Wednesday 16 September 2015

ప్రాంజలిప్రభ - సుందర కాండ తెలుగు వచస్సు (54వ సర్గ)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ 
శ్రీ మాత్రే నమ:
శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ: 

54వ సర్గ (వాల్మికి రామాయణములోని 50 శ్లోకాల  తెలుగు వచస్సు)
("లంకాదహనము - రాక్షసుల విలాపములు )   

హనుమంతుడు ఉత్చాహముగలవాడై కార్యశేషము గూర్చి ఆలోచించెను
నేను ఏమి చేసినా రాక్షసులు సంతాపము కలిగే విధముగా ఉండవలెను 
హనుమంతుడు తను లంకలో చూసిన విషయములన్ని గుర్తు కు తెచ్చుకొనెను 
తక్షణమే తనవద్ద వున్న రాక్షసులనుచంపి లంకను అగ్నికి ఆహుతి చేయాలనుకొనెను




రావణుని ప్రమదా వనము నంతా పాడు చేసినాను 
ఉత్తములైన అనేకమంది రాక్షసులను చంపినాను
సైన్యములో ఒక భాగము నశింప చేసినాను 
ఇక దుర్గ ధ్వంసము చేసి తిరిగి వెళ్ళవలెను 


దుర్గము నాశనము చేసిన నేను మొదలు పెట్టిన ఈ కర్మము సార్ధక మగును 
లాగూలాగ్నితొ అగ్ని దేవునకు లంకా భవణములను సంతర్పనము చేసెదను
ఈ లంకలో ఉన్న ఉత్తము గృహములకు అగ్నినిముట్టించుట న్యాయమే అగును
ఇట్లుచేసిన నేను చేసిన శ్రమ, కార్యము సఫలము కా కలుగును అని మారుతి తలంచెను 


మహాకపి విద్యుసహిత మేఘమువలే మారెను 

లంకలో ఉపరితలముపై సంచరించ సాగెను 
ఒకగ్రుహమునుండి మరో గృహమునకు దూకు చుండెను
ఉద్యానవనములకు రాజభవనములకు నిప్పు పెట్టెను


ప్రహస్తుని భవణమునకును, తెజస్వీ భవణమునకును
వీర్య వంతుడైన మహాపార్స ని ఇంటికిని కాలాగ్నిజ్వాలలను
 సమానముగా వదలి అక్కడ ఉన్న భవణములన్నింటికి నిప్పును 
అంటించి గంతులు వేస్తూ ముందుకు సాగు తుండెను




వజ్రద్రంష్ట్ర, శుక, సారణ, ఇంద్రజిత్, జమ్బుమాలి, భవనాలకును 
సుమాలి, రశ్మికేతు, సూర్యకేతు, హ్రస్వకర్ణ, దంష్ట్ర, ఇండ్లకును 
ఘోర, హస్తిముఖ, కరాల, సోనితాక్ష, నికుంభ, కుంభకర్ణ ఇల్లకును 
యుద్దొంమట్ట,ద్ద్వాజగ్ర్రివ, విద్యుత్ జిహ్న, రొమశ, నిప్పు పెట్టెను 




మహాతేజస్వి  యగు హరిపున్గవుడు విభీషణ గృహమును 
విడిచిపెట్టే, మరాక్ష, నరాంతక, మకరాక్ష, కరాక్ష  ఇండ్లకును 
యజ్ఞ శత్రువు, బ్రహ్మ శత్రువు, మహర్షులైన గృహములకును 
ధనవంతుల ఇండ్లకు చివరకు రావణ భవణమునకు నిప్పు పెట్టెను 



నానారత్న విభూషితమును, మేరు మందర సన్నిభమును 
నానా యుక్తమగు, సర్వ సంపన్నోతమైన భవణములోను
లాగూలాగ్ని మేఘముకన్న పెద్దగాను భవనములో విస్తరించెను 
హనుమంతుడు ప్రళయకాలమందలి కడలి ఘోషవలె ఘర్జిమ్చెను


భవణములకు పెట్టిన అగ్నికి తోడూ గాలి కుడా సహకరిమ్చెను 
బంగారుకిటికీలు, గవాక్షాలు, మణి రత్నపు గోడలు మండుచుండెను  
వజ్ఞ వైడూర్యాలతొ నిర్మించిన అద్భుత కట్టడములు అన్నియును 
పెద్ద పెద్ద విమాన గృహములన్నియును బ్రద్దలై పడి పోవు చుండెను 


రాక్షసులందరూ తమగృహములను రక్షిమ్చుకొనుటకు పరుగెత్తు చుండెను 
కొందరు ఉస్చాహము అంతా పోయి సంపదలు కోల్పోయి ఏడ్వ సాగెను 
అయ్యో అగ్నిదేవుడే ఈ వానరుని రూపములో వచ్చి  దహించు చుండెను
పెద్దగా అరుస్తూ పిల్లలను పట్టుకొని భవణములనుండి దూకు చుండెను


కొందరు కేశములకు, వస్త్రములకు నిప్పు అట్టుకొని పరుగెడు చుండెను 
చంటి బిడ్డలను చంకన పెట్టుకొని, భర్తలను లాగుకుంటూ పరుగేట్టేను 
నిప్పు అంటుకొని భవణముల నుండి దూకునప్పుడు మేఘమేరుపు  లాగుండెను 
వజ్ర,విద్రుమ,వైదూర్య,ముక్త రజతముల ధాతువులు ఆకాశమున ఆవరించి ఉండెను


అగ్నిశిఖలు కొన్ని చోట్ల కుంకుమ పువ్వుల వలెను
మరికొన్ని చోట్ల బూరుగ పువ్వుల వలెను 
అన్నిచోట్ల నల్లని పొగ పువ్వుల వలెను 
వేరువేరు రంగులతో ఆకాశమంతా వ్యాపించెను


అగ్నిజ్వాలలు మండలాలుగా వ్యాపించి తీవ్రముగా ప్రజ్వలిమ్చెను 
అక్కడ రగలుతున్న ఆగ్నికి గాలి తోడై ప్రళయాగ్నిగా మరుచుండెను
పెద్ద పెద్ద మంటలతో రాక్షసుల శరీరములే అజ్యము లాయెను
కోటి సూర్యల వెలుగులతో అగ్ని లంకను దహించి వేసెను 


అగ్ని తీవ్రమైన కాంతి కలిగి మొదుగపూలవలె ఎర్రగా ఉండెను
కొన్ని చోట్ల ఆరిపోయిన అగ్ని నల్లకలువలబోలిన కుష్మలు వాలే ఉండెను 
రుద్రుడు త్రిపురను కాల్చినట్లుగా ఇప్పుడు ఇక్కడ తగల బడుచుండెను
వీరులందరు  చెదిరిపోయి  సాపోపహతమైనట్లు సర్వముకోల్పోయామని భాదపడెను 


రాక్షసులు యితడు వానరుడుకాదని వజ్రాయుధమును ధరించిన వాడును 
ఆగు దేవతలా ప్రభువగా మహేంద్రుడు ఆయి ఉండ వచ్చును 
లేదా కుబేరుడు గాని , సాక్షాత్తు య్యముడు గాని రుద్రుడై యగును 
లేదా సూర్యుడు కాని, చంద్రుడుకాని, కాలపురుషుడే అయి  ఉండవచ్చును



సకల లోకాలకు పితామహుడు సకల జగత్తులను 
పోషిమ్చేవాడు నాలుగుముఖాలు గల బ్రహ్మదేవుడే యగును
రాక్షస సంహారము చేయుటకు వారనరూపమున వచ్చియుండ వచ్చును 
లేదా విష్ణు తేజస్సు వానరునిలో ప్రవేసించి రాక్షుసులను సంహరిమ్చి వచ్చును  


అనంత మంతా వ్యాపించి ఉన్నదియును  
ఇంద్రియములను గోచరిమ్చనిదియును
ఎవ్వరూ ఊహించుటకు శక్యము కానిదియును
ఏదో అద్బుత శక్తి రాక్షసులను సంహరించెను


ప్రాణిసంఘములను, వృక్షములను, గృహములను  
సమస్తము కాలిపోవుట చూచిన రాక్షులు భయపడెను 
ధైన్యముతోనూ, వ్యాకులత తోనూ రాక్షసులు గుమ్పులుగాను 
చేరి హనుమంతునుని గురించి పలు విధములుగా పలుకుచుండెను  


అయ్యో తండ్రి, అయ్యో కుమరా, అయ్యో ప్రియుడా అని ఏడ్చు చుండెను
  అయ్యో మిత్రుడా అయ్యో సకల భోగములు నాశన మయ్యననెను
ఒకరు చేసిన తప్పుకు అందరిని భాదితులుగా చేయుట ఎందుకును
ఓపుణ్యజీవనమా అని విలపించుచూ  రాక్షసులు ఘోరముగా ధ్వని చేసెను  


హనుమంతుని క్రోధపరిచే భూతమగు అగ్నిజ్వాల సమావృ తమైన దియును  
వీరులందరూ చెల్లా చెదరుకగా లంక అంతా సాపోపహతమైనట్లుగా మారెను  
బ్రహ్మ యొక్క రొషముచే ఉపహతమైన భూమి వలే నున్నట్లుగా  నుండెను 
భయముతో విషాదముతొ ఉన్న రక్షసులను చూసి సంతోషమునకు లోనాయ్యేను 

హనుమంతుడు పశస్తమైన ప్రమదావనమును భగ్నము చేసెను
గోప్ప్ గొప్ప రాక్షసులను యుద్ధము నందు సంహరించెను
ఉత్తమ గ్రుహములను అగ్నికి ఆహుతి  ఇచ్చి శాంతి పొందెను
లంకదహనమైనట్లు గ్రహించి రాముని మనస్సులో స్మరించెను



మారుతి మహావేగా సంపన్నుడును, మహా బలవంతుడును 
వానర వీర ముఖ్యుడును, నవ వ్యాకరణ పండితుడును 
ముఖ్యముగా రాముని బంటుయును, రాముని దూతయును
అని వాయుపుత్రున్ని దేవ సంఘములు ప్రశంసించెను


దేవతలు ఘంధర్వులు సిద్దులు ఋషులు ఆశ్చర్యము చెందెను 
కాలాగ్ని రగిలించి రాక్షసులకు భయము కలిగించినట్లు గ్రహించెను
నాగులు సమస్తమైన గొప్ప ప్రాణులు గొప్ప సంతోషము పొందెను
వానర శ్రేష్టుడైన హనుమంతుని సకల భూతములు ప్రశం సిమ్చెను  


హనుమంతుడు జ్వాల పరివృతుతడై రాక్షసులందరికి భయము 
పుట్టించెను
హనుమంతుడు లంకనంతా ధహనము చేసి కోపమును తగ్గించు కొనెను 
లంకఅంతా దగ్దమైనట్లు గ్రహించి వాలమును సముద్రములో ముంచి చాల్లర్చుకొనెను


సుందర కాండ నందు 54వ సర్గ సమాప్తము  

No comments:

Post a Comment