Wednesday 2 September 2015

ప్రాంజలిప్రభ - సుందర కాండ తెలుగు వచస్సు (52వ సర్గ)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ 
శ్రీ మాత్రే నమ:
శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ: 

http://vocaroo.com/i/s1igR0Q24Zuihttp://vocaroo.com/i/s1igR0Q24Zui
 52వ సర్గ (వాల్మికి రామాయణములోని 26శ్లోకాల  తెలుగు వచస్సు)
("దూతను వధించుట తగదని భొధించుచూ విభీషనుడు  మరొక
 దండన యేదైన ఇవ్వమని రావణుని కోరుట, రావణుడు అందుకు అంగీకరించుట ) 

 రావణుడు మహాత్ముడైన ఆ వానరుని వచనమును 
 విని క్రోధముచే  వడ లెరుంగక వధకు ఆజ్ఞాపించెను 
రావణుడు విధించిన వధకు విభీషణుడు అడ్డు పడెను 
    ఉదాత్తు డైన విభీషనుడు దౌత్యమును తెలుసుకొనెను  


రావణుడు కోపించ్నట్లు విభీషనుడు గ్రహించి కర్తవ్యమును గూర్చి భోధించెను   
సంభాషణా కుశలుడగు విభీషనుడు పూజ్యుడైన అగ్రజునతో వివరించ దలిచెను 
వినమ్రతతో హితకరమైన వచనములను వివరించుటకు ధైర్యముతో ముందుకు వచ్చెను
  శతృ విజేత, రాక్షస ప్రదాత, అమోఘ బల సంపన్న రాక్షసాదినేత నేను చెప్పేవి ఆలకించవలెను


ఓ రాక్షస రాజ క్షమింపుడు, త్వజింపుడు క్రోదమును 
ప్రసన్నుడు కండు నా పలుకులను ఆలకించ వలెను
సాధువులు పంపిన దూతను వధించుట ధర్మము ఎట్లగును 
లోకాచారమునకు విరుద్ధముగా వానరుని ఎలా వధించ వలెను
   

ఉత్తమాధములు నెరిగిన నీ వంటి వారికి ఇది ఎలా అగును 
ధర్మజ్నుడవును, భూతముల పరివారమును నెరిగిన వాడవును
నీ వంటి వివేకులు రోషమునకు లోనైనచో పాండిత్యము మేమగును 
శాస్త్ర పాండిత్యము కేవలము పరిశ్రమగా మిగులుట మంచి కాదును 


కావున శత్రు దమనుడవును, దుర్జయుడవును
 అగు ఓ రాక్షస రాజా ప్రసన్నత  చెంద వలెను
ముందు ఉచితా నుచిములను ఆలోచిన్చవలెను
ఈ దూతకు తగిన దండములను విధించవలెను


విభీషణ మాటలకూ రావణునకు మరీ కోపము పెరిగెను
గమ్భీరముగ విభీషణునితో పెద్దగా ఇట్లు పలికెను
ఓ శత్రుసూదనా పాపాత్ములను వధించుటలో పాపమెట్లా అగును
పాపము ఏంతోచేసెను అందువలన నేను ఇతనికి వధను అజ్ఞాపించాను 


భుద్ధిమంతుడైన విభీషణుడు రావణునితో తొట్రుపాటు లేకుండా ఇట్లు పలికెను 
నీవు ముందు కోపమును తగ్గించు కోనుము, కోపము అధర్మమునకు దారితీయును
నీవు ధర్మాత్ముడవు, దుష్టుడుగా మారుటకు, కోపమే మూల కారణమే అగును
  నీకు తెలియంది కాదు, ఉత్తమ మైన కార్య నిర్ణయములకు ఓర్పు వహించ వలయును 


లంకాధిపతియైన ఓ రాక్షస రాజా అనుగ్రహింప వలెను
ధర్మార్ధముతో కూడిన మా మాటలను వినవలెను 
రాజా ఎ కాలమునందు, ఎ దేశమునందు, కూడా దూతలను 
చంప కూడదని సత్పురుషుల మాటలను గుర్తు తెచ్చుకొనవలెను 


నిజమే ఈ వానరుడు మితి మీరి ప్రవర్తించెను 
నిజమే ఇతడు లెక్క లేనంత అప్రియము చేసెను
ఏమైనా తమ కార్యమును నిర్వహించు కొనుటకును 
ఆత్మరక్షనకు చేసెను, దూతకు వేరే దండనను విధించ వలెను


శరీరమునకు వికారము కలిగించుటను
కొరడాలతో కొట్టుటను, తలను గొరిగించుటను
ఏమైనా గుర్తులను దేహము పై వేయుటను
ఇవి దూతకు విధించ వలసిన దండములనేను  


సకలధర్మాలను తెలిసిన వాడవును 
మంచి చెడుల విషయమున జ్ఞానము కలవాడవును
కోపాన్నినిగ్రహించుకొని నిజాన్ని తెలుసు కొనగల వాడవును 
మంచి భుద్ధి ఉన్న నీలాంటి వానికి అసలుకోపము ఎట్లా వచ్చును 


ఓ వీరుడా ధర్మాన్ని గురిచి నీతో వాదించే వారు లేరును 
లోక వ్యవ హారము లందును, పాండిత్యము నందును
శాస్త్రము నందును, తపస్సు నందును వాదించే వారు లేరును 
నీవు సురాసురులలో కళ్ళ ఉత్తమమైన లంకాధీసుడవును


ఓ రాజ నీవు దుర్జయుడవు, అమేయ బల సంపన్నుడవును
నీవు యుద్దములో దేవతలనే పరాజితులను చేసిన ఘనుడవును
రాక్షసులకు విరోధి అయిన వీరుడై ఇంద్రున్నే ఓడించిన వాడవును
పరాజయము అనేది లేనివాడవు అగు నీవు దూతను చంపమని ఎలా అనగలిగెను   


నిన్ను మనస్సులో కూడా ఎదిరించగల సమర్ధుడు ఈ లోకంలో లేడును
 వానరుని చంపుట వలన నీకు ఏమి ప్రయోజనము కలుగును 
వానరుని పంపిన వారిపై మరణ దండన విధించ వలెను
యితడు మంచి వాడైన, చెడ్డవాడైనా ఇతరుల పంపగా వచ్చెను 


పరుల పక్షాన మాట్లాడు దూతను వధింప కూడదును 
ఇతనిని వధించినచో కడలి దాటి వచ్చే వారు లేకుండును 
ఆకాశమున ఎగిరి వచ్చేవారు వేరొకరు లేకుండును 
శత్రువులను జయించువాడా వధను ఉప సంహరించవలెను


ఓ యుద్ద ప్రియ ఇతనిని వధించినచో రాజకుమారులకు సమాచారము ఎవరు అందించును 
దేవతల విషయమున రాజకుమారుల విషయన నీ బలమును, శక్తిని చూపవలెను 
 అందువల్ల రాజకుమారులతో యుద్దమును ప్రేరేపించువారు వేరొకరు లేకుండును
రాక్షసులను ఆనందపరిచేవాడా, నీవె రాజ కుమారులతో యుద్దము చేయవచ్చును 

నీదగ్గర బాగుగా పోషిమ్పబడుచు నీహితము కోరేవారుండెను
శూరులు,శస్త్రదారులు, శ్రేష్ఠులు కోటికి మించే యున్నారును
 ఏమరపాటు లేనివారు, ఆత్మాభిమానము కలవారు నిన్ను ఆశ్ర యించి  ఉండెను
అందుచే కొంత సైన్యముతో రాజకుమారులను జయించ గలవడవును


నీ ప్రభావ మంతా శత్రువులైన రాజకుమారులపై చూపవలెను 
ఓ మహాబలశాలి,రాజులలో శ్రేష్టుడా, నీవె యుద్దమునకు వెల్లుట మంచిదే యగును
రావణుడు విభీషనుని యొక్క ఉత్తమ మైన వాక్యములను మనసుతో వినెను
రావణుడు ఆలోచించి, బుద్దితో గ్రహించి వానరునిపై ఉన్న వధను తొలగించెను 

శ్రీ సుందర కాండ 44వ సర్గ సమాప్తము  

                                                                          

No comments:

Post a Comment