Monday 19 September 2022

 17 వ సర్గ సుందర కాండ 

 

సీ:: నీల వర్ణముగల నిగనిగ మెరుపులు 

      జలములో హంసలు చకచకచక 

      చంద్రుడు నిర్మలం చెలిమిగా వాయువు  

      సీతల కిరనాలు స్వేచ్ఛగాను 

      పూర్ణ చంద్రుని మోము పుడమిని తాకుతూ 

      శోకమై  కృంగుచూ శోక సీత  

      బరువు నావల సీత భారము యగుటఏ     

      రాక్షస స్త్రీలతో రక్ష లేక 


తే:: అందరూ,రాక్షసులుమధ్య అదిరె సీత     

      మనసు లోదుఃఖ మున సీత మేలు లేక   

      లేదు సంతోషము అపుడు దీక్ష సీత   

      కారణం భర్త తలపులే కాని స్థలము 

                   ***

సీ:: ఒక కన్ను,పెద్దదై ఒక చివి చిన్నదై 

      చేతులే లేనీదై  చెవులు లేవు 

      తలలోన ముక్కులు తలవెంట్రుకలనిప్పు 

      దీర్ఘమై కార్ణాలు దీర్ఘ పొట్ట 

      పొడవుగా  కంఠము పొట్టిగా కాళ్ళు 

      దట్టమై రోమాలు దట్ట కొమ్ము 

      వ్రేలాడు పెదవులు వికటరాక్షసులుగా             

      మరుగుజ్జు రాక్షసీ మంత్రగత్తె 

 

తే: ; శాంతి స్నేహ ప్రీతిగ ఓర్పు సమయ మందు 

       జీవితములోన కష్టాలు జయము కొరకు 

       బ్రతుకున వ్యథలేఉండె భయము సీత 

       నేర్చుకొన్నమర్యాదతో నియమ సీత  

                 ***

సీ:: తనువంతయునవేళ్ళు తాపపు చూపులు  

      ఏనుగు కాళ్లు ఏ ఎదన భయము   

      పులులుగా పోతులు పుట్టుగుడ్డి గలిగి 

      గాడిదా ముఖమేను గోల చేసె 

      చూసె గగుర్పాటు చూపుల రాక్షసి 

      నల్లగా, అతి లావు నంగ నాచి     

      కలహాప్రియులతోన  కోపాల రాక్షసి 

      గుర్రపు చేవులవాల్లు గుర్రు పెట్టె 


తే:: ఓర్వ లేక కళ్ళు కలిపే వంత పలుకు 

      కొన్ని వెగటు మాటలతోను కొంపముంచె 

      గుండెనే గాయమును చేసి గోముఖముఎ 

      వినెను రాక్షసి పలకులు విధిగ సీత    

            ****       


శ్రీ సీతాదేవి గురించి హనుమంతుడు విలపిస్తూ పాటను తలచేను చెట్టు నుండి  
 
తనువీయది నీదు భిక్షయే 
నను జూడవేలకో మాతా  
కను లీయవి నిన్ను జూడఁగా 
మది నిండు డెందమేమాతా

మన మియ్యది నీనివాసమే 
మధురేందు హాసినీ మాతా   
వినవేలకొ సుందరాంబికా 
అమృత గీతి నిప్పుడే మాతా

వరవీణను మ్రోఁగనీయుమా 
మృదు నాదభూషితా మాతా
అరవిందపు మోము సూపుమా 
హంసార్జునవస్త్రధారిణీ మాతా

కరమందలి పుస్తకమ్ములో 
కావ్య సార మీయుమా మాతా
చరణంబులఁ బుష్పమాలతో 
శ్రీ మది భక్తిఁ గొల్తు నేన్ మాతా

***
ఒక పాటను బాడగా హనుమా
   
సీత నుత్సాహము పొంగి పొర్లఁగా
సుకమౌనది వీను కింపుగా 
సీత శోభించును సుందరమ్ముగా
మకుటమ్ము వసంతవేళగా  
సీత మందానిల మిందు వీచఁగా
సకి రమ్మిట రాత్రి నిండఁగా 
సీత సానందపు సంగమమ్ముగా 
తల చేనులె తృప్తిగా హాయిగా 

రఘురాముని తల్చియే మదీ రమ్యమ్మును పొందె     
సుఖమాయను ప్రేమయే మదీ సంతోషము పొందె
వినయమ్ముగ మారెనే మదీ విశ్వాసము పొందె
మదిశాంతము అప్పుడే సుఖీ మాధుర్యము పొందె
***
18 వ సర్గ 

సీ:: రాత్రిగడిచి పోయె రాక్షషుల్లో నిద్ర 
      చివరిజామున లేచి చేయు ఘోష  
      మంత్రాలను చదివే మంగళ వాధ్యాలు 
      బ్రహ్మ రాక్షషులు భజన చేయ  
      సుప్రభాతముతోను సుఖరావణుఁడువచ్చె 
      జారిపోవు వస్త్రము చేతబట్టి 
      సీత స్మృతికి వచ్చె సీతయందున ప్రేమ 
      వృక్షముపైననే వుండే హనుమ 

తే: మన్మదుని ప్రేరణలుఉండె మంద బుద్ది 
      కాలముకు లొంగి పోయిన కాల యముడు 
      సీతయందు లగ్నము కాగ గీత మారె 
      సకల విధములై రావణ సీత కోరె 
              ***     

సీ:: పుష్పమాలధరించి పూర్తి రావణుడొచ్చె    
      వెనుక స్త్రీలు నడుచు వేగిరపడు 
      బంగారు దీపాలు బలసిన స్త్రీలతో 
      వింజామరలతోను, విసురు వారు 
      శ్వేతచ్చత్రముతొ స్త్రీ స్వేచ్ఛగా కదిపేను 
      దేహమ్ము చవటతో ధీన స్త్రీలు 
      హారములు కదిలే - హాయివదలి వచ్చె
      మద్యపాన మత్తున  మగువలుండె 
    
తే:: సీతపై మనస్సుకలిగి చిన్నగొచ్చె
      పౌరు షమ్ కలరావణ మౌన ముండె   
      కామదేవునిబోలిన వాడు అతడు 
      వాయుపుత్రుడు వారిని కంచె నపుడు     
               ***
  త్రిపది: మూడు పాదాలలో 4ఇంద్ర, --2 ఇంద్ర 2 సూర్య
2 ఇంద్ర 1 సూర్య, ప్రాస నియతము, యతి నియమం లేదు.

ఊహింప లేనట్టి ఊహల పౌరుష0 
కాంచనీ ధ్వనులతో కధలు కదిలె 
తెల్లని వస్త్రపు తేజ 

రూప యవ్వనముతో రావణ నడుచుచూ 
విశ్రవసుని పుత్ర విజయ నేత      
రావణు తేజము గాంచె హనుమ 

శ్రీసీత నీసేవ నొసగుమా నిరతమ్ము
దేహియనుచు నిను గోరు చుంటి,
పాహిమాం కరునించు సీత 
***
20***
సీ::  పద్మ నేత్రనుచేరి పడిపడే రావణా
        నాచెంత నీకెలా  నటన ఏల
        ఎక్కడి రాముడు ఎక్కడిది అయోద్య
        ఎందు వల్లభయము ఏలదీక్ష
        వనవాస వ్యధలు యే విడువ వలే,యికా
       నవయవ్వనం గల నయనసీత
       ముని వేషము విడిచి ముందు భోగము చూడు
       అని రావణ పలుకు పలికి నిలిచె.

తే:: మోహ నాంగి సిగ్గెందుకు మోహమిదియు
       చేసి కొందుఅర్దాంగిగా చెప్ప వేమి 
      లేరు ఇందెవ్వరు భయము లేకనుండు
      రావణుడు బీకరపలుకు రాత్రి వేళ
               ***
సీ::  దాచుకొనకు మోము దాపరికం ఏల
       నీ అందముయె నన్ను నిలవనీదు
       పరకాంతను హరించి పరమ సౌఖ్యము ఇచ్చు
       మా కులమంతటా మాట తీరు
       మాసిన సీతయు మనస్సు మౌనము గుండె
       ఉపవాసమున సీత ఊరకుండె
       కామాంధుడై పల్కె కాళరాత్రి కొరకే
       అని రావణా పలుకు పలికి నిలిచె
 
తే:: నేలపై పరుండి జననీ నింగి చూపు
       దీని మైన స్వరము తోనుదీక్ష అనెను
       సముఖ విముఖమను,చుండె చెప్పలేక
       మాటలేని మూగపలుకు మంత్రమగుటె
               ***
సీ::  జానకి రాములు జతచేయు లక్ష్యమైన
        రామచంద్ర సతిని ప్రేమ ఏల        
       శ్రిత జనపాలుని శీఘ్రము కలసియు
       శరణు వేడుము నీకు శక్తి కలుగు
      మన్నించమని తెల్పి మనుగడ సాగించు 
      రవి లేని కాంతి గా రాజ్య మేల 
     దీని స్వరముగను దీర్ఘ ఆలోచన
      రావణతో సీత రౌద్ర పలుకు 

తే:: రామలక్ష్మణ లేని ఆశ్రమము చేరి
       అపహరించితివే నీవు ఆశ తోను         
       గాలికి చెదిరే శునకముగా పారిపోతి
      పురుష సింహాలు చూడకే పువ్వు తెచ్చె
            ***
 సీ:: ఓ రావణావిను ఓ వైరమేలను
      రాముడు మన్నించు రాజ్యరక్ష
      అనుగ్రహింపమనియే అడుగుము రావణా
      కోరి ప్రార్దించుము కరుణ జూపు
      తృణము కన్నా హీణ రావణా నీవులే
      అని పల్కె సీత ఆసమయము
      రావణ డంధుడై రౌద్రము గర్జనే
     చేసి కోపముచూపె చింత సీత

తే:: అంత జానకి మూర్ఖుడా యింత సేపు
      నీ హితవు గోరి చెప్పిన నీతు లెల్ల
      పెడచెవిన బెట్టి సిగ్గును విడిచిపెట్టి
      పాడు చుంటివి మరలనీ పాతపాట
                    *** 
21 వ సర్గ సుందర కాండ (వాల్మికి రామాయణములోని 34 శ్లోకాల  తెలుగు వచస్సు)
("నీవు రామునితో పోల్చుటకు కూడ తగని తుచ్చుడవు " అని నిదించుచూ సీత రావణునికి భోదించుట )

సీ:: రాగంతొ కూడిన రమ్యమైనది ప్రేమ 
      రాగరహిత ప్రేమ రమ్య మవదు   
      ఇది ఏల ఒక్కరి ఇష్టమగుట ఏల   
      రాముడు నావాడు మాట వినుము  
      ప్రేమఏ ప్రియునిపై ప్రీతి సంబంధము 
      ప్రేమ అనుకునేది ప్రియుని తోను  
      ప్రేమేను రామపై పిచ్చిఏ రావాణా   
      అనిపల్కె నులె  సీత ఆత్రము గను
  
తే:: వ్యక్తి హింసచేయుట ఏల వలదు నీకు 
       వ్రతము నున్నదాన్ని తగదు వాద నేల  
       ప్రేమ లేనిచేటపలుకు ప్రీతి ఏల
       ప్రేమతత్వము రావణా పాప మిదియు   
                  ***
సీ:: ప్రేమ పూర్వకముగా నెమ్మది గా పల్కి
      రాముని ధ్యానమే నాకు రక్ష   
      భర్త కొరకు రోద భయముచే బాధయు 
      దీనమైన స్వర దీనురాలు 
      మలినమైయున్నాను మనసుతిప్పుకొనుము 
      ఒక గడ్డి పరకను పెట్టి ఉంచె 
      వణకుచు తల వంచి వలదు ఆశయు నీకు 
      నీ భార్య పైననే నీదు ప్రేమ 

తే:: భార్యలనుసుఖ పెట్టుట భాద్యతేను 
       పాప కర్ముడై సిద్ధిని పొంద లేడు 
       నీవు నన్ను కోరుట ధర్మ మేళ నీకు 
       రావణుని వైపు  'వీపు ను ' పల్కె సీత     
                  ***  
సీ:: ఉత్తమ వంశము ఉన్నత రాజ్యము  
      సజ్జన ధర్మము సెప్ప లేవు 
      రక్షింప వలెనీవు రమ్యపర్చెడి బుద్ధి 
      ఉపయుక్త మగుటేల ఊయలేల     
      చపల స్వభావుడా చంచల బుద్ధియే 
      సత్పవర్తన లేక చూపు ఏల 
      మూర్ఖముగాయుండి మోహమ్ము నీకేల      
      జనకుని కూతురు జరిపె వాక్కు
    
తే:: రావణా నీ పాపము వళ్ళ నాశనమ్ము 
      చేయు పనుల వల్ల సమయం చింత చేయు 
      పాపకర్మ వినాశము భీతి చెందు   
      సకల భూతములు అభి నందించు నిన్ను 
                       ***

సీ:: యుక్త వివేకము యుక్త పండితులేని 
      హిత వాక్యములు తెల్పు హితులు లేని  
      రాక్షసుల వినాశ రాజు అమార్గము
      ఐశ్వర్య సంపద ఐక్య మగును 
      నీ అపరాధము ఈ లంక నాశనం 
      లంక వాసుల శిక్ష లయకరమగు  
      రత్నరాశులన్ని క్రాంతి విహీనమై 
      ధీర్ఘదృష్టియు లేని దుష్ట రీతి 
  
తే::  నేను ధనముచేఆకర్షి తమతి కాను 
       సూర్యు కాంతిలా రాముని సతిని నేను 
       బ్రహ్మ చర్యవ్రతముననే బడయు నేను 
       ఈ సమావర్తన వ్రతము ఇష్టి నేను 
             ***
సీ:: లోకమర్యాదగా లోకనీతి తెలిపే 
      జీవించ దలచిన చెలిమి చేయి
      మైత్రి పొందిన నీకు మైకము తొలగును 
      మరణమును జయించ మంచి చేయు 
       రావణా చూడమా లంకా దహనముగా  
      సర్వ నాశనమునే చేష్టలాపు 
      ఇంద్ర వజ్రాయుధ నీ చావు ఆపినా 
      రామ బాణము నిన్ను మట్టు పెట్టు 
       
తే:: కుక్క పెద్ద పులి ఎదుట కూలబడుట 
      సూర్య ఉదకమును హరించు చూడు ఇపుడు 
      అన్నదమ్ములను జయించ ఆశ వదులు   
      పారి పోలేవులే రామ భాణ దృష్టి  
             ***

 22 వ సర్గ (వాల్మికి రామాయణములోని 46 శ్లోకాల  తెలుగు వచస్సు)
("రావణుడు సీతకు రెండు మాసములు గడువు ఇచ్చుట, సీత రావణుని నిందించుట, రావణుడు సీతను భయపెట్టి ఆమెను రక్షించు చుండ వలసినదిగా
 రాక్షస స్త్రీలను ఆదేశించుట, 
స్త్రీలతొ కలసి అంత :పురమునకు పోవుట ")    

సీత పలికే 
సీ:: పరుష మాటలు వళ్ళ బదులు పల్కు సీత 
      లోకములో స్త్రీల లయలు చూడు 
      ప్రేమగా పల్కిన ప్రియము చందను లేరు
      కామచూపులు ఏల కామ్య మందు     
      చెడు మార్గ మైనను  చేష్టలు ఏలనూ 
      కల్గిన కామము కాల పాము  
      రావణ వినమ్రత రమ్యత కొరకునే  
      రాక్షస మాయలు రాజ్య మేలు 

రావణుడు పలికే 
తే:  స్నేహముయు ప్రేమ కల్గును సిగ్గు ఏల 
       కామమే గుర్రమైనను కాంక్ష ఆగు  
       నేను కామాన్ని నినుకోరి నిగ్రహించె 
        రామ అనురక్తి కోరుట రమ్య మవదు  
          ***
సీ:: క్రోధము తో తెల్పె భోగమంతయునీది
      పాలింప వలెనీవు పగలు రాత్రి  
      భర్తగా వలదన్న బక్షనం చేసెద
      రెండు మాసములేను నేటి నుండి    
      గడువు తీరిన వెంట నాశయనముపంట 
      లేక ముక్కలుగాను చీల్చి తినెద     
      సీతను భయపెట్టి శీఘ్రముగ తెలిపి 
      ఆజ్ఞ మనసు మార్చు ఆట కాదు 
    
హనుమ చెట్టునుండి అనుకొనే 

ఆ:: లేశమైన జాలి లేనికసాయికి 
       మేక గోడు చెవికి సోక నటుల 
       కరుడు కట్టినట్టి కామాంధునకు సీత 
       కంటి నీరు మెటుల కాన పించు?
              ***

రాక్షస వనితలు పలికే సీతతో 

సీ:: సీతను ఓదార్చె స్త్రీలు పెదవులతో
      బలగర్వితమనేటి భజన చేయు 
      తేజస్సు అమితమై తిరిగేటి రావణా
      ఎదిరించలేరులే ఎవరు ఇపుడు 
      ఓ అనార్యుడగాను ఓరాముడతడులే 
      ప్రేమను మానుము ప్రీతి కలుగు 
      స్థితి హెచ్చుతగ్గులు స్థిరములేనిమనిషి 
      రావణుని ప్రేమ డ్రాక్టి కట్టు 
  
 సీత పలికే 
తే:: రామునికి భార్యగానుండి వాక్కు తెలుప 
      రాక్షసాధమా శిక్షఏ రాగలదులె  
      చూచు కళ్ళు ఉయ్యాలగు చూడలేవు 
      గజము వంటి ధర్మాత్ముడు కూడ రామ 
              ***
సీ:: రావణాశురిని వర్ణనగ శరీరము  
      భుజములు, కంఠము బలము కలిగి 
      నడక సింహమువలే  నేత్రాలు మండుచూ 
      అతని కిరీటము అద్భుతమ్ము  
      శివ భక్తి వల్లనే  శక్తి, కలిగి యుండె  
      ఎర్రని వస్త్రము ఎర్ర పూలు  
      వాసుకీ సర్పము వడ్డాణము కలిగి  
      పర్వ తాళభుజాలు పడక యందు 
  
తే:: పుత్తడి కడియముమెరుపులు పున్నమికల   
       కల్పవృక్షమువలె ఉన్న కామపరుడు 
       భూషణాలు ధరించియు బుద్ది లేదు 
       సూర్యు డి వలెను ఎర్రగా సూత్రధారి  
                 ***
సీ:: ప్రేమలేకున్నను ప్రేమపొందనులేము  
      తాపము కల్గును తప్పు కాదు 
      కామము క్రోధము కామించ లేకయే 
      స్త్రీతో పురుషుడుగా రావణ కళ
      రావణ వాక్కలు ద్యానమాలిని మేఘ
      కన్నురావణుఏను కౌగలించె     
      ఎర్రని నయనాలు ఎర్రగా మారెను 
      గంధర్వ కన్యలు కలసియే నడిచెను 
      భూమిని కంపింప భూతరాజు 

తే:: సీతతో నీకు ఏమియు సుఖము కల్గు 
       స్తనములుగల స్త్రీ సీతతో సొంగకార్చి 
       బాహు బలమురావణుడివి బాధఏల
       ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభల గీత 
       ***
23 వ సర్గ సుందరకాండ 

రాక్షస వనితతో సీత తో తెల్పుట 

సీ:: సర్వదృష్టియు సీత సంతసించె విధము
      దశకంఠ ప్రేమగా దరిన యుండె  
      రాణులందరిలోన  రాణిమహారాణి 
      రాణింపు రావణ రాణిగాను   
      మండోదరిని కన్న మంచిగా చూడునూ 
      క్రోదమ్ము మానము క్రొత్తగాను  
     ప్రియతమభార్యగా ప్రేమను పంచుము 
      నీభాగ్యమగుటయే నీదు రక్ష  

తే:: అంతటి యశో విశాలుడు ఆదు కొనును  
      రాక్షస వనిత లందరు రాజి తెలిపె   
      విశ్ర వసునిసుతుండుగా విజయ రాజు 
      బాహు బలవీర్య ధీరుడు భామ ప్రియుడు 
                   ***      

సీ:: కోపిష్టిగా మీద ఘోరవాక్యాలుగా 
      దేవేంద్రుని జయించె ధీరుడతడు
      సంపన్నుడుప్రభువు సంపదతోనుండె 
      భార్యలను వదలె భాగ్యశాలి 
      ఐస్వర్య సంపద య్యినవాడు దశకంఠ
      దుర్మిఖి రాక్షసి బోధ చేసె   
      ఆరాధనులుగాను అరుగుదెంచి తెలిపే 
      దీర్ఘ నెత్రములతో దీనమాలి

తే:: ఎవనియోక్క భయమువలన ఏమి అనక         
      వృక్షములు పుష్పలను ఇచ్చు కృపగలిగియు 
      మేఘములు వర్షములు నిచ్చి మేలు చేసె  
      ఋతువులన్ని నిత్య వసంత రావనింట  
               ***
 24వ సర్గ
సీ:: మూడు లోకములలో ముఖ్యమైన ప్రియుడు 
      రాక్షసత్వముఇదే రావణచెర   
      ఐశ్వర్యమును పొంది ఐహిక సుఖము పొందు 
      రాజును ప్రేమించు రాముడేల 
      గౌరవమర్యాద గోప్యముగానుండు 
      ప్రేమను మార్చుము రావణగతి 
      పొందుము సుఖమును పోరుఏలనిపుడు   
      ఓ సుమంగళి ఓర్పు ఓటమియగు 

తే:: విలువగల శయణాలన్ని పిలుపు లాయె 
       ఏల వప్పుకోవు ఇదియు ఏమి జరిగె  
       రాక్షసస్త్రీలు సీతను రంపకోత  
       పరుషములగు మాటలువళ్ళ పలికె సీత 
    
                ****

సీ::భాగ్య సంపద సీత భాదను తెల్పెను 
     దేవేంద్ర సతిలాగ ధీరమగుట  
     రోహిణి చంద్రుని సేవించు నట్లును
     శ్రీమతి-కపిలుని సేవలవలె 
     సతిగ లోపాముద్ర సేవ అగస్త్యుని
     మాత అరుంధతి మాకు రక్ష  
     నలుని సేవించిన నాయికా దమయంతి   
     మదయంతి సౌదాసు మహిమ చూడు 

తే::సత్యవంతుని సావిత్రి శక్తి లాగ  
      సూర్యుని సువర్చలవెలుగు సూత్రమాయె 
      కౌశిని కడలి సేవించి కామ్య మగుట 
      నిత్య శ్రీరామచంద్రుని నియమ భక్తి 
                  ***

సీ:: చెప్పిన మాటలు చేయకనేమియు 
      హృదయము పెకలించి హారతియగు 
      క్రూరదర్సనయగు శూలము తిప్పుచు 
      బిత్తరి చూపులు భీకరమగు  
      భయముచే కంపించు భామస్థనములన్ని 
      సీతను చంపేద శీఘ్రముగను 
      తినవలేనని గోప్ప తీటగనుందియు 
     తె0డు గొడ్డలి చంపి గోరు ముద్ద
  
తే::ఈమె యోక్క మహోత్తర ఇచ్ఛమార్చి 
     వక్షమును మరో రాక్షసి వేడి చేసి  
     రాక్షసి అవయవములను రకము తీసి  
     స్త్రీల కోరికలు బయట పెట్టె నపుడు 
                 ***


 25వ సర్గ (వాల్మికి రామాయణములోని 20 శ్లోకాల  తెలుగు వచస్సు)
(" సీత రాక్షస స్త్రీల మాటలను తిరస్కరించుట, రాక్షస స్త్రీలు సీతను భయపెట్టుట, సీత శోకార్తయై విలపించుట ")    

 25వ సర్గ  సుందరకాండ 
సీ:: పరుషముగాపల్కు పెద్దగా రక్కసి 
      సౌమ్యస్వభావము సాకుఏల  
      ఏంతో భయపెట్టు స్త్రీ ఏమిచేయని సీత 
      మిక్కిలి భయముతో మీరకుండె 
      సహృదయరాలగు సమయాన వైదేహి
      కన్నీటితో పల్కె కాల మాయ 
      మనుష్య స్త్రీ భార్యేల మతిలేని పలుకుఏ 
      మీ మాట ఒప్పను ప్రేమ ఏల  
  
తే::రాక్షసునికి భార్యేలను రభస ఏల  
     సీత సోకార్తియైనది చేయలేక 
     శాంతి లేనట్టి బెదిరింప శాపమాయె 
     వీడి తోడేళ్ళ ల్లకుచిక్కి విషమగుటయె     
     ***

సీ:: మిక్కిలి కంపింప మేలుచేయనులేక 
      ముడుచుకొని యెనుండె ముంపు ముందు 
      భర్తను ద్యానించె భార్యయగుట మేలు 
      సీత శోకముతోను చెప్పుచుండె 
      కన్నీటిశ్రావము తడిపెను స్తనములు   
      గడగడ వణకేను గతియు లేక
      సీత రామునిగూర్చి చింతించు చుండెను 
      పాలిపోయిన ముఖ పడతి సీత 

తే:: ఆమె దుఃఖముతో నుండి ఆశతోను  
      కార్చు చుండెకన్నీరును వ్యాకులతగ 
      భర్త్ర వివైయ్యోగ భాదతో భార్య సీత
      మనసు శోకముచే రామ మంగళమ్ము  
                ***

సీ:: క్రూరురాండ్రగువారి కూడుమాటలువినక 
      మృత్యువు కొరకునే ముందు పిలుపు 
      వాయువేగహతమై వాదము చేయక 
      అల్పము పుణ్యము ఆట ఇదియు 
      పద్మ దళము వలె  పలు నేత్రములుగాను 
      సింహము బోలిన నడక కలిగి   
      ప్రియవదికృతజ్నుడు ప్రియుడైన రాముడు 
      సామాన్య స్త్రీ వలె సాహన ముంచ   

తే:: నేను నీటిలో మునిగిన నిప్రియదర్శిని 
       నేను జీవించ జాలను నీవులేక    
       పూర్వ జన్మము పాపపు స్ఫూర్తి ఇదియు 
       నాకు మరణించ వలెనని నాశ ఇదియు 
              ***

సీ::  అల్పపుణ్య ఫలము అనుకరమ్ లేనిదై
        చెప్పు కొన మనసు శ్రేష్ఠ లేవి 
        పద్మ దళములుగా పలికెడి నేత్రాలు 
        విక్రాంత సింహము విజయ మేది
        ప్రియసఖి ఆయనను ప్రగతి లేని బ్రతుకు 
        అదృష్ట వంతులు ఆదుకొనును 
       విషము తిన్నను వివరము తెలియదు 
       కష్టములున్నను కాల మాయ 

తే:: గొప్ప శోకముతో బాధ కోలు కొనక      
       రాక్షసవనితల కళలు రాజ్య మేళ  
       స్వేచ్ఛ ననుసరించ బ్రతుకు సేతు వేది 
       జీవితమ్ము త్వజించుట వీలు ఏది   
         ***
26వ సర్గ (వాల్మికి రామాయణములోని 51 శ్లోకాల  తెలుగు వచస్సు)
(" సీత శోకార్తయై, ధీనముగా విలపించుచు ప్రాణములు విడువ వలెనని నిశ్చ యించు కొనుట ")    

సీ::  గొప్ప శోకముతోను కోలు కొనక  
        రాక్షస వనితల రాజ్య మేళ ? 
       స్వేచ్ఛ ననుసరించ సేతువేదిబ్రతుక 
        జీవత్వజించుట వీలు ఏది ?    
        కన్నీళ్లుగలసీత కళలతో తలవంచి 
        నేలను తట్టుచూ నీడ యడిగె?
        నలువైపు వనితల  నయనాల చూడగా   
        భయ కళ్ళు తిరిగేను బాధ తోను 

తే:: రాముడే లేనట్టి సమయ రక్ష ఏది ?
        నన్ను మూర్ఖుడు తెచ్చెను నయన లీల 
       భ్రాంతి నొందిన చిత్తమే బంధ బ్రతుకు 
       నాకు విలపించే మార్గమే వీధి ఏది ? 
                    ****
సీ:: ధనమున్నను ఏమి ? ధర్మమ్ము కనలేరు
       పుత్తడి భూషనం పుడమి కేల?
       హృదయాపాషాణము హృదయశాంతియు ఏది?   
       పాపజీవితము ఇది బతుకు టేల? 
       తనమహత్యముతెల్ప తలపు గురువులేడు?
       రావణ ప్రేమయే రంగు మారు 

తే:  నన్ను ముక్కలు చేసినా అగ్ని యందు 
       భస్మమన్నను దేహము బాధ లేదు?
       జాలియుఅదృష్టముయు లేక ప్రాణమున్న 
       రాజ్య రావణకు హితము రాదు లేదు? 
                       ****
సీ:: రామ లక్ష్మణులకు రహదారి తెలియక  
      ఈ భూమి యంతయు వెదక గలుగు 
      శోకంతొ చాలించ  దేహమే కష్టమై
      నాభర్త ఇప్పుడే  నాకొరకు వెదక వచ్చు  
      శ్రీ రామచంద్రుని శీఘ్రదర్శనమగు    
      స్వర్గంలొ చూచును దేవతలగు   
      ధర్మకాముడుగాను థీమంతుడగునులే 
      రామచంద్రడుగాను రాజర్షి యును 

తే:: ఈ ప్రియా ప్రియముల శస్త్రత్యాగముగను
      ధీర్ఘబాహు శూరుడుగాను దివ్య వెలుగు 
      పూజ్యుడైన రాముడుపేక పూజ లేదు 
      కంద మూల ఫలాశము కలలు తీర్చ  
 
                       ***

సీ:: శత్రు నాశకుడును శస్త్రత్యాగము చేయు 
      సత్యనిష్టులు సుభలక్షనాలు 
      మునులు ధన్యులు గదా మనసు జయించిరి 
      దు:ఖము కలిగించు దూర మేది
      వైరాగ్య భావము వైనతీయ మనసు  
      ధర్మమార్గంలోన ధరణి ఏది
      ధైర్య జితేన్ద్రులు దారిచూపు మనసు 
      ప్రియ అప్రియములు  తెలియ కుండు
 

No comments:

Post a Comment