Monday 15 June 2015

31. ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (31వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:



 31వ సర్గ (వాల్మికి రామాయణములోని 19 శ్లోకాల  తెలుగు వచస్సు)
(" హనుమంతుడు సీతకు కనబడ కుండా ఆమెకు రామ కధ 
 విని పించుట  ")    

సీత విన బడునట్లుగా శ్రీ రామకధను  మధుర వాక్యములగా హనుమంతుడు పలుకు చుండెను 
ఇక్ష్వాకు వంశములలొ గొప్ప యశస్సుగల పుణ్య శీలుడైన దశరధ మహా రాజు ఉండెను
అతడు రధ,గజాశ్వ, సైన్యములతో మహాబలశాలియై కీర్తి గలవాడై యుండెను
ఆ దశరధుడు గుణముల చేత  రాజర్షులందరిలో శ్రేష్టుడు, ఐశ్వర్యం కలవాడును


చక్రవర్తి కులమునందు పుట్టినవాడు, బలములో దేవేంద్రునితో సమానుడును
ఆ దశరధుడు ఆహింసా పరుడు, నీచ స్వభావము లేని వాడును 
ఇక్ష్వాకు వంశములొ చాల ప్రధానమైనవాడు, దయా శీలుడును
ధర్మ మార్గమున ఐశ్వర్యమును పెంపొందించినవాడును 
సత్యపరాక్రమము కలవాడు, ఉత్తమ రాజ లక్షణములు కలవాడును
నాలుగు సముద్రముల వరకు ఉన్న భూమి యందు మిక్కిలి 
ఖ్యాతిగల వాడును 
తను సుఖమనుభ వించుచు ఇతరులకు సుఖమును కలుగ చేయు వాడును
ఆ దశరధునకు ప్రియమైన వాడు రాముడను పేరుగల జేష్ట పుత్రుడు  
శ్రీరాముడు చంద్రుడి వంటి ముఖము గలవాడును 
మానవులలో ఉన్న విశేషమును గుర్తించు సమర్దుడును 
సత్య సంకల్పము గలవాడును ధనుద్దారులలో శ్రేష్టుడును
తనవాళ్ళను సకలజీవలోకమును సకల ధర్మములను రక్షించువాడు


శ్రీ రాముడు తననడవడిలో ఎట్టిలోపములేకుండా రక్షించు కొను చుండును 
తనతండ్రి వృద్ధుడైన దశరధ మహారాజు ఆజ్ఞ చేతను 
ఆరాముడు భార్యతోను, సోదరునితోను అరణ్యమునను ప్రవాసము వెళ్ళెను 
శ్రీరాముడు అరణ్యములో స్వెచ్ఛా రూపధారులు అయిన రాక్షసులను సంహరించెను 


పిమ్మట రావణుడు జనస్థానములోని రాక్షసుల వధను
ఖరధూషనుల వధను విని కోపముతో తీవ్రరూపము దాల్చెను  
మాయా మృగ  రూపముచేత అరణ్యములో శ్రీరాముని వంచించెను
రావణుడు మాయారూపమున ఇంట ఎవ్వరూలేని సమయాన  జానకిని అపహరించెను


రాముడు ఎట్టి దోషము లేని ఆసీత కొరకు వెదక సాగెను
అప్పుడు అరణ్యములొ ఉన్న సుగ్రివుడనే వానరునితో మైత్రి 
 చేసుకొనెను
శ్రీ రాముడు వాలిని చంపి ఆ వానర రాజ్యమును సుగ్రీవునకు ఇచ్చెను 
సుగ్రీవుదు ఆజ్ఞాపించి పంపగా వేల కోలది వానరులు సీతాదేవి కొరకు వెతుకు చుండెను 


మేము సంపాతి వచనములచే సీత లంకలో ఉన్నదని తెలుసు కొనుట  వలనను
నేను వానరుల ప్రోస్చాహముతొ శతయోజనముల సాగరమును దాటి లంకలోకి వచ్చాను
శ్రీరాముడు నాకు చెప్పిన రూపురేఖలు, లక్షణములుగల వనితను చూస్తున్నను 
మృదు మధురముగా క్లుప్తముగా శ్రీ రామకధను హనుమంతుడు విన్పించి విరమించెను


జానకీదేవి కుడా ఆ సంభాషణములను విని మిక్కిలి ఆశ్చర్య పడెను
అటుపిమ్మట ఉంగరములు తిరిగిన కేశములు గల తన ముఖమును 
పైకెత్తి బీరుస్వభవమున సీత అశోక వృక్షము వైపు చూసెను 
కపివరుని వాక్యములు విని అన్ని దిక్కులను చూసి రామునిని స్మరించి హర్షము పొందెను 


సీతాదేవి అడ్డముగాను పైకి క్రిందకు గాను 
ఎగాదిగా చూసె అచింత్య బుద్ధియును 
సుగ్రీవుని సచివు డైన వాతాత్మజుడను
అగు హనుమంతున్నీ ఉదయించు సూర్యునివలె చూచెను

శ్రీ సుందర కాండ నందు 31వ సర్గ సమాప్తము 

No comments:

Post a Comment