ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం రాం
శ్రీ మాత్రే నమ:శ్రీ రామ చంద్రపరబ్రహ్మనే నమ:
35వ సర్గ (వాల్మికి రామాయణములోని 80 శ్లోకాల తెలుగు వచస్సు)
("సీత కోరికను అనుసరించి హనుమంతుడు రాముని శరీర లక్షణములను, గుణములను, వర్ణించి చెప్పి నర-వానరుల మైత్రి ఎట్లు జరిగెనో చెప్పి ఆమెకు తనపై విశ్వాసము కలుగునట్లు చేయుట ")
హనుమంతుడు తెలియపరిచిన రామ సంభందమైన కధామృత వచనాలను
విని సీతాదేవి మధురమైన వాక్కుతో కొన్ని శాంత్య వచనములు పలికెను
హనుమా నీకు రామునితో గల సంభందము ఎక్కడ ఎప్పుడు ఎట్లు ఏర్పడెను
లక్ష్మణుని ఎరుగుదువు కదా, వానరులకు- నరులకు సమాగమము ఎట్లు కలిగెను
ఓ వానరా రామునికిని లక్ష్మణునికిని గల గురుతులను తెలుపవలెను
అతని ఆకృతి అతని రూపము ఎట్టిదో విన్న నాకు శోకము తగ్గును
వారిరివురి భాహువులు,ఊరువులు మొదలగు వానిని గూర్చి తెలుపవలెను
హనుమంతుడు సీత మాటలు విని రాముని గూర్చి ఉన్నది ఉన్నట్లుగా వర్ణించుటకు ఉపక్రమించెను
ఓ వైదేహి నా అదృష్టముచే నీకు తెలిసి ఉండి కూడాను
నీ భర్త అయిన రాముని ఆకారమును, లలక్ష్మణుని ఆకారమును
గూర్చి అడుగు చున్నావు నాకు చాలా సంతోషముగా ఉండెను
ఓ విశాలాక్షి నేను గుర్తించిన రాముని లక్షణములను తెలిపెదను
సీతా రాముని పద్మముల రేకులవలె విశాల మైనవియును
సమస్తమైన ప్రాణుల మనస్సును ఆకర్షించు సౌందర్యము కలవాడును
పుట్టుకతోనే మంచిరూపముతొను, దాక్షిన్యము తోను జనించిన వాడును
శ్రీ రామ చంద్రుని స్వరూపమును గూర్చి మారుతి యధాతధముగా చెప్పు చుండెను
తేజమును - సూర్యుని తో సమానుడును
ఓర్పును - భూమి తో సమానుడును
బుద్ధి యందు - బృహస్పతి తో సమానుడును
కీర్తి యందు - ఇంద్రునితో సమానుడును
సమస్త జీవలోక రక్షకుడును
తనవారి అందరికి రక్షకుడును
ఉత్తమనడవడికతొ పాలించు వాడును
ధర్మం తొ శత్రు సంహారకుడును
ఓ భామిని రాముడు ఈ సమస్త ప్రపంచకమును
నాలుగు వర్ణాల వారినీ రక్షించు చుండెను
లోకములో అందరకి కట్టు బాట్లు ఏర్పరిచెను
అందరు కట్టుబాట్లుతో ఉండునట్లుగా చుచు చుండెను
రాముడు మిక్కిలి కాంతి మంతుడును
మిక్కిలి గౌరవింప దగిన వాడును
బ్రహ్మచర్య వ్రతములో ఉన్నవాడును
సత్పురషులకు ఉపకారము ఎట్లుచేయవలెనో తెలిసిన వాడును
కర్మల ప్రయోజనము, ఫలితము తెలిసిన వాడును
ఏ పనికి ఎట్టి ఫలితము వచ్చునో ఊహించ గలవాడును
రాజనీతి ధర్మమును చక్కగా అమలుపరుచు వాడును
బ్రాహ్మణుల విషయమున గౌరమును చూపినవాడును
రాముని భుజములు విశాలమైనవి గను
భాహువులు దీర్ఘమైనవి గను
కంఠం శంఖా కారము గను
ముఖము మంగళ ప్రదమై య్యుండును
సుందరమైన రాముని నేత్రములు ఎర్రగాను
ప్రక్క య్యముకలతో భాహు బలిగాను
రామ్ అనే పేరు లోకమంతా వ్యాపించు ఉండును
విద్యాశీల సంపన్నుడు, వినయ వంతుడును
రాముడు యజుర్వేదము చక్కగా అద్యయనము చేసిన వాడును
మహాత్మూలచేతను, వేదవేత్తలచేత గౌరవము పొందిన వాడును
ధనుర్వేదము నందు మిగిలిన మూడు వెదము లందును
ఉపవెదములందు వేదవేదాన్గములందు పాండిత్యము కలవాడును
రాముని కంఠధ్వని దుందుభి వలే గమ్బీరముగా ఉండును
రంగు నిగనిగలాడుతూ నల్లని రూపములొ అందరిని ఆకర్షించు చుండును
రాముని అవయవములన్నీ సమముగా విభక్తములై ఉండును
గొప్ప ప్రతాపము చూపి శత్రువులను పీడించు వాడును
వక్షస్థలము, ముజేయి, పిడికిలి స్థిరముగా ఉండే వాడును
కనుబొమ్మలు, ముష్కములు, భాహువులు, దీర్ఘముగా ఉండును
కేశములు, మోకాళ్ళు, హేచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉండును
నాభి,కడుపు క్రిందభాగము, వక్షస్థలము పొడవుగా ఉండును
నేత్రములు, గోళ్ళు, అరచేతులు, అరకాల్లు ఎర్రగా ఉండును
పాదరేఖలు,కేశములు, లింగమని నున్నగా ఉండును
కంఠధ్వని, నడక, గమ్భీరముగా ఉండు వాడును
అవావసౌష్టమే అద్భుతం పూర్ణ చంద్రుని మోముగలవాడును
ఉదరము నందు మూడు ముడతలు గలవాడును
స్తనములు, స్తనాగ్రములు రేఖలు అను మూడింటి యిందు లోతైన వాడును
కంఠం, లింగం, వీపు, పిక్క, అను నాలుగు హ్రస్వములుగా ఉన్నవాడును
రాముని శిరస్సునందు మూడు సుడులు కలవాడును
అంగుష్టము మోదట నాలుగు వేదములును సూచించు రేఖలు కల వాడును
అతని నుదుటిపైన, అరచేతులలోన, అరకాళ్ళలోన, నాలుగేసి రేఖలు ఉండును
మోకాళ్ళు ,తొడలు,పిక్కలు బాహువులు సమానముగా ఉన్న వాడును శ్రీ రాముడు తొమ్భైఆరు అంగుళముల (8 అడుగులు) ఎత్తు కలవాడును
రెండు కనుబొమ్మలను , రెండు నసాపుటములను
రెండు నెత్రములను, రెండు కర్ణములను
రెండు పెదవులను, రెండు స్తనానగ్రములను
రెండు చేతులను, రెండు ముంజేతులను
రెండు మోకాళ్లను, రెండు ముష్కములను
రెండు పిరుదులను, రెండు చేతులను
రెండు పాదములను, పిరుడులపై కన్దరములను
జంటలుగా ఉన్న 14 అంగములు సమానముగా ఉన్న వాడును
సింహము, ఏనుగు, పెద్దపులి, వృషభము వలే నడుచు వాడును
ముక్కు, గడ్డము, పెదవులు, చెవులు చాలాఅందముగా ఉన్న వాడును
కళ్ళు, పండ్లు, చర్మము, పాదములు, కేశములు నిగానిగాలాడు చుండును
రెండు దంత పంక్తులలో స్నిగ్దములు, తెల్లని మెరుపు కలిగి ఉండును
ముఖము, కళ్ళు, నోరు,నాలుక, పెదవులు, దవడలు, స్తనములును
గోళ్ళు, హస్తములు,అ పాదములు, ఈ పది పద్మము వలె ఉండును
శిరస్సు, లలాటము, చెవులు, కంఠము, వక్షము, హృదయమును
కడుపు, చేతులు, కాళ్ళు, వీపు ఈ పది పెద్దవిగా ఉండును
తేజస్సు, కీర్తి, సంపద అను మూడింటి చేత లోకమంతా వ్యాపించి యుండును
చంకలు, కడుపు, వక్షము, ముక్కు, మూపు, లలాటము ఆరు ఉన్నతములై ఉండును
వ్రేళ్ళ కణువులు, తలవెంతుకలు, రోమములు, గోళ్ళు, లింగము, చర్మమును
మీసమును, దృష్టి, బుడ్డి అను తొమ్మిదింటి యందు సూక్షమములుగా ఉండును
ధర్మ అర్ధ అక్కమములను సమముగా అనుభవించు వాడును
శుద్దమగా మాతా-పితృ వంశములు కలవాడును
సత్య, న్యాయ, ధర్మములందు ఆసక్తి కలవాడును
సర్వలోక ప్రియముకోరకు ప్రియముగా మాట్లడువాడును
శ్రీమంతుడు ప్రజలను దగ్గరకు తీయ్యుట యందును
వారిని అనుగ్రహించుట యందు ఆసక్తి కలవాడును
దేశకాలయుక్తా యుక్తములయందు జ్ఞానము కలవాడును
పరాజయము అనేది తెలియని మహానుభావుడును
రాముని యొక్క సవతి సోదరుడగు సౌమిత్రి అమిత ప్రభగలవాడును
అనురాగాముచేతను రూపముచేతను గుణములచేతను రాముని వంటి వాడును
మనుజులలో శ్రేష్టులైన ఆ రామ లక్ష్మణలు నిన్ను చూచుటకు వేదక సాగెను
ఆసక్తితో భూమిపై అంతటా సంచరించుచు మమ్ములను కలుసుకొనెను
భూమియంతయు నిన్నే వేదుకు చుండెను
రాజ్య ఛ్యుతుడైన మృగపతి సుగ్రీవుని కలిసెను
సుగ్రీవుడు తనఅన్నకు భయపడి అనేక వృక్షములతోను
ఉన్న ఋష్యమూకపర్వతముపై వసించు చుండెను
సత్యప్రతిజ్నుడును అన్నవలన భయముచే పీడితుడును
అన్నచే సింహాసనము నుండి దింప బడిన వాడును
అగు వానర రాజైన సుగ్రీవునకు సచివుడను నేను
నేను సుగ్రీవుని సేవిస్తూ జీవించు చున్నాను
అటు పిమ్మట నార చీరలు ధరించిన వారును
శ్రేష్ట మైన ధనుస్సు ధరించిన వారును
అగు రామలక్ష్మణులు ఋష్యమూక పర్వత ప్రాంతమునను
ఆయా ప్రదేశములలో నిన్నే వెదకు చుండెను
వానరార్షభుడగు సుగ్రీవుడు ఆ నారా శ్రేష్టులగు రామ లక్ష్మణులను
చూసి భయమోహితుడై ఆ పర్వతముయుక్క ఉచ్చ శిఖరమును చేరెను
ఆక్కడనే ఉండివారి సమీపమునకు పోయి వివరములు తెలుసుకు రమ్మని నన్ను పంపెను
నేను పురుష శ్రేష్టులైన రామలక్ష్మణుల దగ్గరకుకు నమస్కరించుతూ వెళ్లాను
సుగ్రీవుడాజ్న ప్రకారము నేను సౌందర్యముతో కూడిన సర్వ సమర్ధులను
కలసి సాజలి భద్దుడినై ఎగితిని వారు నావలన యదార్ధము తెలుసుకొనెను
ప్రీతియుక్తులైన రామ లక్ష్మణులను నావీపుపై నెక్కించుకొని సుగ్రీవునివద్దకు చేర్చాను
మహాత్ముడగు సుగ్రీవునకు నాచే ఉన్నది ఉన్నట్లుగా వారిని గూర్చి నివేదించబడినాను
రామ సుగ్రీవులు పరస్పరము సంభాషించు కొనెను
వారిరువురకు మిక్కిలి స్నేహము ఉత్పన్నమాయెను
పూర్వము జరిగిన కధలన్నీ ఒకరికి ఒకరు ముచ్చటించు కొనెను
వారిద్దరికీ పరస్పరము పూర్తి విశ్వాసము ఏర్పడెను
విపులమగు తేజస్సు గల సోదరడగు వాలిచే స్త్రీ మూలకముగను
గృహమునుండి వెడల గొట్టబడిన సుగ్రీవున్ని రాముడు ఓదార్చెను
తరువాత నీవు కనబడకపోవుటచే రామునకు కలిగిన దు:ఖమును
గూర్చి లక్ష్మణుడు వానర ప్రభువైన సుగ్రీవునకు నిన్ను అపహరించుట గురించి విన్నవించెను
సుగ్రీవుడు లక్ష్మణుడు చెప్పిన సీతాపహరనము గురించి వినెను
సుగ్రీవుడురాహువు మింగిన సూర్యుడివలే మిక్కిలి కాంతి విహీను డయ్యెను
రావణుడు అపహరించు తీసుకొని వెళ్ళునప్పుడు నీవు అలంకారముగా ఉన్న అభరణములను
భూమిపై పడినప్పుడు వానిని పోగు చేసి నేను సుగ్ర్రివుని వద్ద ఉంచినాను
శ్రీ రామునకు నీవు ఎక్కడ వున్నావో మార్గము తెలియయ దాయెను
నీవుభూమి మీద పడవేసిన ఆభరణములను పోగుచేసిన అన్నియును
శ్రీ రామునకు చూపినాను వెంటనే చూసిరాముడు మూర్చ పోయెను
ఆభరణములను వడిలో పెటుకొని పలు విధములగా విలపించెను
ఆ అభరణములు దాశరధియొక్క శోకమును అగ్నిని ప్రజ్వలిత మొనర్చెను
దేవతుల్య ప్రకాశకుడగు రాముడు మిక్కిలి దుఖసగారమున మునిగెను
దు:ఖార్తుడైన రాముడు చిరకాలము భూమిపై చేతన్యరహితుడుగా పడిపోయెను
నేను పెక్కు అశ్వాసనవచనములను పలికి అతి కష్టము మీద లేచునట్లుగా చేసినాను
పూజ్యరాల నీవు కనబడక పోవుటచే ప్రతి నిముషమునను
ప్రజ్వలించు చున్న అగ్నిచేత అగ్నిపర్వతమువలె తపించు చుండెను
రాఘవుడు నీ మీలమున కల్గిన సోకచింతతో నిద్రలేకుండా తపించు చుండెను
రాఘవుడు మహొత్తరభూకంపముచె కంపించు పర్వతమువలె కంపించు చుండెను
ఓ రాజకుమారీ నీవు కనబడకపోవుటచే రమ్యములైన అరణ్యములను
నదులను, కొండవాగులను దర్శించిన సుఖములేకుండా ఉండెను
రావణున్ని బందుమిత్రసమేతముగా సంహరించి నిన్ను పొందగలుగును
ఆనాడు రామ సుగ్రీవులిద్దరూ కలసి వాలిని వధించుటకును నిన్ను అన్వేషించుటకును వప్పందం చేసుకొనెను
దశరధరాముడు వేగముగా వాలిని సంహరించెను
సమస్త కపి భల్లూకములకు సుగ్రీవున్ని ప్రభువును చేసెను
ఓ దేవి రామ సుగ్రీవులకు ఈవిధముగా మైత్రి ఏర్పడెను
నేను వారిద్దరూ పంపగా దూతగా వచ్చిన హనుమంతుడను
సుగ్రీవుడు రాజ్యాధిపతిగా మారి మహాబల సంపన్నులగు కపులను
భాల్లుకాలను పిలిపించి పది దిక్కులను నిన్ను వెదుకుటకు పంపెను
మహాకాయములు కలవారు అద్భుత శక్తి కలవారు వెదుకుట ప్రారంభించెను
మేము సుగ్రీవునాజ్ఞకు భద్ధులమై పర్వతాలను అరణ్యములను వేదకసాగెను
మహాబల సంపన్నుడును, కపివరుడును, శోభాశాలియును
వాలి పుత్రుడగు అంగదుడు మూదు వంతుల సేనను
తీసుకొని నిన్ను వెదుకటకై బయలుదేరి వనములను
పర్వతములను వెతకగా నీవు కానరాక కార్యవైరశ్వమ్ చెందెను
కపిరాజగు సుగ్రీవుని భయము వలనను
పెట్టిన గడువు దాటి పోవుట వలనను
త్రోవతప్పి వింధ్య పర్వతము వద్ద తిరుగుట వలనను
మేమందరమూ ప్రాణత్యాగము కొరకు సిద్దపడితి యున్నామును
మేము పర్వతశిఖరముపై ప్రాయొపవేశములకై పూను కొంటిమియును
ప్రాయోపసిష్టులైన వారిని చూచి శోకసాగరమునమున ఉన్నఅంగదుడు విలపించెను
ఓ వైదేహి నీవు కనబడకపోవుట, వాలివధయును మాయోక్క ప్రాయోప వేశమును
జటాయువు మరణము గూర్చి తలుస్తూ అంగదుడు విలిపించు చుండెను
మేము వచ్చిన పని సఫలము అగునట్లుగా వచ్చినవాడును
పరాక్రమవంతుడైన ఒక గొప్ప పక్షి రాజు అక్కడకు వచ్చెను
జటాయువు సోదరుడైన సంపాతి అంగదుడు విలపించుటకు
కారణమడిగెను
అంగదుడు చెప్పిన మాటలకు గ్రద్దరాజు సోదరుని వధ గూర్చివిన్న
కోపముతో ఇట్లు పలికెను
నా తమ్ముడు అగు జటాయువు ఎవ్వనిచే చంప బడెను
ఓ వానరోత్తములారా ఎక్కడ నెలపైకూల్చ బడినాడును
జటాయువు అరణ్య ప్రాంతములో కూలగ శ్రీ రాముడు స్వయముగా ధహన సంస్కారములు చేసెను
మీ వలన వార్తను విన్నాను, మీకొక విషయమును చెప్పదలచుకున్నాను
ఆ సంపాతి నీవు రావణుని గృహము నందు ఉన్నట్లుగా తెలిపెను
సంతోషమైన వార్త విన్న అందరమూ ఉస్ఛాహము చే నిన్ను
చూడవలెనను
కోరికచే వింధ్య పర్వతమునుండి బయలు దేరి సముద్రప ఉత్తర తీరమును
చేరి మహాసముద్రమును చూసి భయముపడి మరల చింతా గ్రస్తులై యుండెను
వానర భయమును తొలగించి సముద్ర నూరు యొజనములను దాటినాను
నేను రాక్షసులాతో నిండిన లంకలోకి రాత్రి పూట ప్రవేశించినాను
నిద్రిస్తున్న రావణున్ని, దు:ఖముతో ఉన్న నిన్ను చూసినాను
ఓ సీతాదేవి ఇప్పటికి జరిగిన దంతయు యదాతధముగా చెప్పినాను
ఓ దేవి నేను దశరధనందనుడగు శ్రీ రామునికి దూతను
నాతోమాట్లాడుము నేను శ్రీ రామునికార్యసిద్దికై య్యత్నించు చున్నాను
నిన్ను చూచుటకై ఇక్కడకు వచ్చి యున్నాను, నేను సుగ్రీవుని సచివుడను
వాయుపుత్రుడును,భయము వదులుము నేను చెప్పినవి య్యదార్ధమని పల్కేను
సర్వశాస్త్రములలొ శ్రేష్టుడగు శ్రీరాముడు కుశలముగా నుండెను
లక్షణుడు వీర్యవంతుడగు తన యన్నకు హితకరిగా నుండెను
నేను సుగ్రీవుని ఆజ్ఞ చే ఒంటరిగా సముద్రమును దాటి వచ్చినాను
స్వెఛసారముగా రూపమును మర్చి ఈ లంకలో నిన్ను కలిసినాను
ఓ దేవి దైవ యోగమువలన ఈ సముద్రలంఘనము వ్యర్ధము కాలేదును
నీవు కనబడుటవల్ల శ్రీ రాముని యందు వానరుల యందు ఉన్న దు:ఖమును పోగొట్టగలను
భాగ్యవశముచే నీవు కనబడి నావని రామునికి వానరులకు చెప్పెదను ఇది కుడా నా అద్రుష్టమే, నిన్ను చూడగలిగితి నను కీర్తిని పొందగలను
మహాపరాక్రమశాలి అయిన రాముడు రాక్షసాధి పతియైన దశ గ్రీవమహారాజును
భండుమిత్రసహేతుముగా సంహరించి సీఘ్రముగ నిన్ను పొందగలుగును
ఓ సీతాదేవి పర్వతములన్నింటిలో మూల్యమైన పర్వతము ఉండెను
ఆకడి నుండి కేసరి అను వానరుడు గోకర్ణ పర్వతమును వెళ్ళెను
నా తండ్రియైన కేసరి, దేవతలు, బుషులు ప్రార్ధించగా సముద్రతీరము నందును
ఉన్న పవిత్రప్రదేశములొ నా తండ్రి శంబుసాదనుడను రాక్షసుని సంహరించెను
ఓ సీతాదేవి నేను ఆ కేసరి భార్య యందు వాయుదేవుని వలన పుట్టినాను
నేను చేసినపనిని పట్టి నన్ను లోకములో హనుమంతుడను పేర ప్రసిధ్యుడగును
ఓ సీతా దేవి నమ్మకము కల్గించుటకై నీ భర్తైన రాముని గుణములు వర్ణించి చెప్పినాను
నీవు కొద్దికాలములో రాముడు నిన్ను ఇక్కడినుండి తీసుకొని
వెల్ల గలుగును
సీతకు సరియైన హేతువులను చూపుట ద్వారా హనుమంతునిపై విశ్వాసము కలిగెను
ఆనవాళ్ళను బ్నట్టి అతడు రావణుడు కాదు రామదూత అని నిర్ధారణకు వచ్చెను
జానకి కి సాటిలేని సంతోషము కలిగెను
ఆనందముతో నెత్రములనుండి ఆనందభాస్పాలు రాల్చెను
ఎర్రగాను తెల్లగాను దీర్ఘముగాను ఉన్న నేత్రములు కలదియును
సీత ముఖము రాహువు విడిచిన చంద్రుడివలె ప్రకాశించెను
ఇప్పుడామె అతడు వానరుడే యని అన్యధా కాదని తలచెను
ప్రియ దర్శినియగు ఆమెతో హనుమంతుడు ఇట్లు పలికెను
ఓ దేవి నీకు అంతా చెప్పినాను కదా, నీవు కొంచము ఒపిక పట్టవలెను
మీకు నేను ఏమిచేయవలేనో, నీకెది ఇష్టమో చెప్పుము, చేసి నేను తిరిగి వెల్లెదను
ఓ సీతాదెవి మహర్షులు కపివరుడైన కేసరిని ప్రేరేపించెను
యుద్దమునందు శంబుసాదుడను రాక్షసుడిని చంపెను
నేను వాయు దేవుని వలన జనించిన వానరుడను
ప్రభావము చేతను నేను ఆవాయుదేవుని అంతవాడను
శ్రీ సుందర కాండ నందు 35వ సర్గ సమాప్తము
No comments:
Post a Comment