Thursday 1 September 2022

 ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం

శ్రీ మాత్రే నమ: *** శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:  ***    ప్రాంజలి ప్రాభ        

సర్వేజనా సుఖినోభవంతు ***  ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:


 ప్రాంజలి - సుందరకాండ - తెలుగు- వచస్సు 

అథ: సుందరకాండ ప్రారంబ: - ప్రధమ: సర్గ:

210 సంస్కృత  శ్లోకాల ఆధారముగా తెలుగు- వచస్సు    

O -- O -- O

నుమంతుడు సముద్రమును లంఘించుట, మైనాకాకుడు అతనిని గౌరవించుట

సురసను హనుమంతుడు ఓడించుట, సింహికను వధించుట

దక్షిణ తటముచేరి అచట లంక శోభను చూచుట 

హనుమంతుని - సముద్రలంఘన - ప్రయత్నము

O -- O -- O

జాంబ వంతుడు, వానరులందరు, ఆంజనేయునితో  కలసి, సీతాన్వేషన నిమిత్తం దక్షిణ దిక్కు గాను అంతావెతికారు కానరాలేదు వానర రాజు, ఇచ్చిన సమయం మించినది అప్పుడే దిగులు తో అందరూ ప్రాణార్పణం చేయ తలంచెను।  

అంగదుడు, వానరులతోను కలసి విలపించాసాగెను అప్పుడే కార్యార్ధం జటాయువు అన్న సంపాతి అంగదుని కలిసెను, దక్షిన లంక లో సీత రావణ  చెరలో  ఉందని తెలియపరిచేను  అందరూ కడలి వడ్డు చేరి సముద్రాన్ని దాట తలచెను 

సంపాతి సీత జాడ తెలుప గానె  రెక్కలు వచ్చి వెళ్ళే, వానరులు సముద్రాన్ని దాట గల శక్తి గూర్చి తెలుపె, అంగద, జాంబవంత, వానరుల్లో సంశయము తెల్పి, సముద్రాన్ని దాటుటకు హనుమంతుని  ప్రేరేపణ చేసెను   

తతో రావణ నీతాయాః సీతాయాః శత్రు కర్శనః

ఇయేష పదమ్ అన్వేష్టుం చారణా చరితే పథి 5।1।1

జాంబ వంతాదు లందరూ కలసి హనుమంతుని పొగడెను, రామ నామ జప హనుమంతుడు మహేంద్ర గిరిపై ఉండి, రామచంద్ర అనుచూ ప్రొత్సాహముతో  శక్తిని పెంచుకొని, చారులు సంచరించే మార్గానా సముద్రంపై ప్రయాణమయ్యెను ।   

పచ్చిక బీల్లపై హనుమంతుడు ఆకు పచ్చ వర్ణము తోను, నీటి  బిందువులు వైడూర్యమణులవలె మెరుపులతోను, ఉన్న  జలము పై సూర్య కిరణాల వెలుగు తలుకు గను,  ధీరుడైన హనుమంతుడు మహేంద్రగిరిపై సంచరించెను 

మహేంద్ర గిరి పై చిత్ర వర్ణములు గల ధాతువుల తోను, యక్ష కిన్నర కింపురుష  గంధర్వు దేవత లందరి  తోను,  స్వేచ్చ జీవులుగా సింహాలు,  గజముల సంచారముల తోను, హనుమంతుని  హృదయం లో పరమాత్ముడు వలే ప్రకాశించెను। 

సకల విద్యలు నేర్పిన గురువు గారగు సూర్యనికి నమస్కరించి, బాల్యంలో భాధపెట్టిన దేవతల రాజైన ఇంద్రునికి నమస్కరించి, సృష్టి కర్తైనా బ్రహ్మదేవునకు, సకల భూతములకు నమస్కరించి, హనుమంతుడు కడలి పైగ  గగన సీమలో ప్రయాణం చేయ తలంచెను 

మారుతి తూర్పునకు తిరిగియే తండ్రి  వాయు దేవునకు నమస్కరించి, దక్షణ దిక్కు తిరిగి  శిరస్సు పైకి ఎత్తి ఆబోతువలె ప్రకాశించి, పౌర్ణమి నాడు కడలి పొంగినట్లుగా శరీరాన్ని పెంచి, ।రామ కార్యము కొరకు ఆకాశమార్గమున ప్రయాణించెను  

 పాదాల కదలికకు చెట్లపైన పక్షులు భయపడే, వక్షస్థల ఘాతముతో చెట్లు కూలి పోఏ, సింహ గర్జనకు  అడవిలోన మృగాలన్ని మరణించే, జ్వాలలతో కూడిన అగ్ని నుండి ధూమము బయలు దెరెను 

కొలుచుటకు శక్యము కానంత పెద్దదిగా నున్న శరీరమును పెంచి, చేతులతోనూ, పాదములతోను, పర్వతమును గట్టిగా నొక్కి, పర్వతము ఒక్కసారి ఊగగా చెట్లపైఉన్న పూవ్వులన్ని రాలి, హనుమంతునిపై పుష్పాభిషేకమువల్ల పుష్పముల కొండవలె  ఉండేను 

పర్వతముపై మదించిన ఏనుగులు మదోదకమును కార్చు చుండే, పర్వతముపై ఉన్న ప్రాణులన్నీ వికృతమైన స్వరముతో అరచు చుండే, సమస్త వర్ణ శిలలమద్య అగ్ని పుట్టివర్ణ దూమములు వచ్చు చుండే, 

భూప్రకమ్పనల మద్య హనుమంతుడు బయలు దేరుటకు నిశ్చయించెను 

తొకలపై స్వస్తిక్ చిహ్నములుగల సర్పములు నిలిచే,  విషము క్రక్కుచు దంతములతో శిలలను కరచే, శిలలు అగ్నిజ్వాలకు దగ్ధమై వేయి ముక్కలై ఎగెరే, గిరిపై ఓషధ చెట్లు ఉన్న, శాంతింప చేయలేక పోయెను 

 భూతాలు పర్వతమును బద్దలు చేయు చున్నాయని తలచే, తినుచున్న లేహ్యములు, భక్ష్యములు, మాంసములు విడిచే,  మునులు, యక్షులు,  విద్యాధరులు వారి స్త్రీలతో పైకే ఎగిరే, అణిమా సిద్దులుగల విద్యాధరులు హనుమంతునిచూసి ఆరాధించెను  

మెడలో హారములతోను ,  పాదములకు అందెలతో, భుజములకు దండ కడియములతో, చేతులకు కంకణములతో, విద్యాదరస్త్రీలు ఆశ్చర్యపడుచు, భయముతో తమ ప్రియులతో, విద్యాధరులు పర్వతముపై నిలిచి హనుమంతుని గూర్చి సంభాషించెను 

శోభగల హనుమంతుడు భుజమును,  కంఠంను వంచె, తేజస్సును,వీర్యమును,బలమును, పెంచి ఊపిరి బిగపట్టె, నేత్రములు పెకిఎత్తి, పాదములతో గిరిని అదిమి పై ఎగెరె, మహాబలశాలీ, వానర శ్రేష్టుడు చేతులను చేర్చి సముద్రముపై చేరెను    

 మకరములకు నివాసమైన సముద్రమును దాట దలచె, పర్వతమువంటి శరీరముగల హనుమంతుడు ఒక్కసారి కదలె, రోమములు దులుపుకొని, మహా మేఘము వలె ఘర్జించె, రామునికోరకు, వానరులకోరకు సముద్రముపై లంఘించెను 

రామబాణము వలె మిక్కిలి వాయువేగముచే రావణ పాలిత లంకకు ఎగెదను। అక్కడ సీతమ్మ కనబడనిచో, అదే వేగమున సురలోకమునకు పోయెదను। అక్కడ గూడ సీతాదేవి కనబడనిచో రావణుని బంధించి తీసుకొని వచ్చెదను। ఏదిఏమైనా కృతకృత్యుడనై వచ్చెదను। లేనిచో రావణనునితో సహా లంకను పెకిలించుకొని తీసుకొని రాగలను। అని చెప్పి మిక్కిలి వేగముతో గరుడుని వలె అంతరిక్షమునకు ఎగిరెను। 

*హనుమంతుని సముద్రలంఘనము*

ఆకాశం నుండి   దేవలోకమునకు పోయి అక్కడ సీతను వెదికెద, కానరాని చో లంకకు పోయి రావణ నగరము తో సహా తీసుకొస్తా, ఆకాశం నుండి వానర వీరులందరితో మారుతి అమృత పల్కు పల్కె, గంభీరము గాను జెప్పుచూ నొక్క యూపు లొన సముద్రముపై కెగసెను  

తొడల వేగముతో వచ్చిన గాలికే  చెట్లువ్రేళ్ళతో సహా పైకెగెరే, దూరమునకు పోవు భందువుల్ని పంపి నట్లు గా కొంత దూరము పోఏ, మరలి చెట్లు అన్ని కడలిలో రెక్కలు తెగిన పర్వతముల వలే పడే, మహ సముద్ర మంతా పగటి పూట నక్షత్రాలతో నిండిన ఆకాశంవలె ప్రకాశించెను

హనుమంతుని రెండు బాహువులు పాము పడగలువలే కనిపించే, అతని రెండు నేత్రములు పర్వతముపై రెండు అగ్నిజ్వాల లవలే  ప్రకాశించే, హనుమ వాలము ఇంద్ర ద్వజము వలే ధగ ధగ మెరుయు చుండే,హనుమ  ముఖము సంద్యారాగముతో కూడిన సూర్యబింబము వలె నుండెను

హనుమంతుని  ఎఱ్ఱనైన పిరుదులు బ్రద్దలైన ధాతు శిలల వలె నుండే, హనుమ జంకల నుండి వచ్చే వాయువు మేఘము యురుము వలె నుండే, ఉత్తరము నుండి దక్షణ దిక్కు వైపు పోవు ఉల్కవలే ప్రయాణించు చుండే, రామభాణము ఎంత వేగముగా పోవునో అంతే వేగముగా పోవు చుండెను

హనుమంతుడు  త్రాడును తెంచుకొని పరుగెడుతున్న ఏనుగు వాలే, హనుమ ముఖము చుట్టు తోక ఉండగా సూర్యునివలె ప్రకాశించే, నీడ సముద్రము పై పడి ఒక పెద్ద నౌక వలె కనబడు చుండే, వక్షస్తలమునుండి వెడలిన గాలిచే కెరటములు రెండంతలు ఎగసి పడు చుండెను

 ఉత్తరమునుండే వచ్చే వాయువు హనుమంతునికి ఎగురుటకు  తోడ్పడే, తాకాలని కేరటములు పైకి ఎగిరి పెద్ద గుంటగా ఏర్పడి పైకి ఎగురు చుండే, భూమి యందు ఉన్నసముద్రమును మారుతి త్రగుచున్నట్లుగా కన బడే, హనుమంతుడు ఆకాశమున తలపైకి ఎత్తిన ఆకాశాన్ని  మ్రింగి నట్లుండెను

 ఆధారము లేకుండ  రెక్కల పర్వతమువలె హనుమంతుడు ప్రకాశించు చుండే, మేఘ పంక్తులలోకి పోవుచూ బయటకు వచ్చుచూ గరుత్మంతుడి వలె ఉండే, ఎరుపు, నలుపు,తెలుపు,పచ్చ, మేఘాలల్లో నుమంతుడు ముచ్చటగా నుండే,  హనుమంతున్ని చూసిన \ఋషీశ్వరులు, దేవతలు, గంధర్వులు పరాక్రమమును  ప్రశంసించెను 

కొండంత ఎత్తుగా లేచుచున్న సముద్ర తరంగములను వక్షస్థలముతో 'డి' కొని ఎగిరే, హనుమంతుని తో వచ్చే గాలి, మేఘముల గాలి, సముద్రపు గాలి కలసి భీకర శబ్దముగా  విన బడే, సముద్రములో ఉన్న తరంగాలన్ని భూమి ఆకాశాన్ని తాకు చున్నట్లుగా ఉండే, ఎగసి పడు తున్న సముద్ర తరంగాలను లెక్క పెట్టుచున్నాడా అన్నట్లు దాటు చుండెను 

తిమింగళములు, మొసళ్ళు, వస్త్ర విహీనులయన మనుష్యుల్లా  ఉండే, సర్పములు హనుమంతుని చూసి గరుత్మంతుడని భావించి భయ పడే, హనుమంతుడు ఆకాశములో మేఘముల కన్న ముందుకు పోవు చుండే,

మేఘాలచే కప్పబడుచు బయాకువచ్చు చూ ఉండే , చంద్రుడిలా ప్రకాశించు  చుండెను, అతని నీడ సముద్రము మీద పది యోజనాలతో విస్తీర్ణముగా, ముప్పది యోజనాల పొవుతో ఉండే, దేవ దానవ గంద్రర్వులు పుష్ప వృష్టిని కురిపించే, హనుమంతుని చూసి దేవగణాలన్ని పరమా నందమును పొందెను   

రామకార్యార్ధమై  వేడలుచున్న హనుమంతునకు సూర్యుడు తపించ కుండే, తండ్రియగు వాయుదేవుడు సువాసన కలిగిన  చల్లని గాలిని  వీచు చుండే, సముద్రుడు హనుమంతునకు సహాయ పడనిచో అందరు నన్ను నిందించెదరని తలపోసే, హనుమంతునకు సముద్రుడు శక్తి కొలది సాయపడి కృతజ్ఞతను తెలపా లనుకొనెను

హనుమంతుడు కొంత సమయం అలసట ర్చుకొనుటకే, రామకార్య కోసం పోతున్న హనుమంతునకు అల్పాహారం ఇచ్చుటకు, సముద్రుడు  కర్తవ్యంగా భావించి
సహాయము చేయుటకు,  మైనాకున్ని మారుతికి సహాయం చేయమని సముద్రుడు కోరెను 

మైనాకా హనుమంతుడు సీతాన్వేషణ కొరకు  సముద్రముపై పోవు చుండే,  ఇక్ష్వాకు వంశీయులన్న  అందులో రాముడు నాకు పూజ్యులును పాతాళ  ద్వారము వద్ద ఉన్న నీవు పైకి లేచి హనుమంతునకు సహాయ పడుమనె, త్రిలోక పూజ్జ్యుడైన హనుమంతునికి ఆతిధ్యం ఇవ్వటం మనిద్దరి కర్తవ్యం అనిపల్కెను 
 
  మైనాకా  పూర్తిగా అన్ని దిక్కులు ఎగరగల సామర్ద్యం ఉన్నావు, వానర శ్రేష్టుడైన హనుమంతునికి సహాయము చేయమనకోరె, శ్రీరాముని ధార్మికత్వమును, స్తీతాదేవి  యోక్క పాతివ్రత్యము, పవన పుత్రుని యోక్క కార్య దక్షతను తలచుకొని పైకి లెమ్మనెను 

సూర్యుడు  మేఘములను చీల్చుకొని వెలుగును యిచ్చినట్లు, సముద్రము చీల్చుకొని బంగారు మైనాక శిఖరము పైకి వచ్చె, వృక్ష లతా గుల్మములతో నిండిన మధురఫలాలున్న శిఖరమయ్యేను, నల్లనైన ఆకాశము మైనాక పర్వతము వల్ల ఎర్రగా మారిపోయేను 

హనుమంతుడు పర్వతము అడ్డురావడం విఘ్నమని భావించె, వేగమును రెట్టిమ్పుచేసి హృదయముతో పర్వతమును గట్టిగా కొట్టెను, పర్వతము ప్రక్కకువరగగా  మైనాకుడు హనుమంతుని శక్తిని పొగడెను, వానరొత్తమా పర్వతముపై విశ్రాంతి తీసుకొని ఫలాలు భుజించి వెల్ల మని కోరెను 

 మైనాకుడు హనుమంతునితో వినమ్రతతో విన్నవించు చు న్నాను, నీకు ఆతిద్య మివ్వాలని తలంచి నేను, సముద్రుడు కలసి ప్రార్దిమ్చుతున్నాను, నేను నీకు పినతండ్రిని కృత యుగంలో జరిగిన సంఘటనను తెలిపెదను  

పూర్వము పర్వతములకు రెక్కలు ఉండేవి, మీద పడ తాయని ఋషులు భయపడెను, దేవతలరాజగు ఇంద్రుడిని ఋషులు,  పర్వతముల నుండి రక్షించ మనెను, ఇంద్రుడు వజ్రాయుధముతొ పర్వతముల రెక్కలను నరుకు చుండెను, అప్పుడే నీ తండ్రి వజ్రాయుదానికి గురికాకుండా సముద్రములోనన్ను   పడ వేసెను

ఆ విశ్వాసమును పురస్కరించుకొని నేను నీకు ఆతిద్యమిస్తున్నాను, నీ తండ్రి ఋణము, సముద్రుని కోరిక నీ మూలముగా తీర్చగలుగు తున్నాను, కావున కొంత తడువు నాపై విశ్రాంతి తీసుకొని వేల్లగలవని కోరు చున్నాను, నా యందలి కంద మూల ఫలాదులు నారగించి కార్యమును సాధించ మనెను 

దేవతలలో ప్రధానుడైన వాయుదేవుని కుమారుడవు, వేగము, బలము, బుద్ధి మొదలగు గుణము లున్న వాడవు, నీవు ధర్మమను కాపాడుటకు నిగ్రహ సమర్దుడవు,
నమ్మినవారికి మన:శాంతిని కల్పించిన మహాను భావుడవు।

నీ తండ్రి నాకు చేసిన మహోపకారానికి బ్రత్యుపకారము గాను, ఈ నారేక్కలును నీతండ్రి కాపాడినాడు, నీతండ్రి అంత వాడవు, కావున మహాత్మా సముద్రునకు, నాకు సంతోషము కల్గించమనెను, మారుతి మైనాకునితో మిత్రమా నీ మధుర వినయ భాషలకు సంతోష పడితి ననెను     

    నీ యాదరాభిమానము పొందలేదని చింతవలదనె, ప్రత్యేకముగా ఇంకావేరుగా నాకాతిద్యముతో పనిలేదనె,  ఆతిద్యమిచ్చినట్లుగా భావిస్తున్నాను, నేను లంకకు పోవలెను, నేను ప్రతిజ్ఞ చెసి ఉన్నాను కావున నే మాత్రమును నేనాగ రాదని  మధురముగా పల్కెను  

పర్వతమును తాకి హనుమంతుడు వేగముగా పైకి ఎగిరె, హనుమంతుని చూసి సముద్రుడు మైనాకుడు శుభాశీర్వాదములు నొసగె, దుష్కరమైన యా పనిని జూచి సర్వ దేవతా గణములు సంతోషించె, దేవేంద్రుడు గొప్ప ఆనందముతో మైనాకుని జూచి మెచ్చుకొనెను

దేవేంద్రుడు పలికే హిరణ్యనాభ నీవు చేసిన పనికి ,చాలాసంతోషించితిని నేను, నా వలన నీ కపకీర్తి జరుగదు, నీవు స్వేచ్చగా తిరగ వచ్చు, హనుమంతునకు సహాయ పడిన వాడవై నా భయమును తీర్చినవాడవును , రామ కార్యార్ది యైన వానర సహాయమునకు నే నభయ మిచ్చు చున్నాను 
 
 సురస  హనుమంతుని బరీక్షించ బొవుట*  

నాగమాత అను సురసను  దేవతలు కలసి మాట్లాడే,  నీవు ఒక్క క్షణకాలం హనుమంతుని విఘ్నం కలిగించమనే, నిన్ను జయించి ప్రయాణము సాగించునో, భయముతో వేనుతిరుగు నో చూడాలను కున్నామనే, ఆమాటలకు సురస నేను క్షణకాలం ఆపుతానని దేవతలకు మాట ఇచ్చెను 

సురస రాక్షస రూపం ధరించి పెద్ద నోరు తెరిచి హనుమంతునకు అడ్డముగా, నిల్చొని ఓ వానరా నీవు నాకు  ఆహారముగా దేవతలు నాకు అవకాసం ఇచ్చె, నీవు నా నోటిలో ప్రవేశించి నా ఆకలి తీర్చి, దేవతల కోర్కను తీర్చ మనే, ఆంజనేయుడు సురస మాటలకు యుత్చాహముగా చెప్పే ఈ విధముగా అనెను,  అమ్మా " ఒట్టు పెట్టుకొని చెపుతున్నాను "  నేను రామ కార్యార్ధమై  లంకకు పోవు చున్నాను, మాతా అయోధ్యాధి పతి యైన ధశరధ మహారాజు కుమారుడు శ్రీరాముడు  ప్రతిజ్ఞాపరిపాలకుడై  లక్ష్మణుని తోడను,  భార్య యైన  సీతాదేవి తోడను దండ కారణ్యములలొ బ్రవేసించెను,   ఆ శ్రీరాముడు ధర్మభద్దుడై రాక్షసులతో భద్ధ వైరము గల వాడగుటచే  రావణుడు రామలక్షణులు లేని సమయమున సీతను నపహరించెను । 

నేను రామాజ్ఞచే సీతాన్వేషణ తత్పరుడు నై లంకకు బోవుచున్నాను, సీతాదేవి యొక్క క్షేమవార్తను దెలిసి కొని రామునకు జెప్పి మరలవచ్చి నీ నోటిలొ బ్రవే సించెద, దయతో నన్నిప్పటికి  విడువుము,నమస్కరిస్తూ చెపుతున్నాను, అనివేడు కొనగా ఆ మాటలు విని యా సురస యిట్లు అనెను ।

ఆమాటలకు ఓయీ హనుమంతా నా కడ్డమైన వానిని తినమని బ్రహ్మవరము దానిని నేనతిక్రమించలేను, నీకు శక్తి యున్నచో నానోటిలో ప్రవేశించి పొమ్మనెను 
ఒ సురసా నేను పట్టేంత నోరు తెరువుము, శరీరమును పదియోజనాలు పెంచె, సురసకన్న హనుమంతుడు పెరగగా నూరుయొజనాల  వరకు  పెంచేవిధముగా హనుమంతుడు శరీరమును పెంచె, క్షణంలో అంగుళ రూపంగా మారి సురస నోటిలో దూకి అంతే  వేగముగా బయటకు వచ్చెను। 

హనుమంతుడు సురస నోటిలోనుంచి రాహుముఖము నుండి చెంద్రుడు వచ్చినట్లు వచ్చె, సురస నిజరూపముతొ నాయనా, నీవు సుఖముగా వెళ్లి శుభముగా రమ్ము, నీకు కార్య సిద్దగును, లంకాసౌధముచూసి, నాశనముచేసి, సీతా దేవిని శ్రీరామునితొ గలిపి సిద్ధుడవగు మనెను, హనుమంతుడు సర్వ భూతములు బ్రశంసింపగా గగనంలో వేగముగా పోవు చుండెను  

హనుమంతుడు - సింహికను జంపుట ఆకాశము నందు పక్షులు, కైశికాచార్యులు,హంసలు సంచరించు చుండె, సింహ, పెద్దపులి, ఐరావతములు మీద దేవతలు సంచరించు చుండె, సర్పములు లాగా విమానాలు మహావేగంతో ప్రక్కన సంచరించు చుండె,  ఆకా ఆకాశంలో అగ్నిగోళాలు డీకొన్న శబ్ధాల్లో హనుమంతుడు పయనించెను 

దేవతల కోరకు హవిస్సు మోసుకొని పోవు అగ్ని కనబడు చుండె, గ్రహములు, అశ్విన్వాది నక్షత్రములు, సూర్యునివలె  ప్రకాశించు చుండె, మహర్షులు, గంధర్వులు , నాగులతోను, యక్ష కిన్నరు లతో నిండి ఉండె, హనుమంతుడు  సంచరిస్తున్నప్పుడు ఆకాశం చాందినీ గుడ్డవలె నుండెను

ఆకాశ మర్గము పోవుచున్న మారుతిని సింహిక చూసె, చాలాకాలము తర్వాత మంచి భోజన మని ఆనందించె, సింహిక అనే రాక్షసి ఆలోచించి మారుతి  నీడ ఆకర్షించె,   వేగము ఎదురుగాలికి ఓడ ఆగినట్లు తగ్గి పోయెను

మారుతి తలవంచి క్రింద చూడగా సముద్రంపై పెద్ద జంతువును చూసె, నీడ ఆకర్షించే జంతువు సుగ్రీవ  చెప్పిన సింహిక ఇదే ననుకొనె, మారుతి  తన శరీరమును వర్షాకాలము నందు మేఘము వలె పెంచె, సింహిక కుడా శరీరమును పెంచి  గర్జించి మారుతి వైపు పరుగెత్తెను

మారుతి  సింహిక యొక్క శరీరములొ ఉన్న మర్మస్తానములను చూసె, మారుతి వజ్రము వంటి దేహాన్ని చిన్నది చేసి అమె నోటిలోకి దూకె, పౌర్ణమిన రాహువుచే మ్రింగ బడుచున్న చంద్రుడు వలే మారుతి ఉండె, హనుమంతు డామె ముఖములో దూకగా సిద్ధులు, చారుణులు  భయపడెను

హనుమంతుడు వాడి ఐన  గోళ్ళతో సింహిక మర్మ స్తానము చీల్చివేసి, తక్షణమే మనోవేగము తో సమాణ లక్ష్యంతో ఆకాశం పై కి ఎగిరె, సిద్ధులు పల్కెను మారుతి ఉపాయముగా ధైర్యముగా సింహికను చంపెను, సిద్ధులు, గంధర్వులు వెత్కు కార్యము మంగళ ప్రదం అవ్వాలని దీవించెను

"ఓ వానరోత్తమ నీకు ఉన్నట్లు ఎవనికి  ' ధైర్యము, సూక్ష్మద్రుష్టి, బుద్ధి, నేర్పు అను నాలుగు లక్షణాలు ఎవరకి ఉండునో వారు ఎ కార్యము చేయ వలసి వచ్చిన వైఫల్యము ' మనస్సు ప్రశాంతముగా ఉంటుందని సిద్ధులు, గంధర్వులు పలికెను। 

హనుమంతుడు ఆవలి ఒడ్డు  సమీపించి అక్కడ ఉన్న వృక్ష పంక్తిని చూసె, వృక్షములతో ఉన్న ద్వీపమును, పర్వతప్రాంతము నందలి వనములు చూచె,  సముద్రమును, తీరము నందలి జల ప్రాయ  ప్రదేశము లను, నదులను చూసె, మేఘమువలె ఉన్నతన శరీరమును చూసి అందరు కుతూహల పడుదురని అనుకొనెను

పూర్వము త్రివిక్రముడే వామనుడుగామారి బలిచక్రవర్తిని అనగత్రొక్కె, నేను నా రూపమును ఉపసంహరించుకొని సహజ రూపను మారెద, యజ్ఞానమువల్ల కలిగిన మోహము వీడి జ్ఞాని వలే ప్రవర్తిమ్చవలె, హనుమంతుడు అక్కడ నుండి త్రికూట పర్వతముపై ఉన్న లంకా పురమును జూచెను  

సర్వవస్తు సంమృద్దముగా, విచిత్రమైన రంగులు కలిగి ఉండే, మొగలి డొంకలు, విరిగిచేట్లు కలిగి, ఎత్తైన కొబ్బరి చేట్లుకలిగిఉండే, ధగ ధగ మెరుస్తూ ఆకాశమును తాకుతున్న భవనాలు కలిగిఉండే, ఉన్న లంకాపురము ను లంబ పర్వతముపై నుంచి చూసెను 

హనుమంతుడు పెద్ద పెద్ద తరంగముల పంక్తులతో నిండినదియు, దానవులకు, పన్నాగులకు నివాసమైనది యు, చుట్టూ సముద్రము, రక్షణ కవచముగా ఉన్నదియు, అగు లంకాపట్టనము హనుమంతునకు అమరావతి నగరమా అనిపించెను

(((())))),

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ:
శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
  
హనుమంతుడు సూక్ష్మ రూపంలో లంకలోకి ప్రవేశించుట
అథ ద్వితీయ: సర్గ:

   ప్రాంజలి       

సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:

58 సంస్కృత  శ్లోకాల ఆధారముగా తెలుగు- వచస్సు
 లంకలొకి ప్రవేశించుటగూర్చి ఆలోచించుట, సూక్ష్మ రూపంలో లంకలోకి ప్రవేశించుట
చంద్రోదయ శోభావర్ణనను తెలియపరుచుట, కాంచన లంకను అద్బుతముగా వర్ణించుట

హనుమంతుడు దీర్ఘ విశ్వాశములు విడువక ఎట్టి శ్రమ పొందక అక్కడే ఉండే , హనుమంతుడు సముద్రము దాటి త్రికూట పర్వతము పై దిగెను,అక్కడ ఉన్న చెట్ల అన్ని పూల వర్షంతో అభిషేకము చేసెను

  పుష్పములతో మునిగి పోయిన హనుమంతుడు పుష్పమయమైన కపి వలె ఉండే, హనుమంతుడు మనసులో అనుకొనెను ఇటువంటి ఎన్ని సముద్రాల నయినా అవలీలగ దాటగలను, నీల వర్ణముగల పచ్చిక బయల్లను, సౌగందము చిందే వనములను చూచు చుండెను, వృక్షములచే నాచ్చాదితమైన పర్వతములను,కానన శ్రేణులను, చూచు చుండెను , వానర శ్రేష్టుడు మహావేగ  సంపన్నుడు అగు హనుమంతుడు లంకను చూచెను 

 సరళ వృక్షములను, కొండకోగులను, పుష్పించిన కర్జూరములను,  మేరటి చేట్లను, జమ్బీర వృక్షములను, మొగలి పొదలను, కొండ మల్లెలను, మంచి సువాస ఇచ్చు పిప్పిలి వృక్షములను, ఏడాకుల అరటి చెట్లను వేగిచేట్లను,  కాన్చానములను చూచెను 

హంసలతోను, బాతులతోను, పద్మములతోను, కలువలతోను, రమణీయ మైన  క్రీడోద్యానములను, వివిధ జలాశయములను, రమ్యములైన ఉద్యానవనములను, పూలతో  నిండిన ప్రదేశములను , సర్వ ఋతువులలో పుష్పించి ఫలించు వృక్షములను మారుతి చూచు చుండెను 

శరత్కాల మేఘములవలె, శ్వేత విరాజిత భవనములను , స్వర్ణ ద్వారములు, కిటికీలు, ప్రాకారములు కలదియును, ప్రాసాదాలపై నలరారుధ్వాజ పతాకాలతో నొప్పు చున్నదియును, ధనస్సులు ధరించి రక్షక భటులు లంకను రక్షిమ్చుట హనుమంతుడు చూసెను

కొండశిఖరముపై నిర్మించిన స్వేత వర్ణముగల భవనములను, ఆకాశమునుది వ్రేలాడుతున్నట్లు ఆకాశమున నిర్మించి నవియును, విశ్వకర్మచే నిర్మించ బడిన లంకను రాక్షసేంద్రుడు పాలించు చుండెను, కోట బురుజులనేది కర్నభూశనములొ నొప్పుచున్న లంకను చూచెను , మహా సర్పాలతో భయంకరముగా బుసలుకొడుతు ఉన్నదియును, వికారముగా ఘోరరాక్షసులతో కాపలా కాయుచున్నదియును, ఎత్తెన మహసౌధములతొ  ఆకాశమును మోయుచున్నట్లుగాను, వజ్ర వైడూర్యాలతొ నిర్మించిన లంకను హనుమంతుడు చూచెను

మనసంకల్ప మాత్రమునే  విశ్వకర్మచే నిర్మించి నదియును, పూర్వము కుబేరుని కావాస భూతమైన స్వర్ణ లంకను, శూలపట్టు శాద్యాయుధములను చెత ధరించిన శూరులను, చూస్తూ ఉత్తరాద్వారము వద్దకు వచ్చి హనుమంతుడు ఆలోచించెను

లంక పట్టణము చుట్టూ ఉన్న భయవహమైన సముద్రమును, మహోత్తరమైన రక్షణస్థితి, రావణుని శక్తిని తెలిసికోనియును, లంకను యుద్ధముద్వారా దేవతలైనను జయించ జాలరను కొనేను, సామ,దాన,।భెధముకు, యుద్దమునకు  అవకాసము లేకుండెను

హనుమంతుడు మొదట సీత జీవించి ఉన్నదో తెలుసు కోనవలేనను కొనేను, రామచంద్రునికి  మేలు చేయ గలుగు ముహుర్తకాలమును ఆలోచించెను, బలవంతులు రక్షిమ్పబడుచున్న లంకకు  పోవుట దుర్లభమనుకోనేను, భలవంతులైన రాక్షసులను వంచన చేసి,  ప్రవే సించాలని అనుకొనెను  

శత్రుదుర్భేద్యమైన కోట దగ్గరకు  రాముడు వచ్చి ఏమి చేయగలుగును, రాక్షసుల విషయమున  సామో పాయ్యము అవసరము లేకుండెను, సామ,దాన, భేదమునకు, యుద్దమునకు కూడా అవకాసం లేకుండెను, అంగదుడు, నీలుడు, ధీమన్తుడగు సుగ్రీవుడు వచ్చి ఏమి చేయగల్గును

శుభఘడియల కోసం వేచి యుండి మహోత్తర కార్యమును సాదించెదను, నేను ద్రుశ్యద్రుశ్యమగు రూపములొ స్వర్ణ లంక నంత  వెదకవలెను, స్వర్ణ లంకను చూసి ధీర్ఘవిశ్వాసములు విడుచుచు ఆలోచించెను, హనుమంతుడు రావణుని శక్తిని తెలుసుకొని సీతను వెతకవలెనని అనుకొనెను

రామచంద్రుని కార్యము విఘాతము కలుగ కుండుగను
ఎకాత్మముగా, ఒంటరిగా మాయను చేధించి వెతకవలెను

అస్తిరమైన మతితో నవివేకముగా వ్వవహరించిన పని పాడగును, సూర్యదయము వచ్చిన చీకటి ఉన్న పరిస్తితి ఏర్పడును,   దూత మూలమున బుద్ధి అవివేకముగా మారిన కార్యము చెడిపోవును, దూత అనేవారు ఇది చేయవచ్చు ఇది చెయ్యకూడదు ఆలోచించవలెను
బుద్ధిమంతుల అనుకొన్న మూర్ఖలగు దూతలు పని పాడుచేయును, కార్యము చెడకుండ దూత కార్యము నిర్వహించాలని మారుతి అనుకొనెను

 నా యొక్క వివేక శూన్యత బయట పడకుండు నట్లుగాను , కష్టపడి సముద్రముదాటి వచ్చిన వృధా కాకుండు నట్లుగాను, రాక్షసులు,  రావణునివల్ల రామకర్యముచేడు కుండునట్లుగాను, నాప్రవర్తనను నిగ్రహించుకొని సీతాన్వేషణ నిర్వహిస్తాను,  ఇక్కడ రాక్షస రూపమున సంచరించుట కుడా కష్టమగును, వాయువు కుడా రాక్షస రాజు ఆజ్ఞ ప్రకారము వీచును, ఈరూపమున సంచరించిన ప్రభుకార్యము చెడిపోవును , హనుమంతుడు మార్జాల ప్రమాణమైన శరీరము మార్చుకొనెను 

సీతా సన్దర్శనొత్యుకుడై సూర్యోస్తయము వరకు వేచి ఉండెను,  ప్రదోషకాలమునందు  రమ్యమైన లంకా పట్టనమునందు ప్రవేశించెను, వాజ వైడూర్యములతొ నిర్మించిన  భవనములు చూచెను, హనుమంతుడు అన్ని కాలాల్లో అన్ని పండ్లు పండుట చూచెను, చంద్రుడు కూడా సహస్త కిరణములతో వెన్నెలను కురిపించెను, శంఖమువలె, క్షీరమువలె, తామర తూడ్లను బోలి తెల్లగా నుండెను, బంగారముతొలంకా పట్టణము అంతా సొబగును కూర్చు చుండెను, మనస్సుతో వైదేహిని చూసి, లంకను చూచి హర్షము పొందెను

____((((()))))____

సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:

పొడవైన  దీర్ఘముగా ఉన్న  లంబ  పర్వతము, మేఘము వలె  దట్టముగాఉన్న మహాపట్టణము, రావణునిచే పాలిమ్పబడుచున్న లంకపట్టణము, స్వస్తముగాఉంdi మారుతి  రాత్రిపూట లంకలోకి ప్రవేసిమ్చెను
 
శరత్కాల  మేఘములవలే  తెల్లనిభవనములను , సాగర ఘోశావలె గమ్బీర మగు పెద్ద  ధ్వనులను, సముద్రగాలులచే  సేవిమ్ప  బడుచున్నదియును, మదించినఎనుగులఘీమ్కారములను  లంకలోచూచెను 

సర్ప  మణుల కాంతి  వెలుగులతో లున్నదియును, మేఘములో  మెరుపు వెలుగులతో  ఉన్నదియును , మందమారుతమునకు నక్షత్రాలకదలిక వేగులతోను 
పసిడి మంగళకరమైన భోగవతినగరం వలే ఉండెను 

చిరుగంటలు  మ్రోగు చున్న  పతాకముల  తోను , పెనుగాలికి  స్వర్ణపురెక్కలు కదలికధ్వనుల తో, ను, అమరావతి నగరముతొ తులతూగు చున్నదియును 
హనుమంతుడు అమితానన్దముతొ  ప్రాకారపు గోడఎక్కెను

మనిఖచితములగు  భూగ్రుహములు  కలదియును వజ్రములు, స్పటికములు, ముత్యములతోఉన్న ద్వారములను, పుపరిభాగము పుత్తడితో తయారుచెసిన కలశములు కలదియును, ఆకామంత ఎత్తులోను మనోహరములైన గృహములను  చూచెను 

 క్రౌంచములు, నెమల్లు యోక్క  కూతలతొ  నొప్పు  చున్నదియును, రాజహంసలు, అద్భుతమైన వింతపక్షుల సంచారములు గలిగియును రకరకముల  వాద్య్యములు  ధ్వనులతో ప్రతిద్వనిమ్చు చున్నదియును, ఆ  లంకానగారమును  చూసి  కపి శ్రేష్టుడు  చాలా  ఆనందిమ్చెను  

సకల సంమృద్ధియును సకలశుభములు కలదియును హనుమంతుడుచూచె, ఆయుధము  చేతపట్టు  రాక్షస  వీరులచె  కాపలా  కాయుచున్నదియు, మరియోకరిచే  బలపూర్వకముగా  లోబరుచుటకు  వీలు  కానిదియు,  గ్రహములయోక్క  వేలుగుచే  నష్టమైన  చీకట్లను ఉన్న లంకానగరము చూచెను 

కుముద  అంగదు నకును,    మహాకపి  సుషేను న కును, మైంద  -ద్విపదులకును , కుశపర్వుడను  వానరుడకు, కపిముఖుడైన  జాంబ వంతునకును , సుగ్రివునకును 
లంకలో  ప్రవెశమూన్న  జయము  సంసయమే  అగును

హనుమంతుడు  రామచంద్రుని  యొక్క  పరా క్రమము  
లక్ష్మణుని   యొక్క,   వానరుల యోక్క  సౌర్యము, గుర్తు తెచ్చుకొని  మనస్సులో    ప్రసన్నత  నొందే, తరువాత  లంకలో  ప్రవేశించు  చుండగా  లంకానగరి  చూచెను  

వికృతముగా  ఉన్న   లంకా  నగరి  నిజ రూపములొ  ప్రత్యక్షమయ్యె, హనుమంతుని తో  నిర్భయముగా  గట్టిగా వానరా  నీ వెవడవు, ఏ పనిపై  ఇక్కడ్కకు వచ్చితివి ? ప్రాణాములుండగానే నిజము చెప్పు, రావణుని రక్షణలో  ఉన్న  కోటలోనికి  ప్రవేశించుట నీకు   వీలు  లేదనెను 

హనుమంతుడు  లంక  తో  యదార్ధము  చెప్పెద।  ఫురద్వారమువద్ద  ఉన్న  నీ  వేవతివిఅని  అడిగెను పవన  నందనితొ పరుషముగా ఈ విధముగాపలికె,
నేను  రావణుని  ఆజ్ఞ  మేరకు  కాపలా  కాయుచున్నాను

ఎవరు  లోనికి   ప్రవేసించకుండా  కాపలాకాయు  చున్నాను, నాలుగు  దిక్కులా  ఉన్న  నన్ను  ధిక్కరించి లోనికి వేల్లలేరు, వానరా  నా  చేత  నిహితుడు  కాక ముందు ఇక్కడనుండి పోమ్మనె, లంక  మాటలకు  హనుమంతుడు  తన శరీరమును పెంచెను

నాకు  లంకా  నగరములోని  భవణములను  చూడాలని  వచ్చా, వనోపవనములను కాననములను , సెలఎర్లను  చూడాలని వచ్చా, ఈవాక్యములకు లంక పరుషములగు పలు వాక్యములు పలికె, ఓవానరా  నన్నుజాఇంచ కుండా   నీవు  లోనికి  పోలేవనేను

ఓ ఉత్తమురాలా  నేనుఈ పట్టణమును చూసి వచ్చినట్లు గా  పోయెద, లంక  గొప్ప నాదముతొ కోపముతో  అర చేతితి తో కపిశ్రేష్టుని చరచె, హనుమంతుడు  లంకచే  తాడితుడై  గోప్ప   నాదముతో అరిచె, హనుమంతుడు  వెర్రి  కోపము కలవాడై  ఒక్క   గ్రుద్దు  గుద్దెను 

ఆ  దెబ్బతో  లంక  వికృతముగా మోము పెట్టి భూమిపై పది  పోయె, అప్పుడు  హనుమంతుడు  స్త్ర్రి యని భావించి లంకపై జాలిచూపె, హనుమంతినిలో  లంక  గర్వమడిగినది నన్ను   క్షమిమ్చ మనే, ఓ  వానరా  బ్రహ్మ దేవుడునాకు వరమిచ్చినాడు ఒక వానరుడు నిన్ను  జాయించుననెను

వానరుడుడు  నిన్నులొంగదీసిననాడు   రాక్షసులకు  భయము   వచ్చుననే, స్వయంభువుడు  చెప్పిన  సమయము  ఇప్పుడే వచ్చెనని అనుకోనుచున్నా,  
రావణునికి , రాక్షసులకు  సీతనిమిత్తము  వినాశనము  ఉండు  నని  అనెను, ఓ  హనుమ నీవు  రావణుని  చే  పాలింపబడుచున్న నగరమును  చూడమనెను

ఇడి నన్దికెశ్వర , బ్రహ్మ,  శాపములచె  ఉపహత మైన  నగరమని పలికెను, నీవుస్వేచ్చగావెల్లి పతివ్రతయగు సీత క్షేమవార్త రామునికి  తెలుపమనె, నీవు  చేయ వలసిన  కార్యములన్ని  యదేస్చగా  చెయ్య మని అనెను, హనుమంతునికి  లంక నమస్కరించి అంతర్ధానమై పోయెను

సుందర  కాండ  యందు  3వ  సర్గము  సమాప్తము  
                                           
___((()))___


శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ:
                              శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:

ప్రాంజలి       

సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:

మహాతేజస్సంపన్నుడు  అగుహనుమంతుడు  అద్బుతమైన  లంకను చూచె, కామ  రూపము గలది అగు స్వర్ణలంకా  పురిని  పరాక్రమముతో  జయించెను
కపిశ్రేష్టుడు  ద్వారముతో  నిమిత్తము  లేకుండా  లంకలోకి ప్రవేసిమ్చె,సుగ్రీవహితకారి, కపిశ్రేష్టుడు  లంకలోకి  ఎడమ  పాదముతో  ప్రవేసిమ్చును 

మితృవుల తలపై కుడి పాదముతొ,  శత్రువుల  తలపై  ఎడమ  పాదము  ఉంచె, లంకలో  పుష్పములు  వెదజల్లిన  మహామార్గంలో  ఆహ్వా నిస్తున్నట్లు  ఉండె, రమ్యమైన  లంకలోకి   అభిముఖముగా  హనుమంతుడు   బయలు  దేరే, వాద్యమేశాల తోను, పెద్ద  నవ్వుల  నినాదములతొను, ధ్వనులతో  పెక్కటిల్లెను 

ముత్యములతో  ప్రకాశింప  బడుచున్న    రాజమార్గాము నుండి  నడుచు చుండె, అక్కడ  గృహముల  యందు  వజ్ర  వైడూర్యము లతొ  చేసిన  కిటికీలు  ఉండె, అక్కడ  వజ్ర  అంకుశ  చిహ్నములతో  మేఘములవలె  ఉన్న  గృహములు  చూసె, పద్మాకారములో  ఆకాశంలో  తేలు తున్నట్లు  అద్భుతమైన  గృహములు  చూసెను

స్వస్తిక్  చిహ్నితములు  గల  తెల్లని  మేఘముల  వంటి  గృహములు  చూచె, మంగళ ప్రదమైన  నగర  శోభను  పెంచే  వర్ధమాన  గృహములు  చూచె, రామ  దూత  అగు  హనుమంతుడు  రక్షణ  గణ  గృహములు  చూచె,చిత్ర  విచిత్రమైన  పుష్పములతోను  ఆభరణములతో  వున్న లంకను  చూచెను    

హనుమంతుడు నడుస్తున్న కొద్ది విచిత్ర రంగుల్లో ఉన్నభవనాల్ని   చూసే,  స్త్రీలు మధుర గానముతో అప్సర స్త్రీలవలె నాట్యము చేస్తూ మధురముగా పాడుచుండె, మంద్ర మాద్యమ తారస్వరములను  స్వర భేదములతో ఒప్పారు చుండె,ఇల్లు ఇల్లు తిరిగి లంకను చూసి హనుమంతుడు ఆశ్చర్య పడెను 

కామ పీడుతులను, సుందరమైన స్త్రీల వడ్డాణముల ధ్వనులను, స్త్రీలు మెడమెట్లు ఎక్కునప్పుడు,  దిగు నప్పుడు  కాలి యందెల ధ్వనులును, కుస్తీలు పట్టేవారు మొదట తొడలు చరచునప్పుడు వాచ్చె శబ్ధములను, ఇంకా రాక్షస వీరుల పలుకు సింహ నాదము వాలే నుండెను

హనుమంతుడు రాక్షస గృహము లందును వేదమంత్రములు వినెను, కొందరు జపమాల  త్రిప్పుచూ మంత్రమును వల్లించు చుండె, రావణ స్తవము చేయు రాక్షసులను, గర్జించు వారిని చూచె, జమార్గామునందు సైనికుల సమూహమును మారుతి చూచెను

మద్య గుల్మములందు గుప్త చారులుండెను, దీక్షా ధారులుగా, కొందరు జటా దారులుగా ఉండె, కొందరు గోవు  చర్మమును, మరికొందరు పులి చర్మమును ధరించె, ముండి సిరస్సుతో అగ్ని కుండములందు హవనము చేయు చుండెను  

కొందరు ఎకాక్షులను, బహువర్ణములు గల వారు, కొందరు ఏక స్తణము కలిగి భయంకరముగా ఉండె, వంకర  ముఖములు కలిగిన   వికట కారు  లుండె,
మరుగుజ్జు వారు,  అతి పొడవైన వారుకూడా ఉండెను

కొందరు పట్టేశములను, కొందరు వజ్రాయుధములను, కొందరు ఓడ నడిపే తె డ్డులను, కొందరు పాశములను,  కొందరు శక్తి వృక్షములే ఆయుధములుగా కలవారును,  మంచి అందముతో, తెజముగా ఉన్న వారు కూడా ఉండెను 

నూరువెల అంత:పు రక్షకులు కలదియు, పర్వతము పైభాగమున పద్మవలె కట్టబడినదియు, బంగారముతో చేయబడిన ద్వారములు కలదియు, రాక్ష సాధిపతి గృహమును హనుమంతుడు చూసెను 

పుత్తడి ప్రాకారాలుగాను, స్వర్గములా ఉన్నదియు, దివ్య నాద నినాదముల  తో, సర్వ లక్షనములు కలిగి యున్నదియు,  మహా వీర్య సంపన్నులచే రక్షింప బడు చున్నదియు, పాదము మోపగా పరవశిమ్పచేయు లంకేశ్వరుని భవనమును చూచె, గుర్రపు శాలలో గుర్రపు సకిలిమ్పులు లను, నాలుగు దంతములు గల ఏనుగుల నినాదములతొను, సింహ, వ్యాఘ్ర , భయానకమైన అరుపులతోను, మృగ పక్షుల కిల కిల రావములతొ ఉన్న ప్రదేశమును చూసెను 

సువర్ణము, జంబు నాదముతో నిర్మించిన ప్రాకారమును, ముత్యములు, వైడూర్యములు పొదగబడిన ఉపరి తలమును, ఉత్తముములైన అగురు చందనములచే పూజితము, అగు రావణామ్త:పురమును హనుమంతుడు చూసెను  

ఆదికవి రచించిన సుందర కాండము ( వచస్సు) 4వ సర్గము సమాప్తము,                                        
 ___((())))___     


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ:
 శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
      ప్రాంజలి సుందరకాండ - 5వ         
సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:

రాత్రులందు తారాగతులమద్య చంద్రుడు ప్రకాశిమ్చు చుండె, వెన్నెల అనే చాందిని కుడ్డ పరిచినట్లు చంద్రుడు వెలుగుచుండె, గోసాలలో విహరించి మత్త వృషభము వలే చంద్రుడు ఉండె, నక్షత్రాలమద్య ఉన్న చెంద్రుడు హనుమంతునకు వెన్నెలను పంచెను

చంద్రుడు లోకములోని పాపాలను నాశనము చుండె, 
చంద్రుడు మహాసముద్రమును ఉప్పొంగునట్లు చేయుచుండె, చంద్రుడు సకల భూతములను పకాశిమ్ప చేయు వాడు, చంద్రుడు నింగిలో తారలమద్య ఉండుటను హనుమంతుడు చూచెను 

చంద్రుడు భూమిపై ప్రభాత సమయమున మందర పర్వతము నందు, చంద్రుడు ప్రదోష కాలమున మహా సాగరము నందు, చంద్రుడు పగటి వేలల యందు పద్మము లందు, చంద్రుడు సుందరమైన నిశాకరుని యందు  వెలుగు చుండెను

చంద్రుడు వెండి పంజరములో ఉన్న హంస వలె, మందార చలముయోక్క గుహనందుఉన్న సింహము వలె, చంద్రుడు మహా గజము పై అధిరోహించిన వీరునుని వలె, చంద్రుడు ఆకాశగతుదై అద్భుతముగా ప్రకాశించు చుండెను  

తీక్షనమైన కొమ్ములు గల ఆంబోతు వలె, ఉన్నత శిఖరములుగల హిమపర్వతము వలె, బంగారు తొడుగు దంతములుగల గజము వలె, చంద్రుడు పున్నమి వెన్నెలను ఎప్పుడు ప్రకాశిమ్చు చుండెను

చంద్రుడు శిలాతలముపై పరుండిన సింహము వలె, చంద్రుడు మహారణమునకు వచ్చిన మత్త గజము వలె, చంద్రుడు రాజ్యాభిషేకమునకు వచ్చిన మహారాజు వలె, చంద్రుడు వెలుగును పంచుట హనుమంతుడు చూచెను

చంద్రుని మీద ఉన్న మంచు తుప్పరులు తొలగి పోయె, చంద్రునిలో ఉన్న నిశ్చలమైన ప్రకాశలక్ష్మికి ఆశ్రయ మయ్యె, మాలిన్యమంతా పోయి చెవుల పిల్లివలె కనబడు చుండె, చంద్రబింబము హనుమంతునకు లంకఅంతా వెలుగును విరజిమ్మెను

వెన్నెలచే నష్టమైన తిమిర దోషము కలదియును,
రాక్షసులు మాంసాహారరూపమైన దోషము కలదియును,
స్త్రీల హృదయములందు ప్రేరితమైన కామదోషము కలదియును, స్వర్గ ప్రకశమైవెలుగుచున్న చంద్రుడను హనుమంతుడు చూచెను 

కర్ణ సుఖములు కల్గించు వీణానాదములు వినబడు చుండె, సచ్చరిత్రగల స్త్రీలు పతులతో నిద్రించు చుండె, రౌద్రాకారులగు రాక్షసలు విహారము చేయు చుండె, హనుమంతుడు  వింతవేషాలతోఉన్న రాక్షసుల ను చూచెను

కొందరు రాక్షసులు ఛాతిలతో ' డి ' కొట్టు కొను చుండెను
కొందరు రాక్షసులు ఇష్టమైన కాంతలను ఆట పట్టించు చుండె, కొందరు రాక్షసులు ద్రుడమైన  ధనస్సులను లాగు చుండె, కొందరు రాక్షసులు చిత్ర, విచిత్ర మైన  వేషములు వేయు చుడెను

 రాక్షస స్త్రీలు పరస్పరము ఒకరి కొకరు ఆక్షేపించు కొనుచుండె, తమ బలసిన భుజాలు పట్టుకొని ఒకరికొకరు ఊపుకొను చుండె, రాక్ష స్త్రీలు పానమత్తుచే పరాకగా ఒకరికొకరు మాట్లాడు చుండె, కొందరు మత్తుచే భీకరంగా అరుస్తూ భాణాలను సంధించు చుండెను

కొందరు స్త్రీలు చందన లేపములు పూసికొని ఉండె, 
కొందరు మంచి అందము కలిగియుండి నిద్రించు చుండె, అందమైన మోముగల కొందరు మగువలు నవ్వు చుండె,  స్త్రీలు కోపముతో దీర్ఘమైన విస్వాసములు విడుచు చుండెను 

లంకా నగరంలో గొప్ప బుద్ధిమంతులను, సమ్మనితము లైన ఉత్తమ పురుషులను, మంచి శ్రద్దావంతులగు అందమైన రాక్షసులను, మంచి పేరుతొ మంచిగా మాట్లాడు వారును, అందమునకు తగ్గ గుణములు కలవారును, తేజముతో వేల్గొందు తున్న రాక్షసులను
ప్రశాంతముగా వికృతాకారముగా ఉన్న రాక్షసులను,
 
విశ్వవిక్యాత రాక్షసులను హనుమంతుడు చూసెను, మంచి స్వభావము, శ్రద్ద భావము గలవారును, 
ప్రియుల యందును, పానమందును లగ్నమైనవారును, తారలవలె వేల్గొందు కొందరు అందమైన రాక్షస స్త్రీలను, స్త్రీలు ప్రియులపై ప్రేమాతిసయములు చూపుట మారుతి చూసెను

కొందరు స్త్రీలు ప్రియుల కౌగిలంతలలో చిక్కి సిగ్గు పడుచుండె, స్త్రీలు పతిసుఖమును పొంది ఆత్యానంద భరతులైన వారు, పుష్పములు కప్పిన పక్షులవలె కొందరు స్త్రీలు ఉండె, కొందరు స్త్రీలను మేడలపైన ఉండుట హనుమంతుడు చూచెను

మన్మదావేశముతొ కూడిన స్త్రీలు, భర్తల వడిలో ఉండెను, భర్తలప్రేమకు పాత్రులైన స్త్రీలు రతికేళీలు సలుపు చుండెను, కొందరుస్త్రీలు పురుషులతో ధర్మమార్గమున సంసారము చేయు చుండెను,  రతీ మన్మదులుగాఉన్న రాక్షసులను హనుమంతుడు చూసెను 

కొందరు స్త్రీలు వస్త్ర విహీనులై నగ్నంగా బంగారు తీగవలె  నుండె,  అత్యధిక సంభోగముతో పుట్టము కట్టిన బంగారము వలే నుండె, కొందరి స్త్రీల శరీర వర్ణము చంద్రునిలో మచ్చరంగు వలే నుండె,  కొందరు స్త్రీలు ప్రియుని వియోగాముతో భాదపడు చుండెను 
 
 పుష్పమాలను ధరించి హర్షము గలవారై మనోహరముగా నుండె, అన్దమైనమొముగలిగి, సుందరమైన కుచములు కలిగి ఉండె, సుందరమైన నేత్రములు విద్యులతలవలె ప్రకాశిమ్చు చుండె, స్త్రీలు భూషనాలు ధరించి ఇష్ట ప్రియుల ఆలింగనంలో ఉన్నట్లు మారుతి చూచెను   

అతి ప్రాచీన మైన ధర్మము నందును, మన్మధుని చేత శోభాయుక్త  మైనదియు, నిత్యమూ భర్తనే తలచు చున్నదియును, స్త్రీలలలో  శ్రేష్టమైనదియు, 
అన్ని కాలములో ఎప్పుడు ఎవ్వనవతిగా ఉండ గలినదియు, అన్ని విధములుగా వైవిష్టము గల సీతా దేవి కాన రాకుండెను
  
విరహ దీపము చేత  పీడింమ్ప బడుచున్నదియు, ఏకధారగా కన్నీరు కారుస్తూ కంఠం తడిసి నదియు,  ఉత్తమ హారము ధరించి, చక్కని కను రెప్పలు కలదియు, మనోహరమైన కంఠశ్వరము కలదియు, నృత్యము చేయని ఆడనెమలి వలే సీత కన బడ కుండెను

అస్పష్టముగ కనబడు చంద్రరేఖను బోలినదియు, ధూలిచె ధూపరమైన బంగారు రేఖను బోలినదియు, దెబ్బ తగిలి మానినప్పుడు నిల్చిన వర్ణ రేఖను బోలినదియు,గాలిచేత చెదర గొట్టబడిన మేఘరేఖను బోలినదియు, వివిధ వర్ణ రేఖలు గల సీతాదెవి మాత్రము కనబడ కుండెను 

ఎంత సేపు వెతికినా సీతామాత కాన రాకుండె,  రాముని యొక్క దుఃఖము ఏవిధముగా తొలగించగలను, రాముని యొక్క కార్యము నేను ఏవిధముగా నెరవేర్చ గలను, నిగ్రహాశక్తి పరుడైన హనుమంతుడు కొన్నిక్షణాలు ఉస్చాహ శూన్యుడయ్యెను 

శ్రీ వాల్మీకి మహాముని సంస్కృతం లో విరచిమైన 5వ సర్గ తెలుగు వచస్సు సమాప్తము 
 శ్రీ రామ్   ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రామ్ 
 ---0----
  ఓం శ్రీ  రాం  ఓం శ్రీ  రాం  ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ:   శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:

సూర్యుని బోలి  మిక్కిలి ప్రకాశించు ప్రాకారములను,  
రాక్షాసిధిపతి యోక్క ఎడంతస్తుల భవనములను, రాక్షసులచే రక్షింప  బడుచున్న భవనములను, 
కామరూపుడగు హనుమంతుడు యదేస్చగా చూచెను

వెండితో లిఖించబడిన చిత్తరవులను, బంగారు మలా ముతో చేయబడిన సింహద్వారములను, సింహ ములచే రక్షింప బడుచున్న మహా భవనమును, సౌర్యలలక్ష్మీ సంపన్నుడైన హనుమంతుడు చూసెను 

ఏనుగుపై ఆసీనులైన మావటి వాండ్రను, వేగముగా రధములు లాగు అశ్వములను, సింహ వ్యాఘ్ర చర్మము లను ధరించిన రాక్షసులను, ఏనుగు దంతములకు బంగారు తొడుగులను చూచెను 

వెండితోను పంచలోహములతో చేసిన ప్రతిమలను, 
విచిత్రముగా శబ్దము చేయుచు ఎగురుతున్న భవన ములను, రత్నములతో పొదగబడిన బహుమూల్యము లైన ఆసనములను, మహా వీరులుండే భవనములను హనుమంతుడు చూసెను 

కనివిని ఎరుగని అద్బుత ద్రుస్యములను, నానా ప్రాకారములమీద మృగ-పక్షుల చిత్రములను, వినయ యుక్తులగు రాక్షస భార్యలను, హనుమంతుడు చూసి ఏంతో  ఆనందించెను

రాజులు నివసిమ్చుటకు సమస్త హంగులు కలదియును, 
మిక్కిలి ముఖ్యమైన చందనములతో సంపన్న మైన దియును, మహాజనులు వేచి ఉండు రాక్షసేంద్రుని భవనమును, సింహముతో నొప్పు వనమువలె ఉన్న దానిని మారుతి చూసెను

భవనములో ఎందఱో ఉత్తమ స్త్రీలు నివసించి ఉండె,
భేరి మృదంగద్వనులతో ప్రతిద్వనిమ్చు చుండె,శంఖ నాదములతొ నిత్యార్చనలు చేయు చుండె, పర్వ దినము లందు వివిధహోమములు చేయుచుండె,
పూర్ణిమ అమావాశ్యనందు ప్రత్యేక పూజలు జరుగు చుండెను భవనమద్య బాగముపైకప్పు నందు రత్నములు పొదగి యుండె, అక్కడ గంమ్భీరమైన నిశ్శబ్దము కూడా ఆవహించి ఉండె, తేజోవంతముగా వెలుగుతున్న భవనమును హనుమంతుడు చూసెను

ప్రహస్తుని భవనమును చూసి, మహహ పార్శుని భవనమును వెదికెను, కుంభ కర్ణుని భవనము చూసి,  ప్రక్కనే ఉన్న వనములు వెతికెను, విరూపాక్ష గృహము ను వెతికి, ప్రక్కనున్న గృహములను వెతికెను, లంకా నగరి కి అలంకారముగాఉన్నభవనమును మారుతి చూసెను

మహోదర, విద్యుజిహ్వ,  విద్యున్మాలు,గృహములను 
బహుద్రంష్ట, సుకుల, బుద్దిమంతుడైన సారని, గృహములను, జంబుమాలి, సుమాలి, విష్ణుభక్తుడగు విభీషణ, గృహములను, ఇంద్రజిత్తు గృహమును, హనుమంతుడు సీత కొరకు వెతికెను

ద్రుమాక్ష, సంపాతి, విద్యుద్రూప, భీమ, ఘన, గృహము లను, విఘన, శుకనాభ, చక్ర, శర, కపట, హ్రస్వకర్ణ, గృహములను, దంష్ట్ర,మహాకపి రశ్మికెతు, సూర్య శత్రు, వజ్రకాయ, గృహములను, యుద్ధొన్మత్త,  రాక్షసుల గృహములను హనుమంతుడు వెదికెను 

విద్యుజిహ్వ, ద్విజిహ్వ, హస్తి ముఖి, గో ముఖి గృహము లను, కరాల, విశాల,సోనితాక్షులు ఇండ్లను వరుస క్రమంలో వెతికెను, ముతొ తులతూగు గొప్ప గొప్ప భవణములను వెతికేను, లక్ష్మి సంపన్నుడైన హనుమంతుడు రావణ గృహమునకు వచ్చెను 

రాక్షకురాన్ద్రులాగా వికార నేత్రములు గల రాక్షస స్త్రీలను చూచెను, స్త్రీలు శూలములను, బల్లెములను, మద్గరములను ధరించెను, ఎరుపు,తెలుపు, అనేక రంగులుగల జాతి గుర్రములను చూచెను,     మంచి వస్త్రములు, బంగారునగలతోఉన్నస్త్రీలను మారుతి చూసెను 

మంచి జాతికి చెందిన, చక్కగా, బలంగా, ఉన్న ఏనుగు లను, శత్రువులను భంజిమ్చే గొప్ప యుద్ధ  ఏనుగులను
గజ శిక్షణ పొందిన రాజ భవనంలో ఉన్న ఏనుగులను 
ఐరావతము వంటి ఏనుగులను హనుమంతుడు చూసెను 

ప్రాతకాల సూర్యుని  వెలుగుతున్న శిబికలను చూసెను,
వివిధాకారముగల పల్లకీలను, రధములను చూసెను,
చిత్రములైనా లతాగ్రుహములను, చిత్రశాలను చూసెను, పగటిపూట ఉపయోగించే భవనమును హనుమంతుడు చూసెను

కాష్టమైన క్రీడా పర్వతములను, విశాలమైన మైదానము లను, రమనీయమైన కామగ్రుహములను, విలాస భావన ములను చూసెను,  నెమలి నృత్యములతోను, పక్షుల కూతలతోను ఉన్న గృహమును, మందార చలమువలె సున్నితమైన దానిని హనుమంతుడు చూసెను 

పై కప్పు అనంత రత్నములు పాడగా బడి యుండెను 
పెక్కు నిధులు ఉండి రక్షక భటులు కాపలా కాయు చుండెను, 
ధీరులు, పురుషులుచే ననుష్ఠింపబడు దేవాలయమును చూసెను, హనుమంతుడు అది భూతపతి నివాస స్థానమని గ్రహించెను 

ఆ భవనమంతా మహా శివుని  తెజస్సుతోను, రావణ తపశక్తి  ప్రభావ  తెజస్సు తోను, బంగారము, వజ్రాలు, రత్నాల తెజస్సుతోను, సూర్య తేజస్సుతో ఉన్న దేవాలయమును మారుతి చూసెను

మధు పత్రాలను, రక్త పాత్రలను, జంతు చర్మాలను, 
మాంసము వండే పెద్ద పెద్ద పాత్రలతో ఉన్న గృహ మును, స్వర్ణముతో తయారు చేయ బడిన ఎత్తై న సింహాసనాలను, స్వర్ణ మాయమగు మంచములను హనుమంతుడు చూసెను

అందేలా యొక్క జుమ్కారముల తోడను, మృదంగ తాళముల నిర్ఘోషముల తోడను, పెద్దగా మ్రోగు తూర్య ధ్వనుల తోడను, కుబేరుని భవనము వలే విశాల మైనదియును, పెక్కు ప్రాసాదములతొ ఉన్నదియును
స్త్రీ రత్న శతములతో వ్యాప్త మైనదియును, విశాల మగు అంత:పుర కక్షలతో ఉన్నదియును, రావణుని మహా గృహమును హనుమంతుడు చూసెను 

సుందర కాండము నందు 6వ సర్గ సమాప్తము
         
___((()))___
 
ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                                  శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:

నీళ మనుల తొ  పొదగ బడిన బంగారు కిటికీలను, పక్షి సమూహములు చేయు మదుర స్వరములను, వర్షా కాలములో మేఘముల చే మెరిసేమెరుపులను, వేలుగు ఉన్న భవనమును హనుమంతుడు చూసెను 

రాక్షసలు  స్వబలముతో నిర్మించిన గృహములను, 
బహు విధములైన రత్నములతో నిర్మించినవియును 
దేవతలు, అసురులు, పూజింప దగినవియును, ఎట్టి దోషములేని గృహములను మారుతి చూసెను

సాక్షాత్తు మయునిచే నిర్మించ బడినవియును, భూలోకం లో సకలగుణ శ్రేష్టము లైనవియును, ఉన్నతమైన మేఘములు వలే తెల్లనియును, బంగారు నగిషి  దిద్దిన భవనము ను చూసెను

 అక్కడ భూమి పర్వత పంక్తులతో ఉండెను, పర్వతము లపై వృక్ష సముదాయముతో నిండియుండెను,వృక్షము లపై పుష్ప సముదాయములతో నిండి యుండెను,
పుష్ప ములు, కింజుల్కములతో రేకులతో నిండి యుండెను

పద్మాకారములో శ్వేత భవనములు యుండెను,పద్మము లతో సరస్సులు నిండి యుండెను,పద్మములపై కింజల్కములు నిండియుండెను, పువ్వులతో ఉన్నతమైన వనములుండెను 

 వెండి, పగడములతొ నిర్మింపబడిన విహంగము లుండెను, రత్నములతో చిత్రమైన సర్పములు చెక్కబడి యుండెను, మంచి అవయవ సంస్థానముగల జాతిగుఱ్ఱములు ఉండెను, అనేక పగడములుగల విమానమును హనుమంతుడు చూసెను

 బంగారంతో చేయబడిన పుష్పములతో నొప్పు రెక్క లుండెను, లీలగా క్రిందకు వంపబడిన కుటిలమైన పక్షము లుండెను, సాక్షాత్తు కామదేవుని దివ్య సుందర రూపాలుండెను, సుందరమైన ముక్కులుగల పక్షులు ప్రకాశించుచుండెను

పద్మాల సరస్సునందు ఒక పద్మముపై లక్ష్మీదేవి యుండెను, ఇరువైపులా గజములతోండములందు పద్మాల కాడలుండెను, లక్ష్మీదేవి సుందరమైన హస్తము లందు పద్మములు ఉండెను, బంగారముతో చెక్కబడిన లక్ష్మీదేవి చిత్రమును మారుతి చూసెను 

సర్వప్రశస్యముగా ఉన్న లంకాపట్టణమంతా తిరుగు చుండెను,  పతి, గుణ, ద్యానముచే, ఉన్న సీత మాత్రము కనబడ కుండెను,  భార్తతోడు లేక, స్తైర్యమును కోల్పోయిన జానకి కానరాకుండెను, బహువిధములుగా నాలోచించి సీత కొరకు మారుతి వెతికెను 

నిశిత బుద్ధియును, ధర్మ మార్గ వర్తియును,  సూక్ష్మ  దర్శనముగల మహాత్ముడును, అప్రతిహతమైన దృష్టిగల హనుమంతుడు, సీత కన్పడక పోవుటవలన దు:ఖా క్రాంతుడయ్యేను 
సుందర కాండము నందు 7 వ సర్గ సమాప్తము

___((()))___

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                                  శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
                                                                
                          
విశ్వకర్మచే నిర్మిమ్చబడిన అత్యుత్తమమైన మెరుపు విమానమును, ఆదిత్య మార్గ చిహ్నమువలె కనబడుచు ప్రసంసింమ్ప బడుచున్నదియును, అమితమైన సౌందర్యముగల ప్రతిమలతో శొభిమ్చు చూ ఉన్నదియును, పవననందనుడు మధ్యభాగమున ఉన్న విమానమును చూసెను 

ప్రయత్నా పూర్వకముగా ఏదియు నిర్మించ బడనిదియును, బహుమూల్యమైన రత్నములు లేని భాగమనేది లేనిదియును, దేవవిమానమువలె విశేషమైన శక్తి కలదియును, అద్బుతమైన విమానమును పవన నందనుడు చూసెను 

తపోనిష్టతే సంప్రాప్తమైనదియును, పరాక్రమముచే నార్జింప బడినదియును, మనస్సును బట్టి ప్రయాణము చేయునదియును, రచనా విశేషముల్తొ నిర్మించ బడినదియును, ఎక్కినా వాని మనస్సును బట్టి వేగముగా పోవు నదియును, శత్రువులకు కానరాకుండా అడ్డగించుటకు వీలు లేనిదియును,  వాయువేగాముతో, సమాన వేగముగా, పోవునదియును, పుణ్యవంతులు, మహాత్ములు ప్రయాణము చేయుటకు వీలున్నదియును 

విమానమును కుండలములతో శోభిల్లు చున్న వారును 
అధికమైన ఆహారమును  భుజించు వారును 
గుండ్రని కండ్లుగల ఆకాశసంచారుము చేయగల రాక్షసులను, పై వారితో పాటు పిశాచములు నడుపు విమానము చూసెను

 వసంత  ఋతువులో వికసించే పుస్పములవలెను
మనోహరమైన శరత్కాల చంద్రునివలెను, వసంతము కంటే మనోహరమైన పుష్పక వినమును, శిష్టరూపముగా ఉన్న విమానమును హనుమంతుడు చూసెను

 సుందరకాండము నందు 8వ సర్గ సమాప్తము
____((()))___
                                          

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                          శ్రీ మాత్రే నమ:
         శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
 సుందరకాండ 9 వ సర్గ 
 
రాక్షసేంద్రుని మహాభవనము అర్ధ యోజనము వెడల్పుగాను, ఒక  యోజనము పొడవు కలిగి బహు ప్రాసాదములతొ ఉండె, అక్కడఉన్న భవనములు చూచే చూస్తు రావణుని భవనమునకు పోయె,  విశాల నేత్రములుగల సీత కొరకు హనుమంతుడు  వెతుకు చుండెను

నాలుగు దంతములు, మూడు దంతములు గల ఏనుగులను, ఏనుగులపై  ఆయుధాలు ధరించిన మహా రాక్షసులను, నాల్గు దిశలు భవనమునకు  రక్షగా ఉన్న రాక్షసులను, లక్ష్మీ సంపన్నుడైన హనుమంతుడు చూసెను 

జాలములో ఉన్న  ఏనుగులను,మోసల్లను, మత్యము లను,  తిమింగలములను, అనేక మైన విష సర్పము లను, అ ప్రదేశము గాలికి కదిలే సముద్రము వలే నుండె, రాజకన్యలు, అనేక మంది స్త్రీలు గల భవనమును చూసెను 

కుబేరుని వద్దను, ఇంద్రుని వద్దను, చంద్రుని వద్దను 
ఎలక్ష్మీ నివసిమ్చునో ఆ లక్ష్మీ రావణ గృహము నందుండెను, కుబేర ,యమ,వరుణుల యోద్దగల సకల సమ్రుద్ధములను,  అంతకన్నా ఎక్కువగా రాక్షస  గృహమున తనరారు చుండెను  

 బ్రహ్మాను తపస్సుచె మెప్పించి కుబేరుడు పుష్పక విమానము పొందె, రాక్షసేంద్రుడు పరాక్రమముచే కుబేరుని జయించి విమానము పొందె, ఆ విమానము నందు వెండి బంగారము తో నిర్మించిన   చిత్రము లుండె, తోడేళ్ళచిత్రములతో రత్నాలకాంతులతో అద్భుతముగావేల్గొందు చుండెను 
  
పుష్పక విమానము మేరు మంధర పర్వతమువలె ఉండె, 
ఆకాశము తాకుచున్నాట్లుగా అద్బుతమైన సౌదాలతో ఉండె, ఆ విమానము అన్నిదిశలలో అలంకృతమై ఆకర్షిస్తూ ఉండె,  మనస్సు ను ప్రసాన్తపరిచి సంతోషాన్ని ఇచ్చే విమానమును చూసెను 

అగ్ని= సూర్యులవలె వెలుగొందుతూ సుందరముగా ఉన్నదియును, హేమ సోపాన సంయుక్త మైన శ్రేష్టమైన విమానమును చూసెను, ఉత్తమ ఘన్ధముగల రక్త చందన యుక్తమగు విమానముచు చూసెను, విశ్వకర్మచే విశేషముగా నిర్మించబడిన విమానమును మారుతి చూసెను

పాన భక్ష్య అన్నములవలన కలిగినదియును, నలు దిక్కుల వ్యాపించిన సువాసనను కలిగినదియును,  
దివ్య ఘన్ధముచెత మూర్తీభవించిన సువాసన కలది యును, వాసనలను గ్రహిస్తూ హనుమంతుడు సీతకొరకు వెతుకు చుండెను 

ఏనుగు దంతములచే నిర్మించబడిన వివిదాకృతులను
ముత్యములు, పగడములు, రత్నములు, ఉన్న బొమ్మ లను, భందు ప్రీతితొ తనను ఆహ్వానిస్తునట్టు, స్త్రీఅల పలకరిమ్పులను, అక్కడ ఇటురమ్ము  ఇటురమ్ము అని పిలిచినట్లు మారుతి భావించెను  

ప్రుద్విపై పెద్ద బంగారు తివాచీలు పరుచబడి ఉండెను 
మత్త విహంగములతో సుఘంధ పరిమళాలు వీచు చుండెను, పెక్కు స్తంభములతో ఉన్నభవనము దివికి ఎగురుచున్నట్లు ఉండెను,  గ్రహాది చిత్రాంకితమగు ఆ శాల భూమివలె విస్తీర్ణముగా ఉండెను

ప్రక్కపై పరచు జంపఖానాలు హంసలను బోలి తెల్లగా నుండెను, పాత్ర పుష్పోపహరములచె ఆశాల యమునా నదివలే కాంతిగా ఉండెను, ధూపములచె నిండియున్న సుఘంధములు ఘుభాలించు చుండెను, హనుమంతు నకు ఆప్రదేశము కాంతిజనకమై మనసును  ఉల్లాస పరిచెను

 శోకమును పోగొట్టునదియును కాంతికి ఉత్పత్తి స్తానమైన దివ్యశాలను, శబ్ద, స్పర్స, రూప, రస,గంధములను '5' ఇందిరియార్ధములతోను, దేవలోకములో ఉన్నట్లు 5 ఇంద్రియములు మారుతికి తృప్తి పరిచెను, ఆ ప్రాంతము తల్లి వడిలో ఉన్నట్లు హనుమంతునకు సంతోషముకల్గెను 

అక్కడ దీపముల కాంతి చేతను, రావణుని తెజము చేతను, పుష్పక విమానము కాంతి తోను, ఆభరణాల కాంతితోను , ఏకాంతముగా వెలుగుతున్న కాంచన దీపముల తోను , సిద్ధి శక్తులతో ఉన్న ప్రాంతము హనుమంతుడు చూసెను

నానా వర్ణములుగల వస్త్రములను, పుష్పహరములు ధరించిన స్త్రీలను, నానా వేష భూషితులై తివాచీలపై పరుండిన ఉత్తమ స్త్రీలను, అర్ధరాత్రియందు వివిధ క్రిడలచే అలసివళ్ళు మరచి నిద్రిస్తున్న స్త్రీలను 
శబ్దములేక నిశ్చలముగా ఉన్న నరనారీ సహాస్త్రమును మారుతి చూసెను

హంస బ్రమరములుగల మహా పద్మము వలే ఉన్న స్త్రీలను, నిమిళి నేత్రములు, పద్మ ఘంధములు గల స్త్రీలను, వికసించిన పద్మములవలె, మకుళితమైన పద్మములవలె ఉన్న స్త్రీలను, వికసించిన పద్మములపై మదించిన తుమ్మెదలను మారుతి చూసెను 

పద్మవదన స్త్రీల మద్య రావణుడు నిద్రించు చుండెను
తారల మద్య వెన్నెల కురిపించే చెంద్రుడిలా ఉండెను  
స్త్రీలందరు ఆకాశమునుండి రాలిన తారలుగా ఉండెను 
స్త్రీల ముఖ పద్మముల బట్టి వారి గుణములు తెలిసెను 

పాన క్రీడా సమయంలో విపర్యస్తమైన కెశములుగల స్త్రీలను, పెద్ద పెద్ద పూల చెండ్లు ధరించి క్రీడలొ రాలినపూలుగల స్త్రీలను, నుదుట తిలక చెదిరి ఘాడ నిద్రలో మైమరిచి ఉన్న  స్త్రీలను, కాలి అందెలు, హారులు, పడి ఉన్న స్త్రీలను మారుతి చూసెను

ముత్యాల హారములు తెగి,  రాలిన ముత్యాలమద్య ఉన్న స్త్రీలను, పై వస్త్రములు మొత్తము జారి,  వివస్త్రగా కనబడుతున్న స్త్రీలను, రసనా దామములు తెగి మత్తు మత్తుగా కదులుతున్న స్త్రీలను,  భారమును మోస్తున్న ఆడు గుఱ్ఱపు పిల్లవలెఉన్న స్త్రీలను మారుతి చూసెను 

మహావనములో గజ రాపిడికి రాలిన పూలవలె ఉన్న స్త్రీలను, నలిగి, తెగిన పుష్పాలపై కదులుతూ పరుండిన స్త్రీలను, కర్ణములకు ధరించిన కుండలములు క్రింద పడేసిన స్త్రీలను, స్త్రీల నిజరూపలను చూసి మనో నిబ్బరముగా హనుమంతుడుండెను

చంద్ర సూర్యులను బోలిన స్తనములపై హారములున్న స్త్రీలను, స్త్రీల రోమ్ములపై ఉన్న హారములు నిద్రించు హంసలు వలే ఉండెను,  బంగారువర్ణము కలిగి ఆభరణ ములతో స్త్రీలు, చక్రవాకములవలె ఉండెను, వైడూర్య ఆభరణములు ధరించిన స్త్రీలు నీటి కాకులవలె ఉండెను   

కొందరి స్త్రీల పిరుదులు ఇసుక తిన్నేలుగా కనబడు చుండెను, కొందరు స్త్రీలు చక్రవాక పక్షులతో శోభించు చున్న నదులవలె ఉండెను, ప్రేమాది భావములుగల మొసల్లుగా, కీర్తులె తోరణాలుగల స్త్రీలుఉండెను, 
చిరుమువ్వలె మొగ్గలుగా గల స్త్రీలను హనుమంతుడు చూసెను 

ముఖముపైఉన్నకేశములు గాలికి కదిలి  శొభయా మానముగా నుండెను, స్త్రీల శరీరము పై ఉన్న చీర  చేరుగులు జండాల వలే ఎగురు చుండెను, స్త్రీల యోక్క కర్ణ  కుండలములు క్రింద పడి  సవ్వడి చేయు చుండెను, స్త్రీలశ్వాస-నిశ్వాసము వళ్ళ వస్త్రములు ఎగురుటను మారుతి చూసెను

భార్యలురావణుని మోము అని బ్రాంతిచె సవతులను ముద్దుపెట్టు కొనెను, అస్వతంత్రులు రావణునిగా ఊహించి ఉత్తమస్త్రీలను చుంబించు చుండెను 
 ప్రత్యేకముగా తయారుచేసిన మద్యమును త్రాగిన స్త్రీలు అక్కడ ఉండెను, సుఖకరమైనదియగు వదన శ్వాసము రావణుని సేవించినట్లు మారుతి చూసెను

ఒక స్త్రీ మరియొక స్త్రీవక్ష స్తలముపై తల పెట్టుకొని నిద్రించెను, ఆమె భుజము తలకడగా చేసుకొని మరియొక స్త్రీ నిద్రించు చుండెను, ఒక స్త్రీ మరియొక స్త్రీతొడనే దిండుగా పెట్టుకొని నిద్రించు చుండెను
ఇంకొకస్త్రీ ఆమె యొక్క స్తనములనే దిండుగా పెట్టుకొని నిద్రించు చుండెను

కొందరు స్త్రీలు మదమునకు లోనై తొడలనె ఆశ్రయించి నిద్రించు చుండెను, పార్శములను, కటి ప్రదేశములను ఆశ్రయించి పెనవేసుకొని యుండెను, కొందరి స్త్రీలు స్నేహముతో శరీరముపై శరీరము చేర్చి నిద్రించు చుండెను, స్త్రీలుపరస్పరము ఊరు,పార్స,కటి, పృష్టముల నాశ్రయించి కౌగలించు కొనెను 

 వికసించిన పుస్పములవలె, వికసించిన స్త్రీలమఖాలు కనబడు చుండెను, పుష్పాలన్నీ దారంతో కట్టిన దండలాగా, స్త్రీలు ఒకరికొకరు చుట్టుకొనెను, స్త్రీలందరు వనంలో దట్టముగా ఉన్న పుస్పాలవలె పెనవేసుకొని ఉండెను, తుమ్మెదలు పువ్వు నుండి  పువ్వుపైకి పోయినట్లు స్త్రీలు కలసి ఉండెను 

స్త్రీలపై ఉన్న ఆభరణములను, మేనిపై ధరించిన వస్త్రములను, కొప్పులపై ధరించిన పూలను, ఎవరివో అర్ధకాకుండగా ఉండెను, నిద్రలొ ఉన్న రావణుని తేజస్సును, స్త్రీల ఆభరణాల వెలుగును,  నిర్నిమేష నేత్రములతో రావణుడు స్త్రీలను చూచు చుండెను 

అక్కడ రావణుని మరులుగొని దైత్యులు, గంధర్వుల వనిత లుండెను, అక్కడ రావణునిపై ప్రేమతో వచ్చిన, మదవతులైన స్త్రీలు ఉండెను, అక్కడ కోందరు స్త్రీలు రావణునిపై మన్మద ప్రేరణ కలిగి  ఉండెను, రావణుని ప్రక్కన మద మత్తులైనస్త్రీలను హనుమంతుడు చూచెను 

అక్కడ బలత్కారముగా తెచ్చిన స్త్రీలు అనేవారు లేకుండెను, అక్కడ కొందరు స్త్రీలు రావణుని గుణసంపదచే వచ్చినవారై ఉండెను, అక్కడ రావణుని భార్యలలో ఇతరలుకు బార్య లైనవారు లేకుండెను, 
అక్కడ రావణునిపై తప్ప, ఇతరులపై ప్రేమ ఉన్న భార్యలు లేకుండెను 

 రావణుని భార్యలలో నీచకులములొ పుట్టిన వారు లేకుండెను, రావణుని భార్యలలో తక్కువ అందము, హీనసత్వురలు లేకుండెను,  భార్యలలో ఉత్తమమైన భూషణములు ధరింపని వారు లేకుండెను,   
రావణు 
నిచే బలాత్కారముగా తేబడిన సీత కాన రాకుండెను

హనుమంతుడు మనసులో అనుకొనెను రావణుని ఐశ్వర్యమునకు సీత లొంగి పోయి ఉండవచ్చునను కొనెను।  ఆది కవి వ్రాసిన ఈభావనను వివిధకవులు ఈ విధముగా వివరించారు। 

రావణుని భార్యలను చూసినట్లుగా, రాముని భార్య అగు సీతను చూసిన జన్మ సఫలమగును 
రావణుని భార్యలను చూసినట్లుగా,  సీతను కుడా భార్యగా  అనుకున్న సర్వనాశన మగును,  రావణుని భార్యలను చూసినట్లుగా, భర్తే ఆరాధ్య దేవతాగా ఉన్నసీతను కామించిన బ్రష్టుడగును, రావణునిచే తేబడిన సీత మరెక్కడన్నా ఉన్న వానరుల  ప్ర యత్నము విఫలము కాకుండును 

సీత తప్పక అందరికంటే గొప్ప గుణము కలిగి ఉండును
రావణుడు సీతను అపహరించి చెయకూడని పని చేసిన వాడయ్యేను, భర్త లేని సమయాన చౌర్య రూపమున సీతను అపహరించి తెచ్చెను, హనుమంతుడు దుఃఖముతో  సీత కానక మనస్సులో భాద వ్యక్తీ కరించెను। 

స్రీ సుందర కాండమునందు 9సర్గ సమాప్తము
___((()))___
ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                  శ్రీ మాత్రే నమ:సుందరకాండ 10వ సర్గ  
 శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:

రాజభవనము అంతను వెతుకుచూ య్యాసనాగారమును చూసె, రత్న, స్పటిక, మాణిక్యములతో అలంకరించ బడిన మంచములను చూసె, మంచములు, ఆసనములు, దంతపు నగిషీలతొ చేసిన చిత్రములు చూసె, అత్యుత్తమైన సుఘంధ పరిమళాలతో ఉన్న గృహమును మారుతి  చూసెను 

శయనా గృహమునందు ఒక ప్రక్క ఉత్తమమైన వస్త్రము లు ఉంచె,  మరో ప్రక్క చంద్రునితో సమానమైన శ్వేత చత్రమును ఉంచె, అక్కడ శయనము చుట్టూ అశొక మాలలు కట్ట బడి యుండె,  ఆ ప్రాంతము అగ్నితో సమానమైన వెలుగును హనుమంతుడు చూసెను 

శయనముపై  మేఘమువలె ఉన్న రావణుడు నిద్రించు చుండె, ఉత్తములైన కుండలములు, హారములు రావణుడు ధరించి యుండె, మహాబాహువులు గల రావణుడు ఎఱ్ఱని నేత్రములుకలిగి ఉండె, బంగారు వస్త్రములు ధరించిన రావణున్ని హనుమంతుడు చూసెను   
   
 సుఘం    ధము, ఎర్రచందనము పూసుకున్న రావణుడు నిద్రించు చుండె, సంజ ఛాయలచే నేర్రబడి, విద్యు లేఖాయుక్తమును బోలిన రావణుడు ఉండె, స్వేచ్చ సారముగా రూపమును మార్చుకోగల అతని రూపం అందముగా ఉండె, వృక్షములతో,పొదలతో నిండియున్న మందర మందార పర్వతమువలె రావణుడుండెను 

రావణుడు రాత్రియందు ప్రియరాన్డ్రతో  క్రీడించి విశ్రాంతిగా నిద్రించె, మధుర రసాన్ని  త్రాగిన రావణుడు సుఖముగా నిద్రించు చుండె, రాక్షసకన్యలకు ప్రియు డైన రావణుడు ఘాడముగ నిద్రించు చుండె, వీరుడైన రాక్షసాదిపతిని పవన పుత్రుడగు హనుమంతుడు చూసెను 

తీర్ఘ విశ్వాసములతో బుసలు కొట్టుచున్న సర్పమువలె రావణుడు ఉండె, హనుమంతుడు రావణున్ని చూసి భయముతో దూరముగా వెళ్లి చూడ సాగె, హనుమంతుడు  మరియొక వేదికపైకి ఎక్కి రాక్షస ప్రవరున్ని చూడ సాగె, 
 మదపుటేనుగు సెలయేరులో ఉండి నిద్రపోతున్నట్లు రావణుడు ఉండుట చూసెను 

రాక్షసేంద్రుని రెండు భాహువులు ఇంద్రద్వజముల వాలే ఉండె,  బాహువులమీద ఇరావతముతొ పొడిచిన గాయములు కనబడు చుండె, బుజములమీద విష్ణు చక్ర ప్రహారములు కాన బడుచుండె, బలసినదేహమునకు భుజాలుచాలా బలముగా కనబడు చుండెను

రావణుని యొక్క  రెండు భుజములు పర్వత శిఖరముల వలె ప్రకాశించు చుండె, రావణుని రెండు భాహువులు పర్వతముపై నిద్రించుమహాసర్పముల వలే ఉండెను
రావణుని భాహువులకు   సుఘంద  ద్రవ్యములు పూత పూయ బడి యుండె, భాహువులకు కుందేటి రక్తమువలె ఎర్రనైన చల్లని ఘంధము పూయ బడి యుండెను

రాసా- పున్నాగ- పుష్పములను బోలి సౌరభము కలదియును, ఉత్తమమము లగు పొగడ పూల వంటి వాసన గలదియును, మృష్టాన్నరస సంయుక్తమును, మధు పానమును కూడు కొన్నదియును, రాక్షసేన్ద్రుని శ్వాస ఆ గృహము అంతా వ్యాపించుత హనుమంతుడు చూచెను 

రావణుని ముఖము మణులతో ఉన్న బంగారు కిరీటమువలె ప్రకాశించు చుండె, రావణుని వక్షము మద్య రత్నాలతో ఉన్న ధగ ధగ మెరుస్తూ పెద్ద హారము ఉండె, రావణుడు  మిక్కిలి విలువగల పసుపు పచ్చని ఉత్తరీయము ధరించి ఉండె, రావణుడు మినుముల రాసివలె నల్లని వర్ణముతో, ఎర్రని నెత్రముల ప్రకాశించు చుండెను  

రావణుడు నిద్రిస్తున్నప్పుడు నాల్గు దిక్కులా విద్యు దీపములు వెలుగు చుండె, రావణుని యొక్క సర్వావయవాలు  మెరుస్తు, గ పురుషుడుగా కనబడు చుండె,రాక్షసుని పాదములవద్ద నిద్రిస్తున్న అతని భార్యలు అప్సరసలగా కనబడు చుండె,  
ఆర్తిగా సౌందర్యము ఇంతఅని వర్ణించుట ఆబ్రహ్మాకు కుడా తగునా అనిపించు చుండెను

శ్రేష్టమైన కుండలములు ధరించినవారును, ఎప్పుడు వాడి పోనీ పూలను ధరించిన వారును, చంద్రునివలె కాంతి వంతమైన ముఖము కలవారును, రావణుని భార్యలను వానారాధిపతి చూసెను 

నృత్యవాద్యములనందు నైపుణ్యము కలవారును, 
విలువగల బంగారు ఆబరణములు ధరించినవారును,
రాక్ససేంద్రుని కౌగిలిలొ చిక్కిన వారును,రావణుని భార్యలను హనుమంతుడు చూసెను

భార్యలకు వజ్రములతో పొదగబడిన బంగారు కుండలములు ఉండె, భార్యల బాహువుల యందు బంగారు కడియములు ధరించి యుండె, భార్యల ముఖము ఒక దివ్యమైన వెలుగుగా వెలిగి పోవు చుండె,
భార్యలందరూ నక్షత్రములవలె వేలుగుచున్నట్లు హనుమంతుడు చూసెను 

తీగలాగ సన్నని నడుముగల రానుని భార్యలు మద్యమును త్రాగి ఉండె, కొందరు మదము చేతను, అధిక  రతికేళి చేతను అలసి సొమ్మసిల్లి  యుండె,
ఎక్కడ అవకాసము దొరికే అక్కడ ఉన్న స్త్రీలను వారికి కౌగలించుకొని యుండె, బలసి యున్న మనోహరమైన స్త్రీలను హనుమంతుడు అక్కడ ఉండుట చూసెను  

 అంగ విన్యాసముతొ, నృత్యము చేసి, అలసినవారును,  
న్నృత్యానుకూలముగా అవయవములను ఉంచి నిద్రించు వారును, వీణను వాయిస్తూ, కరచుకొని, వళ్ళు మరచి, నిద్రిస్తున్న స్త్రీలను,  మహానదిలో తెప్పకు చుట్టుకొన్న లతలవలె స్త్రీలు  ఉండెను 
 
చంకలో గుమ్మేటతో ఒక నీల నేత్రి నిదిరించు చుండెను  
పిల్లవాడ్ని పెట్టుకొని నిద్రించి వాత్చల్యముగల తల్లివలె ఉండె, అందమైన అంగములుగల ఒక స్త్రీ తప్పెటను హత్తుకొని నిద్రించు చుండె, ఆ స్త్రీ ప్రియున్ని ఆలింగ నము చేసికొని నిభావము ద్రించు కామినివలే ఉండె,  కమలము లవంటి కళ్ళుగల యువతి వేణువును కౌగలించుకొని నిద్రించు చుండె, ఆమె  ప్రియతమని ఎకాంత ప్రదేశము నందు గ్రహించి శయనించి ఉండె, నియతముగా నృత్యముచేయు మరియొక స్త్రీ సప్తతంత్రులు వీణను మీటుచుండె, ఆ  విణను హత్తుకొని ఉన్న స్త్రీ కాంతునితో నిద్రించు భామినివలె ఉండెను 

 మదముతో ఉన్న ఒక స్త్రీ మ్రుదంగమును హత్తుకొని నిద్రించు చుండె, బలసిఉన్న ఆ స్త్రీ మృదంగమే భర్త అని భావించి హత్తుకొని నిద్రించు చుండె, మద్యపాన మత్తులో ఉన్న ఒక స్త్రీ తప్పెటను కౌగలించుకొని నిద్రించు చుండె, కామమత్తులో ఉన్న  స్త్రీలను హనుమంతుడు చూస్తు ముందుకు పోయెను

ఒక స్త్రీ ఆడంబరము అనే వాయద్యమును గట్టిగా బాహు పాశమున బిగించె, మరొకస్త్రీ నీటికలశమును బోర్లించుకొని తడిసిన  పుష్పాలవలె శోభిల్లు చుండె, ఒక స్త్రీ తనచేతులతో కలశములు బోలిన వక్షోజాలను పాట్టుకొని నిద్రించు చుండె,పూర్న చంద్రుని మోము గల ఒక స్త్రీ మరొక స్త్రీని కౌగలించుకొని నిద్రించు చుండెను 

హనుమంతుడు పచ్చని శరీరకాంతిచే బంగారములా మెరుస్తున్నఒకస్త్రీని చూసె, రావణుని ఇష్టసఖి, సౌందర్యవతి అయిన మండోదరి నిద్రించు చున్నది యును, సౌందర్య యవ్వన్ భూశీతయగు స్త్రీని చూసి హనుమంతుడు సీత అని ఆనందించెను , శయనంపై ఉన్న ఆమె స్తితిని చూసి వెంటనే హనుమంతుడు దైన్యము పొందెను

హనుమంతుడు వాలముతో నేలపై కొట్టెను, కపి సహజ స్వభావముతో ముద్దుపెట్టుకొని ఆనందము అనుభ వించె, హనుమంతుడు గంతులు వేస్తూ  పైకి క్రిందకు పరుగెడుతూ ఉండె, మారుతి స్తంభములపై ప్రాకుచు, తిరిగి క్రిందకు దూకుచూ ఉండెను

 సుందర కాండము నందు  10 వ సర్గము సమాప్తము
___((()))___

 ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
11 వ సర్గ సుందరకాండ    శ్రీ మాత్రే నమ:
    శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:

నిద్రిస్తున్న వనితా సీత అని ఆలోచన విడిచి స్వస్త చిత్తుడాయెను, సీతను గూర్చి పలువిధముల ఆలోచించి చింతకు లోనయ్యే, సీతా మహాసాద్వికి రామునితో విరహితయై నిద్ర అనేది లేకుండె, రాముని తలుస్తూ ఎటువంటి ఆహారమును తీసుకోకుండా ఉండెను 

భర్త లేనిచోట ఉన్నసీత ఎట్టి అలంకారము చేసు కోకుండా ఉండె, పతివ్రత ఐన సీత ఎటువంటి మద్యమును సేవించకుండా ఉండె, పరపురుషుని ప్రక్క సీత ఎట్టి పరిస్తితిలో నిద్రించాకుండా ఉండును,
హనుమంతుడు ఆమెసీత కాదనిభావంచి సీత కొరకు వెతుకుట ప్రారంభించెను 

దేవతలరాజు ఇందృడు వచ్చి సీతను కామించిన సీత త్రుణీకరించు, సీత రామచంద్రునితో సమానమైన వారు అసలు లేరని వాదించు, సీత సందర్సన కౌతూహలము గల వానరాధిపతి అక్కడ సంచరించెను

సీతను వెదుకుటకు హనుమంతుడు మరలా ప్రయ త్నించు చుండె, పానభూమి యందు కొందరు స్త్రీలు అధికరతితో అలసి యుండె, మరికొందరు పాటలు పాడుటవల్ల అలసి సొమ్మసిల్లి యుండె,  నృత్యము చేయుటవల్ల పాదముల నేప్పులతో మూలుగు చుండెను
కొందరు అధికపానమత్తుచే శిధిల శరీరముగలవారై నిద్రించు చుండె, అక్కడ వేలకొలది స్త్రీలు వివిధ అలంకారములతో ఉండె, కొందరు స్త్రీలు సౌందర్యాదివిషయములగూర్చి ముచ్చటించు చుండె, 
గీతములలొని అర్ధములను గూర్చి ఒకరికొకరు చెప్పుకోనుచుండె, దేశకాలమునుబట్టి తగు విధముగా అక్కడ ఉన్న స్త్రీలు పలుకుచుండెను

రావణుడు ఆవుల మద్య ఉన్నమత్త వృషభమువలె ఉండె, రాక్షసేశ్వరుడు ఆడేనుగులచే పరివృతమైన మదపుటెనుగువలె ఉండె, రాక్షసరాజు గృహము అంత సర్వకామోపేతముగా ఉండుట గమనించె, యవ్వన పొంగులతో ఉన్న నారీ సహస్రమును హనుమంతుడు చూసెను

పాన సాలలయండు లేళ్ళు మరియు  మహిశముల యొక్క మాంస ములను, సువర్ణ పాత్రలయందు  భజిమ్పబడిన నేమ్మల్లు, కోళ్ళు యొక్క మాంస ములను
అక్కడక్కడ పెరుగు లవణము కలిపినా వివిధములైన మేకపోతూ మాంస ములను,  ఎనుబందులు, పక్షులు యొక్క మాంసములను హను మంతుడు చూసెను 

తినుటకు సిద్ధముగా ఉన్న కొక్కర మాంసములను 
అనేక రకములుగా తయారు చేసిన మేక మాంసములను
కొమ్ము చేపలను, కుందేటి మాంసమును, గొర్రె మాంసము, సగము తిన్న దున్నబోతు మాంసమును హనుమతుడు చూసెను

ద్రాక్ష దానిమ్మ రసములతో తయారుచేసిన రసము,  
ప్రధానముగా పులుపు ఉప్పు తో చేసిన పదార్ధములను, 
పాన పాత్రలయందు పడవేసిన వివిధ ఫలములను, 
పుష్పాలతో శోభగా ఉన్న ప్రాంతమును మారుతి చూసెను

పానసాలలయందు అగ్ని లేకుండగనే మండు చున్నట్లు గమనించెను, మాంసమును మంచి పాకాది సంస్కారములచే సంస్కరించెను, అనేక పద్ధతులతో భక్షములను తయారుచేసి ఇంపుగా అమర్చేను, అక్కడకొన్ని సయనములు, ఆసనములు ఖలీగ ఉండుట మారుతి చూసెను
దివ్యమైన స్వచ్చమైన అనేక విధములగు సహజ మద్యములను, వివిధ ద్రవ్యములతో తయారు చేయ బడిన కుత్రిమ మద్యమమములను, అనెకవిధములుగా పోపులు పెట్ట బడిన పదార్ధములను, బంగారు,స్పటిక పాత్రలతో పానభూమి సొభిల్లు చుండెను  

విప్పపూలు మొదలగు పూలతొ చేయబడిన పుస్పా సవములను, ఖర్జూరపు పళ్ళతో చేయబడిన ఫలా సవములను,  ద్రాక్షపల్లతో  చేయబడిన ద్రాక్షా సవములను, మధుర భరితమైన పదార్ధాలతో పానభూమి సోభిల్లుచుండెను

అక్కడ మద్యముతో నిండిన బంగారు భాండములను,
పూర్తి గా త్రాగిన మణులతో చేసిన రక్త పాత్రలను, వివిధ భాక్షముల్తో నిండిన వెండి పాత్రలను, సగము త్రాగిన పాత్రలను హనుమంతుడు చూసెను 

ఒక ఆబల మరియొక ఆబల వస్త్రములను అపహరించి నిద్రించు చుండెను, ఒక యువతి ఆమె వద్దకు చేరి ఘాడముగా ఆలింగనముచేసి నిద్రించు చుండెను,       
నిద్రించు చున్న స్త్రీ యొక్క వస్త్రము యజ్ఞాస్వమువలె ఎగురుచుండెను, మందమారుతముచే పై వస్త్రములు మెల్లగా కదులుచుండుట మారుతి చూసెను 

చల్లని చందనములయోక్క మధుర రసముల యొక్క వాసనలను, మద్యముయోక్క, వివిధ పుష్పముల యోక్క వాసనలను, ఘంధ లేపణలు పూసుకున్న వారి వాసనలను, పుష్పకవిమానములో నుండి వచ్చు వాసనలను మారుతి గమనించెను

ఆగ్రుహములొ కొందరు స్త్రీలు నిగనిగలాడుచు శ్యామల వర్ణములు కలిగి ఉండె, మరికొందరు స్త్రీలు బంగారము వలె మెరుస్తూ స్వేతవర్ణముగలగి ఉండె, అధిక రతిచే అలసి పోయినా స్త్రీలు ఇంకా అందముగా కనబడు చుండె, హనుమంతుడు స్త్రీలను చూస్తు సీత కనారాక దిగులు పడు చుండెను 

హనుమంతునకు ధర్మలోప భయశంకితుడై సందేహము ఉదయించెను, నిద్రించు చున్న  స్త్రీలను చూచుట మిక్కిలి ధర్మనాశనమని భావించెను   నాదృష్టి ఇంతవరకు ఎన్నడును పరదారులపై ప్రవర్తించ లేదియును, కాని ఇక్కడ  పరదార పరిగ్రహీతయగు రావణుడు చూడబడు చుండెను

ధీరచిత్తుడగు హనుమంతునకు మనస్సునందు ఆలోచన ఉదయించెను, నేను రావణ స్త్రీలనందరును యదేస్చగా చూడ గలుగు చున్నాను, సర్వెంద్రి యము లకు మనసే కారణము కనుక ఆ మనసే నాకు స్తిరముగా ఉండె, కాని మానసిక వికారము అనేది  కలుగలేదని హనుమంతుడు తలచెను 

సీతకొరకు నేను మరొక ప్రదేశమునకు పోయి  వేదికెదను 
స్త్రీల మధ్యకు పోయి  స్త్రీలన్దరిని పరిసీలిస్తు సీత కొరకు వేదికేదను, జంతువుబట్టి  అజంతువులు ఉన్న చోట వెతుకు చుండ వలెను, లెల్ల మధ్యకు పోయి స్త్రీలను వెతుకుట ఏమి లాభము కలుగును 

నేను నిష్కల్ముష మైన మనస్సుతో ఈ ప్రాంతమంతా వేదుకు చున్నాను, అంత:పురములో దేవ, ఘంధర్వ, నాగ కన్యలను చుచు చున్నాను, ఎంత వెతికినాను పతివ్రతయగు సీత మాత్రము కాన రాకుండెను 
పట్టు వీడకుండుగా  పట్టుదలతో వెతికినా సీత కానవచ్చు నని తలంచెను

సుందర క్జాన్దమునన్దు 11 వ స్వర్గము సమాప్తము
___(()))__
ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                         శ్రీ మాత్రే నమ:
              శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
ప్రాంజలి - సుందరాకాండ తెలుగు వచస్సు (12వ సర్గము )

అంత: పురమంతా అంగుళం కూడా వదలకుండా వెతికే, రావణుని భార్యలందరినీ పరిసీలించి మరీ చూసే, నేను చేసిన శ్రమ అంతా నిష్పరోయోజన మయ్యే, సీత ఉన్న ప్రాంతము ఎక్కడ తెలుసుకోలేక పోయెను

హనుమంతుడు లతాగృహములను, చిత్రగ్రుహములను వెతికే,ఏంతో అందమైన, పతివ్రతా ఐన, సీత  కాన రాకుండే,రఘునందనుని భార్య సిత కనబడక పోవుట వల్లె ఈవిధముగాతల పోసే, ఎంత వెతికినను కానరాకపోతే సీత మరణించి ఉండవచ్చునని అను కొనెను 

సీల రక్షణతో ఉన్న సీత, లొంగక పొతే రాక్షస రాజు చంపి యుండ వచ్చు, విక్రుతాకర  కారాముగల రాక్షసులు వేదనకు తట్టుకోలేక మరణించ వచ్చు,  
రావణుని భార్యల వత్తిడులను తట్టుకోలేక, అధారము లేక మరణించ వచ్చు, పుణ్యమైనా ధర్మ మార్గమున ఎక్కడైనా గుప్త ప్రదేశములో ఉండి యుండ వచ్చును                  

సీత జాడ తెలియకుండా నేను సుగ్రీవునివద్దకు వెళ్ళనే వెళ్ళను, సుగ్రీవుడు ఆజ్ఞను పాటించని వారిని తీవ్రముగా దండిన్చును, సుగ్రీవునకు సీత కాన రాలేదు అన్న నన్ను శిక్షిమ్చును, వానారులందరికి సీత కనబడలేదని చెప్పిన లాములేకుండును 
              
ఉఆగి త్తరతీరమునన్దు ఉన్న
 వానరులకు నేను ఏమి చెప్పవలెను, వానరుల అడిగే ప్రశ్నలకు ఏమి సమా ధానము ఇవ్వ వలెను, లంకలో ఎమిచెసితివి, ఏమి చూసితివి, అన్న ఏమి చెప్పవలెను, నేను అక్కడకు వెళ్ళకుండా ఇక్కడే ప్రాయోప వేశము చేసెదను 

వృద్దుడగు జాంబవంతుడు అడిగిన ఏమి చెప్పవలెను 
అంగదునకు, వానరులందరికి ఏమి చెప్పి నమ్మిమ్చ గలను, నేను (అనిర్వేదము)దిగులు చెందక  పట్టు దలతో మరల వెతికేదను, అనిర్వేదము మానవులకు సర్వకార్యములందు ప్రవర్తిమ్పచేయు చుండెను

అనిర్వేదము మానవులకు తలపెట్టిన పని సఫలమగు నట్లు చేయు, అందుకే ఇంకా నేను వేతకని ప్రాంతము లన్ని వెతికెద, పానశాలలు, పుస్పగ్రుహములు, క్రీడా గ్రుహములను వేదికేద, ఉద్యాన వీధులను, వెతుకుచూ మరల అన్వేషణ ప్రారంభిమ్చేను

భూమి లోపల గృహములను, భూమి పైన ఉన్న గృహము లను, ఇంటిపైకి ఎక్కియును, క్రిందకు దూకియును, వెతక సాగెను, ఒకచోట నిలబడి, మరల కదిలి, నడుస్తూ, పరిగెడుతూవెల్లసాగెను, హనుమంతుడు అక్కడ ఉన్న ప్రదేశ మంతయు వెతికేను 

ప్రాకారములు ఉన్న వీధులలో తలుపులు తెరచి వెతికేను, కొన్ని గృహముల తలుపులు త్రొయుచూ వెతికేను, దిగుడుబవులను, సరస్సులను వెతికేను 
హనుమంతుడు వెదకని ప్రదేశము లేకుండా వెదికేను

వికృతాకార రాక్షస స్త్రీలను చూసె, సౌందర్యములో సాటిలేని స్త్రీలను చూసె, అందమైన పిరుదులు కలిగినవారిని చూసె, హనుమంతునకు ఎంత వెతికినను  సీత కానరాకుండె, రాక్షస రాజు బలాత్కారముగా తెచ్చిన నాగ కన్యలను చూసె, సీత గురించు ఆలోచిస్తూ హనుమంతుడు నిరుస్చాహ పడె, తాను చేసిన సముద్ర లంఘనము వ్యర్ధమైనదని భావించె, దు:ఖముచేత ఏమిచేయవలెనో అని ఆలోచనలో ఉండి పోయెను

     శ్రీ  సుందరా కాండ మునందు  12వ సర్గము సమాప్తము
___((()))___

    

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
      13వ                     శ్రీ మాత్రే నమ:
                   శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
విమాన గృహములనుండి ప్రాకారముల మీదకు దూకి వేదకసాగె, మేఘములోని మెరుపువలె హనుమంతుడు వేతక సాగె, రావణుని భవనమన్తా ఒక్క సారి చూసి మనసులో ఇట్లనుకోనే, ఎంత వెతికిన రాముని ప్రియసఖిని చూడలేక పోయినాను, నదులు,  కోనేరులు, భూమి అంతా వెతికినాను సీత కనబడ కుండెను 
 భవనములు, వెతికినను సీత జాడతెలుసుకొనే అవ కాశము లేకుండె,  విదేహ తనయ సీత ఎక్కడ ఉన్నదో తెలుసుకొనుట కష్టమయ్యే, గ్రద్దరాజగు సంపాతి రావణుని భవనములో ఉన్నదని మాట వమ్మాయెను 

ఒకవేళ సీత రావణుడు బలత్కరిమ్పగా వసురాలై లొంగి పోయి ఉండునా, ఆకాశమార్గమున తెచ్చునప్పుడు రావణుని చేతినుండి సముద్రములో పడి యుండునా,  
ప్రాణ రక్షణకోసం రావణుని చేతినుండి తప్పించుకొని సముద్రములో దూకి యుండునా,రావణుడే సీతను భక్షించు మని రాక్షసులకు ఆజ్ఞ ఇచ్చి యుండ వచ్చును

హారామా! హా లక్ష్మణా !హా అత్త లారా విలపించి శరీరము త్యాగము చేసి యుండును, రామ ముఖద్యాన పరురా లగు, దీనురాలగు, కరుణాలవల్లి, మృతి చెంది యుండు, రావణుని భార్యలచే దోషరహితురాలగు సీతాదేవి భక్షించ బడి యుండును, సీత పంజరములో చిక్కిన గోరువంకవలె ధు:క్కిస్తూ  బ్రతికి యుండ వచ్చును 

జనకుని కులమున పుట్టినదియును, ఉత్పల పత్రాక్షియును, రాముని పత్ని యగు సీత రావణునికి ఎట్లా వశమగును, కనపడక పోయినాను, రామవిరహము తో మృతురాలు ఆయినను, రామచంద్రునకు సీతజాడ తెలుపక ఇక్కడే వెతుకుతూ తిరిగేదను

తెల్పన ఇబ్బంది యగును, తెలపక పోయిన దోషము అగును, ఈ విషయయము చాలా గోప్యముగా ఏమి చేసి దాచవలయును, ఏమిచేయవలయునో సమయోచిత నిర్ణయము తీసుకొనవలెను, సీతజాడ తెలియకుండా కిష్కిందకు పోవుదునేని పురుషార్ధము సాధింప బడును 

నాయొక్క సముద్ర లంఘనం అంతా వ్యర్ధము అయ్యెను 
లంకా నగరమంతా వెతుకుటకు కాలం నష్టం మయ్యెను
రాక్షస రాజు, రాక్షసకన్యలు దర్సనం వ్యర్ధమయ్యేను 
నేను వెళ్ళిన సుగ్రీవుడు ఏమిఅనును వానరులు ఏమి అడుగును

రామచంద్రునితో సీత జాడ తెలియ లేదన్న జీవితము త్యజించును, రాముడ్ని ఘాడముగప్రేమించు మేధా వియగు లక్ష్మణుడు మరణించును, రామలక్ష్మణులు లేరని తెలిసిన భరతశత్రుఘ్నులు మరణించును, 
పుతృలు జీవించిలేరని తెలిసిన కౌసల్య,సుమిత్ర,కైకేయి మరణించును 

రాముని దుస్థితినిచూసి సత్యసంధుడగు సుగ్రీవుడు జీవితము త్యజించును, ధీనురాలు, దు:ఖచిత్తయును, భర్త్రుశోకపీడితయగు రుమ జీవితము త్యజించును
వాలి మరణముచే ద:ఖితురాలగు తార గూడ జీవితము త్యజించును, వానరులందరూ తలలు బ్రద్దలు కొట్టుకొని జీవితము త్యజించును

వానరులు మంచి మాటలు చెప్పేవారు, ఆదరించు వారులేక మరణించును, వనములందును, పర్వతములందును, సంచరించకఏంతోదిగులు చెందును, క్రీదా సుఖములను అనుభ వించక తలలు బ్రద్దలు కొట్టు కొని మరణించును, వానరుల భార్య పుత్రులు అందరు కలసి సముద్రములో పడి మరణించును

కొందరు వానరులు దొరికిన విషమును త్రాగియు, మరి కొందరు తాడును ఉరిగా తలకు వేసుకొనియు,ఇంకొంద రు అగ్నిని రగిల్చి దానిలో దుముకుటయు, వానరు లందరూ ఉపవాసములతొ ఉంది మరణించును

నేను తిరిగి వెళ్ళిన ఇక్ష్వాకు వంశము నశించు,వానరులు నశిమ్చి భయంకరమైన విషాదము సంభవించు, నేను ఎట్టి పరిస్తితులలో కిష్కిందకు వెళ్ళనే వెళ్ళ,        
హను మంతుడు వచ్చును, శుభవార్త తెచ్చును అని అందరు జీవించును

సీత కనిపించు వరకు నియమమును పాటించెదను
వృక్షములనందు నివసించి చేతిలో పడినదానిని గ్రహించేదను, దుంపలు, ఫలములు  తినుచు ఉదకముత్రాగి జీవించెదను, జలప్రాయ ప్రదేశము నందు వాన ప్రస్త జీవితము గడిపెదను

లేదా చితిని ఏర్పరుచుకొని ప్రజ్వలించుచున్న అగ్నిలో ప్రవేసిమ్చేదను, అన సన వ్రతమును అవలంభించి జంతువులకు అహార మగుదును, జలప్రవేశము చేయుట ఋషి సంమతమని భావింఛి మరణిమ్చేదను     
నేను సీత చూడక నా కీర్తి మాలిక శాశ్వితముగా భగ్నమై పోవును

సీతను చూడకుండగా నియతెంద్రుడునై తాపస వృత్తిని ఉండేదను, జానకి కన బడక పోయినను తిన్నగా జలములో పడెదను, జీవిత నాశనమునకు పక్కు దోషములు కానవచ్చు చుండెను, జీవించి యున్న తప్పక ఎప్పటి కైనా సీతను చూడగలను

ద:ఖముతో హనుమంతుడు శోకమును దాత జాలక పోయెను, ధైర్యవంతుడైన హనుమంతుడు తక్షణ కర్తవ్యము ఏమిటని ఆలోచించెను, సీత కనిపించక పోయిన రావణునికి గుణపాటము చెప్పి వెల్లెదను
పశువుని పశుపతిని అర్పించినట్లు నేను రావణున్ని రాముడికి అర్పించెదను

చింతా క్రాంతుడై, ద్యానశొక కులస్వాంతుడగు కపివరుడు విచారించెను, రామ పత్నిని చూసె వరకు తిరిగి తిరిగి ఈ లంకను గాలించేదను, రాఘవున్ని తెచ్చిన సీత కానరాక వానరులను కోపాగ్నిచే దహించును, నేను ఇక్కడనే నియ తెంద్రియుడైన, నియతహారుడునై నివసించెదను
  
మహా వృక్ష సంపన్నమగు విశాలమైన ఆశోకవనమును వెదక వలెననుకొనేను, వసువులను, ఆశ్వనీ దేవతలను, దేవతలరాజైన ఇంద్రునకును, మరుత్తులకును
నమస్కరించి రాక్షసుల దు:ఖమును వృద్ధి పొందించు టకై వనం లోనికి పోయెను, రాక్షసులనుజయించి తపోధనునకు సిద్ధిని అందించినట్లు సీతరామునివద్దకు చేర్చేదను

చింత చేత దుర్బలములైన ఇంద్రియములను హనుమంతుడు వృద్ధి పొందించెను, హనుమంతుడు క్షణ కాలము ఆలోచించి అశోకవ్వనప్రవేశోద్యుక్తుడై  వచ్చెను, రామ చంద్రునకు, సీతా దేవికి, లక్ష్మణునికి నమస్కారము చేసి బయలుదేరేను, అశోక వనమంతా  రాక్షసులతో నిండినదై వృక్షములతో వ్యాకులమై యుండెను

ఆశోకవనము సంస్కారములచేత సంస్కృతమై పుణ్యప్రదముగా ఉండియుండెను, ఉద్యాన వనము నందు  రక్షక భటులు వియమితు లై వృక్షములను రక్షించును, అక్కడ పూజ్యుడైన వాయు దేవుడు కుడా తీవ్రత్వము లేకుండా గాలి  వీచెను, రాముని కార్యము చేయుటకు రావణునికి కనబడకుండా శరీరము చిన్నది చేసెను

బుషిగణములు, దేవతలు నాకు ఇక్కడ కార్యసిద్ది కలుగ చేయమని ప్రార్ధించెను, బ్రహ్మదేవున్ని, దేవతల్ని, అగ్ని, దేవెందృడ్ని, వరుణ్ణి,  ప్రార్ధించి  వేడుకొనెను
చంద్ర సూర్యులను, అశ్వనీదేవతలను, రుద్రుడ్ని, కార్యసిద్ధిఇవ్వమని ప్రార్ధించెను, సకలభూతములను, సర్వేస్వరున్ని, ఇతరదేవతలను, కార్యసిద్ధికి సహకరించమనేను

ఎత్తైన నాసికము, తెల్లని దంతములు, తామర రేకుల వంటి నెత్రములను, చంద్ర బింబము వలేఉన్న రామపత్నిసీత ముఖమును ఎప్పుడుచూచెదను
నీచుడు, పాపాత్ముడు, భయమును కలిగించే వేషములు మార్చే వాడును, రావణుడు ఆబలఅయిన సీతను తెచ్చిన అమే నాకుఎప్పుడు కనిపించును

శ్రీ సుందర కాండ మునందు 13 వ సర్గము సమాప్తము           
      
____((())))___


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
 15 వ సర్గ (వాల్మికి రామాయణములోని తెలుగు వచస్సు)

అశొకవనము కల్పలతలతోను  వృక్షములతో శోభిల్లు చుండెను, దివ్యగంధములతోను, రసములతొను పరిపూర్ణమైనదియును, మృగ, పక్షి సమూహములతొ అన్ని వైపుల చక్కగా ఉన్నదియును, పెద్ద భవనములతో ఉన్న రాక్షసులు ఉన్న ప్రాంతమును మారుతి చూసెను

కోయిలల మధురకలధ్వనులతోను, ర్మోగుచున్నది యును,కలువలు, పద్మాలు  సువర్ణ వర్ణములో వెలుగు చుండెను,నడి బావులు ప్రక్క పెక్కు  ఆసనాలు, తివచీలు పరిచియుండెను, అనేక భూగ్రుహములతొ నందనవనము వాలే ఉండెను 

సర్వఋతువులయందు  పూచె పూలు అన్ని అక్కడ పూయు చుండెను, ఫలవంతములైన వృక్షములతో కూడు కొని దట్టముగా  ఉండెను, అక్కడ అశొక వృక్షములు సూర్యొదయ ప్రభవలె వెలుగు చుండెను 
అక్కడ అన్నిప్రజ్వలిస్తున్నట్లు హనుమంతుడు చూసెను 

పక్షులు చెట్ల కొమ్మలను పత్ర రహితముగా చేయు చుండెను, చెట్లపై ఉన్న పూలన్ని మంటలవలె మండు  చుండెను, వందలకొలది పక్షులు చెట్లపై వ్రాలి పైకి ఎగురు చుండెను, సాఖాగ్రమునుండి మొదళ్ళవరకు పుష్పములు వంగి నేలను తాకుచుండెను  

గన్నేరు చెట్లతోనూ, నిండుగా పూచినమొదుగ పూలతోను 
పున్నాగ చెట్లను,ఏడాకుల అరటిచెట్లను,సంపెంగ చెట్లను, గుగ్గిల చెట్లను, అనేక చెట్లుతో, పుష్పాలతో శోభిల్లు చుండెను, అక్కడ పుష్పములు రత్నమువలె వజ్రములవలె మెరియుచుండెను 

వృక్షములు బంగారువన్నెతోను, అగ్ని శిఖవలె వెలుగు చుండెను, కొన్నివృక్షములు కాటుకువన్నెతోను దేవతా ఉద్యానవనమువలె ఉండెను, ఉద్యానవనములు దివ్యముగా మకరందములునువెదజల్లు చుండెను 
అక్కడ పూలన్ని వెలుగుతూ రెండవ ఆకాశ నక్షత్రాల వలె ఉండెను

పుష్పములు రత్నములతో వెలసిల్లి 5వ సముద్రమువలె ఉండెను, మృగ పక్షి సంఘములు అనేక విధములుగా నాదములు చేయు చుండెను, సుఘంద పరిమళాలతో శోభిల్లు చున్న వనములు చూసెను, గంధమాదన పర్వతమువలె ఉండుట హనుమంతుడు చూసెను

వానరపుంగవుడుకొంత దూరములొ చైత్య ప్రాసాదమును చూసెను, ఆ ప్రాసాదము లోపల అత్యన్నతమైన వేయి స్తంభములు ఉండెను, కైలాస పర్వతమువలె తేజోవంత మై తెల్లగా యుండెను, పగడపుమేట్లతోను, బంగారు వేదికలతోను మిరమిట్లుగొల్పుచుండెను, నిర్మలమైన చైత్య ప్రాసాదమువల్ల నాకాశము నొరయు చున్నట్లుండె, 
ఆ చైత్య ప్రాసాదదర్సనానంతరము అతడొక దీనురాలు గు స్త్రీని చూసెను, ఆమె మలినమైన వస్త్రములను ధరించి రాక్షస స్త్రీల పరివేష్టితమై  యుండెను, ఉవవాస ములచె కృశించి, ధీనురాలై , ధీర్ఘ విశ్వాసములను విడుచు చుండెను
    
ఆమె వీలైన రూపముతో  వేల్గొందు  దేహకాంతి కలిదియును, పచ్చని వన్నె గల మాసిన పట్టు వస్త్రమును ధరించి నదియును,  ఆమె అలంకార రహితయై పొగతో కప్పుబడిన కాంతి వలేఉండెను
పద్మములు లేని సరస్సువలె అలంకార రహితయగు స్త్రీ ఉండెను 

భోజనము చేయక కృశించి నదియును, కన్నీటితో నిండిన మోముకలదియును, ధీనురాలును చింతా శోకమగ్నయును, నిత్యమూ దు:ఖమును, ముని గిదియును, తన ప్రియజనమును దర్శిమ్పనిదియును 
రాక్షసగణముచే నిత్యముచూచు చున్నదియును
అంగారక గ్రహముచే పీడితమైన రోహిణివలెను
చాల కష్టము మీద ఈమె సీత యని గుర్తించెను

లేళ్ళకు దూరమై వేట కుక్కలకిచిక్కిన ఆడలేడి  వలే యుండెను, కటి ప్రదేశమువరకు వ్రేలాడుచున్న, నల్లత్రాచువంటి ఒక జడతోను, వర్షాకాలాంతమునందు నల్లని వృక్షపంక్తితో కూడిన భూమివలే యుండెను 
దు:ఖములచే సంతృప్తిరాలును, ఎటువంటి వ్యసనములు లేని ఒక స్త్రీని చూచెను

ఆమె శుక్ల పక్షారంభమునండలి చంద్రరేఖవలె మిక్కిలి శుద్ధముగా ఉండెను, హనుమంతుడు ఆలోచించి నిశ్చయముగా ఈమె సీతయని అను కొనెను
ఆమె గురుతు పట్టుటకు వీలైన రూపముతొ వేల్గొందు  దేహకాంతి కల దియును, ధూమజాలముచె కప్పు బడిన అగ్నిశిఖలను బోలియున్న ఒక స్త్రీని మారుతి చూసెను 

నిండు చంద్రుని బోలు మోము గలదియును, దరమగు కను బొమలు గలదియును, గుండ్రమైన సుందరమగు  పయోధరములు గలదియును, సుగ్రదితములగు అవయవములు కలదియును 

పద్మ పత్రములను బోలిన కన్నులు కలదియును
కామదేవుని యిల్లాలగు రతి దేవిని పోలినదియును
 సమస్తలోకములో ఉన్న ప్ర్రాణులకు ఇష్టమైనదియును 
 పున్నమి చెంద్రుని వెన్నెల కాంతిగల సీతను మారుతి చూసెను

మిక్కిలి మలినముగా విశాల నేత్రములు కలదియును 
రావణుడు అపహరించి తెచ్చిన సీత ఈమె అయి ఉండవచ్చును, యుక్తా యుక్తములైన హేతువులచే ఆమె సీత అని ఊహించెను, ఎట్లాచూడబడునొ అట్టిరూపముగా ఉన్న స్త్రీ ని సీత అని అను కొనెను

ఈమె దేహకాంతిచే అనీ దిక్కుల యందలి చీకటిని పోగొట్టు చుండెను,  మయూరివలె అందమైనదియును, దొండపండుపెదవులు కలదియును, మహోత్తరమైన శోకజాలముచే ఆచ్చాదితమై విశేషముగా సోభిమ్ప 
నిదియును, సన్ననినడుము ఉన్న ఒక స్త్రీని చూసి ఆమెసీతఅని హనుమంతుడను   కొనెను 

సందేహముతో నిండిన స్మరణ శక్తి వలెను, క్రింద పడి పోయి నశించిన సమృద్దివలెను, అనుకొనివిధముగా దెబ్బతిన్న శ్రద్దవలెను, కోర్కలు సఫలములు కాక భగ్నమైన ఆశలవలెను, విఘ్నములతో కూడిన కార్య సిద్దివలెను, కాలుష్యముతో కలుషితమైన బుద్దివలెను
ఆభూతమైన అపవాదముచె పతితమైన కీర్తివలెను
రామసేవ ప్రతిభంధముచేత వ్యధను పొందుచుండెను

స్త్రీ రక్షోగణములచే పీడించ బడు చున్నదియును 
 మృగ సాబకమును పోలిన కన్నులు కలదియును 
కలతచెందిన మోఖముతో ఇటు నటు చూచు చున్నదియును, అబలయును, కన్నీటితో నిండి యున్న స్త్రీని సీత అనిగుర్తించెను

కనురెప్పలుకదిలిస్తూ, దీర్ఘవిశ్వాసములు విడుచు చున్నదియును, అలంకార రహితముగా మల పంకములు మధ్యేనే  ఉన్నదియును, ఘములుకప్పిన చంద్రకాంతి వలే ఉన్న సీతను చూసేను, మననములేక వేదవిద్య శిధిలమైనట్లు సీతను చూసి బుద్ధి  సందేహము లో పడెను

అలంకార రహితయగు సీతను సంస్కార రహితమై అర్ధాంతరమును, విశాల నేత్రములుగల దోషరహితులైన జనక మహారాజకుమార్తెను, యుక్తా యుక్తములైన హేతువలచేత ఆమె ఖచ్చితముగా సీతె యగును 
భోధించు వాక్కు కలిగిన స్త్రీని సీత అని హనుమంతుడు గుర్తించెను 

సీత  ఎప్పుడు రాముని ప్రేమ కొరకు ఆభరణములు అలంకరించు కొని యుండును, అట్టి ఆభరణములే ఇప్పుడు సీత శరీరముపై ప్రకాశించు చుండెను 
చక్కగా మెరుస్తున్న కర్ణాభరణములను, కుండలములు ధరించు యుండెను, మణులు, పగడములు పొదగబడిన కంకణములను ధరించు యుండెను 

సీత ధరించిన ఆభరణములు చాలా కాలమునుండి ఉండుటవల్ల నల్లగా ఉండెను, సీత అక్కడ పర్వతము మీద వదిలిన నగలు ఇక్కడ కనబడ కుండెను
       అక్కడ సీత ఏమివదలలేదో ఆ నగలన్నీఇక్కడ కనబడు చుండెను, రాముడు మాతోచేప్పిన ఆభరణములు సీత వద్ద ఉన్నట్లు మారుతి గమనించెను

ఆభరణములతో వదిలాన వస్త్రము, ఇప్పుడు దరించ వస్త్రము ఒకటేనని గుర్తించెను, సీత ధరించిన వస్త్రము రెండవ వస్త్రమువలె వన్నే తగ్గినట్లు కనబడు చుండెను 
ఈమె ఆనాడు ఆభరణములు వస్త్రముతో సహా క్రింద పడ వేసినట్లు ఊహించెను, ధీనావస్తలొ ఉన్న సీతను ఏవిధముగా కలవాలని మారుతి ఆలోచించు చుండెను

రావణుడు అపహరించి తెచ్చిన రాముని ప్రియురాలిన సీత ఈమై ఉండును, రాముని మనస్సులో ప్రియురాలిన సీత మారకుండా స్తిరముగా ఉండెను, ఈ దేవి రూపము రాముని తలుస్తూ దేహ దెహావయవములు మారకుండా ఉండెను, సీత అందమును స్మరిస్తు రామచంద్రుడు దేహదారుడ్యముగా ఉండెను

   రాముడు కనబడ కుండా పోయిన స్త్రీ కదా అని జాలి చూపెను, నేను తప వేరెవ్వరు రక్షకులు లేరని మనస్సుతో దయ చూపెను, కనబడకుండా వెళ్ళినది భార్య అగుటచే శొకముతో ఉండెను, ఆమె ప్రియురాలు అగుటచే ప్రేమతో మిక్కిలి సంతాపము పొందెను 

ఈదేవి మనస్సు ఎప్పుడు భర్త అయిన రామచంద్రుని పైనను, శ్రీ రామచంద్రుని మనస్సు ఎప్పుడు భార్య అయిన సీత పైనను, సీత రాముడే నన్ను రక్క్షించు తాడని నమ్మకముతోను ఉండెను, శ్రీ రామచంద్రుడు సీత ఏలోకంలో ఉన్న రక్షించగలనని  అనుకొనెను

యోవనమదము ఉప్పొంగుచున్న రాముడు సీత కొరకు వేచి ఉండెను, భార్య దూరము అవుటకు చాల దుష్కరమైన కార్యము చేసి యుండవచ్చును 
హనుమంతుడు దృడసంకల్పముతొ చేట్టుక్రిందున్న స్త్రీ ని సీత అని గుర్తించెను, హనుమంతుడు స్రీ రామచంద్రుని మనస్సులో సమీపించి మిక్కిలి ప్రశంసించెను    

స్రీ సుందర కాండమునందు 15వ సర్గము సమాప్తము
____((()))___

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
 17 వ సర్గ (వాల్మికి రామాయణములోని 32 శ్లోకాల  తెలుగు వచస్సు)

హంస స్వచ్చమైన నీల వర్ణముగల జలములో విహరిన్చుటకు వచ్చెను, అట్లే ఉదయ సమయము నుండి చంద్రుడు నిర్మలమైన ఆకాశములోకి ప్రవే శించెను, చంద్రుని యొక్క సీతల కిరణములు వాయు పుత్రుడగు మారుతిని  సేవించెను, నిర్మలమైన కాంతిని సీతాదేవికి సహాయము చేవలెనని చంద్రుడు అనుకోను చుండెను, పూర్ణ చంద్రుని మోము గలదియును, శోకభారముచె కృంగు  చున్నదియును, అగు సీతను హనుమంతుడు నీటిలొ బరువుతో నిండిన నావ వలే ఉండెను, స్క్షీతాదెవిచూడ నెంచి ప్రక్కన ఉన్న భయంకర మైన రాక్షస స్త్రీలను చూసేను, సీత యొద్ద కూర్చున్న రాక్షస స్త్రీలను హనుమంతుడు భీకరరూపాలను చూసెను, సీతాదెవి ప్రక్కన రాక్షస వనితలను వర్ణించెను, ఘోర రూపములొ ఒక కన్ను, ఒక చెవి కలిగిన స్త్రీలు ఉండెను, పెద్ద చెవులు కలిగి, అసలు చెవులు లేకుండా ఉన్న స్త్రీలు ఉండెను, శంఖమును బోలిన అనగా నిక్కపోడుచు కున్న చెవులుండెను, తలవరకూ వ్యాపించిన ముక్కుగల భయంకరమైన స్త్రీలు ఉండెను, అతి ప్రవృద్దమైన ఊర్ద్వ శరీరము కలదియును, సన్నగా పొడవుగా  కంఠం కలవారును 
శరీరరమంతా దట్టమైన రోమాలు కలవారును
దీర్ఘమైన కర్ణములు, లలాటములుకలవారును

దీర్ఘమైన ఉదర పయోధరములు కలవారును
వ్రేలాడు పెదవులు, గడ్డమునకంటు  పెదవుల కలవారును, పోట్టి వారును, మిక్కిలి పొడవైన వారును 
మరుగుజ్జుగా, వికటముగా ఉన్నవారును

వంకరముఖము భయపెట్టు  

వంకరముఖముతొ భయంకరముగా ఉన్నవారును 
పసుపుపచ్చ నేత్రములతొ భయపెట్టే వారును
 బాగా నల్లగా, అతి లావుగా ఉన్నవారును 
కలహాప్రియులు, కోపస్వభవముకలవారును 

పందులు లేళ్ళు, మోఖములవలె కొందరుండెను 
పులులు, దున్నపోతు, మోఖములవలె కొందరుండెను      
ఏనుగులు, ఒంటెలు మోఖములవలె కొందరుండెను 
గుర్రము మొఖము పాదాలు,  కలిగి ఉండెను

కొందరి తలలు గుండె లోనికి చొచ్చుకొని ఉండెను
గాడిద చెవుల వాల్లు, గుర్రపు చేవులవాల్లు ఉండెను
కోతిచేవులవాళ్ళు, ముక్కులు లేనివాళ్ళు ఉండెను
 ఏనుగు పాదములు, దములున్నవారుండెను

పాదములందు రోమములు దట్టముగా ఉన్నవారును
పెద్ద పెద్ద తలలు, పెద్ద పెద్ద స్తనములు ఉన్నవారును 
ఏనుగు తొండము వంటి ముక్కులు గలవారును 
నాలికచాపి భయంకరముగా నృత్యము చేయువారును 

నల్లని ఇనుముతో చేసిన సూలములను ధరించిన వారును, సమ్మెట, ఇనప గదలను ధరించిన వారును
ఎత్తుపల్లు మూతి వంకరగా ఉన్నవారును, వ్రేలాడు పొట్ట, పెద్ద పెద్ద కేశములు కలవారును, భయంకరమైన పోగావంటి జుట్టు కలవారును, రక్త మాంసములతొ నిండిన శరీరము కలవారును, నిరంతరము మద్య పానముచేయుచున్నవారును, చూసెవారికి గగుర్పాటు కల్గించే స్త్రీలను మారుతి చూసెను

 సీతా దేవి వర్ణన, కాంతి తరిగి నదియును, శోకసంతప్త యును,  మురికిగా ఉన్న కేశములు కలిగినదియును
ఆకాశమునుండి భూమిపైరాలిన తారను బోలినదియును
ఉత్తమైన భూషణములు పెట్టుకొననిదియును

చారిత్రమున పేరు  గాంచినదియును, పతిదర్శమునకు నొచుకొననిదియును, భర్త్రువాత్చాల్య భూషితయును
 రాక్షస రాజుగు రావణునికి బందీయును, భందువులకు దూరముగా  ఉన్నదియును, సింహమునకు చిక్కిన ఆడేనుగును బోలినదియును, వర్షాకాలము గడచినా నవృతమైన చంద్రరేఖను బోలినదియును, రాక్షస వశములొ చిక్కి కర్మకు భద్దురాలై యుండెను

అశొకవాటికలొ ఉండి  కూడా  మునకలు వేయు చుండెను, సీత పంకములో ఉన్న పద్మనాళమువలే మలినమై యుండెను, అంగులీ స్పర్స లేని వీణలా మూగబొయి సీత అక్కడ ఉండెను, పుష్ప హీనమై  ఉన్నలతవలె ఉన్న సీతను హనుమంతుడు దర్శించెను

సీతాదేవి నలిగి, మాసిపోయిన వస్త్రమును చుట్ట బెట్టుకొని  ఉండెను, లేడిపిల్ల కళ్ళ వంటి కళ్ళుగల సీతాదేవి మొఖము ధీనముగా ఉండెను, భార్త పరాక్రముబలము తెలుసుకొన్న సీత అధైర్య పడ కుండెను, ఆమె పాతివ్రత్యమే  రక్షించు చుండెను అట్టి సీతను మారుతి చూసెను 

అశోక వృక్షమునందు నాల్గు వైపులా భయంకరమైన రాక్షసులు ఉండెను, సీతాదేవి దు:ఖసాగరము ఉన్న ఓడలిపై మాలిన్యము పేరుకొని యుండెను 

రాజపుత్రికయును,  అనిందితయును, దశరధమహారాజు కోడలియును, అగు సీతాదెవిని లక్ష్మీ సంపంనుడగు హనుమంతుడు చూసేను,  భయపడిన ఆడలేడి పిల్ల చూసినట్లు కళ్ళను అటు ఇటు తిప్పుచుండెను 
సీత  వెడి నిట్టుర్పులకు చిగురించిన వృక్షములు కాల్చివేయు చున్నట్లుండెను, అమె శొకముల ప్రొగువలె పైకి లేచిన ద:ఖ తరంగములవలె ఉండెను, అట్టి సీతను హనుమంతుడు చూసి అపారమైన  ఆనందము పొందెను

రాక్షస స్త్రీల భాదను తట్టుకొని ఓర్పు వహించినసీత భూదేవి వలే ఉండెను, సీత ఆహారము తీసుకొక బోయిన అవ యవములలో ఎట్టిమార్పు లేకుండెను
శ్రీ రామచంద్రుని తలుస్తూ మత్తుని కలిగించు నెత్రములుగల  సీత విలపిస్తూ ఉండెను, అట్టి సీతను హనుమంతుడు చూసి రామచంద్రునకు లక్ష్మనునికి  నమస్కారము చేసెను

శ్రీ సుందర కాండ నందు 16వ సర్గ సమాప్తము    

 ___((()))___

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:

 18 వ సర్గ (వాల్మికి రామాయణములోని 32 శ్లోకాల  తెలుగు వచస్సు)
పుష్పించిన వృక్షములతో నిండిన అసోకవనము, విదేహ రాజకుమారి యొక్క స్పష్ట దర్శనము, రాక్షస స్త్రీలు నిద్రపోవుటకు ప్రయత్నిమ్చుట, ఆలోచిస్తుండగానే రాత్రి చాలావరకు గడచిపోయెను 

రాత్రి యొక్క చివరిజామున షడంగవేద వేత్తలను, అనేక మహాయజ్ఞములు చేయు పండితులను, మంత్రాలను చదివే బ్రహ్మ రాక్షషలవేద ఘోషను, హనుమంతుడు వృక్షముపై నుండి గమనిస్తుండెను 

మహాబాహువులు గల దశఖంటుడను, మంగల వాద్యము ల తోను ఇతరవాద్యములతోను, సుప్రభాతముతో రావణున్ని మేల్కొల్పెను, జారిపోయిన వస్త్రముగల వాడైన రావణుడు నిద్రలేచెను 

అత్యుత్కటమైన మదముగల రావణునకు సీత స్మృతికి వచ్చెను, సీతా విషయమునందు మన్మదుడు ప్రేరే పిమ్పగా  కామముతో ఉండెను, సీతను పదే పదే తలుస్తూ తనలో ఉన్నకామమును అనుచుకోలేక పోయెను, కాలమునకు లొంగి పోయినవాడై సీతయందు లగ్నమైన మనస్సుతో ఉండెను

రావణుడు సమస్తమైన ఆభరణములను అలంకరించు కొనెను, సకలవిధములైన పుష్పమాలను ధరించి సోభాముతో ఉండెను, మదించిన పక్షులు విచిత్రముగా అరుచు చుండెను, అశోకవనములో ఉన్న సీతను చూచుటకు బయలుదేరెను

మహేంద్రువెనుక దేవతాస్త్రీలు నడిచినట్లు రావణుని వేనుక స్త్రీలు నడుచు చుండెను, కొందరు స్త్రీలు బంగారు దీపములను, వింజామరలను, విసిన కర్రలను 
మరికొందరు బంగారు పాత్రలలో నీల్లు తీసుకొని నడుచు చుండెను, మరియొక స్త్రీ శ్వేతచ్చత్రము పట్టుకొని రావణుని వెనుకనే వెళ్ళెను

మెరుపు తీగలు మేఘమును అనుసరించినట్లు రావణుని భార్యలు అను సరించెను, రానుని భార్యలు భర్త గౌరవము చెడకుండా ప్రక్కగా నడుచు చూ ఉండెను 
దేహములపై ఉన్న హారములు అటు ఇటు కదిలి జారిపోయిన నడుస్తూ   ఉండెను, రావణుని ఉత్తమ స్త్రీలు నిద్రమత్తుతో నడుచుట హనుమంతుడు చూచెను 

భార్యలు ముఖములు చెమట పట్టి  కురులు విరబోసి కొని నడుచు చుండెను, కొందరు మద్యపాన మత్తులో, నిద్రచేత తూలుతూ నదుస్తూ అనుకరించెను 
స్త్రీల ధరించిన పుష్పములు నలిగిపొఐ కెశములలొ చిక్కుకొని యుండెను, రావణుడు బంగారు ముఖ ద్వారములున్న వీధులను చూచుచు వనంలోకి  ప్రవేశించెను 

మహాబల సంపంనుడగు మంద బుద్ధియు, కామ పరాధీనుడును నగు ఆ కామినీపతియు, విద్యుల్లతల వలె ఉన్న భార్యలతో నడిచెను, సీతపై మనస్సుతో మెల్ల మెల్లగా నడుచుచుండెను 

ఊహింప నంత బల,పౌరుషాలు కలవాడు, సుఘంది తైలములచే తడుపబడుచున్న కాగడాలను, కాంచనీ ధ్వనులతో స్త్రీలు రావణుడితో నడిచెను, అట్టి వారిని వాయుపుత్రుడు చూస్తూ ఉండెను   

 రాక్షస రాజు కామ దర్ప మద యుక్తుడు గా, కుటిలమైన, ఎర్రనైన  చూపులు గల వాడు, దనూరహితుడగు కామదేవుని బోలినవాడు, తెల్లని నురుగు వంటి వస్త్రము ధరించిన రావణున్ని చూసెను 

హనుమంతుడు ఆకులతో ఉన్న కొమ్మ మీద అణిగి మణిగి యుండె, రావణుడి వస్త్రమును విలాసముగా లాగుకోనుచు నడుచు చుండె,  దగ్గరగా వస్తున్న మహారాజును రావణుడిగా మారుతి గుర్తించెను
రూప యవ్వన సంపన్నలగు స్త్రీలు  రావణుడుతో నడుచుచూ ఉండెను 

హనుమంతుడు రావణునియోక్క తేజముచే తిరస్క్రు తుడై యుండె, శంఖువువలె నిక్కపొడుచు కోనిన చేవులగల వాడైన రావణుడు, విశ్రవసుని పుత్రుడగు మహాబల సంపంనుడగు రాక్షసాదిపతియు, విచిత్ర ఆభరణములు ధరించిన స్త్రీలతొ ఉన్న రావణున్ని చూసెను 

ఉత్తమస్త్రీ పరివేష్టితుడైనా తారాపరివృతుడైన చంద్రుని బోలియున్న వాడు, రావణుడు మృగ పక్షి రావ నినాదితమగు ఆ ప్రమదా వనమును ప్రవేశించె,
 ఉత్తమ గృహం లో నిద్రించి నప్పుడు చూసిన రావణుడే ఇతడని గ్రహించె, హనుమంతుడు చెట్టు కొమ్మపై ఉండి  కొంచము క్రిందకు దిగి చూస్తూ ఉండెను

నల్లని కేశ పాశములు గల సీతయు, సుందరమగు కతుభాగాముకల సీతయు, నిరంతర మైన స్తనములు గల సీత, నల్లని నేత్రములుగల సీతను రావణుడు సమీపించెను

సుందర కాన్దమునన్దు 17వ సర్గ సంమాప్తము


___((()))___


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:

 18 వ సర్గ (వాల్మికి రామాయణములోని 32 శ్లోకాల  తెలుగు వచస్సు)
పుష్పించిన వృక్షములతో నిండిన అసోకవనము, విదేహ రాజకుమారి యొక్క స్పష్ట దర్శనము, రాక్షస స్త్రీలు నిద్రపోవుటకు ప్రయత్నిమ్చుట, ఆలోచిస్తుండగానే రాత్రి చాలావరకు గడచిపోయెను 

రాత్రి యొక్క చివరిజామున షడంగవేద వేత్తలను, అనేక మహాయజ్ఞములు చేయు పండితులను, మంత్రాలను చదివే బ్రహ్మ రాక్షషలవేద ఘోషను, హనుమంతుడు వృక్షముపై నుండి గమనిస్తుండెను 

మహాబాహువులు గల దశఖంటుడను, మంగల వాద్యము ల తోను ఇతరవాద్యములతోను, సుప్రభాతముతో రావణున్ని మేల్కొల్పెను, జారిపోయిన వస్త్రముగల వాడైన రావణుడు నిద్రలేచెను 

అత్యుత్కటమైన మదముగల రావణునకు సీత స్మృతికి వచ్చెను, సీతా విషయమునందు మన్మదుడు ప్రేరే పిమ్పగా  కామముతో ఉండెను, సీతను పదే పదే తలుస్తూ తనలో ఉన్నకామమును అనుచుకోలేక పోయెను, కాలమునకు లొంగి పోయినవాడై సీతయందు లగ్నమైన మనస్సుతో ఉండెను

రావణుడు సమస్తమైన ఆభరణములను అలంకరించు కొనెను, సకలవిధములైన పుష్పమాలను ధరించి సోభముతో ఉండెను, మదించిన పక్షులు విచిత్రముగా అరుచు చుండెను, అశోకవనములో ఉన్న సీతను చూచుటకు బయలుదేరెను

మహేంద్రువెనుక దేవతాస్త్రీలు నడిచినట్లు రావణుని వేనుక స్త్రీలు నడుచు చుండెను, కొందరు స్త్రీలు బంగారు దీపములను, వింజామరలను, విసిన కర్రలను 
మరికొందరు బంగారు పాత్రలలో నీల్లు తీసుకొని నడుచు చుండెను, మరియొక స్త్రీ శ్వేతచ్చత్రము పట్టుకొని రావణుని వెనుకనే వెళ్ళెను

మెరుపు తీగలు మేఘమును అనుసరించినట్లు రావణుని భార్యలు అను సరించెను, రావనుని భార్యలు భర్త గౌరవము చెడకుండా ప్రక్కగా నడుచు చూ ఉండెను 
దేహములపై ఉన్న హారములు అటు ఇటు కదిలి జారిపోయిన నడుస్తూ   ఉండెను, రావణుని ఉత్తమ స్త్రీలు నిద్రమత్తుతో నడుచుట హనుమంతుడు చూచెను 

భార్యలు ముఖములు చెమట పట్టి  కురులు విరబోసి కొని నడుచు చుండెను, కొందరు మద్యపాన మత్తులో, నిద్రచేత తూలుతూ నదుస్తూ అనుకరించెను 
స్త్రీల ధరించిన పుష్పములు నలిగిపొఐ కెశములలొ చిక్కుకొని యుండెను, రావణుడు బంగారు ముఖ ద్వారములున్న వీధులను చూచుచు వనంలోకి  ప్రవేశించెను 

మహాబల సంపంనుడగు మంద బుద్ధియు, కామ పరాధీనుడును నగు ఆ కామినీపతియు, విద్యుల్లతల వలె ఉన్న భార్యలతో నడిచెను, సీతపై మనస్సుతో మెల్ల మెల్లగా నడుచుచుండెను 

ఊహింప నంత బల,పౌరుషాలు కలవాడు, సుఘంది తైలములచే తడుపబడుచున్న కాగడాలను, కాంచనీ ధ్వనులతో స్త్రీలు రావణుడితో నడిచెను, అట్టి వారిని వాయుపుత్రుడు చూస్తూ ఉండెను   

 రాక్షస రాజు కామ దర్ప మద యుక్తుడు గా, కుటిలమైన, ఎర్రనైన  చూపులు గల వాడు, దనూరహితుడగు వాయుపుత్రుడువాడు, తెల్లని నురుగు వంటి వస్త్రము ధరించిన రావణున్ని చూసెను 

హనుమంతుడు ఆకులతో ఉన్న కొమ్మ మీద అణిగి మణిగి యుండె, రావణుడి వస్త్రమును విలాసముగా లాగుకోనుచు నడుచు చుండె,  దగ్గరగా వస్తున్న మహారాజును రావణుడిగా మారుతి గుర్తించెను
రూప యవ్వన సంపన్నలగు స్త్రీలు  రావణుడుతో నడుచుచూ ఉండెను 

హనుమంతుడు రావణునియోక్క తేజముచే తిరస్క్రు తుడై యుండె, శంఖువువలె నిక్కపొడుచు కోనిన చేవులగల వాడైన రావణుడు, విశ్రవసుని పుత్రుడగు మహాబల సంపంనుడగు రాక్షసాదిపతియు, విచిత్ర ఆభరణములు ధరించిన స్త్రీలతొ ఉన్న రావణున్ని చూసెను 

ఉత్తమస్త్రీ పరివేష్టితుడైనా తారాపరివృతుడైన చంద్రుని బోలియున్న వాడు, రావణుడు మృగ పక్షి రావ నినాదితమగు ఆ ప్రమదా వనమును ప్రవేశించె,
 ఉత్తమ గృహం లో నిద్రించి నప్పుడు చూసిన రావణుడే ఇతడని గ్రహించె, హనుమంతుడు చెట్టు కొమ్మపై ఉండి  కొంచము క్రిందకు దిగి చూస్తూ ఉండెను

నల్లని కేశ పాశములు గల సీతయు, సుందరమగు కతుభాగాముకల సీతయు, నిరంతర మైన స్తనములు గల సీత, నల్లని నేత్రములుగల సీతను రావణుడు సమీపించెను

సుందర కాన్దమునన్దు 18వ సర్గ సంమాప్తము

___((()))___

ఓం శ్రీ  రాం  ఓం శ్రీ  రాం ఓం శ్రీరాం
                     శ్రీ మాత్రే నమ:
     శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
రచయత ,మల్లాప్రగడ రామకృష్ణ
 21 వ సర్గ (వాల్మికి రామాయణములోని 34 శ్లోకాల  తెలుగు వచస్సు)
("నీవు రామునితో పోల్చుటకు కూడ తగని తుచ్చుడవు " అని 
నిదించుచూ సీత రావణునికి భోదించుట )

భయంకరుడైన రావణుడు ప్రేమ పూర్వకముగా నెమ్మది గా పల్కిన వచనములను సీత వినెను, సుందర మైన కటి ప్రదేశమున కలదియును, భర్త కొరకు రోదనము చేయు చున్నదియును, భయముచే వనకుచున్నదియు ను, పతినే ధ్యానించు చున్నదియును, తపస్వినియును 
మిక్కిలి యార్తియై, దీనమైన స్వరము కలదై,  సీత మెల్లగా సమాదానముగా ఇట్లు పలికెను

మలినమైయున్న, స్మితభూషితయగు సీత ఒక గడ్డి పరకను రావణునికి తనకు మద్య ఉంచె, ప్రత్యక్షము గా రావణునితో మాట్లాడుట ఇష్టములేక వణకుచు తల వంచుకొని ఇట్లు పలికె, నీ మనస్సు నామీద నుంచి మరల్చి, నీ భార్యలపైకి త్రిప్పి  ప్రేమించుము నీ భార్యలను, పాపకర్ముడైనవాడు  సిద్ధిని పొందుటకు కర్హుడు కానట్లు నీవు నన్ను కోరుట అనర్హుడవేయును   

రావణుని వైపు  'వీపు '  ఉంచి ఈ విధముగా పల్కేను 
ఓ రావణా నేను ఉత్తమ వంశములో పుట్టినాను, ఉత్తమ వంశానికి కోడలుగా వెళ్ళినాను, నిద్యమైన ఈ కార్యాన్ని నేను చేయ జాలను 

ఓ నిశాచరా పరిశీలించుము, సజ్జనుల ధర్మమును, సత్పురుషుల నియమములను, ఓ రావణా నీ భార్యలు ఎట్లు రక్షింప దగినవారో, ఇతరుల భార్యలను కూడా రక్షించవలెను, నిన్నే ఆదర్శంగా, నీ ప్రేమనే పొందాలని తపనతో ఉన్న భార్యలను సుఖపెట్టమని హెచ్చరించెను, శ్రీ రామ చంద్రుని భార్యను, దశరధ మహారాజు కోడలిని, జనకుని కూతురిని, నీకు ఉపయుక్తను కాను 
 
చపల స్వభావుడవై నీ భార్యలతో సంతృప్తి పడక కోల్పోవు చున్నావు ఇంద్రియములను, తెలుసుకో రావణా పర భార్యలను చేపట్టి పరాభవించుట వళ్ళ పతనమునకు హేతువగును, నీ బుద్ధి, సత్పవర్తన లేక విపరీతముగా, మూర్ఖముగా ప్రవర్తించు చున్నదియును, లేనిచో నీకు ఆచార విరుద్ధమైన విపరీతపు ఆలోచనలు ఎట్లు కల్గును?

యుక్తా యుక్త వివేకముగల పండితులు చెప్పిన హిత వాక్యములను, మంచివారి మాటలను లెక్క చేయుట లేదు, చూసెదవు  రాక్షసుల వినాశములను, మనసు అదుపులో లేకుండ రాజు అమార్గమునందు ప్రవర్తించు రాజ్య పరిపాలనలోను, ఐశ్వర్య సంపన్నము లైన, రాష్ట్రములు, నగరములు కూడా నాశనమగును 

ఓ రావణా నీ అపరాధము వలన ఈ లంకా నగర 
 వాసులకు శిక్ష పడును, అట్లే నీవు జయించి తెచ్చిన రత్నరాశులన్ని బూడిదలో పోసిన పన్నీ రగును 
ధీర్ఘదృష్టి లేని పాపాత్ముడైన రాజు, చేసే పనుల వల్ల కుటుంబం సర్వ నాశనమగును, అట్లే పాపకర్ముని యొక్క వినాశమును సకల భూతములు అభి నందించును   

రావణా నేను ధనముచేగాని, నీ ఐశ్వర్యముచేగాని, ఆకర్షింప బడు దానను కాను, సూర్యుని నుండి కాంతి ఏవిధముగా వేరు కాదో, అట్లే నేను రాముని నుండి వేరుకాను, నగరవాసులు మన అదృష్టం కొలది ఈ క్రూరునికి ఎట్టి ఆపద వచ్చునో అను కొనును 
రావణా నీవు చేసిన పనికి నీచె పీడింప బడిన వారందరు సంతోషము పొందును

ఇంత కాలము నేను రాముని భుజమును తలకడగా ఉపయోగించు కొన్నాను, రాముని వద్ద సుఖముగా నిద్రించిన నేను ఇతరుల భుజములపై ఎట్లు తలనిడుదును?
   నేను ధరానాదుడైన శ్రీ రామచంద్రుని కొరకు బ్రహ్మ చర్యవ్రతమును అవలంభిచు చున్నాను, ఈ సమావర్తన వ్రతము పూర్తి చేసుకొని విదితాత్ముడైన విద్యవలె నేను ఉపయుక్తమగు భార్యను 

ఒరావణా అరణ్యములో ఆడేనుగును,  గజరాజుతో కులుపుట నీకర్తవ్యమగును, అట్లే నీవు నన్ను నా భర్త యగు రామచంద్రుని వద్దకు పంపుట యుక్తమగును
నీవు  లంకను రక్షిమ్చు కోవలెనన్నచో కలుపుము పురుషోత్తమునితో స్నేహమును, ఓ నిశాచరా  శ్రీ రామచంద్రునితో మిత్రత్వము పొందిన అంతా శుభము కల్గును 

ఓ రాక్షస రాజా శ్రీరాముడు స్వర్వధర్మ కోవిదుడుగను, శరణాగత వత్చలుడుగను, లోకమర్యాదను తెలిసిన రామున్ని అనుగ్రహము పొందిన నీకు శుభమగును,
నీవు జీవించ దలచినచో రామునితో మైత్రి పొందిన నీ కుటుంబ  నాశనము ఆగును, నీవు నన్ను నిగ్రహ యుతుడవై నా భర్త వద్దకు పంపిన నీవు మరణమును జయించ గల్గును

రావణా నన్ను రాముని వద్దకు తిరిగి  పంపివేసినచో నీకు క్షేమమగును, నీవు మరో విధముగా ఆలోచించిన మరణము తప్పక కల్గును, ఇంద్రుని వజ్రాయుధము నిన్ను ఎమీ చేయలేక పోవచ్చును, కాని రాముడు నిన్ను క్షమించక తప్పక సంహరించును 

శ్రీఘ్ర కాలములో  రామ లక్ష్మణులు ద్రుడమైన కణువుల వంటి భాణములను, రావణా నీవు చూడ గలవు లంకా నగారము చుట్టి వేసే సర్పాల భాణములను, దిక్కులు పెక్కటిల్లే రాముని ధనస్సు నుంచి వచ్చే ధ్వనులను వినవచ్చును, యముడు నిన్ను విడిచినా ,నీవు రామ భాణమునకు తప్పక మరణించవచ్చును

రామ లక్ష్మణుల భాణములతో ఈ లంకా నగరమంతా నిప్పులు కురియును, బలవంతులైన రాక్షసులందరిని వరుస క్రమముగా సంహరించ గల్గును, గరుత్మంతుడు సర్పములను చంపినట్లుగా రామచంద్రుడు రాక్షసులను చంపును, రావణా నీవు నన్ను అపహరించి చెడ్డ పని చేసితివి చూసెదవు ఫలితమును 

విష్ణువు మూడడుగులు వేసి రాక్షసుల లక్ష్మి ని తీసుకొని వెళ్ళెను, రాముడు శీఘ్రముగా నన్ను నీవద్దనుండి తీసుకొని పోగాల్గును,   రామలక్ష్మణులు లేని సమయము న మాయచేసి నన్ను తెచ్చినను, కుక్క పెద్ద పులి ఎదుట నిల్వనట్లు, నీవు రామునిఎదుట నిల్చుటే కష్టమగును 

శ్రీ రామచంద్రుడు, సౌమిత్రి సహితుడై తమ భాణము లతో నీ ప్రాణములను, సూర్యుడు అల్పమైన ఉదకమును హరించినట్లు శీఘ్రముగనె హరించ కల్గును 
యుద్దములో అన్నదమ్ములనిద్దరిని నిగ్రహించుట నీకు అసంభవమగును ఇద్రునితో వృతాసురుడు నిల్వనట్లు, రామలక్ష్మనులతో నీవు యుద్దము చేయలేవును 

రావణా నీవు కైలాస పర్వతమునకు పారి పోయినను
అలకాపురి వెళ్లి కుబెరునివద్ద  దాగి కొనినను, రాజైన వరుని వద్దకు పోయి  అర్ధించినను, దక్కిన్చుకోలేవు రాముని నుండి నీ ప్రాణాలను 

శ్రీ సుందరాకాండ 21వ స్వర్గ సమాప్తము
  
____((()))___


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

రాక్షసేశ్వరుడు సీత యొక్క పరుషమగు మాటలు వినెను, రావణుడు వినమ్రతతో ప్రయదర్శని యగు సీతతొ బదులు పల్కేను, లోకములో స్త్రీలను బుజ్జగించిన స్త్రీలు పురుషులకు లొంగి పోవును 
కాని నీ విషయమున నేను ఎంత ప్రేమగా పల్కిన తిరస్కరీస్తున్నావు  నామాటలును 

ముఖ్యముగా మనుష్యులలో గల కామము చాల వక్రంగా ఉండును, కామము ఎవనియందు నిబద్దమగునో వానియందు స్నేహము, జాలి కల్గును, నీ యందు నాకు కల్గిన కామము చెడు మార్గమునందు పరుగెత్తు చున్నాను, సారధి గుర్రములను నిగ్రహించినట్లు, నేను కామాన్ని నీకోసం  అనుచు కొనుచున్నాను

ఓ సముఖీ కపటవనవాసము చేయు రాముని యందు అనురక్తిరాలు వైనను, నన్ను అవమానించిన, వదార్హురాలు వైనను, నిన్ను వధించ  లేకుండా ఉన్నాను, ఓమైథిలి నీవు  పల్కిన పరుషమైన ఒక్కొక్కమాటకునిన్ను హింసించ వలెను, దారుణముగా నిన్ను వధించచుట చాల యుక్తము కాని నీమీద ప్రేమతో చేయలేకున్నాను 
రావణుడు పలికే 

క్రొధావేశముతో ఉన్న రావణుడు సీతతో ఇట్లు బదులు పల్కేను, ఓ సీత నేను నీకు రెండు మాసములు గడువు ఇచ్చి ఉన్నాను, ఓ అందమైన వర్ణము గలదాన, అప్పటిదాకా నేను పాలింప వలసి యుండును 
ఓ సుందరి గడువు తీరిన వెంటనే నీవు నాశయనము 
పైకి రావలెను

రెండు మాసములు తర్వాత నీవు నన్ను భర్తగా అంగీ కరించక పోయినను, నా ప్రత:కాల భక్షనమునకై నిన్ను ముక్కలు ముక్కలుగా భేదింప  గల్గును, రావణుడు సీతను భయపెట్టుటను దేవ నాగ  గాంధర్వ కన్యలు చూసెను, వికృతమైన కన్నులుగల దేవ నాగ  గాంధర్వ కన్యలు మిక్కిలి విషాదము పొందెను
 

రాక్షసరాజు చేత భయపెట్టుచున్న సీతను కొందరు స్త్రీలు పెదవులతోను, మరికొందరు ముఖములు, నేత్రములు కదల్చి సీతను ఓదార్చెను, స్త్రీలచే  ఓదార్చబడిన సీత రావణుడు  చేసే వింత చేష్టలు చూసెను, రావణుడితో సీత సచ్చరిత్ర, బలగర్వితము నగు వాక్యములు పల్కేను, ఓ రావణా ఈ నగరము నందు నీ మేలు కోరు వారెవరు లేరనుకొను చున్నాను 
బల గర్వముతొ పెద్దల మాటలను పెడచేవి పెట్టుచున్నా వని నేను  అనుకుంటున్నాను
దేవేంద్రునికి సచీదేవివలె, ధర్మాత్ముడైన రామునికి భార్యగా  యున్నాను, మూడులోకముల్లో నీవు దప్ప మరియోక్కడు తనమనస్సులో నైన నెట్లు కోరు కొనును ?
     

ఓ రాక్షసాధమా అమితమైన తేజస్సుగల రామునికి భార్యనై యున్నను, నీవు పాపపు మాటలు పలికి నందుకు, నీకు తప్పక శిక్ష పడును, వనములో మదించిన ఏనుగును కుందేలు ఎట్లు ఎదిరించ కల్గును
అట్లే కుందేలువు నీవు, ఎదిరించలేవు గజము వంటి ధర్మాత్ముడను 

ఓ అనార్యుడా, నన్ను చూచు చున్న నీ కృష్ణ పింగళ నేత్రములు నేలపై ఎలా పడ కుండా ఉండెను
ఓ రాక్షసరాజ నీవు పౌరుషముగా నాతో అన్నమాటలకు నీ నాలుక ఎలా ఊడిపడి పోకుండా ఉండెను
నీవె సిగ్గు పడాలి, ఇక్ష్వాకునాదుడైన నా భర్త  శ్రీ రామచంద్రుని తిరస్కరించుటను

ఓ రాక్షసాధమా నీవు నా భర్త కంట పడ నంతవరకు ఎన్ని మాటలు పల్కిన చెల్లును, ఓ రావణా, నాకు శ్రీ రామచంద్రుని ఆజ్ఞ లేకుండుట వలనను, నేను నిత్యమూ తపోవ్రతము అవలంభించు యుండుట వలనను,   ఓ దశగ్రీవా, నేను నిన్ను భస్మము చెయదగిన దానినై యుండినను, నా పాతివ్రత్య తేజముచే నాభర్త ఆజ్ఞ లేకపోవుట వలన భస్మము చేయకుండా ఉన్నాను

నేను శూరుడను, నేను కుబేరు సోదరుడను అనంత బల సంపన్నుడను, అన్నను, రావణా మాయతో నాభర్త లేని సమయమున నన్ను అపహరించి తెచ్చుట ధర్మ మెట్లగును, రావణా శ్రీ రామచంద్రుని భార్యనగు నేను  నీవు అపహరించుటకు వీలుకాని దానను, నాకు సందేహములేదు, దైవమే నీ వధకు నన్ను అపహరించి తెచ్చుట కారణమగును 
రావణాశురిని వర్ణన
 రావణుడు నల్లని మేఘము వంటి శరీరము కల్గి ఉండెను, అతని భుజములు, కంఠం చాల పెద్దవిగా ఉండెను, అతని బలము నడక సింహము బలము వలే ఉండెను, అతని జిహ్ఫగ్రము, నేత్రములు మండు చున్నట్లు ఉండెను

అతడు కిరీటము ధరించుట వల్ల ఎత్తుగా ఉండెను
అతడు ఎర్రనిపూవులను, ఎర్రని వస్త్రములను ధరించెను, శివ భక్తితో, శక్తి, మాయ మంత్రులు తెలిసినవాడును,పుత్తడి దండ కడియములను ధరించినవాడును 

నల్లగా లావుగా ఉన్న త్రాడును నడుమునకు కట్టు కొన్నవాడును, సముద్రమధనమునందు వాసుకిని కట్టిన మంధర పర్వతమువలె ఉండెను, పర్వతమువలె ఉన్న రావణుడు బాగా బలసిన భుజములతోను, రెండు శిఖరముల తో కూదిన మందార పర్వతమువలె ప్రకాశించెను 

బాల సూర్యు డి వలె ఎర్రగా ఉన్నకుండలములు అలంకరించు  కొన్నవాడును, ఎర్రని చిగుళ్ళు, పుష్పములుగల రెండు ఆశోకవృక్షములతొ పర్వతము వలెను, కల్పవృక్షమువలె ఉన్న అతడు మూర్తీ భవించిన వసంతము వలే ఉండెను, చక్కని భూషణాలు ధరించిన స్మసానమునందున్న మండపము వలే ఉండెను 

సీతను చూచుచున్న రావణుడు క్రోధముచె ఎర్రబడిన కన్నులతోను, త్రాచుపాము వలె బుసలు కొట్టుతూ కోపములో సీతతో ఇట్లనెను, ఓ సీతా నీవు నీతి మాలిన అర్ధహీనుడైన రాముని మరువమనెను, సూర్యుడు తన తేజముతో సంధ్యను నాశము చేసినట్లు నేను నిన్ను నాశము చేసెదను

భయంకరముగా ఉన్న రాక్షస స్త్రీల అందరిని రావణుడు ఆజ్ఞాపించెను, ఓ రాక్షస వనితలారా అనుకూల ప్రతికూల వాక్యముల తోడను, సీత నాకు వశమగు నట్లు, సామదాన భేదో పాయములతోను, దండ భయముచె నైన సీతను లొంగదీయుడని స్త్రీలతొ పల్కెను

భయ్యంకరాకారము గల రాక్ష స్త్రీలను రూపాలను వర్ణించుతూ  ఆజ్ఞాపించెను "సీతను లొంగదీయుడని చెప్పి భవనములోనికి వెళ్ళెను, పెద్ద నోరు పొడవైన నాలుక గల స్త్రీలతోను, నాలుక, ముక్కు, చెవులు, లేని స్త్రీలతోను, సింహము, ఆవు, పంది, ముఖముగల స్త్రీలతోను, మండుచున్న కేశములు కలిగి ఉన్న స్త్రీలతోను

ఒక కన్ను, ఒకే చెవి, ఒకే చేయి ఉన్న స్త్రీలతోను, ఆవు, ఒంటె, ఏనుగు, చెవులు గల స్త్రీల తోను, వ్రేలాడు చెవులు, వేలాడు స్తనములుగల స్త్రీలతోను, ఏనుగు, గుఱ్ఱము, ఆవు। పాదములు గల స్త్రీలతోను

పెద్ద పాదములు, చన్న పాదములు గల స్త్రీలతోను
పెద్ద పొట్ట పెద్ద చేతులు, పొడుగు కాళ్ళు గల స్త్రీలతోను
శరీరము మోత్తము రోమాలతో ఉన్న స్త్రీలతోను
నాలుక, ముక్కు, చెవులు, లేని స్త్రీలతోను

శత్రు భయంకరుడగు రావణుడు ఒకవైపు సీతను చూచు చుండెను, మరోవైపు రాక్షస భయం కల్గించే రూపలు గల స్త్రీలను ఆజ్ఞాపించెను, కామంతో,క్రోధంతో ఉన్న రావణుడు సీతవైపు చూసి గట్టిగా గర్జించెను, అప్పుడే ధ్యానమాలిని యను రాక్షసి రావణుని కౌగలించుకొని ఇట్లు పల్కేను

మహారాజా మనుష్య స్త్రీని వదలి నాతో క్రీడింపుము సుఖము కల్గును, దీనురాలైన మానవజన్మురాలైన సీతతో నీకు ఏమి సుఖము కల్గును, ఓ రాక్షసేస్వర నీ బాహు బలము, నీ దివ్యములైన ఉత్తమ భోగములను 
బ్రహ్మాదేవుడు ఈమెకు నీతోసుఖము రాసిపెట్టలేదు ఇదినిజమై యుండెను 

     

ప్రేమలేని స్త్రీతొ పురుషుడు కామించినచో వాని శరీరమునకు తాపము కల్గును, ప్రేమ ఉన్న స్త్రీతొ పురుషుడు కామించినచో వానికి మంచి ఆనందము కల్గును, అని పల్కుతూ ఉన్నప్పడు రావణుడు పదేపదే చూస్తు గట్టిగా నవ్వు చుండెను, ద్యానమాలిని మేఘం లాంటి వాడ్ని కౌగలించుకొని, పైకి లేవతీసుకొని  వెళ్ళెను 

ప్రజ్వలించు భాస్కరుని బోలి ఉన్న, ఎర్రని నయనాలు ఉన్న రావణుడు బయలుదేరెను, దేవ- గాంధర్వ- నాగ, కన్యలు నలుమూలలా అతనిని చుట్టి తీసుకొని పోయెను 
ధర్మమార్గములో ఉన్న సీతను బెదిరించి, మన్మధ మోహితుడైన రావణుడు ఉండెను,భూమిని కంపింప చేయుచూ, కామపీడుతుడై భార్యలతో భావనముకు వెళ్ళెను 

శ్రీ సుందరకాండ 22వ సర్గ సమాప్తము   
 

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
 23 వ సర్గ (వాల్మికి రామాయణములోని 21 శ్లోకాల  తెలుగు వచస్సు)
(" రాక్షస స్త్రీలు సీతకు ఉపదేశించుట  ")    

రాక్షస స్త్రీలతొ సీతను లొంగదీయుడని చెప్పి రావణుడు వెళ్లి పోయెను, భయంకరరూపముగల రాక్షసస్త్రీలు సీతవద్దకు పరుగెత్తుకుంటు వచ్చెను, రాక్షసస్త్రీలు క్రోదావేసముతో పరుషముగా సీతతో మాటలు ప్రారంభించెను, రాక్షసస్త్రీలు సర్వ శ్రేష్టుడు మహాత్ముడైన రావణునికి భార్యగా ఉండమనెను 


ఆరుగురు ప్రజాపతులలోను బ్రహ్మయొక్క మానస పుత్రుడును, పేరులో ప్రసిద్దిడైన ప్రజాపతి, ఆరుగురు ప్రజాపతులలో 4వ వాడును, పులస్తునికి మానస పుత్రుడును పరమతేజముతో ఉన్న విశ్రువసుడను,
ఆవిశ్రవసుని కుమారుడు రావణుడు అని తెలుసుకో అని ఎకజట రాక్షసి పల్కేను

పిల్లి కళ్ళుగల హరిజట అను రాక్షసి కోపముతో కళ్ళు పెద్దవిచేసి ఇట్లు పల్కేను, 33 దేవతలకు ప్రభువైన దేవేంద్రుని జయించిన రాక్షస రాజును, నీవు ప్రేమించి భార్య వగుట అన్ని విధములుగా మంచిదని ఘర్జించెను
పిమ్మట ప్రఘన అనే రాక్షసి కోపిష్టిగా మీదకు వచ్చి ఘోరవాక్యాలు పల్కేను 
 
మహాబల సంఆయా పంనుడగు  రావణ ప్రభువు నిన్ను ఎంతో  ప్రేమించెను, ప్రియురాలిన భార్యనుకూడ  త్యజించి నీ వద్దకు వచ్చి వేడుకొనెను, అంత:పురస్త్రీ లందరినీ వదలి నిన్నె ఆరాధించి నీవద్దకు వచ్చెను, వికట అనే రాక్షసి మొఖంలో మొఖం పెట్టి గట్టిగ అరుస్తూ మాట్లాడేను

ఓ నీచురాల సకలైస్వర సంపన్నుడైన రావణ మహాత్ముడను, ప్రియురాలుగా మారి మాపై, రాక్షసులందరి పై  ఆజ్ఞ వహించ వచ్చును,  
దీర్ఘ నెత్రములు గలదానా అంటూ దుర్మిఖి అనే రాక్షసి కళ్ళు పెద్దవి చేసి బెదిరించెను, ఒసీత మేము చెప్పునది నిజము, మా మాటలు  విని అనుకరించ మనెను

ఎవనియోక్క భయమువలన కాయదో సూర్యుని ఎండలను,  ఎవనియోక్క భయమువలన విడువదో వాయువు గట్టిగాను ఎవనియోక్క భయమువలన మేధావులు మాట్లాడలేరు గట్టిగాను, ఎవనియోక్క భయమువలన స్త్రీలు కూడ మాట్లాడలేరు గట్టిగాను

ఎవనియోక్క భయమువలన వర్షిమ్చునో వృక్షములు పుష్పలను, ఎవనియ్యోక్క భయమువలన విడుచునో పర్వతములు నీటి ధారలను, ఎవనియోక్క భయము వలన వర్షిమ్చునో మేఘములు వర్షములను, అట్టి రాక్షస రాజుకు భార్యకానిచో స్త్రీలందరూ కలసి నీవింక జీవించ జాలవనెను

శ్రీ సుందరకాండ 23వ సర్గ సమాప్తము     

 ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

 24వ సర్గ (వాల్మికి రామాయణములోని 48 శ్లోకాల  తెలుగు వచస్సు)
(" సీత రాక్షస స్త్రీల మాటలను తిరస్కరించుట, రాక్షస స్త్రీలు సీతను భయపెట్టుట ")    

ఓ సీతా నీవు సమస్త  ప్రాణులకును మనోహరమైన అంత: పుర వాసమును ఏల వప్పుకోవు, మిక్కిలి విలువగల  శయణాలున్న రావణుని భవనమును
రాక్షసస్త్రీలు సీతాదేవితో పలుకరాని,  అప్రియములు, పరుషములగు మాటలు పల్కేను నీవు మనుజుని భార్యత్వమును గొప్పగా భావించి, చేస్తున్నావా ఈ తిరస్కారాలను 
 
ఓ సుమంగళి మనుష్యకాంతవగు నీవు, తిరస్క రిస్తున్నావు రాక్షసత్వమును, రాక్షసరాజైన రావణుడు మూడు లోకముల ఐశ్వర్యమును, అతన్నే భర్తగాపొంది, గౌరవమర్యాదలను,  పొందుము సుఖమును రాక్షస రాజును ప్రేమించి, రామునిపై ఉన్న ప్రేమను మరల్చమనేను

రాక్షస స్త్రీల మాటలు విని, కన్నీళ్ళు నిండిన  నేత్రము లతొ ఇట్లు పల్కేను, మీరందరు  కలసి, లోకవిరుద్దముగా చెప్పిన,  మాటలు పాపపు మాటలని తెలియును
మనుష్య స్త్రీ రాక్షసునికి భార్య కాజాలదు, మీరందరు 
తినిన తిందురు కాక,మీరుచెప్పినది చేయజాలను 
ధీనుడు కానిమ్ము, లేక రాజ్యహీనుడు కానిమ్ము 
నాభర్తే  గౌరవింపదగిన వాడై యుండును 
 
మహా భాగ్య సంపన్నురాలగు శచీదేవి  దేవేంద్రు సేవించి నట్లును, అరుంధతి- వసిష్టుని, రోహిణి 
- చంద్రుని సేవించు నట్లును, లోపాముద్ర-అగస్త్యుని, సుకన్య-చ్చవనుని, సేవించి నట్లును, సావిత్రి-సత్యవంతుని, శ్రీమతి-కపిలుని సేవించి నట్లును

భీమరాజు కూతురు దమయంతి,  నలుని సేవించి నట్లును, మదయంతి సౌదాసుని, కౌశిని - సగరుని సేవించి నట్లును, సువర్చల సూర్యుని నిత్యము అనురక్తియై ఉండినట్లును, నేను కూడా ఇక్ష్వాకు వరుడగు  శ్రీరామచంద్రుని అనువర్తింతును 

సీత వాక్యాలు విన్న రాక్షస స్త్రీలు పరుషముగా మరలా ఇట్లు పల్కేను, హనుమంతుడు సింసుపావృక్షము నుండి  స్త్రీలు బెదిరించే మాటలు వింటూ  ఉండెను
ఆపాదమస్తకము కంపించుచున్న సీతను  స్త్రీలు ఆక్రమించి వేదించ సాగెను, రాక్షస  స్త్రీలు పెదవులను నాకుచూ, ప్రజ్వలించుచు సీతను భయపెట్టేను

భయంకరమైన రాక్షసులు  గండ్ర గొడ్డలిని తెచ్చి నరుకు తామనెను, ఈ స్త్రీ రాక్షసాదిపతికి  తగిన భార్య  కాదని పెద్దగా అరిచెను, రాక్ససస్త్రీలు చేస్తున్న బెదిరింపులకు 
సీత దేవి అశ్రుబిందువులను రాల్చెను, విశాలక్ష్మి యగు సీత సింసుపావృక్షము,  వద్దకు వచ్చి శోకమగ్నమై యుండెను

భయంకరులగు రాక్షస్త్రీలకు  చిక్కినదియును,  దీన మతియును, మలినవస్త్రములొఉన్న సీతను నలు వైపుల నుండి హింసించెను, భయంకరమైన, మిక్కిలి లోతుగా  అంటుకు పోయిన ఉదరము కలదియును 
మూర్తీభవించిన కోపమువలె వికట అనే రాక్షసి సీతతొ ఇట్లు పల్కేను

ఓ సీత నీవు భర్త విషయమున చాల స్నేహమును ప్రదర్సిమ్చితివి అది చాలును, తెలియదా నీకు ఏ విషయమునైన  అతిగా నుండుట దుఖమునకు దారి తీయును, నీకు మంగళమగుగాక, చాలాపరితోషము కల్గినది, పరిపాలించితివి మానవుల శిష్టచారములను
ఓమైథిలి పరాక్రమము గలవాడు,సర్వరాక్షసాదిపతి 
యగు రావణుని భర్తగా స్వీకరించమనెను 

ఓ సీత మానవుడు, ధీనుడు, అయిన రామున్ని విడిచి పెట్టుమనెను నీవు దివ్యమైన అంగరాగాములను
 శరీరమునకు పూసు కొనమనెను,   ఓ సీత నీవు శ్రేష్ట మైన అలంకారములను,  అలంకరించు కొనమనెను 
ఓ సీత త్యాగశీలుడైన రావణునికి భార్యాయై సుఖమును పంచవలెను 

మంగళ ప్రదురాలైన సీత అగ్నిదేవుని భార్యయయిన స్వాహాదేవి వలెను, ఇంద్రుని భార్య యైన శచీదేవి వలే
 లోకాధీశురాలువగుము అనెను, రాముని ఆయు ర్దాయము తీరే, నీకేమి ప్రయోజనమున్నది అని పల్కేను
మేముచెప్పినట్లు వినకపోయిన మేమందరమూ కలసి నిన్ను తినేద మనేను 

మిక్కిలో నీచ బుద్దిగల ఓ మైథిలి  నీవు బ్రతికి ఉన్నావు మా జాలివలనను, నీయొక్క అసందర్భపు మాటలను సహించు, చున్నాము మా మృధు స్వభావము వలనను
నీవు ఇతరులు రాలేని సముద్రపు ఈవతల  ఒడ్డుకు తీసుకు వచ్చి యుంచేను, నీవు రావణ గృహమున బందీలొఉన్నావు వినుము మాయోక్క హితమగు వాక్యములను

 సాక్షాత్తు గా దేవెంద్రుడే అయినను నిన్ను రక్షింప జాలకుండును, ఇక కన్నీరు రాల్చుట విడువుము,
 త్యజిమ్పుము వ్యర్ధమైన శోకమును, రావణునిపై ప్రీతిని కలుగజేసికొని, ఆనందించి త్వజించుము నిత్య ధైన్యమును,  ఓ బీరుస్వభావముగల సీతా 
స్త్రీలయెవ్వనమెంతో  యస్తిరమో మాకు తెలియును 

నీయొక్క యవ్వనము గడచిపోకముందే  యనుభ వించుము భోగ సుఖమును, రమ్యములగు ఉద్యానములను, పర్వతాలపైనను, ఉపవము లందును
ఓ సుందరి వగు దేవి, వేల కొలది యత:పురస్త్రీ లందరి పై ఆజ్ఞను, రావణునితో ఓ మదవిభ్రమాక్షి సంచరించి 
సుఖమును పొందవలెను

నేనుచెప్పిన మాటలను విననేమి నీ హృదయమును పెకలించి భక్షించెదను, క్రూరదర్సనయగు చండో దరియను,  రాక్షసి శూలమును త్రిప్పుచూ ఇట్లు పల్కెను 
హరినశాబికమును బోలిబిత్తరి చూపులతొ, భయముచే కంపించు స్తనములు గలదియును, మరొక రాక్షస స్త్రీ, సీతను చంపి ముక్కలుగా చేసి తినవలేనని గోప్పకోరిక కల్గెను అని పల్కెను 

ఒక రాక్షసి ఈమె యోక్క మహోత్తరమైన వక్షమును
మరో రాక్షసి బిందన  సహితముగా హృదయమును, వేరే రాక్షసి అవయవములను, తల భాగమును, విలపిస్తున్న సీతను చూచి స్త్రీల కోరికలు బయట పెట్టెను

 నులిమి చంపివేయుదుము ఈమె యొక్క కంఠంను
ఊరకనే ఎందుకు కూర్చొన వలెను అని ప్రఘన పల్కెను  
మనుష్యవనిత చనిపోయినదని అందరు కలసి చెప్పెదమనెను, ఇందు సందేహములేదు, సరే అని మహారాజుతినండి అని పల్కును

అజాముఖి అను రాక్షసి ఈ విధముగా పల్కెను, చేయుదము ఈమెను నరికి సమాన పిండములను
వివాదము వద్దు మనమందరమూ  పంచుకొని తిందుమనెను, వెంటనే పెయసామగ్రీని, పుష్ప హారములను తెమ్మనెను

అజాముఖ అను రాక్షసి నిజముచేప్పినది  అని సూర్పనఖ వంత పల్కెను, వెంటనే సర్వసోకనాశికమగు సురసతెండు, తినేదము మనుష్య మాంసమును,   
నికుంభలాదేవి ఎదుట నృత్యము చేసి  ఆనందము పొందవచ్చును అని పల్కెను, రాక్షస స్త్రీలచె బెదిరింప బడుచున్నదియై, ధైర్యమును త్యజించి ఏడ్వ సాగెను    

శ్రీ సుందరకాండము నందు 24 వ సర్గ సమాప్తమునచ్చక  


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:

 25వ సర్గ (వాల్మికి రామాయణములోని 20 శ్లోకాల  తెలుగు వచస్సు)
(" సీత రాక్షస స్త్రీల మాటలను తిరస్కరించుట, రాక్షస స్త్రీలు సీతను భయపెట్టుట, సీత శోకార్తయై విలపించుట ")    

పరుషముగాను, దారుణముగాను, నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన  స్త్రీల మాటలను, సౌమ్యస్వభావముగల సీత ఏంతో  భయంతో స్త్రీల ఎదుట పెద్దగా ఏడ్వ సాగెను, 
సహృదయరాలగు వైదేహి మిక్కిలి భయముతో కన్నీటితో ఈవిధముగా పల్కెను,  మనుష్య స్త్రీ రాక్షసునికి భార్య కాజాలదు,  నన్ను హింసించిన మీ మాటలను ఒప్పుకోను 

రావనునిచే బెదిరింప బడుటచే సోకార్తియైన సీత శాంతి లేకుండా నుండెను, వనమునందు తనగుమ్పునుండి వీడి తోడేళ్ళచే పీడింపబడు లేడివలే నుండెను, శరీరమును మిక్కిలి ముడుచుకోనునట్లు చేయుచూ మిక్కిలి కంపింప సాగెను, సీత అశోకవృక్షకొమ్మను పట్టుకొని నిరాశామనస్కయై శోకముతో భర్తను గురించి ద్యానించెను, సీతాదేవి కన్నీటిశ్రావములతో విశాలమైన స్తనములు తడిగా ఉండెను, సీత పెను గాలికి పడిపోయిన అరటివలె గడగడ వణకు చుండెను
సీతను స్త్రీలు భయపెట్టుట వలన పాలిపోయిన ముఖముగా మారెను, సీత రామునిగూర్చి చింతించుచు శోకమునకు అంతును కనుగొనజాలక యుండెను

సీత జడ కుడా కదులుచూ ప్రాకుచున్న త్రాచుపాము వలె నుండెను, స్త్రీలకు ఏమిచేప్పలేక ఆమె దుఃఖముతో కన్నీరు కార్చు చుండెను, భర్త్రువియోగ భాదతో సీత మనసు శోకముచే వ్యాకులమయ్యెను, ఆ సీత దేవి ఓరామ, ఒలక్ష్మనా, ఒఅత్తగారగు కౌసల్యా, ఓ సుమిత్ర, అని విలపించెను    

నేను ఇచ్చట క్రూరురాండ్రగు రాక్షస రక్షక భటులు పీడించ బడుటను, దు:ఖితనై రాముడు లేకుండా ముహర్త మైనను జీవించి యున్నాను, దీనిని బట్టి  స్త్రీ యైన, పురుషుడైనా మరణించ వలెనని కోరుకున్నను
పండితులు చెప్పిన మాటలు "సమయం ఆసంన్న మయే వరకు,  మృత్యువుకూడా రాదన్నది " నిజమగును 

వాయువేగహతమైన వస్తువులతో నిండిన నావవలె అనాధనై నశించు చున్నాను, అల్పమైన పుణ్యము గల దీను రాలైన నాధుడు లేని సామాన్య స్త్రీ వలెను, ఈ రాక్షస స్త్రీలకు లొంగక నాభార్తను చూడ జాలక, చెప్పుకొనేదారిలేక  జీవించి యున్నను, నేను నీటిచే కూల్చబడిన నది ఒడ్డు వలే, గుర్తించేవారు లేక, శోకముతో నశించి యున్నాను 

పద్మ దళముల వలె విశాల మగు నేత్రములు గల వాడును, విక్రాంత మగు సింహమును బోలిన నడక నడుచు వాడును, ప్రియ వదియును, కృతజ్నుడును, అగు నా భర్తను, అదృష్ట వంతులు మాత్రమె చూడ గల్గు చుండెను

ప్రసిద్దమైన బుద్దిగల ఆ రాముడు లేకుండా నేను జీవించ జాలను, విషముతిని జీవించుట ఎంత కష్టమో, అంత కష్టమును నను భవించు  చున్నాను
నేను దెహన్తపూర్వమున (పూర్వజన్మమున) ఎన్నో మహా పాపములు చేసి యున్నాను, అట్టి పాపపు ప్రభావము వలననె ఇట్టి  మహా దు:ఖములు అనుభ విస్తున్నాను 

గొప్ప శోకముతో భాదపడుచున్న నాకు మరణించ వలెనని కోరిక కల్గెను, కాని రాక్షస స్త్రీలు నా చూట్టు ఉండుట వలన మరణాన్ని పొంద జాల కున్నాను 
స్వేచ్చ నను సరించి ఈ జీవితమును త్వజించుట వీలు లేనిదియును,  ఈ మనుష్యత్వమును, ఈ పరాధినత్వమును నేను నిందించు చున్నాను 

శ్రీ సుందర కాండము నందు 25వ సర్గ సమాప్తము  

____((()))___

No comments:

Post a Comment