ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ:శ్రీ రామ చంద్రపరబ్రహ్మనే నమ:
27వ సర్గ (వాల్మికి రామాయణములోని 51 శ్లోకాల తెలుగు వచస్సు)
(" త్రిజట స్వప్న వృత్తాంతమును తెలుపుట - రామునకు విజయము, రాక్షసులకు వినాశనము ")
రాక్షస స్త్రీలు సీతాదేవి వద్దకు వచ్చి పరుషముగా ఏకపక్షముగా పల్కెను
ఓ సీతా నీ మాంసమును మేము కలసి తిని వేయదమని పల్కెను
కొందరు స్త్రీలు రావణునికి సీత వినుట లేదని చెప్పుటకు వెళ్ళెను
సీతను బెదిరించుతున్న స్త్రీ లతో వృద్ధురాలైన త్రిజట కోపంతో ఇట్లు పల్కెను
అనార్యులగు ఓ రాక్షస వనితలారా, సీతను వదలి మీ దేహమును మీరే తిన వలెను
మీరు భక్షించ లేరు దశరధునకు ప్రియమైన కోడలగు, జనకుని కూతురును
ఇప్పుడు నేనొక భయంకరమైన రోమాంచ కరమైన స్వప్నమును చూసినాను
స్వప్నంలో రాక్షసుల వినాశమును, ఆమె భర్త యొక్క అభ్యుదయమును
రాక్షస వనిత లందరూ త్రిజట మాటలువిని భయముతో దగ్గరకు వచ్చెను
రాక్ష స్త్రీ లందరూ త్రిజట ను స్వప్న వృత్తాంతమును తెలుపమని కోరెను
త్రిజట తత్కాలమునందు స్వప్నము నందు చూసిన విషయాలను చెప్పెను
లక్ష్మణ సహితుడైన రాముని తెల్లని వస్త్రాలు ధరించినట్లు కలలో చూసాను
సీతా రామ లక్ష్మణులు ఏనుగు దంతముల తో చేయబడిన పల్లకీలొ ఎక్కి ఉండెను
ఆ పల్లకీని వేయి హంసలు మొస్తూ లంకా నగరము పై సంచరించు చుండెను
శ్వేత పర్వతముపై శ్వేత వస్త్రములు ధరించి తేజోవంతమైన తేజస్సుతో వెలుగు చుండెను
కాంతి సూర్యునిలొ కలిసినట్లు, సీతా రామ లక్ష్మణులలో కాంతి కలసి
వెలుగు చుండెను
మరల రామ లక్ష్మణులు కాంతితో ప్రకాశిస్తూ సీతను సమీపించెను
శ్రీ రామచంద్రుని హస్తము పట్టి ఏనుగు స్కందముపై కూర్చుండెను
శ్రీ రాముడు ఏనుగుపై ఎక్కి సీత చేతులతో సూర్య చంద్రులను తడుచునట్లు చేసెను
సీతా రామ లక్ష్మణులు ఎక్కిన మహాగజము లంక పై భాగమున నిలిచి యుండెను
సీతా రామ లక్ష్మణులు తెల్లని ఎనిమిది వృషభములు లాగుతున్న రధములో ఉండెను
దివ్యమైన సూర్య పకాశ వంత మైన పుష్పక విమానము వలె అది ఉండెను
ఆ పుష్పక విమానము ఉత్తర దిక్కువైపు వెళ్ళు చున్నాట్లు నేను కలలో చూసాను
ఆ విమానము పలు విధాలుగా లంకా నగరము అంతా తిరిగి వెళ్లి నట్లుగా స్వప్నంలో చూసాను
ఇక రావణుడు ముండనము చేయబడిన మస్తకము కలవాడుగాను
మత్తుడై, తలసిక్తుడై, వెర్రి వాడై , ఎర్రని వస్త్రముల ధరించిన వాడును
పిచ్చి వానివలే ప్రవర్తిస్తూ కరవీర పుష్ప మాలలను ధరించిన వాడును
నేలప బడి దొర్లే గుర్రం వలే, బురదలో దొర్లే పంది వలే దొరలు చుండెను
నల్లని వస్త్ర్రము ధరించిన రావణుడు పుష్పపకవిమానము నుండి క్రింద పడెను
అట్టి రావణున్ని ఒక స్త్రీ మెడకు తాడు బిగించి ఈడ్చు వస్తునట్లు నే
చూసాను
ఆ సమయంలో రావణుడు తైలము త్రాగి, మత్తుగా వికటాట్టహసముగా
నవ్వు చుండెను
మరల గాడిదలు నడుపుతున్న రధముపై బ్రాంతి చిత్తుడై ఉన్నట్లు నేను స్వప్నం లో చూసాను
క్రిందపడ్డ రావణుడు వెంటనే లేచి కంగారు పడుచు భయముతో పీడుతు డయ్యెను
మదముతో వ్యాకులుడై, దిగంబరుడై, పిచ్చి పట్టి చెడ్డ మాటలు పల్కు చుండెను
అంధకారముగా ఉన్న, సహించరాని దుర్ఘంధమైన, ఉన్న సరస్సులో ఉండెను
మలపంకములతో, భరింపరాని దుర్వాసనతో ఉన్న ఆ సరస్సులో రావణుడు మునిగి పోయెను
ఎర్రని వస్త్ర్తములను ధరించినదియును
నల్లని వర్ణము కలిగినదియును
ఒడలంతా బురద పూసుకొనినదియును
ఒక స్త్రీ ఆ సరస్సులొఉన్న రావణున్ని మెడకు తాడేసి లాగు చుండెను
రావణుని పుత్రులందరూ తల గోరికించు కొని యున్నట్లుగాను
రావణుడు పందిపైనను,మేఘనాధుడు మోసలిపైనను
కుంభకర్ణుడు వంటే పైనను ఎక్కి దక్షిణ దిక్కుగా పోచున్నట్లుగాను
నలుగురి తోతెల్లని ఛత్రము ధరించిన వాడైన విభీషణుడు కనబడెను
పెక్కు వాద్య ఘోషల తోడను గీత ధ్వనుల తోడను
సంబరము జరుపు కొంటున్నా రాక్షస సమాజమును
వస్త్రములు ఉండి లేనట్లుగా ప్రవర్తించు చున్న రాక్షసులను
లంకా నగరమంతా సముద్రములో మునిగినట్లు కలలో చూసాను
రాక్షస స్త్రీలందరూ నూనె త్రాగి ప్రమత్తులై వెడనవ్వులు నవ్వు చుండెను
దుమ్మురేపుతున్న లంకలో పెద్దగా ఆర్తనాదము చేయుచున్నస్త్రీలను చూసాను
కుంభకర్ణుడు ఎర్రని వస్త్రములు ధరించి పేడలో నిండిన పెద్ద లోతైన సరస్సులో ప్రవేశించెను
రాఘవుడు సీతను పొందగలడు, మిమ్మల్ని కూడాచంప గలడు కావునా మీరు సీతను వేడుకొనమనెను
శ్రీ రామ చంద్రుని మిక్కిలి ఇష్టురాలును
వనమునకు తనతో వచ్చినదియును
ప్రియ్యురాలైన భార్యను బెదిరించినను
సీతను భయపెట్టిన మిమ్ములకూడా హింసిమ్చును
మీరందరు పరుష వాక్యములను కట్టిబెట్టి శాంత వచనములు పలుకవలెను
ఇదియే యుక్తమగును అందువల్ల మనమందరమూ క్షమాభిక్ష కోరేదమని పల్కెను
దు:ఖితురాలైన స్త్రీ విషయమున ఇటువంటి స్వప్నము వచ్చిన దు:ఖము పోవును
దు:ఖితురాలైన స్త్రీ విముక్తియై పరమోత్తము డైన తన ప్రియుని పొంద కల్గును
ఓ రాక్షస వనితలారా పూర్వము బెదిరించిన సీతను
ఇప్పుడు సాన్తముతో యాచించి పొందుము అభయమును
మీరు సీతతో రావణుని గూర్చిచెప్పే మాటలు మానుకోన మనెను
రాఘవుని వలన రాక్షసులు ఘోరభయమును పొందగలుగును
జనకుని కూతురగు మైధిలి కాళ్ళ మీద పడిన ప్రసన్నరాలగును
ఈమెయే రాక్షస స్త్రీల మహొత్తరమైన భయమును తొలగించ కల్గును
రావణ వనంలో అనుభవిస్తున్న కష్టాల వలన శరీర కాంతి తగ్గియుండ వచ్చును
సీతాదేవి రజస్తమోగుణాల ప్రభావము చేత దు:ఖించు చున్నదని అనుకొను చున్నాను
మంచి గుణము కలిగి ఉండుట వలన విరుద్దమైన అవలక్షనములు లేకుండెను
అదియును గాక విశాలక్ష్మియగు ఈమె యొక్క అంగములు ఎటి మార్పు లేకుండెను
మిక్కిలి సూక్షముగానైనను, విపరీతమైన లక్షణములు గాని లేకుండెను
సీత "ఎట్టి లోపములులేని అతిలోక సౌందర్యవతి" కాలచక్రం వళ్ళ దు:ఖించు చుండెను
సీత విమానమునమును అధి రోహించినదియును
సీతకు రావణుని వలన దు:ఖముతో ఉన్నదియును
ఇది తాత్కాలమైన వైగుణ్యమని ఊహించు చున్నాను
సీతకు వచ్చిన దు:ఖము ఛాయమాత్రమే నిలబడ కుండును
సీతకు కార్య సిద్ధి త్వరలో కలుగును
రావణునికి వినాశము, రామునికి విజయము కల్గును
ఇటువంటి శుభసమయము త్వరలో వచ్చును
అని త్రిజట తన తోటి రాక్షసులతో చెప్పెను
సీతాదేవికి గొప్ప ప్రియవార్త అందుకొనే సూచనలు కనిపించెను
పద్మపత్రమువలే విశాలమిననేత్రము అదురు చున్నట్లు ఉండెను
ఎదమభుజము హటాత్తుగా పొంగినదై కొంచము అదురు చుండెను
ఏనుగు తొండమును బోలినదియగు ఎడమ తోడ అదురు చుండెను
పక్షి తనగూటిలోనికి ప్రవేశించి మాటిమాటికి ఊరడింపు మాటలను
చాలా ఉత్చహముతొ కూడినదై స్వాగత వచనములు పల్కు చుండెను
"రాముడు రానున్నాడు " అను ప్రియమైన వార్తాసూచనలు కనబడు చుండెను
అటు పిమ్మట భర్త యొక్క విజయ వారట విని సీత చాల సంతోషము పొందెను
భయపెట్టు రాక్షస స్త్రీ లందరితోను
లజ్జాయుక్తయును అగు నేను
మీరు చెప్పినది నిజమే ఐనను
మిమ్ములను నేను రక్షించ గలను
శ్రీ సుందర కాండము నందు 27వ సర్గ సమాప్తము

No comments:
Post a Comment