Monday 1 June 2015

25. ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (25వ సర్గము)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:



 25వ సర్గ (వాల్మికి రామాయణములోని 20 శ్లోకాల  తెలుగు వచస్సు)
(" సీత రాక్షస స్త్రీల మాటలను తిరస్కరించుట, రాక్షస స్త్రీలు సీతను భయపెట్టుట, సీత శోకార్తయై విలపించుట ")    

పరుషముగాను, దారుణముగాను, నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన  స్త్రీల మాటలను 
సౌమ్యస్వభావముగల సీత ఏంతో  భయంతో స్త్రీల ఎదుట పెద్దగా ఏడ్వ సాగెను
సహృదయరాలగు వైదేహి మిక్కిలి భయముతో కన్నీటితో ఈవిధముగా పల్కెను
 మనుష్య స్త్రీ రాక్షసునికి భార్య కాజాలదు,  నన్ను హింసించిన మీ మాటలను ఒప్పుకోను 


రానునిచే బెదిరింప బడుటచే సోకార్తియైన సీత శాంతి లేకుండా నుండెను 
వనమునందు తనగుమ్పునుండి వీడి తోడేళ్ళచే పీడింపబడు లేడివలే నుండెను
శరీరమును మిక్కిలి ముడుచుకోనునట్లు చేయుచూ మిక్కిలి కంపింప సాగెను 
సీత అశోకవృక్షకొమ్మను పట్టుకొని నిరాశామనస్కయై శోకముతో భర్తను గురించి ద్యానించెను

సీతాదేవి కన్నీటిశ్రావములతో విశాలమైన స్తనములు తడిగా ఉండెను 
సీత పెను గాలికి పడిపోయిన అరటివలె గడగడ వణకు చుండెను
సీతను స్త్రీలు భయపెట్టుట వలన పాలిపోయిన ముఖముగా మారెను
సీత రామునిగూర్చి చింతించుచు శోకమునకు అంతును కనుగొనజాలక యుండెను


సీత జడ కుడా కదులుచూ ప్రాకుచున్న త్రాచుపామువలె నుండెను

స్త్రీలకు ఏమిచేప్పలేక ఆమె దుఃఖముతో కన్నీరు కార్చు చుండెను 
భర్త్రువియోగ భాదతో సీత మనసు శోకముచే వ్యాకులమయ్యెను
ఆ సీత దేవి ఓరామ, ఒలక్ష్మనా, ఒఅత్తగారగు కౌసల్యా, ఓ సుమిత్ర, అని విలపించెను   

నేను ఇచ్చట క్రూరురాండ్రగు రాక్షస రక్షక భటులు పీడించ బడుటను
దు:ఖితనై రాముడు లేకుండా ముహర్త మైనను జీవించి యున్నాను
దీనిని బట్టి  స్త్రీ యైన, పురుషుడైనా మరణించ వలెనని కోరుకున్నను
పండితులు చెప్పిన మాటలు "సమయం ఆసంన్నమయే వరకు
 మృత్యువుకూడా రాదన్నది " నిజమగును 


వాయువేగహతమైన వస్తువులతో నిండిన నావవలె అనాధనై నశించు చున్నాను
అల్పమైన పుణ్యము గల దీను రాలైన నాధుడు లేని సామాన్య స్త్రీ వలెను
ఈ రాక్షస స్త్రీలకు లొంగక నాభార్తను చూడ జాలక, చెప్పుకొనేదారిలేక  జీవించి యున్నను 
నేను నీటిచే కూల్చబడిన నది ఒడ్డు వలే, గుర్తించేవారు లేక, శోకముతో నశించి యున్నాను 

పద్మ దళముల వలె విశాల మగు నేత్రములు గల వాడును
విక్రాంత మగు సింహమును బోలిన నడక నడుచు వాడును
ప్రియ వదియును, కృతజ్నుడును, అగు నా భర్తను 
అదృష్ట వంతులు మాత్రమె చూడ గల్గు చుండెను

ప్రసిద్దమైన బుద్దిగల ఆ రాముడు లేకుండా నేను జీవించ జాలను
విషముతిని జీవించుట ఎంత కష్టమో, అంత కష్టమును నను భవించు  చున్నాను
నేను దెహన్తపూర్వమున (పూర్వజన్మమున) ఎన్నో మహా పాపములు చేసి యున్నాను   
అట్టి పాపపు ప్రభావము వలననె ఇట్టి  మహా దు:ఖములు అనుభ విస్తున్నాను 

గొప్ప శోకముతో భాదపడుచున్న నాకు మరణించ వలెనని కోరిక కల్గెను 
కాని రాక్షస స్త్రీలు నా చూట్టు ఉండుట వలన మరణాన్ని పొంద జాల కున్నాను 
స్వేచ్చ నను సరించి ఈ జీవితమును త్వజించుట వీలు లేనిదియును
 ఈ మనుష్యత్వమును, ఈ పరాధినత్వమును నేను నిందించు చున్నాను 

శ్రీ సుందర కాండము నందు 25వ సర్గ సమాప్తము  

No comments:

Post a Comment