Wednesday 17 June 2015

ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (32వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:




 32వ సర్గ (వాల్మికి రామాయణములోని 14 శ్లోకాల  తెలుగు వచస్సు)
(" హనుమంతుని చూచిన సీతకు కలిగిన ఆలోచనలు  ")    


కొమ్మల మధ్య అణిగియున్న వాడును
తెల్లని వస్త్రములు ధరించిన వాడును 
మెరుపుపండును బోలి పింగళవర్ణము గలవాడును
అగు హనుమంతుని సీత చూచి ఉలిక్కి పడెను


వికసించిన అశోకములను బోలిన శరీరం కలిగిన వాడును
కరిగిన బంగారము వంటి చూపులు గలవాడును
వినీతుడై  ప్రియవాక్యములు పలుకుచున్న వానరుడను
సీతాదేవి చూచి మిక్కిలి ఆశ్చర్యము పొంది తనలో తానిట్లనుకొనెను 


అయ్యో వానరజాటికి చెందిన ఈ మృగము చాల భయంకరముగాను 
పట్టుకొనుటకు వీలు లేనిదిగను, చూడ శక్యము కానిదిగను 
భయ మొహితమైన సీతాదేవి వానరున్ని చూసి మూర్చ బోయెను
సీతాదేవి దు:ఖార్తయై రామ రామ అనుచు మిక్కిలి కరుణముగా విలపించెను


సీతాదేవి మంద స్వరమున హటాత్తుగా రోదనము చేసెను
ఆమె వినయముతో సమీపమున వచ్చిన కపివరుని చూసి స్వప్నమని తలపోసేను
ఆమెవిశాలమైన వంకర పోయిన ముఖము గలవాడును, సుగ్రీవుని ఆజ్ఞ పాలకుడును
మిక్కిలి పూజింప దగిన వాడును బుద్ధిమంతులలో శ్రేష్టుడును, వాతాత్ముడను చూసి మూర్చ పోయెను   


సీత హనుమంతుని చూసి మిక్కిలి వ్యధ చెంది  మ్రుతురాలువలె కోయ్యబారెను 
చాలాసేపటికి సీతాదేవి తెప్పరిల్లి నేనొక చాల చెడ్డ స్వప్నమును  చూచు చున్నాను 
వానర రూపము స్వప్నములో కనబడుట మంచిది కాదని శాస్త్రములు చెప్పబడు చుండెను
రామునకు, లక్ష్మణునకు, జనకమహారాజునకు క్షేమమగుననే నేను ప్రార్ధించు చున్నాను 


కాని నాకు ఇది స్వప్నము కాదు దు:ఖశోకపిడిత నగు నాకు నిద్ర వచ్చుట లేదును 
చంద్ర్రనిభానుడగు రామునితో విరహితనైన నేను సుఖము ఎక్కడ పొందుచున్నాను
నేను సదా రామ రామ అని బుద్ధితో చింతించుచూ వాక్కుతో అతనినే పలుకు చున్నాను 
అట్టి అర్ధమునె ఇచ్చునదియును, దానికి అను కూలమును అగు కధనే  వినుచున్నాను 


శ్రీ రామ గతమగు సన్పూ ర్ణ భావముగల నేను రామ సంభంధమైన కోరికతోను
ఇప్పుడు నిరంతరమూ శ్రీ రాముని గూర్చి చింతించుచు అతని కధనే విను చున్నాను 
ఎప్పటికైనాను నా మనోరధము సఫలమగునని ఆశతో జీవించు చున్నాను 
ఇప్పుడు మాత్రము స్పష్టమైన ఆకారముతో మాట్లాడు వానికి సమాధానము చెప్పవలెను


ఇది నా మనోరధమే యని కాని బుద్ధితో తర్క వితర్కములలో మునిగి యున్నాను   
మనొరధమునకు రూపము లేదు, కాని యితడు స్పష్టమైన రూపముతొ మాట్లాడు చుండెను 
వాచస్పతికును, వజ్రధారియగు ఇంద్రునకు, స్వయం భువునకును ప్రార్ధించు చున్నాను
నా ఎదుట ఈ వనేచరుని చెప్పునది నిజమే యగును, మరొక విధముగ జరుగ కుండును 

శ్రీ సుందర కాండము నందు 32వ సర్గ సమాప్తము

No comments:

Post a Comment