Tuesday 11 August 2015

ప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (47 వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
          శ్రీ మాత్రే నమ:
                                   శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:

 47వ సర్గ (వాల్మికి రామాయణములోని 38శ్లోకాల  తెలుగు వచస్సు)
("హనుమంతుడు అక్షకుమారుని వధించుట    ) 
హనుమంతుని చేతిలో  అనుచర వాహన సహితముగాను 
అమాత్య పుత్రులు ఘోరముగా మరణించినట్లు రావణుడు తెలుసుకొనెను 
రావణుడు  ఎదురుగా కూర్చునిఉన్న అక్షకుమారుని చూసెను
అతడు సమరరోద్దతుడును యుద్దన్ముఖుడై యుండెను 
ప్రభువుయ్యోక్క దృష్టి పాత మాత్రముచే ప్రేరితుడైన వాడును 
చిత్రమైన కాంచనమగు ధనస్సును గల ప్రతాప వంతుడును
అగు అక్షకుమారుడు ద్విజశ్రే ష్టులచే  హవిస్సులతోను 
ప్రజ్వలించుచున్న అగ్ని హోత్రునివలె లేచి సభలో నిలబడెను 
 వీర్యవంతుడును బలవంతుడును అగు అక్షుడు పరాక్రమమును 
చూపాలని బాలసూర్యునివలె వెలుగుతున్న గొప్పరధమును 
ఈ రధము తప: ఫలముచేత వచ్చినదియును సమస్త ఆయుధలతోను  
ఉన్న రధముపై ఎక్కి అక్షుడు హనుమంతునిపై యుద్దము చేయుటకు బయలుదేరెను 
ఆ రధము కరగించిన పరిశుద్ధమైన బంగారముతో చేసినట్లు ప్రకాశించు చుండెను
ఈ రధములో రత్నములచేత, వజ్రములచేత అలంకరించ బడిన పతాకము  లుండెను 
మనోవేగాముతో సమానమైన వేగముతో పోయే గుర్రములు కట్ట బడి ఉండెను 
ఈ రధములో ఉన్నవారితో సురులు, అసురులు కూడా  జయించ లేక పోయెను 
ఈ రధము సూర్య ప్రభ వలే వెలుగుచూ ఆకాశములో సంచరించ గలుగును
ఈ రధము మనస్సంకల్పముతో అడ్డు లేకుండా ప్రయాణము చేయ గలుగును
ఈ రధములో యుద్దమునకు కావలసిన సకల ఆయుధములు గలిగి యుండును 
అక్షుడు భూమిని నింపుచు వచ్చి తోరణములవద్ద ఉన్న హనుమంతుని సమీపించెను
సింహమువలె భయంకరమైన నెత్రములుగల అక్షుడు మారుతిని సమీపించెను 
యుగాన్తసమయమున ప్రజాక్షయమున ప్రవృత్తమైన ప్రళయ కాలాగ్ని వలెను 
విమయజనితమైన సంబ్రమము కలవాడును మెరుపువలె ఉన్న వాడును 
అగు అక్క్షకుమారుడు హనుమంతుని బహుమాన పూర్వక దృష్టి తో చూచెను 
మహాత్మడైన కపి యొక్క వేగమును
శత్రువలపై ఆతను చూపిన పరాక్రమమును
తన బలము , తపోశక్తి బలము గలవాడును 
అగు అక్షకుమారుడు ప్రళయ రుద్రునివలె మారెను 
హనుమంతునితో యుద్దమున ఎదిరించలేని  పరాక్రమమును  
గూర్చి విచారించగా సంజాతక్రోధము కలవాడై స్థిరముగా నిలబడెను 
అతడు ఏకాగ్ర చిత్తముతో తీక్షణములైన మూడు భాణములను 
హనుమంతునిపై ప్రయోగించి యుద్దమునకు సిద్దము కమ్మని ప్రేరేపించెను 


యుద్దమున నలయని వాడును, శత్రువుల జయించగల సామర్ద్యము గలవాడును  
యుద్దోత్సాహ ప్రవుద్దమైన మానసము గలవాడు, అగు గర్వ యుక్తుడును  
అగు హనుమంతుని వైపు ఆ యక్షుడు విల్లు నమ్ములు చేత ధరించి చూచెను
 సీఘ్రముగ పరాక్రమించు వాడును నగు యక్షుడు ఆ వానరుని సమీపించెను  


బంగారు పతకమును దండ కడియములను, సుందరమైన కుండ లములను  
ధరించిన వాడగు అక్షుడు హనుమంతునితో గదాయుద్దమును ప్రారంభించెను 
నిజముగా వారియుద్ధము దేవాసురాలకు సైతము సంబ్రమును కల్గించెను 
వారుచేస్తున్న వీర్యవంత మైన యుద్దము నకు భూమి కిక్కుర మన కుండెను  


అపుడు సూర్యుడు తపించు మానివేసెను
వాయువు వీచుట మానివేసెను, సముద్రము కలిగెను 
పర్వతములు తీవ్రంగా కంపించేను
ఆకాశమునుండి భయంకరమైన నాదము వినిపించెను


అక్షుడు భాణములను మారుతిపై సరిగా గురిచూసి వదులు చుండెను
భాణ అగ్రభాగము లందు బంగరు పొన్నులు గలవి వదులు చుండెను
అవి విషధరము కలిగి సర్పములను బొలినవిగా ఉండెను 
అటువంటి వాటిని మారుతిపై మూడు భాణములు అక్షుడు వేసెను


హనుమంతునకు వాటి ప్రభావము వలన ముఖము నుండి రక్తము స్రవించెను
క్రిందకు మీదకు గల నేత్రములతో హనుమంతుడు పలుమార్లు త్రిప్ప సాగెను 
ఆ అస్త్రములు కిరణములు వలే వంటికి తాకి ఎర్రని మంటలు వచ్చెను 
హనుమంతుడు ఆకాశమునందు అటు  ఇటు  తిరుగుచూ భాద లేకుండెను 


హనుమంతుడు ఉద యించిన సూర్య ప్రభవలె కనబడు చుండెను
ఎర్రని బింబము వలె మారుతి ముఖము ప్రకాశించు చుండెను 
చిత్రమైన దనస్సుతో వచ్చిన అక్ష కుమారుడి ప్రతిభను
చూసి సంతోషించు చూ యుద్ధొన్ముఖుడై దేహమును పెంచెను 


సుగ్రీవుని మంత్రులలో శ్రేష్టుడైన అంజనీ పుత్రుడును 
మంధర పర్వత శిఖరాగ్రముపై ఉన్న సూర్యుడువలె ఉన్నవాడును 
బలపరాక్రమములు గల హనుమంతుడు అత్యధిక కోపముతోను 
అక్షకుమారున్ని నేత్రములందున్న అగ్నితో కాల్చునట్లు చూచెను 


యక్షుడు తపస్సు శక్తి తో సంపాదించిన ధనుస్సు ధరించిన వాడును 
యుద్దమునందు నేర్పుగా వర్షమువలె భాణములు వేయు వాడును
గాలితో సమాన వేగముగల  భాణములను మారుతిపై అక్షుడు వేసెను
అవి మేఘము పర్వతముపై వర్షిమ్చినట్లుగా మారుతిని గాయపరిచెను


అటుపిమ్మట హనుమంతుడు రణమున ప్రచండ పరాక్రమమును 
చూపువాడును, మిక్కిలి తేజస్సు బలము కలవాడును
అగు యక్షకుమారుని యుద్దమును చూసి హర్షయుక్తుడాయెను 
అక్షుడు ప్రయోగించిన బాణములకు గాయమై గమ్భీరనాదము చేసెను 


వీర్యదర్పము ప్రవృద్దమైన కోపముగలవాడును
రక్తమువలె ఎర్రనైన నయనములు కలవాడును 
మారుతి యుద్దము చేయుటచూచి సంతోషించెను
కూపములొ చిక్కిన గజమువలె అక్షుడు మారుతినిసమీపించెను  


అక్షుడు బలపూర్వకముగా మారుతిపై విష భాణములు వేసెను
హనుమంతుడు ఉస్చాహపూర్వకముగ తప్పించుకొని గర్జన చేసెను 
చూచువారికి భయము కల్గునటులుగా కాళ్ళు చేతులు కదిలించెను
అకాశములోకి ఎగురుతూ భూమిపైకి వస్తూ తిరుగుచుండెను


మారుతి విల్లు ధరించి యుద్దోన్ముఖుడై పెక్కు బలమైన బాణములతో ఎదుర్కొనెను
ఆకాశమున ఆచ్చాదనచేయు అక్షకుమారుని బహుమానపూర్వకముగా చూసెను 
కార్యముయోక్క యదార్ధ రూపము తెలిసిన వాడగుట వల్ల చింతించెను
అక్షుని యుద్దనైపున్యముచూసి హనుమంతుడు మేచ్చు కొనెను


అక్షుడు పర్వతముపై వడగళ్ళు పడునట్లు నిప్పురవ్వలు ప్రయోగించెను 
హనుమంతుని శరీరమంతా రక్తముకాగ ఇతనిని ఎట్లు జయించ వలెనని అనుకొనెను
బాలదివాకరుని బోలిన తేజము గలవాడును అస్త్రములను సన్ధించ గలవాడును
బాలుడైన పెద్దవానిగా మహోత్తరమైన యుద్దముచేయు చుండెను 


సమస్త యుద్దకర్మలు తెలిసిన ఇతనిని చంపలేకున్నాను
మహాబుద్దిశాలి, యుద్ద విద్యలో ఆరితేరిన వాడును 
సావధాన చిత్తముగా యుద్దములో ఏంతో ఓర్పువహించు చుండెను
యక్షులు, కిన్నరులు, మునులు అక్షుడిని మెచ్చు కొనుచుండెను  


పరాక్రమముతో ప్రవృద్దమానము గలవాడును
నా ఎదుటే నిలబడి నన్నే ఎదిరించగల సమర్ధతను చూపుచున్న వాడును 
ఇతని పరాక్రమము దేవాసురాలను కూడా ఆనందపరచు చున్నదియును
ఇతని పరాక్రమము యుద్దము నందు పెరిగి నన్నే లొంగ దీయును


ఇప్పుడితనిని ఉపెక్షిమ్చతగదు సంహరించుట మేలగును
వ్యర్ధమైన అగ్నిని ఉపెక్షిమ్చరాదు, ఆర్పి వేయవలెను 
శత్రువుని వేగమును గమనించి యుద్దము చేయాలనుకొనెను 
మారుతి తన కర్తవ్యమును తెలుసుకొని యుద్ద వేగమును పెంచెను   


వీరుడైన హనుమంతుడు ఆకాశమర్గములొ మహావేగము కలవియును 
జాగరూకతో కూడుకున్నవి, రధబారమును మోయు చున్నవియును
అగు ఎనిమిది గుర్రములను అరచేతులతో కొట్టి హనుమంతుడు చంపెను 
అక్షుడు కుర్రములు మరణించగా, రధము విరిగిపోగా, అకాశమునుండి నేలపై పడెను 


అక్షుడు రధమును విడిచి ధనుస్సు ఖడ్గము ధరించి ఆకాశము పైకి 
ఎగెరెను
అప్పు  డతడు తప: శక్తి కలవాడై స్వర్గలోకముకు పోయే ఋషి వలె ఉండెను 
హనుమంతుడు గరుత్మంతుడువలె, సిద్దిలువలె, సంచరిన్చేమార్గమున బయలుదేరెను
అక్షకుమరుని వద్దకు మెల్లగా వెళ్లి అతని  పాదములను గట్టిగా పట్టుకొనెను  


హనుమంతుడు సర్పమును గరుత్మంతుడు గట్టిగా పట్టుకున్నట్లను 
అక్షకుమారుని పాదములను గట్టిగా పట్టుకొని వేయి మార్లు గిర గిర త్రిప్పెను 
ఆ తరువాత నేలపై కొట్టెను రాక్సాస శరీరము ముక్కలు ముక్కలుగా మారెను 
యుద్దమును చూచుచున్న దేవేంద్రాదిదేవతలు ఆశ్చర్యముగా చుచు చుండెను


అక్షుడు రక్తము శ్రవించి ఎముకలు నలిగి ముద్దగా మారిపోయెను
భాహువులు, తొడలు, కటి ప్రదేశము,  కంఠం, మొఖము నలిగి పోయెను
సంధులు ఊడి  శరీర భంద మంతా శిధిలమై పోయి మరణించెను
 దెవత లందరూ సంతోష పడెను , రాక్షసులు భయముతో పరుగెట్టెను


అక్షుని నేలపై కొట్టిన శబ్దము రావణునికి గొప్ప భయము గలిగెను
 శక్తి యుక్తి  పరుడు, రక్తమువలె ఎర్రని కన్నులు గలవాడును
అగు హనుమంతుడు చని పోయినవారిని తీసుకువెల్లె యముడివలెను
ఆతోరణము వద్ద ఇతర రాక్షసుల రాకాకై నిర్రీక్షిమ్చు చుండెను

సుందరకాండ నందు 47వ సర్గ సమాప్తము



No comments:

Post a Comment