Wednesday, 31 August 2022

సుందర కాండ - ప్రార్ధనా శ్లోకాలు

 సుందర కాండ - ప్రార్ధనా శ్లోకాలు  


001..సౌందర్యములు ఇందు అభివ్యక్త మగుటచే దీనికి "సుందరాకాండ" అయినది.

సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథా|

సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం||"

సుందరే సుందరం కావ్యం సుందరే సుందరః కపిః|

సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం|


*హనుమ స్వరూపము*

*వేదవేద్యే పరే పుంసి జాతే దశరాత్మజే*

*వేద: ప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా*


*తతో రావణ నీతాయాః సీతాయాః శత్రు కర్శనః

ఇయేష పదమ్ అన్వేష్టుం చారణా చరితే పథి 5.1.1


*ముమోచ చ శిలాః శైలో విశాలాః సమన శ్శిలాః

మధ్యమేనా౭ర్చిషా జుష్టో ధూమ రాజీ రివా౭నలః 5.1.16

 

వానరాన్ వానర శ్రేష్ఠ ఇదం వచనమ్ అబ్రవీత్

యథా రాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః     5.1.39

 

గచ్ఛేత్ త ద్వద్గమిష్యామి ల౦కా౦ రావణ పాలితామ్

న హి ద్రక్ష్యామి యది తాం లఙ్కాయాం జనకా౭౭త్మజామ్  5.1.40

 

అనేనైవ హి వేగేన గమిష్యామి సురా౭౭లయమ్

యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యా౭మ్యకృత శ్రమః        5.1.41

 

బద్ధ్వా రాక్షస రాజానమ్ ఆనయిష్యామి రావణమ్

సర్వథా కృత కార్యో౭హమ్ ఏష్యామి సహ సీతయా       5.1.42

 

ఆనయిష్యామి వా లఙ్కాం సముత్పాట్య సరావణామ్

ఏవమ్ ఉక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః         5.1.43

 

ఉత్పపాతా౭థ వేగేన వేగవాన్ అవిచారయన్

సుపర్ణ మివ చా౭౭త్మానం మేనే స కపికుంజరః 5.1.44

 

దశ యోజన విస్తీర్ణా త్రింశ ద్యోజనమ్ ఆయతా            

ఛాయా వానర సింహస్య జలే చారుతరా౭భవత్ 5.1.76


య ఈ చకార్న సౌ అస్య వేదయ ఇద దర్శహిరుగిన్ను తస్మాత్,

సమాధుర్యోమ్ నా పరివీతో అంతర్బహు ప్రజా నిరుతిమా వివేశః  (ఋ.వే.1 164 32 )



శ్లో|| అంగుష్ఠమాత్ర పురుషో జ్యోతి రివా  ధూమకః|

      ఈశానో భూత భవ్యస్య స ఎవాద్యసఉశ్వః||

ఈ ఛాయాపురుషుడు చాతుర్మాత్రాత్మక జగత్తున కతీతుడై, త్రికాలజ్ఞుడై, త్రిలోకగామియై యుండును.

శ్లో|| మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం|

      వాతాత్మజం వానర యూధ ముఖ్యం, శ్రీరామదూతం శరణం ప్రపధ్యే||



సింహిక

 గరుడ వేగముతో హనుమ ఆకాశము నందు సాగు చుండగా ఎదురుగాలి చే మందగించిన ఓడ వలె హనుమ వేగము తగ్గెను

ప్లవమానం తు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసీ

మనసా చిన్తయా మాస ప్రవృద్ధా కామ రూపిణీ 5.1.173

అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యా మ్య౭హమ్ ఆశితా

ఇదం హి మే మహత్ సత్త్వం చిరస్య వశమ్ ఆగతమ్      5.1.174


కావ్యగతశబ్దార్థరస సౌందర్యములను పరిశీలింతుము.

1 శబ్ద సౌందర్యము

హంసో యథా రాజత ప౦జర స్థః

సింహో యథా మన్దరకన్దర స్థః

వీరో యథా గర్విత కుఞ్జర స్థః

చన్ద్రో౭పి బభ్రాజ తథా౭మ్బర స్థః      5 5 4

మున్నగు శ్లోకములలో వర్ణ, పద, అనుప్రాసలు అందము కనబడును.

2 "అర్థ సౌందర్యము*

ఇందలి వర్ణనలు, కథ, అలంకారములు కడు మనోహరములు. ఉదాహరణకు

ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమ్ అన్వయుః

ప్రస్థితం దీర్ఘమ్ అధ్వానం స్వబన్ధుమ్ ఇవ బాన్ధవాః    5.1.47

తమ్ ఊరు వేగోన్మథితాః సాలా శ్చా౭న్యే నగోత్తమాః

అనుజగ్ముర్ హనూమన్తం సైన్యా ఇవ మహీ పతిమ్            5.1.48


అహం రాక్షస రాజస్య రావణస్య మహాత్మనః

ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్షా రక్షామి నగరీ మిమాం        5.3.28

 

అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ

సర్వతః పరిరక్షామి హ్యేత త్తే కథితం మయా   ౫.త్రీ.౩౦

 తత స్తదా బహు విధ భావితా౭౭త్మనః

కృతా౭౭త్మనో జనక సుతాం సువర్త్మనః

అపశ్యతో౭భవ ద౭తి దుఃఖితం మనః

సుచక్షుషః ప్రవిచరతో మహాత్మనః  5 7 17


తతో రావణ నీతాయాః సీతాయాః శత్రు కర్శనః


ఇయేష పదమ్ అన్వేష్టుం చారణా చరితే పథి 5।1।1

ముమోచ చ శిలాః శైలో విశాలాః సమన శ్శిలాః


మధ్యమేనా౭ర్చిషా జుష్టో ధూమ రాజీ రివా౭నలః 5।1।16 

వానరాన్ వానర శ్రేష్ఠ ఇదం వచనమ్ అబ్రవీత్


యథా రాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః     5।1।39

గచ్ఛేత్ త ద్వద్గమిష్యామి ల౦కా౦ రావణ పాలితామ్


న హి ద్రక్ష్యామి యది తాం లఙ్కాయాం జనకా౭౭త్మజామ్  5।1।40


అనేనైవ హి వేగేన గమిష్యామి సురా౭౭లయమ్

యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యా౭మ్యకృత శ్రమః        5।1।41


బద్ధ్వా రాక్షస రాజానమ్ ఆనయిష్యామి రావణమ్

సర్వథా కృత కార్యో౭హమ్ ఏష్యామి సహ సీతయా       5।1।42


ఆనయిష్యామి వా లఙ్కాం సముత్పాట్య సరావణామ్

ఏవమ్ ఉక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః         5।1।43


ఉత్పపాతా౭థ వేగేన వేగవాన్ అవిచారయన్

సుపర్ణ మివ చా౭౭త్మానం మేనే స కపికుంజరః 5।1।44


 

గౌరీం కనక వర్ణా౭౭భామ్ ఇష్టామ్ అన్తః పురేశ్వరీమ్

కపి ర్మన్దోదరీం తత్ర శయానాం చారు రూపిణీమ్  5.10.52

 

స తాం దృష్ట్వా మహాబాహు ర్భూషితాం మారుతా౭౭త్మజః

తర్కయా మాస సీతేతి రూప యౌవన సంపదా  5.10.53

 

హర్షేణ మహతా యుక్తో ననన్ద హరియూథపః

*ఆస్హ్పోటయా మాస చుచుమ్బ పుచ్ఛం

ననన్ద చిక్రీడ జగౌ జగామ*

 

స్తమ్భాన్ అరోహన్ నిపపాత భూమౌ

నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనామ్   5.10.54

 

మనో హి హేతుః సర్వేషామ్ ఇన్ద్రియాణాం ప్రవర్తనే

శుభా౭శుభా స్వ౭వస్థాసు తచ్చ మే సువ్యవస్థితమ్        5.11.41

 

అనిర్వేదః శ్రియో మూలమ్ అనిర్వేదః పరం సుఖమ్

అనిర్వేదో హి సతతం సర్వా౭ర్థేషు ప్రవర్తకః                5.11.10

 

కరోతి సఫలం జంతో:కర్మ య త్తత్ కరోతి సః

తస్మాత్ అనిర్వేద కృతం యత్నం  చేష్టే౭హ ముత్తమం 5.11.11

 


ఏకా౭క్షీమ్ ఏక కర్ణాం చ కర్ణ ప్రావరణాం తథా

అకర్ణాం శ౦కు కర్ణాం చ మస్తకో చ్ఛ్వాస నాసికామ్         5.17.5

అతి కాయో త్తమా౭౦గీం చ తను దీర్ఘ శిరో ధరామ్

 

ధ్వస్త కేశీం తథా౭కేశీం కేశ కమ్బళ ధారిణీమ్                5.17.6

లమ్బ కర్ణ లలాటాం చ లమ్బోదర పయోధరామ్

లమ్బౌష్ఠీం చిబుకౌష్ఠీం చ లమ్బా౭౭స్యాం లమ్బ జానుకామ్    5.17.7

 

హ్రస్వాం దీర్ఘాం చ కుబ్జాం చ వికటాం వామనాం తథా

కరాళా౦ భుగ్న వస్త్రాం చ పి౦గా౭క్షీం వికృతా౭౭ననామ్  5.17.8

వికృతాః పి౦గళా: కాళీ: క్రోధనాః కలహ ప్రియాః

 

కాలా౭౭యస మహా శూల కూట ముద్గర ధారిణీః           5.17.9

వరాహ మృగ శార్దూల మహిషా౭జ౭శివా ముఖీః

గజో ష్ట్ర హయ పాదా శ్చ నిఖాత శిరసో౭పరాః               5.17.10

 

ఏక హస్తైక పాదా శ్చ ఖర కర్ణ్య౭శ్వ కర్ణికాః

గోకర్ణీ ర్హస్తి కర్ణీ శ్చ హరి కర్ణీ స్తథా౭పరాః               5.17.11

 

అనాసా అతి నాసా శ్చ తిర్య ఙ్నాసా వినాసికాః

గజ సన్నిభ నాసా శ్చ లలాటో చ్ఛ్వాస నాసికాః            5.17.12

 

హస్తి పాదా మహా పాదా గో పాదాః పాద చూళికాః

అతిమాత్ర శిరో గ్రీవా అతిమాత్ర కుచోదరీః                   5.17.13

 

అతిమాత్రా౭౭స్య నేత్రా శ్చ దీర్ఘ జిహ్వా నఖా స్తథా

అజా ముఖీ ర్హస్తి ముఖీ ర్గో ముఖీః సూకరీ ముఖీః       5.17.14

 

హయో ష్ట్ర ఖర వక్త్రా శ్చ రాక్షసీ ర్ఘోర దర్శనాః

శూల ముద్గర హస్తా శ్చ క్రోధనాః కలహ ప్రియాః       5.17.15

 

కరాళా ధూమ్ర కేశీ శ్చ రాక్షసీ ర్వికృతా౭౭ననాః

పిబన్తీ స్సతతం పానం సదా మాంస సురా ప్రియాః  5.17.16

 

మాంస శోణిత దిగ్ధా౭౦గీ ర్మాంస శోణిత భోజనాః

తా దదర్శ కపి శ్రేష్ఠో రోమ హర్షణ దర్శనాః              5.17.17



యథా తవ తథా౭న్యేషాం దారా రక్ష్యా నిశాచర 5.21.7

 

ఆత్మానమ్ ఉపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యతామ్

అకృతా౭౭త్మానమ్ ఆసాద్య రాజానమ్ అనయే రతమ్ 5.21.11

సమృద్ధాని వినశ్యన్తి రాష్ట్రాణి నగరాణి చ

 

మిత్రమ్ ఔపయికం కర్తుం రామః స్థానం పరీప్సతా        5.2119

వధం చా౭నిచ్ఛతా ఘోరం త్వయా౭సౌ పురుషర్షభః

 

విదితః స హి ధర్మజ్ఞః శరణాగత వత్సలః                      5.2120

తేన మైత్రీ భవతు తే యది జీవితు మిచ్ఛసి


వామః కామో మనుష్యాణాం యస్మిన్ కిల నిబధ్యతే

జనే తస్మిం స్త్వ౭నుక్రోశః స్నేహ శ్చ కిల జాయతే        5 .22 4


శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-11

త్రిజట స్వప్నము

సీతాదేవి ఆ రక్కసుల మాటలకు మిగుల పరితాపము చెందుచు ..


హా రామేతి చ దుఃఖా౭౭ర్తా పున ర్హా లక్ష్మణేతి చ

హా శ్వశ్రు మమ కౌసల్యే హా సుమిత్రేతి భామినీ 5 25 11

 

లోక ప్రవాదః సత్యో౭యం పణ్డితైః సముదా౭౭హృతః

అకాలే దుర్లభో మృత్యుః స్త్రియా వా పురుష స్య వా      5 25 12           

 

య త్రా౭హ మేవం క్రూరాభీ రాక్షసీభి: ఇహా౭ర్దితా

 

జీవామి హీనా రామేణ ముహూర్తమ్ అపి దుఃఖితా         5 25 13

ధిగ్ అస్తు ఖలు మానుష్యం ధిగ్ అస్తు పర వశ్యతామ్

న శక్యం యత్ పరిత్యక్తుమ్ ఆత్మ చ్ఛన్దేన జీవితమ్    5 25 20



చన్ద్ర సూర్యౌ మయా దృష్టా పాణిభ్యాం పరిమార్జతీ

తత స్తాభ్యాం కుమారాభ్యామ్ ఆస్థితః స గజోత్తమః       5.27.16

 

సీతయా చ విశాలా౭క్ష్యా ల౦కాయా ఉపరి స్థితః

పాణ్డు రర్షభ యుక్తేన రథే నా౭ష్ట యుజా స్వయమ్        5.27.17


*శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-12*

*సీత ప్రాణత్యాగమునకు సిద్ధపడుట*

సీత మనస్సు రాక్షస రాజైన రావణుడు క్రూరముగా పల్కిన మాటలకు బెదిరినదియై విలపించు చుండెను.

*నై వా౭స్తి దోషమ్ మమ నూనం అత్ర*

*వధ్యా౭హమ్ అస్యా ప్రియ దర్శన స్య*

*భావం న చా స్యా౭హ మ౭నుప్రదాతుమ్*

*అలం ద్విజో మన్త్రమ్ ఇవా౭ద్విజాయ* 5 28 5

*నూనం మ మా౭౦గా న్య౭చిరా ద౭నా౭౭ర్యః*

*శస్త్రైః శితై శ్ఛేత్స్యతి రాక్షసేన్ద్రః*

*తస్మి న్న౭నాగచ్ఛతి లోక నాథే*

*గర్భస్థ జన్తో రివ శల్య కృన్తః*                 5 28  6

 ..

*శోకా౭భితప్తా బహుధా విచిన్త్య*

*సీతా౭థ వేణ్యుద్గ్రథనం గృహీత్వా*

*ఉద్బధ్య వేణ్యుద్గ్రథనేన శీఘ్రమ్*

*అహం గమిష్యామి యమ స్య మూలమ్* 5 28 18

 


] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-13

 

సీతాదేవికి వినబడునట్లు హనుమ రామకథను వినిపించుట

ఏవం బహువిధాం చిన్తాం చిన్తయిత్వా మహా కపిః   5.31.1

 

సంశ్రవే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహార హ

తస్య పుత్రః ప్రియో జ్యేష్ఠ స్తారా౭ధిప నిభా౭౭ననః

 

రామో నామ విశేషజ్ఞః శ్రేష్ఠః సర్వ ధనుష్మతామ్       5.31.6

రక్షితా స్వస్య వృత్తస్య స్వజన స్యా౭పి రక్షితా

 

రక్షితా జీవ లోకస్య ధర్మస్య చ పరంతపః               5.31.7

తస్య సత్యా౭భిసంధస్య వృద్ధస్య వచనాత్ పితుః

 

తస్య సత్యా౭భిసంధస్య వృద్ధస్య వచనాత్ పితుః

సభార్యః సహ చ భ్రాత్రా వీరః ప్రవ్రాజితో వనమ్      5.31.8

 

జనస్థాన వధం శ్రుత్వా హతౌ చ ఖర దూషణౌ

తత స్త్వ౭మర్షా౭పహృతా జానకీ రావణేన తు           5.31.10

 

వంచయిత్వా వనే రామం మృగ రూపేణ మాయయా

స మార్గమాణ స్తాం దేవీం రామ స్సీతాం అనిన్దితాం  5.31.11

 

ఆససాద వనే మిత్రం సుగ్రీవం నామ వానరం

తత స్స వాలినం హత్వా రామ: పర పురంజయః     5.31.12

 

ప్రాయచ్ఛ త్కపి రాజ్యం త త్సుగ్రీవాయ మహా బలః                         

సుగ్రీవేణా౭పి సందిష్టా హరయ: కామ రూపిణః        5.31.13

 

దిక్షు సర్వాసు తాం దేవీం విచిన్వంతి సహస్రశః

అహం సంపాతి వచనా చ్ఛత యోజన మా౭౭యతం    5.31.14


నమో౭స్తు వాచస్పతయే సవజ్రిణే

స్వయమ్భువే చైవ హుతా౭శనాయ చ

అనేన చోక్తం య దిదం మమా౭గ్రతో

వనౌకసా త చ్చ తథా౭స్తు నా౭న్యథా    5.32.14


కల్యాణీ బత గాథేయం లౌకికీ ప్రతిభాతి మా

ఏతి జీవన్తమ్ ఆన౦దో నరం వర్ష శతా ద౭పి      5.34.6



శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-14

సీత కోరికపై హనుమ శ్రీరాముని గుణగణములను వివరించుట

సీతాదేవి కోరికపై శ్రీరాముని శరీర చిహ్నములను, గుణగణములను ఈ విధముగా వివరిస్తున్నాడు.

జానన్తీ బత దిష్ట్యా మాం వైదేహి పరిపృచ్ఛసి

భర్తుః కమల పత్రా౭క్షి సంఖ్యానం లక్ష్మణ స్య చ  5.35.6

రామః కమల పత్రాక్షః సర్వ భూత మనోహరః

రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకా౭౭త్మజే  5.35.8

రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకా౭౭త్మజే                              

తేజసా౭౭దిత్య సంకాశః క్షమయా పృథివీ సమః

బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవోపమః  5.35.9

రక్షితా జీవలోక స్య స్వజన స్య చ రక్షితా

రక్షితా స్వస్య వృత్త స్య ధర్మ స్య చ పరంతపః 5.35.10

రామో భామిని లోక స్య చాతు ర్వర్ణ్య స్య రక్షితా

మర్యాదానాం చ లోక స్య కర్తా కారయితా చ సః  5.35.11

అర్చిష్మాన్ అర్చితో౭త్య౭ర్థం బ్రహ్మచర్య వ్రతే స్థితః

సాధూనామ్ ఉపకారజ్ఞః ప్రచారజ్ఞ శ్చ కర్మణామ్   5.35.12

రాజ విద్యా వినీత శ్చ బ్రాహ్మణానామ్ ఉపాసితా

శ్రుతవాన్ శీల సంపన్నో వినీత శ్చ పరంతపః  5.35.13

యజుర్వేద వినీత శ్చ వేదవిద్భిః సుపూజితః

ధనుర్వేదే చ వేదే చ వేదా౦గేషు చ నిష్ఠితః      5.35.14

సత్య ధర్మ పరః శ్రీమాన్ సంగ్రహా౭నుగ్రహే రతః

దేశ కాల విభాగజ్ఞః సర్వ లోక ప్రియం వదః   5.35.21


"మిత్రులకు, శ్రేయోభిలాషులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు"

శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-15



*ఋషీణాం దేవతానాం చ గన్ధర్వా౭ప్సరసాం తథా*  6.41.61

*నాగానా మ౭థ యక్షాణాం రాజ్ఞాం చ రజనీచర*

*య చ్చ పాపం కృతం మోహా ద౭వలిప్తేన రాక్షస* 6.41.62

*నూన మ౭ద్య గతో దర్పః స్వయమ్భూ వరదాన జః*

*యస్య దణ్డ ధర స్తేఽహం దారా హరణ కర్శితః*

*ద౦డ౦ ధారయమాణ స్తు ల౦కా ద్వారే వ్యవస్థితః* 6.41.63

*పదవీం దేవతానాం చ మహర్షీణాం చ రాక్షస*

*రాజర్షీణాం చ సర్వేషాం గమిష్యసి మయా హతః* 6.41.64

*బలేన యేన వై సీతాం మాయయా రాక్షసా౭ధమ*

*మా మ౭తిక్రామయిత్వా త్వం హృతవాం స్త ద్విదర్శయ* 6.41.65

*అరాక్షస మిమం లోకం కర్తా౭స్మి నిశితైః శరైః*

*న చే చ్ఛరణ మ౭భ్యేషి మా ముపాదాయ మైథిలీమ్* 6.41.66

*ధర్మాత్మా రక్షసాం శ్రేష్ఠః సంప్రాప్తోఽయం విభీషణః*

*ల౦కై శ్వర్యం ధ్రువం శ్రీమాన౭యం ప్రాప్నో త్య౭కణ్టకమ్* 6.41.67

*న హి రాజ్య మ౭ధర్మేణ భోక్తుం క్షణ మ౭పి త్వయా*

*శక్యం మూర్ఖ సహాయేన పాపే నా౭విదితా౭౭త్మనా*  6.41.68

*యుధ్యస్వ వా ధృతిం కృత్వా శౌర్య మా౭౭లమ్బ్య రాక్షస*

*మ చ్ఛరై స్త్వం రణే శాన్త స్తతః పూతో భవిష్యసి* 6.41.69

*య ద్యా౭౭విశసి లోకాం స్త్రీన్ పక్షి భూతో మనోజవః*

*మమ చక్షు ష్పథం ప్రాప్య న జీవ న్ప్రతి యాస్యసి *  6.41.7౦

*బ్రవీమి త్వాం హితం వాక్యం క్రియతామ్ ఔర్ధ్వదేకికమ్*

*సుదృష్టా క్రియతాం ల౦కా జీవితం తే మయి స్థితమ్* 6.41.71


*రాజన్ మన్త్రిత పూర్వం నః కుశలైః సహ మన్త్రిభిః*   6 57 13

*వివాద శ్చా౭పి నో వృత్తః సమ౭వేక్ష్య పరస్పరమ్*

*ప్రదానేన తు సీతాయాః శ్రేయో వ్యవసితం మయా*    6 57 14

*అప్రదానే పున ర్యుద్ధం దృష్ట మేతత్ తథైవ నః*



*నిశమ్య వాక్యం తు విభీషణస్య*

*తత: ప్రహస్తో వచనం బభాషే*

*న నో భయం విద్మ న దైవతేభ్యో*

*న దానవేభ్యో ప్య౭థ తవా కుతశ్చిత్*

*న యక్ష గ౦ధర్వ మహోరగేభ్యో*

*భయం న సంఖ్యే పతగోత్తమేభ్య:*

*కథం ను రామా ద్భవితా భయం నో*

*నరేంద్ర పుత్రా త్సమరే కదాచిత్*  


*అథా౭౭శ్వాస్య మహాతేజా రావణో వాక్యమ౭బ్రవీత్* 6 59 64

*సాధు వానర వీర్యేణ శ్లాఘనీయోఽసి మే రిపుః*


*రావణే నైవ ముక్త స్తు మారుతి ర్వాక్య మ౭బ్రవీత్* 6 59 65

*ధి గ౭స్తు మమ వీర్యేణ య స్త్వం జీవసి రావణ*



*తామ్ ఆపతన్తీం భరతా౭నుజోఽస్త్రై:*

*జఘాన బాణై శ్చ హుతా౭గ్ని కల్పైః*

*తథా౭పి సా తస్య వివేశ శక్తి:*

*భుజా౭న్తరం దాశరథే ర్విశాలమ్* 6 59 109

 


*వాయు సూనోః సుహృత్త్వేన భక్త్యా పరమయా చ సః*

*శత్రూణామ్ అప్రకమ్ప్యోఽపి లఘుత్వ మ౭గమ త్కపేః* 6 59 120


*ఆశ్వస్త శ్చ విశల్య శ్చ లక్ష్మణ శ్శత్రు సూదన:*

*విష్ణోర్భాగ మ౭మీమా౦స్య మా౭౭త్మానం ప్రత్య౭నుస్మరన్*   6 59 122


హనుమ భుజములపై నెక్కి ధనుస్సు టంకారనాదము గావించెను. ఆ టంకారము వానరులలో ఉత్సాహమును, రాక్షసులు లో భీతిని గొల్పించెను.  శ్రీరాముడు రాక్షసరాజగు రావణునితో ఇట్లు పలికెను.

య దీన్ద్ర వైవస్వత భాస్కరాన్ వా

స్వయమ్భు వైశ్వానర శంకరాన్ వా

గమిష్యసి త్వం దశ వా దిశో వా

తథా౭పి మే నా౭ద్య గతో విమోక్ష్యసే     6 59131

తతో రామో మహా తేజా రావణేన కృత వ్రణమ్

దృష్ట్వా ప్లవగ శార్దూలం క్రోధస్య వశ మేయివాన్  6.59.136

యో వజ్ర పాతా౭శని సన్నిపాతాన్

న చుక్షుభే నా౭పి చచాల రాజా

స రామ బాణా౭భిహతో భృశా౭౭ర్తశ:

చచాల చాపం చ ముమోచ వీరః          6 59139



సీత కోరికపై హనుమ శ్రీరాముని రూపమును  వివరించుట

శ్రీరాముని ఆత్మ గుణ గుణములను వర్ణించిన తరవాత, హనుమ, శ్రీరాముని రూపమును ఈ విధముగా వర్ణించు చున్నాడు.

 

విపులా౭౦సో మహా బాహుః కమ్బు గ్రీవః శుభా౭౭ననః

గూఢ జత్రుః సుతామ్రా౭క్షో రామో దేవి జనై శ్శృతః  5.35.15

 

దున్దుభి స్వన నిర్ఘోషః స్నిగ్ధ వర్ణః ప్రతాపవాన్

సమ స్సమ విభక్తా౭౦గో వర్ణం శ్యామం సమాశ్రితః  5.35.16

 

త్రిస్థిర స్త్రిప్రలమ్బ శ్చ త్రిసమ స్త్రిషు చోన్నతః

త్రి తామ్ర స్త్రిషు చ స్నిగ్దో గంభీర స్త్రిషు నిత్యశః   5.35.17

 

త్రి వలీవాం స్త్ర్యవణత శ్చతు ర్వ్య౭౦గ స్త్రి శీర్షవాన్

చతుష్కల శ్చతు ర్లేఖ శ్చతు ష్కిష్కు శ్చతు స్సమః  5.35.18

 

చతుర్దశ సమ ద్వన్ద్వ శ్చతుర్ద౦ ష్ట్ర శ్చతుర్గతిః

మహౌ ష్ఠ హను నాస శ్చ ప౦చ స్నిగ్ధో౭ష్ట వంశవాన్  5.35.19

దశ పద్మో దశ బృహ త్త్రిభి ర్వ్యాప్తో ద్వి శుక్లవాన్

షడు న్నతో నవ తను స్త్రిభి ర్వ్యాప్నోతి రాఘవః   5.35.20



 

వానరో౭హం మహాభాగే దూతో రామ స్య ధీమతః

రామ నామా౭౦కితం చేదం పశ్య దేవ్య౭౦గుళీయకమ్  5.36.2

 

ప్రత్యయా౭ర్థం తవా౭౭నీతం తేన దత్తం మహాత్మనా

సమా౭౭శ్వసిహి భద్రం తే క్షీణ దుఃఖ ఫలా హ్య౭సి      5.36.3


.

కృతం త్వయా కర్మ మహత్ సుభీమం

హత ప్రవీర శ్చ కృత స్త్వయా౭హమ్

తస్మాత్ పరిశ్రాన్త ఇతి వ్యవస్య

న త్వం శరై ర్మృత్యు వశం నయామి   6.59.142

గచ్ఛా౭నుజానామి రణా౭ర్దిత స్త్వం

ప్రవిశ్య రాత్రించర రాజ లంకాం

ఆశ్వాస్య నిర్యాహి రథీ చ ధన్వీ

తదా బలం ద్రక్ష్యసి మే రథస్థ:  6.59.143


యః పశ్చాత్ పూర్వ కార్యాణి కుర్యా దైశ్వర్య మా౭౭స్థితః

పూర్వం చోత్తర కార్యాణి న స వేద నయా౭నయౌ 6.63.5

దేశ కాల విహీనాని కర్మాణి విపరీత వత్

క్రియ మాణాని దుష్యన్తి హవీం ష్య౭ప్రయతే ష్వివ 6.63.6

ధర్మమ్ అర్థం చ కామం చ సర్వాన్ వా రక్షసాం పతే

భజతే పురుషః కాలే త్రీణి ద్వన్ద్వాని వా పునః     6.63.9

త్రిషు చైతేషు య చ్ఛ్రేష్ఠం శ్రుత్వా త న్నా౭వబుధ్యతే

 రాజా వా రాజ మాత్రో వా వ్యర్థం తస్య బహు శ్రుతమ్ 6.63.10

అస్మిన్ కాలే తు య ద్యుక్తం త దిదానీం విధీయతామ్

గతం తు నా౭నుశోచంతి గతం తు గత మేవ హి 6.63.25

స సుహృద్యో విపన్నా౭ర్థం దీన మ౭భ్య౭వపద్యతే  6.63.27

స బన్ధు ర్యోఽపనీతేషు సాహాయ్యా యోపకల్పతే

గర్జన్తి న వృథా శూరా: నిర్జలా ఇవ తోయదాః

పశ్య సంపాద్యమానం తు గర్జితం యుధి కర్మణా  6.64.3

న మర్షయతి చా౭౭త్మానం సంభావయతి నా౭౭త్మనా

అదర్శయిత్వా శూరా స్తు కర్మ కుర్వన్తి దుష్కరమ్ 6.64.4


న్ సమీక్ష్యా౭౦గదో భగ్నాన్ వానరాన్ ఇద మ౭బ్రవీత్   6.66.18

అవతిష్ఠత యుధ్యామో నివర్తధ్వం ప్లవంగమాః

శయామహే౭థ నిహతాః పృథివ్యా మ౭ల్పజీవితాః

దుష్ప్రాపం బ్రహ్మలోకం వా ప్రాప్నుమో యుధి సూదితాః   6.66.25

సంప్రాప్నుయామః కీర్తిం వా నిహత్య శత్రుమ్ ఆహవే

జీవితం వీరలోకస్య భోక్ష్యామో వసు వానరాః       6.66.26



తం మన్యే రాఘవం వీరం నారాయణ మ౭నామయం  6.72.11

తద్భయా ద్ధి పురీ లంకా పిహిత ద్వార తోరణా

సప్త షష్టి ర్హతాః కోట్యో వానరాణాం తరస్వినామ్

అహ్నః ప౦చమ శేషేణ వల్లభేన స్వయమ్భువః  6.74.12

అ౦జనా సుప్రజా యేన మాతరిశ్వా చ నైరృతా

హనూమాన్ వానర శ్రేష్ఠః ప్రాణాన్ ధారయతే క్వచిత్ 6.74.18

 

శ్రుత్వా జామ్బవతో వాక్యమ్ ఉవా చేదం విభీషణః

  ఆర్య పుత్రా వ౭తిక్రమ్య కస్మాత్ పృచ్ఛసి మారుతిమ్  6.74.19

 

 నైవ రాజని సుగ్రీవే నా౭౦గదే నా౭పి రాఘవే

 ఆర్య సందర్శితః స్నేహ: యథా వాయు సుతే పరః 6.74.20


 విభీషణ వచః శ్రుత్వా జామ్బవాన్ వాక్యమ్ అబ్రవీత్

 శృణు నైరృత శార్దూల యస్మాత్ పృచ్ఛామి మారుతిమ్   6.74.21


యద్య౭స్తి పతి శుశ్రూషా యద్య౭స్తి చరితం తపః

యది చా స్త్యేక పత్నీ త్వం శీతో భవ హనూమతః    5.53.28

యది కించి ద౭నుక్రోశ స్తస్య మయ్య౭స్తి ధీమతః

యది వా భాగ్య శేషో మే శీతో భవ హనూమతః           5.53.29

యది మాం వృత్త సంపన్నాం త త్సమాగమ లాలసామ్

స విజానాతి ధర్మాత్మా శీతో భవ హనూమతః            5.53.30

యది మాం తారయే దా౭ర్యః సుగ్రీవః సత్య సంగరః

అస్మా ద్దుఃఖా౦బు సంరోధా చ్ఛీతో భవ హనూమతః 5.53.31

 

ధన్యా స్తే పురుష  శ్రేష్ఠా యే బుద్ధ్యా కోప ముత్థితమ్

నిరున్ధన్తి మహాత్మానో దీప్తమ్ అగ్నిమ్ ఇవా౭మ్భసా     5.55.4

 

 కృద్ధః పాపం న కుర్యా త్కః క్రుద్ధో హన్యా ద్గురూ న౭పి

కృద్ధః పరుషయా వాచా నర స్సాధూన్ అధిక్షిపేత్       5.55.5

 

వాచ్యా౭వాచ్యం ప్రకుపితో న విజానాతి కర్హిచిత్

నా౭కార్య మ౭స్తి కృద్ధ స్య నా౭వాచ్యం విద్యతే క్వచిత్ 5.55.6

 

య స్సముత్పతితం క్రోధం క్షమ యిైవ నిరస్యతి

యథో రోగ స్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే            5.55.7

 


దగ్ధేయం నగరీ ల౦కా సాట్ట ప్రాకార తోరణా

జానకీ న చ దగ్ధేతి విస్మయోఽద్భుత ఏవ నః  5.55.33

 

హనుమ మరల సీతను దర్శించి సముద్ర లంఘనము చేయుట

 

తత స్తు శింశుపామూలే జానకీం పర్య౭వస్థితామ్

అభివా ద్యా౭బ్రవీ ద్దిష్ట్యా పశ్యామి త్వా మిహాక్షతామ్      5.56.1


 

 తస్మిన్ జీవతి వీరే తు హత మ౭ప్య౭హతం బలమ్

 హనూమ త్యుజ్ఝిత ప్రాణే జీవన్తోఽపి వయం హతాః            6.74.22

 

 ధరతే మారుతి స్తాత మారుత ప్రతిమో యది

 వైశ్వానర సమో వీర్యే జీవితా౭౭శా తతో భవేత్                6.74.23


 

\

ఆధ్యాత్మిక ఆచార్యుడు ఆంజనేయుడు. శ్రీ హనుమన్మాలా మంత్రం

ఓంశ్రీమాత్రే నమః


మనోజవం మారుత తుల్యవేగం!జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !

వాతాత్మజం వానరయూధ ముఖ్యం! శ్రీరామదూతం శిరసా సమామి !!

– హ్రౌం క్ష్రౌం క్ష్ర్మ్యౌం గ్లౌం హ్సౌం (ఇతి పాఠభేదః)


ఓం (హ్రౌం క్ష్రౌం గ్లౌం హుం హ్సౌం) ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే ప్రకట పరాక్రమాక్రాంత సకలదిఙ్మండలాయ, నిజకీర్తి స్ఫూర్తిధావళ్య వితానాయమాన జగత్త్రితయాయ, అతులబలైశ్వర్య రుద్రావతారాయ, మైరావణ మదవారణ గర్వ నిర్వాపణోత్కంఠ కంఠీరవాయ, బ్రహ్మాస్త్రగర్వ సర్వంకషాయ, వజ్రశరీరాయ, లంకాలంకారహారిణే, తృణీకృతార్ణవలంఘనాయ, అక్షశిక్షణ విచక్షణాయ, దశగ్రీవ గర్వపర్వతోత్పాటనాయ, లక్ష్మణ ప్రాణదాయినే, సీతామనోల్లాసకరాయ, రామమానస చకోరామృతకరాయ, మణికుండలమండిత గండస్థలాయ, మందహాసోజ్జ్వల-న్ముఖారవిందాయ, మౌంజీ కౌపీన విరాజత్కటితటాయ, కనకయజ్ఞోపవీతాయ, దుర్వార వారకీలిత లంబశిఖాయ, తటిత్కోటి సముజ్జ్వల పీతాంబరాలంకృతాయ, తప్త జాంబూనదప్రభాభాసుర రమ్య దివ్యమంగళ విగ్రహాయ, మణిమయగ్రైవేయాంగద హారకింకిణీ కిరీటోదారమూర్తయే, రక్తపంకేరుహాక్షాయ, త్రిపంచనయన స్ఫురత్పంచవక్త్ర ఖట్వాంగ త్రిశూల ఖడ్గోగ్ర పాశాంకుశ క్ష్మాధర భూరుహ కౌమోదకీ కపాల హలభృద్దశభుజాటోపప్రతాప భూషణాయ, వానర నృసింహ తార్‍క్ష్య వరాహ హయగ్రీవానన ధరాయ, నిరంకుశ వాగ్వైభవప్రదాయ, తత్త్వజ్ఞానదాయినే, సర్వోత్కృష్ట ఫలప్రదాయ, సుకుమార బ్రహ్మచారిణే, భరత ప్రాణసంరక్షణాయ, గంభీరశబ్దశాలినే, సర్వపాపవినాశాయ, రామ సుగ్రీవ సంధాన చాతుర్య ప్రభావాయ, సుగ్రీవాహ్లాదకారిణే, వాలి వినాశకారణాయ, రుద్రతేజస్వినే వాయునందనాయ, అంజనాగర్భరత్నాకరామృతకరాయ, నిరంతర రామచంద్రపాదారవింద మకరంద మత్త మధురకరాయమాణ మానసాయ, నిజవాల వలయీకృత కపిసైన్య ప్రాకారాయ, సకల జగన్మోదకోత్కృష్టకార్య నిర్వాహకాయ, కేసరీనందనాయ, కపికుంజరాయ, భవిష్యద్బ్రహ్మణే, ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే తేజోరాశే ఏహ్యేహి దేవభయం అసురభయం గంధర్వభయం యక్షభయం బ్రహ్మరాక్షసభయం భూతభయం ప్రేతభయం పిశాచభయం విద్రావయ విద్రావయ, రాజభయం చోరభయం శత్రుభయం సర్పభయం వృశ్చికభయం మృగభయం పక్షిభయం క్రిమిభయం కీటకభయం ఖాదయ ఖాదయ, ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే జగదాశ్చర్యకర శౌర్యశాలినే ఏహ్యేహి శ్రవణజభూతానాం దృష్టిజభూతానాం శాకినీ ఢాకినీ కామినీ మోహినీనాం భేతాళ బ్రహ్మరాక్షస సకల కూశ్మాండానాం విషయదుష్టానాం విషమవిశేషజానాం భయం హర హర మథ మథ భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయ మారయ శోషయ శోషయ ప్రహారయ ప్రహారయ, ఠఠఠఠ ఖఖఖఖ ఖేఖే ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే శృంఖలాబంధ విమోచనాయ ఉమామహేశ్వర తేజో మహిమావతార సర్వవిషభేదన సర్వభయోత్పాటన సర్వజ్వరచ్ఛేదన సర్వభయభంజన, ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే కబలీకృతార్కమండల భూతమండల ప్రేతమండల పిశాచమండలా-న్నిర్ఘాటయ నిర్ఘాటాయ భూతజ్వర ప్రేతజ్వర పిశాచజ్వర మాహేశ్వరజ్వర భేతాళజ్వర బ్రహ్మరాక్షసజ్వర ఐకాహికజ్వర ద్వ్యాహికజ్వర త్ర్యాహికజ్వర చాతుర్ధికజ్వర పాంచరాత్రికజ్వర విషమజ్వర దోషజ్వర బ్రహ్మరాక్షసజ్వర భేతాళపాశ మహానాగకులవిషం నిర్విషం కురు కురు ఝట ఝట దహ దహ, ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే కాలరుద్ర రౌద్రావతార సర్వగ్రహానుచ్చాటయోచ్చాటయ ఆహ ఆహ ఏహి ఏహి దశదిశో బంధ బంధ సర్వతో రక్ష రక్ష సర్వశత్రూన్ కంపయ కంపయ మారయ మారయ దాహయ దాహయ కబళయ కబళయ సర్వజనానావేశయ ఆవేశయ మోహయ మోహయ ఆకర్షయ ఆకర్షయ, ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే జగద్గీతకీర్తయే ప్రత్యర్థిదర్ప దళనాయ పరమంత్రదర్ప దళనాయ పరమంత్రప్రాణనాశాయ ఆత్మమంత్ర పరిరక్షణాయ పరబలం ఖాదయ ఖాదయ క్షోభయ క్షోభయ హారయ హారయ త్వద్భక్త మనోరథాని పూరయ పూరయ సకలసంజీవినీనాయక వరం మే దాపయ దాపయ, ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే ఓం (హ్రౌం క్ష్రౌం గ్లౌం హుం హ్సౌం) శ్రీం భ్రీం ఘ్రీం ఓం న్రూం క్లీం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హుం ఫట్ ఖే ఖే హుం ఫట్ స్వాహా ||

– హ్రౌం క్ష్రౌం క్ష్ర్మ్యౌం గ్లౌం హ్సౌం (ఇతి పాఠభేదః)

*****

 *******


సుందరకాండ - సుందర తత్త్వం - తెలుగు వచస్సు ( 1వ సర్గము )

భూతాలు పర్వతమును బద్దలు చేయు చున్నాయని తలచెను,   తినుచున్న లేహ్యములు, భక్ష్యములు, మాంసములు విడిచెను  మునులు, యక్షులు,  విద్యాధరులు వారి స్త్రీలతో పైకే ఎగిరెను, హనుమంతుడు పాద స్పర్స అంత అమోఘం.
*21. మంచివారు మనగ్రామ్గలో ఉనె అంటా మంచి జరుగును అనిభావించాలి, మంచి వారు లేని ప్రాంతము ఎప్పుడూ భూమి ప్రకంపనలు వస్తాయి, తినే ఆహారము దొరకక భాదలు వహించాలసు వస్త్గుంది, వలసి పోయే పరిస్తితి వస్తుంది అది గమనిమ్చుటే  ఈ శ్లోకం నీతి      

మెడలో హారములతోను ,  పాదములకు అందెలతోను, భుజములకు దండ కడియములతో,చేతులకు కంకణములతోను
విద్యాదరస్త్రీలు ఆశ్చర్యపడుచు, భయముతో తమ ప్రియులతోను , విద్యాధరులు పర్వతముపై నిలిచి హనుమంతుని గూర్చి సంభాషించెను.
*22. ధనవంతులు సంపాదించిన ధనములో కొంత బంగారములోకి మారుస్తారు, వాటి రక్షణ కోసం బ్యాంకుల్లో దాచుతారు,  కొందరునిత్యము ధరిస్తూ ఉన్నారు, కాని అనుకోని పరిస్తితిలో దొంగిలించటం జరిగిందని, రక్షణ కాశము అవుతుందని అంటే బంగారము గూర్చి, ధనవంతుని గూర్చి పలువిధాలుగా సంభా షించుకుంటారనేది ఇందు నీతి.
     
శోభగల హనుమంతుడు భుజమును,  కంఠంను వంచెను, తేజస్సును,వీర్యమును,బలమును, పెంచి ఊపిరి బిగపట్టెను
నేత్రములు పెకిఎత్తి, పాదములతో గిరిని అదిమి  పైకి  ఎగెరెను, మహాబలశాలీ, వానర శ్రేష్టుడు చేతులను చేర్చి సముద్రముపై చేరెను, 
 

*23. ప్రతిఒక్కరు తేజస్సును,వీర్యమును,బలమును పెంచు కుంటూ ఉండాలి, అవసరము వచ్చినప్పుడు అధర్మాన్ని ఎదుర్కొనుటకు పతిఒక్కరు సంఘటితంగా ఏకమై ముందుకు సాకి చేతులు చేతులు కలిపి ఉద్యమించాలి.
 
మకరములకు నివాసమైన సముద్రమును దాట దలచెను, పర్వతమువంటి శరీరముగల హనుమంతుడు ఒక్కసారి కదలెను, రోమములు దులుపుకొని, మహా మేఘము వలె ఘర్జించెను, రామునికోరకు, వానరులకోరకు సముద్రముపై లంఘించెను.
*24. మనం బ్రతకల్సింది ఇతరులు కోసం అని గమనించాలి, సముద్రం లాంటిమన మనస్సును అదుపులో పెట్టుకొని ప్రవర్తించాలి,  అవసర మైనప్పుడు ధర్మం కొరకు తప్పని పరిస్తితిలో దుర్మార్గానిపై  ఘర్జన చేయాలనేదే, స్నేహితులను బంధు వులను ఆదుకోవాలనేదే  ఇందు నీతి.
    
గగనమునుండి   దేవలోకమునకుపోయిఅక్కడ సీతనువెదికెదను, కానరానిచో లంకకు పోయి రావణుని నగరముతోసహా తేగలగు తాను , ఆకాశము నుండి వానర వీరులందరికి మారుతి అమృత మాటలు పల్కెను, గమ్భీరముగా జెప్పుచూ నొక్కఊపులో సముద్రముపై కెగసెను, అణిమా సిద్దులుగల విద్యాధరులు హనుమంతునిచూసి ఆరాధించెను. 
 

*25. ఏవిషయమైన ఘమ్భీరముగ చెప్పాలి, చెప్పిన మాటను నిలబెట్టు కోవాలి, ఎవ్వరి మనస్సును నొప్పించక అందరి మనస్సు శాంత పరిచే మాటలు పలకాలి అనేడి ఇందు నీతి .

*****


సుందరకాండ - సుందర తత్త్వం - తెలుగు వచస్సు ( 1వ సర్గము )5/20
అతని తొడల వేగమునుండి వచ్చిన గాలికి చెట్లువ్రేళ్ళతో సహా పైకి ఎగేరెను, దూరమునకు పోవు భందువులను పంపినట్లుగా కొంతదూరము పోయెను, మరలి చెట్లు అన్ని సముద్రములో రెక్కలు తెగిన పర్వతముల వలే పడెను, మహ సముద్ర మంతా పగటి పూట నక్షత్రాలతో నిండిన ఆకాశంవలె ప్రకాశించెను.
(*26 పెళ్లి చేసి  వధువరులను  సాగనంపేటప్పుడు కొంత దూరము వచ్చి వెనుకకు వెళ్ళుట    అనేది హనుమంతుని వెంబడించిన చెట్లులాగా ఉంటుంది, పిల్లను పంపిన తర్వాత  అన్దరూ నీరసముగా అన్నిసర్డుకొని వేల్లుటే వజ్ర  హతమైన పర్వతాలు ఒక్కసారిగా  కూలినట్లు వారి మనసు భధకరముగా  మారుతున్నదనేదే  ఇందు నీతి)   

హనుమంతుని రెండు బాహువులు పాము పడగలువలే కనిపించెను, అతని రెండు నేత్రములు పర్వతముపై రెండు అగ్నిజ్వాల లవలే  ప్రకాశించెను,    అతని వాలము ఇంద్ర ద్వజము వలే ధగ ధగ మెరుయు చుండెను, అతని ముఖము సంద్యారాగముతో కూడిన సూర్యబింబమువలె నుండెను.
(*27. నిత్య అగ్ని హోత్రుని  దృష్టి చూడాలంటే అందరికీ కష్టమే, వారి చేతులు చూడగా పాము పడగల వలె కనిపించును, నేత్రములు అగ్నిగోళముల వలె కనిపించును. ముఖము బ్రహ్మ   వర్చస్సుతో వెలుగు చుండును  అటువంటి వారికి పాదాబివందనాలు చేసి ఆసీర్వాదము  పొందాలన్నది ఇందు నీతి, .కోపముగా  ఉన్నవారి  కళ్ళు  కుడా  అగ్నిలా  వెలుగుతూ  ఉండటాయి అటువంటి వారి   ముందు   జాగర్తగా   ఉండాలనేదే   ఇందు నీతి.
      
హనుమంతుని  ఎఱ్ఱనైన పిరుదులు బ్రద్దలైన ధాతుశిలలవలె నుండెను, అతని జంకల నుండి వచ్చేవాయువు మేఘము యురుము వలె నుండెను, ఉత్తరము నుండి దక్షణ దిక్కు వైపు పోవు ఉల్క వలే ప్రయాణించు చుండెను ,  రామభాణము ఎంత వేగముగా పోవునో అంతే వేగముగా పోఉ చుండెను
(*28 కొందరి శరీర అవయవాలు బహు చక్కగా ఉండునని, మరి కొందరివి వికృతముగా ఉండునని ఇందు మూలముగ తెలియు చున్నది, కొందరి మాట శబ్దానికి మించి ఉండునని, వేగము, మాట,   తోక చుక్క కన్నా మించి ఉండు నని ఇందు మూలముగా తెలుసుకోవచ్చు ననేదే నీతి    

హనుమంతుడు  త్రాడును తెంచుకొని పరుగెడుతున్న ఎనుగువలె నుండెను, అతని ముఖము చుట్టు తోక ఉండగా సూర్యునివలె ప్రకాశించు చుండెను,  అతని నీడ సముద్రము పై పడి ఒక పెద్ద నౌక వలె కనబడు చుండెను, వక్షస్తలము నుండి వెడలిన గాలిచే కెరటములు రెండంతలు ఎగసి పడు చుండెను
(*29) ఒక్కోక్కరు నడుస్తుంటే  భూమి, గాలి , కంపిస్తున్నది, కొందరి ముఖముచూస్తె వేలుగుతోనిండి పోతున్నది, కిరణాల తాకిడికి నీడ ఆవహిస్తున్నది, అందు చెఅ ప్రతిఒక్కరు త్రాడును తెంచుకొని పరుగెడుతున్న ఎనుగువలె నుందాలన్నదే ఇన్దునీతి      

ఉత్తరమునుండే వచ్చే వాయువు హనుమంతునికి ఎగురుటకు  తోడ్పడెను,  తాకాలని కేరటములు పైకి ఎగిరి పెద్ద గుంటగా ఏర్పడి పైకి ఎగురు చుండెను, భూమి యందు ఉన్నసముద్రమును మారుతి త్రాగుచున్నట్లుగా కన బడెను, హనుమంతుడు ఆకాశమున తలపైకి ఎత్తిన ఆకాశాన్ని  మ్రింగి నట్లుండెను
(*30) కొందరి చూపులు మింగెసి నట్లుగాను, మరికొందరి చూపులు తాగేసినట్లుగాను ఉన్న వారిదగ్గర జాగర్తగా ఉండాలనేదే ఇందు నీతి, మన ప్రయాణములో ఎన్నో ఆటంకాలు వచ్చిన ధైర్యముగా ముందుకు పోవాలన్నదే ఇందునీతి.

  **********
 
ఆధారము లేకుండ  రెక్కల పర్వతమువలె హనుమంతుడు ప్రకాశించు చుండెను, మేఘ పంక్తులలోకి పోవుచూ బయటకు వచ్చుచూ గరుత్మంతుడివలె ఉండెను,ఎరుపు,నలుపు,తెలుపు,పచ్చ, మేఘాలల్లో హనుమంతుడు ముచ్చటగా నుండెను
హనుమంతున్ని చూసిన ఋషీశ్వరులు, దేవతలు, గంధర్వులు పరాక్రమమును  ప్రశంసించెను
*(31) కొందరకి తన శక్తి అసలు తెలియదు, అనుకున్న పని అనుకున్న సమయముము కన్నా ముందే చేయగలుగుతారు, ఎందరు ఎదుర్పడినా ఎన్నిఅవాంతరాలు వచ్చిన తన కార్యమును తను చేసినవారికి,  అందరి దీవెనులు ఉంటాయని  ఈ శ్లోకభావం.

కొండంత ఎత్తుగా లేచుచున్న సముద్ర తరంగములను వక్షస్థలముతో 'డి' కొని ఎగేరెను,  హనుమంతుని తో వచ్చే గాలి, మేఘముల గాలి, సముద్రపు గాలి కలసి భీకరశబ్దముగా వినబడెను, సముద్రములో ఉన్న తరంగాలన్ని భూమి ఆకాశాన్ని తాకు చున్నట్లుగా ఉండెను, ఎగసిపడుతున్న సముద్ర తరంగాలను లెక్క పెట్టు చున్నాడా అన్నట్లు దాటు చుండెను .
*(32) ఎవరైనా సరే తప్పని సరి పరిస్తితిలో పనిచేయాలంటే  గుండె ధైర్యముతో, శబ్ధకాలుష్యాన్ని తట్టుకొని, ఈర్శ్య ద్వేషాలను తట్టుకొని, ఎగసి పడుతూ అడ్డు వచ్చిన వారిని  దాటుకుంటూ  ఎంత మంది అడ్డువచ్చారో లేక్క కట్టుకుంటూ ముందుకు  సాగాలన్నదే ఇందు నీతి.  .   

తిమింగళములు, మొసళ్ళు, వస్త్ర విహీనులయన మనుష్యుల్లా  ఉండెను, సర్పములు హనుమంతుని చూసి గరుత్మంతుడని భావించి భయ పడెను, హనుమంతుడు ఆకాశములో మేఘముల కన్న ముందుకు పోవు చుండెను. మేఘాలచే కప్పబడుచు బయటకువచ్చుచూ ఉండే చంద్రుడిలా ప్రకాశించు  చుండెను
*(33) కొందరు నీ పనికి అడ్డు పడుటకు, ఆక ర్షిమ్చుటకు, వస్త్ర విహీనులై , ఎంతో భయము నటించేవారు ఉంటారు జాగర్తగా మేలగాలనేదే ఇందు నీతి, చూపి చూపనట్లుగా మనసును లాగేవారు ఉంటారు జాగర్తగా మనం ప్రవరిమ్చాలనేదే ఇందు నీతి.  

హనుమంతుని నీడ సముద్రము మీద పది యోజనాలతో విస్తీర్ణముగను, ముప్పది యోజనాల పొడవుతో ఉండెను,  దేవా దాన గంద ర్వులు పుష్ప వృష్టిని కురిపించెను, హనుమంతుని చూసి దేవగణాలన్ని పరమా నందమును పొందెను  
*(34) కొందరు కార్య సాధకులుగా ముందుకు సాగేటప్పుడు వారి నీడను వారే చుడలేరు, ఎంత విస్తీర్ణము ఉందో చెప్పలేరు అనేదే తెలుసు కోవలసిన విషయం మరియు పనిలో ఉన్నప్పుడు పనివిషయము తప్ప అన్య విష యము ఆలోచించ కూడ దనేది ఇందు లోనీతి  

******     
 
*మన సమస్యలకి సుందరకాండ పరిష్కారాలు.!
సుందరకాండ అద్భుతమైన పారాయణం,
ఎన్నో సమస్యలకు సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది పరిష్కారం పొందారు..
ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం
కాండం మొత్తం పారాయణ చేయలేరు,
అయితే అందులో ఏ సమస్యకు ఏది పరిహారామో వివరంగా ఉంది.
పారాయణ నియమాలతో ఉంటుంది.
ఇక్కడ ఇచ్చిన వివరాలు ఒకసారి పరిశీలించండి.
1. ఆపదలు తొలగటానికి , సంపదలు కలగటానికి..
శ్లోకం.ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ ||
21 దినములు ,
108 సార్లు ,
శక్తి కొలది తమలపాకులు,
అరటిపళ్ళు నివేదన చేయాలి.
2. విద్యాప్రాప్తికి.
ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేయవలెను .
3 రోజులు ద్రాక్ష , అరటిపళ్ళు నివేదన
3. భూతబాధ నివారణకు.
3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు
30 దినములు పారాయణ చేయవలెను .
1 కొబ్బరికాయ , అరటిపళ్ళు నివేదన.
4. సర్వ కార్య సిద్దికి.
64 వ సర్గ నిష్ఠతో 11 సార్లు
40 దినములు పారాయణ చేయవలెను .
శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.
5. శత్రు నాశనముకు.
51 వ సర్గ అతినిష్ఠతో 2 సార్లు
21 దినములు పారాయణ చేయవలెను.
శక్తి కొలది ద్రాక్ష , బెల్లము నివేదన చేయవలెను.
6. వాహనప్రాప్తికి.
8 మరియి 9 వ సర్గలు ఏకాగ్రతతో 3 సార్లు
27 దినములు పారాయణ చేయవలెను.
శక్తి కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.
7. మనశాంతికి.
11 వ సర్గ నిష్ఠతో 3 సార్లు
21 దినములు పారాయణ చేయవలెను.
అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.
8. స్వగృహం కోరువారికి.
7వ సర్గ ఏకాగ్రతతో 1 సారి
40 దినములు పారాయణ చేయవలెను.
అరటిపళ్ళు చక్కెరతో నివేదన చేయవలెను.
9. యోగక్షేమాలకు.
13 వ సర్గ నిష్ఠతో 3 సార్లు
27 దినములు పారాయణ చేయవలెను.
శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను.
10. ఉద్యోగప్రాప్తికి.
63 వ సర్గ నిష్ఠతో 5 సార్లు
21 దినములు పారాయణ చేయవలెను .
శక్తి కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.
11. రోగ నివారణకు.
34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతిదినము ,
21 దినములు పఠించవలెను.
శక్తి కొలది బెల్లపు ముక్క అరటిపళ్ళు నివేదన చేయవలెను.
12. దుఃఖనివృత్తికి.
67 వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా 3 సార్లు
21 దినములు పారాయణ చేయవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు,ఖర్జూరము నివేదన చేయవలెను.
13. దుస్వప్న నాశనానికి.
27వ సర్గ ఏకాగ్రతతో 1 సారి ప్రతిదినము పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.
14. దూరముగా ఉన్న ఆప్తులు క్షేమమునకు.
33 నుండి 40 వ సర్గ వరకు 1 సారి ,
21 దినములు నిష్ఠతో పఠించవలెను .
శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.
15. ధనప్రాప్తికి.
15వ సర్గ ఏకాగ్రతతో 1 సారి
40 దినములు పఠించవలెను.
అరటిపళ్ళు, పటిక బెల్లం , మరియు
రామాయణం లో అయోధ్యకాండలో యాత్రాదానము
32 వ సర్గ 1 సారి ,
40 దినములు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్షనివేదన చేయవలెను . ( అగస్త్య , పరాశర , ఉమా సంహిత ప్రకారం చెప్పబడినది ).
16. దైవాపచారా ప్రాయశ్చిత్తం.
38 వ సర్గ ఏకాగ్రతతో 3 సార్లు
27 దినములు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు వీలైతే పనస నివేదన చేయవలెను.
17. బ్రహ్మజ్ఞానము కలుగుటకు.
19 వ సర్గ అతినిష్ఠతో రోజుకు ఒకసారి
1 సంవత్సరము పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.
18. ఏలిననాటి శనీ దోష పరిహారమునకు.
సకల రోగ నివృత్తికి - సర్వ పాప నివృత్తికి
మొత్తం సుందరకాండ నిష్ఠతో 9 దినాలలో 1సారి
68 రోజులు చదువవలెను.
నివేదన రోజూ కొబ్బరికాయ సత్ఫాలితమునిచ్చును.
19. కన్యా వివాహమునకు.
9 దినములలో ఒకసారి పూర్తిగా
68 దినాలలో పఠించవలెను.
సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు
ప్రతిరోజు పఠించవలెను.
అప్పాలు , పాలు , పంచదార నివేదన చేయవలెను.
20. విదేశీ యానమునకు.
1 వ సర్గ ఏకాగ్రతతో రోజుకు 5 సార్లు
30 దినములు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.
21. ధననష్ట నివృత్తికి.
55వ సర్గ నిష్ఠతో 3 సార్లు
30 దినములు పఠించవలెను .
శక్తి కొలది అరటిపళ్ళు,పనస నివేదన చేయవలెను.
22. వ్యాజ్యములో విజయమునకు.
42 సర్గ అతి ఏకాగ్రతతో 3 సార్లు ,
21 దినములు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్ష , దానిమ్మ నివేదన చేయవలెను.
23. వ్యాపారాభివృద్ధికి.
15వ సర్గ నిష్ఠతో నియమంతో 5 సార్లు
21 దినములు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.
24. పుత్ర సంతానానికి.
ప్రతిదినం 7 వ సర్గ నిష్ఠతో
68 రోజులు పారాయణ చేయవలెను .
శక్తి కొలది అరటిపళ్ళు , కొబ్బరికాయ ,నివేదన చేయవలెను.
శక్తి కొలది తమలపాకులతో అర్చన చేయవలెను . సుందరకాండ 16 రోజులు పారాయణ చేయవచ్చును.
25. ఋణ విముక్తికి.
28 వ సర్గ చాలా నిష్ఠగా రోజుకి 1 సారి
41 రోజులు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.
🌼🌿శ్రీరామ జయరామ జయ జయరామ..🌼


ఓం శ్రీ రామ్ ... శ్రీ మాత్రే నమ: 
  • *శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-1*002 

*హనుమ స్వరూపము*
*వేదవేద్యే పరే పుంసి జాతే దశరాత్మజే*
*వేద: ప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా*

వేదములచే తెలియబడు పరమపురుషుడు దశరధునికి కుమారుడైనట్లుగా,వేదము,వాల్మీకి వలన , రామాయణ రూపముతో ఉండినది..

శ్రీమన్నారాయణుడు ఈ భూమిపై మరల నసించిపోవు చున్న ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీరాముడు గా అవతరించాడని  మన భారతీయుల ప్రగాఢ విశ్వాసము. శ్రీరాముని మీద మనకు లభించినన్ని పరిశోధనా గ్రంథాలు వేటి యందు లభించవు. శ్రీరాముడు మానవునిగా జన్మించి తన శిష్య ప్రజ్ఞచే సకల శాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి, అకుంఠిత దీక్షతో ఆయా యోగ రహస్యాలను అభ్యాసం చేసి, తన సత్య సంధతతో భగవంతునిగా రూపాంతరము చెందినవాడు. తనను గూర్చి *"ఆత్మానాం మానుషం మన్యే"* (నేను మానవ మాత్రుడను) అని పేర్కొన్న శ్రీరాముడు *"సత్యేన లోకాన్ జయతి"*  అను ప్రమాణము ననుసరించి సత్యనిష్టాగరిష్ఠుడు అయినందున శ్రీరాముడు అన్ని లోకములను జయించ గలిగిన వాడై భగవంతునిగా ఈ లోకుల దృష్టిలో ఉండిపోయాడు. దుర్లభమైన మానవ జీవితమును వ్యర్థము చేసుకొనకుండా బాహ్యమున ధర్మాచరణమును, అంతరమున జ్ఞానము కలిగి ఉండవలెనని మనకు శ్రీరాముని ద్వారా తెలియు చున్నది.
రామలక్ష్మణులు సీతను అన్వేషించుతూ పంపా తీరమునకు వచ్చినప్పుడు, సుగ్రీవుని భయము పోగొట్టుటకై హనుమ సుగ్రీవునితో ఇది ఋశ్యమూకం గాన ఇక్కడికి వాలి, వాలి సంబంధీకులు రాలేరు అని చెపుతాడు. ఆ విధంగా రామాయణంలో హనుమ పాత్ర పరిచయము అయింది. రామసౌందర్యమును చూడగానే హనుమ ఆకర్షితుడయ్యెను. హనుమను చూచి, అతని సంభాషణ విని నంతనే రాముడు అతనిలోని గుణగణములను తెలుసుకొనెను. రాముడు లక్ష్మణుతో హనుమను గురించి చెపుతూ ..

వాక్యకుశలః,(వాక్యకుశలుడు),  ఋగ్వేదమునందు బాగుగా శిక్షణ పొందినాడు, యజుర్వేదమును ధారణ చేసినాడు,  సామవేదమును చక్కగా ఎరిగిన వాడు, వ్యాకరణమును అనేక మార్లు వినినాడు, మాట్లాడినప్పుడు సందిగ్ధము లేకుండా, తొందరగా గాని, మెల్లగా గాని గాకుండా ముఖము నందు ఎట్టి వికార భావములు లేకుండా, మధుర స్వరముతో, సంస్కారముగా, మంగళకరమైన మధుర స్వరముతో మాట్లాడినాడు అనెను. ఇట్టివాడు దూతగా ఉన్నచో కార్యము తప్పక సిద్ధించునని దూతగా హనుమ యొక్క విశిష్టతను  చెప్పినాడు.  హనుమ యొక్క ఉత్పత్తి ప్రకారమును పరిశీలించిన శబ్దమునకు హనుమతో గల సామ్యము గోచరించును. మనలోని ఒక భావమును ఆవిష్కరించ వలెనన్న కోరిక గలిగినచో శరీరములోని వాయువులలో కదలిక గల్గును. ఆ వాయువుచే అభిహతమై మూలాధార స్థానము నుండి శబ్దము బయలుదేరి నాభిని, హృదయమును, కంఠమును దాటి తిన్నగా శిరస్థానమును చేరును. అచట నుండి పైకి పోవ వీలు లేక కంఠము నుండి ముఖము గుండా వెలికి వచ్చును. అట్లు వచ్చునప్పుడు నోటిలోని ఆయా స్థానములలో వాయువు యొక్క తాకిడిచే శబ్దముగా వెలికి వచ్చును. ఇందు హనుమకు, శబ్ధమునకు సాపత్యమును చూద్దాము.

1 హనుమ వాయువు వలన జన్మించాడు. శబ్దము కూడా వాయువు వలననే జనియించింది.
2 పుట్టగానే హనుమ సూర్య మండలము వైపు (సమాధి అవస్థ) కు పోయెను. శబ్దము కూడా ముందుగా శిరస్సు వైపు సాగును. అటు పోవ వీలుగాక నోటి నుండి వెలుపలికి వచ్చును. నోటిలోని ఆయా వర్ణముల అభివ్యక్త స్థానములే అంజన, కనుక అంజనాసుతుడు అయ్యెను.
3 సూర్యుని నుండి క్రిందకు పడిపోటచే దౌడలు సొట్ట  బోయి   హనుమ గా పేరు వచ్చినది. శబ్దము గూడ శిరఃస్థానము నుండి నోటిలోని దౌడల కదలికచే వర్ణ రూపమున వెలుపలికి వచ్చును గాన శబ్దము గూడ "హనుమ" అగును.
4 శబ్ద సామర్థ్యము వలన అవసరమైన కార్యములు నెరవేర్చుటలో మంత్రి వలే పని చేయును. స్వాధ్యాయన ప్రవచన శీలి యగు సుగ్రీవునకు హనుమ సచివుడు.
ఇట్టి హనుమయే రాముని సీతమ్మతో  కలుపును.
*శ్రీరామ జయరామ జయజయ రామ*
సీతారామ మనోభిరామ కళ్యాణ రామ 
సమస్త జనరక్షక పాలన రామ .. ఓం శ్రీరాం 
/మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
--(())--

హనుమంతుడు - 🐍కుండలినీ యోగ సాధకుడు🧘‍♂️ తత్త్వం

హనుమంతుడు - 🐍కుండలినీ యోగ సాధకుడు🧘‍♂️ 

        యోగి, కుండలినీశక్తిని మూలాధారము నుండి పైకి ప్రయాణింపజేసి, స్వాధిష్ఠాన - మణిపూర - అనాహత - విశుద్ధ -ఆజ్ఞా చక్రములను అతిక్రమించి, చివరికి సహస్రారపద్మాతర్గత బిందు స్వరూపమైన పరబ్రహ్మ సాక్షాత్కారమున పొందుతాడు.అదే యోగ సిద్ధి. 

        హనుమంతుడు జితేంద్రియుడు. అంటే ఇంద్రియ చాపలం లేనివాడు.

బుద్ధిమతాంవరిష్ఠుడు.... అనగా ఇతర విక్షేపములు లేని బుద్ధి, లక్ష్యశుద్ధి కలవాడు.

1. మూలాధారం:-

        హనుమంతుడు మహేంద్రపర్వతం నుండి ఆకాశంలోకి ప్రయాణించడం అంటే మూలాధారంనుంచీ కుండలినీ శక్తిని ఊర్ధ్వముఖంగా ప్రయాణింపజేయడం.

2. స్వాధిష్ఠాన చక్రం:-

        మైనాకుడు సహాయం చేయవచ్చినా అదికూడా గమనానికి అవాంతరమే కదా! ప్రలోభాలకీ సుఖాలకీ ఆశించక, ఆటంకాన్ని దాటటం స్వాధిష్ఠానాన్ని అతిక్రమించడం.

3. మణిపూర చక్రం:-

       తనని సురస మ్రింగెదనని, తన నోట ప్రవేశింపమని అడ్డగించింది. ఆ సురస నోట ప్రవేశించి, బయటపడి తప్పించుకొనడం మణిపూర చక్రాన్ని అతిక్రమించడం.

4. అనాహత చక్రం:-

       సింహిక ఛాయాగ్రహణం చేయగా, దానిని సంహరించటం అనాహతాన్ని దాటి పైకి సాగటము.

5. విశుద్ధి చక్రం:-

       లంకా ప్రవేశానికి లంకానగర అధిష్థాన దేవత అడ్డువచ్చింది.

      ఆమెను గెలవటం విశుద్ధి చక్రాన్ని అతి క్రమించడం.

6. ఆజ్ఞా చక్రం:-

          మండోదరిని చూచి సీతయే అని పరమానందం పొందాడు.

        కానీ లక్షణాలనిబట్టీ, వివేచనచేనూ ఆమె సీత కాదనుకొన్నాడు.

        ఆజ్ఞా చక్రాన్ని చేరిన కుండలిని, అదే గమ్యమనుకొని ఆనందపడి, మరల విచక్షణా జ్ఞానంచే,  గమ్యానికి ఇంకా ప్రయత్నం చేయవలసి ఉందని గ్రహించడం ఆజ్ఞా చక్రాన్ని దాటటం. 

7. సహస్రార చక్రం:-

         అశోకవనంలో సీతాదేవిని చూచి, ఆనందించడం సహస్రార చక్ర ప్రవేశం.

         ఆరు చక్రాలనీ జయించుకొని వచ్చిన సిద్ధపురుషునికి సహస్రార చక్రాంతర్గత బిందురూపిణి అయిన శ్రీ భువనేశ్వరీ దర్శనమైనదని అర్థం.

        చివరకు సీతారాములను తిరిగి కలిపి అయోధ్య చేర్చిన ఆంజనేయ సమారాధనలో సర్వేశ్వరి సాయుజ్యం గోచరిస్తుంది.

          ఈ విధంగా మారుతి యోగసిద్ధుడు.

****

తాత్త్వికదృష్టితో రామాయణమును దర్శిస్తే అందులో పరమార్ధతత్త్వం అవగతమౌతుంది. ఆంజనేయుని బుద్ధి, యోగత్వం, శౌర్య, సాహస పరాక్రమలతో కూడిన సుందరకాండమును పరిశీలిస్తే అత్యద్భుత ఆధ్యాత్మిక రహస్యార్ధములు అనేకం గోచరిస్తాయి.

 ఆంజనేయుడు నిర్వర్తించిన ప్రతికార్యమూ ఆధ్యాత్మిక సాధకునికి చక్కటి సందేశమే.

శ్రీ ఆంజనేయుడు శ్రీ విద్యోపాసకుడు:- 

మానవశరీరం పంచభూతాత్మకం. ఈ పంచభూతములను సమన్వయ పరచడమే యోగసాధన పరమార్ధం. ఈ పంచభూతములను సమన్వయపరిచే కుండలినీ యోగీశ్వరుడు శ్రీ ఆంజనేయుడు. 'వాయు'పుత్రుడైన ఆంజనేయుడు 'భూమి'సుత అయిన సీతమ్మ అన్వేషణ కొరకు 'ఆకాశ' మార్గంబున బయలుదేరి,'జల'ధిని దాటి, సీతమ్మ దర్శన మనంతరం లంకను 'అగ్ని'కి ఆహుతి చేసిన మహామహిమో పేతుడు శ్రీ విద్యోపాసకుడు "శ్రీఆంజనేయుడు".

పంచముఖాంజనేయ స్వరూపం - పంచభూతముల సమన్వయతకు సూచనం.

వానరరూపం - వాయుతత్త్వం.

 గరుడరూపం - ఆకాశతత్త్వం.

నరసింహరూపం - అగ్నితత్త్వం.

 వరాహరూపం - భూమితత్త్వం.

హయగ్రీవరూపం - జలతత్త్వం.

ఆంజనేయుడు ఆధ్యాత్మిక సాధకులకు ఆచార్యుడు.

ఆంజనేయుడు శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటి, లంకలో ప్రవేశించి, సీతాన్వేషణం చేసి కృతకృత్యుడు అయిన ఘటనల్నీ పరిశీలిస్తే సాధకునికి కావలసినది ఏమిటో తెలుస్తుంది.

యస్య త్వేతాని చత్వారి వానరేన్ద్ర చథా తవ /

ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి //

సాధకునికి నాలుగు లక్షణాలుండాలి. అవి ధృతి (దృఢ నిశ్చయం), దృష్టి (ఏకాగ్ర దృష్టి), మతి (బుద్ధి), దాక్ష్యం (దక్షత / సామార్ధ్యం). 

నూరు యోజనాల పొడవైన సముద్రాన్ని అవలీలగా దాటడం 'దృఢ నిశ్చయం'.

తనపర్వతంపై విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరిన మైనాకుని విన్నపాన్ని సున్నితంగా తిరష్కరించి, గౌరవంగా చేతితో స్పృశించి, కాలవిలంభన చేయక, రామకార్యమనే లక్ష్యసాధనపట్లే ఏకాగ్రతను చూపడం 'దృష్టి'. అంగుష్ఠ పరిమాణమును దాల్చి,సురస అనే నాగమాత నోటిలోనికి ప్రవేశించి, వెన్వెంటనే బయల్పడి, ఆమె ఆశీర్వాదం పొంది, ముందుకు పయనించడం 'బుద్ధి'కుశలత. సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని తన శక్తియుక్తులతో సంహరించి, లంకా నగరాధిదేవత లంకిణిని ముష్టిఘాతంచే నిలువరించగలగడం 'సామర్ధ్యం'.

సాధకునికి తన లక్ష్యాన్ని సాధించాలన్న దృఢమైన నిశ్చయం అత్యవసరం. అలానే తన సాధననుండి ఏమాత్రమూ తొలగక ఏకాగ్రదృష్టిని కలిగియుండాలి.

ఈ ఉత్కృష్ట సాధనలో సాధకునికి సాదనారంభంలో ఎన్నో అనుకూల ప్రతికూల బంధకాలు కలగవచ్చు. అనేక సిద్ధులు సిద్ధించ వచ్చు. అలానే సాధకుని సామర్ధ్యమును, మానసికస్థైర్యంను, పట్టుదలను పరీక్షించడానికి పెద్దలు పెట్టె పరీక్షలు పలురకాలుగా ఉంటాయి.

వీటిని యుక్తితో బుద్ధిబలంతో జయించగలిగే ప్రజ్ఞను కలిగియుండాలి. ప్రతిబంధకాలైన అవరోధాలను పూర్తిగా అధిగమించ గలిగే దక్షతను కలిగి యుండాలి. ఈ నాలుగు లక్షణాలు కలిగియున్న సాధకుడే కార్యసాధనా సమర్ధుడు.

అఖిల లోకోపకారి ఆంజనేయుడు

యోగత్వం వలన తనకి ప్రాప్తించే అష్టసిద్దులను తన ప్రయోజనంనకు కాకుండా రామకార్యమునకై, లోకహితంనకై ఉపయోగించిన అఖిలలోకోపకారి ఆంజనేయుడు.

{అష్టసిద్ధులు - వివరణ }:-

అష్టసిద్ధులు సిద్ధించుటకు ముఖ్యంగా కావలసింది 'భూతజయము'. పృధివ్యప్తేజోవాయ్వాకాశము (పృథివ్యప్‌తేజో వాయురాకాశాలనే పంచభూతలంటారు)లను స్థూల భూతముల యందును, తత్స్వరూపములైన కఠినత్వాదులయందును, తన్మాత్రలయిన గంధాది సూక్ష్మ తత్వములయందును, వాని స్థితుల యందును, ఇంద్రియముల యందును, వానికర్మల యందును, అంతఃకరణముల యందును, తత్ప్రకాశ రూపములైన వృత్తుల యందును క్రమముగా సంయమనం చేసినచో భూతజయం కలుగును.

అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,

ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః

అణువులా సూక్ష్మరూపాన్ని పొందడం "అణిమా"సిద్ధి. 

అనేక కోట్ల బ్రహ్మాండాల కంటే అధికుడవడం "మహిమా"సిద్ధి. 

పరమాణువుల కంటే తేలిక కావడం "లఘిమా" సిద్ధి, 

విశేష బరువుగా మారగలగడం "గరిమ"సిద్ధి. 

ఇష్టపదార్థాలను పొందగలగడం "ప్రాప్తి"సిద్ధి. 

లౌకిక పారలౌకిక పదార్థాలలో దేనిని కావాలంటే దానిని పొందడం "ప్రాకామ్య"సిద్ధి.

భూతము లన్నింటిని (పంచభూతములను) వశం చేసుకొనుట "వశిత్వం".

అరిషడ్వర్గమును జయించి, తాపత్రయం లేనివాడై, జితేంద్రియుడై, అపరోక్ష సాక్షాత్కార స్వానుభవము కలిగియుండుట, సర్వమును గ్రహించి ఈశ్వరుని వలె సృష్టిస్థితి లయములకు కారణభూతుడగుట "ఈశత్వం."}


లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లఞ్కా పురీ మయా /

ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్ //


తాను తలపెట్టిన కార్యం ఎంతో గొప్పదగుటచే, ఆ కార్యసాధనకు రాత్రి సమయమే యోగ్యమైనదని తలుస్తాడు. అందుకే హనుమ లంకలో రాత్రిసమయంలో ప్రవేశించాడు. అయితే ఇక్కడ రాత్రి అంటే ఏమిటీ? ఇందులో అంతరార్ధం ఏమిటీ?

ఆధ్యాత్మిక కోణంలో - ఇంద్రియప్రవృత్తులతో పాటు సర్వవిధ మనఃప్రవృత్తులు, బహిప్రవృతాలు కాకుండా అంతస్స్రోతములై ఉండే తురీయదశయే రాత్రి.

గీతలో కృష్ణపరమాత్మ చెప్పినట్లు -

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ /

యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే: //

భూతజాలములన్నింటికిని ఏది రాత్రియో, అది యోగికి పగలు. సమస్త భూతములకు ఏది పగలో అది విజ్ఞుడగు ద్రష్టకు రాత్రి. అనగా అజ్ఞానంధాకారములో నుండు జీవులకు ఆత్మానుభూతి లేనందున ఆత్మవిషయమందు వారు నిద్రించు చుందురు. సమస్త ప్రాణులకు అనగా అజ్ఞానులకు ఏది (ఆత్మజ్ఞానం) రాత్రి అగుచున్నదో (అంతరదృష్టికి గోచరించక యుండునో), అట్టి ఆత్మజ్ఞానం నందు యోగి జాగురుకుడై యుండును (ఆత్మావలోకనం జేయుచుండును).

 దేనియందు ప్రాణులు (అజ్ఞానులు) జాగురూకము లగుచున్నవో (విషయాసక్తితో ప్రవర్తించుచున్నవో), అది ఆత్మావలోకనం చేయు యోగికి రాత్రిగా యుండును. అంటే ఆత్మనిష్టుడు ఆత్మవిషయమై జాగ్రత్తలో నుండి ప్రపంచవిషయమై నిద్రావస్థలో నుండును.

రామ - హనుమల బంధం ఏమిటంటే - ప్రభు - సేవకుడు;భగవానుడు - భక్తుడు; గురువు - శిష్యుడు

అటుపై వీరి బంధం "ఏకత్వం".

ఓసారి రామునితో హనుమ ఇలా అంటాడు -

దేహదృష్ట్యా తు దాస్యోహం జీవదృష్ట్యా త్వదంశకః /

ఆత్మదృష్ట్యా త్వమేవాహమితి మే నిశ్చితా మతి: //

ఈ శ్లోకం పరిశీలిస్తే సాధకునికి అన్నీ అవగతమౌతాయి. బలం ధైర్యం నేర్పు ఓర్పు బుద్ధి శక్తి సామర్ధ్యం తదితర సుగుణాలతో అనేక ధర్మకార్యాలు చేసిన 'కర్మయోగి' ఆంజనేయుడు.

 రామభక్తిరసంలో మునకలు వేసి దాసోహం అంటూ తనని తాను పరిపూర్ణంగా శ్రీరామచంద్రునికి అర్పించుకొని సోహం స్థితికి (అద్వైతస్థితికి) చేరుకున్న 'భక్తియోగి' ఆంజనేయుడు. సీతమ్మతల్లి (పరదేవత), రాముని(పరమాత్మ)లచే ఉపదేశములు పొంది, మనల్ని తరింపజేస్తున్న 'జ్ఞానయోగి' ఆంజనేయుడు. భక్తితో మనస్సును పూజాప్రసూనంగా సమర్పించి, జ్ఞానంచే జీవేశ్వరుల ఏకత్వాన్ని గ్రహించి, నిష్కామ కర్మాచరణలతో "భవిష్యద్బ్రహ్మ" అయినాడు ఆంజనేయుడు.

****