పనిగాను వచ్చితి - పనిపూర్తి వెల్లద
కదలక మెదలక కళల హనుమ
అతిసుందరము లంక ఆశతీర్చ గలదు
ఆత్రమేళయునీకు ఆట కాదు
రావణ ఆజ్ఞ తో రక్షగా లంకకు
నన్ను జయించుము నమ్మ గలను
భీకర రూపము బలహనుమకు చూపె
హనుమకాయముపెంచె ఆసమయము
తే:: అంతరంగమునందు నే అదుపు తిప్పి
నిలిపి చూడచూడగనులే నిలుచు గాక
బాహ్య మందు శివుని పూజ భావమేన
గురి కుదరని మనిషిఏను గడిన తిరుగు
***
సీ:: వెఱ్ఱికోపముతోను వేగ గర్జన చేసి
లంఖిణి హనుమతో లాస్య మాడె
చేతితో చరిచేను చెప్పక హనుమనే
హనుమనాదముతోను హస్త మోపె
రక్కసి డొల్లేను రవ్వలా మెరిసెను
స్త్రీయని హనుమయే శీఘ్రమాగె
భయముచేతవనకీ బాధ్యత తెలిపే
బ్రహ్మవరముఇది బాధ లేదు
తే:: సృష్టి అపవిత్రము పవిత్ర సమయ మందు
స్వీయ సృష్టి గనే ఎందు శ్రీకరమగు
చెడును మంచినే పంచుటే చేరువగుట
ఊరుకోదుపుణ్యము పాపమూను చేరు
***
సీ:: ఓ బల భీముడా ఓర్పు వహించుము
ఓవానరోత్తమా ఓమహాత్మ
ఇంతకాలముగాను ఈశ్వరసంకల్పం
నేటికీ నీచేత నేను ఓడె
ఓటమి లంకకే ఓర్పులేకయుచేటు
లంఖిణి తెలిపెను లక్షణాలు
నందికేశ్వర శాప నాందియగుటయేను
లంకవినాశము లక్ష్యమగుట
తే:: కోరికను తరిమితె బుద్ది కొండ దిగును
నిర్మలమగు ఆలోచన నిన్ను మార్చు
దైవ నిర్ణయాన్ని మరచి కైపు ఏల
మనసు పరమాత్మ మార్చియు మంచి చేయు
***
రాక్షస సమూహమును జూసె రాత్రి నందు
రాకుమారి సీతయు కాన రాకయుండె
వైభవోపేత లంకయు వైన తేయ
బ్రహ్మరుద్రాదులు జయించ భేద లంక
***
శ్రీ వాల్మీకి మహాముని సంస్కృతం లో విరచిమైన 3వ సర్గ తెలుగు వచస్సు సమాప్తము
శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
---0----
4 వ సర్గ
సీ:: కొమ్మలెక్కుహనుమ - కోటగోడను ఎక్కి
ఎడమపాదముపెట్టి - ఎక్కి దూకి
శత్రువు నిలయమే - శ్రమనుకోకను చేరె
పుష్పవీధులుగ వుండె - పురమునందు
ఆణిముత్యమనులు - ఆనంద పరిచేను
రమ్య మైనది లీల - రాజ వీధి
శుభమైన శోభలు - సుబ్రతా భవనాలు
కలలుతీర్చేకాల - కపట మేది
తే:: ధరణి నందు చీల్చుకొనిమొక్క దారి చేయు
శక్తి సామర్ధ్య మంతయు సతమగుట
చీకటిని తరిమే తేజస్సు చేరువగుట
చ్ఛ వాయువుల్లా బ్రత్కు సేతు ఆశ
***
సీ:: అప్సరసను మించు - ఆడమదవతులు
త్రివిధగాణములతో - తృప్తి పరచు
పుత్తడి ద్వారాలు - పున్నమి వెలుగులు
వెన్నెల నీడలు - వెల్లువిరిసె
కంఠాభరణ కాంతి - కళ్ళు యే మిరమిట్లు
దీపకాంతుల లీల - దివ్య మగుట
కళకళ లాడేటి - కమనీయ రమణులు
ఒడ్డానపు మెఱుపు - ఓర్పు చూపు
తే:: విధి కథంటూమొదలుగాను విర్ర వీగు
పూర్తి కూడాను అవుతుంది పురము నందు
పాత్రధారి కళాకారు ప్రాణ మిచ్చు
జ్ఞాప కమ్ము ఏ ఉంటుంది జ్ఞాని యందు
***
సీ:: ఘల్లు ఘల్లుమనెడి - గజ్జల సవ్వడి
మెల్లగా కదిలాను - మగని ధీర
మగువలు మెరుపులు - మగసిరి కొరుకునే
ముచ్చట గొలిపేటి - ముసుగు కళలు
తెల్లమబ్బులుకల - తెల్లని భవనాలు
ఎగిరేటి జండాలు - ఎల్ల వేళ
మంగళ ప్రదమైన - మనసిచ్చు గృహములు
తేలు తున్నట్లు ఇల్లు - తెలిపే లేక
తే:: ఏది అవగతం కాకనే ఏమి యనక
అన్ని అర్ధమయ్యాకనే ఆశ తీరు
మనసు లాగేస్కుంది ఎంత మహిమ గాను
జీవితం గడిస్తే బాగు జాతి కదులు
***
సీ:: సైనికుల సమూహమును మారుతి చూచెను
నిత్యసమర్థులు - నియమ మగుట
గుప్తచార గణము - గుండువేషధరులు
గోవుచర్మధరులు - గోప్యగుండె
దీక్షజటాధర - ధర్మఘంటాధర
ముండిశిరస్సుతో - మునివలెను
అగ్నికుండముల - హవనము చేయుచు
పూజలు చేయుచు - పురమునందు
తే:: ఏమి కోరిక ఉండేను ఎళ్లవేళ
నీటి బిందువు లామారి నిప్పు ఆర్పు
ఆశ ఆకాశమునుకోరు అడగ లేక
నక్షత్రాలురాలు పుడమిన కదలికనె
***
సీ:: కొందరే కా0క్షలు - కొందరు వికటలు
ఉండె భయంకర - ఉన్నతమగు
మరుగుజ్జు పొడవైన - మంచి బలము తోను
వజ్రాయుధము లతో - వంతు బ్రతుకు
ఓడ తెడ్డులతోను - ఓర్పు భాణముగాను
శక్తి ఆయుధములు - సకల తేజ
అంత:పురము స్త్రీలు - అందము తేజము
శక్తి వృక్షములేను - సర్వ సృష్టి
తే:: నీకు మాత్రమే తెలిసింది నీది కాదు
నీకు ఉన్నట్టి ప్రేమయు నీది కాదు
నీవు చేసేవి నిజముగా నీవి కావు
నీవు పొందే సుఖములన్ని నిన్ను చెరచు
***
సీ:: రాక్షసాధిపతిగా రక్షణ గృహముయే
వీర్యసంపన్నులు - విజయ కాంక్ష
స్వర్గములా ఉన్న - స్వరసమ్మేళన
దివ్య నాద నినాద - దినము వెలుగు
పాదము మోపగా - పరవశిమ్పచేయుట
లంకేశ్వర భవణం - లంక నందు
గుర్రపు శాలలో - గుర్రపు సకిలిమ్పు
మృగ పక్షుల కిల - ముఖ్యమగుట
తే:: మలిన పడుట మనసు నైజ మగుట నిజము
చలనము వలదనే దివ్య చేష్ట తేజ
కలత పడినను తీరని కాలమిదియు
తలగడ తలనెప్పిఅయితే తన్ను లాట
***
సింహ, వ్యాఘ్ర, భయాన - సింహస్వప్నములుగా
సీ:: జంబు నాదముతోను - జతగ నుండె
ముత్యము, వైడూర్య- ములు పొదగబడిన
పవళింపు మంచము - ప్రకృతి శోభ
ఉపరి తలముననే - ఉత్తమము గనులే
ఏనుగు, గుర్రాలు - ఎన్నొ గలవు
వైభవ లంకయు - వేయికళ్ళుకలిగె
హనుమకు వింతగా - హాయి గొలిపే
తే:: కొండ కోణలు తిరుగాడు కోటి వెలుగు
ఈ పు రికిఏల వచ్చితి ఇష్ట మేల
లంఖిణి మదమణచియేను లంజ చేరె
రాముడాజ్ఞ ఇదియు రక్ష రమ్య సీత
***
శ్రీ వాల్మీకి మహాముని సంస్కృతం లో విరచిమైన 4వ సర్గ తెలుగు వచస్సు సమాప్తము
శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
---0----
___((())))___
5 వ
చీకటి వేళలో - చేరువ చంద్రుడు
చాందిని గుడ్డగా - చంద్ర కళలు
మత్తవృషభముగా - మహిమచూపు కళలు
వెన్నెల రాత్రులు - విజయ కళలు
పాపాలు నాశన - పాలచంద్ర కళలు
ఉప్పొంగు సంద్రము - ఉజ్వలమగు
భూతసంపద కళ - భూరి విజయముకే
తారల మధ్యన - తార చంద్ర
విరహ దీపము పీడింప విధిన అట
కంఠ హారము లేకయు కన్న తీపి
చక్కని కను రెప్పలు గల చుక్కల కళ
నృత్యమును చేయు స్త్రీలతో నెమలి నటన
***
పంజరంలో హంస - పటిక గా మెరిసెను
చలములో గుండెగా - చక్క చంద్ర
విలువ నిశాకరుని - వెలుగుగా చంద్రుడు
పగటి వేలల యందు - పద్మ చంద్ర
హిమపర్వతము వలె - హితము చంద్రుడగుటే
గజముపై యూరేగె - గమ్య చంద్ర
శిలపైన సింహము - శృంగారమును పంచు
పున్నమి వెన్నెల - పుడమి చంద్ర
మన్మధుని చేత ధర్మము మహిమ చూపు
నిత్యమూ భర్తనే తల్చు నియమ స్త్రీలు
ఎవ్వనవతిగా ఉండియు ఏలు కొనుట
అన్ని విధములుగానులే ఆశ లేదు
***
నిశ్చలంగా నున్న - నియమము చంద్రుడు
ఆశ్రయ లక్ష్మీగా - అంబరమున
మాలిన్యమంతాను - మనుమాయపరిచేటి
వెన్నెల చిందేటి - వెలుగు చంద్ర
తిమిరదోషముచేత - తికమక చంద్రుడు
మాంసభక్షము దోష - మంత్ర చంద్ర
స్త్రీ కామ దోషము - సకల ప్రేమకు చంద్ర
వీణ నాదములు ఏ - వినుట చంద్ర
సుందరకుచములున్నట్టి సుమరమణులు
నేత్రములు విద్యులతలుగా నేస్తమగుట
స్త్రీలు భూషనాలు ధరించి సిగ్గు కలిగి
పుష్పమాల ధరించిన పుడమి హర్ష
***
నల్లని తెల్లని - నయనాల వారును
దృడకాయ పొడగరి - ధ్రువము వలెను
తేజేవంతులు వైన - తేయస్త్రీ లోలురు
భూషణ దారులు - బుద్ధి మెరుపు
నరహంతకులు నిశా - నరభక్షకులుగాను
విచ్చల విడిగాను - ఉండువారు
విహరించేవారు - వింతగుండెడివారు
కనకమణిమయమ్ము - కాంత ప్రియులు
ధూళిచేకప్ప బడి నది దునియ రేఖ
కనబడని చంద్ర వెన్నెల కాయు రేఖ
వంపుసొంపుల వళ్ళ వర్ణ రేఖ
గాలిచేతయు చెదిరిన గమ్య రేఖ
***
ధనుధారులు ఖడ్గ - ధారులగుట
ఏకకర్ణులు గుండి - ఏకాక్షలు గలిగి
లంబోదరులు గుండి - వికృత రూపులు
కవచధారుల గుండి - కనుల వెలుగు
అస్త్రశస్త్ర ములతో - ఆడుకొనెడివారు
వీరవిహారంతొ - విర్రవీగు
యజ్ఞదీక్షులు కామ - యవ్వన రూపులు
ముండిత ధారులు - ముఖ్య మగుట
సీత కానరాకుండెను స్థిరముగాను
దు:ఖము తొలగు మార్గము దూరమగుట
రామ కార్యము నెరవేర్చ రణముఏను
క్షణము ఉత్సాహ సూన్యము క్షమయు తప్ప
***
మదిలోన మరిపించు - మాయ కామిని లీల
రసలీల రమణులు - రమ్య పరచు
దిశమొల గాస్త్రీలు - దశదిశలుండిరి
శయనించు చూ స్త్రీలు - శ్రమను మరిచి
అందెవేసిన చేయి - అలకగనుయు మారె
పరవశమొందియు - పడక రాత్రి
మోహనాంగుల కళ - మైమరిపించేను
కామక్రీడ సలిపి - కామ్య నిద్ర
వెతుకు తుంటారు పోగొట్టు కున్న మనసు
జీవి ఈ ఆట ఆడేను జీవి తాన
పోయినది ఏది తెల్పరు పొగ పెట్టు
పట్టుగా రావణ కళలు పలక రింపు
***
శ్రీ వాల్మీకి మహాముని సంస్కృతం లో విరచిమైన 5వ సర్గ తెలుగు వచస్సు సమాప్తము
శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
---0----
6వ
సీ:: మూలబలము వళ్ళ - ముఖ్యమైనది మార్పు
పరివేష్టి త వలనా - పరమ సుఖము
గిరిశిఖరాన శివ - గమనించ గలిగితి
ప్రాకారము వెలుగు - ప్రగతి వలెను
నవరత్న ఖచితమై - నవ్యతోరణములు
వెండి చిత్తరువులు - వేలు వేలు
సౌర్యలక్ష్మి కలిగి - సంపద అపరంజి
సింహారక్షణ కల్గి - సేతు లంక
ఎక్క డెక్కడ వెతికాను ఎరుక లేను
అనవ సరవివ రాలులే ఏల నాకు
ఎంత ఇంకా ప్రయాణించి ఏమి చేసె
చెప్ప లేను ఓ జీవితమ్ చలప రింత
***
సీ:: స్వర్గపురముతోను - సరితూగు పలుకులే
మారుతి గాంచెను - అచ్చెరువుగ
సుందర మైనది - సుమమాల మందిరం
నృత్యమృదంగము - నియమ శక్తి
వీణ గాన వినోద - విజయశ్రీ నటనలు
చెంగున ఎగిరేటి - చేత పక్షి
ఉద్యానవనముల - ఉన్నత స్త్రీ కళ
మృగముల ఆటలు - మ్రగ్గి పోయె
కఠిన కాలపరీక్షలు కధలు నిచ్చి
పఠన చరితగా మేలుగా పలుకు తీర్చి
కంఠ సుస్వర వైరాగ్య కళలు కూర్చి
పీఠ మై కరుణాంతరం ప్రేమ చేర్చి
సాధన ప్రయత్నము లోక సమ్మతియగు
***
సీ:: కనివిని ఎరుగని - కమనీయ అద్బుతమ్
వినయ యుక్తులగను - విద్య వేక్త
శంఖ నాదములతొ - శివపూజ చేసెను
నిత్యార్చనలు చేయు - నియమ లంక
రత్నములు పొదగి - రాజద్వారము చూసె
కుంభ కర్ణ భవనమ్ - బురుజు గుండె
పార్శుని భవనము - ప్రతిభ విరూపాక్ష
రాక్షస గృహమున - రాత్రి హనుమ
విద్యుజిహ్వ, విద్యున్మాల వింత గృహము
సుకుల, బుద్దిమంతుడగు సార శుబ్ర గృహము
జంబుమాలి, సుమాలి భోజన గృహములు
ఇంద్రజిత్తు ఇల్లు హనుమ - ఇష్ట ముండె
***
సీ:: ప్రియ కామినులుగాలె - ప్రీతికల్పన కళ
అత్తరు పన్నీట - జలక ములులె
వర్ణచిత్రములుగా - వింధ్యపర్వతములు
వైకుంఠ మువలెను - వైన తీయ
కస్తూరి, పునుగులు - కాలమృగములన్ని
కలసి మెలసియేను - కలుగు లంక
గంధదూపములుగా - గగన వీధులలోన
హోమ శివార్చన - హోయలుగాను
చక్ర, శర, కపట,విఘన, చర్మ వజ్ర
కాయ, దంష్ట్ర,మహాకపి కాల భీమ
హ్రస్వకర్ణ,ద్రుమాక్ష, సంపాతి సూర్య
శత్రు, శుకనాభ, రాక్షస శాంతి గృహము
***
ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ: శ్రీ రామ చంద్రపరబ్రహ్మనే నమ:
సుందరకాండ 7వ సర్గ
సీ:: నీళ మనుల తొను - నిగనిగ కిటికీలు
వర్ష కాలములో మేఘ - వరుస కళలు
భూమి పర్వత ముగా - భుక్తికి గృహము
మెరిసేమెరుపులతో - మేలు చేయు
రాక్షస స్వబలము - రమ్యాతిగృహములు
దేవత, అసురులు - దివ్వె పూజ
సాక్షాత్తు మయునిచే - సాక్షులకు గృహము
దోషములేనిది - ధర్మ గృహము
ప్రేయసి చిలిపి చేష్టలు ప్రేమ పెంచు
ముంగురుల సవరింపుల ముఖ్య కేళి
వ్రేళ్ళు అనురాగ తీగల్ని మీటె నపుడు
పలికె సప్తస్వరాల్నిలే పడక నందు
***
సీ:: శ్వేత భవనములు - శ్రేయస్సు కోరియు
పద్మము లసరస్సు - ప్రగతి గాను
కింజల్కములు నిండి - కిలకిలా రావము
పువ్వులతో ఉన్న - పుడమి కళలు
వెండి, పగడముల - విజయ విహంగము
జాతిగుఱ్ఱములతో - జయము నిచ్చు
చిత్రమైన సర్పములు - చిన్మయాన్నితెలిపే
దివ్య సుందర రూప - దివ్వె వెలుగు
మంచి రూపగుణము ఏను మనుగడకుయె
జనుల పలుకులాలన చూసి జయము నివ్వు
మాటతో మనసున చేరి మమత పంచు
మరచి పోరులే చేసిన మేలు ఎపుడు
***
సీ:: నిశిత బుద్ధియుగనే - నియమాల మధ్యన
ధర్మ మార్గ వర్తి - ధరణి యందు
సూక్ష్మ దర్శనముతో - సుబ్రత కనుగొనే
అప్రతిహతమైన - అందలమది
లంకాపట్టణమంత - లయకారముగ నుండె
పతి, గుణ, ద్యానము - ప్రతిక్షణము వినే
సర్వప్రశస్యము - సర్వులనాకర్ష
సీత కన్పడకఏ - శీఘ్ర హనుమ
గుండె గూటిలోనున్నావు గుల్ల యనకు
పక్షిలాగ తెల్లని హంస ప్రతిభ నందు
భావ మల్లియై నా ముందు భాధ తీర్చు
పరిమళాల్ని జల్లి మనసు చల్ల బరుచు
***
సీ:: యమకుబేర ఇంద్ర ధనము ఏ లంక లో కళ
పుష్ప విమానము - పూజ్య మగుట
తపముతోను కుబేర - సాధించిన విమాన
ధైర్యంతొ రావాణ - పొంది నదియె
కాంచన మెరువుతో - కలలకు మనోహర
విశ్వకర్మవిచిత్ర - విజయ విందు
జ్వాల వలెను పుష్ప - జాతి విమానాన్ని
మారుతి మొత్తము - బాగ వెతికె
గజము తోండములందును పద్మ కాడ
లక్ష్మి దేవి హస్తము నందు పద్మముండి
బహువిధములుగా వెతికిన భాగ్య సీత
కాన రాలేదు హనుమకు కష్టపడ్డ
***
___((()))___
8 వ
సీ:: నెలకు తాకక - నిలచియే యుండెను
భవన ప్రతిష్టిత - భాగ్యమవును
దివినుండి భువికియే - ఎగసిన పక్షిగా
సూర్య చంద్ర వెలుగూ - చూడ గలిగె
శిష్టరూపముగాను - శిబికలు కలిగెను
ఆకాశసంచారు - ఆలనగుట
ఆహార ముభుజించు - అన్నియు పాయాలు
రచనా విశేషము - రామ్య పరచు
గీ:: నేను మళ్ళీ ఇలాగనే నేర్చుకొనుచుఁ
జరగ బొయ్యే పరీక్షింప జాగృతిగను
రెక్కలు తెగవేసినను నే రక్కసి వధ
నింగికి ఎగరేయబడినా నీడ నవుతి
***
సీ:: ఏదియు నిర్మించ - ఏలవిశ్వము కర్మ
బహుమూల్యమైనది - భాగ్య లంక
దేవవిమానము - తేజము వలెవుంది
అద్బుతమై శక్తి - ఆవహించ
పవన నందనుడుఏ - ప్రతిమూలతిరిగే
మనసు బట్టి ప్రయాణ - మమత ఏల
సంప్రాప్తమైనది - సంతోష పరిచేను
శత్రువులకు కాన - శక్తి రాదు
గీ:: నమ్మటంవేరు నమ్మించ నటన వేరు
ఉప్పు చెక్కర ఒక్కటే ఊట వేరు
విశ్వ అనుభూతి ఆకర్ష విధము వేరు
దైవ అర్ధం హృదయములో దర్శి వేరు
***
___((())))___
సుందరకాండ - 9 వ
సీ:: ఒక యోజన పొడవు - ఒక అర్ధ ము వెడల్పు
భవణ ప్రాసాదము - భందమయె
ఆయుధాలు ధరించి - అంతటా రక్షగా
నాల్గు దిశల లోన - నాట్య లక్ష్మి
గాలికి కదిలేను - గమ్యముప్రశ్నగా
విష సర్ప మోసళ్లు - వినయ చూపు
మంధర పర్వత - మాయలు కనబడే
రత్నాలకాంతులు - రమ్య పరచు
తే:: బ్రహ్మ తేజస్సు కనబడే - భద్రముగాను
వెండి బంగారు నిర్మిత - వేద నిలయ
హేమ సోపానము - యేలు చుండె
పాన భక్ష్యాన్నము - ప్రాప్తి తృప్తి
***
సీ:: పుడమిన తారలై - పురివిప్పె కేశాలు
చెదరె అంగన దర్శ - జేరి నవ్వు
అస్తవ్యస్తము హార - అందమైన ముఖము
చిరుచెమటలతోను - చితి తిలకము
పాన వ్యాయామము - ప్రాధాన్య సమయాలు
తెగినట్టి ముత్తెపు - తెల్ల పూస
జారే వక్షో జాలు - జామురాత్రి సుఖము
సడలె వడ్డాణాలు - సర్దు కొనక
తే:: తనకు తానుగా తిరిగేను తపన హనుమ
జగతి లోన నిస్వార్థము జూపు నిత్య
సత్య, సద్భావమును పంచు సత్య వ్రతుడు
మానవముసుగు మార్చియు మహిమ జూపు
***
సీ:: పగిలె కుండలములు - పిరుదులు తిన్నెలు
జలములో లతలుగా - జాము రాత్రి
చంద్ర కిరణ శోభ - చీర లెగెరె పతాక
ముత్యాల హారాలు - ముఖము కురులు
స్త్రీల అలంకార - శృంగార మకరాలు
పొదిగిన చిరుగంట - పోరు జరగ
రాజహంసవలెను - రాజకన్య కదులె
కరిశరీరాలతో - కలలు కనెను
తే:: లోపము వెతికే గుణముయే లొలకమగు
నీవు మనుషుల్లో దేవుడి నీడ హనుమ
నిన్ను నీవు నిరూపించు నియమ మందు
నిజము తెల్పు అబద్దపు నీడ వలదు
***
సీ:: తెగి ఊడె దండలు - తెల్లటి ముద్దులు
చక్రవాక హారాలు - చక్క బరికె
మొగ్గఆభరణాలు - మొధుపాన గంధాలు
వదనాలు కమలాలు - వరుస కళలు
శృంగార మకరాలు - శృతిలయ కళలు
నిట్టూర్పు హృదయాలు - నీలి సెగలు
దేవతా వస్త్రాలు - దేవ రావణ చూపు
రావణ హాయిగా - రామ్య పరచె
తే:: మద్యపాన వివశలుతో - మధుర పొందు
మగువ ఆలింగనాలు శోభ - మంగళమగు
కర్ణ కుండలాలు కదిలే - కామ ప్రక్రియ
రావణునిపైన కామమ్ము - రాత్రి వేళ
***
సీ:: వాసనతో తృప్తి - వ్యాధిగ్రస్తులు వుండె
స్పర్శలు ఆకాంక్ష - సంధి చేయు
ఒడిలోన తలపెట్టి - ఒకయువతి పడక
మేలి వనాలు ముసుగు - మెలి తొలగె
బాహువులు నలిపే - బాధతీర్చె
వక్షస్థలంపైన - వేరొకరి తలయు
పిరుదులపై స్త్రీలు - పిటపిటలాడెను
తొడలపైన స్త్రీలు - తొట్రుపాటు
తే::మనసుల సభలో నిద్రలు మౌన మేళ సైతం
మాటకు గురవుతుందోయి మంచి చేయ
ఒకరిని హృదిలో నిలిపాక ఓట మేది
శయన వేళ వెతకడమే శక్తి హనుమ
***
సీ:: మైకం శరీరము - మైదనం కోరెను
స్పర్శతో మూలుగు - సంతసమ్ము
పూలపై దుమ్మెద - పూర్తిగా ఆవహించె
ఒకరి భుజం దండ - ఒకరి నోట
కదలియాడు లతలు - కామపు కళలుగా
చుంబనాలతొ చేయు - చుప్పనాతి
మహిళ లలోకామ - మదవాసన పిలుపు
ఒకరొకరు కలిసే - ఓర్చు కొక
తే:: బంధనాల వెలుగు చిమ్మె బ్రాంతి కలిగ
స్త్రీలచూపులే వెలుగులె స్త్రీల కళలు
ఇష్టమైన ఆశ పరులు ఇక్కడుండె
వారు అవివాహితులుగాను వాంఛ కొరకు
***
సీ:: బంగారు దీపాల - బాధ్యత మరచియు
చెల్లా చెదిరె కళ - చేరు వగుట
అనురాగ పంచేటి - ఆత్మీయతను చూపు
ప్రేమచూపియు బత్కు - ప్రేమ పక్షి
ఆద మరచి నిద్ర - ఆమె సీతయు కాదు
తక్కవందంలేని - తరుణి లేదు
రూప, కులం లేని - రూపవతియు లేదు
గుణ శీలం లేని - గుణవతి లేదు
తే:: అలసిన ముఖకవలికలె -అలక తెలిపె
రావణని శక్తి లొంగెను -రమ్య స్త్రీలు
రావణ కళ సౌందర్యము -దాసులగుట
సంతసమ్ము తోనులె ఉండు - సమయ హనుమ
***
సీ:: సందేహపడి సీత శాంతినిద్రయేల
ఆమె సీతయు కాక - ఆమె ఎవరు
సర్వ సోభిత సుందర - సముఖ నిద్ర
ఆమె మండోదరి - అయిన అవును
సహజ బుద్ది ఇదియు - శాంతికోరుట సీత
తొందర కార్యము - తొట్రుపాటు
వెతికేద అంగుళం - వేచిచూచెదనులే
స్త్రీలుండు గృహముగా - స్త్రీని వెతకె
తే:: అవని అవకాశ మదిఏను అలక తీర్చు
మిన్ను పంపువర్షము మౌన మిచ్చి తీర్చు
ప్రకృతి అనుకరణ జనుల ప్రతిభ పెంచు
ఆశ ఆకలి తీర్చేది అంబరమగు
***
సుందరకాండ - 10 వ సర్గ
సీత కానక హనుమంతునుని ఆలాపన
సీ:: ఏనుగు పోటుతో - ఏర్పడ్డ గాయము
దంతపు మొనలతో - దంచు దెబ్బ
పోరును జొడిచిన - పొంగు గుంటలతోను
రావణ ముఖమందు - రంగు తేలె
వజ్రాయుధపు గాటు - వంపు చక్రము గాటు
జయము పరంపర - జఘన గుర్తు
పీఠకే వెదికేను - ప్రియ మారుతి యపుడు
కీర్తిచిహ్నాల కాంతి - కాంత లగుట
తే:: బ్రతుకు మార్పు వయసుతోను భాధ సుఖము
వెతుకు సత్య వాక్కు గురువు వేడి చలవ
మెతుకు పట్టి చూడు మనసు మోయగలదు
చితుకు లైన ధర్మమువెంట చేరి వుండు
***
సీ:: స్పటిక మనులతోను - స్వశ్చముగావుండె
రత్నకాంతులతోను - రమ్య పరచు
నిత్య సుఘంధము - నిర్మలముగుచుండె
ఉన్నత స్వర్గము - ఉజ్వలమగు
స్వర్గమయమ్ముగా - రంజిల్లు చుండెను
చంద్రుని బోలిన - చక్ర ముండె
కుసుమ అశోకము - క్రుమ్మరించినదిగా
లంకేశ శయనము - లహరి గుండె
తే:: అక్షరాలపొంది జపము ఆత్మ తృప్తి
మస్తకమున మకుటమౌను మనసు తృప్తి
హృదయ పుస్తక గంధము హాయి నిచ్చు
ప్రకృతి పరవశం మానవ ప్రతిభ పెంచు
***
సీ:: ఉత్తమాంగనలతో - ఉయ్యాలాటలుగాను
మేఘమువలె నుండి - మేటి కాంతి
ప్రియరాన్డ్రతోక్రీడ - ప్రియురాలితొ నిద్ర
విశ్వాసములతోను - వింత బుసలు
మదపుటేనుగువలే - మదన కాముని చూసె
భయముతో హనుమయే - బ్రాంతి చెందె
రాక్షస ప్రవరున్ని- రవ్వెవెల్గున చూసె
త్రాచుపామునుచూసె - తట్టుకొనక
తే:: బ్రతుకు మార్పు వయసుతోను భాధ సుఖము
వెతుకు సత్య వాక్కు గురువు వేడి చలవ
మెతుకు పట్టి చూడు మనసు మోయగలదు
చితుకు లైన ధర్మమువెంట చేరి వుండు
***
సీ:: అంచనా తక్కువ - రావణవద్దను
సౌందర్య స్త్రీలుగా - సౌఖ్య మిచ్చె
మినపరాశి వలెను - మించ్చనల్లవాడు
విక్షణదృక్కులు - వింత వాడు
రక్తచందన పూత - రక్షగాత్రుడు వాడు
సంధ్యారునఘనుడు - రతిని పంచె
లక్షణమ్ముల గాను - లయసుంద రంగుడు
మణిమయభూషణ - మనసు భక్తి
తే:: భుజబలముమహా పరిరక్ష భవుడు గురువు
పద్మముఖులచేత సుఖుడు పరమ ప్రియుడు
శ్రేష్ఠ మైన పీతాంబర శ్రేయో ధామ
షడ్రసోపేత మృష్టాన్న భోజ్య ప్రియుడు
***
సీ:: ఏ నిమిషమ్ముయు నీది కాదు ,
నిజము తెలిపితేను నీది యగును
నిజము హృదయమైతె - నీదియగుట నిజం
ఏ కలం రాతయు నీది కాదు
విశ్వ మంతయు ఉన్న విజయము నీదియే
శ్వాసను పంచేది శాంతి కొరకు
కర్మ లన్నియు మర్మ కామ్యబుద్ధియగుటే
ధర్మ మంతయు పొందు ధరణి యందు
తే:: నిన్ను ఆవహించు శక్తియు నీది కాదు
సంప దంత కష్టఫలమ్ము సంతసమ్ము
ఉన్న దంతయు పొందేది ఉత్తమమ్ము
స్వరము నీదియు అయినను సంఘ తృప్తి
***
సీ:: ఆవల ఏముంది !? - అర్థ0కాని నిజమౌ
మార్పు" నిరంతర - మాయ వలన
గమనమ్ము ఉన్నది - గతులు మార్చుటకుఏ
కదలనిది కదిలే - కనుల రెప్ప
ధ్యానమార్గ శ్వాస ధరణిలో నిండెను
భిన్న విభిన్నము - బ్రహ్మ తేజ
జీవి సజీవంగా - జీవితం సమరమే
శ్వాసిస్తు చలనంలొ - శ్రమను పొందు
తే:: వివిధ యంత్రాంగమంతాను - వేగిరపడు
జీవ క్రియలు లోపల సాగు - జయము కొరకు
విశ్వక్రియలు బాహ్యము లోను - విజయ మిచ్చు
భూమిపై సూర్యుని వెలుగు - భుక్తి కొరకు
***
సీ:: చంకలో గుమ్మేట - చక్కని నేత్రియు
ఆలింగ వాత్చల్య - అంద మగుట
స్త్రీతప్పెటను హత్తు - స్త్రీ ప్రియున్ననిముద్దు
కమలము కళ్ళుగా - కమల నేత్రి
వేణువు కౌగలి వినయముమ్ము యువతి
స్త్రీసప్తతంత్రులు - స్త్రీల కాంతి
నియత నృత్యముచేయు - నీలవేణి కళలు
వీణను హత్తుకొనిన - విశ్వ రాణి
తే:: భామినివలెను నిద్రగా భర్త అనియు
మదముతో స్త్రీ మ్రుదంగము మత్తు హత్తు
మద్యపాన మత్తునహత్తు మత్తు భర్త
తప్పెటను కౌగలించేను తప్పు స్త్రీలు
***
సీ:: ఆడంబరమనేడి ఆవాయద్యముపట్టే
బాహు పాశముననే బాగు బిగువు
నీటికలశమును నాతిపై బోర్లించి
పుష్పాల పూజలై - పుడమి స్త్రీలు
కలశమ్ము బోలిన కామవక్షోజాలు
పట్టియు నిద్రించు పడచు వనిత
చంద్ర మోముగలిగి - చంపకం శోభిల్లు
కౌగలించుకొనుస్త్రీ - కామ బుద్ది
తే:: భూమి పుత్రికని ఎగిరే - భావ హనుమ
ఆమె స్థితిగాంచి దైన్యము- ఆశ మారె
కపి సహజమై స్వానుభ వమనియనెను
గంతులతొ వాలమునుపట్టి గగన హనుమ
***
హనుమంతుడు సీత కానక ఆవేదన
సీ:: ఒంటరి తనమాయె - ఓదార్పు లేదాయె
పాపము కాదులే - పడతుల కళ
శాపము కాదులే - శాస్త్రము చెప్పేనె
అవకాశ జారెనె - అంత రాత్మ
గుండె దండిగ నుంది - ధైర్యాన్ని తగ్గేద
సాయమడుగు వీలు - సాధ నేది
మనసులో స్తైర్యాన్ని - ముందుకు తీయనా
ముసురు నిరాశఏ - ముందు ఏల
తే:: కడిగి వేయటానికిదారి కానరాదు
సూత్రదారిగా సీతను చూడ లేదు
అడుగు ముందుకే వేసియు అమ్మ వెతక
నేను కాలంతొ కలిసిఏ నిజము తెలుప
****
సీ:: శ్వాసని వదిలిఏ - శాన్యంకధకు జారి
శూన్య శక్తి వలన - సుబ్రత కలుగు
మెలకువ నుండిఏ - మొదటగా నిద్రలో
జారినట్టు కళలు - జరుగు చుండు
ప్రాణి సహజ స్థితి - ప్రాధాన్యత వలెనే
నిశ్శబ్ద శూన్య ము - నిజము తెలుపు
తాత్వికులంతయు - తమతమ పనిలోను
స్వీయదర్శనములు - శీఘ్ర మగుట
తే:: అంతిమ దృక్పథమగుటేను - ఆశ పెంచు
విశ్వ సారాన్ని విశ్లేష - విశ్వసించు
తత్వవేత్త నిజాయతి - తరము నందు
దార్శినికుడు ధర్మపరుడు - దారి చూపు
***
సీ:: సూక్ష్మ బాధలు వళ్ళ - శుద్ధికి మార్గము
ఆలోచనల బుద్ధి - ఆది మార్పు
ఉత్పన్న భావాలు - ఉ ర్రూత లూగించు
పూర్తిగా స్వశ్చత - పుడమి కోరు
ద్వందబుద్ధివలెనే - త్వరగా ఆశకు
స్వంత మనస్సుఏ - సంకటపడు
అవగాహనలతోను - ఆరాటపడుటేను
మరొకటి కాదని - మాయ తెలుపు
తే:: పట్టుకోవాలి..? దేనిని - ప్రధమమగు
విడిచిపెట్టాలి..? దేనిని - వినయముగను
దగ్గర మరియు దూరమా - ధరణి యందు
అది ఎవరికి వారే తెలుయు - ఆట కాదు
***
సీ:: త్రికరణ శుద్ధితో - త్రినేత్రుని కొలిచే
సత్యం ప్రతి క్షణం - సమర మగుట
ఎరుకతోను అడుగు - ఏర్పాటుకావాలి
ప్రేమపూర్వకముగా - ప్రేరణయగు
గట్టి విశ్వాసము - గమ్యమగుటకు
ధైర్య ఆయుధమేను - ధర్మ మగును
దైవస్వరూపము - ధర్మాచరణ వైపు
మనలోన అద్భుతం - మనసు మార్చు
తే:: హింస అహింసయో - హితము చేయు
హక్కు ఎవరికీ లేదను - హాస్య మొద్దు
జీవి జీవించేటిది హక్కు - జైత్ర యాత్ర
సీత చెరలోన జీవించి - స్వేశ్చ కోరె
***
సీ:: మాట్లాడ కున్నను - మన మనో శక్తుండు
మనసు ఒక బ్రహ్మ - మాయ జన్మ
రాక్షసి కళలతో - ద్రాజ్యమే అశాంతి
సృష్టిని ఏ శక్తి - శృతిగ గతిగ
సంకల్ప 'సహజమై - సంతోష పరిచేది
తృప్తి అసంతృప్తి - తృణము వలెను
సాధన కేవలం - సమయ తృప్తి కొరకు
అనుభవం నేర్పును - ఆత్మా తృప్తి
సీ:: ఉదయా స్తమానములు - ఉన్నత భావాలు
అహము స్ఫురణ కొస్తె - అంత మగుట
అన్యత్వ అకార్ష - ఆలోచనల వేడి
జ్ఞానమే నిలిచిన - జ్ఞాతి కాడు
దృశ్య అదృశ్యమై - కృషియేను మారుటే
దేహానికి మరణ0 - తధ్యమగుట
ఒక వ్రణం వచ్చినా - ఓర్పుతో నుండుటే
తగువిధమున తగ్గి - తపన మారు
తే:: మాయ తోప్రారబ్ధమ్ముగా మార్మ మగును
పిడికెడు బిగువు కర్మలు పిలుపులగును
నీవు వద్దన్నఅది ఆగ నీదు బ్రతుకు
ఆత్మ జ్ఞాన దేహ స్ఫురణమ్ము యేను
***
11 వ సర్గ సుందరకాండ
సీ:: పానభూమిన స్త్రీలు - -పాటలు పాడిరి
అలసి మొరాయించి - మొండి కేసె
అధికపానమత్తుకు - ఆత్రుత మూళుగై
శిధిల శరీరము - స్త్రీలగుటయు
అధికరతికి వేచి - ఆడపడచులుండె
వేలకొలది స్త్రీలు - వేచి వుండె
గీతము అర్ధము - స్త్రీలబ్రతుకు పాట
దేశకాలముబట్టి - దీన స్త్రీలు
తే:: కాల గడియార కదలిక కామ్య మగుట
ప్రాగ్దిశా సుందరి కళలు పాన మదము
పక్షుల కిలకిలా రావ పలుకు చిలికు
మేల్కొలుపు గీతలాలన ఏలు ఎవరు
***
సీ:: ఇందువే రెవరొస్త్రీ - ఇచ్చవాంఛగావుంది
సీతమాత్రము కాదు - నిప్పు సీత
పరమపురుష రామ - పరమాత్మ మరచునా
కాపుర0 పరునితో - కళ్ళు కప్పి
భుజియించునాసీత - భూషణ ధారిగా
రావణ తో నిద్ర - రంకు బ్రతుకు
రాముని సతి నిద్ర - రమ్య గుండుటయేల
రావణాశ్రమమున - రాత్రి లేదు
తే:: పోవగలతావులను చూసె పోరు హనుమ
చూడగలవాని నెన్నోను చూసె హనుమ
నగ్న కాంతల పరిశీలనలుగ హనుమ
పరుల పరికించి పరిశీల పరమ హనుమ
***
సీ:: రతికేళి సలిపిన - రమణులు అంగాలు
ఎందుకో గాంచితి - ఏల ఇదియు
ధర్మము గానక - ధరణిని వెదికె
పాపినైతిని నేను - ప్రస్తుతమున
మనసున వికార - మనునది లేదులే
పరితాప మునుపొందె - ప్రతిభ హనుమ
సుదతులతో సీత - సుఖముగా నుండుట
వారును చూడక - వాక్యమేళ
తే :: నావివేకము వీడక నాదు బుద్ది
ఇది నిష్కామముయగుటే ఈశ్వరేశ్చ
స్వామిసేవయే పరమార్ధ సాధనగుట
పాప మెరుగని గుణుఁయే ప్రతిన హనుమ
***
12 వ సర్గ సుందరకాండ
సీ:: ఎక్కడైనా గుప్త - ఏదైన స్థలమున
పుణ్య మైనాఉంచి - పూర్తి రక్ష
సీల రక్షణతోను - సీత లొంగి నదేమి
విక్రుతా కారాము - వింత రగడ
ధర్మ మార్గముననే - దాగియుండవచ్చునొ
వానరుల అడిగే - వాక్కు ఏమి
చిత్రగ్రుహములను - చింతలేని గృహము
ఎంత వెతికినను - ఏమి చెప్ప
తో:: లంకలో ఎమిచెసితివి లాంఛనమ్ము
పని సఫలమగు నట్లునా పలక లేను
భూమి లోపల గృహములు భూత నాధ
పానశాలలు వెతికెను పట్టు బట్టి
***
సీ:: సీతమ్మ బ్రతికిఏ - శీఘ్రముకానక
క్రూరరాక్షసులతో - ఊరకుంద
తిరిగిన తావున తిరిగేద మరలాను
రావణుడేబలి - రాజ్యలక్ష్మి
ఆగి ఆగిన వేద - అడుగు వేసేదను
లంఘనము వృధాన - లక్ష్మిఏది
దిగుడుబావులనులే - దిగి వెతికితినిలే
సీత కనబడలే - చిన్న బోఎ
తే:: ఉరుముతా చీటికిమాటికి ఊకదంపు
నీళ్లు నములు తారును వారు నీడ లేక
పెదవి విప్పలేక తెలిప పేరు ఏది
బానిసల్లఉండి వెతక బాగ్య లంక
***
సీ:: జాడ కానన లేదు జామురాత్రి వెతక
తెలిపినక్రూరము - తలపకున్న
లేదని తెలిపినా - లేతమనసు బాధ
దుర్వార్త లను తెల్పి - దూరమేల
ఘోరభయంకర - ఘడియలివియనట
గొప్పనేరముతప్పు - కోప మోచ్చు
నేనిక్కడేవుండి - నిత్యమూ వెతికెద
సంపాతి మాటలు - సత్య మగును
తే:: అంధకార బంధురమున ఆత్మ సీత
నిస్పృహ నిరాశ చెందియు నీడ చేరి
దుఃఖ మువియోగ భయముతో దూరముండె
తనకు తానుగా మరణము తప్ప దనిన
***
సీ:: చేతిలో పడినచొ - చేరుఫలమనిఏ
ఉదకముత్రాగియు - ఉండ గలుగు
జలమున జపముగా - జలపుష్ప ఆహరం
వాన ప్రస్తము గాను - వెగర గలను
చితిని ఏర్పరుచుయు - చిక్కేద జ్వాలకు
అన సన వ్రతమును - అవల పరిచి
నా కీర్తి మాలిక శాశ్విత భగ్నమై
ఋషి సంమ్మతమనిఏ - ఋషివలెనులె
తో:: కెరలు హర్షమే వర్షమై కురియుచుండ
వెండి జేగంట శబ్దంబు గుండె నిండ
విజయనృత్యాలసాంగులు వేయు పూల
దండలే కుస్తరించెను దంతి హనుమ
***
సీ:: రామకు తెలిపిన - రమ్యమవదుకదా
లక్ష్మణ కోపము - లయలు దాటు
వానర మరణము - వినవలసేవుండు
భరతుడు శత్రుఘ్నుడు - భాద తెలుపు
కౌసల్యా సుమిత్రలు - కైకేయి కోపమే
ఇంత వినాశము - ఇప్పుడు జరుగును
నేను వెళ్లినఇక - నేనేమి చెప్పాలి
కనుక ఇక్కడవుండి - కనులు వెతక
తే:: పట్టుకొని కూర్చున్నమనసు ఫలము లేదు
తవ్వుదామని జ్ఞాపకా లన్ని లేవు
వేడి చల్లారిపోతున్న వేగమెవదు
కనులు చెమ్మగిల్లి కదలి కరుణ చూపు .
***
సీ:: నియతెంద్రుడుగనేను - నియమతాపసవృత్తి
జీవిత నాశనం - జీవహింస
దు:ఖమున హనుమ - దూర ఆలోచన
జీవించి యున్నను - జయము కలుగు
రావణునికి గుణ - పాఠము చెప్పెద
ద్యానసోక కులస్వ - దారి లేక
పశువుగా రావణ - పశుపతి ఇచ్చేది
రామ పత్నిని చూసె - వరకు తిరిగె
తే:: దేవతలరాజు ఇంద్రుని ధర్మవర్తి
ఆశ్వ నీదేవత మరుత్తు ప్రార్ధ నులుగ
బ్రహ్మ దేవున్నిఅగ్నిని భజన చేసి
చంద్ర సూర్యులను కొలచి చెక్క వెదక
***
15
సీ:: చివురులుమెరిసెను - చింతయు త్య తగ్గెను
రెమ్మలపైపువ్వు - రంగ రించె
అమరిన చిరుగంట - ఆర్తనాదము వినే
కదలిన శాఖలు - గణగణగణ
పద్మపత్రములుగా - ప్రతిభను చూపేను
ఫలపుష్పముల కళ - పగటి వెలుగు
అందమైన వనము - ఆదరించు తనము
శోభిల్లు శాఖలు - శింశుపాలు
తే:: అన్ని రీతుల అనువైన ఆమె ఉన్న
సీత యని తలచె హనుమ శీఘ్రముగను
సీత పద్మా కరములులే సిరులు వలెను
తరువు శాఖలపై వుండి తపము హనుమ
***
సీ:: మంగళ కారమైన - మనసును దోచేటి
వృక్ష అశోకము - విరియు చుండె
మృగములు పక్షులు - ముందు పరుగులులే
వనచరములు రాలె - వరుస పెట్టి
హనుమ ఆహ్వానము - హారతి వలెను లే
సందేహముయు తీరె - సీత కాంచె
అంనంద ము కలిగె - ఆసమయముననే
శోక సీతనుఁ చూసి - శోక హనుమ
తే:: సీత ప్రాణ ప్రదమని ఏ స్థిరము భక్తి
నదుల వద్దకు చేరియు నయన అయన
నిత్యా సంధ్యాసమయము నే నీటికొరకు
వచ్చు నామెయు ఈమెఏ వనము సీత
***
1
సీ:: గన్నేరు చెట్లతో - గంపెడు ఆశతో
పూచిన మొదుగల - పూలతోను
గుగ్గిల చెట్లను - గుర్తుగా శోభిళ్లు
వజ్రము రత్నము - వలెను మెరియు
అగ్ని శిఖవలెను - ఆర్తిగా వంగెను
కాటుకువన్నెతో - కళలు చూచె
నక్షత్రములవలె - నయనాల విందులు
కైలాస పర్వత - కళలు కమ్ము
తే:: నిర్మలమ్ముగా నున్నట్టి నిజము యదియు
దీనురాలుగు స్త్రీ శక్తి దీక్ష చూసె
ఆమె మలినమైనవి వస్త్ర మాల చూసె
రాక్షస స్త్రీల పరివేష్టి రంగు మారె
***
సీ:: పట్టు వస్త్రముగాను - పచ్చని వన్నె గ
దేహకాంతి వెలుగు - దశదిశలులె
ఆమె అలంకార - ఆకర్ష రహితగా
పొగతోను కప్పిన - సెగల సీత
పద్మాలు లేనట్టి - సెలయేరు లాగాను
ధీనురాలుగనున్న - చింత సీత
భోజనం చేయక - భక్తితోను కృశించి
కన్నీటితో నిన్న - కనుల సీత
తే:: నిజము తెల్పలేని బ్రతుకు నీడ వలెనె
తెల్పినా ఆర్దముగ్రహించు తిష్టలెవరు
నిత్యమూ దు:ఖమును మునిగినదియునులె
వ్యసన ములులేని జీవియు వనిత సీత
***
సీ:: పట్టు వస్త్రముగాను - పచ్చని వన్నె గ
దేహకాంతి వెలుగు - దశదిశలులె
ఆమె అలంకార - ఆకర్ష రహితగా
పొగతోను కప్పిన - సెగల సీత
పద్మాలు లేనట్టి - సెలయేరు లాగాను
ధీనురాలుగనున్న - చింత సీత
భోజనం చేయక - భక్తితోను కృశించి
కన్నీటితో నిన్న - కనుల సీత
తే:: నిజము తెల్పలేని బ్రతుకు నీడ వలెనె
తెల్పినా ఆర్దముగ్రహించు తిష్టలెవరు
నిత్యమూ దు:ఖమును మునిగినదియునులె
వ్యసన ములులేని జీవియు వనిత సీత
***
సీ:: పట్టు వస్త్రముగాను - పచ్చని వన్నె గ
దేహకాంతి వెలుగు - దశదిశలులె
ఆమె అలంకార - ఆకర్ష రహితగా
పొగతోను కప్పిన - సెగల సీత
పద్మాలు లేనట్టి - సెలయేరు లాగాను
ధీనురాలుగనున్న - చింత సీత
భోజనం చేయక - భక్తితోను కృశించి
కన్నీటితో నిన్న - కనుల సీత
తే:: నిజము తెల్పలేని బ్రతుకు నీడ వలెనె
తెల్పినా ఆర్దముగ్రహించు తిష్టలెవరు
నిత్యమూ దు:ఖమును మునిగినదియునులె
వ్యసన ములులేని జీవియు వనిత సీత
***
సీ:: పట్టు వస్త్రముగాను - పచ్చని వన్నె గ
దేహకాంతి వెలుగు - దశదిశలులె
ఆమె అలంకార - ఆకర్ష రహితగా
పొగతోను కప్పిన - సెగల సీత
పద్మాలు లేనట్టి - సెలయేరు లాగాను
ధీనురాలుగనున్న - చింత సీత
భోజనం చేయక - భక్తితోను కృశించి
కన్నీటితో నిన్న - కనుల సీత
తే:: నిజము తెల్పలేని బ్రతుకు నీడ వలెనె
తెల్పినా ఆర్దముగ్రహించు తిష్టలెవరు
నిత్యమూ దు:ఖమును మునిగినదియునులె
వ్యసన ములులేని జీవియు వనిత సీత
***
సీ:: పట్టు వస్త్రముగాను - పచ్చని వన్నె గ
దేహకాంతి వెలుగు - దశదిశలులె
ఆమె అలంకార - ఆకర్ష రహితగా
పొగతోను కప్పిన - సెగల సీత
పద్మాలు లేనట్టి - సెలయేరు లాగాను
ధీనురాలుగనున్న - చింత సీత
భోజనం చేయక - భక్తితోను కృశించి
కన్నీటితో నిన్న - కనుల సీత
తే:: నిజము తెల్పలేని బ్రతుకు నీడ వలెనె
తెల్పినా ఆర్దముగ్రహించు తిష్టలెవరు
నిత్యమూ దు:ఖమును మునిగినదియునులె
వ్యసన ములులేని జీవియు వనిత సీత
***
సీ:: శోకజలధి పడి సొమ్మ సిల్లిన సీత
పుణ్యము తిరిగిరాక పుడమి నందు
ఏకాంత శాంతము ఏమి కానకవుండె
అలివేణి జఘనము ఆశ గుండె
చిక్కిన వనితను చెట్టున గాంచెను
రాక్షసవనితల రంగమందు
కృంగి కృశించిన కౄరులతో సీత
ఉపవాసము తోను ఉండియుండె
తే:: చెట్టు క్రింద రోదన చేయు చింత చూచి
హనుమ చిత్తము చెలించె ఆక్షణమున
సీత సొమ్ములు గాంచెను శీఘ్ర హనుమ
కర్ణ వేష్టములు మణులు కాంచె హనుమ
***
గగన మార్గముననే కర్ణకఠోరుడు
సీతాపహరణం చింత సమయ
కష్కిందపైయాన కీచులాటయందు
జానకి నగలనే జారవిడిచె
అందుచూచినవియే అమ్మయందునలేవు
ఇందుయున్నవియన్ని ఇచటనగలు
రాముడు చెప్పిన ఆభరణములను
వదిలిన సీతయే వస్ర్తమదియు
తే
దేవిరూపము తలపులుదీక్ష గనులే
దేహ అవయవాలు అటులే
దీపము గాను
రామచంద్రుని తలచుచూ రమ్య సీత
ప్రేమ మిక్కిలి సంతాప ప్రియుని పైన