Tuesday, 3 March 2015

7. Pranjali - సుందరకాoడ - తెలుగు- వచస్సు ( 6va sargamu )

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ:
   శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:


సూర్యుని బోలి  మిక్కిలి ప్రకాశించు ప్రాకారములను 
రాక్షాసిధిపతి యోక్క ఎడంతస్తుల భవనములను
రాక్షసులచే రక్షింప  బడుచున్న భవనములను 
కామరూపుడగు హనుమంతుడు యదేస్చగా చూచెను

వెండితో లిఖించబడిన చిత్తరవులను 
బంగారు మలాముతో చేయబడిన సింహద్వారములను 
సింహములచే రక్షింప బడుచున్న మహా భవనమును 
సౌర్యలలక్ష్మీ సంపన్నుడైన హనుమంతుడు చూసెను 

ఏనుగుపై ఆసీనులైన మావటి వాండ్రను 
వేగముగా రధములు లాగు అశ్వములను
సింహ వ్యాఘ్ర చర్మములను ధరించిన రాక్షసులను
ఏనుగు దంతములకు బంగారు తొడుగులను చూచెను 

వెండితోను పంచలోహములతో చేసిన ప్రతిమలను
విచిత్రముగా శబ్దము చేయుచు ఎగురుతున్న భవనములను
రత్నములతో పొదగబడిన బహుమూల్యములైన ఆసనములను
మహా వీరులుండే భవనములను హనుమంతుడు చూసెను 

కనివిని ఎరుగని అద్బుత ద్రుస్యములను 
నానా ప్రాకారములమీద మృగ-పక్షుల చిత్రములను
వినయ యుక్తులగు రాక్షస భార్యలను 
హనుమంతుడు చూసి ఏంతో  ఆనందించెను

రాజులు నివసిమ్చుటకు సమస్త హంగులు కలదియును
 మిక్కిలి ముఖ్యమైన చందనములతో సంపన్న మైనదియును 
మహాజనులు వేచి ఉండు రాక్షసేంద్రుని భవనమును
సింహముతో నొప్పు వనమువలె ఉన్న దానిని మారుతి చూసెను

భవనములో ఎందఱో ఉత్తమ స్త్రీలు నివసించి ఉండెను
భేరి మృదంగద్వనులతో ప్రతిద్వనిమ్చు చుండెను
శంఖనాదములతొ నిత్యార్చనలు చేయు చుండెను 
పర్వదినములందు వివిధహోమములు చేయుచుండెను


పూర్ణిమ అమావాశ్యనందు ప్రత్యేక పూజలు జరుగు చుండెను  



భవనమద్య బాగముపైకప్పు నందు రత్నములు పొదగి యుండెను
అక్కడ గంమ్భీరమైన నిశ్శబ్దము కూడా ఆవహించి ఉండెను
తేజోవంతముగా వెలుగుతున్న భవనమును హనుమంతుడు చూసెను


ప్రహస్తుని భవనమును చూసి, మహహ పార్శుని భవనమును వెదికెను
కుంభ కర్ణుని భవనము చూసి,  ప్రక్కనే ఉన్న వనములు వెతికెను
విరూపాక్ష గృహమును వెతికి, ప్రక్కనున్న గృహములను వెతికెను
లంకానగరికి అలంకారముగాఉన్నభవనమును మారుతి చూసెను

మహోదర, విద్యుజిహ్వ,  విద్యున్మాలు,గృహములను 
బహుద్రంష్ట, సుకుల, బుద్దిమంతుడైన సారని, గృహములను
  జంబుమాలి, సుమాలి, విష్ణుభక్తుడగు విభీషణ, గృహములను    
ఇంద్రజిత్తు గృహమును, హనుమంతుడు సీత కొరకు వెతికెను

ద్రుమాక్ష, సంపాతి, విద్యుద్రూప, భీమ, ఘన, గృహములను
విఘన, శుకనాభ, చక్ర, శర, కపట, హ్రస్వకర్ణ, గృహములను
దంష్ట్ర,మహాకపి రశ్మికెతు, సూర్య శత్రు, వజ్రకాయ, గృహములను
యుద్ధొన్మత్త,  రాక్షసుల గృహములను హనుమంతుడు వెదికెను 

విద్యుజిహ్వ, ద్విజిహ్వ, హస్తి ముఖి, గో ముఖి గృహములను 
కరాల, విశాల,సోనితాక్షులు ఇండ్లను వరుసక్రమంలో వెతికెను 
ఐస్వర్యముతొ తులతూగు గొప్ప గొప్ప భవణములను వెతికేను
లక్ష్మి సంపన్నుడైన హనుమంతుడు రావణ గృహమునకు వచ్చెను 

రాక్షకురాన్ద్రులాగా వికార నేత్రములు గల రాక్షస స్త్రీలను చూచెను 
స్త్రీలు శూలములను, బల్లెములను, మద్గరములను ధరించెను 
     ఎరుపు,తెలుపు, అనేక రంగులుగల జాతి గుర్రములను చూచెను       మంచివస్త్రములు, బంగారునగలతోఉన్నస్త్రీలను మారుతి చూసెను 

మంచి జాతికి చెందిన, చక్కగా, బలంగా, ఉన్న ఏనుగులను
శత్రువులను భంజిమ్చే గొప్ప యుద్ధ  ఏనుగులను
గజ శిక్షణ పొందిన రాజ భవనంలో ఉన్న ఏనుగులను 
ఐరావతము వంటి ఏనుగులను హనుమంతుడు చూసెను 

ప్రాతకాల సూర్యుని  వెలుగుతున్న శిబికలను చూసెను
వివిధాకారముగల పల్లకీలను, రధములను చూసెను
చిత్రములైనా లతాగ్రుహములను, చిత్రశాలను చూసెను
పగటిపూట ఉపయోగించే భవనమును హనుమంతుడు చూసెను

కాష్టమైన క్రీడా పర్వతములను, విశాలమైన మైదానములను  
రమనీయమైన కామగ్రుహములను, విలాస భావనములను చూసెను 
 నెమలి నృత్యములతోను, పక్షుల కూతలతోను ఉన్న గృహమును 
మందార చలమువలె సున్నితమైన దానిని హనుమంతుడు చూసెను 

పై కప్పు అనంత రత్నములు పాడగా బడి యుండెను 
పెక్కు నిధులు ఉండి రక్షక భటులు కాపలా కాయుచుండెను 
ధీరులు, పురుషులుచే ననుష్ఠింపబడు దేవాలయమును చూసెను 
హనుమంతుడు అది భూతపతి నివాస స్థానమని గ్రహించెను 

ఆ భవనమంతా మహా శివుని  తెజస్సుతోను
రావణ తపశక్తి  ప్రభావ  తెజస్సు తోను 
బంగారము, వజ్రాలు, రత్నాల తెజస్సుతోను
సూర్య తేజస్సుతో ఉన్న దేవాలయమును మారుతి చూసెను

మధు పత్రాలను, రక్త పాత్రలను, జంతు చర్మాలను 
మాంసము వండే పెద్ద పెద్ద పాత్రలతో ఉన్న గృహమును  
స్వర్ణముతో తయారు చేయ బడిన ఎత్తై న సింహాసనాలను
స్వర్ణ మాయమగు మంచములను హనుమంతుడు చూసెను

అందేలా యొక్క జుమ్కారముల తోడను 
మృదంగ తాళముల నిర్ఘోషముల తోడను
పెద్దగా మ్రోగు తూర్య ధ్వనుల తోడను
కుబేరుని భవనము వలే విశాల మైనదియును   

పెక్కు ప్రాసాదములతొ ఉన్నదియును
స్త్రీ రత్న శతములతో వ్యాప్త మైనదియును 
విశాలమగు అంత:పుర కక్షలతో ఉన్నదియును  
రావణుని మహా గృహమును హనుమంతుడు చూసెను 

సుందర కాండము నందు 6వ సర్గ సమాప్తము
  

1 comment: