Saturday, 7 March 2015

8. Pranjali - సుందరకాoడ - తెలుగు- వచస్సు ( 7 va sargamu )


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                                  శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:

 


నీళ మనుల తొ  పొదగ బడిన బంగారు కిటికీలను
పక్షి సమూహములు చేయు మదుర స్వరములను 
వర్షా కాలములో మేఘముల చే మెరిసేమెరుపులను
వేలుగుఉన్న భవనమును హనుమంతుడు చూసెను 

రాక్షసలు  స్వబలముతో నిర్మించిన గృహములను
బహువిధములైన రత్నములతో నిర్మించినవియును 
దేవతలు, అసురులు, పూజింప   దగినవి యును
ఎట్టి దోషములేని గృహములను మారుతి చూసెను

సాక్షాత్తు మయునిచే నిర్మించ బడినవియును
భూలోకంలో సకలగుణ శ్రేష్టము లైనవియును
ఉన్నతమైన మేఘములు వలే తెల్లనియును
బంగారు నగిషి  దిద్దిన భవనము ను చూసెను

 అక్కడ భూమి పర్వత పంక్తులతో ఉండెను
పర్వతములపై వృక్ష సముదాయముతో నిండియుండెను
వృక్షములపై పుష్ప సముదాయములతో నిండి యుండెను 
పుష్పములు, కింజుల్కములతో రేకులతో నిండి యుండెను

పద్మాకారములో శ్వేత భవనములు యుండెను 
పద్మములతో సరస్సులు నిండి యుండెను 
పద్మములపై కింజల్కములు నిండియుండెను
పువ్వులతో ఉన్నతమైన వనములుండెను 

 వెండి, పగడములతొ నిర్మింపబడిన విహంగములుండెను
రత్నములతో చిత్రమైన సర్పములు చెక్కబడి యుండెను
మంచి అవయవ సంస్థానముగల జాతిగుఱ్ఱములు ఉండెను
అనేక పగడములుగల విమానమును హనుమంతుడు చూసెను

 బంగారంతో చేయబడిన పుష్పములతో నొప్పు రెక్కలుండెను
లీలగా క్రిందకు వంపబడిన కుటిలమైన పక్షము లుండెను
సాక్షాత్తు కామదేవుని దివ్య సుందర రూపాలుండెను
     సుందరమైన ముక్కులుగల పక్షులు ప్రకాశించుచుండెను

పద్మాల సరస్సునందు ఒక పద్మముపై లక్ష్మీదేవి యుండెను
ఇరువైపులా గజములతోండములందు పద్మాల కాడలుండెను
లక్ష్మీదేవి సుందరమైన హస్తము లందు పద్మములు ఉండెను
బంగారముతో చెక్కబడిన లక్ష్మీదేవి చిత్రమును మారుతి చూసెను 

సర్వప్రశస్యముగా ఉన్న లంకాపట్టణమంతా తిరుగు చుండెను
   పతి, గుణ, ద్యానముచే, ఉన్న సీత మాత్రము కనబడ కుండెను
 భార్తతోడు లేక, స్తైర్యమును కోల్పోయిన జానకి కానరాకుండెను 
బహువిధములుగా నాలోచించి సీత కొరకు మారుతి వెతికెను 

నిశిత బుద్ధియును, ధర్మ మార్గ వర్తియును 
 సూక్ష్మ  దర్శనముగల మహాత్ముడును 
అప్రతిహతమైన దృష్టిగల హనుమంతుడు
సీత కన్పడక పోవుటవలన దు:ఖా క్రాంతుడయ్యేను 

 







No comments:

Post a Comment