Tuesday 3 February 2015

4. Pranjali - సుందరకాoడ - తెలుగు- వచస్సు ( 3rd sargamu )

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ:
                              శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
                                                                     

lankanu chuusi hanumantudu aaScharyamu chenduta 
lankaloniki povunappudu Sri ruupamuna lankini addu konuta 
hanumantunito lankini lankaadhipatini guurchi goppagaa chepputa 
hanumantuni prahaaramu che lankhini loniki anumatimchuta 

ప్రాంజలి       
సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:


పొడవైన  దీర్ఘముగా   ఉన్న  లంబ  పర్వతమును 
మేఘమువలె  దట్టముగాఉన్న మహాపట్టణమును
రావణునిచే పాలిమ్పబడుచున్న లంకపట్టణమును
స్వస్తముగాఉంdi మారుతి  రాత్రిపూట లంకలోకి ప్రవేసిమ్చెను
 
శరత్కాల  మేఘములవలే  తెల్లనిభవనములను 
సాగర ఘోశావలె గమ్బీర మగు పెద్ద  ధ్వనులను
సముద్రగాలులచే  సేవిమ్ప బడుచున్నదియును 
మదించినఎనుగులఘీమ్కారములను  లంకలోచూచెను 

సర్ప  మణుల కాంతి  వెలుగులతో లున్నదియును
మేఘములో  మెరుపు వెలుగులతో  ఉన్నదియును 
మందమారుతమునకు నక్షత్రాలకదలిక వేగులతోను 
పసిడి మంగళకరమైన భోగవతినగరం వలే ఉండెను 

చిరుగంటలు  మ్రోగు చున్న  పతాకముల  తోను 
పెనుగాలికి  స్వర్ణపురెక్కలు కదలికధ్వనుల తోను
అమరావతి నగరముతొ తులతూగు చున్నదియును 
హనుమంతుడు అమితానన్దముతొ  ప్రాకారపు గోడఎక్కెను

మనిఖచితములగు  భూగ్రుహములు  కలదియును
వజ్రములు, స్పటికములు, ముత్యములతోఉన్న ద్వారములను
పుపరిభాగము పుత్తడితో తయారుచెసినకలశములు కలదియును
ఆకామంత ఎత్తులోను మనోహరములైన గృహములను  చూచెను 

 క్రౌంచములు, నెమల్లు యోక్క  కూతలతొ  నొప్పు  చున్నదియును 
రాజహంసలు, అద్భుతమైన వింతపక్షుల సంచారములు గలిగియును
రకరకముల  వాద్య్యములు  ధ్వనులతో ప్రతిద్వనిమ్చు చున్నదియును 
ఆ  లంకానగారమును  చూసి  కపి శ్రేష్టుడు  చాలా  ఆనందిమ్చెను  
సకల సంమృద్ధియును సకలశుభములు కలదియును హనుమంతుడుచూచెను
ఆయుధము  చేతపట్టు  రాక్షస  వీరులచె  కాపలా  కాయుచున్నదియును 
మరియోకరిచే  బలపూర్వకముగా  లోబరుచుటకు  వీలు  కానిదియును 
గ్రహములయోక్క  వేలుగుచే  నష్టమైన  చీకట్లను ఉన్నలంకానగరము చూచెను 

కుముద  అంగదు నకును,    మహాకపి  సుషేను న కును
మైంద  -ద్విపదులకును , కుశపర్వుడను  వానరుడకును
కపిముఖుడైన  జాంబ వంతునకును , సుగ్రివునకును 
లంకలో  ప్రవెశమూన్న  జయము  సంసయమే  అగును

హనుమంతుడు  రామచంద్రుని  యొక్క  పరాక్రమమును 
లక్ష్మణుని   యొక్క,   వానరుల యోక్క  సౌర్యమును
గుర్తు తెచ్చుకొని  మనస్సులో    ప్రసన్నత  నొందేను
తరువాత  లంకలో  ప్రవేశించు  చుండగా  లంకానగరి  చూచెను  


వికృతముగా  ఉన్న   లంకా  నగరి  నిజ రూపములొ  ప్రత్యక్షమయ్యెను
హనుమంతుని తో  నిర్భయముగా  గట్టిగా వానరా  నీ వెవడవు  అనెను
ఎపనిపై  ఇక్కడ్కకు వచ్చితివి ? ప్రాణాములుండగానే నిజము చెప్పుమనేను
రావణుని రక్షణలో  ఉన్న  కోటలోనికి  ప్రవేశించుట నీకు   వీలు  లేదనెను 

హనుమంతుడు  లంక  తో  యదార్ధము  చెప్పెదను 
ఫురద్వారమువద్ద  ఉన్న  నీ  వేవతివిఅని  అడిగెను
పవన  నందనితొ పరుషముగా ఈ విధముగాపలికెను
నేను  రావణుని  ఆజ్ఞ  మేరకు  కాపలా  కాయుచున్నాను

ఎవరు  లోనికి   ప్రవేసించకుండా  కాపలాకాయు  చున్నాను 
నాలుగు  దిక్కులా  ఉన్న  నన్ను  ధిక్కరించిలోనికి వేల్లలేరనేను  
వానరా  నా  చేత  నిహితుడు  కాకముందు ఇక్కడనుండి పోమ్మ నెను 
లంక  మాటలకు  హనుమంతుడు  తన శరీరమును  పెంచెను

నాకు  లంకా  నగరములోని  భవణములను  చూడాలని  వచ్చాను
వనోపవనములను కాననములను , సెలఎర్లను  చూడాలని వచ్చాను
ఈవాక్యములకు లంక పరుషములగు పలు వాక్యములు   పలికెను
ఓవానరా  నన్నుజాఇంచ కుండా   నీవు  లోనికి  పోలేవనేను

ఓ ఉత్తమురాలా  నేనుఈ పట్టణమును చూసి వచ్చినట్లుగా  పోయెదను  
లంక  గొప్ప నాదముతొ కోపముతో  అరచేతితితో  కపిశ్రేష్టుని  చరచెను
హనుమంతుడు  లంకచే  తాడితుడై  గోప్ప   నాదముతో అరిచె ను 
హనుమంతుడు  వెర్రి  కోపము కలవాడై  ఒక్క   గ్రుద్దు  గుద్దెను 

ఆ  దెబ్బతో  లంక  వికృతముగా మోము పెట్టి భూమిపై పది  పోయెను 
అప్పుడు  హనుమంతుడు  స్త్ర్రి యని భావించి లంకపై జాలిచూపెను
హనుమంతినిలో  లంక  గర్వమడిగినది నన్ను   క్షమిమ్చ మనేను
ఓ  వానరా  బ్రహ్మ దేవుడునాకు వరమిచ్చినాడు ఒక వానరుడునిన్ను  జాయించుననెను

వానరుడుడు  నిన్నులొంగదీసిననాడు   రాక్షసులకు  భయము   వచ్చుననేను 
స్వయంభువుడు  చెప్పిన  సమయము  ఇప్పుడే  వ చ్చె నని అనుకోనుచున్నాను 
రావణునికి , రాక్షసులకు  సీతనిమిత్తము  వినాశనము  ఉండు  నని  అనెను
ఓ  హనుమ నీవు  రావణుని  చే  పాలింపబడుచున్న నగరమును  చూడమనెను

ఇడి నన్దికెశ్వర , బ్రహ్మ,  శాపములచె  ఉపహత మైన  నగరమని పలికెను
నీవుస్వేచ్చగావెల్లి పతివ్రతయగు సీత క్షేమవార్త రామునికి  తెలుపమ
నెను
నీవు  చేయ వలసిన  కార్యములన్ని  యదేస్చగా  చెయ్య మని అనెను  
హనుమంతునికి  లంక నమస్కరించి అంతర్ధానమై పోయెను

సుందర  కాండ  యందు  3వ  సర్గము  సమాప్తము  
                                           
                                                

                                           
                                                



1 comment: