Saturday, 22 August 2015

ప్రాంజలిప్రభ - సుందర కాండ తెలుగు వచస్సు (49 వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
ప్రాంజలి ప్రభ
          శ్రీ మాత్రే నమ:
                                   శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ: 49వ సర్గ (వాల్మికి రామాయణములోని 20శ్లోకాల  తెలుగు వచస్సు)
("ప్రభావశాలి అయిన రావణుని రూపమును చూడగానే హనుమంతుని మనస్సులో అనేక విధములైన భావములు కలుగుట ) 


ఇంద్ర జొత్తు యొక్క కర్మచే విస్మితుడును 
రావణునియోక్క కర్మచే ఎర్రని కన్నుల గలవాడును
హనుమంతుడు రాక్షస ప్రభువును చూచెను
రాక్షస కాంతిని చూసి అశ్చర్య పడెను


బహుమూల్యమును బంగారముతో చేయబడినదియును
మరియు  ముత్యములు, వజ్రములతోను  వైడూర్యములతోను 
చేయబడిన కిరీటము ధరంచి మహాతేజవంతుగా ప్రకాశించుటను
హనుమంతుడు రావణుని చూసి అంనంద పడెను 


బహుమూల్యమైన పట్టు వస్త్రములను ధరించిన వాడును 
మంచి రూపము కలిగి ఎర్ర చందనము నలదుకొనిన వాడును 
చిత్ర విచిత్ర రచనలలోను అంగరాగముల తోడను
   అలంకృతమగు శరీరముతో  రాక్షసాదిపతి ఉండెను 


రావణుడు నల్లని కాటుక కొండ వలే ఉండెను
వక్షస్తలముపై ప్రకాశవంతమైన హారములుండెను 
పూర్న చంద్రుని మోఖముతో బాలసూర్యుని వలే ఉండెను
వజ్రవైడూర్యములతో  పొదగబడిన సింహాసనము మీద ఉండెను


భాహువులకు  దండ కడియములు ధరించెను
వక్షస్థలముపై కస్తూరి చెందన లేపములు పూయబడి యండెను 
అతని చేతులు ఐదు తలల సర్పము వలే కనబడు చుండెను
ఆకాశములో ఉన్న నల్లని మేఘమువలె నుండెను


భయంకరమైన పెద్ద కోరలు కలిగి యుండెను 
కన్నులు రక్త వర్ణము కలిగి భయపెట్టు చుండెను 
పెదవులు పొడుగుగా పెద్దవిగా ఉండెను 
పది తలలతో ఉన్న రావణుని మారుతి చూసెను 


విన్జామరులతో స్త్రీలు విసురు చుండెను 
య్యవ్వనవతుల స్త్రీలు సేవించు చుండెను 
మంత్రతంత్రములు తెలిసిన వారు నలుగురు ఉండెను 
దుర్భర, ప్రహస్థ, మహాపార్స్య,  నికుమ్భాది రాక్షులుండెను


నల్గురు రాక్షసులచే పరివృతుడైన రావణుడు బలదర్పము ప్రకటించెను
రావణుడు చతుసముద్ర పరివృతమైన భూలోకమువలె నున్న వాడును 
మంత్రం తంత్రజ్నులగు ఇతరమంత్రులచే పొగడబడు చున్నవాడును 
దేవతలచే పరివృతుడైన దేవేంద్రునివలె రావణుండు వెలుగు చుండెను


భీమ విక్రముగల రాక్షసులు హనుమంతుని భాదపెట్టినను 
భాదను భరిస్తూ ఆశ్చర్యముగా రాక్షస ప్రభను చూసి సంతోషించెను 
హనుమంతుడు రాక్షసాధిపతి యొక్క తేజస్సును తెలుసుకొనెను 
రావణుని తేజస్సుకు హనుమంతుడు మోహితుడై తనలోతాను ఇట్లనుకొనెను


ఆహ ఏమి రూపము, ఏమి ధైర్యము, ఏమి బలము, ఏమి శక్తి, ఏమి కాంతియును
ఈ రాక్షస రాజు రాజోచితములగు సర్వలక్షణములను కలిగి యున్నాడును 
ఇతని యందు ప్రబలమైన అధర్మము లేకుండిన ఈ రాక్షస రాజు సర్వ ప్రపంచమును
ఇంద్రసహతమగు దేవలోకమును కుడా రక్షించగల సమర్ధుడు అని మారుతి తలచెను 


దేవతలు దానవులు, సమస్త మైన లోకములు దారుణములైనవి యును 
క్రూరములనిఅవియును కుశ్చితములైన ఇతని పనులకు వెరచి యుండెను
కోపము వచ్చిన యితడు మొత్తము జగము నంతను సముద్రముగా మార్చ గలుగును
రావణప్రభావమును పలువిధములుగా వీక్షించి హనుమంతుడు ఆలోచించి చింతించెను

సుందర కాండ నందు 49 వ సర్గ సమాప్తము