Sunday 30 August 2015

ప్రాంజలిప్రభ - సుందర కాండ తెలుగు వచస్సు (51 వ సర్గ)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ 
శ్రీ మాత్రే నమ:
శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ: 


 51వ సర్గ (వాల్మికి రామాయణములోని 45శ్లోకాల  తెలుగు వచస్సు)
("హనుమంతుడు రాముని ప్రభావమును వర్ణించి చెప్పుచూ రావణునికి నీతిని ఉపదేశించెను ) 


మహాబలవంతుడగు హనుమంతుడు రావణుని చూసి ధైర్యముగా ఉండెను 
రావణునితో ఎట్టి తొట్రుపాటు లేకుండా అర్ధవంతములగు మాటలు పలికెను
ఓ రాక్షసేంద్ర నెను నీ వద్దకు సుగ్రీవుని సందేశమును తీసుకొనివచ్చాను
నీసొదరుడు వానరరాజు సుగ్రీవుడు నిన్ను కుశలమడిగి నట్లు చెప్పమనెను


మహాత్ముడగు సుగ్రీవుడు చెప్పిన మాటలను చెప్పుచున్నాను
ఈ వాక్యములు ధర్మ అర్ధ యుక్తమైనవియును 
ఇహపరలోక యోగ్యమును కలిగించునవియును 
సందేశమును ఉన్నది ఉన్నట్లుగా లేలుపుతున్నాను 


రధములు, గుర్రములు, ఏనుగులు, కలవాడును 
లోకమునకు, తనరాజ్యమునకు తండ్రిలాంటి వాడును
లోకభండుడైన దేవేంద్రునితో సమానమైన వాడును 
దశరధ మహారాజు తేజోవంతముగా వెలుగు చుండెను 


అతనికి మహాభాహువును ప్రభావ యుక్తుడును
మిక్కిలిప్రియమైన జ్యేష్టపుత్రుడును రామచంద్రుడును
అతడు తండ్రి ఆజ్ఞచేత దండకావనమునకు పవేశించెను
భార్య అగు సీత, సోదరుడైన లక్ష్మణుతో వనమునకు వచ్చియుండెను


విదేహ దేశధి పతియైన జనక మహారాజు పుత్రికయును 
భర్తను అనుసరించి అరణ్యమునకు వచ్చిన సీతను 
ఎవ్వరూలేని సమయాన మాయ చేసి తీసుకొని వెళ్ళెను
రామలక్ష్మణులు సీతను వెదుకుచూ సుగ్రీవున్ని కలుసుకొనెను    


సుగ్రీవుడు సీతను వేదికించెదనని రామునికి ప్రతిజ్ఞ చేసెను
రాముడు సుగ్రీవునితొ వానర రాజ్యమును ఇచ్చెదనని పతిజ్ఞ చేసెను
పిమ్మట వాలి సుగ్రీవుల యుద్దము నందు వాలిని సంహరించెను
సుగ్రీవున్ని వానర భాల్లూకములకు అధిపతిగా చేసెను 


వాలి శక్తి ఎటువంటిదో నీకు ముందే తెలుసును 
ఆ వాలిని రాముడు ఒక్కబాణముతో సంహరించెను
సత్య ప్రతిజ్నుడగు సుగ్రీవుడు సీతాన్వేషణ ప్రారంభించెను
తన వద్ద ఉన్న వానర భల్లూకములను దశదిశలను పంపెను


వందలకొలది, వేలకొలది, లక్షలకొలది, వానరులందరును 
ఆకాశమునందు, పాతాళమునందు, భూమియందును
గరుత్మన్తునితో సమాన మైనవారును, వయువుతో సమానమైన వారును       
అగు వనరులు అతిసీఘ్రముగా అన్నిచోట్ల సీత కొరకు వెతుకు చుండెను


నేను హనుమంతుడను వాయుదేవుని ఔరస పుత్రుడను
సీతకొరకు మిక్కిలివేగాముతో కడలి దాటి లంకలో అడుగు పెట్టాను 
ఇక్కడ అన్ని చోట్ల తిరిగి నీ గ్రుహములొఉన్న సీతను చూసాను
నిన్ను చూచుటకై , రామ దూతగా ఇక్కడకు వచ్చి నీకెదు రున్నాను 


 నీవు తప:శక్తి గలవాడవు ధర్మార్ధములు నేరిగిన వాడవును 
 గోప్పసంపదను, గొప్ప శక్తిని సంపాదించిన వాడవును
మహాప్రాజ్ఞా పరదారులను నీ యింట భందించుట తగదును 
ధర్మ విరుద్ధముగా భుద్ధి మంతులు ప్రవర్తించుట తగదును  


దేవాసురల కైనను శ్రీ రాముని భాణములకును
లక్ష్మణుని చేత విడువ బడిన భాణములకును
ఎవ్వరూ ఎదుట నిలబడి యుద్దము చేయ లేరును
మూడు లోకములలో రామున్ని ఎదిరించే వారు లేరును


రామునికి అపరాధము చేసినవారు సుఖముగా ఉండలేరును 
త్రికాలహితమును, దర్మార్ధముల కనుకూల మగు మాటను
మన్నించి ఆ పురుషోత్తమునకు జానకినిచ్చి వేయ వలెను
సీతను నేను చూసినాను చాలా భాద పడు తుండెను


ఇక  చేయవలసిన కార్యము రాముని పై యుండెను 
నీఇంట ఉన్న సీత ఐదు తలల సర్పమని తెలుసు కొనవలెను
విషాన్నము ఎక్కువ తిన్న వారెవరైనా జీర్ణము చేసు కో లేకుండును 
అట్లే అసురులు, సురులు గాని, ఎవ్వరు సీతను జీర్ణము చేసుకో లేరును


నీవు తపస్సువలన ధర్మ ఫలమును పొంది యున్నావును  
నీవు ధీర్ఘాయును పొంది, సీత ఆశించుట మంచిది కాదును  
నివు చేసిన తపస్సును, వ్యర్ధము చేయుట మంచిది కాదును
రాముడు వచ్చి నిన్ను చంపకముందే సీతను అప్పచెప్పవలెను    


ధర్మ ఫలము అధర్మ ఫలముతో కలయ కుండును  
ధర్మ ఫలము ధర్మ మార్గమునే అనుసరించి ఉండును  
ధర్మ ఎప్పుడు  చేసిన అధర్మము నశించి పోవును  
ఇప్పటిదాకా ధర్మ ఫలము పొందావు, పొందెదవు అధర్మ ఫలమును


అధర్మము బలమైనప్పుడు ధర్మము కూడా వెనక్కి పోవును
అధర్మ ఫలం అనుభవించేటప్పుడు ధర్మ ఫలం నశించును 
నీవు ధర్మ ఫలమును అనుభవిన్చావు సందేహము లేదును 
అచిరకాలమోలో అధర్మ ఫలమును కూడా అనుభవిన్చగలవును  


జనస్థానములో రాక్షస వధను 
రామసుగ్రీవుల మద్య స్నేహ భంధమును 
రాముడు సంహరించిన వాలి వధను 
గుర్తు తెచ్చుకొని ఏది హితమో కనుగొనవలెను 


ఆశ్వరధ గజాలతో కూడిన కంచన లంకను
నేనొక్కడినే తక్షణమే నసింప చేయ గలను
అది రాముని నిర్ణయమునకు అనుగుణము కాదును 
అందుకే నేను బలాబల విషయాలు తెలుపుచున్నాను 


ఎందు చేతననగా రాముడు వానర భల్లూకముల సమక్షము నందును 
సీత అపహరించిన శత్రువులను నశింప చేసెద నని ప్రతిజ్ఞ చేసెను
రామునకు అపకారము చేసిన దేవేంద్రుని నైనాను ఎదిరించగలుగును 
నీ వంటి వానిని వదిలి పెట్టునా? చూడగలవు నీ వధ త్వరలోను 


సీత యనిన ఎవ్వరను కోనుచున్నవో,  నీకు తెలియుట లేదును 
నీ ఇంట ఉన్న స్త్రీ సర్వ లంక వినాశిని గా గుర్తించ వలెను 
అందు చేత సీత శరీర రూపములో ఉన్న కాళపాశమును 
నీ అంతట నీవె మెడకు తగిలించు కొనకము, ఏది హితమో అలోచించు 
కొనవలెను


అటు చూడు సీత యొక్క తేజము చేతను 
ఇటు చూడు శ్రీ రామచంద్రుని కోపము చేతను 
పెద్ద భవనములతో, వీధులతో ఉన్న లంకను
దహించి వేస్తున్న అగ్నిని ఒక్కసారి చూడవలెను 


నీమిత్రులను, జ్ఞాతులను, సుతులను, హితులను 
స్త్రీలను, భోగములను, లంకాపట్టనము యొక్క నాశనమును
 ఎందుకు కోరుకొనుచున్నావు, నీ పట్టుదల వీడి సీతను 
రామునికి అప్పచెప్పి, నీ కీర్తిని, శక్తిని నిలబెట్టు కొనవలెను


ఓ రాక్షస రాజా నేను రాముని దాసుడను, అతని దూతను  
కీర్తిగల రామనకు స్థావరజంగము రూపములైన ప్రాణులలోను  
  పంచ భూతములతో కూడిన సకల లోకములను
శ్రీ రాముడు సంహరించి అట్లే సృష్టించగల సామర్ద్యము గలవాడును 


ఏ కాలములోను, ఏ దేశములోను, ఏ భూతములలోను
దేవాసురలలోను, నరులలోను,రాక్షసులలోను విద్యాధరులలోను 
గంధర్వులలోను, యక్ష కిన్నరులలోను, నాగులలోను, పక్షులలోను 
శ్రీరాముని ఎదుట నిలబడి యుద్దము చేయగలవారు ఎవ్వరూ లేరును


రాజశ్రేష్టు డైన రామునకు నీవు అపకారము చేసినావును  
నీవు బ్రతికుండట కష్టమే అని తెలుసుకొనవలెను 
యుద్దములో రాముని ఎదుట నిలబడి యుద్దము  చేయలేరును 
ఓ రాక్షస రాజ సత్య వచనములు పలుకుచున్నాను ఆలకించ వలెను    




నాలుగు ముఖములు గల స్వయంభువుడగు బ్రహ్మయైనను 
మూడు నేత్రములు గల త్రిపుర సంహారి యగు రుద్రు డైనను 
ఐస్వర్య శాలియైన దేవతల కధీశ్వరుడు ఇంద్రు డైనను
యుద్దమునందు రామచంద్రుని ఎదుట నిలబడ లేరును


నిర్భయముగా మాటలాడు చున్న మాటలను
సౌష్టము కూడిన అప్రియమగు వచనములను
రావణుడు విని కోపముతో నేత్రములు త్రిప్పెను
"ఈ వానరుని వధింపుడు అని ఆజ్ఞాపించెను

సుందర కాండ నందు 51 వ సర్గ సమాప్తము

No comments:

Post a Comment