ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ:శ్రీ రామ చంద్రపరబ్రహ్మనే నమ:
విశ్వకర్మచే నిర్మిమ్చబడిన అత్యుత్తమమైన మెరుపు విమానమును
ఆదిత్య మార్గ చిహ్నమువలె కనబడుచు ప్రసంసింమ్ప బడుచున్నదియును
అమితమైన సౌందర్యముగల ప్రతిమలతో శొభిమ్చుచూ ఉన్నదియును
పవననందనుడు మధ్యభాగమున ఉన్న విమానమును చూసెను
ప్రయత్నా పూర్వకముగా ఏదియు నిర్మించ బడనిదియును
బహుమూల్యమైన రత్నములు లేని భాగమనేది లేనిదియును
దేవవిమానమువలె విశేషమైన శక్తి కలదియును
అద్బుతమైన విమానమును పవన నందనుడు చూసెను
తపోనిష్టతే సంప్రాప్తమైనదియును
పరాక్రమముచే నార్జింప బడినదియును
మనస్సును బట్టి ప్రయాణము చేయునదియును
రచనా విశేషముల్తొ నిర్మించ బడినదియును
ఎక్కినా వాని మనస్సును బట్టి వేగముగా పోవు నదియును
శత్రువులకు కానరాకుండా అడ్డగించుటకు వీలు లేనిదియును
వాయువేగాముతో, సమాన వేగముగా, పోవునదియును
పుణ్యవంతులు, మహాత్ములు ప్రయాణము చేయుటకు వీలున్నదియును
విమానమును కుండలములతో శోభిల్లు చున్న వారును
అధికమైన ఆహారమును భుజించు వారును
గుండ్రని కండ్లుగల ఆకాశసంచారుము చేయగల రాక్షసులను
పై వారితో పాటు పిశాచములు నడుపు విమానము చూసెను
వసంత ఋతువులో వికసించే పుస్పములవలెను
మనోహరమైన శరత్కాల చంద్రునివలెను
వసంతము కంటే మనోహరమైన పుష్పక వినమును
విశిష్టరూపముగా ఉన్న విమానమును హనుమంతుడు చూసెను
సుందరకాండము నందు 8వ సర్గ సమాప్తము
No comments:
Post a Comment