Wednesday, 17 June 2015

ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (33వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:



 33వ సర్గ (వాల్మికి రామాయణములోని 33 శ్లోకాల  తెలుగు వచస్సు)
("సీత హనుమంతునకు తన విషయమును చెప్పుచు తన అరణ్యే గమనమును, రావణుడు తనను అపహరించుటను వర్ణించుట   ")    


పగడము వంటి ఎర్రని ముఖము గలవాడును 
మహా తేజశాలి వాయు పుత్రుడైన హనుమంతుడును 
వినాయమగు వేషము కలవాడై దీనముగా ఉన్న సీతను
సమీపించి తలపై దోసిలుపెట్టి నమస్కరించుతూ ఇట్లుపలికెను



పద్మ పత్రనేత్రములు కల దానవును
నలిగిపోయిన పట్టుబట్ట ధరించిన దానవును
ఎట్టి దోషము లేనిదానా! ఇక్కడ ఈ చెట్టు కొమ్మను 
పట్టుకొని ఉన్నావు  నీవెవతవు అని అడిగెను


పద్మదళములనుండి జారు జల బిందువులతో సమానమైనవియును
నీ నేత్రముల నుండి దు:ఖమూలకమైన జలము ప్రవహించుట కారణమును 
మరియు నీవు దేవాసుర,నాగ,గాంధర్వ,యక్ష,రాక్షస,కిన్నర, రుద్ర,వసువులలోను 
ఎవ్వరికి చెందినదానావు? ఓ సుందరీ నీఒక దేవతవని అనుకోనుచున్నాను


చంద్రునిలో వియుక్తమైన దేవలోకము నుండి భూమిపై పడినదియును
నక్షత్రములలో శ్రేష్ట మైనదియును సర్వగుణములలో నధికురాలును
అగు రోహిణి నక్షత్రమువు కావుకదా!ఓ యసితేక్షనా భర్తైన వసిష్టునకును 
కోపమువలననో అజ్ఞానమువలననో కోపముకలిగించి వచ్చిన అరుంధతి కాదను కుంటాను


ఓ సుందరమైన నడుముగల వనితా దు:ఖానికి కారణము తెలుపవలెను 
నీవు మరణించినవారి నెవరినో గూర్చి దు:ఖం వ్యక్త పరుస్తున్నావను కుంటున్నాను
ఆపోయినవారిలొ నీకు పుత్రుడా, తండ్రియా, సోదరుడా, లేక భర్తయా తెలుప వలెను 
నేను నీవు దేవజాతికి చెందిన దానవు కాదు, భూమి పాలకుని పుత్రిక 
అనుకుంటున్నాను


నీవు ఏడ్చుచూ  నిట్టుర్పుచూ భూమిని స్పృశించు విధానమును 
నీ అవయవ సౌష్టమును బట్టి చక్రవర్తికి భార్యవై అయి ఉండవచ్చును
నీవు క్షత్రియ వనితవై ఉండవచ్చునని ఊహించు కొను చున్నాను
నేను అడుగుతున్నాను చెప్పుము, నీకు మంగళ మగును అని మారుతి పల్కెను


జనస్థానము నుండి బలాత్కారముగా రావణునిచే హింస పూర్వకముగాను
తేబడిన సీత ఐనచో నీకు శుభమగు గాక, నీయొక్క  ధైణ్యమును
అలౌకికమైన రూపమును తాపసి వేషమును బట్టి ఆ రామమహిషి వే అయి ఉండును
రాజైన రామునియోక్క స్మరణము బట్టియును మానవస్త్రీ అను కొనుచున్నాను

  
హానుమంతుని మాట విన్న సీత రాముని గూర్చి చెప్పుటచే చాలా సంతోషించెను 
హర్షమును పొంది అశోక వృక్షమును ఆశ్ర యించిన హనుమంతునితో ఇట్లు పలికెను 
ఈ పుడమినగల రాజశ్రేష్టులలో ముఖ్యుడును, శత్రుసైన్య విద్వంసి యును, ఆత్మవేత్తయును 
అగు దశరధునకు కోడలిని, మహాత్ముడగు వైదేహి జనకుని కూతురును, సీతయను పేరుగల నేను ధీమంతుడైన రామునిభార్యను 



నేను రాముని ఇంటిలో మనుష్యులకు వీలు వున్న సకల భోగములు అనుభవించాను 
సమస్త కామములు సమృద్ధితో పండెండు సంవత్చరములు అనుభ వించి యున్నాను 
పిమ్మట 13వ సంవత్చరమున దశరధ మహరాజు రామునికి 
రాజ్యాభిషేకము చేయదలచెను
రాజ్యాభిషేకము జరుగు చుండగా కైకేయి అను రాణి భర్తఐన దశరధునితొ ఇట్లు పలికెను 



రామునికి నీవు పట్టాభిషేకమును చేసినను
ఎదినమునండు భోజనము చేయను జలముత్రాగాను 
ఇంతటితో నాజీవితము అంతమగును 
కైకేయి భర్త యగు దశరదమహారాజుతో పల్కెను 



ఓ రాజశ్రేష్టుడా, నీవు ఆనాడు నాకు ఇచ్చిన వరమును కోరుచున్నాను 
శ్రీరాముని అరణ్యమునకు పంపవలెను,భరతునికి పట్టాభిషేకము చేయవలెను 
ఆరాజు క్రూరము, అప్రియము లైన మాటలను ప్రియభార్యనుండి వినుట వలనను 
రాణీకి తానిచ్చిన వరము ఇప్పుడే తీర్చవలెనా అని స్మరిస్తూ మూర్చ పోయెను 


అటు పిమ్మట ముసలిరాజు సత్యధర్మ వ్యవస్థితుడై యశస్వియును
జ్యేష్ట పుత్రుడును అగు శ్రీ రామున్ని  విలపించుచు రాజ్య మడిగెను
 శ్రీరాముడు తండ్రి వచనము రాజ్యాభిషేకము కంటే మిక్కిలి ప్రియముగువలనను
మన:పూర్వకముగా స్వీకరించి వాక్కును కూడా స్వీకరించి రాజ్యను   విడిచెను  



సత్య పరాక్రముడైన రాముడు దానము చేయునుగాని ప్రతిగ్రహము చేయుట ప్రాణ రక్షణము కొరకైనను  
ఎపుడు సత్యమును పలుకుని కాని శ్రీ రాముడు ఆపద సమయమునందు కుడా అప్రియమైన మాటలను పలుక కుండును
మహయశస్వియైన ఆ రాముడు బహుమూల్యములైన ఉత్తరీయములను త్యజించెను
మనస్సులోనే రాజ్యమును గూడా త్యజించి నన్ను తల్లికి అప్పగించెను  




నేను వనములో సంచరించుటకై నిశ్చ యించు కొని వెంటనే వనమునకు బయలు దేరాను 
రాముడు లేకున్నచో నాకు స్వర్గములో నివాసము ఇచ్చిననుఇ ష్ట  పడను 
మిత్రనందనుడును మహాభాగ్యసంపంన్నుడును లక్ష్మణుడు కుడా వచ్చుటకే నిర్ణ యించుకొనెను 
అన్నగారిని అనుసరించి వేల్లుటకై నాకంటే ముందే నార చీరలు ధరించి సిద్ధముగా ఉండెను

మేము పాటించి నాము దశరధ మహారాజు యొక్క ఆజ్ఞను 
మిక్కిలి మన్నించి గౌరవించి దృడమైన నియమములను 
అనుసరించి మునుపెన్నడూ చూడని దండకారణ్య వనమునను
కంద మూలా ఫలాలను స్వీకరిస్తూ రామ సేవ చెస్తూ ఉన్నాను 

ఆ వనమునందు మునలకు రక్షణగా ఉన్న శ్రీ రామచంద్రుని భార్యను 
దురాత్ముడైన రావణునిచే అపహరింపబడి తెచ్చి ఇక్కడ ఉంచెను
   ఆ రావణుడు నాకు రెండు మాసములుపాటు అనుగ్రహించె  జీవితమును
ఈ రెండు మాసములు తర్వాత అతని కోరికను తీర్చక జీవితము త్వజించ గలను

శ్రీ సుందర కాండము నందు 33వ సర్గ సమాప్తము

No comments:

Post a Comment