Saturday, 7 February 2015

5. Pranjali - సుందరకాoడ - తెలుగు- వచస్సు ( 4va sargamu )

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ:
                              శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:ప్రాంజలి       
సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:

మహాతేజస్సంపన్నుడు  అగుహనుమంతుడు  అద్బుతమైన  లంకను చూచెను
కామ  రూపము గలది అగు స్వర్ణలంకా  పురిని  పరాక్రమముతో  జయించెను
కపిశ్రేష్టుడు  ద్వారముతో  నిమిత్తము  లేకుండా  లంకలోకి ప్రవేసిమ్చెను 
సుగ్రీవహితకారి, కపిశ్రేష్టుడు  లంకలోకి  ఎడమ  పాదముతో  ప్రవేసిమ్చును 


మితృవుల తలపై కుడి పాదముతొ,  శత్రువుల  తలపై  ఎడమ  పాదము  ఉంచెను 
లంకలో  పుష్పములు  వెదజల్లిన  మహామార్గంలో  ఆహ్వా నిస్తున్నట్లు  ఉండెను 
రమ్యమైన  లంకలోకి   అభిముఖముగా  హనుమంతుడు   బయలు  దేరేను
వాద్యమేశాల తోను, పెద్ద  నవ్వుల  నినాదములతొను, ధ్వనులతో  పెక్కటిల్లెను 

ముత్యములతో  ప్రకాశింప  బడుచున్న    రాజమార్గాము నుండి  నడుచు చుండెను
అక్కడ  గృహముల  యందు  వజ్ర  వైడూర్యము లతొ  చేసిన  కిటికీలు  ఉండెను 
అక్కడ  వజ్ర  అంకుశ  చిహ్నములతో  మేఘములవలె  ఉన్న  గృహములు  చూసెను  
పద్మాకారములో  ఆకాశంలో  తేలు తున్నట్లు  అద్భుతమైన  గృహములు  చూసెను

స్వస్తిక్  చిహ్నితములు  గల  తెల్లని  మేఘముల  వంటి  గృహములు  చూచెను 
మంగళ ప్రదమైన  నగర  శోభను  పెంచే  వర్ధమాన  గృహములు  చూచెను 
రామ  దూత  అగు  హనుమంతుడు  రక్షణ  గణ  గృహములు  చూచెను 
చిత్ర  విచిత్రమైన  పుష్పములతోను  ఆభరణములతో  వున్న లంకను  చూచెను    

హనుమంతుడు నడుస్తున్న కొద్ది విచిత్ర రంగుల్లో ఉన్నభవనాల్ని   చూసేను 
 స్త్రీలు మధుర గానముతో అప్సర స్త్రీలవలె నాట్యము చేస్తూ మధురముగా పాడుచుండెను
మంద్ర మాద్యమ తారస్వరములను  స్వర భేదములతో ఒప్పారు చుండెను 
ఇల్లు ఇల్లు తిరిగి లంకను చూసి హనుమంతుడు ఆశ్చర్య పడెను 

కామ పీడుతులను, సుందరమైన స్త్రీల వడ్డాణముల ధ్వనులను
స్త్రీలు మెడమెట్లు ఎక్కునప్పుడు, దిగునప్పుడు కాలియందెల ధ్వనులును
కుస్తీలు పట్టేవారు మొదట తొడలు చరచునప్పుడు వాచ్చె శబ్ధములను
ఇంకా రాక్షస వీరుల పలుకు సింహనాదము వాలే నుండెను

హనుమంతుడు రాక్షస గృహము లందును వేదమంత్రములు వినెను 
కొందరు జపమాల  త్రిప్పుచూ మంత్రమును వల్లించు చుండెను 
రావణ స్తవము చేయు రాక్షసులను, గర్జించు వారిని చూచెను 
రాజమార్గామునందు సైనికుల సమూహమును మారుతి చూచెను

మద్య గుల్మములందు గుప్త చారులుండెను
దీక్షాధారులుగా, కొందరు జటా దారులుగా ఉండెను
కొందరు గోవు  చర్మమును, మరికొందరు పులి చర్మమును ధరించెను 
ముండి సిరస్సుతో అగ్ని కుండములందు హవనము చేయు చుండెను  

కొందరు ఎకాక్షులను, బహువర్ణములు గల వారును
కొందరు ఏక స్తణము కలిగి భయంకరముగా ఉండెను
వంకర  ముఖములు కలిగిన   వికట కారు  లుండెను
మరుగుజ్జు వారు,  అతి పొడవైన వారుకూడా ఉండెను

కొందరు పట్టేశములను, కొందరు వజ్రాయుధములను 
కొందరు ఓడ నడిపే తె డ్డులను, కొందరు పాశములను 
కొందరు శక్తి వృక్షములే ఆయుధములుగా కలవారును 
 మంచి అందముతో, తెజముగా ఉన్న వారు కూడా ఉండెను 

నూరువెల అంత:పు రక్షకులు కలదియును
పర్వతము పైభాగమున పద్మవలె కట్టబడినదియును
బంగారముతో చేయబడిన ద్వారములు కలదియును 
రాక్షాసాధిపతి గృహమును హనుమంతుడు చూసెను 

పుత్తడి ప్రాకారాలుగాను, స్వర్గములా ఉన్నదియును
దివ్యనాద నినాదములతో, సర్వలక్షనములు కలిగియున్నదియును 
 మహా వీర్య సంపన్నులచే రక్షింప బడు చున్నదియును 
పాదము మోపగా పరవశిమ్పచేయు లంకేశ్వరుని భవనమును చూచెను  
గుర్రపు శాలలో గుర్రపు సకిలిమ్పులు లను 
నాలుగు దంతములు గల ఏనుగుల నినాదములతొను 
సింహ, వ్యాఘ్ర , భయానకమైన అరుపులతోను 
మృగ పక్షుల కిల కిల రావములతొ ఉన్న ప్రదేశమును చూసెను 

సువర్ణము, జంబు నాదముతో నిర్మించిన ప్రాకారమును 
ముత్యములు, వైడూర్యములు పొదగబడిన ఉపరితలమును 
ఉత్తముములైన అగురు చందనములచే పూజితమును
అగు రావణామ్త:పురమును హనుమంతుడు చూసెను  

ఆదికవి రచించిన సుందర కాండము ( వచస్సు) 4వ సర్గము సమాప్తము


                                                                         
నది
కాలుష్య వరదలో చిక్కి
కొండ చేరియలకు చిక్కి
జలచరాలకు ఆహారముగా చిక్కి
నావల బరువులతొ అనగ  దొక్కి
సూర్య వెలుగులో ఆవిరికి చిక్కి
గాలికి తుంపరులుగా గాలిలోకి చెక్కి
స్నానాలతో బయటదాక పాదాలకు చిక్కి
ప్రతి ఒక్కరికి ఆకలికి మంచినీరుగా దక్కి
పంటలకు అహారముగా చిక్కి , మానవులకు దక్కి
అక్క చెల్లెల్లతొ కలసి కొండలు మిట్టలు ఎక్కి
ఉరకలు వెస్తూ సముద్రములో కలుస్తూ చూడదు వెనక్కి