Sunday, 31 May 2015

24. ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (24వ సర్గము)


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:


రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

 24వ సర్గ (వాల్మికి రామాయణములోని 48 శ్లోకాల  తెలుగు వచస్సు)
(" సీత రాక్షస స్త్రీల మాటలను తిరస్కరించుట, రాక్షస స్త్రీలు సీతను భయపెట్టుట ")    


ఓ సీతా నీవు సమస్త  ప్రాణులకును 
మనోహరమైన అంత: పుర వాసమును 
ఏల వప్పుకోవు, మిక్కిలి విలువగల
 శయణాలున్న రావణుని భవనమును
రాక్షసస్త్రీలు సీతాదేవితో పలుకరాని,
 అప్రియములు, పరుషములగు మాటలు పల్కేను
నీవు మనుజుని భార్యత్వమును గొప్పగా 
భావించి, చేస్తున్నావా ఈ తిరస్కారాలను 

ఓ సుమంగళి మనుష్యకాంతవగు నీవు, 
తిరస్కరిస్తున్నావు రాక్షసత్వమును 
రాక్షసరాజైన రావణుడు మూడు 
లోకముల ఐశ్వర్యమును 
అతన్నే భర్తగాపొంది, గౌరవమర్యాదలను
 పొందుము సుఖమును
రాక్షస రాజును ప్రేమించి, 
రామునిపై ఉన్న ప్రేమను మరల్చమనేను


రాక్షస స్త్రీల మాటలు విని, కన్నీళ్ళు నిండిన
 నేత్రములతొ ఇట్లు పల్కేను
మీరందరు  కలసి, లోకవిరుద్దముగా చెప్పిన
 మాటలు పాపపు మాటలని తెలియును
మనుష్య స్త్రీ రాక్షసునికి భార్య కాజాలదు, మీరందరు 
తినిన తిందురు కాక,మీరుచెప్పినది చేయజాలను 
ధీనుడు కానిమ్ము, లేక రాజ్యహీనుడు కానిమ్ము 
నాభర్తే  గౌరవింపదగిన వాడై యుండును 

   
మహా భాగ్య సంపన్నురాలగు శచీదేవి
 దేవేంద్రు సేవించి నట్లును
అరుంధతి- వసిష్టుని, రోహిణి 
- చంద్రుని సేవించు నట్లును 
లోపాముద్ర-అగస్త్యుని, సుకన్య-చ్చవనుని
 సేవించి నట్లును
సావిత్రి-సత్యవంతుని, 
శ్రీమతి-కపిలుని సేవించి నట్లును


భీమరాజు కూతురు దమయంతి,
 నలుని సేవించి నట్లును 
మదయంతి సౌదాసుని, 
కౌశిని - సగరుని సేవించి నట్లును
సువర్చల సూర్యుని 
నిత్యము అనురక్తియై ఉండినట్లును 
నేను కూడా ఇక్ష్వాకువరుడగు
 శ్రీరామచంద్రుని అనువర్తింతును 


సీత వాక్యాలు విన్న రాక్షస స్త్రీలు 
పరుషముగా మరలా ఇట్లు పల్కేను
హనుమంతుడు సింసుపావృక్షము నుండి 
 స్త్రీలు బెదిరించే మాటలు వింటూ  ఉండెను
ఆపాదమస్తకము కంపించుచున్న సీతను
 స్త్రీలు ఆక్రమించి వేదించ సాగెను
రాక్షస  స్త్రీలు పెదవులను నాకుచూ,
 ప్రజ్వలించుచు సీతను భయపెట్టేను


భయంకరమైన రాక్షసులు
 గండ్ర గొడ్డలిని తెచ్చి నరుకుతామనెను
ఈ స్త్రీ రాక్షసాదిపతికి
 తగిన భార్య  కాదని పెద్దగా అరిచెను 
రాక్ససస్త్రీలు చేస్తున్న బెదిరింపులకు 
సీత దేవి అశ్రుబిందువులను రాల్చెను 
విశాలక్ష్మి యగు సీత సింసుపావృక్షము
 వద్దకు వచ్చి శోకమగ్నమై యుండెను


భయంకరులగు రాక్షస్త్రీలకు
 చిక్కినదియును,  దీన మతియును 
మలినవస్త్రములొఉన్న సీతను 
నలు వైపుల నుండి హింసించెను
భయంకరమైన, మిక్కిలి లోతుగా
 అంటుకు పోయిన ఉదరము కలదియును 
మూర్తీభవించిన కోపమువలె 
వికట అనే రాక్షసి సీతతొ ఇట్లు పల్కేను


ఓ సీత నీవు భర్త విషయమున చాల 
స్నేహమును ప్రదర్సిమ్చితివి అది చాలును 
తెలియదా నీకు ఏ విషయమునైన
 అతిగా నుండుట దుఖమునకు దారి తీయును 
నీకు మంగళమగుగాక, చాలాపరితోషముకల్గినది, పరిపాలించితివి మానవుల శిష్టచారములను
ఓమైథిలి పరాక్రమము గలవాడు,సర్వరాక్షసాదిపతి 
యగు రావణుని భర్తగా స్వీకరించమనెను 


ఓ సీత మానవుడు, ధీనుడు, 
అయిన రామున్ని విడిచి పెట్టుమనెను 
నీవు దివ్యమైన అంగరాగాములను
 శరీరమునకు పూసు కొనమనెను
  ఓ సీత నీవు శ్రేష్ట మైన అలంకారములను
 అలంకరించు కొనమనెను 
ఓ సీత త్యాగశీలుడైన రావణునికి 
భార్యాయై సుఖమును పంచవలెను 


మంగళ ప్రదురాలైన సీత అగ్నిదేవుని 
భార్యయయిన స్వాహాదేవి వలెను
ఇంద్రుని భార్య యైన శచీదేవి వలే
 లోకాధీశురాలువగుము అనెను
రాముని ఆయుర్దాయముతీరే, 
నీకేమి ప్రయోజనమున్నది అని పల్కేను
మేముచెప్పినట్లు వినకపోయిన 
మేమందరమూ కలసి నిన్ను తినేద మనేను 

మిక్కిలో నీచ బుద్దిగల ఓ మైథిలి
 నీవు బ్రతికి ఉన్నావు మా జాలివలనను
నీయొక్క అసందర్భపు మాటలను సహించు 
చున్నాము మా మృధు స్వభావము వలనను
నీవు ఇతరులు రాలేని సముద్రపు ఈవతల
 ఒడ్డుకు తీసుకు వచ్చి యుంచేను 
నీవు రావణ గృహమున బందీలొఉన్నావు వినుము మాయోక్క హితమగు వాక్యములను

 సాక్షాత్తు గా దేవెంద్రుడే అయినను 
నిన్ను రక్షింప జాలకుండును 
ఇక కన్నీరు రాల్చుట విడువుము,
 త్యజిమ్పుము వ్యర్ధమైన శోకమును
రావణునిపై ప్రీతిని కలుగజేసికొని 
ఆనందించి త్వజించుము నిత్యధైన్యమును
 ఓ బీరుస్వభావముగల సీతా 
స్త్రీలయెవ్వనమెంతో  యస్తిరమో మాకు తెలియును 


నీయొక్క యవ్వనము గడచిపోకముందే
 యనుభవించుము భోగ సుఖమును 
రమ్యములగు ఉద్యానములను, 
పర్వతాలపైనను, ఉపవము లందును
ఓ సుందరి వగు దేవి, వేల కొలది 
యత:పురస్త్రీ లందరి పై ఆజ్ఞను
రావణునితో ఓ మదవిభ్రమాక్షి సంచరించి 
సుఖమును పొందవలెను


నేనుచెప్పిన మాటలను విననేమి 
నీ హృదయమును పెకలించి భక్షించెదను
క్రూరదర్సనయగు చండోదరియను
 రాక్షసి శూలమును త్రిప్పుచూ ఇట్లు పల్కెను 
హరినశాబికమును బోలిబిత్తరి చూపులతొ, 
భయముచే కంపించు స్తనములు గలదియును
మరొక రాక్షస స్త్రీ, సీతను చంపి ముక్కలుగా చేసి తినవలేనని గోప్పకోరిక కల్గెను అని పల్కెను 


ఒక రాక్షసి ఈమె యోక్క మహోత్తరమైన వక్షమును
మరో రాక్షసి బిందన  సహితముగా హృదయమును
వేరే రాక్షసి అవయవములను, తల భాగమును 
విలపిస్తున్న సీతను చూచి స్త్రీల కోరికలు బయట పెట్టెను


 నులిమి చంపివేయుదుము ఈమె యొక్క కంఠంను
ఊరకనే ఎందుకు కూర్చొన వలెను అని ప్రఘన పల్కెను  
మనుష్యవనిత చనిపోయినదని 
అందరు కలసి చెప్పెదమనెను
ఇందు సందేహములేదు, 
సరే అని మహారాజుతినండి అని పల్కును

అజాముఖి అను రాక్షసి ఈ విధముగా పల్కెను
చేయుదము ఈమెను నరికి సమాన పిండములను
వివాదము వద్దు మనమందరమూ
 పంచుకొని తిందుమనెను 
వెంటనే పెయసామగ్రీని, 
పుష్ప హారములను తెమ్మనెను


అజాముఖ అను రాక్షసి నిజముచేప్పినది
 అని సూర్పనఖ వంత పల్కెను
వెంటనే సర్వసోకనాశికమగు సురసతెండు,
 తినేదము మనుష్య మాంసమును   
నికుంభలాదేవి ఎదుట నృత్యము చేసి
 ఆనందము పొందవచ్చును అని పల్కెను
రాక్షస స్త్రీలచె బెదిరింప బడుచున్నదియై 
ధైర్యమును త్యజించి ఏడ్వ సాగెను    

శ్రీ సుందరకాండము నందు 24 వ సర్గ సమాప్తము  

Friday, 22 May 2015

23. ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (23వ సర్గము)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:



 23 వ సర్గ (వాల్మికి రామాయణములోని 21 శ్లోకాల  తెలుగు వచస్సు)
(" రాక్షస స్త్రీలు సీతకు ఉపదేశించుట  ")    

రాక్షస స్త్రీలతొ సీతను లొంగదీయుడని చెప్పి రావణుడు వెళ్లి పోయెను
భయంకరరూపముగల రాక్షసస్త్రీలు సీతవద్దకు పరుగెత్తుకుంటు వచ్చెను
రాక్షసస్త్రీలు క్రోదావేసముతో పరుషముగా సీతతో మాటలు ప్రారంభించెను
రాక్షసస్త్రీలు సర్వ శ్రేష్టుడు మహాత్ముడైన రావణునికి భార్యగా ఉండమనెను 


ఆరుగురు ప్రజాపతులలోను బ్రహ్మయొక్క మానస పుత్రుడును 
పేరులో ప్రసిద్దిడైన ప్రజాపతి, ఆరుగురు ప్రజాపతులలో 4వ వాడును
పులస్తునికి మానసపుత్రుడును పరమతేజముతో ఉన్న విశ్రువసుడను
ఆవిశ్రవసుని కుమారుడు రావణుడు అని తెలుసుకో అని ఎకజట రాక్షసి పల్కేను


పిల్లి కళ్ళుగల హరిజట అను రాక్షసి కోపముతో కళ్ళు పెద్దవిచేసి ఇట్లు పల్కేను
33 దేవతలకు ప్రభువైన దేవేంద్రుని జయించిన రాక్షస రాజును 
నీవు ప్రేమించి భార్య వగుట అన్ని విధములుగా మంచిదని ఘర్జించెను
పిమ్మట ప్రఘన అనే రాక్షసి కోపిష్టిగా మీదకు వచ్చి ఘోరవాక్యాలు పల్కేను 


మహాబల సంపంనుడగు రావణ ప్రభువు నిన్ను ఎంతో  ప్రేమించెను
ప్రియురాలిన భార్యనుకూడ  త్యజించి నీ వద్దకు వచ్చి వేడుకొనెను
అంత:పురస్త్రీ లందరినీ వదలి నిన్నె ఆరాధించి నీవద్దకు వచ్చెను 
వికట అనే రాక్షసి మొఖంలో మొఖం పెట్టి గట్టిగ అరుస్తూ మాట్లాడేను


ఓ నీచురాల సకలైస్వర సంపన్నుడైన రావణ మహాత్ముడను 
ప్రియురాలుగా మారి మాపై, రాక్షసులందరిపై  ఆజ్ఞ వహించ వచ్చును 
దీర్ఘనెత్రములుగలదానా అంటూ దుర్మిఖి అనే రాక్షసి కళ్ళు పెద్దవి చేసి బెదిరించెను 
ఒసీత మేము చెప్పునది నిజము, మా మాటలు  విని అనుకరించ మనెను

ఎవనియోక్క భయమువలన కాయదో సూర్యుని ఎండలను 
 ఎవనియోక్క భయమువలన విడువదోవాయువు గట్టిగాను ఎవనియోక్క భయమువలన మేధావులు మాట్లాడలేరు గట్టిగాను
ఎవనియోక్క భయమువలన స్త్రీలు కూడ మాట్లాడలేరు గట్టిగాను


ఎవనియోక్క భయమువలన వర్షిమ్చునో వృక్షములు పుష్పలను 
ఎవనియ్యోక్క భయమువలన విడుచునో పర్వతములు నీటి ధారలను
ఎవనియోక్క భయము వలన వర్షిమ్చునో మేఘములు వర్షములను
అట్టి రాక్షస రాజుకు భార్యకానిచో స్త్రీలందరూ కలసి నీవింక జీవించ జాలవనెను

శ్రీ సుందరకాండ 23వ సర్గ సమాప్తము     

Sunday, 17 May 2015

22. ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (22వ సర్గము)


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:


రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

 22 వ సర్గ (వాల్మికి రామాయణములోని 46 శ్లోకాల  తెలుగు వచస్సు)
("రావణుడు సీతకు రెండు మాసములు గడువు ఇచ్చుట, సీత రావణుని నిందించుట, రావణుడు సీతను భయపెట్టి ఆమెను రక్షించు చుండ వలసినదిగా
 రాక్షస స్త్రీలను ఆదేశించుట, 
స్త్రీలతొ కలసి అంత :పురమునకు పోవుట ")    

రాక్షసేశ్వరుడు సీత యొక్క పరుషమగు మాటలు వినెను 
రావణుడు వినమ్రతతో ప్రయదర్శని యగు సీతతొ బదులు పల్కేను
లోకములో స్త్రీలను బుజ్జగించిన స్త్రీలు పురుషులకు లొంగి పోవును 
కాని నీ విషయమున నేను ఎంత ప్రమగా పల్కిన తిరస్కరీస్తున్నావు  నామాటలును 

ముఖ్యముగా మనుష్యులలో గల కామము చాల వక్రంగా ఉండును
కామము ఎవనియందు నిబద్దమగునో వానియందు స్నేహము, జాలి కల్గును
నీ యందు నాకు కల్గిన కామము చెడు మార్గమునందు పరుగెత్తు చున్నాను 
సారధి గుర్రములను నిగ్రహించినట్లు, నేను కామాన్ని నీకోసం  అనుచు కొనుచున్నాను
 

ఓ సముఖీ కపటవనవాసము చేయు రాముని యందు అనురక్తిరాలు వైనను 
నన్ను అవమానించిన, వదార్హురాలు వైనను, నిన్ను వధించ  లేకుండా ఉన్నాను 
ఓమైథిలి నీవు  పల్కిన పరుషమైన ఒక్కొక్కమాటకు 
నిన్ను హింసించ వలెను 
దారుణముగా నిన్ను వధించచుట చాల యుక్తము కాని నీమీద ప్రేమతో చేయలేకున్నాను 


క్రొధావేశముతో ఉన్న రావణుడు సీతతో ఇట్లు బదులు పల్కేను
ఓ సీత నేను నీకు రెండు మాసములు గడువు ఇచ్చి ఉన్నాను
ఓ అందమైన వర్ణము గలదాన, అప్పటిదాకా నేను పాలింప వలసి యుండును 
ఓ సుందరి గడువు తీరిన వెంటనే నీవు నాశయనము పైకి రావలెను



రెండు మాసములు తర్వాత నీవు నన్ను భర్తగా అంగీకరించక పోయినను
నా ప్రత:కాల భక్షనమునకై నిన్ను ముక్కలు ముక్కలుగా భేదింప  గల్గును
రావణుడు సీతను భయపెట్టుటను దేవ నాగ  గాంధర్వ కన్యలు చూసెను 
వికృతమైన కన్నులుగల దేవ నాగ  గాంధర్వ కన్యలు మిక్కిలి విషాదము పొందెను


రాక్షసరాజు చేత భయపెట్టుచున్న సీతను కొందరు స్త్రీలు పెదవులతోను 
మరికొందరు ముఖములు, నేత్రములు కదల్చి సీతను ఓదార్చెను 
స్త్రీలచే  ఓదార్చబడిన సీత రావణుడు  చేసే వింత చేష్టలు చూసెను
రావణుడితో సీత సచ్చరిత్ర, బలగర్వితమునగు వాక్యములు పల్కేను 


ఓ రావణా ఈ నగరము నందు నీ మేలు కోరు వారెవరు లేరనుకొను చున్నాను 
బల గర్వముతొ పెద్దల మాటలను పెడచేవి పెట్టుచున్నా వని నేను  అనుకుంటున్నాను
దేవేంద్రునికి సచీదేవివలె, ధర్మాత్ముడైన రామునికి భార్యగా  యున్నాను   
మూడులోకముల్లో నీవు దప్ప మరియోక్కడు తనమనస్సులో నైన నెట్లు కోరు కొనును ?


ఓ రాక్షసాధమా అమితమైన తేజస్సుగల రామునికి భార్యనై యున్నను 
నీవు పాపపు మాటలు పలికి నందుకు, నీకు తప్పక శిక్ష పడును 
వనములో మదించిన ఏనుగును కుందేలు ఎట్లు ఎదిరించ కల్గును
అట్లే కుందేలువు నీవు, ఎదిరించలేవు గజము వంటి ధర్మాత్ముడను 


ఓ అనార్యుడా, నన్ను చూచు చున్న నీ కృష్ణ పింగళ నేత్రములు నేలపై ఎలా పడ కుండా ఉండెను
ఓ రాక్షసరాజ నీవు పౌరుషముగా నాతో అన్నమాటలకు నీ నాలుక ఎలా ఊడిపడి పోకుండా ఉండెను
నీవె సిగ్గు పడాలి, ఇక్ష్వాకునాదుడైన నా భర్త  శ్రీ రామచంద్రుని తిరస్కరించుటను

ఓ రాక్షసాధమా నీవు నా భర్త కంట పడ నంతవరకు ఎన్ని మాటలు పల్కిన చెల్లును 

ఓ రావణా, నాకు శ్రీ రామచంద్రుని ఆజ్ఞ లేకుండుట వలనను 
నేను నిత్యమూ తపోవ్రతము అవలంభించు యుండుట వలనను 
  ఓ దశగ్రీవా, నేను నిన్ను భస్మము చెయదగిన దానినై యుండినను 
నా పాతివ్రత్య తేజముచే నాభర్త ఆజ్ఞ లేకపోవుట వలన భస్మము చేయకుండా ఉన్నాను


నేను శూరుడను, నేను కుబేరు సోదరుడను అనంత బల సంపన్నుడను, అన్నను 
రావణా మాయతో నాభర్త లేని సమయమున నన్ను అపహరించి తెచ్చుట ధర్మ మెట్లగును
రావణా శ్రీ రామచంద్రుని భార్యనగు నేను  నీవు అపహరించుటకు వీలుకాని దానను
నాకు సందేహములేదు, దైవమే నీ వధకు నన్ను అపహరించి తెచ్చుట కారణమగును 


రావణాశురిని వర్ణన
 రావణుడు నల్లని మేఘము వంటి శరీరము కల్గి ఉండెను 
అతని భుజములు, కంఠం చాల పెద్దవిగా ఉండెను 
అతని బలము నడక సింహము బలము వలే ఉండెను
అతని జిహ్ఫగ్రము, నేత్రములు మండు చున్నట్లు ఉండెను


అతడు కిరీటము ధరించుట వల్ల ఎత్తుగా ఉండెను
అతడు ఎర్రనిపూవులను, ఎర్రని వస్త్రములను ధరించెను 
శివ భక్తితో, శక్తి, మాయ మంత్రులు తెలిసినవాడును 
పుత్తడి దండ కడియములను ధరించినవాడును 


నల్లగా లావుగా ఉన్న త్రాడును నడుమునకు కట్టు కొన్నవాడును
సముద్రమధనమునందు వాసుకిని కట్టిన మంధర పర్వతమువలె ఉండెను   
పర్వతమువలె ఉన్న రావణుడు బాగా బలసిన భుజములతోను
రెండు శిఖరములతో కూదిన మందార పర్వతమువలె ప్రకాశించెను 


బాల సూర్యు డి వలె ఎర్రగా ఉన్నకుండలములు అలంకరించు  కొన్నవాడును 
ఎర్రని చిగుళ్ళు,పుష్పములుగల రెండు ఆశోకవృక్షములతొ పర్వతమువలెను 
కల్పవృక్షమువలె ఉన్న అతడు మూర్తీభవించిన వసంతము వలే ఉండెను 
చక్కని భూషణాలు ధరించిన స్మసానమునందున్న మండపము వలే ఉండెను 


సీతను చూచుచున్న రావణుడు క్రోధముచె ఎర్రబడిన కన్నులతోను
త్రాచుపాము వలె బుసలు కొట్టుతూ కోపములో సీతతో ఇట్లనెను
ఓ సీతా నీవు నీతి మాలిన అర్ధహీనుడైన రాముని మరువమనెను 
సూర్యుడు తన తేజముతో సంధ్యను నాశము చేసినట్లు నేను నిన్ను నాశము చేసెదను


భయంకరముగా ఉన్న రాక్షస స్త్రీల అందరిని రావణుడు ఆజ్ఞాపించెను 
ఓ రాక్షస వనితలారా అనుకూల ప్రతికూల వాక్యముల తోడను 
సీత నాకు వశమగు నట్లు, సామదాన భేదో పాయములతోను 
దండ భయముచె నైన సీతను లొంగదీయుడని స్త్రీలతొ పల్కెను


భయ్యంకరాకారము గల రాక్ష స్త్రీలను రూపాలను వర్ణించుతూ  ఆజ్ఞాపించెను "సీతను లొంగదీయుడని చెప్పి భవనములోనికి వెళ్ళెను 

పెద్ద నోరు పొడవైన నాలుక గల స్త్రీలతోను
నాలుక, ముక్కు, చెవులు, లేని స్త్రీలతోను
సింహము, ఆవు, పంది, ముఖముగల స్త్రీలతోను
మండుచున్న కేశములు కలిగి ఉన్న స్త్రీలతోను


ఒక కన్ను, ఒకే చెవి, ఒకే చేయి ఉన్న స్త్రీలతోను
ఆవు, ఒంటె, ఏనుగు, చెవులు గల స్త్రీల తోను
వ్రేలాడు చెవులు, వేలాడు స్తనములుగల స్త్రీలతోను 
ఏనుగు,గుఱ్ఱము, ఆవు. పాదములు గల స్త్రీలతోను


పెద్ద పాదములు, చన్న పాదములు గల స్త్రీలతోను
పెద్ద పొట్ట పెద్ద చేతులు, పొడుగు కాళ్ళు గల స్త్రీలతోను
శరీరము మోత్తము రోమాలతో ఉన్న స్త్రీలతోను
నాలుక, ముక్కు, చెవులు, లేని స్త్రీలతోను


శత్రు భయంకరుడగు రావణుడు ఒకవైపు సీతను చూచు చుండెను 
మరోవైపు రాక్షస భయం కల్గించే రూపలు గల స్త్రీలను ఆజ్ఞాపించెను 
కామంతో,క్రోధంతో ఉన్న రావణుడు సీతవైపు చూసి గట్టిగా గర్జించెను 
అప్పుడే ధ్యానమాలిని యను రాక్షసి రావణుని కౌగలించుకొని ఇట్లు పల్కేను


మహారాజా మనుష్య స్త్రీని వదలి నాతో క్రీడింపుము సుఖము కల్గును 
దీనురాలైన మానవజన్మురాలైన సీతతో నీకు ఏమి సుఖము కల్గును
ఓ రాక్షసేస్వర నీ బాహు బలము, నీ దివ్యములైన ఉత్తమ భోగములను 
బ్రహ్మాదేవుడు ఈమెకు నీతోసుఖము రాసిపెట్టలేదు ఇదినిజమై యుండెను 


ప్రేమలేని స్త్రీతొ పురుషుడు కామించినచో వాని శరీరమునకు తాపము కల్గును 
ప్రేమ ఉన్న స్త్రీతొ పురుషుడు కామించినచో వానికి మంచి ఆనందము కల్గును
అని పల్కుతూ ఉన్నప్పడు రావణుడు పదేపదే చూస్తు గట్టిగా నవ్వు చుండెను 
ద్యానమాలిని మేఘం లాంటి వాడ్ని కౌగలించుకొని, పైకి లేవతీసుకొని  వెళ్ళెను 


ప్రజ్వలించు భాస్కరుని బోలి ఉన్న, ఎర్రని నయనాలు ఉన్న రావణుడు బయలుదేరెను 
దేవ- గాంధర్వ- నాగ, కన్యలు నలుమూలలా అతనిని చుట్టి తీసుకొని పోయెను 
ధర్మమార్గములో ఉన్న సీతను బెదిరించి, మన్మధ మోహితుడైన రావణుడు ఉండెను
భూమిని కంపింప చేయుచూ, కామపీడుతుడై భార్యలతో భావనముకు వెళ్ళెను 


శ్రీ సుందరకాండ 22వ సర్గ సమాప్తము   
 





  








Wednesday, 6 May 2015

21. ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (21వ సర్గము)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:


రచయత ,మల్లాప్రగడ రామకృష్ణ
 21 వ సర్గ (వాల్మికి రామాయణములోని 34 శ్లోకాల  తెలుగు వచస్సు)
("నీవు రామునితో పోల్చుటకు కూడ తగని తుచ్చుడవు " అని 
నిదించుచూ సీత రావణునికి భోదించుట )

భయంకరుడైన రావణుడు ప్రేమ పూర్వకముగా నెమ్మదిగా పల్కిన వచనములను సీత వినెను 
సుందరమైన కటి ప్రదేశమున కలదియును, భర్త కొరకు రోదనము చేయు చున్నదియును
భయముచే వనకుచున్నదియును, పతినే ధ్యానించు చున్నదియును, తపస్వినియును 
మిక్కిలి యార్తియై, దీనమైన స్వరము కలదై,  సీత మెల్లగా సమాదానముగా ఇట్లు పలికెను


మలినమైయున్న, స్మితభూషితయగు సీత ఒక గడ్డి పరకను రావణునికి తనకు మద్య ఉంచెను 
ప్రత్యక్షముగా రావణునితో మాట్లాడుట ఇష్టములేక వణకుచు తలవంచుకొని ఇట్లు పలికెను 
నీ మనస్సు నామీద నుంచి మరల్చి, నీ భార్యలపైకి త్రిప్పి  ప్రేమించుము నీ భార్యలను
పాపకర్ముడైనవాడు  సిద్ధిని పొందుటకు కర్హుడు కానట్లు నీవు నన్ను కోరుట అనర్హుడవేయును   


రావణుని వైపు  'వీపు '  ఉంచి ఈ విధముగా పల్కేను 
ఓ రావణా నేను ఉత్తమ వంశములో పుట్టినాను 
ఉత్తమ వంశానికి కోడలుగా వెళ్ళినాను 
నిద్యమైన ఈ కార్యాన్ని నేను చేయ జాలను 


ఓ నిశాచరా పరిశీలించుము, సజ్జనుల ధర్మమును, సత్పురుషుల నియమములను 
ఓ రావణా నీ భార్యలు ఎట్లు రక్షింప దగినవారో, ఇతరుల భార్యలను కూడా రక్షించవలెను
నిన్నే ఆదర్శంగా, నీ ప్రేమనే పొందాలని తపనతో ఉన్న భార్యలను సుఖపెట్టమని హెచ్చరించెను 
శ్రీ రామ చంద్రుని భార్యను, దశరధ మహారాజు కోడలిని, జనకుని కూతురిని, నీకు ఉపయుక్తను కాను 


చపల స్వభావుడవై నీ భార్యలతో సంతృప్తి పడక కోల్పోవుచున్నావు ఇంద్రియములను
తెలుసుకో రావణా పర భార్యలను చేపట్టి పరాభవించుట వళ్ళ పతనమునకు హేతువగును 
నీ బుద్ధి, సత్పవర్తన లేక విపరీతముగా, మూర్ఖముగా ప్రవర్తించు చున్నదియును 
లేనిచో నీకు ఆచార విరుద్ధమైన విపరీతపు ఆలోచనలు ఎట్లు కల్గును?


యుక్తా యుక్త వివేకముగల పండితులు చెప్పిన హిత వాక్యములను 
మంచివారి మాటలను లెక్క చేయుటలేదు, చూసెదవు  రాక్షసుల వినాశములను
మనసు అదుపులో లేకుండ రాజు అమార్గమునందు ప్రవర్తించు రాజ్య పరిపాలనలోను 
ఐశ్వర్య సంపన్నము లైన, రాష్ట్రములు, నగరములు కూడా నాశనమగును 


ఓ రావణా నీ అపరాధము వలన ఈ లంకా నగరవాసులకు శిక్ష పడును 
అట్లే నీవు జయించి తెచ్చిన రత్నరాశులన్ని బూడిదలో పోసిన పన్నీ రగును 
ధీర్ఘదృష్టి లేని పాపాత్ముడైన రాజు, చేసే పనుల వల్ల కుటుంబం సర్వ నాశనమగును 
అట్లే పాపకర్ముని యొక్క వినాశమును సకల భూతములు అభి నందించును   


రావణా నేను ధనముచేగాని, నీ ఐశ్వర్యముచేగాని, ఆకర్షింప బడు దానను కాను 
సూర్యుని నుండి కాంతి ఏవిధముగా వేరు కాదో, అట్లే నేను రాముని నుండి వేరుకాను 
నగరవాసులు మన అదృష్టం కొలది ఈ క్రూరునికి ఎట్టి ఆపద వచ్చునో అను కొనును 
రావణా నీవు చేసిన పనికి నీచె పీడింప బడిన వారందరు సంతోషము పొందును


ఇంత కాలము నేను రాముని భుజమును తలకడగా ఉపయోగించు కొన్నాను
రాముని వద్ద సుఖముగా నిద్రించిన నేను ఇతరుల భుజములపై ఎట్లు తలనిడుదును?
   నేను ధరానాదుడైన శ్రీ రామచంద్రుని కొరకు బ్రహ్మ చర్యవ్రతమును అవలంభిచు చున్నాను 
ఈ సమావర్తన వ్రతము పూర్తి చేసుకొని విదితాత్ముడైన విద్యవలె నేను ఉపయుక్తమగు భార్యను 


ఒరావణా అరణ్యములో ఆడేనుగును
 గజరాజుతో కులుపుట నీకర్తవ్యమగును
అట్లే నీవు నన్ను నా భర్త యగు రామచంద్రుని 
వద్దకు పంపుట యుక్తమగును
నీవు  లంకను రక్షిమ్చు కోవలెనన్నచో కలుపుము పురుషోత్తమునితో స్నేహమును 
ఓ నిశాచరా  శ్రీ రామచంద్రునితో మిత్రత్వము పొందిన అంతా శుభము కల్గును 


ఓ రాక్షస రాజా శ్రీరాముడు స్వర్వధర్మ కోవిదుడుగను, శరణాగత వత్చలుడుగను
లోకమర్యాదను తెలిసిన రామున్ని అనుగ్రహము పొందిన నీకు శుభమగును
నీవు జీవించ దలచినచో రామునితో మైత్రి పొందిన నీ కుటుంబ  నాశనము ఆగును
నీవు నన్ను నిగ్రహయుతుడవై నా భర్త వద్దకు పంపిన నీవు మరణమును జయించ గల్గును


రావణా నన్ను రాముని వద్దకు తిరిగి  పంపివేసినచో నీకు క్షేమమగును
నీవు మరో విధముగా ఆలోచించిన మరణము తప్పక కల్గును
ఇంద్రుని వజ్రాయుధము నిన్ను ఎమీ చేయలేక పోవచ్చును
కాని రాముడు నిన్ను క్షమించక తప్పక సంహరించును 


శ్రీఘ్ర కాలములో  రామ లక్ష్మణులు ద్రుడమైన కణువుల వంటి భాణములను
రావణా నీవు చూడ గలవు లంకా నగారము చుట్టి వేసే సర్పాల భాణములను
దిక్కులు పెక్కటిల్లే రాముని ధనస్సు నుంచి వచ్చే ధ్వనులను వినవచ్చును 
యముడు నిన్ను విడిచినా ,నీవు రామ భాణమునకు తప్పక మరణించవచ్చును

రామ లక్ష్మణుల భాణములతో ఈ లంకా నగరమంతా నిప్పులు కురియును
బలవంతులైన రాక్షసులందరిని వరుస క్రమముగా సంహరించ గల్గును 
గరుత్మంతుడు సర్పములను చంపినట్లుగా రామచంద్రుడు రాక్షసులను చంపును 
రావణా నీవు నన్ను అపహరించి చెడ్డ పని చేసితివి చూసెదవు ఫలితమును 

విష్ణువు మూడడుగులు వేసి రాక్షసుల లక్ష్మి ని తీసుకొని వెళ్ళెను 
రాముడు శీఘ్రముగా నన్ను నీవద్దనుండి తీసుకొని పోగాల్గును
  రామలక్ష్మణులు లేని సమయమున మాయచేసి నన్ను తెచ్చినను  
కుక్క పెద్ద పులి ఎదుట నిల్వనట్లు, నీవు రామునిఎదుట నిల్చుటే కష్టమగును 


శ్రీ రామచంద్రుడు, సౌమిత్రి సహితుడై తమ భాణములతో నీ ప్రాణములను 
సూర్యుడు అల్పమైన ఉదకమును హరించినట్లు శీఘ్రముగనె హరించ కల్గును 
యుద్దములో అన్నదమ్ములనిద్దరిని నిగ్రహించుట నీకు అసంభవమగును ఇద్రునితో వృతాసురుడు నిల్వనట్లు, రామలక్ష్మనులతో నీవు యుద్దము చేయలేవును 


రావణా నీవు కైలాస పర్వతమునకు పారి పోయినను
అలకాపురి వెళ్లి కుబెరునివద్ద  దాగి కొనినను
రాజైన వరుని వద్దకు పోయి  అర్ధించినను
దక్కిన్చుకోలేవు రాముని నుండి నీ ప్రాణాలను 

శ్రీ సుందరాకాండ 21వ స్వర్గ సమాప్తము
  

Sunday, 3 May 2015

20. ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (20వ సర్గము)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:




 20 వ సర్గ (వాల్మికి రామాయణములోని 36 శ్లోకాల  తెలుగు వచస్సు)
(రావణుడు సీతను లోభ పెట్టుట )  
రాక్షస స్త్రీలచె ప్రరివేష్టింప బడిన స్తీతను 
ఆనందరహిత యగు, తపస్విని యగు సీతను
రావణుడు సీతను సమీపించి మధుర వాక్యములతోను 
సాభిప్రయములగు మాటలతో లోబరుచు కొనుటకు ప్రయత్నించెను

ఏనుగు తొండము వంటి సుందర మైన తొడలు గల సీతను
స్తనోదరములను కనబడ కుండా కప్పుకొను సీతను
భయముతో శరీరమును ముడుచుకొని కూర్చున్న సీతను 
రావణుడు ప్రాధేయ పూర్వకముగా, నెమ్మదిగా వేడుకొనెను 

ఓ సర్వాంగ సుందరి, ఓ విశాలాక్షి, నిన్ను నేను ప్రేమించు చున్నాను 
ఓ ప్రియా, ఓ సర్వలోకమనోహరి,నన్ను ఆదరించమని అర్ధించు చున్నాను 
ఓ లలనా నిన్ను భయపెట్టు రాక్షసులు లేకుండ చేయు చున్నాను
నాకు నీపై ప్రేమ అధికముగా ఉన్నది, నావల్ల నీకు భయము లేకుండా చేసెదను 

ఓ సీతా పరభార్య గమనము చేపట్టుట రాక్షస శాశ్విత ధర్మమేయును
ఓ జానకీ పరస్త్రీలను అపహరించి,బలాత్కరించుట రాక్షస స్వధర్మేయును 
ఓ మిధిలేశ నందినీ నన్ను ప్రీ,మించే వరకు నేను నిన్ను తాకనే తాకను
నన్ను మదనుడు తన యిచ్చవచ్చినట్లు భాదించిన నేను ఓర్పు
 వహిస్తాను 

జడలు కట్టిన కేశపాశములు గల సీతను
కటిక నేలపై సయనిస్తున్న సీతను
చింతలో మునిగి ఉపవాసము చేస్తున్న సీతను
రావణుడు నెమ్మదిగా నీకు ఇవి తగనవి కావు అని హెచ్చరించెను

ఓ సీత నీవు విచిత్ర పుష్ప హారములను దరించవలెను 
ఓ సీత నీవు వివిధములైన దివ్యవస్త్రములను ధరించవలెను
ఓ సీత నీవు ఘంధం, చెందన లేపనములను పూసుకొనవలెను
రావణుడు సీత వద్దకు చేరి పానద్రవ్యములను తీసుకొని నాతోసుఖము అనుభవించ వలెను

ఓ సుందరి నీవు స్త్రీ రత్నమవు నిన్ను మించినవారు ఈ లోకం లో లేరును 
 బంగారు వర్ణముగల నీ శరీరమునకు ఆభరణములు అమితానందము నిచ్చును
నావద్ద ఉన్నవారందరూ భూషనాలు ధరించినట్లు నీవు ధరించావలేను 
నీ సౌఖ్యము నాకు, నా సౌఖ్యము నీకు కావలెనని రావణుడు పలికెను

యవ్వనము గడచి పోతున్నది, త్వజించకుము సుఖములను
నదులు ప్రవాహముల వలే పోయినా, వెనుకకు రాకుండా ఉండును 
ఓ శుభదర్శనురాలా, రూప నిర్మితయగు ఆవిశ్వకర్త నిన్ను శ్రుశిమ్చెను
పిదప రూపవంతులను సృజించుట మానివేసేనని రావణుడు సీతతొ పలికెను 

ఓ మైథిలీ, రూపయవ్వన శాలినీ, నిన్ను చూసిన పిదప ఎవ్వడైనను
సాక్షాత్తు ఆ బ్రహ్మకు కుడా మనసు క్షోభ పడక తప్పదియును
విశాలమైన కటిప్రదేశములో ఉన్న నీముఖము చంద్ర బింబము వలెను
నీ శరీరములొ ఎ అవయవములు చూచు చున్నానో, వాటి యందు నా నేత్రములుండును

ఓ వైదేహి నేను అనేక మంది ఉత్తమ జాతి స్త్రీలను తీసుకొని వచ్చి యున్నాను
ఓ జానకీ పట్టమహిషివై నా భార్యలపై,  నాపై అధికారము చూప వచ్చును
ఓ యశశ్వని గమనించుము, నా యొక్క వృద్ధిని, నాయొక్క                 ఐశ్వర్యమును
రావణుడు సీతతో, ఓ విలాసిని నా రాజ్యము నీకు ధారపోయుచున్నాను

ఓ భామిని నీకొరకు ఈ భూమినంతను జయించి నీ తండ్రి జనకునకు ఇచ్చెదను
ఓసీత నాతో సమానమైన వారు ఈ లోకములో ఇంత వరకెవ్వరు పుట్ట లేదనెను
యద్ధములో యదిరించు వారెవ్వరు లేని మహా బలపరాక్రమ వంతుడను
యుద్ధములో సురులను, అసురులను కూడా ఓడించి వారిధ్వజములు ఛేదించినాను





ఓ చారుముఖీ నీవు  అలంకరించు కుంటే చాల అందముగా ఉండును
హి భీరు చక్కగా అనుభవించుము  మధ్యపానమును, స్వేచ్చగా భోగములను
ఓ యశశ్వని నీ ఇష్టము వచ్చినట్లు భూమిని, ధనమును ప్రధానము చేయమనెను
నేను కుడా నీ మీద  ప్రేమతో నా భాగ్మమంతయు  నీకు దార పోస్తున్నాను

ఒ సీత నీవు భోగములను అనుభవించుము, నీవు  పిలిచినా వచ్చెదను
నాయందు విశ్వాసము ఉంచుము, నీవు నిర్భయముగా ఇక్కడ ఉండ వచ్చును  
నాయందు అనుగ్రహము చూపి, నీ  ఇష్టమైన కోరికలు తీర్చుకొన మనెను
నీ భంధువులు యదేశ్చగా సుఖ భోగములను అనుభవించుటకు అనుమతిస్తున్నాను



చూడు సీత నారచీరలు ధరించిన ఆ రామునితో నీకు ఏమి సుఖ ముండును 
విగత లక్ష్మీశుడును నగు రాముడు వనముల పట్టి తిరుగుచూ నీవు కానరాక మరిచియుండును  
రాముడు జీవించి ఉన్నాడో లేదో అని నేను అనుమానించు చున్నాను 
ఇంతవరకు నీ దరికి కూడా రాలేని వానిని ప్రేమించుట ఎందుకు అని రావణుడు సీతతో వినమ్రతతో పలికెను   



ఒకే పంక్తులుగా నల్లని మేఘములచే కప్పబడిన చంద్రుని వెన్నల వలెను 
నిను పొందుట యటుంచి, చూడటానికైనా రాని రాముని గురించి  ఆలోచనలు మాను మనెను
హిరణ్యకశిపుడు ఇంద్రుని చేతిలో చిక్కిన భార్యయైన కీర్తిని పొందగల్గెను
కాని రాముడు మాత్రము నాచేజిక్కిన నిన్ను నా నుండి విడి పించుకో లేకుండెను 



ఓ విలాసవతి సర్పమును గరుత్మంతుడు హరిన్చినట్లు నేను నిన్ను హరించాలను కుంటున్నాను 
ఓ సీత నీ శల్యమైన రూపమును చూచిన తర్వాత నా భార్యలతో నేను ఆనందం పొంద లేకున్నాను 
 నీ రూపానికి తగ్గ కళ్లను చూసిన నేను, నిన్ను వదలి విడిచి ఉండ లేకున్నాను 
ఒసీత లక్ష్మీ దేవినిసేవిన్చినట్లు నిన్ను నాభార్య లందరూ సేవిన్చునట్లు వప్పించెదను 


నేను మూడు  లోకాల్లో సంపాదించిన దంతయు నీకు ప్రేమతో ధార పోయు చున్నాను 
విలాస స్వభావముగల సీత నీకు నేను ధనరాసులను, భూమిని ఇచ్చెదను   
ఓ సీతా నీ భందువు లందరినీ పిలిచి సుఖముగా ఆనందము పొంద వచ్చును 
ఒ భీరు నీవు మధువుని సే వించి, విహరించి, క్రీడించి ,భోఘములతో సుఖపడ వచ్చును

ఓ సీత చివరిగా నేనుచెప్పుచున్నాను రాముడికన్నా తపస్సుచేత శక్తి వంతుడను
నేను తెలివిచేత, పరాక్రమముచేత, అనేక ,వేలమంది రాజులను జయించాను 
ఒసీత నీ రాముడు నా తేజస్సులోను, కీర్తిలోను, భక్తిలోను  సమానుడు కాడును 
నన్ను సుఖ పెట్టుము, నీకు కుబెరుని సంభందించిన రత్నములు ఇచ్చెదను 

ఓ చారుసీల ఇరువురము విహరించెదము, ధరించుకొని రమ్ము  భంగారు ఆభరణములను 
సంచరించేదము, సముద్ర తీరములను, పుష్పించిన తీర సమూహములను
బ్రమర యుక్తములను, సీతల పవనములను, సుఘంధ పరిమళాలను  
ఉన్న ఉద్యానవనములయండు విహరించి మనస్సు ప్రశాంత పరుచు  కొన వచ్చును 



శ్రీ సుందర కాండ నందు 20 వ స్వర్గ సమాప్తము