Wednesday 25 February 2015

6. Pranjali - సుందరకాoడ - తెలుగు- వచస్సు ( 5va sargamu )

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ:
                              శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:


      ప్రాంజలి       
సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:
రాత్రులందు తారాగతులమద్య చంద్రుడు ప్రకాశిమ్చు చుండెను
వెన్నెల అనే చాందిని కుడ్డ పరిచినట్లు చంద్రుడు వెలుగుచుండెను 
గోసాలలో విహరించి మత్త వృషభము వలే చంద్రుడు ఉండెను
నక్షత్రాలమద్య ఉన్న చెంద్రుడు హనుమంతునకు వెన్నెలను పంచెను

చంద్రుడు లోకములోని పాపాలను నాశనము  చుండెను
చంద్రుడు మహాసముద్రమును ఉప్పొంగునట్లు చేయుచుండెను
చంద్రుడు సకల భూతములను పకాశిమ్ప చేయు వాడును 
చంద్రుడు నింగిలో తారలమద్య ఉండుటను హనుమంతుడు చూచెను 

చంద్రుడు భూమిపై ప్రభాత సమయమున మందర పర్వతము నందును
చంద్రుడు ప్రదోష కాలమున మహా సాగరము నందును 
చంద్రుడు పగటి వేలల యందు పద్మము లందును
చంద్రుడు సుందరమైన నిశాకరుని యందు  వెలుగు చుండెను

చంద్రుడు వెండి పంజరములో ఉన్న హంస వలెను
మందార చలముయోక్క గుహనందుఉన్న సింహము వలెను
చంద్రుడు మహా గజము పై అధిరోహించిన వీరునుని వలెను
చంద్రుడు ఆకాశగతుదై అద్భుతముగా ప్రకాశించు చుండెను  

తీక్షనమైన కొమ్ములు గల ఆంబోతు వలెను 
ఉన్నత శిఖరములుగల హిమపర్వతము వలెను
బంగారు తొడుగు దంతములుగల గజము వలెను
చంద్రుడు పున్నమి వెన్నెలను ఎప్పుడు ప్రకాశిమ్చు చుండెను

చంద్రుడు శిలాతలముపై పరుండిన సింహము వలెను
చంద్రుడు మహారణమునకు వచ్చిన మత్త గజము వలెను
చంద్రుడు రాజ్యాభిషేకమునకు వచ్చిన మహారాజు వలెను
 చంద్రుడు వెలుగును పంచుట హనుమంతుడు చూచెను

 చంద్రుని మీద ఉన్న మంచు తుప్పరులు తొలగి పోయెను
చంద్రునిలో ఉన్న నిశ్చలమైన ప్రకాశలక్ష్మికి ఆశ్రయ మయ్యెను
మాలిన్యమంతా పోయి చెవుల పిల్లివలె కనబడు చుండెను
చంద్రబింబము హనుమంతునకు లంకఅంతా వెలుగును విరజిమ్మెను

వెన్నెలచే నష్టమైన తిమిర దోషము కలదియును
రాక్షసులు మాంసాహారరూపమైన దోషము కలదియును
స్త్రీల హృదయములందు ప్రేరితమైన కామదోము కలదియును
స్వర్గ ప్రకశమైవెలుగుచున్న చంద్రుడను హనుమంతుడు చూచెను 

కర్ణ సుఖములు కల్గించు వీణానాదములు వినబడు చుండెను 
సచ్చరిత్రగల స్త్రీలు పతులతో నిద్రించు చుండెను
రౌద్రాకారులగు రాక్షసలు విహారము చేయు చుండెను
హనుమంతుడు  వింతవేషాలతోఉన్న రాక్షసులను చూచెను

కొందరు రాక్షసులు ఛాతిలతో ' డి ' కొట్టు కొను చుండెను
కొందరు రాక్షసులు ఇష్టమైన కాంతలను ఆట పట్టించు చుండెను 
కొందరు రాక్షసులు ద్రుడమైన  ధనస్సులను లాగు చుండెను
కొందరు రాక్షసులు చిత్ర, విచిత్ర మైన  వేషములు వేయు చుడెను

 రాక్షస స్త్రీలు పరస్పరము ఒకరి కొకరు ఆక్షేపించు కొనుచుండెను  
తమ బలసిన భుజాలు పట్టుకొని ఒకరికొకరు ఊపుకొను చుండెను
రాక్ష స్త్రీలు పానమత్తుచే పరాకగా ఒకరికొకరు మాట్లాడు చుండెను
కొందరు మత్తుచే భీకరంగా అరుస్తూ భాణాలను సంధించు చుండెను

కొందరు స్త్రీలు చందన లేపములు పూసికొని ఉండెను 
కొందరు మంచి అందము కలిగియుండి నిద్రించు చుండెను 
అందమైన మోముగల కొందరు మగువలు నవ్వు చుండెను  
 స్త్రీలు కోపముతో దీర్ఘమైన విస్వాసములు విడుచు చుండెను 

లంకా నగరంలో గొప్ప బుద్ధిమంతులను 
సమ్మనితములైన ఉత్తమ పురుషులను 
మంచి శ్రద్దావంతులగు అందమైన రాక్షసులను
మంచి పేరుతొ మంచిగా మాట్లాడు వారును 

అందమునకు తగ్గ గుణములు కలవారును 
తేజముతో వేల్గొందు తున్న రాక్షసులను
ప్రశాంతముగా వికృతాకారముగా ఉన్న రాక్షసులను 
విశ్వవిక్యాత రాక్షసులను హనుమంతుడు చూసెను 

మంచి స్వభావము, శ్రద్ద భావము గలవారును 
ప్రియుల యందును, పానమందును లగ్నమైనవారును
తారలవలె వేల్గొందు కొందరు అందమైన రాక్షస స్త్రీలను
స్త్రీలు ప్రియులపై ప్రేమాతిసయములు చూపుట మారుతి చూసెను

కొందరు స్త్రీలు ప్రియుల కౌగిలంతలలో చిక్కి సిగ్గు పడుచుండెను 
స్త్రీలు పతిసుఖమును పొంది ఆత్యానంద భరతులైన వారును
పుష్పములు కప్పిన పక్షులవలె కొందరు స్త్రీలు ఉండెను 
కొందరు స్త్రీలను మేడలపైన ఉండుట హనుమంతుడు చూచెను

మన్మదావేశముతొ కూడిన స్త్రీలు, భర్తల వడిలో ఉండెను
భర్తలప్రేమకు పాత్రులైన స్త్రీలు రతికేళీలు సలుపు చుండెను
కొందరుస్త్రీలు పురుషులతో ధర్మమార్గమున సంసారము చేయు చుండెను 
 రతీమన్మదులుగాఉన్న రాక్షసులను హనుమంతుడు చూసెను 

కొందరు స్త్రీలు వస్త్ర విహీనులై నగ్నంగా బంగారు తీగవలె  నుండెను
 అత్యధిక సంభోగముతో పుట్టముకట్టిన బంగారము వలే నుండెను
కొందరి స్త్రీల శరీరవర్ణము చంద్రునిలో మచ్చరంగు వలే నుండెను
 కొందరు స్త్రీలు ప్రియుని వియోగాముతో భాదపడు చుండెను 

 పుష్పమాలను ధరించి హర్షము గలవారై మనోహరముగా నుండెను 
అన్దమైనమొముగలిగి, సుందరమైన కుచములు కలిగి ఉండెను 
సుందరమైన నేత్రములు విద్యులతలవలె ప్రకాశిమ్చు చుండెను 
స్త్రీలు భూషనాలు ధరించి ఇష్ట ప్రియుల ఆలింగనంలో ఉన్నట్లు మారుతి చూచెను   

అతి ప్రాచీన మైన ధర్మము నందును, మన్మధుని చేత శోభాయుక్త  మైనదియును 
నిత్యమూ భర్తనే తలచు చున్నదియును, స్త్రీలలలో  శ్రేష్టమైనదియును
అన్ని కాలములో ఎప్పుడు ఎవ్వనవతిగా ఉండ గలినదియును 
అన్ని విధములుగా వైవిష్టము గల సీతా దేవి కాన రాకుండెను

విరహ దీపము చేత  పీడింమ్ప బడుచున్నదియును
ఏకధారగా కన్నీరు కారుస్తూ కంఠం తడిసి నదియును
ఉత్తమ హారము ధరించి, చక్కని కను రెప్పలు కలదియును
మనోహరమైన కంఠశ్వరము కలదియును 
నృత్యము చేయని ఆడనెమలి వలే సీత కన బడ కుండెను

అస్పష్టముగ కనబడు చంద్రరేఖను బోలినదియును
ధూలిచె ధూపరమైన బంగారు రేఖను బోలినదియును 
దెబ్బ తగిలి మానినప్పుడు నిల్చిన వర్ణ రేఖను బోలినదియును 
గాలిచేత చెదర గొట్టబడిన మేఘరేఖను బోలినదియును
వివిధ వర్ణ రేఖలు గల సీతాదెవి మాత్రము కనబడ కుండెను 

ఎంత సేపు వెతికినా సీతామాత కాన రాకుండెను 
రాముని యొక్క దుఃఖము ఏవిధముగా తొలగించగలను 
రాముని యొక్క కార్యము నేను ఏవిధముగా నెరవేర్చ గలను 
నిగ్రహాశక్తి పరుడైన హనుమంతుడు కొన్నిక్షణాలు ఉస్చాహ శూన్యుడయ్యెను 

శ్రీ వాల్మీకి మహాముని సంస్కృతం లో విరచిమైన 5వ సర్గ తెలుగు వచస్సు సమాప్తము 
 శ్రీ రామ్   ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రామ్ 
 ---0----
ఓం శ్రీ  రాం -  శ్రీ మాత్రే నమ: -  శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
 ప్రాంజలి - సర్వేజనా సుఖినోభవంతు
ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:
సుందరకాండ 5వ సర్గ

హనుమంతుడు లంకానగరములో ప్రవేశించాడు, అక్కడ రాత్రి పేజీలుగా కనిపిస్తున్నది, ఎందుకనగా ఆకాశములో చీకటి రాత్రులందు తారాగతుల మద్య చంద్రుడు ప్రకాసించు  చుండెను. నక్షత్ర వెలుగులు విరజిమ్ము చుండెను. పృద్విమీద వెన్నెల అనే చాందిని కుడ్డ పరిచినట్లు చంద్రుడు వెలుగుచుండెను.తెల్లటి గోవుల మధ్య  గోసాలలో విహరించి మత్త వృషభము వలే చంద్రుడు ఉండెను.  హనుమంతునకు ప్రతి అంగుళము కనబడునట్లు వెన్నెలను కురిపిస్తున్నాడు చంద్రుడు.
వెన్నెలలో లంకలో  ఉన్న గృహాలను చూస్తూ ముందుకు నడుస్తున్నాడు హనుమంతుడు. 

చంద్రుడు లోకములోని పాపాలను (చీకట్లో చేసేవి)  నాశనము  చుండెను, నదులు కలవటం వళ్ళ
చంద్రుడు మహాసముద్రమును ఉప్పొంగునట్లు చేయుచుండెను, ప్రకృతిలో ప్రశాంత వాతావరణము కల్పించి,  చంద్రుడు సకల భూతములను ప్రకాశింప చేయుచున్నాడు  

చంద్రుడు భూమిపై ప్రభాత సమయమున మందర పర్వతము నందును, చంద్రుడు ప్రదోష కాలమున మహా సాగరము నందును, చంద్రుడు పగటి వేలల యందు పద్మము లందును
చంద్రుడు సుందరమైన నిశాకరుని యందు  వెలుగు చుండెను.

చంద్రుడు నింగిలో వెలుగు చుండగా శ్రీ  రామచంద్రుని ఒక్కసారి మనసులో తలచుకొని  హనుమంతుడు నెమ్మదిగా నడక సాగెను.  

చంద్రుడు వెండి పంజరములో ఉన్న హంస వలెను, మందార చలముయోక్క గుహనందుఉన్న సింహము వలెను, చంద్రుడు మహా గజము పై అధిరోహించిన వీరునుని వలెను, చంద్రుడు ఆకాశగతుదై అద్భుతముగా ప్రకాశించు చుండెను.  

తీక్షనమైన కొమ్ములు గల ఆంబోతు వలెను, ఉన్నత శిఖరములుగల హిమపర్వతము వలెను,
బంగారు తొడుగు దంతములుగల గజము వలెను,చంద్రుడు పున్నమి వెన్నెలను ఎప్పుడు ప్రకాశిమ్చు చుండెను.

చంద్రుడు శిలాతలముపై పరుండిన సింహము వలెను, చంద్రుడు మహారణమునకు వచ్చిన మత్త గజము వలెను, చంద్రుడు రాజ్యాభిషేకమునకు వచ్చిన మహారాజు వలెను,  చంద్రుడు వెలుగును పంచుటను హనుమంతుడు చూచెను

చంద్రుని మీద ఉన్న మంచు తుప్పరులు తొలగి పోయెను, చంద్రునిలో ఉన్న నిశ్చలమైన ప్రకాశలక్ష్మికి ఆశ్రయ మయ్యెను, మాలిన్యమంతా పోయి చెవుల పిల్లివలె కనబడు చుండెను,
చంద్రబింబము హనుమంతునకు మరియు లంక అంతా వెలుగును విరజిమ్మెను.

వెన్నెలచే నష్టమైన తిమిర దోషము కలదియును, రాక్షసులు మాంసాహారరూపమైన దోషము కలదియును, స్త్రీల హృదయములందు ప్రేరితమైన కామదోషము కలదియును, స్వర్గ ప్రకశమై వెలుగుచున్న చంద్రుడను హనుమంతుడు చూచెను. 

కర్ణ సుఖములు కల్గించు వీణానాదములు వినబడు చుండెను, సచ్చరిత్రగల స్త్రీలు పతులతో నిద్రించు చుండెను, రౌద్రాకారులగు రాక్షసలు విహారము చేయు చుండెను, హనుమంతుడు  వింతవేషాలతో ఉన్న రాక్షసులను చూచెను.

కొందరు రాక్షసులు ఛాతిలతో ' డి ' కొట్టు కొను చుండెను, కొందరు రాక్షసులు ఇష్టమైన కాంతలను ఆట పట్టించు చుండెను, కొందరు రాక్షసులు ద్రుడమైన  ధనస్సులను లాగు చుండెను, కొందరు రాక్షసులు చిత్ర, విచిత్ర మైన  వేషములు వేయు చుడెను.

రాక్షస స్త్రీలు పరస్పరము ఒకరి కొకరు ఆక్షేపించు కొనుచుండెను, తమ బలసిన భుజాలు పట్టుకొని ఒకరికొకరు ఊపుకొను చుండెను, రాక్ష స్త్రీలు పానమత్తుచే పరాకగా ఒకరికొకరు మాట్లాడు చుండెను, కొందరు మత్తుచే భీకరంగా అరుస్తూ భాణాలను సంధించు చుండెను.

కొందరు స్త్రీలు చందన లేపములు పూసికొని ఉండెను, కొందరు మంచి అందము కలిగియుండి నిద్రించు చుండెను, అందమైన మోముగల కొందరు మగువలు నవ్వు చుండెను,  స్త్రీలు కోపముతో దీర్ఘమైన విస్వాసములు విడుచు చుండెను. 

లంకా నగరంలో గొప్ప బుద్ధిమంతులను, సమ్మనితములైన ఉత్తమ పురుషులను, మంచి శ్రద్దావంతులగు అందమైన రాక్షసులను, మంచి పేరుతొ మంచిగా మాట్లాడు వారును,
అందమునకు తగ్గ గుణములు కలవారును, తేజముతో వేల్గొందు తున్న రాక్షసులను,
ప్రశాంతముగా వికృతాకారముగా ఉన్న రాక్షసులను, విశ్వవిక్యాత రాక్షసులను హనుమంతుడు చూసెను .

మంచి స్వభావము, శ్రద్ద భావము గలవారును, ప్రియుల యందును, పానమందును లగ్నమైనవారును, తారలవలె వేల్గొందు కొందరు అందమైన రాక్షస స్త్రీలను, స్త్రీలు ప్రియులపై ప్రేమాతిసయములు చూపుట మారుతి చూసెను

కొందరు స్త్రీలు ప్రియుల కౌగిలంతలలో చిక్కి సిగ్గు పడుచుండెను, స్త్రీలు పతిసుఖమును పొంది ఆత్యానంద భరతులైన వారును, పుష్పములు కప్పిన పక్షులవలె కొందరు స్త్రీలు ఉండెను,
కొందరు స్త్రీలను మేడలపైన ఉండుట హనుమంతుడు చూచెను

మన్మదావేశముతొ కూడిన స్త్రీలు, భర్తల వడిలో ఉండెను, భర్తలప్రేమకు పాత్రులైన స్త్రీలు రతికేళీలు సలుపు చుండెను, కొందరుస్త్రీలు పురుషులతో ధర్మమార్గమున సంసారము చేయు చుండెను. 

రతీమన్మదులుగాఉన్న రాక్షసులను హనుమంతుడు చూసెను, కొందరు స్త్రీలు వస్త్ర విహీనులై నగ్నంగా బంగారు తీగవలె  నుండెను,  అత్యధిక సంభోగముతో పుట్టముకట్టిన బంగారము వలే నుండెను, కొందరి స్త్రీల శరీరవర్ణము చంద్రునిలో మచ్చరంగు వలే నుండెను,  కొందరు స్త్రీలు ప్రియుని వియోగాముతో భాదపడు చుండెను. 

పుష్పమాలను ధరించి హర్షము గలవారై మనోహరముగా నుండెను, అన్దమైనమొముగలిగి, సుందరమైన కుచములు కలిగి ఉండెను, సుందరమైన నేత్రములు విద్యులతలవలె ప్రకాశిమ్చు చుండెను, స్త్రీలు భూషనాలు ధరించి ఇష్ట ప్రియుల ఆలింగనంలో ఉన్నట్లు మారుతి చూచెను.   

అతి ప్రాచీన మైన ధర్మము నందును, మన్మధుని చేత శోభాయుక్త  మైనదియును, నిత్యమూ భర్తనే తలచు చున్నదియును, స్త్రీలలలో  శ్రేష్టమైనదియును, అన్ని కాలములో ఎప్పుడు ఎవ్వనవతిగా ఉండ గలినదియును, అన్ని విధములుగా వైవిష్టము గల సీతా దేవి కాన రాకుండెను

విరహ దీపము చేత  పీడింమ్ప బడుచున్నదియును, ఏకధారగా కన్నీరు కారుస్తూ కంఠం తడిసి నదియును, ఉత్తమ హారము ధరించి, చక్కని కను రెప్పలు కలదియును, మనోహరమైన కంఠశ్వరము కలదియును, నృత్యము చేయని ఆడనెమలి వలే సీత కన బడ కుండెను.

అస్పష్టముగ కనబడు చంద్రరేఖను బోలినదియును, ధూలిచె ధూపరమైన బంగారు రేఖను బోలినదియును, దెబ్బ తగిలి మానినప్పుడు నిల్చిన వర్ణ రేఖను బోలినదియును, గాలిచేత చెదర గొట్టబడిన మేఘరేఖను బోలినదియును, వివిధ వర్ణ రేఖలు గల సీతాదెవి మాత్రము కనబడ కుండెను.

ఎంత సేపు వెతికినా సీతామాత కాన రాకుండెను, రాముని యొక్క దుఃఖము ఏవిధముగా తొలగించగలను, రాముని యొక్క కార్యము నేను ఏవిధముగా నెరవేర్చ గలను, నిగ్రహాశక్తి పరుడైన హనుమంతుడు కొన్నిక్షణాలు ఉస్చాహ శూన్యుడయ్యెను. 

శ్రీ వాల్మీకి మహాముని సంస్కృతం లో విరచిమైన 5వ సర్గ తెలుగు వచస్సు సమాప్తము

 శ్రీ రామ్   ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రామ్ 

No comments:

Post a Comment