Sunday, 31 May 2015

24. ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (24వ సర్గము)


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ: 24వ సర్గ (వాల్మికి రామాయణములోని 48 శ్లోకాల  తెలుగు వచస్సు)
(" సీత రాక్షస స్త్రీల మాటలను తిరస్కరించుట, రాక్షస స్త్రీలు సీతను భయపెట్టుట ")    


ఓ సీతా నీవు సమస్త  ప్రాణులకును మనోహరమైన అంత: పుర వాసమును 
ఏల వప్పుకోవు, మిక్కిలి విలువగల శయణాలున్న రావణుని భవనమును
రాక్షసస్త్రీలు సీతాదేవితో పలుకరాని, అప్రియములు, పరుషములగు మాటలు పల్కేను
నీవు మనుజుని భార్యత్వమును గొప్పగా భావించు, చేస్తున్నావా ఈ తిరస్కారాలను 

ఓ సుమంగళి మనుష్యకాంతవగు నీవు, తిరస్కరిస్తున్నావు రాక్షసత్వమును 
రాక్షసరాజైన రావణుడు మూడు లోకముల ఐశ్వర్యమును 
అతన్నే భర్తగాపొంది, గౌరవమర్యాదలను పొందు సుఖమును
రాక్షస రాజును ప్రేమించి, రామునిపై ఉన్న ప్రేమను మరల్చమనేను


రాక్షస స్త్రీల మాటలు విని, కన్నీళ్ళు నిండిన నేత్రములతొ ఇట్లు పల్కేను
మీరందరు  కలసి, లోకవిరుద్దముగా చెప్పిన మాటలు పాపపు మాటలని తెలియును
మనుష్య స్త్రీ రాక్షసునికి భార్య కాజాలదు, మీరందరు తినిన తిందురు కాక,మీరుచెప్పినది చేయజాలను 
ధీనుడు కానిమ్ము, లేక రాజ్యహీనుడు కానిమ్ము నాభర్తే  గౌరవింపదగిన వాడై యుండును 

   
మహా భాగ్య సంపన్నురాలగు శచీదేవి దేవేంద్రు సేవించి నట్లును
అరుంధతి- వసిష్టుని, రోహిణి - చంద్రుని  సేవించు నట్లును 
లోపాముద్ర-అగస్త్యుని,సుకన్య-చ్చవనుని సేవించి నట్లును
సావిత్రి-సత్యవంతుని, శ్రీమతి-కపిలుని సేవించి నట్లును


భీమరాజు కూతురు దమయంతి, నలుని సేవించి నట్లును 
మదయంతి సౌదాసుని, కౌశిని - సగరుని సేవిన్చినట్లును
సువర్చల సూర్యుని నిత్యము అనురక్తియై ఉండినట్లును 
నేను కూడా ఇక్ష్వాకువరుడగు శ్రీరామచంద్రుని అనువర్తింతును 


సీత వాక్యాలు విన్న రాక్షస స్త్రీలు పరుషముగా మరలా పల్కేను
హనుమంతుడు సింసుపావృక్షమునుండి  స్త్రీలు బెదిరించే మాటలు వింటూ  ఉండెను
ఆపాదమస్తకము కంపించుచున్న సీతను స్త్రీలు ఆక్రమించి వేదించ సాగెను
రాక్షస  స్త్రీలు పెదవులను నాకుచూ ప్రజ్వలించుచు సీతను భయపెట్టేను


భయంకరమైన రాక్షసులు గండ్ర గొడ్డలిని తెచ్చి నరుకుతామనెను
ఈ స్త్రీ రాక్షసాదిపతికి తగిన భార్య  కాదని పెద్దగా అరిచెను 
రాక్ససస్త్రీలు చేస్తున్న బెదిరింపులకు సీత దేవి అశ్రుబిందువులను రాల్చెను 
విశాలక్ష్మి యగు సీత సింసుపావృక్షము వద్దకు వచ్చి శోకమగ్నమై యుండెను


భయంకరులగు రాక్షస్త్రీలకు చిక్కినదియును, దీన మతియును 
మలినవస్త్రములొఉన్న సీతను నలు వైపుల నుండి హింసించెను
భయంకరమైన, మిక్కిలి లోతుగా అంటుకు పోయిన ఉదరము కలదియును 
మూర్తీభవించిన కోపమువలె వికట అనే రాక్షసి సీతతొ ఇట్లు పల్కేను


ఓ సీత నీవు భర్త విషయమున చాల స్నేహమును ప్రదర్సిమ్చితివి అది చాలును 
తెలియదా నీకు ఏ విషయమునైన అతిగా నుండుట దుఖమునకు దారి తీయును 
నీకు మంగళమగుగాక, చాలాపరితోషముకల్గినది, పరిపాలించితివి మానవుల శిష్టచారములను
ఓమైథిలి పరాక్రమము గలవాడు,సర్వరాక్షసాదిపతియగు రావణుని భర్తగా స్వీకరించమనెను 


ఓ సీత మానవుడు, ధీనుడు, అయిన రామున్ని విడిచి పెట్టుమనెను 
నీవు దివ్యమైన అంగరాగాములను శరీరమునకు పూసు కొనమనెను
  ఓ సీత నీవు శ్రేష్ట మైన అలంకారములను అలంకరించు కొనమనెను 
ఓ సీత త్యాగశీలుడైన రావణునికి భార్యాయై సుఖమును పంచవలెను 


మంగళ ప్రదురాలైన సీత అగ్నిదేవుని భార్యయయిన స్వాహాదేవి వలెను
ఇంద్రుని భార్య యైన శచీదేవి వలే లోకాధీశురాలువగుము అనెను
రాముని ఆయుర్దాయముతీరే, నీకేమి ప్రయోజనమున్నది అని పల్కేను
మేముచెప్పినట్లు వినకపోయిన మేమందరమూ కలసి నిన్ను తినేద మనేను 

మిక్కిలో నీచ బుద్దిగల ఓ మైథిలి నీవు బ్రతికి ఉన్నావు మా జాలివలనను
నీయొక్క అసందర్భపు మాటలను సహించు చున్నాము మా మృధు స్వభావము వలనను
నీవు ఇతరులు రాలేని సముద్రపు ఈవతల ఒడ్డుకు తీసుకు వచ్చి యుంచేను 
నీవు రావణ గృహమున బందీలొఉన్నావు వినుము మాయోక్క హితమగు వాక్యములను

 సాక్షాత్తు గా దేవెంద్రుడే అయినను నిన్ను రక్షింప జాలకుండును 
ఇక కన్నీరు రాల్చుట విడువుము, త్యజిమ్పుము వ్యర్ధమైన శోకమును
రావణునిపై ప్రీతిని కలుగజేసికొని ఆనందించి త్వజించుము నిత్యధైన్యమును ఓ బీరుస్వభావముగలసీతా స్త్రీలయొవనమెంతో  యస్తిరమో మాకు తెలియును 


నీయొక్క యవ్వనము గడచిపోకముందే యనుభవించుము భోగ సుఖమును 
రమ్యములగు ఉద్యానములను, పర్వతులపైనను, ఉపవము లందును
ఓ సుందరి వగు దేవి, వేల కొలది యత:పురస్త్రీ లందరి పై ఆజ్ఞను
రావణునితో ఓ మదవిభ్రమాక్షి సంచరించి సుఖమును పొందవలెను


నేనుచెప్పిన మాటలను విననేమి నీ హృదయమును పెకలించి 
భక్షించెదను
క్రూరదర్సనయగు చండోదరియను రాక్షసి శూలమును త్రిప్పుచూ ఇట్లు పల్కెను 
హరినశాబికమును బోలిబిత్తరి చూపులతొ, భయముచే కంపించు స్తనములు గలదియును
మరొక రాక్షస స్త్రీ, సీతను చంపి ముక్కలుగా చేసి తినవలేనని గోప్పకోరిక కల్గెను అని పల్కెను 


ఒక రాక్షసి ఈమె యోక్క మహోత్తరమైన వక్షమును
మరో రాక్షసి బిందన  సహితముగా హృదయమును
వేరే రాక్షసి అవయవములను, తల భాగమును 
విలపిస్తున్న సీతను చూచి స్త్రీల కోరికలు బయట పెట్టెను


 నులిమి చంపివేయుదుము ఈమె యొక్క కంఠంను
ఊరకనే ఎందుకు కూర్చొన వలెను అని ప్రఘన పల్కెను  
మనుష్యవనిత చనిపోయినదని అందరు కలసి చెప్పెదమనెను
ఇందు సందేహములేదు, సరే అని మహారాజుతినండి అని పల్కును

అజాముఖి అను రాక్షసి ఈ విధముగా పల్కెను
చేయుదము ఈమెను నరికి సమాన పిండములను
వివాదము వద్దు మనమందరమూ పంచుకొని తిందుమనెను 
వెంటనే పెయసామగ్రీని,పుష్ప హారములను తెమ్మనెను


అజాముఖ అను రాక్షసి నిజముచేప్పినది అని సూర్పనఖ వంత పల్కెను
వెంటనే సర్వసోకనాశికమగు సురసతెండు, తినేదము మనుష్య మాంసమును   
నికుంభలాదేవి ఎదుట నృత్యము చేసి ఆనందము పొందవచ్చును అని పల్కెను
రాక్షస స్త్రీలచె బెదిరింప బడుచున్నదియై ధైర్యమును త్యజించి ఏడ్వ సాగెను    

శ్రీ సుందరకాండము నందు 24 వ సర్గ సమాప్తము