Tuesday, 2 June 2015

26. ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (26వ సర్గ)


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ: 26వ సర్గ (వాల్మికి రామాయణములోని 51 శ్లోకాల  తెలుగు వచస్సు)
(" సీత శోకార్తయై, ధీనముగా విలపించుచు ప్రాణములు విడువ వలెనని నిశ్చ యించు కొనుట ")    

నిరంతరం కారుచున్న కన్నీళ్ళుగల బాల యైన సీత తలవంచి నేలను తట్టు చుండెను
అమాయకముగా  జానకి నలువైపుల చూసి భూమి వైపు చూచుచూ ఏడవ సాగెను
రాముడు ఎమరి ఉన్న సమయములో రాక్షసుడు బలాత్కారముగా నన్ను తెచ్చెను 
ఈ రాక్షస స్త్రీ లందరూ తమ వశములొఉన్న నన్ను చాలా దారుణముగా భయపెట్టు చుండెను

ఆమె పిచ్చి పట్టిన దాని వలెను, ప్రమాదమున చిక్కు కున్న దానివలెను
బ్రాంతి నొందిన చిత్తము గలదాని వలెను, భయ బ్రాన్తుల తో ఏడవ సాగెను
భూమిపై బొరలాడు ఆడు గుఱ్ఱపు పిల్లవలె  నేలపై దొర్లుచూ విలపించెను
దు:ఖము చేత పిడితు రాలనై చింతించు చూ జీవించుట  ఇచ్చగించను 


భర్తతోడు లేని జీవితములో  ధనము ఉన్న ఏమి ప్రయోజనుము కలుగును
భూషణములను అలంకరించు కొని ఎవరి కొరకు ప్రాణాలతో బ్రతుక వలెను 
నా హృదయము నిజముగా పాషాణము, ఇనుముతో చేయబడి యుండెను
అందుచే ఇంట దు:ఖము వచ్చిన హృదయము బ్రద్దలగుట లేదని పల్కెను

అనార్యయును, అసాద్వియనగు నన్ను నేనే అసహ్యంచు కొను చున్నాను
పాప జీవితగు నేను భర్తనుండి వేరుచేయబడి ముహుర్తకాలము జీవించి యున్నాను
నేను నా ఎడమ పాదముతో నైనను  నిశాచరుడగు రావణున్ని స్ప్రుశించను 
రావణుడు వరప్రసాదు డైను కామించుట యనునది ఎట్లు పోసగును?  


రావణుడు తన క్రూర స్వభావముతో నన్ను ప్రార్ధించు చున్నను
నేను నిరాకరించిన తన మనస్సు మార్చు కొనజాలక యున్నను 
తనమహత్యము, తన కుల మహత్యము తెలుసు కొనలేకున్నను
నన్ను చేధించినా, నేను రావణున్ని ఎట్టిపరిస్తితిలో కూడాప్రేమించను


నన్ను ముక్కలు గా నరికినను, అగ్నిలో పడవేసి భస్మము చేసినను
భర్తకు దూరమైన నేను శరీరమును విడుచుటకు సిద్ధముగా ఉన్నాను
నాభర్త నాయదృష్ట లోపమువలన, జాలిదొరిగి యున్నదని అను కొందును   
మీరు వాగిన ఏమి ప్రయోజనము? ప్రాణములు విడుస్తాగాని రానణున్ని చేరెను


రాక్షస శ్రేష్టుడైన బలవంతుడైన విరాధుని రాముడొక్కడే సంహరించెను 
వనములో పడునాల్గువేల రాక్షసులను రాముడొక్కడే హతమార్చెను
నా భార్త ఖ్యాతిగలవాడు, ప్రజ్నుడు, కృతజ్ఞుడు, సత్య సంపంనుడును 
నాభర్త నావద్దకు ఎలారాడు? నేను లంకలో ఉన్నట్లు తెలియకుండును


ఇతరులు ఆక్రమిన్చుటకు వీలు లేని లంక అయినా రామభాణాన్ని ఏది అడ్డుకోకల్గును ?
అపహరించ బడిన ప్రియమైన భార్యను శ్రీరాముడు ఎలా రక్షించ  లేకుండెను ?
శ్రీరాముడు నేను ఇక్కడ ఉన్నట్లు తెలిసి ఉండి  సహిస్తున్నాడా అవమానమును ?
నేను ఇక్కడ ఉన్నట్లు తెలిపే జటాయువు కూడా రావణుని చేతిలో హతమయ్యెను 


రావణునితో జటాయువు ద్వంద్వ యుద్దానికి తలపడి నన్ను రక్షింప దలచెను
ఆ జటాయువు నాకొరకు మహోత్తరమైన కార్యము ఆచరించి స్వర్గస్తు డాయెను 
ఇప్పుడు నేనెట్లు ఏడ్చు చున్ననో అట్లే భర్తలు పోయిన రాక్షస స్త్రీలు విలపించును
కొద్ది  కాలములోనే నా మనోరధము నెరవేరును, ఈచెడునడవడిక కల వారు నశించును


శ్రీ రామచంద్రుడు లంకా పట్టణమును దహించి వేయును 
మహాసముద్రములో నీరు లేకుండా ఎండింప చేయును 
నీచుడైన రావణుని కీర్తిని, పేరును నశింప చేయును
ఈ లంగా నగరమంతా రాక్షస రహితముగా చేయును


కొద్ది దినములలో ఈ లంకా పట్టణము శ్మశానముగా మారును 
ఈ పట్టణముపై గ్రద్దలు మండలాకారముగా తిరుగు చుండును
శవాల చితులనుండి బయలుదేరు ధూమముతో వ్యాకులమై ఉండును
ప్రభువే లేనిదగు లంకాపట్టణమునష్ట భత్త్రుకయగు స్త్రీవలే శ్రీహీనము కా కల్గును 


ఈ లంకలొఆసుభములైన శకునములు అనేకములు కనబడు చుండును 
వాటిని బట్టి ఈలంక కొద్ది దినములలోనే కాంతి హీనముగా తప్పక మారును
పాపాత్ముడు రాక్షసాధముడు  అయిన రావణుడు శ్రీ రాముని చేతిలో చంపబడును 
ఈ పట్టణము భర్త మరణించిన స్త్రీ వలె పున్యోత్సవములకు దూరము 
కాగల్గును


నన్ను తెచ్చుట దుర్మారుడగు రావణునికి మృత్యువు తెచ్చినట్లగును
రాక్షసుల అధర్మమువలన మహాత్పాతము ఇక్కడ సమ్బవించును
పచ్చిమాంసము తినే రాక్షసులకు అధర్మమని చెప్పేవారు లేకుండును  
శ్రీ రామునకు నా జాడ తెలిసిన నాకొరకు లంకను భస్మము చేయును

ఈ రాక్షసుడు ప్రాత:హకాల భోజనమునముతో పాటు నన్ను తప్పక తినును 
ప్రయదర్శనుడగు శ్రీ రామచంద్రుడు లేకుండా నేను ఏమి చేయ గలుగును
నాకు ఇక్కడ విషము లేదా అస్త్రము ఇచ్చేవారుంటె నా ప్రాణాలు అర్పించెదను
నేను ఎడబాటు సుఖమును భరించలేకున్నాను, శీఘ్రముగా యముని దర్శించగలను

రామునకు లక్ష్మణునికి నేను ఇక్కడ ఉన్నట్లు తెలియక పోవచ్చును 
లేదా నాకొరకు ఈ భూమి యంతయు వెతుకుతూ ఉండవచ్చును
లేదా నాభర్త నాకొరకు శోకముతోనే దేహమును చాలించ వచ్చును
శ్రీ రామచంద్రుని స్వర్గంలో చూడ గల్గు దేవతలు ధన్యాత్ములగును 

అట్లుకానిచో ధర్మకాముడును, థీమన్తుడును, రాజర్షి యును 
పరమాత్ముడును నన్ను తలవక మరచి పోయి ఉండవచ్చును
ఎదుట కనబడు వారిమీద ప్రీతి కల్గును, కనబడనివారిమీద స్నెహము కూడా మరుచును
క్రుతఘ్నులగువారు స్నేహమును నసింప చేయుదురు కాని రాముడు మాత్రం ఎట్లు చేయును ?

నాయొక్క దురదృష్టమో, లేక నాయందు దుర్గునములున్నవేమో అనుకొందును 
స్త్రీ ఐన నేను పరమ పూజ్యుడైన రాముడు లేకుండా నశించి పోవు చున్నాను
లేదా రావణునిచే రామ లక్ష్మణులను మోసముచే చంపబడి యుండ వచ్చును
లేదా ఇద్దరు కంద మూల ఫలాశనులై శస్త్రత్యాగము చేసి యుండ వచ్చును 

నిర్దోషమగు చరిత్రగలవాడును, ధీర్ఘబాహుడు శూరుడును, శత్రు నాశకుడును
అన్నిసుభలక్షనాలుగల నాభర్తకు నా సమాచారము తెలుపక ఎట్లు మరణము పొందెదను 
సత్యనిష్టులు, మహాత్ములు మహాభాగ్య్యులు,జితేన్ద్రులు, మనస్సును జయించిన వారును
అట్టి వారగు మునులు ధన్యులు గదా వారికి ప్రియా అప్రియములు తెలియ కుండును  

ప్రియము జరిగినప్పుడు దు:ఖము కలుగదు,అప్రియము జరిగినప్పుడు ఎకువ దు:ఖము కలుగును
ఈ ప్రియా ప్రియముల నుండి విముక్తులైన మహాత్ములకు నమస్కారములు పెడుతున్నాను
నా భర్త ధర్మమార్గంలో వైరాగ్యము చెంది నన్ను మరచినాడేమో అను కొందును
ఆత్మజ్ఞానియగు రామునికి దూరమై, రావణునికి దక్కక ప్రాణములు వదల గలను
  
శ్రీ సుందరకాండ 26వ సర్గ సమాప్తము