Tuesday, 11 August 2015

ప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (46 వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
          శ్రీ మాత్రే నమ:
                                   శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:

http://vocaroo.com/i/s1gBHpjs6ux1 
 46వ సర్గ (వాల్మికి రామాయణములోని 39శ్లోకాల  తెలుగు వచస్సు)
("హనుమంతుడు రావణుని సేనాపతులను వధించుట    ) 

మహాత్ముడైన హనుమంతుని చేతిలో మంత్రి సుతులు మరణించినట్లు రావణుడు తెలుసుకొనెను
రావణుడు తన భావమును భాహిర్గతముచేయక విచారించి కర్తవ్య నిర్ధారణ చేసెను
రావణుడు తనవద్ద ఉన్న  ఐదుగురు సేనాదిపతుల వైపు చూసి వారిని ప్రోస్చహించెను
వీరు రావణునితో సమానమైన వారు మారుతితో యుద్దమునకు తొందర పడుచుండెను 


విరూపాక్షుడు, యుపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘనుడు, భానకర్ణుడు బయలుదేరెను 
వారితో పెద్ద సైన్యముతో ఆయుధములతో వెళ్లి వానరుడిని శిక్షించండి   అని ఆజ్ఞాపించెను 
మీరు ఆ వానరునితో చాలా జాగర్త వహించి లొంగతీయుటకు ప్రయత్నం చేయవలెను
మీరు పనులలలో దేశ విరోధము, కాలవిరోధము లేకుండా జాగర్త పడవలెను 


అతడు చేసిన యుద్దమును బట్టి సామాన్య వానరుడు కాదనిపించు చుండెను 
గొప్ప సేనను నిగ్రహించిన ఒక మహా ప్రాణివలె నాకు కనపడు చుండెను 
వానరుడని తెలిసిన తర్వాత నాలో అనేక సందేహములు కూడా వచ్చెను
ఇప్పడు రూపమునుబట్టి అతడు వానరుడే అని నేను అనుకోను చున్నాను 


ఈ మహాభూతమును మనకోసమే ఇంద్రుడు తనతపోబలముచేత సృష్టించు యుండ వచ్చును 
నేను మీరన్దరు వెంటరాగా పూర్వము నాగులను, యక్షులను, గంధర్వులను దేవతలను 
అసురలను జయించి ఉన్నాము కదా వారు మనపై ఏదైనా అపకారము చేయదలచి యుండవచ్చును 
అందుకే నేను మీరందరూ  చతురంగ బలమును తీసుకొని వెళ్లి జయము సాధింఛి తిరిగి రావలెను 


నేను గతంలో వాలిని, సుగ్రీవుడ్ని, మహాబలసాలియైన జాంబవంతుడ్ని, నీలుడును 
ద్వివిదుడు మొదలైన అత్యధికమైన బలముగల అనేకమంది వానరులను భల్లూకాలను 
ఎందరినో నేను చూచి యున్నాను, కాని వారి వేగము ఇతని వేగామంత  భయంకరముగా లేకుండెను   
వారిలో ఇట్టి తేజముకాని, పరాక్రమం గాని, బలోశ్చాహముకాని మతిగాని లేకుండెను 


ధైర్య పరాక్రమములతో మీరు ఆ కపిని అవ మానింపక అదుపులోకి తేవలెను 
కావున కపిరూపములో ఏదో మహాశక్తి ఈరూపములొ వచ్చి యుండ వచ్చును
ఇతనిని నిగ్రహించుటకై మహోత్తర శక్తిని మీరు కూడా ఉపయోగించ వలెను
యుద్దమునందు ముల్లోకములలో ఎవరు మిమ్ము  జయించే వారు లేకుండె ననెను 


మహావెగశాలురతోను, అగ్నితో సమానమైన తేజము గలవారితోను
 మత్తగజలములతోను 
గుర్రములు,గజములు పెక్కు రధముల యందు తీక్క్షనమైన శస్త్రములను ధరించిన సేనలను 
మారుతిని ఎదుర్కొని జయమును కాన్క్షిమ్చువాడు యాత్మను రక్షించు కొనవలెను 
ఎందు చేతనంటే యుద్దములో జయ మనేది చంచల మైనదని గుర్తించ  వలెను 


ఉదయించు చున్న సూర్యునివలె తేజోమయమైన కిరణములతో వెలుగు చున్న వాడును
మహాసత్యసంపంనుడును, మహాబలుడును, మహోస్చాహ మహిమ గలవాడును 
మహా వేగ సంపన్నుడును, మహాకాయుడును, మహాభుజుడును, సింహాద్వార స్థితుడును 
నగు హనుమంతున్ని రాక్షసులు చూసి మారుతిని జయంచాలని అన్నిదిక్కుల నిలబడెను   


వారు భయంకరమైన ఆయుధములతోను
మారుతిపై ఆయస్థలములనుండి విరచుకు పడెను
రాక్షసులు ఒక్కసారిగా మారుతిపై భాణ వర్షము కురిపించెను
హనుమంతుని శరీరమంతా భాణములు గుచ్చుకొనగా రక్తము ఏరులై పారెను 


హనుమంతుడు మేఘ ఘర్జనవలె పది దిక్కులు ప్రతిద్వనిమ్చుననట్లు నాదము చేసెను
దుధరుడు వేసే బాణములను తప్పించుకొనుటకు హనుమంతుడు గాలిలోకి ఎగేరెను
దుర్ధరుడు కూడా బలముతో ఒకేసారి వంద బాణములను మారుతిపై  ప్రయోగించెను 
మేఘాలని గాలి తరిమినట్ట్లుగా హనుమంతుడు నోటి జ్వాలతో భాణము లను ఎదుర్కొనెను


హనుమంతుడు వేగముగా శరీరమును పెంచి దుర్ధరుని రధముపై ఒక్క సారి దుమికెను
రధము ముక్కలాయెను, గుర్రములు చనిపోయెను,దుర్ధరుడు క్రిందపడి మరణించెను
విరూపాక్షుడు, యుపాక్షుడు దుర్ధరుడు మరణించినట్లు విని మారుతి పై విజ్రుమ్భించెను 
ఇరువురు ఆకాశములోకి ఎగిరి హనుమంతుని వక్షస్తాలముపై ముద్గరలతో కొట్టెను 


గరుత్మంతునితో సమానమైన పరాక్రమము గల వాడును
మహాబలశాలియైన హనుమంతుడు రాక్షసుల మహా వేగమును 
అణచి గాలిలోకి ఎగురుతూ క్రిందకు వస్తూ వారిని ఎదుర్కొనెను
వెంటనే పాలక వృక్షమును పెకలించి దానితో రాక్షసులను వధించెను  


భానకర్ణుడు, ప్రఘనుడు ఇరువురు కలసి హనుమంతుని ఎదుర్కొనుకు సిద్దపడెను
ఆరాక్షసులు శూలములతొను ఒకవైపు బాణములతోను మరోవైపు యుద్దముచేసెను
ఆ రాక్షులు విపరీతమైన వేగముతో మాయాబలముతో హనుమంతునికి భాదకల్గించెను 
హనుమంతుని శరీరమంతా భాణములు గుచ్చుకొనగా మారుతి వారితో యుద్దము చేసెను    


 రక్తముతో ఉన్న మారుతి రోమములన్నీ ఎర్రబడెను
హనుమంతుని రూపము బాలసూర్యునివలే వెలుగు చుండెను
ఆ వానరశ్రేష్టుడు కోపోద్రేకుడై భీకర నాదము చేసెను 
పర్వతశిఖరమును పెకలించి వారిపై విసిరి చంపివేసెను


హనుమంతుడు అశ్వములను చేతబట్టి అశ్వములను 
గజములను పట్టి గజములను, రధములను బట్టి రధములను
సైనికులను బతి సైనికులను త్రిప్పుచూ నేలకుకొట్టి చంపి వేసెను 
దేవేంద్రుడు అసురలను సంహరించినట్లుగా మారుతి సంహరించెను


చనిపోయిన ఏనుగులతోను, గుర్రములతోను 
విరిగి పోయిన రధములతోను , హతులైన సైనికులతోను
యుద్దమున మారుతి సేనాధిపతులను సంహరించెను
భూమి అంతయు రక్తపు మడుగుగా అక్కడ మారెను


ప్రజాసంహారము కొరకు ఉద్యమించిన కాలము వలెను
హనుమంతుడు యుద్దము చేయవలెనని సింహద్వారముపై నిలిచెను 
మృ త్యువును తీసుకువెల్లె యముడివలె ఎదురుచూస్తుండెను 
పిక్కబలము ఉన్నా సైనికులు రావణునికి సేనాధిపతులు చనిపోయినట్లు తెలిపెను   

సుందర కాండ నందు 46వ సర్గ సమాప్తము