Monday, 2 February 2015

3. Pranjali సుందరకాoడ - తెలుగు- వచస్సు (IInd sargamu )

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ:
శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:


  
హనుమంతుడు సూక్ష్మ రూపంలో లంకలోకి ప్రవేశించుట
అథ ద్వితీయ: సర్గ:

   ప్రాంజలి       
సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:

58 సంస్కృత  శ్లోకాల ఆధారముగా తెలుగు- వచస్సు
 లంకలొకి ప్రవేశించుటగూర్చి ఆలోచించుట
సూక్ష్మ రూపంలో లంకలోకి ప్రవేశించుట
చంద్రోదయ శోభావర్ణనను తెలియపరుచుట
కాంచన లంకను అద్బుతముగా వర్ణించుట


 

హనుమంతుడు దీర్ఘ విశ్వాశములు విడువక ఎట్టి శ్రమ పొందక అక్కడే ఉండెను
హనుమంతుడు సముద్రము దాటి త్రికూట పర్వతము పై దిగెను
అక్కడ ఉన్న చెట్ల అన్ని పూల వర్షంతో అభిషేకము చేసెను

  పుష్పములతో మునిగి పోయిన హనుమంతుడు పుష్పమయమైన కపి వలె ఉండెను 

హనుమంతుడు మనసులో అనుకొనెను ఇటువంటి ఎన్ని సముద్రాల నయినా అవలీలగ దాటగలను
నీల వర్ణముగల పచ్చిక బయల్లను, సౌగందము చిందే వనములను చూచు చుండెను 
వృక్షములచే నాచ్చాదితమైన పర్వతములను,కానన శ్రేణులను, చూచు చుండెను  
వానర శ్రేష్టుడు మహావేగ  సంపన్నుడు అగు హనుమంతుడు లంకను చూచెను 

 సరళ వృక్షములను, కొండకోగులను, పుష్పించిన కర్జూరములను,
మేరటి చేట్లను, జమ్బీర వృక్షములను, మొగలి పొదలను
కొండ మల్లెలను, మంచి సువాస ఇచ్చు పిప్పిలి వృక్షములను 
ఏడాకుల అరటి చెట్లను వేగిచేట్లను,  కాన్చానములను చూచెను 

హంసలతోను, బాతులతోను, పద్మములతోను, కలువలతోను 
రమణీయ మైన  క్రీడోద్యానములను, వివిధ జలాశయములను
రమ్యములైన ఉద్యానవనములను, పూలతో  నిండిన ప్రదేశములను 
సర్వ ఋతువులలో పుష్పించి ఫలించు వృక్షములను మారుతి చూచు చుండెను 

శరత్కాల మేఘములవలె, శ్వేత విరాజిత భవనములను 
స్వర్ణ ద్వారములు, కిటికీలు, ప్రాకారములు కలదియును
ప్రాసాదాలపై నలరారుధ్వాజ పతాకాలతో నొప్పుచున్నదియును 
ధనస్సులు ధరించి రక్షక భటులు లంకను రక్షిమ్చుట హనుమంతుడు చూసెను

కొండశిఖరముపై నిర్మించిన స్వేత వర్ణముగల భవనములను
ఆకాశమునుది వ్రేలాడుతున్నట్లు ఆకాశమున నిర్మించి నవియును
విశ్వకర్మచే నిర్మించ బడిన లంకను రాక్షసేంద్రుడు పాలించు చుండెను 
కోట బురుజులనేది కర్నభూశనములొ నొప్పుచున్న లంకను చూచెను  


మహా సర్పాలతో భయంకరముగా బుసలుకొడుతు ఉన్నదియును
వికారముగా ఘోరరాక్షసులతో కాపలా కాయుచున్నదియును
ఎత్తెన మహసౌధములతొ  ఆకాశమును మోయుచున్నట్లుగాను
వజ్ర వైడూర్యాలతొ నిర్మించిన లంకను హనుమంతుడు చూచెను

మనసంకల్ప మాత్రమునే  విశ్వకర్మచే నిర్మించి నదియును
పూర్వము కుబేరుని కావాస భూతమైన స్వర్ణ లంకను
శూలపట్టు శాద్యాయుధములను చెత ధరించిన శూరులను
చూస్తూ ఉత్తరాద్వారము వద్దకు వచ్చి హనుమంతుడు ఆలోచించెను

లంక పట్టణము చుట్టూ ఉన్న భయవహమైన సముద్రమును
మహోత్తరమైన రక్షణస్థితి, రావణుని శక్తిని తెలిసికోనియును
లంకను యుద్ధముద్వారా దేవతలైనను జయించ జాలరను కొనేను
సామ,దాన,.భెధముకు, యుద్దమునకు  అవకాసము లేకుండెను

హనుమంతుడు మొదట సీత జీవించి ఉన్నదో తెలుసు కోనవలేనను కొనేను
రామచంద్రునికి మేలు చేయగలుగు ముహుర్తకాలమును ఆలోచించెను
బలవంతులు రక్షిమ్పబడుచున్న లంకకు  పోవుట దుర్లభమనుకోనేను
భలవంతులైన రాక్షసులను వంచన చేసి ప్రవేసించాలని అనుకొనెను  

శత్రుదుర్భేద్యమైన కోట దగ్గరకు  రాముడు వచ్చి ఏమి చేయగలుగును
రాక్షసుల విషయమున సామోపాయ్యము అవసరము లేకుండెను
సామ,దాన,భేదమునకు, యుద్దమునకు కూడా అవకాసం లేకుండెను
అంగదుడు, నీలుడు, ధీమన్తుడగు సుగ్రీవుడు వచ్చి ఏమి చేయగల్గును

శుభఘడియల కోసం వేచి యుండి మహోత్తర కార్యమును సాదించెదను
నేను ద్రుశ్యద్రుశ్యమగు రూపములొ స్వర్ణ లంక నంత  వెదకవలెను
స్వర్ణ లంకను చూసి ధీర్ఘవిశ్వాసములు విడుచుచు ఆలోచించెను
హనుమంతుడు రావణుని శక్తిని తెలుసుకొని సీతను వెతకవలెనని అనుకొనెను

రామచంద్రుని కార్యము విఘాతము కలుగ కుండుగను
ఎకాత్మముగా, ఒంటరిగా మాయను చేధించి వెతకవలెను
అస్తిరమైన మతితో నవివేకముగా వ్వవహరించిన పని పాడగును
సూర్యదయము వచ్చిన చీకటి ఉన్న పరిస్తితి ఏర్పడును
  దూత మూలమున బుద్ధి అవివేకముగా మారిన కార్యము చెడిపోవును
   దూత అనేవారు ఇది చేయవచ్చు ఇది చెయ్యకూడదు ఆలోచించవలెను
బుద్ధిమంతుల అనుకొన్న మూర్ఖలగు దూతలు పని పాడుచేయును
  కార్యము చెడకుండ దూత కార్యము నిర్వహించాలని మారుతి అనుకొనెను

 నా యొక్క వివేక శూన్యత బయట పడకుండు నట్లుగాను 
కష్టపడి సముద్రముదాటి వచ్చిన వృధా కాకుండు నట్లుగాను
రాక్షసులు,  రావణునివల్ల రామకర్యముచేడు కుండునట్లుగాను
నాప్రవర్తనను నిగ్రహించుకొని సీతాన్వేషణ నిర్వహిస్తాను 

 ఇక్కడ రాక్షస రూపమున సంచరించుట కుడా కష్టమగును 
వాయువు కుడా రాక్షస రాజు ఆజ్ఞ ప్రకారము వీచును 
ఈరూపమున సంచరించిన ప్రభుకార్యము చెడిపోవును 
హనుమంతుడు మార్జాల ప్రమాణమైన శరీరము మార్చుకొనెను 

సీతా సన్దర్శనొత్యుకుడై సూర్యోస్తయము వరకు వేచి ఉండెను
 ప్రదోషకాలమునందు  రమ్యమైన లంకా పట్టనమునందు ప్రవేశించెను
వాజ వైడూర్యములతొ నిర్మించిన  భవనములు చూచెను
హనుమంతుడు అన్ని కాలాల్లో అన్ని పండ్లు పండుట చూచెను

చంద్రుడు కూడా సహస్త కిరణములతో వెన్నెలను కురిపించెను
శంఖమువలె, క్షీరమువలె, తామరతూడ్లను బోలి తెల్లగా నుండెను
బంగారముతొలంకా పట్టణము అంతా సొబగును కూర్చు చుండెను
మనస్సుతో వైదేహిని చూసి, లంకను చూచి హర్షము పొందెను