Sunday 13 September 2015

ప్రాంజలిప్రభ - సుందర కాండ తెలుగు వచస్సు (53వ సర్గ)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ 
శ్రీ మాత్రే నమ:
శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ: 

53వ సర్గ (వాల్మికి రామాయణములోని 44 శ్లోకాల  తెలుగు వచస్సు)
("రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పు అంటించి 
నగరమంతా త్రిప్పుట)   

సోదరుని మాటలు ఓర్పు తో ఆలకించేను 
దేశకాలహితమగు ఈ సమాధానమును పలికెను 
నీవు చెప్పినది నిజమే దూత వధ నిందితమగును 
మరియొక విధమైన దండమును విధించవలెను 


వానరులకు తోక చాల ఇష్టమైన అలంకారారము దానికి నిప్పు అంటించ వలెను
దగ్ధమైన తోకతో భాదతో యితడు వెనుకకు వెళ్ళ గలుగును
అపుడు అంగ వికారము చేత కృశుడై  ధీనుడై యితడు వెనక్కు  పోవును 
మిత్రులు,జ్ఞాతులు,మిత్రులతో కూదిన భంధువులు

 యందును చూడ గలుగును 


మండుచున్న తోకతో హనుమంతుని పురములోని చతుష్పాదాల
 యందును 
అన్ని వీధులలో  త్రిప్పుదురు గాక అని రావణుడు రక్షకులకు ఆజ్ఞాపించెను 
కోపముతో ఉన్న అ ఆ రాక్షసులు నారచీరలు, ఎండు కట్టెలు, తైలమును తెచ్చెను 
వారు హనుమంతుని తోకకు ఎండుకట్టెలు పేటి నూనె పోసి గుడ్డతోచుట్టి నిప్పు వెలిగించెను


మండుచున్న తైలపు తోకతో హనుమంతునకు పట్టరాని కోపము వచ్చెను 
బాల సూర్యునివలె ఆ రాక్షసులందర్నీ  క్రిందకు పడవేసి చితక బాదెను
అ రాక్షసులందరూ గట్టిగా పట్టి , త్రాళ్ళతో చేతులు కదలకుండా కట్టివేసెను 
రాక్షసులు హింసించుతూ, కోరడాలుతో కొట్టుచూ నదివీధులలొ త్రిప్ప సాగెను 


స్త్రీలు బాలురు వృద్ధులు అందరు హనుమంతున్నీ చూస్తూ  పరిగెడుతూ ఉండెను 
హనుమంతుడు భద్ధుడై అసహయయమునకు తగినట్లుగా అలోచిమ్చెను
ఈ రాక్షసులు నన్నేమి చేయలేరు, భంధములు తెంచుకొని నేను వీరిని చంపగలను 
రామకార్యముకోరకు నేను వచ్చాను, లంకాధిపతి ఆజ్ఞ ప్రకారముగా వారు చేయుచుండెను 


హనుమంతుడు మనసులో రాత్రియందు లంకను సరిగా చూడ లేదు ఇప్పుడు చూచెదను 
అందు వలన ఈ భందములను సహించి వారు పెట్టె హింసను భరించెదను
అద్బుతమైన దుర్గ నిర్మాణము, కళా కాంతులతో వెలుగుచున్న భవణాలను చూచెదను
అందుచే రాక్షసులను చంపక బుద్ధిమంతుడుగా వారి వెంటే నడవసాగెను 


మారుతి మనసులో అను కొనెను నా తోకకునిప్పు పెట్టినను, భందిన్చినను
మారుతి తనకు చేసిన అవమానమును చూసి భయపడకుండా 
ధైర్యముగా ఉండెను  
మనస్సులో ఏమాత్రము అధైర్యపడకుండా ధైర్యముగా రాక్షసులవెంగా నడవసాగెను 
రాక్షసులు దండోరా వేస్తు హనుమంతుని చేసిన పనులన్నీ తెలియ పరుస్తుండెను 

రాక్షసులు శంఖములను ఊదెను, భేరీలు మ్రోగించెను
హనుమంతుడు చేసిన అపరాదములను ఘోషించెను 
క్రూర రాక్షసులు కొట్టుతూ లంకా నగరమంతా తిప్ప సాగెను 
హనుమంతుడు వారివేంట సంతోషముగా తిరిగ సాగెను 


హనుమంతుడు అక్కడ విచిత్రమైన విమానములను
రహస్య గృహములను, బాగుగా తీర్చిదిద్దిన చతుష్పాదములను
పెద్ద చిన్న మార్గములను, మేఘం లాంటి గృహములను
నాలుగుస్తంభాల మండపమును, రాజ మార్గమును చూసెను 


హనుమంతుని చూడాలని కుతూహలముతొ రాక్షసులు బయటకు వచ్చెను 
 ఆయా ప్రదేశము లందు బాలురు, స్త్రీలు, వృద్ధులు వింతగా చూచు చుండెను 
హనుమంతునితో వచ్చిన రాక్షసులు ఇతనొక ఘూడ చారిఅని చెప్పు చుండెను 
కొందరు స్త్రీలు సీత వద్దకు పోయి హనుమంతుని తోకకు నిప్పు పెటినట్లు తెలిపెను 


రాక్షసవనితల మాటలు విని సీత సోకసంతాపము చెందెను
అగ్నిహోత్రున్ని మానసికముగా సీత ప్రార్ధించెను 
 హనుమంతున్ని అగ్నిహోత్రుడు ఎమీ చెయ్యకూడదని అర్ధిమ్చెను
హనుమంతునకు మంగళమును ఆశించే వేడుకొనెను 


అగ్నిదేవా నేను పతిసేవ చేసిన దానినైతేను
నేను చేసిన తపస్సు వ్యర్ధముకాకుండా ఉన్నదానినైతేను 
నేను పాతివ్రత్యముతో జీవించి ఉన్న దాని నైతేను
హనుమంతుని విషయములో చల్లగా ఉండవలెను


అగ్ని దేవా రామునకు నాపై కొంచమైన దయ ఉన్నట్లైనను
చరిత్రవంతురాలును, భార్తసమాగమ లాలసరాలను అగు నా విషయములను
ధర్మాతుడైన నా పతి  శ్రీరామ చంద్రుడు నన్ను కలుకోనవలేనని కోరిక ఉన్నను    
నాభాగ్యము ఏమైనా శే షించి ఉన్న నీవు హనుమంతుని చల్లగా ఉంచవలెను 


సత్య ప్రతిజ్ముడు అగు సుగ్రీవుడు నా విషయమున ధర్మమును తప్పకుండా ఉన్నను
నీవు హనుమంతుని తోక వెంట ఉన్న  జ్వాలలను  శీతలముగా మార్చవలెను   
సీత యొక్క ప్రార్ధనలు విని అగ్నిహోత్రుడు హనుమంతుని వాలము చల్లగా మారెను 
హనుమంతునకుజ్వాలలు ఎక్కువగా ఉన్నను అతి చల్లగా ఉన్నట్లు తెలుసుకొనెను 


వాయు దేవుడు  దేవి మనసు కుదుట పడే విధముగా గాలి చాల్లగా వీచెను 
అగ్నిదేవుడు హనుమంతునకు తపన అనేది లేకుండగా మంచు వలే చల్లగా మార్చెను 
హనుమంతునాకు  అగ్నిజ్వాలలు ఎగసి పడుతున్న ఎటువంటి భాదలేకుండెను 
 మైనాకుడు సహాయపడినట్లు అగ్నిదేవుడు కూడ సహయపడి ఉండవచ్చు ననుకొనెను  


సీతయొక్క కరుణ చేతను 
రామునియోక్క పరాక్రమమువలనను
నా తండ్రితోగల సఖ్యత వలనను
నన్ను పావకుడు దహించి ఉండకపోవచ్చును 


హనుమంతుడు ఒక్క క్షణం ఆలోచించి పైకెగిరి పెద్దగా గర్జించెను 
బుద్దిమంతుడైన హనుమంతుడు తనశరీరమును చిన్నదిగా చేసి భందములు తొలగించెను
మరల నగరద్వారమువద్ద కు చేరి తనశరీరమును పెద్దగా చేసి ఆలోచించెను 
ఇప్పుడు నేను ఈ రాక్షసులను చంపి రావణాసురణకు భయము కల్పించవలెను 


మారుతి జ్వాలలతో మండుచున్న తోక కిరణములతో శోభిల్లుసూర్యుని వలెఉండెను
ఇనుముతోబిగించేసిన పరిఘను తీసుకొని రాక్షసులనందరిని చంపి వేసెను 
 తనమనోరధము సఫలమైనట్లుగా  భావించెను, లంకా దహనము  చేయాలని తలంచెను  
అద్బుతమైన నగరమును అగ్నికి ఆహుతి చేసి రాక్షసులలో భయము పుట్టించవలే ననుకొనెను

సుందర కాండ 53వ సర్గ సమాప్తము


  
 

No comments:

Post a Comment