\
ఆధ్యాత్మిక ఆచార్యుడు ఆంజనేయుడు. శ్రీ హనుమన్మాలా మంత్రం
ఓంశ్రీమాత్రే నమః
మనోజవం మారుత తుల్యవేగం!జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !
వాతాత్మజం వానరయూధ ముఖ్యం! శ్రీరామదూతం శిరసా సమామి !!
– హ్రౌం క్ష్రౌం క్ష్ర్మ్యౌం గ్లౌం హ్సౌం (ఇతి పాఠభేదః)
ఓం (హ్రౌం క్ష్రౌం గ్లౌం హుం హ్సౌం) ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే ప్రకట పరాక్రమాక్రాంత సకలదిఙ్మండలాయ, నిజకీర్తి స్ఫూర్తిధావళ్య వితానాయమాన జగత్త్రితయాయ, అతులబలైశ్వర్య రుద్రావతారాయ, మైరావణ మదవారణ గర్వ నిర్వాపణోత్కంఠ కంఠీరవాయ, బ్రహ్మాస్త్రగర్వ సర్వంకషాయ, వజ్రశరీరాయ, లంకాలంకారహారిణే, తృణీకృతార్ణవలంఘనాయ, అక్షశిక్షణ విచక్షణాయ, దశగ్రీవ గర్వపర్వతోత్పాటనాయ, లక్ష్మణ ప్రాణదాయినే, సీతామనోల్లాసకరాయ, రామమానస చకోరామృతకరాయ, మణికుండలమండిత గండస్థలాయ, మందహాసోజ్జ్వల-న్ముఖారవిందాయ, మౌంజీ కౌపీన విరాజత్కటితటాయ, కనకయజ్ఞోపవీతాయ, దుర్వార వారకీలిత లంబశిఖాయ, తటిత్కోటి సముజ్జ్వల పీతాంబరాలంకృతాయ, తప్త జాంబూనదప్రభాభాసుర రమ్య దివ్యమంగళ విగ్రహాయ, మణిమయగ్రైవేయాంగద హారకింకిణీ కిరీటోదారమూర్తయే, రక్తపంకేరుహాక్షాయ, త్రిపంచనయన స్ఫురత్పంచవక్త్ర ఖట్వాంగ త్రిశూల ఖడ్గోగ్ర పాశాంకుశ క్ష్మాధర భూరుహ కౌమోదకీ కపాల హలభృద్దశభుజాటోపప్రతాప భూషణాయ, వానర నృసింహ తార్‍క్ష్య వరాహ హయగ్రీవానన ధరాయ, నిరంకుశ వాగ్వైభవప్రదాయ, తత్త్వజ్ఞానదాయినే, సర్వోత్కృష్ట ఫలప్రదాయ, సుకుమార బ్రహ్మచారిణే, భరత ప్రాణసంరక్షణాయ, గంభీరశబ్దశాలినే, సర్వపాపవినాశాయ, రామ సుగ్రీవ సంధాన చాతుర్య ప్రభావాయ, సుగ్రీవాహ్లాదకారిణే, వాలి వినాశకారణాయ, రుద్రతేజస్వినే వాయునందనాయ, అంజనాగర్భరత్నాకరామృతకరాయ, నిరంతర రామచంద్రపాదారవింద మకరంద మత్త మధురకరాయమాణ మానసాయ, నిజవాల వలయీకృత కపిసైన్య ప్రాకారాయ, సకల జగన్మోదకోత్కృష్టకార్య నిర్వాహకాయ, కేసరీనందనాయ, కపికుంజరాయ, భవిష్యద్బ్రహ్మణే, ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే తేజోరాశే ఏహ్యేహి దేవభయం అసురభయం గంధర్వభయం యక్షభయం బ్రహ్మరాక్షసభయం భూతభయం ప్రేతభయం పిశాచభయం విద్రావయ విద్రావయ, రాజభయం చోరభయం శత్రుభయం సర్పభయం వృశ్చికభయం మృగభయం పక్షిభయం క్రిమిభయం కీటకభయం ఖాదయ ఖాదయ, ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే జగదాశ్చర్యకర శౌర్యశాలినే ఏహ్యేహి శ్రవణజభూతానాం దృష్టిజభూతానాం శాకినీ ఢాకినీ కామినీ మోహినీనాం భేతాళ బ్రహ్మరాక్షస సకల కూశ్మాండానాం విషయదుష్టానాం విషమవిశేషజానాం భయం హర హర మథ మథ భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయ మారయ శోషయ శోషయ ప్రహారయ ప్రహారయ, ఠఠఠఠ ఖఖఖఖ ఖేఖే ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే శృంఖలాబంధ విమోచనాయ ఉమామహేశ్వర తేజో మహిమావతార సర్వవిషభేదన సర్వభయోత్పాటన సర్వజ్వరచ్ఛేదన సర్వభయభంజన, ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే కబలీకృతార్కమండల భూతమండల ప్రేతమండల పిశాచమండలా-న్నిర్ఘాటయ నిర్ఘాటాయ భూతజ్వర ప్రేతజ్వర పిశాచజ్వర మాహేశ్వరజ్వర భేతాళజ్వర బ్రహ్మరాక్షసజ్వర ఐకాహికజ్వర ద్వ్యాహికజ్వర త్ర్యాహికజ్వర చాతుర్ధికజ్వర పాంచరాత్రికజ్వర విషమజ్వర దోషజ్వర బ్రహ్మరాక్షసజ్వర భేతాళపాశ మహానాగకులవిషం నిర్విషం కురు కురు ఝట ఝట దహ దహ, ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే కాలరుద్ర రౌద్రావతార సర్వగ్రహానుచ్చాటయోచ్చాటయ ఆహ ఆహ ఏహి ఏహి దశదిశో బంధ బంధ సర్వతో రక్ష రక్ష సర్వశత్రూన్ కంపయ కంపయ మారయ మారయ దాహయ దాహయ కబళయ కబళయ సర్వజనానావేశయ ఆవేశయ మోహయ మోహయ ఆకర్షయ ఆకర్షయ, ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే జగద్గీతకీర్తయే ప్రత్యర్థిదర్ప దళనాయ పరమంత్రదర్ప దళనాయ పరమంత్రప్రాణనాశాయ ఆత్మమంత్ర పరిరక్షణాయ పరబలం ఖాదయ ఖాదయ క్షోభయ క్షోభయ హారయ హారయ త్వద్భక్త మనోరథాని పూరయ పూరయ సకలసంజీవినీనాయక వరం మే దాపయ దాపయ, ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే ఓం (హ్రౌం క్ష్రౌం గ్లౌం హుం హ్సౌం) శ్రీం భ్రీం ఘ్రీం ఓం న్రూం క్లీం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హుం ఫట్ ఖే ఖే హుం ఫట్ స్వాహా ||
– హ్రౌం క్ష్రౌం క్ష్ర్మ్యౌం గ్లౌం హ్సౌం (ఇతి పాఠభేదః)
*****
*******
సుందరకాండ - సుందర తత్త్వం - తెలుగు వచస్సు ( 1వ సర్గము )
భూతాలు పర్వతమును బద్దలు చేయు చున్నాయని తలచెను, తినుచున్న లేహ్యములు, భక్ష్యములు, మాంసములు విడిచెను మునులు, యక్షులు, విద్యాధరులు వారి స్త్రీలతో పైకే ఎగిరెను, హనుమంతుడు పాద స్పర్స అంత అమోఘం.
*21. మంచివారు మనగ్రామ్గలో ఉనె అంటా మంచి జరుగును అనిభావించాలి, మంచి వారు లేని ప్రాంతము ఎప్పుడూ భూమి ప్రకంపనలు వస్తాయి, తినే ఆహారము దొరకక భాదలు వహించాలసు వస్త్గుంది, వలసి పోయే పరిస్తితి వస్తుంది అది గమనిమ్చుటే ఈ శ్లోకం నీతి
మెడలో హారములతోను , పాదములకు అందెలతోను, భుజములకు దండ కడియములతో,చేతులకు కంకణములతోను
విద్యాదరస్త్రీలు ఆశ్చర్యపడుచు, భయముతో తమ ప్రియులతోను , విద్యాధరులు పర్వతముపై నిలిచి హనుమంతుని గూర్చి సంభాషించెను.
*22. ధనవంతులు సంపాదించిన ధనములో కొంత బంగారములోకి మారుస్తారు, వాటి రక్షణ కోసం బ్యాంకుల్లో దాచుతారు, కొందరునిత్యము ధరిస్తూ ఉన్నారు, కాని అనుకోని పరిస్తితిలో దొంగిలించటం జరిగిందని, రక్షణ కాశము అవుతుందని అంటే బంగారము గూర్చి, ధనవంతుని గూర్చి పలువిధాలుగా సంభా షించుకుంటారనేది ఇందు నీతి.
శోభగల హనుమంతుడు భుజమును, కంఠంను వంచెను, తేజస్సును,వీర్యమును,బలమును, పెంచి ఊపిరి బిగపట్టెను
నేత్రములు పెకిఎత్తి, పాదములతో గిరిని అదిమి పైకి ఎగెరెను, మహాబలశాలీ, వానర శ్రేష్టుడు చేతులను చేర్చి సముద్రముపై చేరెను,
*23. ప్రతిఒక్కరు తేజస్సును,వీర్యమును,బలమును పెంచు కుంటూ ఉండాలి, అవసరము వచ్చినప్పుడు అధర్మాన్ని ఎదుర్కొనుటకు పతిఒక్కరు సంఘటితంగా ఏకమై ముందుకు సాకి చేతులు చేతులు కలిపి ఉద్యమించాలి.
మకరములకు నివాసమైన సముద్రమును దాట దలచెను, పర్వతమువంటి శరీరముగల హనుమంతుడు ఒక్కసారి కదలెను, రోమములు దులుపుకొని, మహా మేఘము వలె ఘర్జించెను, రామునికోరకు, వానరులకోరకు సముద్రముపై లంఘించెను.
*24. మనం బ్రతకల్సింది ఇతరులు కోసం అని గమనించాలి, సముద్రం లాంటిమన మనస్సును అదుపులో పెట్టుకొని ప్రవర్తించాలి, అవసర మైనప్పుడు ధర్మం కొరకు తప్పని పరిస్తితిలో దుర్మార్గానిపై ఘర్జన చేయాలనేదే, స్నేహితులను బంధు వులను ఆదుకోవాలనేదే ఇందు నీతి.
గగనమునుండి దేవలోకమునకుపోయిఅక్కడ సీతనువెదికెదను, కానరానిచో లంకకు పోయి రావణుని నగరముతోసహా తేగలగు తాను , ఆకాశము నుండి వానర వీరులందరికి మారుతి అమృత మాటలు పల్కెను, గమ్భీరముగా జెప్పుచూ నొక్కఊపులో సముద్రముపై కెగసెను, అణిమా సిద్దులుగల విద్యాధరులు హనుమంతునిచూసి ఆరాధించెను.
*25. ఏవిషయమైన ఘమ్భీరముగ చెప్పాలి, చెప్పిన మాటను నిలబెట్టు కోవాలి, ఎవ్వరి మనస్సును నొప్పించక అందరి మనస్సు శాంత పరిచే మాటలు పలకాలి అనేడి ఇందు నీతి .
*****
సుందరకాండ - సుందర తత్త్వం - తెలుగు వచస్సు ( 1వ సర్గము )5/20
అతని తొడల వేగమునుండి వచ్చిన గాలికి చెట్లువ్రేళ్ళతో సహా పైకి ఎగేరెను, దూరమునకు పోవు భందువులను పంపినట్లుగా కొంతదూరము పోయెను, మరలి చెట్లు అన్ని సముద్రములో రెక్కలు తెగిన పర్వతముల వలే పడెను, మహ సముద్ర మంతా పగటి పూట నక్షత్రాలతో నిండిన ఆకాశంవలె ప్రకాశించెను.
(*26 పెళ్లి చేసి వధువరులను సాగనంపేటప్పుడు కొంత దూరము వచ్చి వెనుకకు వెళ్ళుట అనేది హనుమంతుని వెంబడించిన చెట్లులాగా ఉంటుంది, పిల్లను పంపిన తర్వాత అన్దరూ నీరసముగా అన్నిసర్డుకొని వేల్లుటే వజ్ర హతమైన పర్వతాలు ఒక్కసారిగా కూలినట్లు వారి మనసు భధకరముగా మారుతున్నదనేదే ఇందు నీతి)
హనుమంతుని రెండు బాహువులు పాము పడగలువలే కనిపించెను, అతని రెండు నేత్రములు పర్వతముపై రెండు అగ్నిజ్వాల లవలే ప్రకాశించెను, అతని వాలము ఇంద్ర ద్వజము వలే ధగ ధగ మెరుయు చుండెను, అతని ముఖము సంద్యారాగముతో కూడిన సూర్యబింబమువలె నుండెను.
(*27. నిత్య అగ్ని హోత్రుని దృష్టి చూడాలంటే అందరికీ కష్టమే, వారి చేతులు చూడగా పాము పడగల వలె కనిపించును, నేత్రములు అగ్నిగోళముల వలె కనిపించును. ముఖము బ్రహ్మ వర్చస్సుతో వెలుగు చుండును అటువంటి వారికి పాదాబివందనాలు చేసి ఆసీర్వాదము పొందాలన్నది ఇందు నీతి, .కోపముగా ఉన్నవారి కళ్ళు కుడా అగ్నిలా వెలుగుతూ ఉండటాయి అటువంటి వారి ముందు జాగర్తగా ఉండాలనేదే ఇందు నీతి.
హనుమంతుని ఎఱ్ఱనైన పిరుదులు బ్రద్దలైన ధాతుశిలలవలె నుండెను, అతని జంకల నుండి వచ్చేవాయువు మేఘము యురుము వలె నుండెను, ఉత్తరము నుండి దక్షణ దిక్కు వైపు పోవు ఉల్క వలే ప్రయాణించు చుండెను , రామభాణము ఎంత వేగముగా పోవునో అంతే వేగముగా పోఉ చుండెను
(*28 కొందరి శరీర అవయవాలు బహు చక్కగా ఉండునని, మరి కొందరివి వికృతముగా ఉండునని ఇందు మూలముగ తెలియు చున్నది, కొందరి మాట శబ్దానికి మించి ఉండునని, వేగము, మాట, తోక చుక్క కన్నా మించి ఉండు నని ఇందు మూలముగా తెలుసుకోవచ్చు ననేదే నీతి
హనుమంతుడు త్రాడును తెంచుకొని పరుగెడుతున్న ఎనుగువలె నుండెను, అతని ముఖము చుట్టు తోక ఉండగా సూర్యునివలె ప్రకాశించు చుండెను, అతని నీడ సముద్రము పై పడి ఒక పెద్ద నౌక వలె కనబడు చుండెను, వక్షస్తలము నుండి వెడలిన గాలిచే కెరటములు రెండంతలు ఎగసి పడు చుండెను
(*29) ఒక్కోక్కరు నడుస్తుంటే భూమి, గాలి , కంపిస్తున్నది, కొందరి ముఖముచూస్తె వేలుగుతోనిండి పోతున్నది, కిరణాల తాకిడికి నీడ ఆవహిస్తున్నది, అందు చెఅ ప్రతిఒక్కరు త్రాడును తెంచుకొని పరుగెడుతున్న ఎనుగువలె నుందాలన్నదే ఇన్దునీతి
ఉత్తరమునుండే వచ్చే వాయువు హనుమంతునికి ఎగురుటకు తోడ్పడెను, తాకాలని కేరటములు పైకి ఎగిరి పెద్ద గుంటగా ఏర్పడి పైకి ఎగురు చుండెను, భూమి యందు ఉన్నసముద్రమును మారుతి త్రాగుచున్నట్లుగా కన బడెను, హనుమంతుడు ఆకాశమున తలపైకి ఎత్తిన ఆకాశాన్ని మ్రింగి నట్లుండెను
(*30) కొందరి చూపులు మింగెసి నట్లుగాను, మరికొందరి చూపులు తాగేసినట్లుగాను ఉన్న వారిదగ్గర జాగర్తగా ఉండాలనేదే ఇందు నీతి, మన ప్రయాణములో ఎన్నో ఆటంకాలు వచ్చిన ధైర్యముగా ముందుకు పోవాలన్నదే ఇందునీతి.
**********
ఆధారము లేకుండ రెక్కల పర్వతమువలె హనుమంతుడు ప్రకాశించు చుండెను, మేఘ పంక్తులలోకి పోవుచూ బయటకు వచ్చుచూ గరుత్మంతుడివలె ఉండెను,ఎరుపు,నలుపు,తెలుపు,పచ్చ, మేఘాలల్లో హనుమంతుడు ముచ్చటగా నుండెను
హనుమంతున్ని చూసిన ఋషీశ్వరులు, దేవతలు, గంధర్వులు పరాక్రమమును ప్రశంసించెను
*(31) కొందరకి తన శక్తి అసలు తెలియదు, అనుకున్న పని అనుకున్న సమయముము కన్నా ముందే చేయగలుగుతారు, ఎందరు ఎదుర్పడినా ఎన్నిఅవాంతరాలు వచ్చిన తన కార్యమును తను చేసినవారికి, అందరి దీవెనులు ఉంటాయని ఈ శ్లోకభావం.
కొండంత ఎత్తుగా లేచుచున్న సముద్ర తరంగములను వక్షస్థలముతో 'డి' కొని ఎగేరెను, హనుమంతుని తో వచ్చే గాలి, మేఘముల గాలి, సముద్రపు గాలి కలసి భీకరశబ్దముగా వినబడెను, సముద్రములో ఉన్న తరంగాలన్ని భూమి ఆకాశాన్ని తాకు చున్నట్లుగా ఉండెను, ఎగసిపడుతున్న సముద్ర తరంగాలను లెక్క పెట్టు చున్నాడా అన్నట్లు దాటు చుండెను .
*(32) ఎవరైనా సరే తప్పని సరి పరిస్తితిలో పనిచేయాలంటే గుండె ధైర్యముతో, శబ్ధకాలుష్యాన్ని తట్టుకొని, ఈర్శ్య ద్వేషాలను తట్టుకొని, ఎగసి పడుతూ అడ్డు వచ్చిన వారిని దాటుకుంటూ ఎంత మంది అడ్డువచ్చారో లేక్క కట్టుకుంటూ ముందుకు సాగాలన్నదే ఇందు నీతి. .
తిమింగళములు, మొసళ్ళు, వస్త్ర విహీనులయన మనుష్యుల్లా ఉండెను, సర్పములు హనుమంతుని చూసి గరుత్మంతుడని భావించి భయ పడెను, హనుమంతుడు ఆకాశములో మేఘముల కన్న ముందుకు పోవు చుండెను. మేఘాలచే కప్పబడుచు బయటకువచ్చుచూ ఉండే చంద్రుడిలా ప్రకాశించు చుండెను
*(33) కొందరు నీ పనికి అడ్డు పడుటకు, ఆక ర్షిమ్చుటకు, వస్త్ర విహీనులై , ఎంతో భయము నటించేవారు ఉంటారు జాగర్తగా మేలగాలనేదే ఇందు నీతి, చూపి చూపనట్లుగా మనసును లాగేవారు ఉంటారు జాగర్తగా మనం ప్రవరిమ్చాలనేదే ఇందు నీతి.
హనుమంతుని నీడ సముద్రము మీద పది యోజనాలతో విస్తీర్ణముగను, ముప్పది యోజనాల పొడవుతో ఉండెను, దేవా దాన గంద ర్వులు పుష్ప వృష్టిని కురిపించెను, హనుమంతుని చూసి దేవగణాలన్ని పరమా నందమును పొందెను
*(34) కొందరు కార్య సాధకులుగా ముందుకు సాగేటప్పుడు వారి నీడను వారే చుడలేరు, ఎంత విస్తీర్ణము ఉందో చెప్పలేరు అనేదే తెలుసు కోవలసిన విషయం మరియు పనిలో ఉన్నప్పుడు పనివిషయము తప్ప అన్య విష యము ఆలోచించ కూడ దనేది ఇందు లోనీతి
******
*మన సమస్యలకి సుందరకాండ పరిష్కారాలు.!
ఎన్నో సమస్యలకు సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది పరిష్కారం పొందారు..
ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం
కాండం మొత్తం పారాయణ చేయలేరు,
అయితే అందులో ఏ సమస్యకు ఏది పరిహారామో వివరంగా ఉంది.
పారాయణ నియమాలతో ఉంటుంది.
ఇక్కడ ఇచ్చిన వివరాలు ఒకసారి పరిశీలించండి.
శ్లోకం.ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ ||
108 సార్లు ,
శక్తి కొలది తమలపాకులు,
అరటిపళ్ళు నివేదన చేయాలి.
ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేయవలెను .
3 రోజులు ద్రాక్ష , అరటిపళ్ళు నివేదన
3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు
30 దినములు పారాయణ చేయవలెను .
1 కొబ్బరికాయ , అరటిపళ్ళు నివేదన.
64 వ సర్గ నిష్ఠతో 11 సార్లు
40 దినములు పారాయణ చేయవలెను .
శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.
51 వ సర్గ అతినిష్ఠతో 2 సార్లు
21 దినములు పారాయణ చేయవలెను.
శక్తి కొలది ద్రాక్ష , బెల్లము నివేదన చేయవలెను.
8 మరియి 9 వ సర్గలు ఏకాగ్రతతో 3 సార్లు
27 దినములు పారాయణ చేయవలెను.
శక్తి కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.
11 వ సర్గ నిష్ఠతో 3 సార్లు
21 దినములు పారాయణ చేయవలెను.
అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.
7వ సర్గ ఏకాగ్రతతో 1 సారి
40 దినములు పారాయణ చేయవలెను.
అరటిపళ్ళు చక్కెరతో నివేదన చేయవలెను.
13 వ సర్గ నిష్ఠతో 3 సార్లు
27 దినములు పారాయణ చేయవలెను.
శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను.
63 వ సర్గ నిష్ఠతో 5 సార్లు
21 దినములు పారాయణ చేయవలెను .
శక్తి కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.
34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతిదినము ,
21 దినములు పఠించవలెను.
శక్తి కొలది బెల్లపు ముక్క అరటిపళ్ళు నివేదన చేయవలెను.
67 వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా 3 సార్లు
21 దినములు పారాయణ చేయవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు,ఖర్జూరము నివేదన చేయవలెను.
27వ సర్గ ఏకాగ్రతతో 1 సారి ప్రతిదినము పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.
33 నుండి 40 వ సర్గ వరకు 1 సారి ,
21 దినములు నిష్ఠతో పఠించవలెను .
శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.
15వ సర్గ ఏకాగ్రతతో 1 సారి
40 దినములు పఠించవలెను.
అరటిపళ్ళు, పటిక బెల్లం , మరియు
రామాయణం లో అయోధ్యకాండలో యాత్రాదానము
32 వ సర్గ 1 సారి ,
40 దినములు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్షనివేదన చేయవలెను . ( అగస్త్య , పరాశర , ఉమా సంహిత ప్రకారం చెప్పబడినది ).
38 వ సర్గ ఏకాగ్రతతో 3 సార్లు
27 దినములు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు వీలైతే పనస నివేదన చేయవలెను.
19 వ సర్గ అతినిష్ఠతో రోజుకు ఒకసారి
1 సంవత్సరము పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.
సకల రోగ నివృత్తికి - సర్వ పాప నివృత్తికి
మొత్తం సుందరకాండ నిష్ఠతో 9 దినాలలో 1సారి
68 రోజులు చదువవలెను.
నివేదన రోజూ కొబ్బరికాయ సత్ఫాలితమునిచ్చును.
9 దినములలో ఒకసారి పూర్తిగా
68 దినాలలో పఠించవలెను.
సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు
ప్రతిరోజు పఠించవలెను.
అప్పాలు , పాలు , పంచదార నివేదన చేయవలెను.
1 వ సర్గ ఏకాగ్రతతో రోజుకు 5 సార్లు
30 దినములు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.
55వ సర్గ నిష్ఠతో 3 సార్లు
30 దినములు పఠించవలెను .
శక్తి కొలది అరటిపళ్ళు,పనస నివేదన చేయవలెను.
42 సర్గ అతి ఏకాగ్రతతో 3 సార్లు ,
21 దినములు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్ష , దానిమ్మ నివేదన చేయవలెను.
15వ సర్గ నిష్ఠతో నియమంతో 5 సార్లు
21 దినములు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.
ప్రతిదినం 7 వ సర్గ నిష్ఠతో
68 రోజులు పారాయణ చేయవలెను .
శక్తి కొలది అరటిపళ్ళు , కొబ్బరికాయ ,నివేదన చేయవలెను.
శక్తి కొలది తమలపాకులతో అర్చన చేయవలెను . సుందరకాండ 16 రోజులు పారాయణ చేయవచ్చును.
28 వ సర్గ చాలా నిష్ఠగా రోజుకి 1 సారి
41 రోజులు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.
- *శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-1*002
No comments:
Post a Comment