ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ:శ్రీ రామ చంద్రపరబ్రహ్మనే నమ:
నిద్రిస్తున్న వనితా సీత అని ఆలోచన విడిచి స్వస్త చిత్తుడాయెను
సీతను గూర్చి పలువిధముల ఆలోచించి చింతకు లోనయ్యేను
సీతా మహాసాద్వికి రామునితో విరహితయై నిద్ర అనేది లేకుండెను
రాముని తలుస్తూ ఎటువంటి ఆహారమును తీసుకోకుండా ఉండెను
భర్త లేనిచోట ఉన్నసీత ఎట్టి అలంకారము చేసుకోకుండా ఉండెను
పతివ్రత ఐన సీత ఎటువంటి మద్యమును సేవించకుండా ఉండెను
పరపురుషుని ప్రక్క సీత ఎట్టి పరిస్తితిలో నిద్రించాకుండా ఉండును
హనుమంతుడు ఆమెసీత కాదనిభావంచి సీత కొరకు వెతుకుట ప్రారంభించెను
దేవతలరాజు ఇందృడు వచ్చి సీతను కామించిన సీత త్రుణీకరించును
సీత రామచంద్రునితో సమానమైన వారు అసలు లేరని వాదించును
సీత సందర్సన కౌతూహలము గల వానరాధిపతి అక్కడ సంచరించెను
సీతను వెదుకుటకు హనుమంతుడు మరలా ప్రయత్నించు చుండెను
పానభూమి యందు కొందరు స్త్రీలు అధికరతితో అలసి యుండెను
మరికొందరు పాటలు పాడుటవల్ల అలసి సొమ్మసిల్లి యుండెను
నృత్యము చేయుటవల్ల పాదముల నేప్పులతో మూలుగు చుండెను
కొందరు అధికపానమత్తుచే శిధిల శరీరముగలవారై నిద్రించు చుండెను
అక్కడ వేలకొలది స్త్రీలు వివిధ అలంకారములతో ఉండెను
కొందరు స్త్రీలు సౌందర్యాదివిషయములగూర్చి ముచ్చటించు చుండెను
గీతములలొని అర్ధములను గూర్చి ఒకరికొకరు చెప్పుకోనుచుండెను
దేశకాలమునుబట్టి తగు విధముగా అక్కడ ఉన్న స్త్రీలు పలుకుచుండెను
రావణుడు ఆవుల మద్య ఉన్నమత్త వృషభమువలె ఉండెను
రాక్షసేశ్వరుడు ఆడేనుగులచే పరివృతమైన మదపుటెనుగువలె ఉండెను
రాక్షసరాజు గృహము అంత సర్వకామోపేతముగా ఉండుట గమనించెను
యవ్వనపొంగులతో ఉన్న నారీ సహస్రమును హనుమంతుడు చూసెను
పాన సాలలయండు లేళ్ళు మరియు మహిశములయొక్క మాంస ములను
సువర్ణ పాత్రలయందు భజిమ్పబడిన నేమ్మల్లు, కోళ్ళు యొక్క మాంస ములను
అక్కడక్కడ పెరుగు లవణము కలిపినా వివిధములైనమేకపోతూ మాంస ములను
ఎనుబందులు, పక్షులు యొక్క మాంసములను హను మంతుడు చూసెను
తినుటకు సిద్ధముగా ఉన్న కొక్కర మాంసములను
అనేక రకములుగా తయారు చేసిన మేక మాంసములను
కొమ్ము చేపలను, కుందేటి మాంసమును, గొర్రెమాంసమును
సగము తిన్న దున్నబోతు మాంసమును హనుమతుడు చూసెను
ద్రాక్ష దానిమ్మ రసములతో తయారుచేసిన రసమును
ప్రధానముగా పులుపు ఉప్పు తో చేసిన పదార్ధములను
పాన పాత్రలయందు పడవేసిన వివిధ ఫలములను
పుష్పాలతో శోభగా ఉన్న ప్రాంతమును మారుతి చూసెను
పానసాలలయందు అగ్ని లేకుండగనే మండు చున్నట్లు గమనించెను
మాంసమును మంచి పాకాది సంస్కారములచే సంస్కరించెను
అనేక పద్ధతులతో భక్షములను తయారుచేసి ఇంపుగా అమర్చేను
అక్కడకొన్ని సయనములు, ఆసనములు ఖలీగ ఉండుట మారుతి చూసెను
దివ్యమైన స్వచ్చమైన అనేక విధములగు సహజ మద్యములను
వివిధ ద్రవ్యములతో తయారుచేయబడిన కుత్రిమ మద్యమమములను
అనెకవిధములుగా పోపులు పెట్ట బడిన పదార్ధములను
బంగారు,స్పటిక పాత్రలతో పానభూమి సొభిల్లు చుండెను
విప్పపూలు మొదలగు పూలతొ చేయబడిన పుస్పాసవములను
ఖర్జూరపు పళ్ళతో చేయబడిన ఫలాసవములను
ద్రాక్షపల్లతో చేయబడిన ద్రాక్షా సవములను
మధుర భరితమైన పదార్ధాలతో పానభూమి సోభిల్లుచుండెను
అక్కడ మద్యముతో నిండిన బంగారు భాండములను
పూర్తిగా త్రాగిన మణులతో చేసిన రక్త పాత్రలను
వివిధ భాక్షముల్తో నిండిన వెండి పాత్రలను
సగము త్రాగిన పాత్రలను హనుమంతుడు చూసెను
ఒక ఆబల మరియొక ఆబల వస్త్రములను అపహరించి నిద్రించు చుండెను
ఒక యువతి ఆమె వద్దకు చేరి ఘాడముగా ఆలింగనముచేసి నిద్రించు చుండెను
నిద్రించు చున్న స్త్రీ యొక్క వస్త్రము యజ్ఞాస్వమువలె ఎగురుచుండెను
మందమారుతముచే పై వస్త్రములు మెల్లగా కదులుచుండుట మారుతి చూసెను
చల్లని చందనములయోక్క మధుర రసముల యొక్క వాసనలను
మద్యముయోక్క, వివిధ పుష్పముల యోక్క వాసనలను
ఘంధ లేపణలు పూసుకున్న వారి వాసనలను
పుష్పకవిమానములో నుండి వచ్చు వాసనలను మారుతి గమనించెను
ఆగ్రుహములొ కొందరు స్త్రీలు నిగనిగలాడుచు శ్యామల వర్ణములు కలిగి ఉండెను
మరికొందరు స్త్రీలు బంగారమువలె మెరుస్తూ స్వేతవర్ణముగలగి ఉండెను
అధిక రతిచే అలసి పోయినా స్త్రీలు ఇంకా అందముగా కనబడుచుండెను
హనుమంతుడు స్త్రీలను చూస్తు సీత కనారాక దిగులు పడు చుండెను
హనుమంతునకు ధర్మలోప భయశంకితుడై సందేహము ఉదయించెను
నిద్రించు చున్న స్త్రీలను చూచుట మిక్కిలి ధర్మనాశనమని భావించెను నాదృష్టి ఇంతవరకు ఎన్నడును పరదారులపై ప్రవర్తించ లేదియును
కాని ఇక్కడ పరదార పరిగ్రహీతయగు రావణుడు చూడబడు చుండెను
ధీరచిత్తుడగు హనుమంతునకు మనస్సునందు ఆలోచన ఉదయించెను
నేను రావణ స్త్రీలనందరును యదేస్చగా చూడ గలుగు చున్నాను
సర్వెంద్రియములకు మనసే కారణము కనుక ఆ మనసే నాకు స్తిరముగా ఉండెను
కాని మానసిక వికారము అనేది కలుగలేదని హనుమంతుడు తలచెను
సీతకొరకు నేను మరొక ప్రదేశమునకు పోయి వేదికెదను
స్త్రీల మధ్యకు పోయి స్త్రీలన్దరిని పరిసీలిస్తు సీత కొరకు వేదికేదను
జంతువుబట్టి అజంతువులు ఉన్న చోట వెతుకు చుండ వలెను
లెల్ల మధ్యకు పోయి స్త్రీలను వెతుకుట ఏమి లాభము కలుగును
నేను నిష్కల్ముష మైన మనస్సుతో ఈ ప్రాంతమంతా వేదుకు చున్నాను
అంత:పురములో దేవ, ఘంధర్వ, నాగ కన్యలను చుచు చున్నాను
ఎంత వెతికినాను పతివ్రతయగు సీత మాత్రము కాన రాకుండెను
పట్టు వీడకుండుగా పట్టుదలతో వెతికినా సీత కానవచ్చునని తలంచెను
సుందర క్జాన్దమునన్దు 11 వ స్వర్గము సమాప్తము