Wednesday 26 August 2015

ప్రాంజలిప్రభ - సుందర కాండ తెలుగు వచస్సు (50 వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
ప్రాంజలి ప్రభ
          శ్రీ మాత్రే నమ:
                                   శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:


 50వ సర్గ (వాల్మికి రామాయణములోని 19శ్లోకాల  తెలుగు వచస్సు)
("రావణుడు ప్రేరేపిమ్పగా లంకకు ఎందుకు వచ్చినావని ప్రహస్తుడు హనుమంతుని ప్రశ్నించుట, రాముని దూతగా వచ్చినానని హనుమంతుడు చెప్పుట  ) 


మహాబాహువులను గలవాడు, లోకములను ఏడ్పించిన వాడును
అగు రావణునికి ఎదురుగా నిలబడిన పసుపు పచ్చని కన్నులను 
గల హనుమంతుని చూసి మహా రోషా విష్టుడుగా మారెను
అయినా హనుమంతుని చూసి శంకాకులిత స్వాన్తుడై చింతించెను 



రావణుడు నందీశ్వరుడు వచ్చినా ఏమి? అని సంకోచించేను 
నదీశ్వరుడే పూర్వము కైలాసము పరిహసిమ్పగా శాపము ఇచ్చెను 
అతడే ఇప్పుడు వానర రూపమున వచ్చి యుండ వచ్చును 
లేక బాణాసురుడా? ఎవ్వరికి చిందిన వాడో కనుగొన మనెను



రోషముతో రావణుడు ప్రహస్తునితో గంభీరార్ధ యుక్తమును 
ఎర్రని కన్నులుకలవాడై సమయాను కూలమైన మాటలు పల్కెను 
ఈ వానరుడు ఎక్కడనుండి ఇక్కడకు వచ్చుటకు కారణమును 
 తెలుసుకో మనేను, అన్ని వివరములను తెలుసుకోవలెను 



అతని యుద్దెశ్యమెమి ? ప్రమదావనమును పాడు చేయుటలోను
దుర్భేద్యమైన ఈ నగరమునకు వచ్చుటలో ప్రయోజనము అడుగవలెను
రాక్షసులను బెదిరించుటలో అతని యుద్దేశ్యమెదో తెలుసు కోవలెను
రాక్షసులతో యుద్దము ఎలా చేసినాడు? ఎ ఉద్దేశ్యమో కనుగోన మనెను



రావణుని మాటలు విని మంత్రి వర్యుడు ప్రహస్తు డిట్లనెను
ఓ వానర ఊరడిల్లుము నీకు ఇక్కడ ఏమి భయము లేదును
నీవు రావణుని గృహమునందు ఉన్నావు నీకు శుభ మగును
నీవు రావణాలయమునకు వచ్చుటకు కారణము తెలుప వలెను 



ఇంద్రుడు పంపగా వచ్చినట్లయితే నిజం చెప్పవలెను 
నీ తేజము వానరులకు ఉండదు, రూపము మాత్రమే ఉండును
ఓ వానరా నీవు నిజము చెప్పిన విడిచి పెట్టగలము, అనృతమును
పల్కిన నీవు జీవించుట అసంభవము అని ప్రహస్తుడు పలికెను



హనుమంతుడు రాక్షస మంత్రులతో ఈవిదముగా పలికెను
నేను ఇంద్ర, వరుణ,యమ లలో నెవ్వరికి చెందిన వాడను కాను 
రాక్షసేంద్రుని దర్శనార్ధమై వచ్చినాను, నేను పుట్టుక తోను వానరుడను,
 దదర్శనము దుర్లభమని భావించి ప్రమదావనమును పాడు చేసినాను


బలవంతులైన రాక్షసులు నాతో యుద్దము గోరి వచ్చెను 
నా ఆత్మరక్షనకై నేను యుద్దములో వారిని ఎదుర్కొనగలిగాను
దేవాసురలకైనను అస్త్రములతొ నన్ను భంధించు శక్తి లేదును
బ్రహ్మదేవుడు ఎ అస్త్రము ప్రయోగించిన పనిచేయవు అని వరము ఇచ్చెను


నేను బ్రహ్మస్త్రము నుండి విముక్తి అయినాను
రామకార్యము కొరకు నీయొద్దకు వచ్చి యున్నాను 
అమిత తేజస్సు గల రాముని యొక్క  దూతను నేను  
నేను చెప్పు హిత వచనములు ఆలకిన్చవలెను  
      
సుందర కాండ నందు 50 వ సర్గ సమాప్తము  

No comments:

Post a Comment