Sunday, 17 May 2015

22. ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (22వ సర్గము)


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:


రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

 22 వ సర్గ (వాల్మికి రామాయణములోని 46 శ్లోకాల  తెలుగు వచస్సు)
("రావణుడు సీతకు రెండు మాసములు గడువు ఇచ్చుట, సీత రావణుని నిందించుట, రావణుడు సీతను భయపెట్టి ఆమెను రక్షించు చుండ వలసినదిగా
 రాక్షస స్త్రీలను ఆదేశించుట, 
స్త్రీలతొ కలసి అంత :పురమునకు పోవుట ")    

రాక్షసేశ్వరుడు సీత యొక్క పరుషమగు మాటలు వినెను 
రావణుడు వినమ్రతతో ప్రయదర్శని యగు సీతతొ బదులు పల్కేను
లోకములో స్త్రీలను బుజ్జగించిన స్త్రీలు పురుషులకు లొంగి పోవును 
కాని నీ విషయమున నేను ఎంత ప్రమగా పల్కిన తిరస్కరీస్తున్నావు  నామాటలును 

ముఖ్యముగా మనుష్యులలో గల కామము చాల వక్రంగా ఉండును
కామము ఎవనియందు నిబద్దమగునో వానియందు స్నేహము, జాలి కల్గును
నీ యందు నాకు కల్గిన కామము చెడు మార్గమునందు పరుగెత్తు చున్నాను 
సారధి గుర్రములను నిగ్రహించినట్లు, నేను కామాన్ని నీకోసం  అనుచు కొనుచున్నాను
 

ఓ సముఖీ కపటవనవాసము చేయు రాముని యందు అనురక్తిరాలు వైనను 
నన్ను అవమానించిన, వదార్హురాలు వైనను, నిన్ను వధించ  లేకుండా ఉన్నాను 
ఓమైథిలి నీవు  పల్కిన పరుషమైన ఒక్కొక్కమాటకు 
నిన్ను హింసించ వలెను 
దారుణముగా నిన్ను వధించచుట చాల యుక్తము కాని నీమీద ప్రేమతో చేయలేకున్నాను 


క్రొధావేశముతో ఉన్న రావణుడు సీతతో ఇట్లు బదులు పల్కేను
ఓ సీత నేను నీకు రెండు మాసములు గడువు ఇచ్చి ఉన్నాను
ఓ అందమైన వర్ణము గలదాన, అప్పటిదాకా నేను పాలింప వలసి యుండును 
ఓ సుందరి గడువు తీరిన వెంటనే నీవు నాశయనము పైకి రావలెనురెండు మాసములు తర్వాత నీవు నన్ను భర్తగా అంగీకరించక పోయినను
నా ప్రత:కాల భక్షనమునకై నిన్ను ముక్కలు ముక్కలుగా భేదింప  గల్గును
రావణుడు సీతను భయపెట్టుటను దేవ నాగ  గాంధర్వ కన్యలు చూసెను 
వికృతమైన కన్నులుగల దేవ నాగ  గాంధర్వ కన్యలు మిక్కిలి విషాదము పొందెను


రాక్షసరాజు చేత భయపెట్టుచున్న సీతను కొందరు స్త్రీలు పెదవులతోను 
మరికొందరు ముఖములు, నేత్రములు కదల్చి సీతను ఓదార్చెను 
స్త్రీలచే  ఓదార్చబడిన సీత రావణుడు  చేసే వింత చేష్టలు చూసెను
రావణుడితో సీత సచ్చరిత్ర, బలగర్వితమునగు వాక్యములు పల్కేను 


ఓ రావణా ఈ నగరము నందు నీ మేలు కోరు వారెవరు లేరనుకొను చున్నాను 
బల గర్వముతొ పెద్దల మాటలను పెడచేవి పెట్టుచున్నా వని నేను  అనుకుంటున్నాను
దేవేంద్రునికి సచీదేవివలె, ధర్మాత్ముడైన రామునికి భార్యగా  యున్నాను   
మూడులోకముల్లో నీవు దప్ప మరియోక్కడు తనమనస్సులో నైన నెట్లు కోరు కొనును ?


ఓ రాక్షసాధమా అమితమైన తేజస్సుగల రామునికి భార్యనై యున్నను 
నీవు పాపపు మాటలు పలికి నందుకు, నీకు తప్పక శిక్ష పడును 
వనములో మదించిన ఏనుగును కుందేలు ఎట్లు ఎదిరించ కల్గును
అట్లే కుందేలువు నీవు, ఎదిరించలేవు గజము వంటి ధర్మాత్ముడను 


ఓ అనార్యుడా, నన్ను చూచు చున్న నీ కృష్ణ పింగళ నేత్రములు నేలపై ఎలా పడ కుండా ఉండెను
ఓ రాక్షసరాజ నీవు పౌరుషముగా నాతో అన్నమాటలకు నీ నాలుక ఎలా ఊడిపడి పోకుండా ఉండెను
నీవె సిగ్గు పడాలి, ఇక్ష్వాకునాదుడైన నా భర్త  శ్రీ రామచంద్రుని తిరస్కరించుటను

ఓ రాక్షసాధమా నీవు నా భర్త కంట పడ నంతవరకు ఎన్ని మాటలు పల్కిన చెల్లును 

ఓ రావణా, నాకు శ్రీ రామచంద్రుని ఆజ్ఞ లేకుండుట వలనను 
నేను నిత్యమూ తపోవ్రతము అవలంభించు యుండుట వలనను 
  ఓ దశగ్రీవా, నేను నిన్ను భస్మము చెయదగిన దానినై యుండినను 
నా పాతివ్రత్య తేజముచే నాభర్త ఆజ్ఞ లేకపోవుట వలన భస్మము చేయకుండా ఉన్నాను


నేను శూరుడను, నేను కుబేరు సోదరుడను అనంత బల సంపన్నుడను, అన్నను 
రావణా మాయతో నాభర్త లేని సమయమున నన్ను అపహరించి తెచ్చుట ధర్మ మెట్లగును
రావణా శ్రీ రామచంద్రుని భార్యనగు నేను  నీవు అపహరించుటకు వీలుకాని దానను
నాకు సందేహములేదు, దైవమే నీ వధకు నన్ను అపహరించి తెచ్చుట కారణమగును 


రావణాశురిని వర్ణన
 రావణుడు నల్లని మేఘము వంటి శరీరము కల్గి ఉండెను 
అతని భుజములు, కంఠం చాల పెద్దవిగా ఉండెను 
అతని బలము నడక సింహము బలము వలే ఉండెను
అతని జిహ్ఫగ్రము, నేత్రములు మండు చున్నట్లు ఉండెను


అతడు కిరీటము ధరించుట వల్ల ఎత్తుగా ఉండెను
అతడు ఎర్రనిపూవులను, ఎర్రని వస్త్రములను ధరించెను 
శివ భక్తితో, శక్తి, మాయ మంత్రులు తెలిసినవాడును 
పుత్తడి దండ కడియములను ధరించినవాడును 


నల్లగా లావుగా ఉన్న త్రాడును నడుమునకు కట్టు కొన్నవాడును
సముద్రమధనమునందు వాసుకిని కట్టిన మంధర పర్వతమువలె ఉండెను   
పర్వతమువలె ఉన్న రావణుడు బాగా బలసిన భుజములతోను
రెండు శిఖరములతో కూదిన మందార పర్వతమువలె ప్రకాశించెను 


బాల సూర్యు డి వలె ఎర్రగా ఉన్నకుండలములు అలంకరించు  కొన్నవాడును 
ఎర్రని చిగుళ్ళు,పుష్పములుగల రెండు ఆశోకవృక్షములతొ పర్వతమువలెను 
కల్పవృక్షమువలె ఉన్న అతడు మూర్తీభవించిన వసంతము వలే ఉండెను 
చక్కని భూషణాలు ధరించిన స్మసానమునందున్న మండపము వలే ఉండెను 


సీతను చూచుచున్న రావణుడు క్రోధముచె ఎర్రబడిన కన్నులతోను
త్రాచుపాము వలె బుసలు కొట్టుతూ కోపములో సీతతో ఇట్లనెను
ఓ సీతా నీవు నీతి మాలిన అర్ధహీనుడైన రాముని మరువమనెను 
సూర్యుడు తన తేజముతో సంధ్యను నాశము చేసినట్లు నేను నిన్ను నాశము చేసెదను


భయంకరముగా ఉన్న రాక్షస స్త్రీల అందరిని రావణుడు ఆజ్ఞాపించెను 
ఓ రాక్షస వనితలారా అనుకూల ప్రతికూల వాక్యముల తోడను 
సీత నాకు వశమగు నట్లు, సామదాన భేదో పాయములతోను 
దండ భయముచె నైన సీతను లొంగదీయుడని స్త్రీలతొ పల్కెను


భయ్యంకరాకారము గల రాక్ష స్త్రీలను రూపాలను వర్ణించుతూ  ఆజ్ఞాపించెను "సీతను లొంగదీయుడని చెప్పి భవనములోనికి వెళ్ళెను 

పెద్ద నోరు పొడవైన నాలుక గల స్త్రీలతోను
నాలుక, ముక్కు, చెవులు, లేని స్త్రీలతోను
సింహము, ఆవు, పంది, ముఖముగల స్త్రీలతోను
మండుచున్న కేశములు కలిగి ఉన్న స్త్రీలతోను


ఒక కన్ను, ఒకే చెవి, ఒకే చేయి ఉన్న స్త్రీలతోను
ఆవు, ఒంటె, ఏనుగు, చెవులు గల స్త్రీల తోను
వ్రేలాడు చెవులు, వేలాడు స్తనములుగల స్త్రీలతోను 
ఏనుగు,గుఱ్ఱము, ఆవు. పాదములు గల స్త్రీలతోను


పెద్ద పాదములు, చన్న పాదములు గల స్త్రీలతోను
పెద్ద పొట్ట పెద్ద చేతులు, పొడుగు కాళ్ళు గల స్త్రీలతోను
శరీరము మోత్తము రోమాలతో ఉన్న స్త్రీలతోను
నాలుక, ముక్కు, చెవులు, లేని స్త్రీలతోను


శత్రు భయంకరుడగు రావణుడు ఒకవైపు సీతను చూచు చుండెను 
మరోవైపు రాక్షస భయం కల్గించే రూపలు గల స్త్రీలను ఆజ్ఞాపించెను 
కామంతో,క్రోధంతో ఉన్న రావణుడు సీతవైపు చూసి గట్టిగా గర్జించెను 
అప్పుడే ధ్యానమాలిని యను రాక్షసి రావణుని కౌగలించుకొని ఇట్లు పల్కేను


మహారాజా మనుష్య స్త్రీని వదలి నాతో క్రీడింపుము సుఖము కల్గును 
దీనురాలైన మానవజన్మురాలైన సీతతో నీకు ఏమి సుఖము కల్గును
ఓ రాక్షసేస్వర నీ బాహు బలము, నీ దివ్యములైన ఉత్తమ భోగములను 
బ్రహ్మాదేవుడు ఈమెకు నీతోసుఖము రాసిపెట్టలేదు ఇదినిజమై యుండెను 


ప్రేమలేని స్త్రీతొ పురుషుడు కామించినచో వాని శరీరమునకు తాపము కల్గును 
ప్రేమ ఉన్న స్త్రీతొ పురుషుడు కామించినచో వానికి మంచి ఆనందము కల్గును
అని పల్కుతూ ఉన్నప్పడు రావణుడు పదేపదే చూస్తు గట్టిగా నవ్వు చుండెను 
ద్యానమాలిని మేఘం లాంటి వాడ్ని కౌగలించుకొని, పైకి లేవతీసుకొని  వెళ్ళెను 


ప్రజ్వలించు భాస్కరుని బోలి ఉన్న, ఎర్రని నయనాలు ఉన్న రావణుడు బయలుదేరెను 
దేవ- గాంధర్వ- నాగ, కన్యలు నలుమూలలా అతనిని చుట్టి తీసుకొని పోయెను 
ధర్మమార్గములో ఉన్న సీతను బెదిరించి, మన్మధ మోహితుడైన రావణుడు ఉండెను
భూమిని కంపింప చేయుచూ, కామపీడుతుడై భార్యలతో భావనముకు వెళ్ళెను 


శ్రీ సుందరకాండ 22వ సర్గ సమాప్తము