ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ:శ్రీ రామ చంద్రపరబ్రహ్మనే నమ:
28వ సర్గ (వాల్మికి రామాయణములోని 20 శ్లోకాల తెలుగు వచస్సు)
(" సీత విలపించుచు ప్రాణములు విడుచుటకు ఉద్యమించుట ")
తథాగతాం తాం వ్యథితామనిందితాం
వ్యపేతహర్షాం పరిదీనమానసామ్,
శుభాం నిమిత్తాని శుభాని భేజిరే
నరం శ్రియా జుష్టమివోపజీవినః
తస్యాః శుభం వామమరాళపక్ష్మ
రాజీవృతం కృష్ణవిశాలశుక్లమ్,
ప్రాస్పన్దతైకం నయనం సుకేశ్యా
మీనాహతం పద్మమివాభితామ్రమ్.
భుజశ్చ చార్వంచితపీనవృత్తః
పరార్ధ్యకాలాగరు చందనార్హః,
అనుత్తమేనాధ్యుషితః ప్రియేణ
చిరేణ వామః సమవేపతాఽఽశు.
సీతాదేవి వనమునందు సింహమునకు చిక్కిన గజరాజ కన్యవలె భయపడు చుండెను
రాక్షసీ మధ్యమున ఉన్నదియును పరుషములు వాక్కులతో బెదిరింప బడుచున్నదియును
అడవిమద్యలో ఒంటరిగా విదిలి పెట్ట బడిన బాలకన్య వలె విలపించు చున్నదియును
పాపత్మురాలైన నేను క్రూరులు భయపెట్టువారి మద్య క్షనకాలమైన జీవించు చున్నాను
అకాల మృత్యువురాదని లోకమున సత్పురుషులు పల్కిన మాటలు నిజ మయ్యేను
ఎట్టి సుఖము లేకుండా దు:ఖముతో నా హృదయము నిశ్చయముగా గట్టిగాఉండెను
నా హృదయము వేయి ముక్కలు బ్రద్దలు కాకుండా వజ్ర శిఖరము వలే ఉండెను
నాలో ఎట్టిదోషము లేకుండ గనే అప్రియదర్శణుడగు రావణుడు నన్ను వధించ కల్గును
ద్విజుడు కానివానికి వేదమంత్రముల వలే నా అనురాగమును ఈతనికి ఈయజాలను
రావణుడు శస్త్ర చికిత్చుడు గర్భములో ఉన్న శిశువును చేదించు నట్లుగా నా అవయవములను
లోకములకు ప్రభువైన రాముడు రాకున్నచో వాడియైన శస్త్రముతో తప్పక నన్ను చేదించును
ఈ జీవితము ఎవరి సుఖము కోసం, ఎవరి ఋణం తీర్చుటకు నేను జీవించి యుండ వలెను
రాజాజ్ఞచే అపరాధమునకు బద్ధుడైన దొంగను తెల్లవారుజామున ఉరి తీసి నట్లును
రావణుడు నాకు యిచ్చిన రండు మాసముల పూర్తి అయిన నన్నూ చంపి వేయను
నేను మహాసముద్రము లో పెనుగాలికి చిక్కిన నావవలె నశించి పోవలెను
ఓ రామా, ఓ లక్ష్మనా, ఓ సుమిత్రా ,ఓ శ్రీ రామమాత, ఓ నాతల్లులారా అనివిలపిస్తున్నాను
ఆప్రాణి ఎవరో మృగ రూపమున ధరించి మహాబలశాలులైన ఆ రామలక్ష్మణులను
పిడుగు వళ్ళ శ్రేష్టములైన రెండు సింహములను నామూలమున చంపి యుండ వచ్చును
ఆనాడు కాలపురుషుడు మృగ రూపమున వచ్చి దురదృష్టరాలైన నన్ను లోభపెట్టెను
నేను తెలివి తక్కువ తనముతో ఆర్యపుత్రున్ని, లక్ష్మణున్ని దూరముగా పంపినాను
సత్యవతుడువును, దీర్ఘ బాహువులు కల వాడువును
ఓ రామ వెన్నెలను పంచె చంద్రుడి వంటి వాడవును
జీవలోకమునకు హితుడవును, నా ప్రియుడవును
నగు నీవు అయ్యో నేను రక్కసుల మద్య ఉన్నట్లు తెలియ కుండును
ఓ రామా ధర్మమార్గమున ఏక పత్నిత్వముగా ఉండి చిక్కి పోయాను
నీవు తండ్రి ఆజ్ఞా భద్దుడవై పాలించు చున్నావా సత్యవ్రతమును
వనమునుండి అయోధ్యకు తిరిగి వెళ్లి వీతభయుడవు, క్రుతార్దుడవును
విశాలమైన కన్నులుగల స్త్రీలతో రమించు చున్నావని యోచించు చున్నాను
నేను భర్తను తప్ప మరి ఎ దేవుణ్ణి పూజించ కుండుట వలనను
ఈ ఓర్పు నెలమీద శయనము, ప్రతివ్రతా తత్వము వలనను
మనుష్యులు కృతఘ్నులకు చేసిన ఉపకారము వలే వ్యర్ధమాయెను
ఓ రామా నీకు దూరమై, నిన్నుచూడ లేక, నీవు వస్తావని ఆశ వదలక ఉన్నాను
ఓరామా నీయందు మాత్రమే సంజాత కామనై, నీయందే అనురాగము కల దానను
ఓరామా వ్యర్ధముగా తపో వ్రతము ఆచరించి నీ కొరకు నేను ప్రాణాలతో ఉన్నాను
ఓ రామా నా ఓర్పు తగ్గుతున్నది ఇక ఈ జీవితమును త్వజించాలను కున్నాను
అట్టి నేను విషముచేతగాని, శస్త్రము చేతగాని శీఘ్రముగా నా ప్రాణాలను విడిచెదను
ఈ రాక్షస వనములో నాకు విషమును, శస్త్రమును ఇచ్చువారు లెకుండెను
రామున్ని తలుస్తూ ఎండి పోయిన ముఖముతో పుష్పించిన వృక్షము వద్దకు వెళ్ళెను
అక్కడ అనేక విధముల అలోచించి ఉరిత్రాడువలె జడను చేతితో పట్టు కొనెను
నేను ఈ జడను ఉరిగా వేసుకొని శీఘ్రముగా యమలోకమునకు
వెల్లెదను
మృదువైన అవయవములు గల సీతాదేవి అశోకవృక్షశాఖను నుగ్రహించి నిలబడెను
రామచంద్రుని తలుస్తున్న సీతకు అనేకములైన శుభ శకునములు కనబడెను
శోకమును తొలగించేవి,అత్యుత్తమములుగా లోకములో ప్రసిద్దము లైన వియును
శుభశకునములు వచ్చెను, అట్టి శకునములే పూర్వముకూడా వచ్చి ఆశలు నెరవేర్చెను
శ్రీ సుందరకాండము నందు 28వ సర్గ సమాప్తము
No comments:
Post a Comment