Saturday, 13 June 2015

30. ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (30వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ: 30వ సర్గ (వాల్మికి రామాయణములోని 44 శ్లోకాల  తెలుగు వచస్సు)
(" సీతతో ఎట్లా సంభాషనములు చేయవలెనో అని హనుమంతుడు ఆలోచించుట ")    


పరాక్రమ వంతుడైన హనుమంతుడు కుడా సీత యోక్క విలాపమును
రాక్షస స్త్రీల  బెదిరింపును, త్రిజట యొక్క స్వప్న వృత్తాంతమును
సీతాదేవి, రావణుడు, రాక్షసస్త్రిలు చెప్పన మాటలు హనుమంతుడు వినెను
సీతాదేవిని నందనవనంలోని దేవతను బోలినట్లుగా మారుతి చూసెను 


గుప్త రూపములొ సంచరించు వాడును 
శత్రువుయోక్క శక్తిని గ్రహించినవాడును   
శ్రీ రామచంద్ర ప్రభుచే నియుక్తుడును
గూదచారివలె ఉన్నది విషయములన్ని తెలుసుకొను చుండెను


హనుమంతుడు సీతాదేవి శోకమును తోల గించాలని అనేక విదాలుగా ఆలోచించెను
వేలకొలది, లక్షల కొలది వానరులు సీతాదేవి కొరకు అన్ని దిక్కులను
వెదుకుతున్నారో ఆమెను నేను రాక్షసుని బందిలొ ఉన్నట్లు చూడ గలిగాను
రాక్షసాధి పతి ప్రభావమును, లంకా రాక్షసు లందరిని చూడ బడినాను
  

అప్రమేయ ప్రభావము కలవాడును, సకల ప్రాణులందు దయగలవాడును
రామునిభార్య పతిదర్శనకాంక్షతొ తల్లడిల్లు తున్నది, ఓదార్చుట యుక్తమును 
కష్టములు నెరగనిదియు చంద్రుని మోము కలదియును దు:ఖమునకు అంతమును 
చూడ జాల కున్నది ఈమెను నేను తప్పక ఓదార్చివలె అనిమారుతి అనుకొనెను  


శోకోప హత చేతనయును, వివేకవతియును పతివ్రత ఐన శ్రీ రాముని భార్యను
సీతను ఒదార్చక పోవుదు నేని నాయొక్క గమనముక దోష యుక్తము కల్గును
నేను వెళ్ళినచో కీర్తిమన్తురాలగు, రాజపుత్రి యగు జానకి, అశోక వనము నందును  
తనను రక్షించు వారు కాన రాక వేరే దారి లేక ప్రాణ త్యాగము చేయ వచ్చును 


మహాబాహువులు గల శ్రీ రామచంద్రుడను 
పూర్ణ చంద్రుని మోఖముగల సీతాదేవి భర్తను 
సీతాదర్శించుటకు ఉవ్విలూరుతున్న దశరధ పుత్రుడను 
నగు కౌసల్యా పుత్ర్రుడ్ని నేను ఓదార్చుట న్యాయ మగును


రాక్షస స్త్రీల ఎదుట మాటలాడుట యుక్తము కాదును
ఈ పని నేనెట్లా చేయగలనో? నేను క్లిష్ట పరిస్తితిలో చిక్కి ఉన్నాను
నేను ఈరాత్రి శేషమునందే ఈమెను నెను ఓదార్చ పోయినచో ఈమె ఏమైనను 
తన జీవితము త్వజించును ఇందు సందేహము లేదు దాన్ని గూర్చే  ఆలో చిస్తున్నాను


శ్రీ రాముడు సీత నన్ను గూర్చి ఏమి పల్కినది అని అడిగినప్పుడు  ఏమి 
చెప్పవలెను?
సుందరమగు నడుముగల సీతాదేవితో  మాటలాడక ఏమి ప్రత్యుత్తరము చెప్పగలను ?   
ఇక్కడనుండి సీతాసందేశము లేకుండగా త్వరపడి వెళ్ళిన ఆకాకుస్థుడు క్రోధించును 
శ్రీరామునకు సమాధానము చెప్పలేక పొతే తీవ్రమైన చూపులతో నన్ను దహించి వేయును 


ఒకవేళ నేను రాముని కార్య సిద్ధి కొరకు ప్రభువగు సుగ్రీవుని ప్రోస్చ హించినను 
మహా సైన్యముతో అతడిక్కడకు వచ్చుట కూడా వ్యర్ధమే యగును  
 రాక్షస స్త్రీల మద్య నుండియే నేను కొంత అవకాసమును సంపా దించెదను
రాక్షస స్త్రీల మద్య మెల్లగా మిక్కిలి సంతాపముతో ఉన్న సీతను ఓదార్చెదను 


నేను చాల సూక్ష్మరూపములో ఉన్నాను విశేషించి వానరుడను అయినాను
స్పష్టమైన అర్ధమును భోధించు మనుష్యవాక్కులతో మాట్లాడుట ప్రయత్నిమ్చెదను 

ఒక వేళ ద్విజునివలె సంస్క్రుతవాణిలో మాట్లాడిన సీత రావణుడని అనుకొనును 
అశోక వృక్షముపైన వుండి సీత భయపడకుండా అమృత వాక్యాలు  వల్లించెదను


ఈ సీతాదేవి నాయొక్క వానర రూపమును, మానవ భాషితమును
వినగానే  రాక్షసుల వల్ల భయపడుతున్న సీత ఇంకా భయ పడును
పిదప ఉత్తమమైన మనస్సుగల విశాలాక్ష్మి యగు సీత నన్ను చూసినను
కామ రూపములొ వచ్చిన రావణుడని భావించి పెద్దగా అరవ గలుగును

 
సీత అరవగానే ఘోర రాక్షసీ గణము నంతయును
వివిధ ఆయుధములు చేత ధరించి గుమ్మిగూడి వచ్చును 
వికృతమైన స్త్రీలు నన్ను నలుమూలల నుండి చుట్టి వేయును 
నన్ను చంపుటకు వారి బలమంత ప్రయోగించి ప్రయత్నం చేయును


అప్పుడు నేను వాళ్లకు దొరకకుండా మహావృక్షం కొమ్మలను పట్టు కొన వలెను 
నేను అతివేగముగా పరుగెత్తి చుండగా చూసి వాళ్లకు భయము ఇంకా కల్గును 
నా రూపమును చూసి రాక్షస స్త్రీలు వికృతమైన అరుపులు అరవ కల్గును
అటుపిమ్మట రాక్షస స్త్రీలు రాక్షస భవణము వద్ద ఉన్న రాక్షసులను అహ్వానించెను


 
ఆ రాక్షసులు గూడా ఉద్వేగముగా శూలములను బాణములను కరవాలములను 
ఇంకా వివిధ ఆయుధములు ధరించి వేగముగా నన్ను మర్దించుటకు వచ్చును 
వాళ్ళందరూ నలుమూలలు చుట్టు ముట్టగా ఆ రాక్షస సైన్యమును సంహరించుచూ నేను
ఈ మహా సముద్రము ఆవలి వడ్డుకు పోజాలను అని మనసులో అను కొనెను 


నన్ను పట్టు కొనినచో సీత యొక్క ప్రయోజనము నెరవేరదు, నేను పట్టు బడెదను 
రాక్షసులు జానకిని హింసించ గలరు, రామ సుగ్రీవుల కార్యము  ప్రమాదములో పడును 
 జానకి రహస్య ప్రదేశములో నివసించు చున్నది, ఇక్కడ నుండి మార్చ వచ్చును 
నేను యుద్దములో  హతమైనను, బందీ అయినను రామకార్యము నేరవేర్చువారు వేరోకరు లేకుండును 


ఆలోచించగా నేను నిహితుడైనచొ మహాదది దాటువాడు కనిపించ కుండును  
నేను వేలకొలది రాక్షసులను సంహరించే సామర్ధ్యమున్న ఆవలి ఒడ్డుకు పోజాలను
యుద్దములో జయాపజయములు అనిశ్చితములు నాకు సంశయము ఇష్టము కాదును
ప్రాజ్నుడగు వాడెవ్వడు అసందఘ్దమైన కార్యమును సంశయుక్తముగా గావించును ?  

అవి వేకియును మనశ్చామ్చల్యము కలవాడునగు దూత మూలమునను 
 సిద్ధియైనకార్యములు కుడా దేశకాలమునకు వ్యతరేకముగా ఉండుటను
సూర్యోదయ మవగానె చీకటి మయముగాను నేను సీతతొ మాటలాడినను 
ఇంత దోషముండును మాటలాడకుండినను ఆమె ప్రాణత్యాగము జరుగును

ఏది లాభమో ఏది నష్టమో నిర్ణ ఇంచు కొన్న కార్యము నందును
వివెకహీనులైన దూతలను నియమించినచో ఆకార్యము విఫలమగును
పండితులు దురభిమానములు గల దూతలు కార్యములను చెడ  కొట్టును 
ఇప్పుడు నేను ఎ విధముగా ప్రవర్తించినచో కార్యము చెడి పోకుండా ఉండును?

నేను ఎట్లు మాట్లాడిన బుద్దికి వ్యాకులత్వము కలుగ కుండా యుండును 
నేను చేసిన సముద్ర లంఘణము వ్యర్ధము కాకుండా ఇక్కడ నేను ఏమి చేయవలెను  
 సీత నా మాటలువిని భయపడకుండా ఉండుటకు ఏవిధముగా మాట్లాడ వలెను
హనుమంతుడు పలువిధాలుగా అలోచించి తను ఏమి చేయవలెనో నిశ్చయించు కొనెను 

సీత మనస్సు అత్యుత్తమ బంధువైన రాముని యందే లగ్నమై యుండెను 
ఉతమ బంధువైన  రామున్ని గూర్చి  కీర్తినచొ ఈమె భయపడ కుండా ఉండును 
ఆత్మవేత్తయును అగు శ్రీ రామునికి సంభందించిన సమస్త వచనములు వినిపించెదను
మధురముగా పలికి ఆమె నన్ను విశ్వసించునట్లుగ ఆమెకు ప్రత్యత్తర మోసంగుదును   

చెట్టుకొమ్మలు మద్య దాగియుండి సీతను 
చూచుచూ మదురాతి మధురముగా వచనములను
వ్యర్ధముకాని అనేక విధములైన మాటలను
హనుమంతుడు సీతాదేవితొ పలుకుట ప్రారంభించెను

శ్రీ సుందర కందమునండు 30 వ స్వర్గ సమాప్తము