Friday, 18 September 2015

ప్రాంజలిప్రభ - సుందర కాండ తెలుగు వచస్సు (55వ సర్గ)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ 
శ్రీ మాత్రే నమ:
శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ: 
55వ సర్గ (వాల్మికి రామాయణములోని 34 శ్లోకాల  తెలుగు వచస్సు)
("సీత కూడా అగ్నిచే దహించ బడినదేమోనని హనుమంతుడు భయపడుట, అభయము నివృత్తి యగుట  )   

మహాబలశాలి అయిన వానరోత్తముడు లంకంతా జ్జ్వాలలతో తిరిగెను 
 జ్జ్వాలను లంకలో విడిచి సముద్రమున చేరి తోకను చల్లార్చు కొనెను
 హనుమంతుడు తిరిగి చూడగా లంక అంతా దగ్దమగుట కనబడెను 
భయపడిన రాక్షస సంగాలన్ని కూడా ఏకమై ఒక చోటకు చేరెను 


హనుమంతునికి చాలా భయము కల్గెను 
తను చేసిన పనికి అసహ్యము కలిగెను
   తనవిషయమున నిందా బుద్దికూడా కల్గెను 
లకనంతా కాల్చివేయుచూ నేనెంత పనిచేసినాను 


మండుచున్న అగ్నిని నీటితొ చల్లార్చవచ్చును
కోపమును అనుచుకున్నవారు శ్రేష్టులగును
కోపముతో పూజ్యులైన పెద్దలను కూడా చమ్పివేయును 
సత్పురుషులను పరుషములైన మాటలతో ఆక్షేపించును


కోపానికి మంచి చెడు తెలుసుకోవాటానికి కళ్ళే కనబడకుండును  
కోపముతో ఏది అనవచ్చు ఏది అనకూడదో తెలిపే మనసే లేకుండును 
కోపముతో విచక్షణా జ్ఞాణము కోల్పోయి మూర్ఖులుగా  మారును 
ఉత్తమ్పురుషుడు ఓర్పుతో, వచ్చిన కోపమును తగ్గించు కొనును 


నేను తొందరపాటుతో ఎంత దుర్భుద్ధితో చేసినాను 
సీత గూర్చి ఎమీ ఆలోచించకుండా లంకను తగలబెట్టాను
రాక్షసులను వధించి, లంకకునిప్పుపెట్టి కొంత జయము పొందాను
ప్రభు కార్యమును పాడుచేసిన మహా పురుషుడను నేను 


లంక అంతా ధగ్దమైనప్పుడు జానకి కూడా దగ్దమగును 
న యజ్ఞానము వలన స్వామికార్యమును భగ్నము చేసినాను
దేనికొరకు నేనుఇంతదూరమము వచ్చానో అది వ్యర్ధమై పోయెను 
సీతకు రక్షణ కల్పించకుండా నేను పెద్ద తప్పే చేసి యున్నాను 

 
తలపెట్టిన కార్యము కొంత వరకు సఫల మాయెను   
నేను కోపముతో మూలమునె నాశనము చేసినాను
సందేహము లేదు లంక అంతా దగ్ధ మాయెను
అందుచేత జాని కుడా కాలి యుండ వచ్చును 

నా బుద్ధివైపరీత్యము వలన కార్య0 చెడి పోయెను 
ఇపుడు నాకు ప్రానత్యాగము చేయుట మూలమగును
నేను సముద్ర జంతువులకు ఆహారము అయ్యేదను 
లేదా అగ్నిప్రవేశము చేసి ప్రాణాలు అర్పించెదను 

రామలక్ష్మణులకు, సుగ్రీవునకు నేను ఎలా చెప్పవలెను 
నేను సీత కు ఎటువంటి రక్షణ కల్పించ లేకుండెను 
ఈ మోఖముతో నేను ఎలా వానరులకు రాజపుత్రులకు చూపగలను 
నేను చపలచిత్వముతో ప్రవర్తించుట తప్పే యగును 


రాజస ప్రవృత్తి  అదుపు తప్పి చపలచిత్వం కల్గించును 
సీత మరణించినచో రామలక్ష్మనులు మరణించును
రాజైన సుగ్రీవుడు కూడా ప్రాణత్యాగము చేయును 
సోదరులు లేరని తెలిసిన భరత శత్రుఘ్నులు మరణించును


ధర్మమార్గ నిరతమైన ఇక్ష్వాకు వంశమే నశిమ్చును
ప్రజలందరూ సోకముచేత మనస్తాపము చెందును
నేను ధర్మమును అర్ధమును సంరక్ష్మిమ్చుకోలేక పోయాను
మనసు రోషమునకు చిక్కి లొకవినాసమునకు కారణ భూతుడైనాను

హనుమంతుడు ఆలోచించు చుండగా సుభశకునములు వచ్చెను
పూర్వము కూడా  ఇటువంటి వాటిని ప్రత్యక్షముగా చూసాను
సీతాదేవి తన ప్రాతివత్యతేజముచే రక్షితా అయి యుండును
సుమంగళి నశించదు ఎందుకనగా ఒక అగ్ని మరొక అగ్ని ఎలా దాహించును 


శ్రీరామునికి సీతపై ఉన్న ప్రేమ వలనను, సీత సుకృతి బలము వలనను
భరత మొదలగుగా గల మువ్వురు సోదరుల ఆరాద్యదేవత అవుట వలనను
శ్రీ రాముని హృదయ వల్లభయును నగు సీతను అగ్ని ఎలా దహించును
సీతాదేవి అగ్నికి ఆహుతి  కాకుండగా జీవించె యుండ వచ్చును 


ఈ తాహతుడు అన్ని చోట్ల అధికృతుడును, అవ్యయుడును
అగు అగ్ని నా వాలము దహించనప్పుడు సీతను ఎలా దాహించును
రామకార్యమున మైనాకుడు చేసిన సహాయము గుర్తుకు తెచ్చుకొనెను
ఈమే అగ్నిని దహించగలదు, దాహకుడు ఈమెను ఏమి చెయ లేకుండును 


తపముచేతను, సత్య వాక్యము చేతను
భార్తయందు అనన్యభావము ఉండుట చేతను
అగ్నిదేవుడు ఈమెకు సహాయము చేసి యుండును
ధర్మబద్దురాలైన సీత గురించి మారుతి ఆలోచించెను


మహాత్ములైన చారుల యొక్క అమృత వాక్కులను వినెను
హనుమంతుడు రాక్షసులయోక్క గృహములకు తీవ్ర మైనవియును 
 భయంకరమైన అగ్నిని వదలి దుష్కరమైన కార్యమును చేసెను
పారిపోవుచున్న స్త్రీలు బాలురు,వృద్దులు అలసి క్రిక్కిరిసి యుండెను


జనకోలాహలముచే పరి పూర్ణ మైనదియును
పెద్ద సౌదములను, ప్రాకారములను, సిమ్హద్వారములను
అలిగియున్న లంకానగరము అగ్నికి ఆహుతి అయ్యెను 
కాని సీత మాత్రము దగ్దము ఆలేదు ఆశ్చర్యముగా నుండెను 


ఈవిదంగా అమృత సమాన మైన చారునుల వాక్కులు వినెను
హనుమంతునకు తత్కాలమైన సంతోషము కలిగెను
అనేకవిధములైన భూతముల శకునముల వలనను 
ఋషి వాక్యముల వలనను హనుమంతుడు సంప్రీతి మనస్కుడాయెను


హనుమంతుడు చారుల వాక్యములు విని సంతోషించెను
రాజకుమారి సీతదేవి బ్రతికి ఉన్నట్లు తెలుసుకొనెను
తక్షణమే సీతను చూసి తిరిగి పోవాలని నిర్ణ ఇమ్చు కొనెను
మరల సీతను చూచుటకు లంకలోపలకు ప్రవేసిమ్చెను

శ్రీ సుందరకాండ 55వ సర్గ సమాప్తము