Thursday 11 June 2015

29. ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (29వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:


 29వ సర్గ (వాల్మికి రామాయణములోని 8 శ్లోకాల  తెలుగు వచస్సు)
(" సీతకు కొన్ని శుభశకునములు కనబడుట ")    



అశోక వృక్షము వద్దకు వచ్చిన భర్త్రువియోగ వ్యధితయును 
హర్షితయును, దోషరహితయును, ధీనమైన మానసము గలదియును
అగు సీతాదేవి వద్దకు శుభ శకునములు వెంట వెంటనే వచ్చెను 
శ్రీ సంపన్నుడగు పురుషుని వద్దకు సేవకులు వచ్చినట్లు వచ్చెను


సుకేశియగు సీతాదేవియొక్క వక్రములగు కనురెప్పలు నావృతమును 
విశాలమైన శ్వేతవర్ణముగల, ఎడమ నేత్రము పద్మము వలె కదిలెను
ఎడమ భుజము ముచ్చట గొల్పుచూ బలసి గుండ్రముగా మారెను
ప్రియునిచే చిరకాలము సేవింపబడిన ఎడమ భుజము అదెరెను


సీత తొడలు రెండు కలసి ఉండి ఎడమతోడ ఎనుగుతోండము వలే బలసి యుండెను 
ఈ ఎడమ తొడ అదురుచు రాముడు ఆమె ఎదుట ఉన్నట్లుగా సూచించెను 
నిలబడి యున్నదియును ఆచారు గాత్రి యోక్క బంగారు వర్ణము కలదియును 
కొంచము దుమ్ము పట్టు కొనినదియు నగు పీతవస్త్రము కొంచము క్రిందకు జారెను 


నిర్మలమైన నేత్రములు, కొనలు తేలిన దంతములు కలిగి యున్న దియును 
రాహుముఖము నుండి వచ్చిన చంద్ర బింబమువలె ఆమె ముఖము ప్రకాశించు చుండెను 
భూమిలో పడ్డ విత్తనము వర్షము కురియ గానె మొలక వచ్చి నట్లు ఆనందించెను   
శుభ శకునాల వల్ల కష్టాలు పోయి, పూర్వం వలె  సత్పలితాలు కనబడు చుండెను 


పూజ్యు రాలైన సీతకు రాక్షస వనితల వల్ల శోకము తొలిగెను 
అలసత్వము పోయి మానసిక సంతాపము శాంతించెను 
సంతోషముతో తేజోవంతమైన ముఖము, మనసు వికసించెను
ఆమె శుక్లపక్షమునందు ఉదయించిన చంద్రునిలో నొప్పు రాత్రివలె ప్రకాశించెను 

శ్రీ సుందర కాండ నందు 29వ సర్గ సమాప్తము

No comments:

Post a Comment