన నాగబాణములైన నాగబాణములచే బంధించెను. హనుమంతుడు తాను తీసికొవచ్చిన పర్వతముపై ఉన్న విశల్యయను ఓషధిచేత రామలక్ష్మణులను శల్యరహితులను చేసి ఆ పర్వతమును దాని చోట ఉంచెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
 💎💥💎💥💎💥💎


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 23 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 10
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. యుద్ధకాండ వర్ణనము - 3 🌻

నికుమ్భిలాయాం హోమాది కుర్వన్తతం హి లక్ష్మణః #9; 20

శ##రైరిన్ద్రజితర వీరం యుద్ధే తం తు వ్యశాతయత్‌ | రావణః శోకసన్తప్తః సీతాం హన్తుం సముద్యతః. 21

అవిన్ద్యావారితో రాజా రథస్థః సబలో య¸°|

నికుంభిలలో హోమాదికముచేయుచున్న ఆ ఇంద్రజిత్తులను లక్ష్మణుడు బాణములతో సంహరించెను. రావణుడు శోకసంతప్తుడై సీతను చంపుటకు ఉద్యమింపగా అవింధ్య వారించెను. అతడు సేనాసమేతుడై రథము నెక్కి యుద్ధమునకై వెళ్శెను.

ఇన్ద్రోక్తో మాతలీ రామం రథస్థం ప్రచకార తమ్‌. 22

రామారావణయోర్యద్ధం రామరావణయోరివ | రావణో వానరాన్‌ హన్తి మారుత్యాద్యాశ్చ రావణమ్‌. 23

ఇంద్రుడు పంపగా మాతలి వచ్చి రాముని రథారూడుని చేసెను. రామరావణుల యుద్దమునకు రామరావణ యుద్ధమే సాటి. రావణుడు వానరులను కొట్టగా, హనూమదాది వానరులు రావణుని కొట్టిరి.

రామః శ##సై#్త్రస్తమసై#్త్రశ్చ వవర్ష జలదో యథా | తస్యధ్వజం స చిచ్ఛేద రథమశ్వాంశ్చ సారథిమ్‌. 24

దనుర్బాహూంశ్ఛిరాం స్యేవ ఉత్తిష్ఠన్తి శిరాంసి హి | పైతామహేన హృదయం భిత్వా రామేణ రావణః 25

భూతలే పాతితః సర్వై రాక్షసై రురుదుః స్త్రియః|

రాముడు మేఘము వలె ఆ రావణునిపై అస్త్రాస్త్రములను కురిపించెను. అతని ధ్వజమును భేదించి, రథమును భగ్నముచేసి గుఱ్ఱములను, సారథిని చంపి, అతని ధనస్సును, బాహ్మావులను, శిరస్సులను ఛేదించెను, కాని అతని శిరస్సుమరల మరల మొలుచు చుండెను. అపుడు రాముడు బ్రహ్మాస్త్రముచే అతని హృదయమును భేదించి నేలపై కూల్చెను. రాక్షసుల నందరిని కూడ పరిమార్చెను. స్త్రీలు విహత భర్తృకలై ఏడ్చరి.

ఆశ్వాస్యతంచసత్కృత్య రామాజ్ఞప్తో విభీషణః 26

హనూమతానయద్రామః సీతాం శుధ్ధాం గృహీతవాన్‌ | రామో వహ్నౌ ప్రవిష్టాం తాం శుద్ధామిన్ద్రాదిభిః స్తుతః

బ్రహ్మణా ధశరథేన త్వం విష్ణూ రాక్షస మర్దనః | ఇన్ద్రో7ర్చితో7మృతవృష్ట్యా జీవయామాస వానరాన్‌ . 28

రాముని ఆజ్ఞచే విభీషణుడు ఆ స్త్రీలను ఓదార్చెను. రాముని పూజించెను. రాముడు హనుమంతుని ద్వారా సీతను రప్పించి, అగ్ని ప్రవేశముచే శుద్ధరాలగు ఆమెను స్వీకరించెను. ఇంద్రాదిదేవతలును, బ్రహ్మయు, దశరథుడును "నీవు రాక్షససంహారివైన విష్ణువే" అని అతనిని స్తుతించిరి. రాముడు కోరగా ఇంద్రుడు అమృతము కురిపించి వానరులను పునరుజ్జీవితులను చేసెను.

రామేణ పూజితా జగ్ముర్యుద్దం దృష్ట్వా%ివం చ తే | రామే విభీషణాయాదాల్లఙ్కా మభ్యర్చ్య వానరాన్‌. 29

ఆ దేవతలు యుద్ధము చూచి రామునిచే పూజితులై స్వర్గమునకు వెళ్ళిరి. రాముడు వానరులను గౌరవించి, లంకా రాజ్యమును విభీషణున కిచ్చెను.

ససీతః పుష్పకే స్థిత్వా77గతమార్గేణ వై గతః | దర్శయన్వనదుర్గాణి సీతాయై హృష్ణమానసః 30

సీతాసమేతుడై పుష్పకమునెక్కి, సంతసించిన మనస్సు కలవాడై, సీతకు వనములను, దుర్గమ భూములను చూపుచు, వచ్చిన మార్గముననే అయోధ్య వైపు తిరిగి వెళ్ళెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 24 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 10
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. రామాయణ యుద్ధకాండ వర్ణనము - 4 🌻

భరద్వాజం నమస్కృత్య నన్దిగ్రామం సమాగతః | భరతేన నతశ్చాగాదయోధ్యాం తత్ర సంస్థితః. 31

భరద్వాజునకు నమస్కరించి అచట నుండి నందిగ్రామమునకు వెళ్ళి, భరతునిచే నమస్కరింపబడివాడై అయోధ్యకు వెళ్ళెను.

వసిష్ఠాదీన్నమస్కృత్య కౌసల్యాం చైవ కైకయీమ్‌ | సుమిత్రాం ప్రాప్తరాజ్యోథ ద్విజాతీన్సో7భ్యపూజయత్‌.

వసిష్ఠాదులకు నమస్కరించి,కౌసల్యా-కై కేయి-సుమిత్రలకు కూడ నమస్కరించి, రాజ్యమును పొంది బ్రహ్మణులను పూజించెను.

వాసుదేవం స్వమాత్మానమశ్వమేధైరతయజత్‌ | సర్వదానాని స దదౌ పాలయామాస స ప్రజాః 33

పుత్రవద్దర్మకామాదీన్‌ దుష్టనిగ్రహేణ రతః |

పిమ్మట అశ్వమేధయాగములచే వాసుదేవుడైన తనను తానే ఆరాధించెను. సర్వదానములను ఇచ్చెను. ప్రజలను పుత్రులను వలె పాలించెను. దుష్టులను నిగ్రహించుటయందు అసక్తుడై ధర్మకామాదులను పాలించెను.

సర్వధర్మపరో లోకః సర్వసస్యా చ మేదినీ | నాకాలమరణశ్చాసీద్రామే రాజ్యం ప్రశాసతి.

ఇత్యాది మహాపురాణ అగ్నేయే రామాయణ యుద్ధకాణ్డ వర్ణనం నామ దశమోధ్యాయః.

రాముడు రాజ్యమును పాలించిన కాలమున ప్రజలందరును తమ ధర్మములను పాలించుటయందు అసక్తులైరి. అకాలమరణము చెందనవాడెవ్వడును లేకుండెను.

అగ్ని మహాపురాణమున రామాయణమునందలి యుద్దకాండవర్ణనమను దశమాధ్యాయము సమాప్తము.

సశేషం... 

🌹 🌹 🌹 🌹 

No comments:

Post a Comment